హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 75వ అధ్యాయం: మన్నింపుల వైఖరి, మూర్ఖుల పట్ల ఉపేక్షాభావం. ఈ అధ్యాయంలో 5 ఖుర్ఆన్ ఆయతులు, 5 హదీసులు (హదీసు 643 – 647) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
75. మన్నింపుల వైఖరి, మూర్ఖుల పట్ల ఉపేక్షాభావం
باب العفو والإِعراض عن الجاهلين
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ సెలవిచ్చాడు :
{خُذِ الْعَفْوَ وَأْمُرْ بِالْعُرْفِ وَأَعْرِضْ عَنِ الْجَاهِلِينَ} [الأعراف:١٩٩]
"ప్రవక్తా! మృదుత్వం, మన్నింపుల వైఖరిని అవలంబించు, మంచిని ప్రబోధించు. మూర్ఖులతో వాదానికి దిగకు." (అల్ ఆరాఫ్ : 199)
{فَاصْفَحِ الصَّفْحَ الْجَمِيلَ} [الحجر:٨٥]
"ప్రవక్తా! నీవు (వారి కుచేష్టలను) పెద్దమనిషి తరహాలో మన్నించు." (అల్ హిజ్ర్ : 85)
{وَلْيَعْفُوا وَلْيَصْفَحُوا أَلا تُحِبُّونَ أَنْ يَغْفِرَ اللَّهُ لَكُم} [النور: ٢٢]
"వారిని క్షమించాలి, వారి (తప్పుల్ని) ఉపేక్షించాలి. మిమ్మల్ని అల్లాహ్ క్షమించాలని మీరు కోరుకోరా?" (అన్ నూర్ : 22)
{وَالْعَافِينَ عَنِ النَّاسِ وَاللَّهُ يُحِبُّ الْمُحْسِنِينَ} [آل عمران: ١٣٤]
"వారు (అంటే విశ్వాసులు) ఇతరుల తప్పుల్ని క్షమించేవారు – ఇలాంటి సజ్జనులంటే అల్లాహ్కు ఎంతో యిష్టం." (ఆలి ఇమ్రాన్ : 134)
{وَلَمَنْ صَبَرَ وَغَفَرَ إِنَّ ذَلِكَ لَمِنْ عَزْمِ الأُمُورِ} [الشورى:٤٣]
"ఎవరయినా సహనంతో వ్యవహరిస్తే, క్షమించివేస్తే అది పెద్ద సాహసంతో, దృఢ సంకల్పంతో కూడుకున్న పని." (అష్ షూరా : 43)
English
“Show forgiveness, enjoin what is good, and turn away from the foolish (i.e., don’t punish them).” [Al-A‘rāf 7:199]
“So overlook (O Muhammad ﷺ), their faults with gracious forgiveness.” [Al-Ḥijr 15:85]
“Let them pardon and forgive. Do you not love that Allah should forgive you?” [An-Nūr 24:22]
“And who pardon men; verily, Allah loves Al-Muhsinun (the good-doers)” [Āl ‘Imrān 3:134]
“And verily, whosoever shows patience and forgives, that would truly be from the things recommended by Allah.” [Ash-Shūrā 42:43]
హదీసు 643
وعن عائشة رضي اللَّه عنها أَنها قالت للنبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: هَلْ أَتى عَلَيْكَ يَوْمٌ كَانَ أَشدَّ مِنْ يَوْمِ أُحُدٍ؟ قَالَ: "لَقَدْ لَقِيتُ مِنْ قَومِكِ، وكَان أَشدُّ مَا لَقِيتُ مِنْهُمْ يوْم العقَبَةِ، إِذْ عرَضتُْ نَفسِي عَلَى ابْنِ عَبْدِ يَالِيلَ ابنِ عبْدِ كُلال، فلَمْ يُجبنِى إِلى مَا أَردْتُ، فَانْطَلَقْتُ وَأَنَا مَهْمُومٌ عَلَى وَجْهِي، فلَمْ أَسْتَفِقْ إِلاَّ وَأَنا بقرنِ الثَّعالِبِ، فَرفَعْتُ رأْسِي، فَإِذا أَنَا بِسحابَةٍ قَد أَظلَّتني، فنَظَرتُ فَإِذا فِيها جِبريلُ عليه السلام، فنَاداني فَقَالَ: إِنَّ اللَّه تَعَالَى قَد سَمِع قَولَ قومِك لَكَ، وَما رَدُّوا عَلَيكَ، وَقد بعثَ إِلَيك ملَكَ الجبالِ لِتأْمُرهُ بمَا شِئْتَ فِيهم فَنَادَانِي ملَكُ الجِبَالِ، فَسلَّمَ عَليَّ ثُمَّ قَالَ: يَا مُحَمَّدُ إِنَّ اللَّه قَد سمعَ قَولَ قَومِكَ لَكَ، وأَنَا مَلَكُ الجِبالِ، وقَدْ بَعَثَني رَبِّي إِلَيْكَ لِتأْمُرَني بِأَمْرِكَ، فَمَا شئتَ: إِنْ شئْتَ: أَطْبَقْتُ عَلَيهمُ الأَخْشَبَيْن"فقال النبي صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"بلْ أَرْجُو أَنْ يُخْرِجَ اللَّه مِنْ أَصْلابِهِم منْ يعْبُدُ اللَّه وَحْدَهُ لاَ يُشْرِكُ بِهِ شَيْئاً "متفقٌ عَلَيْهِ. "الأَخْشبان": الجَبَلان المُحِيطَان بمكَّة.. والأَخْشَبُ: هُوَ الجبل الغليظ.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం ఆమె ఒకసారి దైవప్రవక్త ﷺతో మాట్లాడుతూ, "మీకు ఉహుద్ యుద్ధం కంటే కఠినమైన రోజు ఎప్పుడయినా ఎదురయిందా?" అని అడిగారు. దానికి సమాధానమిస్తూ దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు : "నేను నీ జాతి ప్రజల చేతిలో అనేక బాధలు భరించాను. ఆ బాధల్లో ఉఖబా దినం నాకు అత్యంత వ్యధాభరితంగా గడిచింది. ఆ రోజు నేను (తాయెఫ్ నాయకుడయిన) అలీ బిన్ అబ్దె యాలీల్ బిన్ అబ్దె కులాల్ను కలిసి మాట్లాడాను. అతను నేను ఆశించినట్లుగా నా సందేశాన్ని అంగీకరించలేదు. నేను అక్కడినుండి తీవ్ర మనస్తాపంతో వెనుదిరిగాను. ఖర్నె సఆలిబ్ ప్రాంతం చేరుకున్న తరువాతగాని నేను ఆ బాధ నుండి కోలుకోలేకపోయాను. అప్పుడు నేను తలపైకెత్తి చూస్తే ఒక మబ్బు తునక నా మీద నీడ పట్టి ఉన్నట్లు కనిపించింది. కాస్త జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఆ మబ్బు తునక మధ్య జిబ్రయీల్ దూత కనిపించారు. ఆయన నన్ను పిలిచి, "మీ జాతి ప్రజలు మిమ్మల్ని అన్నమాటలు, మీకిచ్చిన సమాధానాలు దేవుడు విన్నాడు. ఆయన మీ దగ్గరికి పర్వత (సంచాలక) దూతను పంపాడు. ఈ జాతి ప్రజల విషయంలో మీరు ఏం ఆజ్ఞాపించదలచుకున్నారో ఈ దైవదూతను ఆజ్ఞాపించండి" అన్నారు. ఆ తరువాత పర్వత నిర్వహణ దూత నన్ను పలకరించాడు. "ముహమ్మద్! మీ జాతి ప్రజలు మిమ్మల్ని అన్నమాటలు దేవుడు విన్నాడు. నేను పర్వత (వ్యవహారాల) దూతను. మీరు ఆజ్ఞాపించినట్లు చేయమని దేవుడు నన్ను మీ దగ్గరికి పంపించాడు. మీరు ఏ ఆజ్ఞ ఇవ్వదలచుకున్నారో ఇవ్వండి. మీరు ఆజ్ఞాపించాలేగాని నేను ఈ జాతి ప్రజలను (రెండు వైపులా ఉన్న) కొండల్ని కలిపేసి నుజ్జునుజ్జు చేసేస్తాను" అన్నాడు.
