హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 73వ అధ్యాయం: ఉత్తమ నడవడిక. ఈ అధ్యాయంలో 2 ఖుర్ఆన్ ఆయతులు, 11 హదీసులు (హదీసు 621 – 631) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
73. ఉత్తమ నడవడిక
باب حسن الخلق
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ సెలవిచ్చాడు :
{وَإِنَّكَ لَعَلَى خُلُقٍ عَظِيمٍ} [القلم:٤]
"ప్రవక్తా! నిస్సందేహంగా నువ్వు నైతికంగా ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నావు." (అల్ ఖలమ్ : 4)
{وَالْكَاظِمِينَ الْغَيْظَ وَالْعَافِينَ عَنِ النَّاسِ} [آل عمران:١٣٤]
"(భయభక్తులు కలవారైన విశ్వాసులు) కోపాన్ని దిగమ్రింగుతారు. ఇతరుల తప్పుల్ని క్షమిస్తారు. ఇలాంటి సజ్జనులంటే అల్లాహ్కు ఎంతో యిష్టం." (ఆలి ఇమ్రాన్ : 134)
English
“And verily, you (O Muhammad ﷺ) are on an exalted (standard of) character.” [Al-Qalam 68:4]
“The Jannah is prepared for those)… who repress anger, and who pardon men.” [Āl ‘Imrān 3:134]
హదీసు 621
وعن أَنسٍ رضيَ اللَّه عنه قَالَ: كانَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أَحْسنَ النَّاسِ خُلقاً. متفقٌ عَلَيْهِ.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ మానవులందరిలోకెల్లా సుగుణవంతులు. (బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని సంస్కార ప్రకరణం, సహీహ్ ముస్లింలోని ఘనతా విశిష్ఠతల ప్రకరణం)
English
Anas (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ was the best of all the people in behaviour.[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|73. ఉత్తమ నడవడిక|హదీసు 621
హదీసు 622
وعنه قَالَ: مَا مَسِسْتُ دِيباجاً ولاَ حَرِيراً أَلْيَنَ مِنْ كَفِّ رسُولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، وَلاَ شَمَمْتُ رائحَةً قَطُّ أَطْيَبَ مِن رَسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، وَلَقَدْ خَدَمْتُ رَسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم عشْرَ سِنينَ، فَما قالَ لي قَطُّ: أُفٍّ، وَلا قالَ لِشَيْءٍ فَعلْتُهُ: لِمَ فَعَلْتَهُ؟ وَلاَ لشيءٍ لَمْ افعَلْهُ: أَلاَ فَعَلْتَ كَذا؟ متفقٌ عليه.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ హస్తం కన్నా సుకుమారమైన పట్టువస్తువేదీ నేను ముట్టుకోలేదు. దైవప్రవక్త ﷺ శరీర సువాసన కన్నా పవిత్రమైన పరిమళం నేనెన్నడూ ఆఘ్రాణించలేదు. నేను పదేళ్ళపాటు దైవప్రవక్త ﷺకు సేవ చేశాను. కాని నేను చేసిన పని విషయంలో ఆయన నన్ను ఎన్నడూ ఇలా ఎందుకు చేశావని అనలేదు. అలాగే నేను చేయని పని విషయంలో ఇలా ఎందుకు చేయలేదు అని కూడా అనలేదు. (బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని మహిమోన్నతుల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని ఘనతా విశిష్ఠతల ప్రకరణం)
English
Anas (radiyallahu anhu) reported: I never felt any piece of velvet or silk softer than the palm of the Messenger of Allah ﷺ, nor did I smell any fragrance more pleasant than the smell of Messenger of Allah ﷺ. I served him for ten years, and he never said `Uff’ (an expression of disgust) to me. He never said `why did you do that?’ for something I had done, nor did he ever say `why did you not do such and such’ for something I had not done.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
తన దగ్గర పదేండ్లు పనిచేసిన ఓ నౌకరుని యజమాని అంత సుదీర్ఘ కాలంలో ఏనాడైనా కసురుకోకుండా ఉండటం, కనీసం ఫలానా పని ఎందుకు చేయలేదు అని కూడా అడగకుండా ఉండటం ఉత్తమోత్తమ నైతికతకు నిలువెత్తు నిదర్శనం. దివిటీ పెట్టి వెతికినా లోకంలో ఇలాంటివారు కానరారు. ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకు ఇలాంటి ఉదాహరణ మరొకటి లేదు. దైవప్రవక్త అనుచర సమాజం కూడా ఆయనగారి ఈ ఉత్తమ నడవడికను ఆదర్శంగా తీసుకుంటే ఎంతబాగుండు!
