హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 79. న్యాయశీలుడైన పరిపాలకుడు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 79వ అధ్యాయం: న్యాయశీలుడైన పరిపాలకుడు. ఈ అధ్యాయంలో 2 ఖుర్ఆన్ ఆయతులు, 4 హదీసులు (హదీసు 659 – 662) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

79. న్యాయశీలుడైన పరిపాలకుడు

↑ విషయ సూచిక

باب الوالي العادل

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు :

{إِنَّ اللَّهَ يَأْمُرُ بِالْعَدْلِ وَالأِحْسَانِ} [النحل:٩٠]

"న్యాయం చెయ్యండి అనీ, ఉపకారం చెయ్యండి అనీ, బంధువుల హక్కులు నెరవేర్చండి అనీ అల్లాహ్ ఆజ్ఞాపిస్తున్నాడు." (అన్ నహ్ల్ : 90)

{وَأَقْسِطُوا إِنَّ اللَّهَ يُحِبُّ الْمُقْسِطِينَ} [الحجرات: ٩]

"న్యాయం చేయండి, ఎందుకంటే అల్లాహ్ న్యాయం చేసేవారిని ప్రేమిస్తాడు." (అల్ హుజురాత్ : 9)

English

“Verily, Allah enjoins Al-`Adl (justice) and Al-Ihsan (performing duties in a perfect manner).” [An-Naḥl 16:90]

“And be equitable. Verily! Allah loves those who are the equitable.” [Al-Ḥujurāt 49:9]

659

హదీసు 659

وعن أَبي هريرة رضي اللَّه عنه، عن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ:"سَبْعَةٌ يُظِلُّهُمُ اللَّه في ظِلِّهِ يومَ لاَ ظِلَّ إلاَّ ظِلُّهُ: إمَامٌ عادِلٌ، وشَابٌّ نَشَأَ في عِبادَةِ اللَّهِ تَعالى، ورَجُلٌ مُعَلَّقٌ قَلبُهُ في المَسَاجِدِ، ورجُلانِ تَحَابَّا في اللَّه، اجتَمعَا عليهِ، وتَفرَّقَا علَيهِ، ورجُلٌ دعَتهُ امرَأَةٌ ذَاتُ مَنصِب وجمَالٍ، فقَال: إنِّى أَخَافُ اللَّه، ورَجُلٌ تَصَدَّقَ بِصدقةٍ، فَأَخْفَاها حَتَّى لاَ تَعلَمَ شِمالُهُ مَا تُنفِقُ يميِنُهُ، ورَجُلٌ ذَكَر اللَّه خَالِياً فَفَاضَتْ عينَاهُ" متفقٌ عَلَيْهِ.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు : దేవుని నీడ తప్ప మరెలాంటి నీడ కనిపించని (ప్రళయ) దినాన దేవుడు ఏడుగురు వ్యక్తుల్ని తన (కారుణ్య) నీడలో ఉంచుతాడు. ఆ ఏడుగురు : (1) న్యాయంగా పాలించిన పరిపాలకుడు (2) తన యవ్వనాన్ని దైవారాధనలో గడిపిన యువకుడు (3) మనసంతా మస్జిద్‌లోనే ఉండే వ్యక్తి (4) కేవలం దైవప్రసన్నత కోసం పరస్పరం ప్రేమించుకునే ఇద్దరు వ్యక్తులు (అలాగే), దైవప్రసన్నత ప్రాతిపదికగా పరస్పరం విడిపోయేవారు (5) అందం, అంతస్థూ కలిగివున్న స్త్రీ చెడుకార్యానికి పిలిస్తే తాను దేవునికి భయపడుతున్నానంటూ ఆమె కోరికను నిరాకరించిన వ్యక్తి (6) కుడిచేత్తో చేసింది ఎడమచేతికి కూడా తెలియనంత గోప్యంగా దానాలు చేసిన వ్యక్తి (7) ఏకాంతంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని (ఆయన భీతితో) కన్నీరు కార్చిన వ్యక్తి. (బుఖారీ – ముస్లిం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “Seven are (the persons) whom Allah will give protection with His Shade* on the Day when there will be no shade except His Shade (i.e., on the Day of Resurrection), and they are: A just ruler; a youth who grew up with the worship of Allah; a person whose heart is attached to the mosque; two persons who love and meet each other and depart from each other for the sake of Allah; a man whom a beautiful and high ranking woman seduces (for illicit relation), but he (rejects this offer by saying): `I fear Allah’; a person who gives a charity and conceals it (to such an extent) that the left hand might not know what the right has given; and a person who remembers Allah in solitude and his eyes well up.”[Al-Bukhari and Muslim].