అందుకు నేను, "వద్దు, (తొందరపడి అంత పని చేయకు) వీళ్ళు కాకపోయినా వీళ్ళ సంతానంలోనయినా ఒక్క అల్లాహ్ను మాత్రమే ఆరాధిస్తూ, ఆయనకు మరెవ్వరినీ సాటి కల్పించకుండా ఉండేవారు పుడతారని నాకు నమ్మకం ఉంది" అని అన్నాను.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని సృష్టి ఆరంభ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని యుద్ధాల ప్రకరణం)
English
`Aishah (radiyallahu anha) reported: I asked the Prophet ﷺ “Have you ever experienced a day harder than the day of the battle of Uhud?” He replied, “Indeed, I experienced them (dangers) at the hands of your people (i.e., the disbelievers from amongst the Quraish tribe). The hardest treatment I met from them was on the Day of `Aqabah when I went to Ibn `Abd Yalil bin `Abd Kulal (who was one of the chiefs of Ta’if) with the purpose of inviting him to Islam, but he made no response (to my call). So I departed with deep distress. I did not recover until I arrived at Qarn ath-Tha`alib. There, I raised my head and saw a cloud which had cast its shadow on me. I saw in it Jibril (Gabriel) ﷺ who called me and said: `Indeed, Allah, the Exalted, heard what your people said to you and the response they made to you. And He has sent you the angel in charge of the mountains to order him to do to them what you wish.’ Then the angel of the mountains called me, greeted me and said: `O Muhammad, Allah listened to what your people had said to you. I am the angel of the mountains, and my Rubb has sent me to you so that you may give me your orders. (I will carry out your orders). If you wish I will bring together the two mountains that stand opposite to each other at the extremities of Makkah to crush them in between.”’ But Messenger of Allah ﷺ said, “I rather hope that Allah will raise from among their descendants people as will worship Allah the One, and will not ascribe partners to Him (in worship).”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
మదీనా నగరానికి సమీపంలో 'ఉహుద్' అనే కొండ ఉంది. అక్కడే ఉహుద్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో దైవప్రవక్త ﷺగారి ముఖారవిందానికి స్వల్పంగా గాయాలయ్యాయి. బాణం దెబ్బతగిలి రెండు పళ్ళు కూడా ఊడిపోయాయి. ముష్కరమూకలు ఆయనమీద దాడి చేయటంతో ఆయన ఓ గుంతలో పడిపోయారు. అంతేకాదు ఆయనగారి సొంత బాబాయి హజ్రత్ హమ్జా (రదియల్లాహు అన్హు) కూడా ఈ యుద్ధంలోనే అమరగతినొందారు. శత్రువులు ఆయన శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి చాలా దారుణంగా ప్రవర్తించారు. ఒకవిధంగా ఉహుద్ సంగ్రామ దినం దైవప్రవక్త ﷺ పాలిట అత్యంత కఠినమైన దినం. కాని అవన్నీ తన వ్యక్తిగతమైన బాధలు కాబట్టి ఆయన వాటిని ఉపేక్షించారు. ఇందుకు భిన్నంగా తాయెఫ్ వాసులు తన సందేశాన్ని నిరాకరించినప్పుడు మాత్రం ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తన అనుచర సమాజం తన కళ్ళముందే నరకానికి గొనిపోయే కుచేష్టలకు పాల్పడుతుంటే ఆయన హృదయం పరి పరి విధాలా చింతించేది.