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|73. ఉత్తమ నడవడిక|హదీసు 622
హదీసు 623
وعن الصَّعبِ بنِ جَثَّامَةَ رضيَ اللَّهُ عنه قَالَ: أَهْدَيْتُ رسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم حِمَاراً وَحْشِياً، فَرَدُّهُ عليَّ، فَلَمَّا رأَى مَا في وَجْهي قالَ: "إِنَّا لَمْ نَرُدَّهُ عَلَيْكَ إِلاَّ أَنَّا حُرُمٌ" متفقٌ عَلَيْهِ.
హజ్రత్ సాబ్ బిన్ జస్సామా (రదియల్లాహు అన్హు) కథనం : నేనొకసారి దైవప్రవక్త ﷺకు ఓ అడవి గాడిదను కానుకగా సమర్పించుకున్నాను. కాని ఆయన దాన్ని నాకు వాపసు చేసేశారు. అప్పుడు నా ముఖకవళికల్లో వచ్చిన మార్పును చూసి ఆయన నాతో, "మేము 'ఇహ్రాం' దీక్షబూని ఉన్నాం. అందుకే దాన్ని వాపసు చేసేశాం" అని అన్నారు.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలలోని హజ్ ప్రకరణాలు)
English
Sa`b bin Jaththamah (radiyallahu anhu) reported: I presented a wild ass to Messenger of Allah ﷺ as a gift but he returned it to me. When he perceived signs of despair on my face, he said, “I have declined to accept it because I am in the state of Ihram.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
హజ్, లేక ఉమ్రా యాత్ర కోసం దీక్షబూనటాన్ని 'ఇహ్రాం' అని అంటారు. ఇహ్రాం దీక్షబూనిన వానిని 'ముహ్రిం' అని పిలుస్తారు. ఒక ముహ్రిం ఇహ్రాం స్థితిలో ఉన్నప్పుడు తాను స్వయంగా జంతువుల్ని వేటాడటం గాని లేదా వేటాడటంలో ఇతరులకు సహకరించటం గాని చేయకూడదు. బహుశా ఆ కారణంవల్లనే దైవప్రవక్త ﷺ సాబ్ బిన్ జస్సామా కానుకను నిరాకరించి ఉంటారు.
ఈ సందర్భంగా గమనార్హమైన విషయం మరొకటుంది. ఇతరులచేత వేటాడబడిన జంతువుల మాంసాన్ని 'ముహ్రిం' కూడా తినవచ్చని మరికొన్ని హదీసులు ఉద్ఘాటిస్తున్నాయి. కాని మరోవైపు పై హదీసు ద్వారా అలా వేటాడబడిన జంతువుల మాంసాన్ని ముహ్రిం తినకూడదని తెలుస్తోంది. చాలామంది విద్వాంసులు ఈ రెండురకాల హదీసుల మధ్య భావసారూప్యతను సూచించారు. దాని ప్రకారం ముహ్రిం కానివారు తమ స్వయం కోసం జంతువుల్ని వేటాడి అందులో కొంతమాంసాన్ని ముహ్రింకు కానుకగా ఇస్తే ముహ్రిం దాన్ని నిస్సంకోచంగా స్వీకరించవచ్చు. మొదటిరకం హదీసుల్లో ప్రస్తావించబడిన విషయం అదే.
