హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 80వ అధ్యాయం: ధర్మసమ్మతమైన విషయాల్లో పాలకులకు విధేయత చూపటం విధి, అధర్మ విషయాల్లో వారికి విధేయత చూపటం నిషిద్ధం. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 11 హదీసులు (హదీసు 663 – 673) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
80. ధర్మసమ్మతమైన విషయాల్లో పాలకులకు విధేయత చూపటం విధి, అధర్మ విషయాల్లో వారికి విధేయత చూపటం నిషిద్ధం
باب وجوب طاعة ولاة الأمور في غير معصية وتحريم طاعتهم في المعصية
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ సెలవిచ్చాడు :
{يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ وَأُولِي الأَمْرِ مِنْكُمْ} [النساء: ٥٩]
"విశ్వసించిన ప్రజలారా! విధేయత చూపండి అల్లాహ్కు, విధేయత చూపండి ప్రవక్తకు, మీలో అధికారం అప్పగించబడిన పెద్దలకు." (అన్ నిసా : 59)
వివరణ :
పై దివ్య ఖుర్ఆన్ సూక్తిని నిశితంగా పరిశీలిస్తే మనకు ఒక విషయం బోధపడుతుంది. అల్లాహ్కు, ప్రవక్తకు అనే ముందు విధేయత చూపండి అనే పదం వాడబడిందిగాని అధికారం అప్పగించబడిన పెద్దలకు అనేమాట ముందు మాత్రం ఆ పదం వాడబడలేదు. ఇందులోని మర్మం ఏమిటంటే దేవునికి, దైవప్రవక్తకు – మరో మాటలో చెప్పాలంటే దైవగ్రంథానికి, దైవప్రవక్త దివ్య వచనాలకు ఎట్టిపరిస్థితుల్లోనయినా తప్పనిసరిగా విధేయత చూపవలసి ఉంటుంది. కాని పరిపాలకులకు చూపవలసిన విధేయత అలాంటిది కాదు. ఖుర్ఆన్, హదీసుల బోధనలకు అనుగుణంగా ఉండే పరిపాలకుల ఆదేశాలను తప్పకుండా పాటించాలి. కాని అందుకు విరుద్ధంగా ఉండే ఆదేశాల్ని మాత్రం తప్పకుండా త్రోసిపుచ్చాలి.
English
“O you who believe! Obey Allah and obey the Messenger (Muhammad ﷺ), and those of you (Muslims) who are in authority.” [An-Nisā’ 4:59]
హదీసు 663
وعن ابن عمر رضي اللَّهُ عنهما عَن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "عَلى المَرْءِ المُسْلِم السَّمْعُ والطَّاعَةُ فِيما أَحَبَّ وكِرَهَ، إِلاَّ أنْ يُؤْمَرَ بِمَعْصِيَةٍ فَإذا أُمِر بِمعْصِيَةٍ فَلاَ سَمْعَ وَلا طاعَةَ" متفقٌ عَلَيْهِ.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : ముస్లిం అయిన ప్రతి వ్యక్తి తనకు ఇష్టమున్నా లేకపోయినాసరే (తమ నాయకుడు) చెప్పే మాటను వినాలి. (అతని ఆజ్ఞను) శిరసావహించాలి – పాపకార్యానికి పాల్పడమని అతడు ఆజ్ఞాపిస్తే తప్ప. ఒకవేళ (నాయకుడు స్వయంగా) పాపకార్యానికి పాల్పడమని ఆజ్ఞాపిస్తే మాత్రం దాన్ని శిరసావహించకూడదు.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని ఆదేశాల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని నాయకత్వ ప్రకరణం)
English
Ibn `Umar (radiyallahu anhuma) reported: The Prophet ﷺ said, “It is obligatory upon a Muslim to listen (to the ruler) and obey whether he likes it or not, except when he is ordered to do a sinful thing; in such case, there is no obligation to listen or to obey.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ముస్లింలు తమ నాయకులకు ఏంతవరకు విధేయత చూపాలో, ఏ విషయాల్లో వారిని అనుసరించాలో మరే విషయాల్లో వారితో విభేదించాలో నిర్ణయించటం జరిగింది. కనుక ముస్లిం పాలకులు దేవుడు, దైవప్రవక్త బోధనలు, ఇస్లామీయ షరీఅత్ ఆదేశాల పరిధిలో మసలుకోవటంలోనే తమ గౌరవం ఇమిడి ఉందని గ్రహించాలి. అలాగాకుండా హద్దుమీరి ప్రవర్తిస్తే పరలోక శిక్షతోపాటు ఇహలోకంలోనూ ఎన్నో అవమానాలకు గురికావలసి వస్తుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|80. ధర్మసమ్మతమైన విషయాల్లో పాలకులకు విధేయత చూపటం విధి, అధర్మ విషయాల్లో వారికి విధేయత చూపటం నిషిద్ధం|హదీసు 663
హదీసు 664
وعنه قَالَ: كُنَّا إِذَا بايَعْنَا رسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم عَلى السَّمْعِ والطَّاعةِ يقُولُ لَنَا:"فِيمَا اسْتَطَعْتُمْ" متفقٌ عَلَيْهِ.
