హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 83వ అధ్యాయం: పాలనాధికారాలను, న్యాయమూర్తి పదవిని అడిగేవారికి లేదా కాంక్షించేవారికి అలాగే వాటికోసం పైరవీలు చేసుకునేవారికి ఆ హోదాలు ఇవ్వకూడదు. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 680) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
83. పాలనాధికారాలను, న్యాయమూర్తి పదవిని అడిగేవారికి లేదా కాంక్షించేవారికి అలాగే వాటికోసం పైరవీలు చేసుకునేవారికి ఆ హోదాలు ఇవ్వకూడదు
باب النهي عن تولية الإِمارة والقضاء وغيرهمامن الولايات لمن سألها أَوْ حرص عليها فعرَّض بها
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 680
عن أَبي موسى الأَشعريِّ رضي اللَّه عنه قَالَ: دخَلتُ عَلَى النَّبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أنَا وَرَجُلانِ مِنْ بَنِي عَمِّي، فَقَالَ أحَدُهُمَا: يَا رسولَ اللَّه أمِّرنَا عَلى بعضِ مَا ولاَّكَ اللَّه، عزَّ وجلَّ، وقال الآخرُ مِثْلَ ذلكَ، فَقَالَ: " إنَّا واللَّه لاَ نُوَلِّي هذَا العَمَلَ أحَداً سَأَلَه، أَوْ أحَداً حَرَص عليه"متفق عليه.
హజ్రత్ అబూ మూసా అష్అరీ (రదియల్లాహు అన్హు) కథనం : ఓ రోజు నేను మా బాబాయి కుమారులిద్దరితో కలిసి దైవప్రవక్త ﷺ దగ్గరికి వెళ్ళాను. వారిద్దరిలో ఒకతను దైవప్రవక్త ﷺతో మాట్లాడుతూ, "దైవప్రవక్తా! దేవుడు మిమ్మల్ని రాజ్యాధినేతగా చేసిన ప్రాంతాలలో కొన్నింటికి మమ్మల్ని గవర్నర్లుగా నియమించండి" అని కోరాడు. రెండోవతను కూడా అదే కోరిక కోరాడు. అప్పుడు దైవప్రవక్త ﷺ (చిరుకోపంతో), "దైవసాక్షి! పదవులకోసం అప్పీలు చేసుకునేవారికి, పదవీ వ్యామోహపరులకు మేము ఈ పదవీ బాధ్యతల్ని అప్పగించం" అని ఖరాఖండీగా చెప్పేశారు.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని ఆదేశాల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని నాయకత్వ ప్రకరణం)
English
Abu Musa Ash`ari (radiyallahu anhu) reported: I called on the Prophet ﷺ with two of my cousins. One of them said to him: “O Messenger of Allah ﷺ, appoint me governor of some land over which Allah has given you authority.” The other also requested for something of the same nature. Messenger of Allah ﷺ said, “By Allah we do not appoint someone to this post who seeks it or someone who contends for it.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
పదవీ కాంక్షాపరులు సాధారణంగా తమ స్వార్థప్రయోజనాల కోసమే ప్రభుత్వ పదవుల్ని చేజిక్కించుకోవటానికి ప్రయత్నిస్తారు. దానివల్ల దేశప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయి. ప్రభుత్వం ఏర్పడేది సామాన్య ప్రజల ప్రయోజనాలను కాపాడటం కోసమేగాని కొద్దిమంది బడావ్యక్తుల పబ్బం గడవటం కోసం కాదు. ప్రజల కోసం ఏర్పడే ప్రభుత్వం ఆ ప్రజల ప్రయోజనాలనే కాపాడలేకపోయినప్పుడు ఇక ఆ ప్రభుత్వం ఉండి లాభమేంటి?
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|83. పాలనాధికారాలను, న్యాయమూర్తి పదవిని అడిగేవారికి లేదా కాంక్షించేవారికి అలాగే వాటికోసం పైరవీలు చేసుకునేవారికి ఆ హోదాలు ఇవ్వకూడదు|హదీసు 680
You must be logged in to post a comment.