ఇకపోతే రెండో రకం హదీసుల్లో చెప్పబడిన విషయం ఏమిటంటే ఇతరులెవరయినా ప్రత్యేకంగా ముహ్రిం కోసమే జంతువుని వేటాడి దాని మాంసాన్ని ముహ్రింకు కానుకగా ఇస్తే దాన్ని స్వీకరించడం ధర్మసమ్మతం కాదు (ఫత్హుల్ బారీ). అదేవిధంగా జంతువు ఎవరికోసం వేటాడబడినప్పటికీ ఒకవేళ అది ప్రాణాలతో ఉంటే ముహ్రిం దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ స్వీకరించకూడదు. ఇమామ్ బుఖారీ అభిప్రాయం కూడా ఇదే. ఆయన ఈ హదీసును, "ముహ్రిం సజీవంగా ఉన్న వేట జంతువుల కానుకను స్వీకరించకూడద"నే శీర్షిక క్రింద ప్రస్తావించారు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|73. ఉత్తమ నడవడిక|హదీసు 623
హదీసు 624
وعن النَّوَّاسِ بنِ سمعانَ رضي اللَّه عنه قَالَ: سأَلتُ رسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم عنِ البِرِّ والإِثمِ فقالَ: "البِرُّ حُسنُ الخُلُقِ، والإِثمُ: مَا حاكَ فِي نَفْسِكَ، وكَرِهْتَ أَنْ يَطَّلعَ عَلَيْهِ النَّاسُ" رواهُ مسلم.
హజ్రత్ నవ్వాస్ బిన్ సమ్ఆన్ (రదియల్లాహు అన్హు) కథనం : నేను దైవప్రవక్త ﷺను సత్కార్యం, దుష్కార్యాల గురించి అడిగాను. దానికి ఆయన, "సత్కార్యమంటే ఉత్తమ నడవడిక. దుష్కార్యమంటే మదిని తొలిచేది, దాని గురించి ప్రజలు తెలుసుకుంటే బాగుండదని నువ్వు తలచేది" అని చెప్పారు.
(ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని సత్కార్యాలు – సత్సంబంధాల ప్రకరణం)
English
Nawwas bin Sam`an (radiyallahu anhu) reported: I asked Messenger of Allah ﷺ about virtue and sin, and he said, “Virtue is noble behaviour, and sin is that which creates doubt and you do not like people to know about it.”[Muslim].
ముఖ్యాంశాలు
మంచి నడవడికను కలిగివుండటం కూడా సత్కర్మలు చేయటంతో సమానమని ఈ హదీసులో చెప్పబడింది. ఎందుకంటే మంచినడవడిక గల వ్యక్తి మంచిపనులు మాత్రమే చేస్తాడు. చెడు పనులకు దూరంగా మసలుకుంటాడు.
