హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 74. సౌమ్యం, విజ్ఞత, మృదుత్వం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 74వ అధ్యాయం: సౌమ్యం, విజ్ఞత, మృదుత్వం. ఈ అధ్యాయంలో 4 ఖుర్ఆన్ ఆయతులు, 11 హదీసులు (హదీసు 632 – 642) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

74. సౌమ్యం, విజ్ఞత, మృదుత్వం

↑ విషయ సూచిక

باب الحلم والأناة والرفق

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు :

{وَالْكَاظِمِينَ الْغَيْظَ وَالْعَافِينَ عَنِ النَّاسِ وَاللَّهُ يُحِبُّ الْمُحْسِنِينَ} [آل عمران: ١٣٤]

"వారు (అంటే విశ్వాసులు) కోపాన్ని దిగమ్రింగేవారు. ఇతరుల తప్పులను క్షమించేవారు – ఇలాంటి సజ్జనులంటే అల్లాహ్‌కు ఎంతో యిష్టం." (ఆలి ఇమ్రాన్ : 134)

{خُذِ الْعَفْوَ وَأْمُرْ بِالْعُرْفِ وَأَعْرِضْ عَنِ الْجَاهِلِينَ} [الأعراف:١٩٩]

"ప్రవక్తా! మృదుత్వం, మన్నింపుల వైఖరిని అవలంబించు. మంచిని ప్రబోధించు. మూర్ఖులతో వాదానికి దిగకు." (అల్ ఆరాఫ్ : 199)

{وَلا تَسْتَوِي الْحَسَنَةُ وَلا السَّيِّئَةُ ادْفَعْ بِالَّتِي هِيَ أَحْسَنُ فَإِذَا الَّذِي بَيْنَكَ وَبَيْنَهُ عَدَاوَةٌ كَأَنَّهُ وَلِيٌّ حَمِيمٌ وَمَا يُلَقَّاهَا إِلاَّ الَّذِينَ صَبَرُوا وَمَا يُلَقَّاهَا إِلاَّ ذُو حَظٍّ عَظِيمٍ} [فصلت:٣٤-٣٥]

"ప్రవక్తా! మంచీ, చెడూ ఒకటి కావు. నీవు చెడును శ్రేష్ఠమైన మంచిద్వారా తొలగించు. అప్పుడు నీ పట్ల శత్రుభావం కలవాడు నీకు ప్రాణస్నేహితుడై పోవటాన్ని నీవు గమనిస్తావు. ఈ సుగుణయోగం సహనశీలురకు తప్ప మరెవరికీ లభ్యం కాదు. ఈ స్థానం మహా అదృష్టవంతులకు తప్ప మరెవరికీ దక్కదు." (ఫుస్సిలత్ : 34, 35)

{وَلَمَنْ صَبَرَ وَغَفَرَ إِنَّ ذَلِكَ لَمِنْ عَزْمِ الأُمُورِ} [الشورى:٤٣]

"ఎవరయినా సహనంతో వ్యవహరిస్తే, క్షమించివేస్తే, అది పెద్ద సాహసంతో, దృఢ సంకల్పంతో కూడుకున్న పని." (అష్ షూరా : 43)

English

“…who repress anger, and who pardon men; verily, Allah loves Al-Muhsinun (the good-doers).” [Āl ‘Imrān 3:134]

“Show forgiveness, enjoin what is good, and turn away from the foolish (i.e., don’t punish them).” [Al-A‘rāf 7:199]

“The good deed and the evil deed cannot be equal. Repel (the evil) with one which is better (i.e., Allah orders the faithful believers to be patient at the time of anger, and to excuse those who treat them badly) then verily he, between whom and you there was enmity, (will become) as though he was a close friend. But none is granted it (the above quality) except those who are patient – and none is granted it except the owner of the great portion (of happiness in the Hereafter, i.e., Jannah and of a high moral character) in this world.” [Fuṣṣilat 41:34–35]

“And verily, whosoever shows patience and forgives that would truly be from the things recommended by Allah.” [Ash-Shūrā 42:43]

632

హదీసు 632

وعن ابنِ عَبَّاسٍ رَضيَ اللَّهُ عَنْهُما قَالَ: قَالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم لأَشَجِّ عبْدِ الْقَيْس:"إِنَّ فيكَ خَصْلَتَيْنِ يُحِبُّهُمَا اللَّهُ: الحِلْمُ وَالأَنَاة" رَواهُ مُسلم.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ అషజ్జ్ అబ్దుల్ ఖైస్‌ను ఉద్దేశ్యించి, "నీలో దేవుడు యిష్టపడే రెండు సుగుణాలున్నాయి. అవి సౌమ్యం, నిదానం" అని అన్నారు.

(ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణం)

English

Ibn `Abbas (radiyallahu anhuma) reported: Messenger of Allah ﷺ said to Ashaj Abdul-Qais (radiyallahu anhu), “You possess two qualities that Allah loves. These are clemency and tolerance.”[Muslim].

ముఖ్యాంశాలు

'అషజ్జ్ అబ్దుల్ ఖైస్' ఈయన అసలు పేరు ముంజిర్ బిన్ ఆయిజ్ లేదా ముంఖజ్ బిన్ ఆయిజ్. దైవప్రవక్త ﷺ అనుచరులు.

ఈ హదీసు ఏ పని చేసినా సౌమ్యంగా, నిదానంగా చేయాలని, ఈ రెండు సుగుణాలు దేవునికి ప్రియమైన గుణాలని ప్రబోధిస్తోంది. తొందరపాటులో చేసే పనులు అసంపూర్తిగా, అస్తవ్యస్తంగా ఉంటాయి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|74. సౌమ్యం, విజ్ఞత, మృదుత్వం|హదీసు 632

633

హదీసు 633

وعن عائِشةَ رضيَ اللَّه عنها قَالَتْ: قَالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِنَّ اللَّه رفيقٌ يُحِبُّ الرِّفْقَ فِي الأَمْرِ كُلِّه" متفقٌ عَلَيْهِ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు : దేవుడు మృదు స్వభావి. అన్ని విషయాల్లోనూ ఆయన మృదుత్వాన్ని ఇష్టపడతాడు.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని సంస్కార ప్రకరణం, సహీహ్ ముస్లింలోని సత్కార్యాల ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha) reported: The Messenger of Allah ﷺ said, “Allah is Forbearer and loves forbearance in all matters.”[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|74. సౌమ్యం, విజ్ఞత, మృదుత్వం|హదీసు 633

634

హదీసు 634

وعنها أَن النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إِنَّ اللَّهَ رَفِيقٌ يُحِبُّ الرِّفقَ، وَيُعْطِي على الرِّفق مالا يُعطي عَلى العُنفِ وَما لاَ يُعْطِي عَلى مَا سِوَاهُ" رواه مسلم.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : దేవుడు మృదు స్వభావి. ఆయన మృదుత్వాన్ని ఇష్టపడతాడు. కాఠిన్యం వల్లగాని, మరే ఇతర విషయం వల్లగాని ప్రసాదించనిది దేవుడు మృదుత్వం మూలంగా ప్రసాదిస్తాడు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని సత్కార్యాల ప్రకరణం)

English

`Aishah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “Allah is Forbearer and He loves forbearance, and rewards for forbearance while He does not reward severity, and does not give for any thing besides it (forbearance).”[Muslim]

ముఖ్యాంశాలు

ప్రజలు తమ పరస్పర వ్యవహారాల్లో మృదుత్వం, మార్దవాలతో మెలగాలి. పరస్పరం మార్దవంతో వ్యవహరించుకునే దాసుల్ని దేవుడు అమితంగా యిష్టపడతాడు. దానిపై వారికి పుణ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. అయితే ధార్మిక విషయాల్లో, దేవుని హద్దుల విషయాల్లో మాత్రం ఎలాంటి మృదుత్వానికి, రాజీతత్వానికి తావివ్వకూడదు సుమా!

