హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 78. పాలకులు ప్రజలపట్ల మృదువుగా వ్యవహరించాలి

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 78వ అధ్యాయం: పాలకులు ప్రజలపట్ల మృదువుగా వ్యవహరించాలి. వారి శ్రేయాన్ని అభిలషించాలి, వారిని కరుణించాలి, వారిని మోసగించటం, వారిపట్ల కటువుగా వ్యవహరించటం, వారి ప్రయోజనాలను నిర్లక్ష్యం చేయటం, వారిని ఉపేక్షించటం చేయకూడదు. ఈ అధ్యాయంలో 2 ఖుర్ఆన్ ఆయతులు, 6 హదీసులు (హదీసు 653 – 658) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

78. పాలకులు ప్రజలపట్ల మృదువుగా వ్యవహరించాలి. వారి శ్రేయాన్ని అభిలషించాలి, వారిని కరుణించాలి, వారిని మోసగించటం, వారిపట్ల కటువుగా వ్యవహరించటం, వారి ప్రయోజనాలను నిర్లక్ష్యం చేయటం, వారిని ఉపేక్షించటం చేయకూడదు

↑ విషయ సూచిక

باب أمر وُلاة الأمور بالرفق برعاياهم ونصيحتهم والشفقة عليهم والنهي عن غشهم والتشديد عليهم وإهمال مصالحهم والغفلةعنهم وعن حوائجهم

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు :

{وَاخْفِضْ جَنَاحَكَ لِمَنِ اتَّبَعَكَ مِنَ الْمُؤْمِنِينَ} [الشعراء:٢١٥]

"విశ్వాసులలో నిన్ను అనుసరించేవారిపట్ల మృదువుగా మెలగు." (అష్ షుఅరా : 215)

{إِنَّ اللَّهَ يَأْمُرُ بِالْعَدْلِ وَالأِحْسَانِ وَإِيتَاءِ ذِي الْقُرْبَى وَيَنْهَى عَنِ الْفَحْشَاءِ وَالْمُنْكَرِ وَالْبَغْيِ يَعِظُكُمْ لَعَلَّكُمْ تَذَكَّرُونَ} [النحل:٩٠]

న్యాయం చెయ్యండి అనీ, ఉపకారం చెయ్యండి అనీ, బంధువుల హక్కులు నెరవేర్చండి అనీ అల్లాహ్ ఆజ్ఞాపిస్తున్నాడు. చెడునూ, అశ్లీలతనూ, అన్యాయాన్నీ, మితిమీరి ప్రవర్తించటాన్నీ నిషేధిస్తున్నాడు. ఆయన మీకు హితబోధ చేస్తున్నాడు, మీరు గుణపాఠం నేర్చుకోవాలని. (అన్ నహ్ల్ : 90)

English

“And be kind and humble to the believers who follow you.” [Ash-Shu‘arā’ 26:215]

“Verily, Allah enjoins Al-`Adl (justice) and Al-Ihsan (performing duties in a perfect manner), and giving (help) to kith and kin, and forbids Al-Fahsha’ evil deeds and Al-Munkar (all that is prohibited) and Al-Baghy (oppression). He admonishes you, that you may take heed.” [An-Naḥl 16:90]