పై హదీసులో పాపం గురించి కూడా అందరికీ అర్థమయ్యే విధంగా ఒక ప్రధాన సూత్రం వివరించబడింది. అదేమిటంటే- ప్రతి చెడుపనినీ మనిషి అంతరంగం అసహ్యించుకుంటుంది. తాను ఆ చెడుపని చేస్తే ప్రజలు తనను నిందిస్తారేమోనని కూడా మనిషి లోలోపల భయపడతాడు. అలాంటి ప్రతిపనీ చెడ్డదే అవుతుంది. అయితే ఈ అంతరాత్మ ప్రబోధనం కూడా మనిషి హృదయం పూర్తిగా మలినం కాకుండా ఉన్నంతవరకు మాత్రమే జరుగుతుంది. ఎప్పుడైతే మనిషి హృదయం పూర్తిగా మలినమైపోయి తన సహజత్వాన్ని కోల్పోతుందో అప్పుడు పెద్ద పెద్ద నేరాలు కూడా ఆ హృదయాన్ని కదిలించలేవు. ఆ హృదయం మనుషులెవరికీ భయపడదు. మనిషిలో వాసనశక్తి సరిగ్గా ఉంటే అతను దుర్వాసనను పసిగట్టగలుగుతాడు. కాని ఎల్లప్పుడూ దుర్వాసన మధ్య ఉండేవాడి వాసనశక్తి ఎంతగా పాడయిపోతుందంటే పెంటకుప్పలపై కూర్చున్నా కూడా అతనికి దుర్వాసన రాదు. మలినమయిపోయిన హృదయం సంగతి కూడా అంతే.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|73. ఉత్తమ నడవడిక|హదీసు 624
హదీసు 625
وعن عبد اللَّهِ بن عمرو بن العاص رضي اللَّه عنهما قَالَ: لَمْ يَكُنْ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَاحِشاً وَلاَ مُتَفَحِّشاً. وكانَ يَقُولُ: "إِنَّ مِن خِيارِكُم أَحْسَنَكُم أَخْلاقاً "متفقٌ عَلَيْهِ.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) కథనం : దైవప్రవక్త ﷺ అప్రయత్నంగాగాని, ప్రయత్నపూర్వకంగా గాని అశ్లీల మాటలు మాట్లాడేవారు కారు. పైగా తరచూ (మమ్మల్ని ఉపదేశిస్తూ), "నైతికత రీత్యా మీలో ఉత్తముడైనవాడే అందరికంటే శ్రేష్ఠుడు" అని అనేవారు. (బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని మహిమోన్నతుల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని ఘనతా విశిష్టతల ప్రకరణం)
English
`Abdullah bin `Amr bin Al-`as (radiyallahu anhuma) reported: Messenger of Allah ﷺ did not indulge in loose talk nor did he like to listen to it. He used to say, “The best of you is the best among you in conduct.”[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|73. ఉత్తమ నడవడిక|హదీసు 625
హదీసు 626
وعن أَبي الدرداءِ رضي اللَّه عنه: أَن النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ: "مَا مِنْ شَيءٍ أَثْقَلُ في ميزَانِ المُؤمِنِ يَومَ القِيامة مِنْ حُسْنِ الخُلُقِ. وإِنَّ اللَّه يُبغِضُ الفَاحِشَ البَذِيِّ "رواه الترمذي وقال: حديث حسن صحيح. "البِذيُّ": هُوَ الَّذِي يَتَكَلَّم بالفُحْشِ. ورِديء الكلامِ.
హజ్రత్ అబూ దర్దా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు: ప్రళయదినాన విశ్వాసి త్రాసులో ఉత్తమ నడవడిక కన్నా బరువైన వస్తువు మరొకటి ఉండదు. నిస్సందేహంగా దేవుడు దుర్భాషలాడే వాణ్ణి బూతు మాటలు మాట్లాడేవాణ్ణి అసహ్యించుకుంటాడు. (తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హసన్, సహీహ్గా పేర్కొన్నారు)
(సుననె తిర్మిజీలోని సత్కార్యాలు – సత్సంబంధాల అధ్యాయం)
English
Abud-Darda (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “Nothing will be heavier on the Day of Resurrection in the Scale of the believer than good manners. Allah hates one who utters foul or coarse language.”[At-Tirmidhi].
