హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 77వ అధ్యాయం: షరీఅత్ ఆదేశాల పట్ల అపచారం జరిగితే ఆగ్రహం వ్యక్తం చేయాలి, దైవధర్మానికి తోడ్పడాలి. ఈ అధ్యాయంలో 2 ఖుర్ఆన్ ఆయతులు, 4 హదీసులు (హదీసు 649 – 652) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
77. షరీఅత్ ఆదేశాల పట్ల అపచారం జరిగితే ఆగ్రహం వ్యక్తం చేయాలి, దైవధర్మానికి తోడ్పడాలి
باب الغضب إِذَا انتهكت حرمات الشّرع والانتصار لدين الله تعالى
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ సెలవిచ్చాడు :
{وَمَنْ يُعَظِّمْ حُرُمَاتِ اللَّهِ فَهُوَ خَيْرٌ لَهُ عِنْدَ رَبِّهِ} [الحج: ٣٠]
"ఎవడైనా అల్లాహ్ విధించిన పవిత్ర నియమాలను గౌరవిస్తే, అది అతని ప్రభువు దృష్టిలో స్వయంగా అతడికి శ్రేష్ఠమైనది." (అల్ హజ్ : 30)
{إِنْ تَنْصُرُوا اللَّهَ يَنْصُرْكُمْ وَيُثَبِّتْ أَقْدَامَكُمْ} [محمد: ٧]
"విశ్వాసులారా! మీరు అల్లాహ్‌కు సహాయం చేస్తే, ఆయన మీకు సహాయం చేస్తాడు, మీ పాదాలను స్థిరంగా ఉంచుతాడు" (ముహమ్మద్ – 7)
English
“And whoever honours the sacred things of Allah, then that is better for him with his Rubb…” [Al-Ḥajj 22:30]
“If you help (in the Cause of) Allah, He will help you, and make your foothold firm.” [Muḥammad 47:7]
హదీసు 649
وعن أَبي مسعود عقبة بن عمرو البدريِّ رضي اللَّه عنه قَالَ: جَاءَ رَجُلٌ إِلَى النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَقَالَ: إنِّي لأتَأَخَّر عَن صَلاةِ الصُّبْحِ مِن أجْلِ فلانٍ مِما يُطِيل بِنَا، فمَا رَأيْتُ النَّبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم غَضِبَ في موعِظَةٍ قَطُّ أَشدَّ ممَّا غَضِبَ يَومئذٍ، فَقَالَ: يَا أَيهَا النَّاس: إنَّ مِنكم مُنَفِّرين. فأَيُّكُمْ أَمَّ النَّاسَ فَليُوجِز، فإنَّ مِنْ ورائِهِ الكَبيرَ والصَّغيرَ وَذَا الحَاجَةِ" متفقٌ عَلَيهِ.