653

హదీసు 653

وعن ابن عمر رضي اللَّه عنهما قَالَ: سمِعتُ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقول: "كُلُّكُم راعٍ، وكُلُّكُمْ مسؤولٌ عنْ رعِيتِهِ: الإمامُ راعٍ ومَسْؤُولٌ عَنْ رعِيَّتِهِ، والرَّجُلُ رَاعٍ في أهلِهِ وَمسؤولٌ عنْ رَعِيَّتِهِ، وَالمَرأَةُ راعيةٌ في بيتِ زَوجها وَمسؤولةًّ عَنْ رعِيَّتِها، والخَادِمُ رَاعٍ في مَالِ سَيِّدِهِ وَمَسؤُولٌ عَنْ رَعِيتِهِ، وكُلُّكُم رَاعٍ ومسؤُولٌ عَنْ رعِيَّتِهِ" متفقٌ عَلَيْهِ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : మీలో ప్రతి మనిషీ ఓ బాధ్యతగల వ్యక్తి. మిమ్మల్నందరినీ తమ తమ బాధ్యతల గురించి (దేవుని సన్నిధిలో) ప్రశ్నించటం జరుగుతుంది. పాలకుడు (ప్రజా సంక్షేమానికి) బాధ్యుడు. అతన్ని తన బాధ్యత విషయమై ప్రశ్నించటం జరుగుతుంది. (సాధారణ) మనిషి తన పరివారానికి బాధ్యుడు. అతన్ని తన బాధ్యత (పరివారాన్ని) గురించి ప్రశ్నించటం జరుగుతుంది. అలాగే స్త్రీ కూడా తన భర్త ఇంటికి బాధ్యత వహిస్తుంది. ఆమె (కూడా) తన బాధ్యత విషయమై ప్రశ్నించబడుతుంది. సేవకుడు తన యజమాని సొమ్ముకు బాధ్యుడు. అతడూ తన బాధ్యత గురించి ప్రశ్నించబడతాడు. కనుక మీలో ప్రతి ఒక్కడూ (తన కార్యక్షేత్రంలో) బాధ్యతగల వ్యక్తే. మీలో ప్రతి ఒక్కడూ తన బాధ్యత విషయమై ప్రశ్నించబడతాడు.

(బుఖారీ – ముస్లిం)

English

Ibn `Umar (radiyallahu anhuma) reported: I heard Messenger of Allah ﷺ saying, “All of you are guardians and are responsible for your wards. The ruler is a guardian and responsible for his subjects; the man is a guardian and responsible for his family; the woman is a guardian and is responsible for her husbands house and his offspring; and so all of you are guardians and are responsible for your wards.”[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|78. పాలకులు ప్రజలపట్ల మృదువుగా వ్యవహరించాలి. వారి శ్రేయాన్ని అభిలషించాలి, వారిని కరుణించాలి, వారిని మోసగించటం, వారిపట్ల కటువుగా వ్యవహరించటం, వారి ప్రయోజనాలను నిర్లక్ష్యం చేయటం, వారిని ఉపేక్షించటం చేయకూడదు|హదీసు 653

654

హదీసు 654

وعن أَبي يَعْلى مَعْقِل بن يَسَارٍ رضي اللَّه عنه قَالَ: سمعتُ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقول: "مَا مِن عبدٍ يسترعِيهِ اللَّه رعيَّةً، يَمُوتُ يومَ يَموتُ وهُوَ غَاشٌ لِرَعِيَّتِهِ، إلاَّ حَرَّمَ اللَّه علَيهِ الجَنَّةَ" متفقٌ عليه. وفي روايةٍ: "فَلَم يَحُطهَا بِنُصْحهِ لَمْ يجِد رَائحَةَ الجَنَّة". وفي روايةٍ لمسلم: "مَا مِن أَمِيرٍ يَلِي أُمورَ المُسلِمينَ، ثُمَّ لا يَجهَدُ لَهُم، ويَنْصحُ لهُم، إلاَّ لَم يَدخُل مَعَهُمُ الجَنَّةَ".

దైవప్రవక్త ﷺ ఈవిధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూ యాలా మాఖిల్ బిన్ యసార్ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు: దేవుడు ఏ దాసునికయినా ఒకరి తాలూకు పాలనా బాధ్యతలు అప్పగించగా అతను తన పాలితులను మోసపుచ్చుతూ మరణిస్తే దేవుడు అతనికి స్వర్గాన్ని నిషేధిస్తాడు.

(బుఖారీ – ముస్లిం)

వేరొక ఉల్లేఖనంలో, "అతను వారి సంక్షేమాన్ని కోరుకుంటూ వారి హక్కుల్ని కాపాడకపోతే అతనికి స్వర్గ పరిమళం కూడా దక్కదు" అని ఉంది.

ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: ముస్లింల వ్యవహారాలకు బాధ్యతవహించే పాలకుడు వారి సమస్యల పరిష్కారం కోసం తగిన విధంగా శ్రమించకపోతే, వారి బాగును కోరుకోకపోతే అతను వారితోపాటు స్వర్గంలోకి ప్రవేశించలేడు."

(సహీహ్ బుఖారీలోని ఆదేశాల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని నాయకత్వ ప్రకరణం)

English

Abu Ya`la Ma`qil bin Yasar (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Any slave whom Allah makes him in charge of subjects and he dies while he is not sincere to them, Allah will make Jannah unlawful for him.”[Al-Bukhari and Muslim].