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|74. సౌమ్యం, విజ్ఞత, మృదుత్వం|హదీసు 634

635

హదీసు 635

وعنها أَن النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إِنَّ الرِّفقُ لاَ يَكُونُ في شيءٍ إِلاَّ زَانَهُ، وَلا يُنْزَعُ مِنْ شَيءٍ إِلاَّ شَانَهُ" رواه مسلم.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : ఏ వస్తువులోనయినా మృదుత్వముంటే అది ఆ వస్తువును హృద్యంగా మలుస్తుంది. ఆ మృదుత్వాన్నే తీసివేస్తే అది లోపభూయిష్టంగా కనిపిస్తుంది. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని సత్కార్యాల ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha) reported: The Prophet ﷺ said, “Whenever forbearance is added to something, it adorns it; and whenever it is withdrawn from something, it leaves it defective.”[Muslim].

ముఖ్యాంశాలు

మృదుత్వం మనిషికి పెట్టని ఆభరణం. మృదు స్వభావం గల మనిషిని అందరూ యిష్టపడతారు, గౌరవిస్తారు. అంతేకాదు, మృదుత్వాన్ని, మన్నింపుల వైఖరిని అవలంబించేవారిని దేవుడు కూడా ప్రేమిస్తాడు. దీనికి భిన్నంగా కఠినాత్ములు ఇటు ప్రజల దృష్టిలోనూ, అటు దేవుని దృష్టిలోనూ నీచులుగా పరిగణించబడతారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|74. సౌమ్యం, విజ్ఞత, మృదుత్వం|హదీసు 635

636

హదీసు 636

وعن أبي هريرةَ رضي اللَّه عنه قَالَ: بَال أَعْرَابيٌّ في المسجِد، فَقَامَ النَّاسُ إِلَيْه لِيَقَعُوا فِيهِ، فَقَالَ النبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: " دَعُوهُ وَأَرِيقُوا عَلى بَوْلِهِ سَجْلاً مِنْ مَاءٍ، أَوْ ذَنُوباً مِن مَاءٍ، فَإِنَّما بُعِثتُم مُيَسِّرِينَ ولَمْ تُبْعَثُوا مُعَسِّرِينَ" رواه البخاري. "السَّجْلُ"بفتح السين المهملة وإسكان الجيم: وَهِيَ الدُّلوُ المُمْتَلِئَةُ ماء، كَذلِكَ الذَّنُوبُ.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం : ఒక పల్లెటూరి వ్యక్తి మస్జిద్‌లో మూత్రం పోశాడు. అది చూసి ప్రజలు అతన్ని కొట్టబోయారు. అంతలో దైవప్రవక్త ﷺ వారిని అడ్డుకొని, "అతన్ని వదలిపెట్టండి. ఆ మూత్రంపై ఒక బిందె నీళ్లు పారబోయండి. మీరు సౌలభ్యం కోసం ప్రభవింపజేయబడ్డారు, కాఠిన్యం కోసం కాదు" అని అన్నారు. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని శుచీ శుభ్రతల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: A bedouin urinated in the mosque and some people rushed to beat him up. The Prophet ﷺ said: “Leave him alone and pour a bucket of water over it. You have been sent to make things easy and not to make them difficult.”[Al-Bukhari].

ముఖ్యాంశాలు

ప్రజలకు నీతిని, నడవడికను బోధించేటప్పుడు వారి పట్ల వీలైనంతవరకు మృదుత్వం, మన్నింపుల వైఖరిని అవలంబించాలి. ముఖ్యంగా పల్లెటూరి వ్యక్తులు, ఏమీ తెలియని అమాయకుల పట్ల మృదువుగా వ్యవహరించాలి. కాఠిన్యాన్ని ప్రదర్శిస్తే వారు బెదిరిపోయి నకారాత్మకంగా స్పందించే ప్రమాదముంది. అంచేత వారికి నడవడికను బోధించాలనుకున్నప్పుడు ముందుగా వారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవాలి. కొన్నిసార్లు వారు మూర్ఖంగా ప్రవర్తించినా మన్నింపుల ధోరణితో వారిని సరిదిద్దే ప్రయత్నం చేయాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|74. సౌమ్యం, విజ్ఞత, మృదుత్వం|హదీసు 636

637

హదీసు 637

وعن أَنس رضي اللَّه عنه عن النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "يسِّرُوا وَلا تُعَسِّروا. وَبَشِّرُوا وَلا تُنَفِّرُوا" متفقٌ عَلَيْهِ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : "సౌలభ్యాన్ని కలగజేయండి. ప్రజలను కాఠిన్యానికి గురిచేయకండి. శుభవార్తలు అందించండి, ద్వేషం కలిగించే మాటలు చెప్పకండి."