హజ్రత్ ఇబ్నె ఉమర్గారే చేసిన కథనం : మేము దైవప్రవక్త ﷺతో 'వింటాము, శిరసావహిస్తాము' అని ప్రమాణం చేసినప్పుడు ఆయన మాతో "మీ శక్తిమేరకే" అని చెప్పేవారు.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని ఆదేశాల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని నాయకత్వ ప్రకరణం)
English
Ibn `Umar (radiyallahu anhuma) reported: Whenever we took a pledge of allegiance to Messenger of Allah ﷺ to hear and obey, he ﷺ would say to us, “As far as you are capable of.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ముస్లిం పాలకులు జారీచేసే ఆజ్ఞలు ఇస్లామీయ షరీఅత్కు అనుగుణంగా ఉండటంతోపాటు ప్రజల శక్తిసామర్థ్యాలకు మించనివిగా ఉండటం కూడా చాలా అవసరం. అలా కాని పరిస్థితుల్లో ప్రజలు వాటిని శిరసావహించకపోయినా తప్పులేదు. పాలకులు ప్రజలు మోయలేని భారాన్ని వారిపై మోపి వారి సహనాన్ని పరీక్షించే చర్యలకు పాల్పడకూడదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|80. ధర్మసమ్మతమైన విషయాల్లో పాలకులకు విధేయత చూపటం విధి, అధర్మ విషయాల్లో వారికి విధేయత చూపటం నిషిద్ధం|హదీసు 664
హదీసు 665
وعنهُ قالَ: سَمِعْتُ رسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقول: " مَنْ خلَعَ يَداً منْ طَاعَةٍ لَقِى اللَّه يوْم القيامَةِ ولاَ حُجَّةَ لَهُ، وَمَنْ ماتَ وَلَيْس في عُنُقِهِ بيْعَةٌ مَاتَ مِيتةً جَاهِلًيَّةً" رواه مسلم. وفي روايةٍ لَهُ: "ومَنْ ماتَ وَهُوَ مُفَارِقٌ للْجَماعةِ، فَإنَّهُ يمُوت مِيتَةً جَاهِليَّةً"."المِيتَةُ"بكسر الميم.
దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) తెలియజేశారు: (ధర్మసమ్మతమైన విషయాల్లో తమ నాయకుని) విధేయత నుండి మడమ త్రిప్పుకునే వ్యక్తి ప్రళయదినాన దేవుణ్ణి కలుసుకున్నప్పుడు అతని దగ్గర ఎలాంటి ఆధారమూ ఉండదు. తన మెడలో ఎవరి ప్రమాణమూ లేని స్థితిలో మరణించేవ్యక్తి అజ్ఞానకాలపు చావు చస్తాడు. (ముస్లిం)
ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : (ముస్లింల) సామూహిక వ్యవస్థ నుండి వైదొలగి మరణించేవ్యక్తి అజ్ఞానకాలపు చావు చస్తాడు. (సహీహ్ ముస్లింలోని నాయకత్వ ప్రకరణం)
English
Ibn `Umar (radiyallahu anhuma) reported: Messenger of Allah ﷺ said, “One who withdraws his hand from obedience (to the Amir) will find no argument (in his defense) when he stands before Allah on the Day of Resurrection; and one who dies without having sworn allegiance will die the death of one belonging to the Days of Ignorance.’‘[Muslim].
Another narration is: The Messenger of Allah ﷺ said, “He who dies having defected from obedience (to the Amir) and discards his association with the main body of the (Muslim) community, dies the death of one belonging to the Days of Jahiliyyah.”
ముఖ్యాంశాలు
ముస్లింలు తమ పాలకులకు తప్పనిసరిగా విధేయత చూపాలని, వారి విధేయతను ధిక్కరిస్తే మొత్తం ధర్మాన్నే ధిక్కరించినట్లవుతుందని ఈ హదీసుద్వారా కూడా బోధపడుతోంది. పాలకులకు అవిధేయులుగా ఉండి మరణించటాన్ని అజ్ఞానకాలపు చావు అని ఎందుకు అనబడిందంటే – ఇస్లాంకు పూర్వం అజ్ఞానకాలంలో ఒకే నాయకుణ్ణి అనుసరించాలనే నియమం ఉండేది కాదు. పైగా దాన్ని వారు ఎంతో అవమానకరంగా భావించేవారు. ఇస్లాం ధర్మం ఆ అస్తవ్యస్త వ్యవస్థను నిర్మూలించి నియమబద్ధమైన ఓ వినూత్న సమాజాన్ని స్థాపించింది. ప్రజలు తమ నాయకులకు తప్పకుండా విధేయత చూపాలని నొక్కివక్కాణించింది.