హజ్రత్ అబూ మస్‌వూద్ ఉఖ్బా బిన్ అమ్ర్ బద్రీ (రదియల్లాహు అన్హు) కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺ దగ్గరికి వెళ్ళి ఫలానా అతను నమాజ్ సుదీర్ఘంగా చేయిస్తుండటం వల్ల తను ఫజ్ర్ వేళ సామూహిక నమాజ్‌లో పాల్గొనలేకపోతున్నానని ఫిర్యాదు చేశాడు. ఆ సందర్భంగా దైవప్రవక్త ﷺ (ప్రజలకు ఉపన్యాసమిస్తూ) విపరీతమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతకుముందు ఏ ఉపన్యాసంలోనూ ఆయన అంతగా కోపగించుకోవటం నేను చూడలేదు. అప్పుడాయన ప్రజలకు హితబోధచేస్తూ, "జనులారా! మీలో కొందరు ప్రజలకు ధర్మం పట్ల విరక్తిపుట్టించేవారున్నారు. బాగా గుర్తుంచుకోండి! మీలో ప్రజలకు నమాజ్ చేయించేవారు క్లుప్తంగా చేయించాలి. ఎందుకంటే మీ వెనుక నమాజ్ చేసేవారిలో వృద్ధులు, చిన్నపిల్లలు, పని మీద వెళ్ళాల్సినవారు కూడా ఉంటారు.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని అజాన్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని నమాజ్ ప్రకరణం)
English
Abu Mas`ud `Uqbah bin `Amr Al-Badri (radiyallahu anhu) reported: A man came to the Prophet ﷺ and said: “I join the morning Salat late because of so-and-so who leads it and prolongs it.” (Abu Mas`ud said): I have never seen the Prophet ﷺ so angry while giving a speech as he was on that day. He ﷺ said, “Some of you create hatred among the people against faith. Whoever leads Salat (the prayer), should make it brief because the congregation includes old men and youngsters and those who have some urgent work to do.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
పై హదీసు ద్వారా నాలుగు విషయాలు బోధపడుతున్నాయి. ఒకటి : ప్రజలను ఇబ్బందుల్లో పడవేసే సమస్య గురించి ప్రజానాయకునికి ఫిర్యాదు చేయవచ్చు. రెండు : ధర్మాదేశాలు ఉల్లంఘించబడుతున్నప్పుడు కోపాన్ని వ్యక్తం చేయవచ్చు. మూడు : ముక్తదీలను దృష్టిలో పెట్టుకొని ఇమాము నమాజును మరీ సుదీర్ఘంగా కాకుండా సంక్షిప్తంగా చేయించాలి. నమాజు లేక ఖుర్ఆన్ పారాయణం సంక్షిప్తంగా చేయటమంటే దైవప్రవక్త విధానాన్ని, నమాజులో పాటించవలసిన కనీస స్థిమితాన్ని కూడా లెక్కచేయకుండా కాకి పొడిచినట్టు నేలమీద త్వరత్వరగా సజ్దాలు కొట్టి నమాజు ముగించేయటం కాదు. పైగా ఇమాము అయినవాడు ఇటు నమాజు విధులను చక్కగా నిర్వర్తిస్తూ అటు ముక్తదీలకు కూడా భారం అనిపించకుండా మధ్యరకమైన నమాజు చేయించాలి. ఇకపోతే నాల్గవ విషయం : ఇమాము అయినవాడు ప్రజలకు ఆరాధన మీద విసుగు పుట్టించే పద్ధతులను అవలంబించరాదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|77. షరీఅత్ ఆదేశాల పట్ల అపచారం జరిగితే ఆగ్రహం వ్యక్తం చేయాలి, దైవధర్మానికి తోడ్పడాలి|హదీసు 649
హదీసు 650