ఈ హదీసు ధార్మిక వ్యవహారాల్లో కష్టాలు, బాధలు ఎదురయినప్పుడు వాటిని ఓర్చుకొని సహన స్థయిర్యాలను ప్రదర్శించాలని ప్రబోధిస్తోంది. ధర్మప్రచార కార్యక్రమమంటే నల్లేరుపై నడకలా సాగేదికాదు. ధర్మ ప్రచార కార్యక్రమానికి పూనుకున్న తరువాత ఎన్నో కష్టాల్ని ఎదుర్కొనవలసి వస్తుంది. వ్యయప్రయాసలకు ఓర్చుకోవాల్సి వస్తుంది. ప్రజల నుండి తిట్లు, శాపనార్థాలు వినాల్సివస్తుంది. వాటికి అదరక, బెదరక మొక్కవోని గుండెబలంతో సహనస్థయిర్యాలను ప్రదర్శిస్తూ పనిచేసినప్పుడే ధర్మప్రచార కార్యం నెరవేరుతుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|75. మన్నింపుల వైఖరి, మూర్ఖుల పట్ల ఉపేక్షాభావం|హదీసు 643
హదీసు 644
وعنها قالت: مَا ضرَبَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم شَيْئاً قَطُّ بِيَدِهِ، وَلاَ امْرأَةً وَلاَ خادِماً، إِلاَّ أَنْ يُجَاهِدَ فِي سَبِيل اللَّهِ، وَمَا نِيل منْهُ شَيْءٌ قَطُّ فَيَنتَقِم مِنْ صاحِبِهِ إِلاَّ أَنْ يُنتَهَكَ شَيء مِن مَحَارِمِ اللَّهِ تَعَالَى: فَيَنْتَقِمَ للَّهِ تَعَالَى. رواه مسلم.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) గారే చేసిన కథనం : దైవప్రవక్త ﷺ తన చేత్తో ఎవర్నీ దండించలేదు. ఏ స్త్రీనిగాని, బానిసనుగాని కొట్టలేదు. అయితే ఆయన దైవమార్గంలో యుద్ధం మాత్రం చేసేవారు. ఆయనకు ఎవరివల్లనయినా బాధకలిగితే దానికాయన ప్రతీకారం చేసేవారు కారు. కాని ఎవరైనా దేవుడు నిషేధించిన విషయంలో జోక్యం చేసుకుంటే మాత్రం ఆయన దైవం కోసం ప్రతీకారం చేసేవారు. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని ఘనతా విశిష్టతల ప్రకరణం)
English
`Aishah (radiyallahu anha) reported: Messenger of Allah ﷺ never hit anything with his hand neither a servant nor a woman but of course, he did fight in the Cause of Allah. He never took revenge upon anyone for the wrong done to him, but of course, he exacted retribution for the sake of Allah in case the Injunctions of Allah about unlawful acts were violated.[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|75. మన్నింపుల వైఖరి, మూర్ఖుల పట్ల ఉపేక్షాభావం|హదీసు 644
హదీసు 645
وعن أَنس رضي اللَّه عنه قَالَ: كُنتُ أَمْشِي مَعَ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وَعَلَيْهِ بُردٌ نَجْرَانيٌّ غلِيظُ الحَاشِيةِ، فأَدركَهُ أَعْرَابيٌّ، فَجبذهُ بِرِدَائِهِ جَبْذَة شَديدَةً، فَنظرتُ إِلَى صَفْحَةِ عاتِقِ النَّبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، وقَد أَثَّرَت بِها حَاشِيةُ الرِّداءِ مِنْ شِدَّةِ جَبذَتِهِ، ثُمَّ قَالَ: يَا مُحَمَّدُ مُرْ لِي مِن مالِ اللَّهِ الَّذِي عِندَكَ. فالتَفَتَ إِلَيْه، فضحِكَ، ثُمَّ أَمر لَهُ بعَطَاءٍ. متفقٌ عليه.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : నేనొకసారి దైవప్రవక్త ﷺ వెంట నడుస్తున్నాను. ఆ సమయంలో ఆయన దళసరి అంచులుగల నజ్రాన్ దుప్పటి కప్పుకొని ఉన్నారు. దారిలో ఓ పల్లెటూరి వ్యక్తి కలిసి ఆయన దుప్పటి పట్టుకొని గట్టిగా లాగాడు. నేను దైవప్రవక్త ﷺ భుజం వంక చూస్తే, అలా గట్టిగా లాగటం వల్ల దుప్పటి అంచులు గీసుకుపోయి ఆయన భుజం కందిపోయి ఉంది. ఆ పల్లెటూరి వ్యక్తి అంతటితో ఊరుకోక, "దేవుడు మీకిచ్చిన సొమ్ములో నుంచి నాక్కొంచెం ఇప్పించరూ!" అని అడిగాడు. దానికి దైవప్రవక్త ﷺ అతని వైపు తిరిగి చూసి నవ్వుతూ ఇతనికి కొంతధనం ఇవ్వండి" అని (తన సహచరుల్ని) ఆజ్ఞాపించారు.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని వస్త్రధారణ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణం)
English