పై హదీసులో పరిపాలకుడు అంటే ముస్లింల సామూహిక వ్యవస్థకు అధికారికంగా ఎన్నికయిన నాయకుడని అర్థం. అంతేగాని ముస్లిం సమాజంలోని చిట్టిపొట్టి సంస్థలు, సంఘాల నాయకులని దాని అర్థం ఎంతమాత్రం కాదు. ఎందుకంటే వారు అధికారికంగా ఎన్నుకోబడినవారు కారు. వారికి అవిధేయత కనబరిస్తే దేశ సమగ్రతకు భంగం వాటిల్లుతుందని గాని, ముస్లింల సామూహిక వ్యవస్థకు విఘాతం కలుగుతుందని గాని భయం ఉండదు. అంచేత వారిపట్ల అవిధేయతను కనబరచటాన్ని దైవతిరస్కారం, ధర్మభ్రష్టతల అంతటి నేరంగా పరిగణించలేము. హదీసులో నాయకుని పట్ల అవిధేయత కనబరచటాన్ని దైవతిరస్కారంతో సమానంగా చెప్పబడింది. దీనిద్వారా నాయకుడంటే ముస్లింల సామూహిక వ్యవస్థకు అధికారికంగా ఎన్నుకోబడిన నాయకుడని అవగతమవుతుంది. అయితే ఇతర దిన్న చిన్న సంస్థల, సంఘాల నాయకుల్ని ఆయా సంస్థల సభ్యులు, కార్యకర్తలు గౌరవించాలి. షరీఅత్కు అనుగుణమైన విషయాల్లో తప్పనిసరిగా వారికి విధేయత చూపాలి. లేకపోతే సమాజంలోని ఏ సంస్థా, ఏ సంఘమూ నిలకడగా ఉండజాలదు. అయితే ఇలాంటి సంఘాల నుండి వైదొలగిపోవటం లేదా వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం దైవధిక్కారమంతటి ఘోరమైన నేరం మాత్రం కాదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|80. ధర్మసమ్మతమైన విషయాల్లో పాలకులకు విధేయత చూపటం విధి, అధర్మ విషయాల్లో వారికి విధేయత చూపటం నిషిద్ధం|హదీసు 665
హదీసు 666
وعَن أنَسٍ رضي اللَّهُ عنه قال: قال رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "اسْمَعُوا وأطِيعُوا، وإنِ اسْتُعْمِل علَيْكُمْ عبْدٌ حبشىٌّ، كَأَنَّ رَأْسهُ زَبِيبَةٌ" رواه البخاري.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : (నాయకుల మాట) వినండి, వారికి విధేయత చూపండి. నేరేడు పండులాంటి తల గల ఒక నీగ్రోజాతి బానిస మీకు నాయకునిగా నియమించబడినా సరే! (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని అజాన్ ప్రకరణం)
English
Anas (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Hear and obey even if an Abyssinian slave whose head is like a raisin is placed in authority over you.”[Al-Bukhari].
ముఖ్యాంశాలు
నేరేడుపండు లాంటి తలగల వాడంటే చిన్న తలకాయతో వికృతంగా కనిపించే మనిషి అని అర్థం. చిన్న తలకాయ, నల్లని శరీర వర్ణం, దానికితోడు బానిసత్వం – ఇన్ని అవలక్షణాలున్న మనిషిని సాధారణంగా ఎవరూ గౌరవదృష్టితో చూడరు. కాని అలాంటి వ్యక్తి అయినాసరే; తన దైవభక్తి, ధర్మపరాయణత, బుద్ధికుశలతల ప్రాతిపదికపై నాయకునిగా నియమించబడితే ముస్లింలు అతనికి కూడా విధేయత చూపాలని పై హదీసు నొక్కివక్కాణిస్తోంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|80. ధర్మసమ్మతమైన విషయాల్లో పాలకులకు విధేయత చూపటం విధి, అధర్మ విషయాల్లో వారికి విధేయత చూపటం నిషిద్ధం|హదీసు 666
హదీసు 667
وعن أَبي هريرة رضي اللَّه عنه قَالَ: قالَ رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "عليْكَ السَّمْعُ وَالطَّاعةُ في عُسْرِكَ ويُسْرِكَ وَمنْشَطِكَ ومَكْرهِكَ وأَثَرَةٍ عَلَيْك" رواهُ مسلم.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు:కలిమిలోనూ, లేమిలోనూ, సంతోష సమయాల్లోనూ విచారవేళల్లోనూ (పాలకులు) నీకన్నా ఇతరులకు ప్రాధాన్యతనిచ్చినప్పుడు కూడా (వారి మాట) వినటం, శిరసా వహించటం నీ విధి. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని నాయకత్వ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “It is obligatory upon you to listen and obey the orders of the ruler in prosperity and adversity, whether you are willing or unwilling, or when someone is given undue preference to you.”[Muslim].