* The Shade of Allah to which this Hadith refers to is the shade of His Throne.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|79. న్యాయశీలుడైన పరిపాలకుడు|హదీసు 659

660

హదీసు 660

وعن عبد اللَّهِ بنِ عمرو بن العاص رضي اللَّهُ عنهما قَالَ: قَالَ رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إنَّ المُقسِطينَ عِنْدَ اللَّهِ عَلى مَنابِرَ مِنْ نورٍ: الَّذِينَ يعْدِلُونَ في حُكْمِهِمْ وأَهليهِمْ وما وُلُّوا "رواهُ مسلم.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : (ఇహలోకంలో) న్యాయానికి కట్టుబడి ఉండేవారు దేవుని సన్నిధిలో వెలుగుతో నిండిన వేదికలపై ఉంటారు. న్యాయానికి కట్టుబడి ఉండేవారంటే తమ స్వంత విషయాల్లో, కుటుంబం, ఇతర బాధ్యతల విషయంలో న్యాయంగా వ్యవహరించేవారని అర్థం. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని పదవుల ప్రకరణం)

English

`Abdullah bin `Amr bin Al-`as (radiyallahu anhuma) reported: The Messenger of Allah ﷺ said, “The just will be seated upon pulpits of light.” Those who are fair with regards to their judgement and their family and those who are under them.”[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|79. న్యాయశీలుడైన పరిపాలకుడు|హదీసు 660

661

హదీసు 661

وعَن عوفِ بن مالكٍ رضي اللَّه عنه قالَ: سمِعْتُ رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقولُ: "خِيَارُ أَئمَتكُمْ الَّذينَ تُحِبُّونهُم ويُحبُّونكُم، وتُصَلُّونَ علَيْهِم ويُصَلُّونَ علَيْكُمْ، وشِرَارُ أَئمَّتِكُم الَّذينَ تُبْغِضُونهُم ويُبْغِضُونَكُمْ، وتَلْعُنونَهُمْ وَيَلْعَنُونَكُمْ"قَالَ: قُلْنا يَا رسُول اللَّهِ، أَفَلا نُنابِذُهُمْ؟ قالَ:"لاَ، مَا أَقَامُوا فِيكُمُ الصَّلاةَ، لاَ، مَا أَقَامُوا فيكُمُ الصَلاة "رواه مسلم. قَوْله:"تُصَلُّونَ عَلَيْهِمْ": تَدْعونَ لهُمْ.

దైవప్రవక్త ﷺ ఈ విధంగా చెబుతుండగా తాను విన్నానని హజ్రత్ ఔఫ్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు: మీ పాలకుల్లో మీరు అభిమానించేవారు, మిమ్మల్ని అభిమానించేవారు, మీరు శ్రేయం కోరి ప్రార్థించేవారు, మీ శ్రేయం కోరి ప్రార్థించేవారు అత్యుత్తమ పాలకులు. ఇంకా మీ పాలకుల్లో మీరు అసహ్యించుకునేవారు, మిమ్మల్ని అసహ్యించుకునేవారు, మీరు ఛీత్కరించుకునేవారు, మిమ్మల్ని ఛీత్కరించుకునేవారే అత్యంత హీనులైన పాలకులు. హజ్రత్ ఔఫ్ బిన్ మాలిక్ ఇలా అంటున్నారు : రెండో మాట విని మేము సందేహపడుతూ, "దైవప్రవక్తా! మరి మేము అలాంటి పాలకులతో ప్రమాణాన్ని భగ్నం చేసి వారిపై తిరుగుబాటు చేయకూడదా?" అని అడిగాం. దానికాయన "లేదు, వారు మీ మధ్య నమాజ్ స్థాపించేవారుగా ఉన్నంతవరకూ (అలా చేయకండి), వారు మీమధ్య నమాజ్ స్థాపించేవారుగా ఉన్నంత వరకూ" అని అన్నారు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని నాయకత్వ ప్రకరణం)

