హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 82వ అధ్యాయం: రాజులు, న్యాయమూర్తులు ఇంకా ఇతర ఉన్నతాధికారులు తమ కొలువులో సదాచార సంపన్నులైనవారినే ఉద్యోగులుగా నియమించుకోవాలి, వారిని చెడు సావాసాలకు దూరంగా ఉండాలని, వారి కానుకల్ని స్వీకరించకూడదని హెచ్చరిస్తూ ఉండాలి. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 2 హదీసులు (హదీసు 678 – 679) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
82. రాజులు, న్యాయమూర్తులు ఇంకా ఇతర ఉన్నతాధికారులు తమ కొలువులో సదాచార సంపన్నులైనవారినే ఉద్యోగులుగా నియమించుకోవాలి, వారిని చెడు సావాసాలకు దూరంగా ఉండాలని, వారి కానుకల్ని స్వీకరించకూడదని హెచ్చరిస్తూ ఉండాలి
٨٢ – باب حَثّ السلطان والقاضي وغيرهما من ولاة الأمورعلى اتخاذ وزير صالح وتحذيرهم من قرناء السوء والقبول منهم
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ సెలవిచ్చాడు :
{الأَخِلاَّءُ يَوْمَئِذٍ بَعْضُهُمْ لِبَعْضٍ عَدُوٌّ إِلاَّ الْمُتَّقِينَ} [الزخرف:٦٧]
"ఆ రోజు భయభక్తులు కలవారు తప్ప (ప్రపంచంలోని మిగతా) స్నేహితులందరూ ఒకరికొకరు శత్రువులై పోతారు." (అజ్ జుఖ్రుఫ్ : 67)
వివరణ :
ప్రపంచంలో మంచి వ్యక్తుల మధ్య స్నేహం, ధర్మం, న్యాయం పరస్పర శ్రేయోభిలాషల ప్రాతిపదికగా జరుగుతుంది. అంచేత ఈ స్నేహాలు, ఈ భవబంధాలు ప్రళయదినాన కూడా వారిమధ్య నిలిచి ఉంటాయి. ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) పైన పేర్కొనబడిన దివ్య ఖుర్ఆన్ సూక్తిని నిదర్శనంగా చేసుకొని ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా పాలనావ్యవహారాలు నిర్వహించటానికి సదాచార సంపన్నులైన వారినే తమ సహోద్యోగులుగా నియమించుకోవాలని అంటున్నారు. మంత్రులు, సలహాదార్లు ఇతర అధికారుల నియామకంలో దైవభక్తికి, ధర్మపరాయణతకు ప్రాధాన్యతనివ్వాలి. ఆ విధంగా నియమితులయ్యే అధికారులు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ, ఉన్నతాధికార్లకు మంచి సలహాలు ఇస్తూ దేశాన్ని ప్రగతిపథంలో నడిపించటానికి కృషిచేస్తారు. దీనికి భిన్నంగా అవినీతిపరుల్ని, స్వార్థప్రియుల్ని తమ సహోద్యోగులుగా నియమించుకుంటే అలాంటి వారు పై అధికారులను తమ చేతుల్లో కీలుబొమ్మలుగా చేసుకుంటారు. తాము స్వయంగా పెడదోవల్లో నడవడంతోపాటు ప్రభుత్వాన్ని కూడా పెడదోవ పట్టిస్తారు. ఆ తర్వాత ప్రళయదినాన వారందరూ దైవసన్నిధిలో ఒండొకరిపై నిందారోపణలు చేసుకోవటం మొదలుపెడతారు.
English
“Friends of that Day will be foes one to another except Al-Muttaqun: (i.e., pious and righteous persons).” [Az-Zukhruf 43:67]
హదీసు 678
عن أبي سعيدٍ وأبي هريرةَ رضيَ اللَّه عنهما أنَّ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَا بَعَثَ اللَّهُ مِن نَبِيٍّ، وَلاَ استَخْلَف مِنْ خَليفَةٍ إلاَّ كَانَتْ لَهُ بِطَانتَانِ: بِطَانَةٌ تَأْمُرُهُ بِالمَعْرُوفِ وَتحُضُّهُ عَلَيْهِ، وبِطَانَةٌ تَأْمُرُهُ بِالشَّرِّ وتحُضُّهُ عليهِ والمَعصُومُ مَنْ عَصَمَ اللَّهُ "رواه البخاري.
హజ్రత్ అబూ సయీద్ మరియు అబూ హురైరా (రదియల్లాహు అన్హుమా)ల కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు: దేవుడు పంపిన ప్రతి ప్రవక్తకు, ఆయన తర్వాత ఎన్నికయిన ప్రతి ఖలీఫాకు ఇద్దరు అంతరంగికులుండేవారు. వారిలో ఒక అంతరంగికుడు మంచిని గురించి ఆదేశిస్తూ, దాన్ని ఆచరించమని ప్రేరేపించేవాడు. మరో అంతరంగికుడు చెడుని గురించి ఆదేశిస్తూ, దాన్ని ఆచరించమని ప్రేరేపించేవాడు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఎవర్నయితే దేవుడు కాపాడుతాడో వారే సురక్షితంగా ఉండగలరు. (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని విధివ్రాత ప్రకరణం)
English
Abu Sa`id and Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Allah neither raised up any Prophet nor did He authorize any person with ruling power but for whom there were two types of entourage: one enjoins upon him to do good and incites him to carry it out, and the other enjoins evil and goads him; and the protected (from the bad entourage) is the one whom Allah protects.”[Al-Bukhari].