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని విద్యాప్రకరణం, సహీహ్ ముస్లింలోని జిహాద్ ప్రకరణం)

English

Anas (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “Make things easy and do not make them difficult, cheer the people up by conveying glad tidings to them and do not repulse (them).”[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|74. సౌమ్యం, విజ్ఞత, మృదుత్వం|హదీసు 637

638

హదీసు 638

وعن جرير بن عبد اللَّه رضي اللَّه عنه قالَ: سمعتُ رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقُولُ: "مَنْ يُحْرَمِ الرِّفْقَ يُحْرمِ الخيْرَ كُلَّهُ" رواه مسلم.

హజ్రత్ జరీర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : మృదుత్వం లేనివాడు సకల ప్రాప్తాలనూ కోల్పోతాడు.

(ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని సత్కార్యాల ప్రకరణం)

English

Jarir bin `Abdullah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “He who is deprived of forbearance and gentleness is, in fact, deprived of all good.”[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|74. సౌమ్యం, విజ్ఞత, మృదుత్వం|హదీసు 638

639

హదీసు 639

وعن أَبي هريرة رضي اللَّه عنه أَنَّ رَجُلاً قَالَ للنَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: أَوْصِني قَالَ:"لا تَغْضَبْ"فَرَدَّدَ مِرَاراً، قَالَ:"لاَ تَغْضَبْ" رواه البخاري.

హజ్రత్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) కథనం: ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺను తనకు ఏమైనా ఉపదేశించమని కోరాడు. దానికి ఆయన, "నువ్వు కోపగించుకోకు" అన్నారు. ఆ వ్యక్తి పలుమార్లు అదే ప్రశ్న అడిగాడు. ప్రతిసారీ ఆయన 'కోపగించుకోకు' అనే అన్నారు. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని సంస్కార ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: A man asked the Prophet ﷺ to give him advice, and he ﷺ said, “Do not get angry.” The man repeated that several times and he ﷺ replied (every time), “Do not get angry.”[Al-Bukhari].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో దైవప్రవక్త ﷺను ఉపదేశించమని కోరిన వ్యక్తి బహుకోపిష్టి అని ఇతర ఉల్లేఖనాల ద్వారా తెలుస్తోంది. అందుకే దైవప్రవక్త ﷺ ఆ వ్యక్తి స్వభావాన్ని గమనించి ప్రతిసారీ అతనికి కోపగించుకోవద్దనే ఉపదేశించారు. మనిషికి కోపం రావటం సహజమే. కాని ఆ కోపాన్ని దిగమ్రింగటం ఉత్తముల లక్షణం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|74. సౌమ్యం, విజ్ఞత, మృదుత్వం|హదీసు 639

640

హదీసు 640

وعن أَبي يعلَى شدَّاد بن أَوسٍ رضي اللَّه عنه، عن رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إِنَّ اللَّه كَتَبَ الإِحسَان عَلَى كُلِّ شَيءٍ، فإِذا قَتلتُم فَأَحسِنُوا القِتْلَةَ وَإِذَا ذَبحْتُم فَأَحْسِنُوا الذِّبْحة وليُحِدَّ أَحَدُكُم شَفْرتَه وَليُرِحْ ذَبيحَتَهُ" رواه مسلم.

హజ్రత్ అబూ యాలా షద్దాద్ బిన్ ఔస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : నిస్సందేహంగా దేవుడు ప్రతి పనిని ఉత్తమంగా నిర్వర్తించటం విధిగా చేశాడు. కనుక మీరు (ఒక ప్రాణిని) చంపినప్పుడు ఉత్తమమైన రీతిలో చంపండి. (జంతువుల్ని) జిబహ్ చేసినప్పుడు ఉత్తమమైన రీతిలో జిబహ్ చేయండి. మీలో ప్రతి ఒక్కరూ కత్తికి సానపట్టి జిబహ్ చేయబడే జంతువుకి సుఖాన్ని కలగజేయాలి సుమా! (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జంతువేట ప్రకరణం)

English

Abu Ya`la Shaddad bin `Aus (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Verily Allah has prescribed Ihsan (kindness) for everything. So when you kill, you must make the killing in the best manner; when you slaughter, make your slaughter in the best manner. Let one of you sharpen his knife and give ease to his animal (in order to reduce his pain).”[Muslim].