ముఖ్యాంశాలు
ప్రళయదినాన దైవసన్నిధిలో మనిషికి ఇహలోకంలో తాను చేసుకున్న పుణ్యకర్మలే ఉపయోగపడతాయి. ఈ పుణ్యకర్మలు ఇతర కర్మలన్నింటికన్నా ఎక్కువ బరువుని కలిగి ఉంటాయి. అయితే ఈ అదృష్టం మాత్రం ఒక్క విశ్వాసులకే ప్రత్యేకం. దైవంపై విశ్వాసం లేనివారు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా వాటికి దైవసన్నిధిలో విలువ ఉండదు. అదేవిధంగా చెడునడత కలవారిని, బూతు మాటలు మాట్లాడేవారిని దేవుడు అసహ్యించుకుంటాడంటే వారు పరలోకంలో వైఫల్యాన్ని చవిచూస్తారని అర్థం.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|73. ఉత్తమ నడవడిక|హదీసు 626
హదీసు 627
وعن أبي هُريرة رضيَ اللَّه عنه قَالَ: سُئِلَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم عَنْ أَكثرِ مَا يُدْخلُ النَّاس الجَنَّةَ؟ قَالَ: "تَقْوى اللَّهِ وَحُسنُ الخُلُق وَسُئِلَ عَنْ أَكثرِ مَا يُدْخِلُ النَّاسَ النَّارَ فَقَالَ:"الفَمُ وَالفَرْجُ". رواه الترمذي وقال: حديث حسن صحيح.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం : ప్రజల్ని అతి ఎక్కువగా స్వర్గానికి గొనిపోయే కర్మలు ఏవని దైవప్రవక్త ﷺను ప్రశ్నించటం జరిగింది. దానికి ఆయన, "దైవభీతి, ఉత్తమ నడవడికలు" అని సమాధానమిచ్చారు. మరి ప్రజల్ని అతి ఎక్కువగా నరకానికి గొనిపోయే కర్మలు ఏవని అడగ్గా, దానికి సమాధానమిస్తూ ఆయన, "నోరు మరియు మర్మాంగం" అని చెప్పారు.
(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హసన్, సహీహ్గా పేర్కొన్నారు)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ was asked about the deed which will be foremost to lead a man to Jannah. He replied, “Fear of Allah and the good conduct.” Then he was asked about indulgence which will admit a man to Hell (Fire) and he answered, “The tongue and the genitals.”[At-Tirmidhi].
ముఖ్యాంశాలు
ఈ హదీసు ఎంతో భావగర్భితమైనది. దైవభీతి మూలంగా మనిషికి- దైవంతో సరైన అనుబంధం ఏర్పడుతుంది. తనలో ఉత్తమ నడవడిక గనక ఉంటే మనిషి ప్రజల హక్కుల్ని నెరవేర్చటంలో నిర్లక్ష్యం చేయడు. కనుక ఈ రెండు ఆచరణలు ఎలాంటివంటే వీటిమూలంగా ప్రజలు అత్యధికంగా స్వర్గానికి వెళ్తారు.
అదేవిధంగా నోరు ; నోటితో మనిషి ధర్మధిక్కారపు మాటలు మాట్లాడతాడు. చాడీలు చెబుతాడు. ఇతరుల మీద నిందలు మోపుతాడు. తిట్లు శాపనార్థాలు పెడ్తాడు. ఇవన్నీ నోటికర్మలు. మర్మాంగం వ్యభిచారానికి కారణభూతమవుతుంది. ఈ విధంగా ఈ రెండు అవయవాల వల్ల అత్యధికంగా ప్రజలు నరకానికి వెళ్తారు. కనుక ప్రతి వ్యక్తి దైవభీతితో, ఉత్తమ నడవడికతో జీవితం గడుపుతూ నోరు, మర్మాంగాల మూలంగా జరిగే అనర్థాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. లేకపోతే అతని పరలోక జీవితం నాశనమయిపోతుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|73. ఉత్తమ నడవడిక|హదీసు 627
హదీసు 628
وعنه قَالَ: قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "أَكْمَلُ المُؤمِنِينَ إِيمَاناً أَحسَنُهُم خُلُقاً، وخيارُكُم خِيَارُكُمْ لِنِسَائِهمْ". رواه الترمذي وَقالَ: حديث حسن صحيح.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : విశ్వాసుల్లో ఉత్తమ నడవడిక గలవారే పరిపూర్ణ విశ్వాసులు. మీలో మీ భార్యల పట్ల ఉత్తమంగా వ్యవహరించేవారే ఉత్తములు. (తిర్మిజీ దీనిని ఉల్లేఖించి 'హసన్' సహీహ్గా పేర్కొన్నారు)
(సుననె తిర్మిజీలోని విశ్వాసాల అధ్యాయం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “The most perfect man in his faith among the believers is the one whose behaviour is most excellent; and the best of you are those who are the best to their wives.”[At-Tirmidhi].