ముఖ్యాంశాలు
జాతీయ ప్రయోజనాల నిమిత్తం పరిపాలకుల ఆజ్ఞల్ని శిరసావహించటం చాలా అవసరం. అందుకే ప్రజలు వ్యక్తిగత ప్రయోజనాలకు బదులు జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సర్వకాల, సర్వావస్థల్లో నాయకులకు విధేయత చూపుతూ ఉండాలి. వారు షరీఅత్ హద్దులకు లోబడి ఉన్నంతవరకూ వారి ఆజ్ఞల్ని శిరసావహిస్తూనే ఉండాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|80. ధర్మసమ్మతమైన విషయాల్లో పాలకులకు విధేయత చూపటం విధి, అధర్మ విషయాల్లో వారికి విధేయత చూపటం నిషిద్ధం|హదీసు 667
హదీసు 668
وعن عبدِ اللَّهِ بن عَمرو رضي اللَّه عنهما قَالَ: كُنَّا مَع رسول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم في سَفَرٍ، فَنَزَلْنا منْزِلاً، فَمِنَّا منْ يُصلحُ خِباءَهُ، ومِنَّا منْ ينْتَضِلُ، وَمِنَّا مَنْ هُوَ في جَشَرِهِ، إذْ نادَى مُنَادي رسولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: الصَّلاة جامِعةٌ. فاجْتَمعْنَا إِلَى رَسُولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَقَالَ: "إنَّهُ لَمْ يَكُنْ نَبيٌّ قَبْلي إلاَّ كَانَ حَقا علَيْهِ أنْ يَدُلَّ أُمَّتَهُ عَلى خَيرِ مَا يعْلَمُهُ لهُمْ، ويُنذِرَهُم شَرَّ مَا يعلَمُهُ لهُم، وإنَّ أُمَّتَكُمْ هذِهِ جُعِلَ عَافيتُها في أَوَّلِها، وسَيُصِيبُ آخِرَهَا بلاءٌ وأُمُورٌ تُنكِرُونَهَا، وتجيءُ فِتَنٌ يُرقِّقُ بَعضُها بَعْضاً، وَتَجِيءُ الفِتْنَةُ فَيقُولُ المؤمِنُ: هذِهِ مُهْلِكَتي، ثُمَّ تَنْكَشِفُ، وتجيءُ الفِتنَةُ فَيَقُولُ المُؤْمِنُ: هذِهِ هذِهِ، فَمَنْ أَحَبَّ أنْ يُزَحْزَحَ عَنِ النَّارِ، ويُدْخَلَ الجنَّةَ، فَلْتَأْتِهِ منيَّتُهُ وَهُوَ يُؤْمِنُ بِاللَّهِ وَاليَوْمِ الآخِرِ، ولَيَأْتِ إِلَى الناسِ الَّذِي يُحِبُّ أَنْ يُؤتَى إلَيْهِ. ومَنْ بَايع إمَاماً فَأَعْطَاهُ صَفْقَةَ يدِهِ، وثمَرةَ قَلْبهِ. فَليُطعْهُ إنِ اسْتَطَاعَ، فَإنْ جَاءَ آخَرُ ينازعُهُ، فاضْربُوا عُنُقَ الآخَرِ "رواهُ مسلم. قَوْله:"ينْتَضِلُ"أيْ: يُسابِقُ بالرَّمْي بالنَّبْل والنُّشَّاب."والجَشَرُ"بفتح الجيم والشين المعجمة وبالراءِ: وهي الدَّوابُّ الَّتي تَرْعَى وتَبيتُ مَكانَها. وَقَوْلُه:"يُرقَّقُ بعْضُهَا بَعضاً"أيْ: يُصيِّرُ بعضَها بَعْضَاً رقِيقاً، أيْ: خَفِيفاً لِعِظَمِ مابعْدَهُ، فالثَّاني يُرقَّقُ الأَوَّلَ. وقيلَ: معناهُ: يُشَوِّقُ بَعْضُهَا إِلَى بعْضٍ بتحْسينها وتسْويلها وقيلَ: يُشْبهُ بعضُها بَعْضاً.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హుమా) కథనం : ఒకసారి మేము దైవప్రవక్త ﷺ వెంట ప్రయాణిస్తూ ఒకచోట మజిలీ చేశాము. అప్పుడు మాలో కొంతమంది తమ గుడారాలు చక్కబెట్టుకోసాగారు. మరికొంతమంది విలువిద్యల ప్రదర్శనలు జరుపుకోసాగారు. ఇంకొంతమంది పశువుల బాగోగులు చూడటంలో నిమగ్నులై ఉన్నారు. అంతలో దైవప్రవక్త ﷺ గారి ప్రకటనకర్త 'నమాజ్ మొదలుకాబోతోంది' అని ప్రకటించాడు.
ఆ ప్రకటన విని మేమంతా దైవప్రవక్త ﷺ దగ్గరికి చేరుకున్నాం. అప్పుడాయన మమ్మల్ని ఉద్దేశ్యించి ఇలా బోధించారు : "నాకు పూర్వం వచ్చిన ప్రతి ప్రవక్తపై తన అనుచర సమాజాన్ని తాను వారికోసం శ్రేయోదాయకమైన ఆచరణలుగా భావించేవాటి వైపునకు నడిపించటం, తాను వారి పాలిట హానికరమయిన ఆచరణలుగా భావించేవాటి నుండి హెచ్చరించటం విధిగా ఉండేది. ఇకపోతే మీ ఈ సమాజ శ్రేయం దాని తొల్దొలి (కాలం)లో ఉంది. దాని ఆఖరిలో పరీక్షలుంటాయి. మీరు అసహ్యించుకునే పనులు జరుగుతాయి. ఎన్నో ఉపద్రవాలు తలెత్తుతాయి. ఒక ఉపద్రవం మరో ఉపద్రవాన్ని చిన్నదిగా చేసేస్తుంది. (తలెత్తే ప్రతి ఉపద్రవం తనకంటే ముందు వచ్చిన ఉపద్రవం కన్నా భయంకరంగా ఉంటుంది). ఒక ఉపద్రవం ఎదురవటం చూసి విశ్వాసి, తనను నాశనం చేసే ఉపద్రవం అదేననుకుంటాడు. కాని అంతలో అది దూరమయిపోయి మరో ఉపద్రవం తలెత్తుతుంది. దాన్ని చూసి విశ్వాసి అన్నిటికన్నా పెద్ద ఉపద్రవం అదేననుకుంటాడు.