ముఖ్యాంశాలు
- దైవభీతి కలవారిని, నీతి నిజాయితీలు కలవారినే తమ అంతరంగికులుగా, సలహాదార్లుగా నియమించుకోవాలని ఈ హదీసు అన్యాపదేశంగా పరిపాలకులను ఆదేశిస్తోంది. అలాంటివారు పరిపాలకులకు మంచి సలహాలు ఇచ్చి అల్లకల్లోలం సృష్టించేవారి నుంచి రాజ్యాన్ని కాపాడుతారు. 2. పరిపాలకుడు దైవం మరియు దైవప్రవక్త ఆదేశాలకు కట్టుబడి పరిపాలన చేయాలి. అతని పరువు మర్యాదలు అందులోనే ఉన్నాయి. అంతేకాదు, దైవానికి దైవప్రవక్తకు విధేయత చూపే పరిపాలకుడు దుర్జనుల నుంచి, వారి కీడు నుంచి కూడా సురక్షితంగా ఉండగల్గుతాడు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|82. రాజులు, న్యాయమూర్తులు ఇంకా ఇతర ఉన్నతాధికారులు తమ కొలువులో సదాచార సంపన్నులైనవారినే ఉద్యోగులుగా నియమించుకోవాలి, వారిని చెడు సావాసాలకు దూరంగా ఉండాలని, వారి కానుకల్ని స్వీకరించకూడదని హెచ్చరిస్తూ ఉండాలి|హదీసు 678
హదీసు 679
وعن عائشة رضي اللَّه عنها قالتْ: قالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِذَا أرَادَ اللَّه بالأمِيرِ خَيْراً، جَعَلَ لَهُ وزيرَ صِدقٍ، إنْ نَسي ذكَّرهُ، وَإن ذَكَرَ أعَانَهُ، وَإذا أَرَاد بهِ غَيرَ ذَلِكَ جعَلَ لَهُ وَزِيرَ سُوءٍ، إنْ نَسي لَمْ يُذَكِّره، وَإن ذَكَرَ لَمْ يُعِنْهُ". رواه أَبُو داود بإسنادٍ جيدٍ عَلَى شرط مسلم.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : దేవుడు ఏ ప్రజానాయకునికయినా మంచి చేయాలని తలపెట్టినప్పుడు అతనికి సత్యబద్ధుడైన మంత్రిని అనుగ్రహిస్తాడు. అతను (పాలనా వ్యవహారాలకు సంబంధించిన విషయమేదయినా) మర్చిపోతే అతని మంత్రి అతనికి గుర్తుచేస్తాడు. తనకు గుర్తున్నప్పుడు కూడా అతను సహాయపడతాడు. ఒకవేళ దేవుడు ఆ నాయకునికి మరేదయినా (హాని) చేయాలని తలపెట్టినప్పుడు అతనికి ఏ దుష్టమంత్రినయినా అంటగడతాడు. తను (పాలనా వ్యవహారాల్లో) ఏదయినా మర్చిపోతే అతను గుర్తుచేయడు. తనకు గుర్తున్నప్పుడయినా అతను తనకు సహాయపడడు. (అబూదావూద్ దీనిని ముస్లిం షరతులకు అనుగుణంగా మంచి ఆధారాలతో నకలు చేశారు).
(సుననె అబూదావూద్లోని నాయకత్వ ప్రకరణం)
English
`Aishah (radiyallahu anha) reported: Messenger of Allah ﷺ said, “When Allah desires good for a ruler, He appoints for him a sincere adviser who will remind him if he forgets and helps him if he remembers. When Allah wishes for him the contrary, He appoints for him a bad adviser who will not remind him if he forgets, nor will he help him if he remembers.”
ముఖ్యాంశాలు
ఏ నాయకునికయినా దైవభీతిపరులు, సదాచార సంపన్నులయిన మంత్రులు, సలహాదార్లు లభించి, నిత్యం ప్రయోజనకరమైన సలహాలు, సేవలను అందజేస్తూ, చెడుకార్యాల నుండి హెచ్చరిస్తూ ఉంటే దాన్ని దైవప్రసన్నతకు నిదర్శనంగా భావించాలి. అందుకు భిన్నంగా ఏ నాయకునికయినా ప్రభుత్వాన్ని తప్పుదోవపట్టించే స్వార్థపరులు, అవకాశవాదులయిన మంత్రులు, సలహాదార్లు లభిస్తే ఇహపరాల దృష్ట్యా ఆ రాజ్యం పతనావస్థకు చేరుకోబోతుందని గ్రహించాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|82. రాజులు, న్యాయమూర్తులు ఇంకా ఇతర ఉన్నతాధికారులు తమ కొలువులో సదాచార సంపన్నులైనవారినే ఉద్యోగులుగా నియమించుకోవాలి, వారిని చెడు సావాసాలకు దూరంగా ఉండాలని, వారి కానుకల్ని స్వీకరించకూడదని హెచ్చరిస్తూ ఉండాలి|హదీసు 679
You must be logged in to post a comment.