ముఖ్యాంశాలు
ఈ హదీసులో నైతికతకు, విశ్వాసానికి అవినాభావ సంబంధముందని చెప్పబడింది. మనిషి నడవడిక ఎంత ఉన్నతంగా ఉంటుందో అతని విశ్వాసం కూడా అంత పరిపక్వత చెందివుంటుంది. విశ్వాసంలో పరిణతి రావాలంటే ముందుగా నైతికతలో పరిపూర్ణత రావాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|73. ఉత్తమ నడవడిక|హదీసు 628
హదీసు 629
وعن عائشةَ رضيَ اللَّه عنها، قالت سَمِعتُ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقول: "إِنَّ الُمؤْمِنَ لَيُدْركُ بِحُسنِ خُلُقِه درَجةَ الصائمِ القَائمِ" رواه أَبُو داود.
దైవప్రవక్త ﷺ ఈవిధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) తెలియజేశారు : విశ్వాసి తన ఉత్తమ నడవడిక మూలంగా ఒక ఉపవాసి స్థాయికి, రాత్రంతా మేల్కొని ఆరాధన చేసే ఆరాధకుని స్థాయికి చేరుకుంటాడు.
(అబూదావూద్)
(సుననె అబూదావూద్లోని సంస్కార ప్రకరణం)
English
`Aishah (radiyallahu anha) reported: I heard Messenger of Allah ﷺ saying: “A believer will attain by his good behaviour the rank of one who prays during the night and observes fasting during the day.”[Abu Dawud].
ముఖ్యాంశాలు
ఇక్కడ 'ఉపవాసి' అంటే తరచూ నఫిల్ ఉపవాసాలు పాటించేవాడని అర్థం. అలాగే పై హదీసులో 'ఖాయిమ్' అనే పదం కూడా వాడబడింది. ఖాయిమ్ అంటే రాత్రిళ్ళు జాగారం చేసి దైవారాధనలో గడిపేవాడని భావం. ఈ రెండూ చాలా కష్టమైన ఆచరణలు. కాని ఆచరించే వారికి మాత్రం లెక్కలేనంత పుణ్యం లభిస్తుంది. అదే సమయంలో పైన పేర్కొనబడిన నఫిల్ ఆరాధనలు పాటించలేకపోయినప్పటికీ, కేవలం విధుల్ని మాత్రమే నిర్వర్తిస్తూ ఉత్తమ నడవడికను కలిగివున్న వ్యక్తికి కూడా ఉపవాసుల, నఫిల్ ఆరాధకుల మాదిరి పుణ్యం లభిస్తుంది. దేవుని దృష్టిలో ఉత్తమ నడవడికకు అంతటి ప్రాముఖ్యం ఉంది మరి!
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|73. ఉత్తమ నడవడిక|హదీసు 629
హదీసు 630
وعن أَبي أُمَامَة الباهِليِّ رضي اللَّه عنه قَالَ: قَالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "أَنا زَعِيمٌ ببَيتٍ في ربَضِ الجنَّةِ لِمَنْ تَرَكَ المِراءَ. وَإِنْ كَانَ مُحِقّاً، وَببيتٍ في وَسَطِ الجنَّةِ لِمَنْ تَرَكَ الكَذِبَ، وإِن كَانَ مازِحاً، وَببيتٍ في أعلَى الجَنَّةِ لِمَن حَسُنَ خُلُقُهُ" حديث صحيح، رواه أَبُو داود بإِسناد صحيح. "الزَّعِيمُ": الضَّامِنُ.