ముఖ్యాంశాలు

ఇక్కడ ప్రాణిని చంపటమంటే హాని తలపెట్టే విష జంతువుని చంపటం లేదా హత్యచేసిన నేరస్థుణ్ణిగాని యుద్ధరంగంలో శత్రువుని గాని చంపటం అని అర్థం. ఇలాంటి సందర్భాల్లో జీవహింస సమ్మతమేగాని ఆ జీవిని చిత్రహింసలు పెట్టిమరీ చంపటం ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మతం కాదు. ఇస్లాం ధర్మం ఒక నేరస్థునికి మరణశిక్ష విధించినా చిత్రహింసలు పెట్టి చంపకూడదని తాకీదు చేస్తోంది. ఇస్లాంకు పూర్వం అజ్ఞాన కాలంలో ప్రజలు ఒక మనిషిని చంపాలనుకున్నప్పుడు అతనికి చిత్రహింసలు పెట్టిన తరువాతగాని చంపేవారు కారు. ముందు చెవి, ఆ తరువాత ముక్కు, ఆ తర్వాత కాళ్లుచేతులు ఇలా ఒక్కొక్క అవయవమే వేరుచేసి చివరికి ప్రాణాలు తీసేవారు. ఇస్లాం ధర్మం ఈ పద్ధతిని తీవ్రంగా ఖండించింది. మనిషిని ఆ విధంగా చావుబతుకుల మధ్య ఇరికించి, చిత్రహింసలు పెట్టి చంపటం పాశవిక చర్యగా పేర్కొంది.

అదేవిధంగా జంతువుల్ని కోసినప్పుడు కత్తికి సానబట్టుకోవాలని, మెడవైపునుండి కోయకూడదని తాకీదు చేయబడింది. ఎందుకంటే కత్తి మొండిగా ఉన్నా లేదా మెడవైపు నుండి కోసినా దానివల్ల జంతువుకి విపరీతమైన నొప్పి కలుగుతుంది. జంతువుని ఆ విధంగా హింసిస్తూ చంపటం కూడా ఇస్లాం దృష్టిలో గర్హించదగిన విషయమే. నేడు యూరపు దేశాల్లో జంతువుల్ని యంత్రాల ద్వారా కోసే పద్ధతిని అవలంబిస్తున్నారు. దానివల్ల జంతువయితే అవలీలగా చావగలుగుతుందిగాని అధిక రక్తస్రావం జరగకపోవటంతో చాలా వరకు రక్తం జంతువు మాంసంలోనే ఉండిపోతుంది. అటువంటి మాంసం ఆరోగ్యానికి హానికరంగా పరిణమించవచ్చు. జంతువు మాంసం ధర్మసమ్మతం కావాలంటే అధికస్రావం జరగాలని ఇస్లాం ఆదేశిస్తోంది. అందుకని జంతువుల్ని కోయటానికి ఇస్లాం ధర్మం సూచించిన పద్ధతే అన్నివిధాలా శ్రేయస్కరం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|74. సౌమ్యం, విజ్ఞత, మృదుత్వం|హదీసు 640