English

`Auf bin Malik (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “The best of your rulers are those whom you love and who love you, and those who supplicate Allah in your favour and you supplicate Allah in their favour. The worst of your rulers are those whom you hate and who hate you; and whom you curse and who curse you.” It was asked (by those who were present): “Should not we oppose them?” He said, “No, as long as they establish Salat; as long as they establish Salat in your midst.”[Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో మంచి, చెడు – రెండు రకాల పరిపాలకుల గురించీ చెప్పటం జరిగింది. కొందరు పరిపాలకులు ప్రజల సంక్షేమాన్ని, శ్రేయాన్ని కోరుకుంటూ వారికి న్యాయవంతమైన పరిపాలనను అందజేయటానికి కృషిచేస్తారు. అలాంటి పరిపాలకులు అత్యుత్తమ పరిపాలకులుగా ఖ్యాతిగడిస్తారు. ప్రజలు తమ అభిమాన ప్రభువులు, పాలకుల క్షేమం, శ్రేయాల కోసం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. ఆ సచ్ఛీలురైన పాలకులు కూడా తమ ప్రజల బాగుకోసం ప్రార్థిస్తూ ఉంటారు. ఆ విధంగా వారి రాజ్యం మూడు పూవులు ఆరుకాయలుగా సుఖసంతోషాలతో, శాంతి సౌమనస్యాలతో వర్ధిల్లుతూ ఉంటుంది.

మరోవైపు పాలకుల్లో కొందరు నీచులు, స్వార్థపరులు కూడా ఉంటారు. వారు నిత్యం తమ అధికారాన్ని, తమ వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడుకోవటానికి మాత్రమే కృషి చేస్తుంటారు. ప్రజలకు న్యాయవంతమైన పరిపాలనను అందజేయాలనిగాని, వారి సమస్యలను పరిష్కరించాలనిగాని వారికి ఏమాత్రం ఆసక్తి ఉండదు. తత్కారణంగా ప్రజలు వారిని బహిరంగంగా కాకపోయినా లోలోన అయినా దూషిస్తారు. చరిత్రలో వారికి దుష్ట పరిపాలకులనే ముద్ర పడిపోతుంది.

ఈ హదీసు ద్వారా బోధపడే మరో ముఖ్య విషయం ఏమిటంటే పరిపాలకులు బహిరంగంగా దైవతిరస్కారానికి పాల్పడుతూ, ఇస్లామీయ గౌరవ చిహ్నాలను అవమానపరచనంతవరకూ, నమాజ్‌ను స్థాపిస్తూ ఉన్నంతవరకూ – వారు దౌర్జన్యానికి పాల్పడేవారయినా సరే – ప్రజలు వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయరాదు. ఎందుకంటే చీటికి మాటికీ తిరుగుబాట్లు చేయటం వల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|79. న్యాయశీలుడైన పరిపాలకుడు|హదీసు 661

662

హదీసు 662

وعَنْ عِيَاضِ بن حِمار رضي اللَّهُ عَنْهْ قالَ: سمِعْت رَسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقولُ: "أَهْلُ الجَنَّةِ ثَلاثَةٌ: ذُو سُلْطانٍ مُقْسِطٌ مُوَفَّقٌ، ورَجُلٌ رَحِيمٌ رَقيقٌ القَلْبِ لِكُلِّ ذِى قُرْبَى وَمُسْلِمٍ، وعَفِيفٌ مُتَعَفِّفٌ ذُو عِيالٍ" رواهُ مسلم.

దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ ఇయాజ్ బిన్ హిమార్ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు : "ముగ్గురు స్వర్గవాసులవుతారు. (ఒకడు:) న్యాయంగా పరిపాలించే, సదాచరణచేసే భాగ్యం కలిగివున్న రాజు (రెండోవాడు:) బంధువులు, ముస్లింల విషయంలో దయామయుడు, జాలిగుండె కలిగిన మనిషి. (మూడోవాడు:) అవసరాల్లో ఉండికూడా అడుక్కోని ఆత్మాభిమాని. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని స్వర్గసుఖాల ప్రకరణం)

English

`Iyad bin Himar (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “The people of Jannah will be of three kinds: A just successful ruler, a man who shows mercy to his relatives, and a pious believer who has a large family and refrains from begging.”[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|79. న్యాయశీలుడైన పరిపాలకుడు|హదీసు 662