"ఎవరయితే నరకాగ్ని నుండి రక్షించబడి స్వర్గానికి పంపబడాలనుకుంటున్నాడో అతనికి తాను దేవుణ్ణి, అంతిమదినాన్ని విశ్వసిస్తూ ఉన్న తరుణంలో మరణం సంభవించాలి. ఇంకా అతను తన పట్ల, ఉత్తమ వ్యవహారం జరగాలని కోరుకుంటున్నట్లుగానే ప్రజలపట్ల కూడా ఉత్తమంగా వ్యవహరిస్తూ ఉండాలి. ఎవరయినా ఏ నాయకునితోనయినా ప్రమాణం చేసి అతనికి తన హస్తం, హృదయాల ఫలాన్ని అందజేస్తే (అంటే మనసులో ఆ ప్రమాణాన్ని నెరవేర్చాలని గట్టిగా నిశ్చయించుకుంటే) అతను తన నాయకునికి వీలైనంతగా విధేయత చూపాలి. ఆ తర్వాత వేరే వ్యక్తి ఎవరయినా అతన్ని లోబరుచుకోవాలనే ఉద్దేశ్యంతో అతనితో కొట్లాడితే ఆ వ్యక్తి తలను నరికివేయండి." (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని నాయకత్వ ప్రకరణం)
English
`Abdullah bin `Amr (radiyallahu anhuma) reported: We accompanied Messenger of Allah ﷺ on a journey. We halted at a place to take a rest. Some of us began to set right their tents, others began to graze their animals while others were engaged in competing with one another in archery when an announcer of Messenger of Allah ﷺ announced that people should gather for Salat. We gathered around the Messenger of Allah and he ( ﷺ) addressed us, saying, “Every Prophet before me was under obligation to guide his followers to what he knew was good for them and to warn the evil thing which he knew. As for this Ummah, it will have sound state and in its early stage of existence; but the last phase of its existence, will be faced with trials and with things you do not recognize. There will be tremendous trials, one after the other, and to each the believer will say, `That is it’. Whenever a trial arrives the believer will say: `This is going to bring about my destruction.’ When this passes, another calamity will approach and he will say: `This surely is going to be my end.’ Whosoever wishes to be removed from the Fire (Hell) and admitted to Jannah should die with faith in Allah and the Last Day; and he should treat others as he wishes to be treated. He who swears allegiance to an Imam, he should give him the pledge in ratification and the sincerity of his heart. He should obey him to the best of his capacity. If another man comes forward as a claimant (when one has already been installed), behead the second.”[Muslim].
ముఖ్యాంశాలు
తొల్దొలి కాలమంటే దైవప్రవక్త సహచరులు, వారి అనుచరులైన తాబయీన్లు, వారి అనుచరులైన తబేతాబయీన్ల జీవిత కాలమన్నమాట. అదే వేరొక హదీసులో 'ఖైరుల్ ఖురూన్' (అత్యుత్తమకాలం)గా చెప్పబడింది. ఆ కాలం, దాని తర్వాత వచ్చిన కాలాలన్నిటికన్నా శ్రేష్ఠమయినదిగా, శుభకరమైనదిగా వర్ధిల్లింది. ఆ తర్వాత కాలగమనంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఎన్నో ఉపద్రవాలు తలెత్తాయి. ఆ విధంగా ముస్లిం సమాజం సయితం చెడులకు, నీతి బాహ్యతలకు ఆలవాలమయిపోయింది.
ఉపద్రవాలు తలెత్తుతాయని ముందే చెప్పటంలోని ఉద్దేశ్యం సమాజాన్ని జాగరూకపరచటం, చెడుల నుండి హెచ్చరించటం, ప్రజల్ని ఉపద్రవాల పట్ల అప్రమత్తం చేయటం. అందుకే ఆ ఉపద్రవాల నుండి మనుషులు తమల్ని తాము కాపాడుకునే మార్గాన్ని కూడా సూచించటం జరిగింది. దేవునిపై, అంతిమ దినంపై మొక్కవోని విశ్వాసంతో ప్రజల పట్ల ఉత్తమంగా వ్యవహరిస్తూ,మంచి నడవడికను కలిగివుంటే ఆ ఉపద్రవాల వల్ల మనిషికి ఎలాంటి హాని జరగదని చెప్పబడింది.
ప్రళయ సమీపకాలంలో నాయకుల్లో పదవీ వ్యామోహం పెచ్చరిల్లుతుందని కూడా ఈ హదీసు సూచిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ మొట్టమొదటి నాయకునికే విధేయత చూపాలి. అతనితో కలిసి తిరుగుబాటుదారుల పీచమణచివేయాలి. వ్యతిరేకవాదుల కుంపట్లను కూల్చివేయాలి. అప్పుడే ఇస్లామీయ రాజ్యవ్యవస్థ పటిష్టంగా ఉండగల్గుతుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|80. ధర్మసమ్మతమైన విషయాల్లో పాలకులకు విధేయత చూపటం విధి, అధర్మ విషయాల్లో వారికి విధేయత చూపటం నిషిద్ధం|హదీసు 668
హదీసు 669
وعن أَبي هُنَيْدةَ وائِلِ بن حُجْرٍ رضي اللَّه عنه قالَ: سأَلَ سَلَمةُ بنُ يزيدَ الجُعْفيُّ رَسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فقالَ: يَا نَبِيَّ اللَّهِ، أرَأَيْتَ إنْ قَامَتْ علَيْنَا أُمراءُ يَسأَلُونَا حقَّهُمْ، ويمْنَعُونَا حقَّنا، فَمَا تَأْمُرُنَا؟ فَأَعْرضَ عنه، ثُمَّ سألَهُ، فَقَال رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم "اسْمَعُوا وأطِيعُوا، فَإنَّما علَيْهِمْ ماحُمِّلُوا وعلَيْكُم مَا حُمِّلْتُمْ " رواهُ مسلم.