Another narration is: Allah’s Messenger ﷺ said, “He who does not look after his subjects with goodwill and sincerity, will be deprived of the fragrance of Jannah.”

A narration in Muslim is: Messenger of Allah ﷺ said, “A ruler who, having control over the affairs of the Muslims, does not strive diligently for their betterment and does not serve them sincerely, will not enter Jannah with them.”

ముఖ్యాంశాలు

ముస్లింల పాలనా వ్యవహారాలకు బాధ్యత వహించటమంటే మాటలు కాదు. ముస్లిం సమాజమన్న తర్వాత వారికి సవాలక్ష సమస్యలుండవచ్చు. ముస్లింలకు బాధ్యుడైన వ్యక్తి వాటి పరిష్కార మార్గాలను తెలుసుకోవటం కోసం కృషి చేయవలసి ఉంటుంది. అతను గనక ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటూ, పూర్తి ఏకాగ్రతతో పనిచేయకపోతే దేవుని సన్నిధిలో నేరస్థుడిగా పరిగణించబడతాడు. తన పాలితులయిన ప్రజలు విశ్వాసం, సదాచరణల మూలంగా స్వర్గంలోకి ప్రవేశిస్తారు కాని తాను మాత్రం (బాధ్యతను మరచిన కారణంగా) ఆ భాగ్యానికి నోచుకోలేకపోతాడు. అందువల్ల ప్రజావ్యవహారాలకు బాధ్యత వహించే రాజులు, అధికారులు రాజ్య మదాంధకారంతో వ్యవహరించకుండా రేపు దైవసన్నిధిలో ఈ బాధ్యత నిర్వహణ గురించి ప్రశ్నించబడుతుందనే భీతిభావంతో మసలుకోవాలి. ప్రజలకు సంపూర్ణ న్యాయాన్ని, సుఖశాంతులను అందజేయటానికి అన్నివిధాలా కృషిచేయాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|78. పాలకులు ప్రజలపట్ల మృదువుగా వ్యవహరించాలి. వారి శ్రేయాన్ని అభిలషించాలి, వారిని కరుణించాలి, వారిని మోసగించటం, వారిపట్ల కటువుగా వ్యవహరించటం, వారి ప్రయోజనాలను నిర్లక్ష్యం చేయటం, వారిని ఉపేక్షించటం చేయకూడదు|హదీసు 654

655

హదీసు 655

وعن عائشة رضي الله عنها قَالَتْ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقُولُ في بيتي هَذَا: "اللَّهُمَّ مَنْ وَلي مِنْ أمْرِ أُمتي شَيْئاً فَشَقَّ عَلَيْهِمْ فاشْقُقْ عَلَيْهِ، وَمَنْ وَلِيَ مِنْ أَمْرِ أُمَّتِي شَيْئاً فَرَفَقَ بِهِمْ فَارفُقْ بِهِ" رواه مسلم.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త ﷺ ఈ నా ఇంట్లో ఈ విధంగా ప్రార్థిస్తుండగా నేను విన్నాను : దేవా! ఎవరైనా నా అనుచర సమాజ వ్యవహారాలకు బాధ్యత వహించి, వారిని కష్టాల పాల్జేస్తే, నువ్వు కూడా అతన్ని కష్టాలపాల్జెయ్యి. మరెవరయినా నా అనుచర సమాజ వ్యవహారాలకు బాధ్యతవహించి, వారిపట్ల మృదువుగా మెలిగితే నువ్వు కూడా వారిపట్ల మృదువుగా వ్యవహరించు.

(ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని నాయకత్వ ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha) reported: I heard the the Messenger of Allah ﷺ supplicating in my house: “O Allah! Treat harshly those who rule over my Ummah with harshness, and treat gently those who rule over my Ummah with gentleness.”[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|78. పాలకులు ప్రజలపట్ల మృదువుగా వ్యవహరించాలి. వారి శ్రేయాన్ని అభిలషించాలి, వారిని కరుణించాలి, వారిని మోసగించటం, వారిపట్ల కటువుగా వ్యవహరించటం, వారి ప్రయోజనాలను నిర్లక్ష్యం చేయటం, వారిని ఉపేక్షించటం చేయకూడదు|హదీసు 655

656

హదీసు 656

وعن أَبي هريرةَ رضي اللَّه عنه قَالَ: قالَ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "كَانَت بَنُو إسرَائِيلَ تَسُوسُهُمُ الأَنْبياءُ، كُلَّما هَلَكَ نَبِيٌّ خَلَفَهُ نَبيٌّ، وَإنَّهُ لاَ نَبِيَّ بَعدي، وسَيَكُونُ بَعدي خُلَفَاءُ فَيَكثُرُونَ"قالوا: يَا رسول اللَّه فَما تَأْمُرُنَا؟ قَالَ:"أَوفُوا بِبَيعَةِ الأَوَّلِ فالأَوَّلِ، ثُمَّ أَعطُوهُم حَقَّهُم، وَاسأَلوا اللَّه الَّذِي لَكُم، فَإنَّ اللَّه سائِلُهم عمَّا استَرعاهُم "متفقٌ عليه.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు : ఇస్రాయీల్ జాతి రాజ్య వ్యవహారాలను దైవప్రవక్తలు నడిపేవారు. ఒక ప్రవక్త చనిపోగానే ఆయన స్థానంలో మరొక ప్రవక్త ఆయనకు వారసుడు అయ్యేవాడు. కాని నా తదనంతరం మాత్రం మరే దైవప్రవక్తా రాడు. కాకపోతే ఖలీఫాలు ఉంటారు, చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు.

ఈ మాట విని అనుచరులు, "దైవప్రవక్తా! ఈ సందర్భంగా తమరు మాకిచ్చే ఆజ్ఞ ఏమిటి?" అని అడిగారు. దానికి ఆయన, "మొదటగా ప్రమాణం చేసినవారి ప్రమాణాన్ని పూర్తిచేయండి. ఆ తర్వాతగాని వేరొకరితో ప్రమాణం చేయండి. వారి హక్కుల్ని నెరవేర్చండి. మీ హక్కుల గురించి దేవుణ్ణి ప్రార్థించండి. (వారు గనక బాధ్యతా నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే) దేవుడు ఏయే వ్యవహారాలకు వారిని బాధ్యులుగా చేశాడో ఆయా వ్యవహారాలను గురించి స్వయంగా దేవుడే వారిని నిలదీస్తాడు.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని దైవప్రవక్తల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని నాయకత్వ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “The Banu Isra’il were ruled by the Prophets. When one Prophet died, another succeeded him. There will be no Prophet after me. Caliphs will come after me, and they will be many.” The Companions said: “O Messenger of Allah, what do you command us to do?” He said, “Fulfill the pledge of allegiance to which is sworn first (then swear allegiance to the others). Concede to them their due rights and ask Allah that which is due to you. Allah will call them to account in respect of the subjects whom He had entrusted to them.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

స్వతహాగా రాజకీయాలు చెడ్డవేమీ కావు. అవి చెడ్డవయితే దైవప్రవక్తలు వాటిని నిర్వహించేవారే కాదు. దైవప్రవక్తలు రాజ్య వ్యవహారాలు నడిపేవారంటే అర్థం ప్రభుత్వ నిర్వహణ, ప్రజా సంక్షేమం మొదలగు రాజకీయ బాధ్యతలన్నీ దైవప్రవక్తలే చూసుకునేవారు. పూర్వకాలంలో ధార్మిక, ప్రాపంచిక వ్యవహారాలన్నీ మిళితమయి ఉండేవి. రెండింటినీ దైవప్రవక్తలే నిర్వహించేవారు. మన ప్రవక్త ﷺ తదనంతరం ఖ్యాతిగాంచిన నలుగురు ఖలీఫాల కాలంలో, ఆ తర్వాత కూడా చాలాకాలం వరకూ ఈ విధానమే అమల్లో ఉండంది. రాచరికపు వ్యవస్థలో ఒక రాజు తర్వాత అతని వారసులు రాజులుగా చెలామణి అయినట్లు ఇస్రాయీల్ జాతి ఆరంభకాలంలో ప్రభుత్వాన్ని నిర్వహించే ఒక దైవప్రవక్త చనిపోగానే ఆయన స్థానంలో మరొక దైవప్రవక్త ఆయనకు వారసుడిగా పరిపాలనా బాధ్యతలు చేపట్టేవారు.