وعن عائشة رضي اللَّه عنها قَالَتْ: قدِمَ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم مِنْ سفَرٍ، وقَد سَتَرْتُ سَهْوةً لِي بقِرامٍ فَيهِ تَمَاثيلُ، فَلمَّا رآهُ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم هتكَهُ وتَلَوَّنَ وجهُهُ وقال: "يَا عائِشَةُ: أَشَدُّ النَّاسِ عَذَاباً عِند اللَّهِ يَوْمَ القيامةِ الَّذينَ يُضاهُونَ بِخَلقِ اللَّهِ "متفقٌ عَلَيْهِ. "السَّهْوَةُ": كالصُّفَّة تكُونُ بَيْنَ يدي البيت … وَ"القِرام"بكسر القاف: سِتر رقيق، وَ"هتكه": أفسد الصورة التي فيه.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : నేను మా ఇంటి గుమ్మానికి ఒక తెర వ్రేలాడదీసి ఉంచాను. దాని మీద బొమ్మలు వేసి ఉన్నాయి. దైవప్రవక్త ﷺ ప్రయాణం నుంచి తిరిగొచ్చినప్పుడు దాన్ని చూసి (వెంటనే) ఆ బొమ్మల రూపాల్ని మార్చేశారు. ఆగ్రహంతో ఆయన ముఖవర్ణం మారిపోయింది. తర్వాత ఆయన నాతో, "ఆయిషా! దేవుని సృష్టిని పోలిన వాటిని సృష్టించేవారికి ప్రళయదినాన అందరికన్నా తీవ్రమైన శిక్ష విధించబడుతుంది" అని చెప్పారు. (బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలలోని వస్త్రధారణ ప్రకరణాలు)
English
`Aishah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ returned once from a journey, and saw a curtain which I had hung along a platform with some pictures on it. The colour of his face changed. He tore it up and said, “O `Aishah, the most tormented people on the Day of Resurrection are those who contend with Allah in terms of creation.”[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|77. షరీఅత్ ఆదేశాల పట్ల అపచారం జరిగితే ఆగ్రహం వ్యక్తం చేయాలి, దైవధర్మానికి తోడ్పడాలి|హదీసు 650
హదీసు 651
وعنها أَنَّ قرَيشاً أَهَمَّهُم شَأْنُ المرأةِ المَخزُومِية الَّتي سَرقَت فقالوا: مَنْ يُكلِّمُ فِيهَا رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم؟ فقالوا: مَن يجتَرِيءُ عليهِ إِلاَّ أُسامةُ بنُ زيدٍ حِبُّ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم؟ فَكَلًَّمهُ أُسامةُ، فقالِ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "أَتَشفعُ في حدٍّ مِن حُدُودِ اللَّهِ تَعَالَى؟،" ثُمَّ قامَ فَاخْتَطَبَ ثُمَّ قَالَ:"إنَّمَا أهْلَكَ مَنْ قبلكُم أنَّهُم كانُوا إذَا سرقَ فِيهِم الشَّريفُ تَركُوهُ، وَإِذَا سَرَقَ فِيهمِ الضَّعِيفُ أَقامُوا عليهِ الحدَّ، وايْمُ اللَّه، لَوْ أنَّ فاطمَة بِنْتَ محمدٍ سرقَتْ لقَطَعْتُ يَدهَا" متفقٌ عَلَيْهِ.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) గారే చేసిన కథనం : ఓసారి మఖ్జూమ్ కుటుంబానికి చెందిన ఒక స్త్రీ దొంగతనం చేసింది. (ఆమెకు హస్తఖండన శిక్ష విధించబడుతుంద నటంతో) ఖురైషులు ఆందోళన చెందారు.
అప్పుడు వారు పరస్పరం సంప్రతించుకొని 'ఈ విషయమై దైవప్రవక్త ﷺతో ఎవరు మాట్లాడతారు?' అని అన్నారు. వారిలో కొందరు సలహా ఇస్తూ ఒక్క ఉసామా బిన్ జైద్ తప్ప దైవప్రవక్త ﷺ దగ్గర ఎవరూ ఈ విషయం గురించి మాట్లాడలేరని, దైవప్రవక్త ﷺ ఆయన్ని అమితంగా అభిమానిస్తారని చెప్పారు. (చివరికి వారంతా ఉసామాను దైవప్రవక్త దగ్గర సిఫారసు చేయటం కోసం ఒప్పించారు). అలాగే ఉసామా వెళ్ళి దైవప్రవక్త ﷺతో మాట్లాడారు.
అది విని దైవప్రవక్త ﷺ ఉసామాను మందలిస్తూ "ఏమిటీ…నువ్వు దేవుడు నిర్ణయించిన శిక్షలలో ఒక శిక్ష గురించి సిఫారసు చేయటానికి వచ్చావా?" అని అన్నారు.
