హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 81. పదవుల్ని కాంక్షించకూడదు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 81వ అధ్యాయం: పదవుల్ని కాంక్షించకూడదు, తన అవసరం లేదనుకున్నప్పుడు ప్రభుత్వ పదవుల్ని వదిలేయటమే మంచిది. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 4 హదీసులు (హదీసు 674 – 677) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

81. పదవుల్ని కాంక్షించకూడదు, తన అవసరం లేదనుకున్నప్పుడు ప్రభుత్వ పదవుల్ని వదిలేయటమే మంచిది

↑ విషయ సూచిక

باب النهي عن سؤال الإمارة واختيار ترك الولايات إذا لَمْ يتعين عليه أَوْ تَدْعُ حاجة إِلَيْهِ

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు :

{تِلْكَ الدَّارُ الْآخِرَةُ نَجْعَلُهَا لِلَّذِينَ لاَ يُرِيدُونَ عُلُوّاً فِي الأَرْضِ وَلا فَسَاداً وَالْعَاقِبَةُ لِلْمُتَّقِينَ} [القصص:٨٣]

"పరలోకంలోని గృహాన్ని మేము భూమిపై తమ పెద్దరికాన్ని కోరుకోనివారికీ, కల్లోలాన్ని సృష్టించగోరని వారికీ ప్రత్యేకించి ఉంచుతాము. మేలైన పరిణామం మాత్రం భయభక్తులు కలవారికే." (అల్ ఖసస్ : 83)

వివరణ :

పదవీవ్యామోహం గల వ్యక్తి ప్రపంచంలో పెద్దరికాన్ని కోరుకుంటాడు. ఇలాంటి పెద్ద మనుషుల మూలంగానే ప్రపంచంలో కల్లోలం చెలరేగుతుంది. పదవుల్ని కాంక్షించటం, వాటిని పొందటం కోసం కృషిచేయటం పరిణామం రీత్యా సాధారణంగా చెడుపనులుగానే పరిగణించబడతాయి. మనిషి ఎల్లప్పుడూ పదవులకు, ప్రాపంచిక పటాటోపాలకు దూరంగా ఉండటమే అన్ని విధాలా శ్రేయస్కరం.

English

“That home of the Hereafter (i.e., Jannah), We shall assign to those who rebel not against the truth with pride and oppression in the land nor do mischief by committing crimes. And the good end is for the Muttaqun (the pious and righteous persons).” [Al-Qaṣaṣ 28:83]

674

హదీసు 674

وعن أبي سعيد عبد الرحمنِ بن سَمُرةَ رضي اللَّه عنه، قَالَ: قَالَ لي رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "يَا عَبدَ الرَّحمن بن سمُرَةَ: لاَ تَسأَل الإمارَةَ، فَإنَّكَ إن أُعْطِيتَها عَن غَيْرِ مسأَلَةٍ أُعنتَ علَيها، وَإنْ أُعطِيتَها عَن مسأَلةٍ وُكِلتَ إلَيْها، وإذَا حَلَفْتَ عَلى يَمِين، فَرَأَيت غَيرها خَيراً مِنهَا، فَأْتِ الَّذِي هُو خيرٌ، وكفِّر عَن يَمينِكَ "متفقٌ عَلَيهِ.

హజ్రత్ అబూ సయీద్ అబ్దుర్రహ్మాన్ బిన్ సముర (రదియల్లాహు అన్హు) కథనం: ఒకసారి దైవప్రవక్త ﷺ నాకు ఈ విధంగా హితోపదేశం చేశారు : "అబ్దుర్రహ్మాన్ బిన్ సమురా! నువ్వు ఎన్నటికీ పదవిని కోరుకోకు. ఎందుకంటే నువ్వు కోరుకోకుండానే నీకు పాలనాధికారాలు లభిస్తే ఆ బాధ్యతా నిర్వహణలో నీకు దైవసహాయం అందుతుంది. కాని ఒకవేళ నీ కోరిక మేరకు పాలనాధికారాలు లభిస్తే ఆ బాధ్యత అంతా నీదే అవుతుంది. (అందులో నీకు దైవసహాయం లభించదు). అదేవిధంగా నువ్వు ఏదయినా పనిచేస్తానని మొక్కుకున్నప్పుడు ఆ తర్వాత దానికి వ్యతిరేకంగా మరో పని చేయటం ఉత్తమమని భావిస్తే మొక్కుబడిని భంగం చేసుకొని ఆ ఉత్తమమైన పనే చెయ్యి. అయితే మొక్కుబడిని భంగం చేసినందుకు పరిహారం ఇచ్చుకోవాలి సుమా!"