కాని అంతిమ ప్రవక్త ముహమ్మద్ ﷺతో దైవప్రవక్తల పరంపర నిలిచిపోయింది. ఆయన తర్వాత ఇక మరే దైవప్రవక్తా ప్రభవించడు. కాకపోతే ఖలీఫాలు పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తారు. ఏకకాలంలో అనేకమంది అభ్యర్థులు ఖలీఫా పదవి కోసం ప్రాకులాడుతూ దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పుడు ప్రజలు మొట్టమొదటిసారిగా బైత్ (ప్రమాణం) ద్వారా ఎన్నుకున్న ఖలీఫాకే విధేయత చూపాలి, అతను అధికారంలో ఉండగా పాలనా వ్యవహారాల్లో వేరొకరి అడుగులకు మడుగులు ఒత్తడం అధర్మం అని దైవప్రవక్త ﷺ ప్రబోధించారు.

ప్రభుత్వాధినేతల వల్ల జరిగే ప్రతి చిన్న లోపాన్నీ గోరంతను కొండంత చేసి ప్రచారం చేయటం, రాజ్యంలో అరాచకాన్ని సృష్టించి తిరుగుబాటు ధోరణులను అవలంబించటాన్ని ఇస్లామీయ షరీఅత్ విపరీతంగా గర్హిస్తుంది. అధికారులు పాలనా వ్యవహారాల్లో షరీఅత్ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నంతకాలం ప్రజలు వారికి విధేయత చూపుతూ ఉండాలి. అంతేగాని ప్రతి చిన్న తప్పుకీ ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తే ఒకవైపు ఇస్లామీయ రాజ్యవ్యవస్థ దెబ్బతినటంతోపాటు మరోవైపు ఈ వైఖరి ప్రజల విశ్వాసానికే గొడ్డలిపెట్టు అవుతుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|78. పాలకులు ప్రజలపట్ల మృదువుగా వ్యవహరించాలి. వారి శ్రేయాన్ని అభిలషించాలి, వారిని కరుణించాలి, వారిని మోసగించటం, వారిపట్ల కటువుగా వ్యవహరించటం, వారి ప్రయోజనాలను నిర్లక్ష్యం చేయటం, వారిని ఉపేక్షించటం చేయకూడదు|హదీసు 656

657

హదీసు 657

وعن عائِذ بن عمروٍ رضي اللَّه عنه أَنَّهُ دَخَلَ عَلَى عُبيدِ اللَّهِ بنِ زِيادٍ، فَقَالَ لَهُ: أَيْ بُنَيَّ، إنِّي سَمِعتُ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقول: "إنَّ شَرَّ الرِّعاءِ الحُطَمةُ" فإيَّاكَ أن تَكُونَ مِنْهُم، متفقٌ عليه.

ఒకసారి హజ్రత్ ఆయిజ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) ఉబైదుల్లాహ్ బిన్ జియాద్ దగ్గరికి వెళ్ళి, "చూడు నాయనా! 'ప్రజల పట్ల కఠినంగా వ్యవహరించే పాలకులు అతి నీచులు' అని దైవప్రవక్త ﷺ ప్రవచిస్తుండగా నేను విన్నాను. కనుక నువ్వూ వారిలాగా అవకుండా జాగ్రత్త పడు!" అని ఉపదేశించారు. (ముస్లిం)

English

`Aidh bin `Amr (radiyallahu anhu) reported: I visited `Ubaidullah bin Ziyad and said to him: “Dear son, I heard Messenger of Allah ﷺ saying, `The worst of rulers are those who treat their subjects harshly. Beware, lest you should be one of them.”’[Al-Bukhari].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో 'హుతమా' అనే పదం వాడబడింది. హుతమా అంటే పశువుల్ని విపరీతంగా కొట్టిబాధించే కాపరులు అని అర్థం. ప్రజల హక్కులను కాలరాస్తూ, నిర్దాక్షిణ్యంగా హింసిస్తూ, వారిమీద దారుణంగా అన్యాయానికి ఒడిగట్టే పాలకులను ఇక్కడ పశువుల పట్ల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించే కాపరులతో పోల్చటం జరిగింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|78. పాలకులు ప్రజలపట్ల మృదువుగా వ్యవహరించాలి. వారి శ్రేయాన్ని అభిలషించాలి, వారిని కరుణించాలి, వారిని మోసగించటం, వారిపట్ల కటువుగా వ్యవహరించటం, వారి ప్రయోజనాలను నిర్లక్ష్యం చేయటం, వారిని ఉపేక్షించటం చేయకూడదు|హదీసు 657