హజ్రత్ అబూ హునైదా వాయిల్ బిన్ హుజ్ర్ (రదియల్లాహు అన్హు) కథనం : ఒకసారి సలమా బిన్ యజీద్ జూఫీ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త ﷺను అడిగారు: "దైవప్రవక్తా! ఒకవేళ కొంతమంది (చెడ్డ) పరిపాలకులు మాపై నియమింపబడి కేవలం తమ హక్కుల గురించి మమ్మల్ని డిమాండ్ చేస్తూ, మా హక్కుల్ని కాలరాస్తుంటే అప్పుడు మేము ఏం చేయాలో చెబుతారా?" అని. దానికి దైవప్రవక్త ﷺ మొదటిసారి తలత్రిప్పుకున్నారు. (ఏ సమాధానం చెప్పలేదు). సలమా మళ్ళీ అదేమాట అడిగారు. అప్పుడు దైవప్రవక్త ﷺ సమాధానమిస్తూ, "(నాయకుల మాట) వినండి, వారికి విధేయత చూపండి. వారి బాధ్యతల భారాన్ని వారు మోస్తారు. మీ బాధ్యతల భారాన్ని మీరు మోయాలి" అన్నారు.
(ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని నాయకత్వ ప్రకరణం)
English
Wa’il bin Hujr (radiyallahu anhu) reported: Salamah bin Yazid Al-Ju`f (radiyallahu anhu) asked Messenger of Allah ﷺ: “O Prophet of Allah! Tell us, what you command us to do if there arises over us rulers who demand of us what is due to them and refuse us what is due to us.” Messenger of Allah ﷺ turned away from him, but he repeated the same question. Thereupon Messenger of Allah ﷺ said, “Listen to them and obey them. They are responsible for their obligations and you are accountable for yours.”[Muslim].
ముఖ్యాంశాలు
పాలకులు, పాలితులు – ఇరువురునూ తమ తమ కార్యక్షేత్రాల్లో బాధ్యతాయుతులేనని ఈ హదీసు చెబుతోంది. ఆ బాధ్యతా నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఆ పాపభారాన్ని తామే మోయవలసి ఉంటుంది. దానికి వారు ప్రళయదినాన శిక్షను అనుభవిస్తారు. అయితే పరిపాలకులు తమ విధులు సరిగ్గా నిర్వర్తించటం లేదని ప్రజలు కూడా అవిధేయతకు పాల్పడటానికి ఇస్లాం ధర్మం ఎంతమాత్రం అనుమతించదు. ఎందుకంటే ఒక తప్పును మరో తప్పుతో ప్రక్షాళించటం సాధ్యం కాదు. పైగా దానివల్ల రాజ్యంలో మరింత కల్లోలం చెలరేగుతుంది. అంతేకాదు, దేశప్రయోజనాల దృష్ట్యా పరిపాలకుల పట్ల అవిధేయతకు పాల్పడటంకన్నా వారి ఆగడాలను, అన్యాయాన్ని సహించటమే అన్ని విధాలా మంచిది. అయితే షరీఅత్ అనుమతి మేరకు, సంఘసంస్కరణకోసం కృషిచేయటం, పరిపాలకుల అన్యాయాన్ని ఎండగట్టటం, నాయకుల దౌర్జన్యాన్ని నిరసించటం, అదేవిధంగా మంచిని గురించి ఆజ్ఞాపించే, చెడుని నిర్మూలించే విధిని నిర్వర్తించటంలాంటి చర్యలు తిరుగుబాటు ధోరణుల క్రిందికి రావు. పైగా ప్రజలందరూ తమ శక్తిమేరకు వ్యక్తిగతంగా, సామూహికంగా ఇలాంటి చర్యలు చేపట్టటం చాలా అవసరం.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|80. ధర్మసమ్మతమైన విషయాల్లో పాలకులకు విధేయత చూపటం విధి, అధర్మ విషయాల్లో వారికి విధేయత చూపటం నిషిద్ధం|హదీసు 669
హదీసు 670
وَعَنْ عَبْدِ اللَّهِ بنِ مسْعُودٍ رضي اللَّهُ عنه قَالَ: قالَ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إنَّهَا ستَكُونُ بعْدِي أَثَرَةٌ، وأُمُورٌ تُنْكِرُونَهَا،"قَالُوا: يَا رسُولَ اللَّهِ، كَيفَ تَأْمُرُ مَنْ أَدْركَ مِنَّا ذلكَ؟ قَالَ:"تُؤَدُّونَ الحَقَّ الَّذِي عَلَيْكُمْ، وتَسْأَلُونَ اللَّه الذي لَكُمْ" متفقٌ عليه.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఒకసారి తన అనుచరుల్ని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, "నా తదనంతరం స్వార్థం రాజ్యమేలుతుంది. ఇంకా మీరు అసహ్యించుకునే ఎన్నో చెడు పనులు జరుగుతాయి" అన్నారు.