హజ్రత్ అబూ ఉమామా బాహిలీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు : ధర్మం తన పక్షాన ఉన్నప్పటికీ వివాదాన్ని ఉపసంహరించుకునే వ్యక్తికి స్వర్గ పరిసరాల్లో ఒక గృహాన్ని ఇప్పించేందుకు నేను పూచీ వహిస్తున్నాను. అలాగే పరాచికానికయినా అబద్ధాలు పలకనివానికి నడి స్వర్గంలో ఒక గృహాన్ని ఇప్పించేందుకు, ఉత్తమ నడవడికను కలిగివున్న వ్యక్తికి స్వర్గంలో ఎత్తయిన ప్రదేశంలో ఒక గృహాన్ని ఇప్పించేందుకు నేను పూచీ వహిస్తున్నాను. (ఈ హదీసు దృఢమైనది. అబూదావూద్ దీనిని ఉల్లేఖించారు)
(సుననె అబూదావూద్లోని సంస్కార ప్రకరణం)
English
Abu Umamah Al-Bahili (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “I guarantee a house in Jannah for one who gives up arguing, even if he is in the right; and I guarantee a home in the middle of Jannah for one who abandons lying even for the sake of fun; and I guarantee a house in the highest part of Jannah for one who has good manners.”[Abu Dawud].
ముఖ్యాంశాలు
ధర్మం తమ పక్షాన ఉన్నప్పటికీ వివాదాన్ని రూపుమాపే ఉద్దేశ్యంతో తమ హక్కుల్ని వదలుకోవటం ఉత్తముల లక్షణం. అదేవిధంగా ఒక వ్యక్తి ఎగతాళికయినా అబద్ధం చెప్పటం లేదంటే అతను షరీఅత్కు, దేవుడు, దైవప్రవక్త ﷺ ఆదేశాల అమలుకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నాడని అర్థం. అందుకే అతను అబద్ధం చెబితే ప్రజలు చెడుగా భావించని సందర్భాల్లో కూడా అబద్ధానికి దూరంగా ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనయినా అబద్ధం పలకకుండా ఉండటాన్ని దేవుడు అమితంగా ఇష్టపడతాడు. ఇలాంటి ఉత్తమ లక్షణాలు నీతిమంతులకే చెల్లుతాయి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|73. ఉత్తమ నడవడిక|హదీసు 630
హదీసు 631
وعن جابر رضي اللَّه عنه أَن رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إِن مِنْ أَحَبِّكُم إِليَّ، وَأَقْرَبِكُمْ مِنِّي مَجلساً يَومَ القِيَامَةِ، أَحَاسِنَكُم أَخلاقاً. وإِنَّ أَبَغَضَكُم إِليَّ وَأَبْعَدكُم مِنِّي يومَ الْقِيامةِ، الثَّرْثَارُونَ والمُتَشَدِّقُونَ وَالمُتَفَيْهِقُونَ"قالوا: يَا رسول اللَّه قَدْ عَلِمْنَا الثَرْثَارُونَ وَالمُتَشَدِّقُونَ، فَمَا المُتَفيْهِقُونَ؟ قَالَ:"المُتَكَبِّروُنَ" رواه الترمذي وقال: حديث حسن. "الثَّرثَارُ": هُوَ كَثِيرُ الكَلامِ تَكلُّفاً."وَالمُتَشَدِّقُ": المُتَطاوِلُ عَلى النَّاسِ بِكَلامِهِ، وَيتَكَلَّمُ بِملءِ فِيهِ تَفَاصُحاً وَتَعْظِيماً لكلامِهِ،"وَالمُتَفَيْهِقُ": أَصلُهُ مِنَ الفَهْقِ، وهُو الامْتِلاءُ، وَهُوَ الَّذِي يَمْلأ فَمَهُ بِالكَلامِ، وَيَتَوَسَّعُ فِيهِ، وَيُغْرِب بِهِ تَكَبُّراً وَارتِفَاعاً، وإِظْهَاراً للفَضِيلَةِ عَلى غيَرِهِ. وروى الترمذي عن عبد اللَّه بن المباركِ رحِمه اللَّه في تَفْسير حُسْنِ الخُلُقِ قَالَ: هُوَ طَلاقَةُ الوجه. وبذلُ المَعرُوف، وكَفُّ الأَذَى.
హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : మీలో అందరికన్నా ఎక్కువ నీతిమంతులు ప్రళయదినాన నాకు అత్యంత ప్రియతములుగా, నాకు అందరికన్నా సమీపంలో కూర్చొని ఉంటారు. వదరుబోతులు, డాబుసరిగా మాట్లాడేవారు, వికటంగా నవ్వుతూ మాట్లాడేవారు ప్రళయదినాన నాకు అత్యంత అయిష్టులుగా, అందరికన్నా దూరంగా ఉంటారు.
అది విని సహచరులు సందేహపడుతూ, "దైవప్రవక్తా! వదరుబోతులు, డాబుసరిగా మాట్లాడేవారంటే అర్థమయింది. కాని ఈ వికటంగా మాట్లాడేవారంటే ఎవరు?" అని అడిగారు. దానికి సమాధానమిస్తూ దైవప్రవక్త ﷺ "వారు అహంకారులు" అని చెప్పారు.
(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హసన్గా పేర్కొన్నారు)
అసలు అరబీ మూలంలో 'ముత్ఫైహిఖ్' అనే పదం వాడబడింది. ఈ పదం 'ఫహఖ్' నుండి వచ్చింది. ఫహఖ్ అంటే నోరు తెరవటం. ఇలాంటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు నోరు తెరిచి (మాటల్ని సాగదీస్తూ) గర్వం ఉట్టిపడేలా విచిత్రంగా మాట్లాడుతుంటాడు. ఇమామ్ తిర్మిజీ (రహిమహుల్లాహ్) తన గ్రంథంలో ఉత్తమ నైతికతను గురించి వివరిస్తూ హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ముబారక్ (రహిమహుల్లాహ్) చెప్పిన మాటను నకలుచేశారు. దాని ప్రకారం ఉత్తమ నైతికత అంటే నగుమోముతో పలకరించటం, దానధర్మాలు చేయటం, ఇతరుల్ని కష్టపెట్టకుండా ఉండటం.
(సుననె తిర్మిజీలోని సత్కార్యాలు – సత్సంబంధాల ప్రకరణం)
English
Jabir (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “The dearest and nearest among you to me on the Day of Resurrection will be one who is the best of you in manners; and the most abhorrent among you to me and the farthest of you from me will be the pompous, the garrulous, and Al-Mutafaihiqun.” The Companions asked him: “O Messenger of Allah! We know about the pompous and the garrulous, but we do not know who Al-Mutafaihiqun are.” He replied: “The arrogant people.”[At-Tirmidhi].
ముఖ్యాంశాలు
ఈ హదీసు కూడా ఉత్తమ నైతికతను ప్రబోధిస్తోంది. అనవసరంగా, అనాలోచితంగా మాట్లాడి ప్రజల ముందు డాంబికాలను ప్రదర్శించకూడదని తాకీదు చేస్తోంది. మితంగా, సౌమ్యంగా మాట్లాడటం మంచివారి లక్షణాలు. దీనికి విరుద్ధంగా అతిగా మాట్లాడటం, ప్రజల్ని భయపెట్టేలా ప్రగల్భాలు పలకటం ధూర్తుల లక్షణం.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|73. ఉత్తమ నడవడిక|హదీసు 631
You must be logged in to post a comment.