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలలోని ప్రమాణాలు మొక్కుబడుల ప్రకరణం)

English

`Abdur-Rahman bin Samurah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said to me, “Do not ask for position of authority. If you are granted this position without asking for it, you will be helped (by Allah) in discharging its responsibilities; but if you are given it as a result of your request, you will be left alone as its captive. If you take an oath to do something and then find a better alternative, you should adopt the latter and expiate for your oath.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

'ఇమారత్' అంటే ప్రభుత్వం (అధికారం) లేదా దానికే సంబంధించిన ఏదైనా పదవి అని అర్థం. దానికోసం వెంపర్లాడటం, దాన్ని పొందటానికి కృషిచేయటాన్ని ఇస్లామీయ షరీఅత్ గర్హిస్తుంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద బాధ్యత. దాన్ని నిర్వహించటమంటే మాటలుకాదు. అయితే ఎవరికయినా ఈ హోదా కోరుకోకుండానే లభిస్తే దాన్ని స్వీకరించటం తప్పు కూడా కాదు. ఎందుకంటే కార్యదక్షులు, యోగ్యులకే పదవులు కోరుకోకుండా లభిస్తాయి. అంతేకాదు, అలాంటివారికి బాధ్యతా నిర్వహణలో దైవసహాయం కూడా తోడుంటుంది. దీనికి భిన్నంగా వ్యామోహంతో పదవుల్ని చేజిక్కించుకునేవారు సాధారణంగా చవటలు, చేతకాని దద్దమ్మలై ఉంటారు. అలాంటి వారికి దైవసహాయం కూడా లభించదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకులు ధర్మాధర్మాలను లెక్కచేయకుండా రకరకాల కుత్సితాలు, కుతంత్రాలకు పాల్పడి అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు. ఫలితంగా ఎవరూ సమర్థవంతమైన పరిపాలనను అందజేయలేకపోతున్నారు. దానికి ఇంకో కారణం, వారిలో ఎవరికీ పరిపాలనా నిర్వహణలో దైవసహాయం లభించక పోవటమే.

ఈ హదీసులో చెప్పబడిన ఇంకో విషయం ఏమిటంటే ఎవరయినా ఏదయినా పని చేస్తానని ప్రమాణం చేసి, ఆ తర్వాత దానికి వ్యతిరేకంగా మరో పని చేస్తే ఎక్కువ లాభం కలుగుతుందనుకుంటే అలాంటి పరిస్థితిలో ప్రమాణాన్ని భంగంచేసి ఉత్తమమైన పనే చేయాలి. అయితే ప్రమాణ భంగానికి పరిహారాన్ని మాత్రం చెల్లించాలి. పరిహారంగా ఒక బానిసకు విముక్తిని ప్రసాదించాలి. లేదా పదిమంది నిరుపేదలకు మధ్యరకమైన భోజనం పెట్టాలి లేదా బట్టలు తొడిగించాలి. ఇవేవీ చేయలేమనుకుంటే మూడు రోజులు ఉపవాసవ్రతం పాటించాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|81. పదవుల్ని కాంక్షించకూడదు, తన అవసరం లేదనుకున్నప్పుడు ప్రభుత్వ పదవుల్ని వదిలేయటమే మంచిది|హదీసు 674

675

హదీసు 675

وعن أَبي ذرٍ رضي اللَّه عنه قَالَ: قَالَ لي رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "يا أبا ذَر أَرَاك ضعِيفاً، وَإنِّي أُحِبُّ لكَ مَا أُحِبُّ لِنَفسي، لاَ تَأَمَّرنَّ عَلَى اثْنيْن وَلاَ تولِّيَنَّ مَالَ يتِيمِ" رواه مسلم.

హజ్రత్ అబూ జర్ర్ (రదియల్లాహు అన్హు) కథనం: ఓ రోజు దైవప్రవక్త ﷺ నాకు ఈ విధంగా ఉపదేశించారు : అబూ జర్ర్! నువ్వు నాకు బలహీనుడిలా కనిపిస్తున్నావు. కనుక నేను నా స్వయంకోసం యిష్టపడేదే నీ కోసం కూడా ఇష్టపడుతున్నాను. నువ్వు ఇద్దరు వ్యక్తులకు కూడా నాయకత్వం వహించకు. ఏ అనాధుని సొమ్ముకూ బాధ్యత వహించకు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని నాయకత్వ ప్రకరణం)

English

Abu Dharr (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said to me, “O Abu Dharr, I see that you are weak and I like for you what I like for myself. Do not rule over (even) two persons, and do not manage an orphan’s property.”[Muslim].