658

హదీసు 658

وعن أَبي مريمَ الأَزدِيِّ رضي اللَّه عنه، أَنه قَالَ لمعَاوِيةَ رضي اللَّه عنه: سَمِعتُ رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقُولُ:"مَنْ ولاَّهُ اللَّه شَيئاً مِن أُمورِ المُسلِمينَ فَاحَتجَبَ دُونَ حَاجتهِمِ وخَلَّتِهم وفَقرِهم، احتَجَب اللَّه دُونَ حَاجَتِه وخَلَّتِهِ وفَقرِهِ يومَ القِيامةِ"فَجعَل مُعَاوِيةُ رجُلا عَلَى حَوَائجِ الناسِ. رواه أَبُو داودَ، والترمذي.

ఒకసారి హజ్రత్ అబూ మర్యమ్ అజ్దీ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త ﷺ ఈవిధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని ముఆవియా (రదియల్లాహు అన్హు)కు ఉపదేశిస్తూ చెప్పారు : దేవుడు ఎవరినయినా ముస్లింల కొన్ని వ్యవహారాలకు అధికారిగా నియమించినప్పుడు అతను వారి అవసరాలకు, అక్కరలకు, పేదరికానికి మధ్య అడ్డుగా నిలిస్తే (వారి అవసరాలను తీర్చకపోతే) ప్రళయదినాన దేవుడు కూడా అతని అవసరాలకు అక్కరలకు, పేదరికానికి అడ్డుగా ఉంటాడు.

హజ్రత్ ముఆవియా (రదియల్లాహు అన్హు) (ఈ హదీసు విన్న తరువాత) ప్రజల అవసరాల గురించి తెలుసుకోవటానికి ఒక వ్యక్తిని నియమించారు.

(అబూ దావూద్, తిర్మిజీ)

(సుననె అబూదావూద్‌లోని పన్నుల ప్రకరణం, సుననె తిర్మిజీలోని ఆదేశాల అధ్యాయం)

English

Abu Maryam Al-Azdi (radiyallahu anhu) reported: I said to Mu`awiyah (bin Abu Sufyan) (radiyallahu anhuma): I heard Messenger of Allah ﷺ saying, “If Allah invests to someone the affairs of the Muslims and he (i.e., the ruler) ignores their rights, denies their access to him and neglects their needs, Allah will not answer his prayer or realize his hopes and will act towards him with indifference on the Day of Resurrection.” So Mu`awiyah appointed a person to keep a vigil on the necessities of the people and to fulfill them.[Abu Dawud and At-Tirmidhi].

ముఖ్యాంశాలు

ఆటంకంగా పరిణమించటమంటే బాధిత ప్రజల్ని తమ దగ్గరికి రానీయకుండా అడ్డుకోవటమని అర్థం. ప్రజల కష్టనష్టాలను గురించి తెలుసుకోకుండా, తెలియపరిచేవారినీ దరిచేరనీయకుండా నిర్దాక్షిణ్యంగా అణచివేసే నిరంకుశ ప్రభువులను ప్రళయదినాన దేవుడు తన కారుణ్యఛాయలకు బహుదూరంలో ఉంచుతాడు. వారిని అస్సలు పట్టించుకోడు. ఆ రోజు వారు కరుణామయుని సన్నిధికి వెళ్ళి తమ గోడుని వినిపించుకోవాలని ఎంతగానో అభిలషిస్తారు కాని వారికా భాగ్యం లభించదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|78. పాలకులు ప్రజలపట్ల మృదువుగా వ్యవహరించాలి. వారి శ్రేయాన్ని అభిలషించాలి, వారిని కరుణించాలి, వారిని మోసగించటం, వారిపట్ల కటువుగా వ్యవహరించటం, వారి ప్రయోజనాలను నిర్లక్ష్యం చేయటం, వారిని ఉపేక్షించటం చేయకూడదు|హదీసు 658