ఆ తర్వాత లేచి ప్రజల ముందు ఉపన్యసిస్తూ, "మీకు పూర్వం గతించిన జాతులను ఈ విషయమే నాశనం చేసింది. వారు తమలో పలుకుబడి గల వ్యక్తి ఎవరైనా దొంగతనం చేస్తే అతడ్ని శిక్షించకుండా వదలిపెట్టేవారు. అదే బలహీనుడైన వ్యక్తి ఎవరయినా దొంగతనం చేస్తే అతడికి శిక్ష విధించేవారు. దైవసాక్షి! ముహమ్మద్ కూతురు ఫాతిమా అయినా సరే దొంగతనం చేస్తే నేనామె చేతిని నరికి తీరుతాను" అన్నారు.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలలోని శిక్షల ప్రకరణాలు)
English
`Aishah (radiyallahu anhu) reported: The Quraish were much worried about the case of a Makhzumiyah woman who had committed theft and wondered who should intercede for her with Messenger of Allah ﷺ (so that she would not get punished for her crime). Some said Usamah bin Zaid (radiyallahu anhu) was his beloved and so he may dare do so. So Usamah(radiyallahu anhu) spoke to him about that matter and the Prophet ﷺ said to him, “Do you intercede when one of the legal punishments ordained by Allah has been voilated?” Then he got up and addressed the people saying, “The people before you were ruined because when a noble person amongst them committed theft, they would leave him, but if a weak person amongst them committed theft, they would execute the legal punishment on him. By Allah, were Fatimah, the daughter of Muhammad, to commit the theft, I would have cut off her hand.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
షరీఅత్ విధించిన శిక్షల్ని తగ్గించటానికిగాని, లేదా శిక్షాపద్ధతిని మార్చటానికిగాని మానవుల్లో ఎవరికీ హక్కులేదు. ఈ విషయంలో ఒకరు మరొకరి కోసం సిఫారసు చేయటం, ఒకరి సిఫారసును అంగీకరించటం అన్నీ అధర్మ కార్యకలాపాలుగానే పరిగణించబడతాయి. ఇస్లాం ధర్మమే మొట్టమొదటిసారిగా ప్రపంచానికి 'చట్టం దృష్టిలో సమానత'ను అందించింది. ప్రజలైనా, పాలకులైనా, కులీనులైనా, కులహీనులైనా, ధనికులైనా, నిరుపేదలైనా చట్టం దృష్టిలో అందరూ సమానులేననీ, పేరు ప్రతిష్ఠలు, కులగోత్రాల ప్రాతిపదికపై శిక్షాస్మృతిలో ఎలాంటి భేదభావం ఉండకూడదని ప్రబోధించింది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|77. షరీఅత్ ఆదేశాల పట్ల అపచారం జరిగితే ఆగ్రహం వ్యక్తం చేయాలి, దైవధర్మానికి తోడ్పడాలి|హదీసు 651
హదీసు 652
وعن أنس رضي اللَّه عنه أَنَّ النَّبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم رَأَى نُخامَةً في القِبلةِ. فشقَّ ذلكَ عَلَيهِ حتَّى رُؤِي في وجهِهِ، فَقَامَ فَحَكَّهُ بيَدِهِ فَقَالَ: "إن أحَدكم إِذَا قَام فِي صَلاتِه فَإنَّهُ يُنَاجِي ربَّه، وإنَّ ربَّهُ بَينَهُ وبَينَ القِبْلَةِ، فَلاَ يَبْزُقَنَّ أَحدُكُم قِبلَ القِبْلَةِ، ولكِن عَنْ يَسَارِهِ أوْ تحْتَ قدَمِهِ"ثُمَّ أخَذَ طرفَ رِدائِهِ فَبصقَ فِيهِ، ثُمَّ ردَّ بَعْضَهُ عَلَى بعْضٍ فَقَالَ:"أَو يَفْعَلُ هكذا" متفقٌ عَلَيْهِ. والأمرُ بالبُصاقِ عنْ يسَارِهِ أَوْ تحتَ قَدمِهِ هُوَ فِيما إِذَا كانَ في غَيْرِ المَسجِدِ، فَأَمَّا في المسجِدِ فَلا يَبصُقْ إلاَّ في ثوبِهِ.