641

హదీసు 641

وعن عائشة رضي اللَّه عنها قالت: مَا خُيِّر رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم بَينَ أَمْرينِ قَطُّ إِلاَّ أَخذَ أَيْسَرَهُمَا، مَا لَم يَكُن إِثماً، فإنْ كانَ إِثماً كَانَ أَبعد النَّاسِ مِنْهُ. ومَا انتَقَمَ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم لِنَفْسِهِ في شَيءٍ قَطُّ، إِلاَّ أَن تُنتَهكَ حُرْمَةُ اللَّهِ، فَينتَقِم للَّهِ تَعَالَى. متفقٌ عَلَيْهِ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త ﷺకు ఏవయినా రెండు విషయాల్లో ఒకదాన్ని అవలంబించే ఎంపిక స్వేచ్ఛ ఇస్తే ఆయన ఆ రెండింటిలో సులభమైన విషయాన్నే ఎంచుకునేవారు. అయితే ఆ విషయం పాపకార్యమయి ఉండకూడదు. ఆ విషయం పాపకార్యమయిన పక్షంలో అందరికన్నా ఎక్కువగా ఆయనే దానికి దూరంగా ఉంటారు. దైవప్రవక్త ﷺ ఎన్నడూ తన సొంత వ్యవహారంలో ఇతరులకు ప్రతీకారం చేయలేదు. కాని దేవుని నిషిద్ధ విషయాల్లో జోక్యం చేసుకుంటే మాత్రం ఆయన దైవం కోసం ప్రతీకారం చేసేవారు.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని మహిమోన్నతుల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని ఘనతా విశిష్టతల ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha) reported: Whenever the Prophet ﷺ was given a choice between two matters, he would (always) choose the easier as long as it was not sinful to do so; but if it was sinful he was most strict in avoiding it. He never took revenge upon anybody for his own sake; but when Allah’s Legal Bindings were outraged, he would take revenge for Allah’s sake.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ప్రవక్త తన అనుచర సమాజానికి ఆదర్శకర్తగా వ్యవహరిస్తాడు. ప్రవక్త వాక్కర్మల్ని ఆయన అనుచర సమాజం తమ పాలిట ఆదర్శప్రాయంగా భావిస్తుంది. అలాంటప్పుడు ప్రవక్తే స్వయంగా ఆచరణయోగ్యం కాని క్లిష్టమైన పద్ధతులు, విధానాలను అవలంబిస్తే తన అనుచర సమాజం కాఠిన్యానికి గురికావలసి వస్తుంది. అందుకే దైవప్రవక్త ﷺ ఎల్లప్పుడూ వీలైనంతవరకు సులభమైన విధానాలనే పాటించేవారు. శిక్షలు, ఆరాధనలు, విధులు ప్రతి విషయంలోనూ అనుచర సమాజ సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించేవారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|74. సౌమ్యం, విజ్ఞత, మృదుత్వం|హదీసు 641

642

హదీసు 642

وعن ابن مسعود رضي اللَّه عنه قال: قال رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: " أَلا أَخْبرُكُمْ بِمَنْ يَحْرُمُ عَلى النَّارِ أَوْ بِمَنْ تَحْرُمُ عَلَيْهِ النَّارُ؟ تَحْرُمُ عَلَى كُلِّ قَرِيبٍ هَيِّنٍ ليِّنٍ سَهْلٍ". رواه الترمذي وقال: حديثٌ حسنٌ.

హజ్రత్ ఇబ్నె మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు : నరకానికి ఎవరు (లేక) నరకం ఎవరిపై నిషిద్ధమో నేను మీకు తెల్పనా? ప్రజలతో సన్నిహితంగా ఉంటూ సౌకర్యాన్ని కలగజేస్తూ, మృదుత్వం మార్దవాలతో వ్యవహరించే ప్రతి వ్యక్తిపై నరకం నిషిద్ధమే. (తిర్మిజీ దీనిని ఉల్లేఖించి 'హసన్'గా పేర్కొన్నారు)

(సుననె తిర్మిజీలోని ప్రళయ వర్ణనల ప్రకరణం)

English

Ibn Mas`ud (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Shall I not tell you whom the (Hell) Fire is forbidden to touch? It is forbidden to touch a man who is always accessible, having polite and tender nature.”[At-Tirmidhii].

ముఖ్యాంశాలు

సన్నిహితంగా ఉండటమంటే తమ నడవడికతో, మంచి ప్రవర్తనతో ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకోవటమని అర్థం. అదేవిధంగా సౌకర్యాన్ని కలుగజేస్తూ మృదువుగా వ్యవహరించటమంటే ప్రాపంచిక వ్యవహారాల్లో వారిపట్ల అణకువతో, ప్రేమతో వ్యవహరించటమని భావం. ఈ హదీసులో కూడా ఉత్తమ నడవడికకు గల గొప్పదనం వివరించబడింది. దీనికి విశ్వాసంతో ప్రగాఢమైన సంబంధముంది. మనిషిని నరకాగ్ని నుంచి కాపాడేది ఆ విశ్వాసమే!

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|74. సౌమ్యం, విజ్ఞత, మృదుత్వం|హదీసు 642