ముఖ్యాంశాలు

హజ్రత్ అబూజర్ర్ (రదియల్లాహు అన్హు) సాత్వికులు, నిరాడంబర జీవి. ప్రాపంచిక వ్యవహారాల్లో ఆయన ఎక్కువగా ఆసక్తి కనబరచేవారు కారు. అందుకే దైవప్రవక్త ﷺ ఆయనకు ఆ విధంగా హితోపదేశం చేశారు. పదవులు, బాధ్యతల విషయంలో ఆయన్ని బలహీనుడిగా ఖరారు చేశారు. ప్రాపంచిక విషయాల్లో ఆసక్తి కనబరిచేవారు మాత్రమే పదవులు, పరిపాలనా బాధ్యతల్ని నిర్వహించగలరు. ప్రపంచాన్ని అనహ్యించుకునేవారు, బాధ్యతల నుండి పారిపోయేవారు పరిపాలనా వ్యవహారాల్ని నిర్వహించలేరు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|81. పదవుల్ని కాంక్షించకూడదు, తన అవసరం లేదనుకున్నప్పుడు ప్రభుత్వ పదవుల్ని వదిలేయటమే మంచిది|హదీసు 675

676

హదీసు 676

وعنه قَالَ: قُلْتُ: يَا رسول اللَّه ألا تَستعمِلُني؟ فضَرب بِيدِهِ عَلَى منْكبِي ثُمَّ قَالَ: "يَا أَبَا ذَرٍّ إنَّكَ ضَعِيف، وإنَّهَا أَمانة، وإنَّها يَوْمَ القيامَة خِزْيٌ ونَدَامةٌ، إلاَّ مَنْ أخَذها بِحقِّها، وَأدَّى الَّذِي عليهِ فِيها" رواه مسلم.

హజ్రత్ అబూజర్ర్ (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం : ఒకసారి నేను దైవప్రవక్త ﷺతో మాట్లాడుతూ, "దైవప్రవక్తా! మీరు నన్ను ఎక్కడైనా ప్రభుత్వాధికారిగా నియమించరెందుకు?" అని అడిగాను. అప్పుడు ఆయన (చిరుకోపంగా) తన చేత్తో నా భుజాన్ని తట్టి, "అబూజర్ర్! నువ్వు బలహీనుడివి. ఉద్యోగమనేది ఒక అమానతు (అప్పగింత). న్యాయంగా దాన్ని పొంది, దాని విధుల్ని నిర్వర్తించేవారిని తప్ప (అసమర్థుల్ని) అది ప్రళయదినాన పరాభవానికి, పశ్చాత్తాపానికి గురిచేస్తుంది" అని చెప్పారు.

(ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని నాయకత్వ ప్రకరణం)

English

Abu Dharr (radiyallahu anhu) reported: I said to Messenger of Allah ﷺ: “Why do you not appoint me to an (official) position?” He ﷺ patted me on the shoulder with his hand and said, “O Abu Dharr, you are a weak man and it is a trust and it will be a cause of disgrace and remorse on the Day of Resurrection except for the one who takes it up with a full sense of responsibility and fulfills what is entrusted to him (discharges its obligations efficiently).”[Muslim].

ముఖ్యాంశాలు

ప్రభుత్వ, పాలనా వ్యవహారాలకు సంబంధించిన పదవుల్ని పొందటం ధర్మసమ్మతమేనని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. అయితే ఆయా పదవుల్ని పొందేవారిలో ముఖ్యంగా రెండు లక్షణాలుండాలి. ఒకటి : సమర్థత. రెండోది: కార్యదక్షత. ఈ రెండు లక్షణాలూ లేనివారు పదవుల్ని నిర్వహించటానికి అనర్హులు. ఉదాహరణకు ప్రజానాయకునిగా నియమించబడే వ్యక్తి ప్రజలకు న్యాయవంతమైన పరిపాలనను అందించే కార్యదక్షతతోపాటు తన విధుల్ని నిర్వర్తించగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండాలి. అలాగే ఏ పదవిని, ఏ ఉద్యోగాన్ని పొందాలన్నా తనలో ఆ రెండు లక్షణాలు ఉన్నాయో లేవో ముందుగానే చూసుకోవాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|81. పదవుల్ని కాంక్షించకూడదు, తన అవసరం లేదనుకున్నప్పుడు ప్రభుత్వ పదవుల్ని వదిలేయటమే మంచిది|హదీసు 676

677

హదీసు 677

وعن أَبي هُريرة رضي اللَّه عنه أنَّ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إنَّكم ستحرِصون عَلَى الإمارةِ، وستَكُونُ نَدَامَة يوْم القِيامَةِ" رواهُ البخاري.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఒకానొక సందర్భంగా ఇలా అన్నారు : మీరు తప్పకుండా పదవుల కోసం వెంపర్లాడతారు. (కాని గుర్తుంచుకోండి!) ఈ విషయమే ప్రళయదినాన మిమ్మల్ని పశ్చాత్తాపానికి గురిచేస్తుంది. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని ఆదేశాల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “You will covet for getting a position of authority, but remember that it will be a cause of humiliation and remorse on the Day of Resurrection.”[Al-Bukhari]

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|81. పదవుల్ని కాంక్షించకూడదు, తన అవసరం లేదనుకున్నప్పుడు ప్రభుత్వ పదవుల్ని వదిలేయటమే మంచిది|హదీసు 677