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : ఒకరోజు దైవప్రవక్త ﷺ (మస్జిదులో) ఖిబ్లావైపు (గోడమీద) కఫం పడి ఉండటం చూశారు. ఆ దృశ్యం చూసి ఆయన గగుర్పాటుకు లోనయ్యారు. ఆయన ముఖకవళికల్లోనూ దాని ప్రభావం కనిపించింది. వెంటనే లేచి తనే స్వయంగా దాన్ని గీకి శుభ్రపరిచారు. ఆ తరువాత ఇలా అన్నారు : మీలో ఎవరైనా నమాజ్ చేస్తున్నప్పుడు అతను తన ప్రభువుతో గుసగుసలాడుతుంటాడు. అతనికి ఖిబ్లా వైపునకు మధ్య అతని ప్రభువు ఉంటాడు. అందువల్ల మీలో ఎవరూ ముందు వైపు ఉమ్మివేయకూడదు. ఒకవేళ వేయదలచుకుంటే ఎడమ వైపుగాని లేదా తన కాలిక్రిందగాని ఉమ్మివేసుకోవాలి.
ఆ తర్వాత దైవప్రవక్త ﷺ తన అంగవస్త్రంలోని ఒక మూలను ఎత్తిపట్టుకొని అందులో ఉమ్మివేసి వస్త్రాన్ని రెండు వైపులతో రుద్దివేస్తూ, "లేదా ఇలా చెయ్యాలి" అని అన్నారు. (బుఖారీ – ముస్లిం)
ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు : ఎడమ వైపుగాని, కాలిక్రిందగాని ఉమ్మివేయాలనే ఆజ్ఞ మస్జిద్ వెలుపల నమాజ్ చేసే సందర్భానికి సంబంధించినది. అదే మస్జిద్లో ఉన్నప్పుడయితే ఒక్క అంగవస్త్రంలో తప్ప మరెక్కడా ఉమ్మి వేయకూడదు.
(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలలోని నమాజ్ ప్రకరణాలు)
English
Anas (radiyallahu anhu) reported: The Prophet ﷺ noticed spittle in the mosque in the direction of the Qiblah. The signs of disgust were perceived on his face. Then, he stood up and scraped it away with his own hand and said, “When you stand in Salat, you hold communion with your Rubb and He is between you and the Qiblah. Let no one therefore cast out his spittle in that direction, but only to his left or under his foot.” Then he caught hold a corner of his sheet, spat into it and folded it up and said, “Or he should do like this.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
మస్జిద్‌లను పరిశుభ్రంగా ఉంచాలని, మలిన వస్తువులు కనిపిస్తే వాటిని వెంటనే మస్జిద్నుండి తొలగించాలని ఈ హదీసు ప్రబోధిస్తోంది. మస్జిద్లో అసలు ఉమ్మివేయరాదు. మస్జిద్ వెలుపల నమాజ్ చేస్తున్నప్పుడు ఖిబ్లావైపు మాత్రం ఉమ్మివేయకూడదు. ఒకవేళ అనివార్యమనుకుంటే ఎడమవైపుగాని లేదా కాలిక్రిందగాని ఉమ్మివేసుకోవాలి. మస్జిద్‌లోపల నమాజ్ చేస్తున్నప్పుడు ఉమ్మివస్తే రుమాలులోగాని, చేతిగుడ్డలోగాని ఉమ్మివేసి ఆ తర్వాత ఆ గుడ్డను రుద్దివేయాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|77. షరీఅత్ ఆదేశాల పట్ల అపచారం జరిగితే ఆగ్రహం వ్యక్తం చేయాలి, దైవధర్మానికి తోడ్పడాలి|హదీసు 652
You must be logged in to post a comment.