Anas (radiyallahu anhu) reported: I was walking with Messenger of Allah ﷺ who was wearing a Najrani cloak with a very thick border when a bedouin happened to meet him. He took hold of the side of his cloak and drew it violently. I noticed that the violence of jerk had bruised the neck of Messenger of Allah ﷺ. The bedouin said: “O Muhammad! Give me out of Allah’s wealth that you possess.” Messenger of Allah ﷺ turned to him and smiled and directed that he should be given something.[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|75. మన్నింపుల వైఖరి, మూర్ఖుల పట్ల ఉపేక్షాభావం|హదీసు 645
హదీసు 646
وعن ابن مسعود رضي اللَّه عنه قَالَ: كأَنِّي أَنظُرُ إِلَى رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يحْكِي نَبِيّاً مِن الأَنبياءِ، صلوَاتُ اللَّهِ وَسلامُه عَلَيهم، ضَرَبَهُ قَومُهُ فَأَدموهُ، وَهُوَ يَمسَحُ الدَّمَ عَنْ وَجهِهِ، ويقول:"اللَّهُمَّ اغفِرِ لِقَومي فَإِنَّهُم لا يَعْلَمُونَ"متفقٌ عليه.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్వూద్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ఒకానొక ప్రవక్తకు సంబంధించిన సంఘటనను వివరిస్తున్నప్పుడు నేను చూశాను. ఇప్పటికీ నాకు దైవప్రవక్త ﷺ నా కళ్లెదుట ఆ సంఘటన వివరిస్తున్న అనుభూతి కలుగుతోంది. ఆ ప్రవక్తను ఆయన జాతి ప్రజలు రక్తం కారేలా కొట్టారు. అయినా కూడా ఆ ప్రవక్త తన మొహం మీది రక్తాన్ని తుడుచుకుంటూ, "దేవా! నా జాతి ప్రజలను క్షమించు, వీళ్ళు తెలీక ఇలా చేస్తున్నారు" అని ప్రార్థించారు.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని ప్రవక్తల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని జిహాద్ ప్రకరణం)
English
Ibn Mas`ud (radiyallahu anhu) reported: I can see the Messenger of Allah ﷺ look like one of the Prophets of Allah whose people beat and made him bleed while he was wiping the blood from his face and supplicating: “O Allah, forgive my people because they know not.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
హదీసులో పేర్కొనబడిన ప్రవక్త ఎవరో కాదు, స్వయానా ముహమ్మద్ ప్రవక్తేనని పండితులు రాశారు. ఇది కూడా ఆయనలోని గొప్ప నైతికతకు అపూర్వ నిదర్శనం. తనకు తన జాతివారి నుంచి ఎదురైన అనుభవాన్ని ఆయన అన్యాపదేశంగా చెప్పారేగాని వారిపేరు ప్రస్తావించలేదు. తాయెఫ్ నగరంలో ధర్మప్రచార కార్యం నిర్వహించినప్పుడు ఆయనకు ఈ అనుభవం ఎదురైందని మనందరికీ తెలుసు!
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|75. మన్నింపుల వైఖరి, మూర్ఖుల పట్ల ఉపేక్షాభావం|హదీసు 646
హదీసు 647
وعن أبي هريرة رضي اللَّه عنه أَن رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "لَيس الشَّديدُ بِالصُّرعَةِ، إِنَّما الشديدُ الَّذِي يَملِكُ نفسهُ عِند الغضبِ" متفقٌ عليه.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : కుస్తీపట్టి ఇతరులను చిత్తుచేసేవాడు పరాక్రమశాలి (పహిల్వాను) కాడు. కోపం వచ్చినప్పుడు తన్ను తాను అదుపులో పెట్టుకోగలిగినవాడే నిజమైన పరాక్రమశాలి.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని సంస్కార ప్రకరణం, సహీహ్ ముస్లింలోని సత్కార్యాల ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “The strong man is not the one who wrestles, but the strong man is in fact the one who controls himself in a fit of rage.”[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|75. మన్నింపుల వైఖరి, మూర్ఖుల పట్ల ఉపేక్షాభావం|హదీసు 647
You must be logged in to post a comment.