హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 76. కష్టాలు ఎదురైనప్పుడు సహనం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 76వ అధ్యాయం: కష్టాలు ఎదురైనప్పుడు సహనం వహించటం. ఈ అధ్యాయంలో 2 ఖుర్ఆన్ ఆయతులు, 1 హదీసులు (హదీసు 648) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

76. కష్టాలు ఎదురైనప్పుడు సహనం వహించటం

↑ విషయ సూచిక

باب احتمال الأذى

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు:

{وَالْعَافِينَ عَنِ النَّاسِ وَاللَّهُ يُحِبُّ الْمُحْسِنِينَ} [آل عمران: ١٣٤]

వారు (విశ్వాసులు) కోపాన్ని దిగమ్రింగేవారు, ఇతరుల తప్పులను క్షమించేవారు – ఇలాంటి సజ్జనులంటే అల్లాహ్‌కు ఎంతో యిష్టం." (ఆలి ఇమ్రాన్ : 134)

{وَلَمَنْ صَبَرَ وَغَفَرَ إِنَّ ذَلِكَ لَمِنْ عَزْمِ الأُمُورِ} [الشورى:٤٣]

ఎవరయినా సహనంతో వ్యవహరిస్తే, క్షమించివేస్తే అది పెద్ద సాహసంతో, దృఢ సంకల్పంతో కూడుకున్న పని." (అష్ షూరా : 43)

English

“(Those) who repress anger, and who pardon men; verily, Allah loves Al-MuhsinÃn (the good-doers).” [Āl ‘Imrān 3:134]

“And verily, whosoever shows patience and forgives, that would truly be from the things recommended by Allah.” [Ash-Shūrā 42:43]

648

హదీసు 648

وعن أبي هريرةَ رضي اللَّه عنه أَن رَجُلاً قَالَ: يَا رَسُول اللَّه إِنَّ لِي قَرَابَةً أَصِلُهم وَيَقطَعوني، وَأُحسِنُ إِليهِم ويُسِيئُونَ إليَّ، وأَحلُمُ عَنهم ويجهلُونَ عَلَيَّ، فَقَالَ: "لَئِن كُنتَ كَمَا قُلتَ فَكَأَنَّمَا تُسِفَّهم الملَّ وَلاَ يزَالُ معكَ مِنَ اللَّه تَعَالَى ظَهيرٌ عَلَيهم مَا دُمْتَ عَلى ذَلِكَ" رواه مسلم. وقد سَبَقَ شَرْحُه في"باب صلة الأرحام".

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺ దగ్గరికి వచ్చి, "దైవప్రవక్తా! నా బంధువులు కొందరున్నారు. నేను వారితో సత్సంబంధాలు పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటే వారేమో నాతో తెగత్రెంపులు చేసుకోవాలని చూస్తున్నారు. నేను వారిపట్ల మంచిగా మెలగుతుంటే వారేమో నాకు కీడు తలపెడుతున్నారు. నేను వారిపట్ల ఉదార వైఖరిని అనుసరిస్తుంటే వారుమాత్రం నా పట్ల మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు" అని మొరపెట్టుకున్నాడు. అతని మాటలు విని దైవప్రవక్త ﷺ "నువ్వు చెప్పింది నిజమే అయితే (వాస్తవానికి) నువ్వు వారి నోళ్ళల్లో వేడి బూడిదను పోస్తున్నావనుకో. నువ్వు వారిపట్ల ఇలాగే సత్ప్రవర్తనతో మెలగుతున్నంత కాలం దేవుని తరపు నుండి వారికి వ్యతిరేకంగా ఒక సహాయకుడు నీ వెంట ఉంటాడు" అని చెప్పి పంపించారు. (ముస్లిం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: A man said to Messenger of Allah ﷺ: “I have relatives with whom I try to maintain good relationship but they sever relations with me; whom I treat kindly but they treat me badly, with whom I am gentle but they are rough to me.” He ﷺ replied, “If you are as you have said, then it is as though you are feeding them hot ashes and you will not be without a supporter against them from Allah, as long as you do so.”[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|76. కష్టాలు ఎదురైనప్పుడు సహనం వహించటం|హదీసు 648