అది విని సహచరలు, "దైవప్రవక్తా! మాలో ఎవరైనా ఆ కాలంలో గనక బ్రతికి ఉంటే అప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు?" అని అడిగారు. దానికి దైవప్రవక్త ﷺ, "మీరు మీ బాధ్యతల్ని నిర్వర్తించాలి. మీకు రావలసిన హక్కుల్ని గురించి మాత్రం దేవుణ్ణి ప్రార్థించాలి" అని బదులిచ్చారు.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని ప్రవక్తల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని నాయకత్వ ప్రకరణం)
English
`Abdullah bin Mas`ud (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “There will be discrimination after my death and there will be other matters that you will disapprove.” He was asked: “O Messenger of Allah! What do you command us to do when we are encountered with such happenings?” He answered, “Give what is due from you and supplicate to Allah for your rights.”[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|80. ధర్మసమ్మతమైన విషయాల్లో పాలకులకు విధేయత చూపటం విధి, అధర్మ విషయాల్లో వారికి విధేయత చూపటం నిషిద్ధం|హదీసు 670
హదీసు 671
وعن أبي هريرة رضي اللَّهُ عنه قَالَ: قَالَ رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَنْ أَطَاعَني فَقَدْ أَطَاعَ اللَّه، وَمَنْ عَصَاني فَقَدْ عَصَى اللَّه، وَمَنْ يُطِعِ الأمِيرَ فَقَدْ أطَاعَني، ومَنْ يعْصِ الأمِيرَ فَقَدْ عَصَانِي" متفقٌ عَلَيْهِ.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : నాకు విధేయత చూపితే దేవునికి విధేయత చూపినట్లవుతుంది. నా పట్ల అవిధేయత కనబరిస్తే దేవుని పట్ల అవిధేయత కనబరచినట్లవుతుంది. తమ నాయకునికి విధేయత చూపితే నాకు విధేయత చూపినట్లవుతుంది. తమ నాయకునిపట్ల అవిధేయత కనబరిస్తే నా పట్ల అవిధేయత కనబరచినట్లవుతుంది. (బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని ఆదేశాల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని నాయకత్వ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Whosoever obeys me, obeys Allah; and he who disobeys me, disobeys Allah; and whosoever obeys the Amir (leader), in fact, obeys me; and he who disobeys the Amir, in fact, disobeys me.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ఇక్కడ 'నాయకుడు' అంటే అధికారంలో ఉన్న ముస్లిం పరిపాలకుడు, ఏదైనా ప్రాంతపు గవర్నరు, ముఖ్యమంత్రి, ప్రధానాధికారి మొదలగువారని అర్థం. వీరు అల్లాహ్ పట్ల అవిధేయతకు పాల్పడనంతవరకు ముస్లింలు వీరికి తప్పకుండా విధేయత చూపాలి. వీరికి విధేయత చూపకపోవటం చాలా పెద్ద పాపం. రాజ్యంలో శాంతిభద్రతలతోపాటు క్రమబద్ధత కూడా చాలా అవసరం. ప్రజలు తమ పరిపాలకులకు విధేయత పాటించినప్పుడే అది సాధ్యమవుతుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|80. ధర్మసమ్మతమైన విషయాల్లో పాలకులకు విధేయత చూపటం విధి, అధర్మ విషయాల్లో వారికి విధేయత చూపటం నిషిద్ధం|హదీసు 671
హదీసు 672
وعن ابن عباسٍ رضي اللَّه عنهما أنَّ رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَنْ كَرِه مِنْ أَمِيرِهِ شيْئاً فَليَصبِر، فإنَّهُ مَن خَرج مِنَ السُّلطَانِ شِبراً مَاتَ مِيتَةً جاهِلِيةً" متفقٌ عَلَيْهِ.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : ఎవరికయినా తమ నాయకునిలో ఏదయినా విషయం నచ్చకపోతే అతను సహనం వహించాలి. ఎవరయినా తమ పరిపాలకుని విధేయతా పరిధినుండి జానెడు దూరం మించిపోయినా సరే అతను అజ్ఞానపు చావును కొనితెచ్చుకుంటాడు.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని ఉపద్రవాల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని నాయకత్వ ప్రకరణం)
English
Ibn `Abbas (radiyallahu anhuma) reported: Messenger of Allah ﷺ said, “If a person notices in his ruler what he dislikes, he should show patience because he who departs from the (Muslim) community a cubit, dies like those who died in the Days of Ignorance.”[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|80. ధర్మసమ్మతమైన విషయాల్లో పాలకులకు విధేయత చూపటం విధి, అధర్మ విషయాల్లో వారికి విధేయత చూపటం నిషిద్ధం|హదీసు 672
హదీసు 673
وعن أبي بكر رضي اللَّه عنه قالَ: سَمِعتُ رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقول:"مَن أهَانَ السُّلطَانَ أَهَانَهُ اللَّه" رواه الترمذي وقال: حديث حسن. وفي الباب أحاديث كثيرة في الصحيح، وقد سبق بعضها في أبواب.
దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు పరిపాలకుణ్ణి పరాభవించినవాణ్ణి దేవుడు అవమానానికి గురిచేస్తాడు.
తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హసన్గా పేర్కొన్నారు.
ఈ అధ్యాయానికి సంబంధించిన ప్రామాణికమైన హదీసులు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని వివిధ అధ్యాయాల క్రింద ఇంతకుముందే ప్రస్తావనకు వచ్చాయి.
(సుననె తిర్మిజీలోని ఉపద్రవాల అధ్యాయం)
English
Abu Bakrah (radiyallahu anhu) reported: I heard Messenger of Allah ﷺ saying, “He who insults the rulers Allah will insult him.”[At-Tirmidhi].
ముఖ్యాంశాలు
నాయకుణ్ణి పరాభవించటమంటే అతని ఆజ్ఞల్ని నిర్లక్ష్యం చేయటం, అతనికి విధేయత చూపకపోవటం అని అర్థం. దానిమూలంగా నాయకుని పరువుప్రతిష్ఠలు దెబ్బతింటాయి. రాజ్యంలో శాంతీసౌమనస్యాలు వర్ధిల్లాలంటే, నేరప్రవృత్తి ప్రబలకుండా ఉండాలంటే నాయకుల పట్ల ప్రజల్లో భయభక్తులు ఉండటం చాలా అవసరం. మొత్తానికి నాయకులు బహిరంగంగా దైవధిక్కారానికి పాల్పడకుండా ఉండేంతవరకూ, నమాజ్ లాంటి ఇస్లామీయ విధుల్ని నెరవేరుస్తూ ఉన్నంతవరకూ న్యాయవంతమైన పరిపాలనను అందించటంలో వారివల్ల లోపాలు జరిగినా దేశప్రయోజనాల దృష్ట్యా, విజ్ఞతా వివేచనాల దృష్ట్యా ముస్లిం ప్రజానీకం తమ నాయకులకు విధేయత చూపటాన్ని మానుకోకూడదని ఇస్లాం ధర్మం నొక్కివక్కాణిస్తోంది.
ఇస్లాం ధర్మంలోని ఈ ఆదేశం నేటి ప్రజాస్వామ్య వ్యవస్థకు పూర్తిగా భిన్నమైనది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పక్షంతోపాటు ప్రతిపక్షం కూడా తప్పనిసరిగా ఉంటుంది. అది ఎల్లప్పుడూ అధికారపక్షంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉంటుంది. సామాన్య ప్రజానీకాన్ని పాలకవర్గానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయమని పురికొల్పి అధికారాన్ని తమ హస్తగతం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇస్లామీయ రాజ్యవ్యవస్థలో పాలకవర్గం, ప్రతిపక్షవర్గమన్న ప్రసక్తే ఉండదు. అందరూ ఒకే సమాజంలోని సభ్యులు. ఒకే నావలో పయనిస్తున్న ప్రయాణీకుల్లాంటివారు. ఇందులో వ్యక్తిగత ప్రయోజనాలు, లక్ష్యాలకు బదులు ప్రజలందరి ఉమ్మడి ప్రయోజనాలు, లక్ష్యాలకు ప్రాధాన్యత ఉంటుంది. అంచేత పాలకుల వల్ల స్వల్పమైన తప్పులు జరిగినప్పుడు వారికి విధేయత చూపకపోవటం, వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం నేరంగా పరిగణించబడుతుంది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల నిర్వహణ ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. ఈ తరహా వ్యవస్థలో తరచూ ఎన్నికలు జరుగుతుండటం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎన్నో కోట్ల, బిలియన్ రూపాయాల నష్టం వస్తుంది. అంతేకాదు, ఎన్నికల కాలంలో వివిధ పార్టీల కార్యకర్తలు ప్రచారాల పేరిట వీధుల్లో తిరిగి ప్రజలమధ్య విద్వేషాన్ని రగుల్గొల్పుతారు. ఈ చేష్టలు ఇస్లామీయ శాంతిదాయక బోధనలతో ఏమాత్రం పొసగవు. ఇస్లాంలో నాయకులు ఓ నిర్ణీత కాలంలోనే పరిపాలించాలన్న నియమం లేదు. చీటికి మాటికి నాయకుల్ని గద్దె దింపి క్రొత్తవారికి పట్టం కట్టటాన్ని కూడా ఇస్లాం ధర్మం గర్హిస్తుంది. ప్రజలు తమ నాయకుల తప్పుల్ని ఉపేక్షించాలని చెప్పటంలోని ఉద్దేశ్యం అదే. నాయకులకు వీలైనంత ఎక్కువ పరిపాలనా వ్యవధి లభించాలి. దానివల్ల దేశసమగ్రత దెబ్బతినకుండా ఉంటుంది. ప్రజల శ్రేయం కూడా అందులోనే ఇమిడి ఉంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|80. ధర్మసమ్మతమైన విషయాల్లో పాలకులకు విధేయత చూపటం విధి, అధర్మ విషయాల్లో వారికి విధేయత చూపటం నిషిద్ధం|హదీసు 673
You must be logged in to post a comment.