హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 72వ అధ్యాయం: గర్వాహంకారాలను ప్రదర్శించటం నిషిద్ధం. ఈ అధ్యాయంలో 4 ఖుర్ఆన్ ఆయతులు, 9 హదీసులు (హదీసు 612 – 620) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
72. గర్వాహంకారాలను ప్రదర్శించటం నిషిద్ధం
باب تحريم الكِبْر والإِعجاب
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ సెలవిచ్చాడు :
{تِلْكَ الدَّارُ الْآخِرَةُ نَجْعَلُهَا لِلَّذِينَ لاَ يُرِيدُونَ عُلُوّاً فِي الأَرْضِ وَلا فَسَاداً وَالْعَاقِبَةُ لِلْمُتَّقِينَ} [القصص:٨٣]
"ఇక, పరలోకంలోని గృహాన్ని మేము భూమిపై తమ పెద్దరికాన్ని కోరుకోనివారికీ, కల్లోలాన్ని సృష్టించగోరని వారికీ ప్రత్యేకించి ఉంచుతాము. మేలైన పరిణామం మాత్రం భయభక్తులు కలవారికే. (అల్ ఖసస్ : 83)
{وَلا تَمْشِ فِي الأَرْضِ مَرَحاً} [الإسراء: ٣٧]
"నేలమీద నిక్కుతూ నడవకండి." (అల్ ఇస్రా : 37)
{وَلا تُصَعِّرْ خَدَّكَ لِلنَّاسِ وَلا تَمْشِ فِي الأَرْضِ مَرَحاً إِنَّ اللَّهَ لاَ يُحِبُّ كُلَّ مُخْتَالٍ فَخُورٍ} [لقمان:١٨]
"ప్రజలతో ముఖం ప్రక్కకు త్రిప్పి మాట్లాడకు, భూమిపై నిక్కుతూ నడవకు. అహంభావి, బడాయికోరు అయిన ఏ వ్యక్తినీ అల్లాహ్ ప్రేమించడు." (లుఖ్మాన్ : 18)
ముఖం త్రిప్పి మాట్లాడటమంటే, అహంభావంతో విముఖత చూపుతూ మాట్లాడటమని అర్థం. నిక్కుతూ అంటే గర్వాన్ని ప్రదర్శిస్తూ అని భావం.
ఇంకొకచోట దేవుడు ఇలా అంటున్నాడు :
{إِنَّ قَارُونَ كَانَ مِنْ قَوْمِ مُوسَى فَبَغَى عَلَيْهِمْ وَآتَيْنَاهُ مِنَ الْكُنُوزِ مَا إِنَّ مَفَاتِحَهُ لَتَنُوءُ بِالْعُصْبَةِ أُولِي الْقُوَّةِ إِذْ قَالَ لَهُ قَوْمُهُ لاَ تَفْرَحْ إِنَّ اللَّهَ لاَ يُحِبُّ الْفَرِحِينَ} [القصص:٧٦] … {فَخَسَفْنَا بِهِ وَبِدَارِهِ الْأَرْضَ} [القصص: ٨١]
"ఇదొక యదార్థం; ఖారూన్ మూసా జాతికి చెందిన ఒక వ్యక్తి. అతను తన జాతికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. మేము అతనికి ఎన్నో నిధులను ఇచ్చాము. వాటి తాళపు చెవులను బలాఢ్యులైన వ్యక్తుల ఒక సమూహం కూడా చాలా కష్టంగా ఎత్తగలదు. ఒకసారి అతని జాతి ప్రజలు అతనితో, "విర్రవీగకు. విర్రవీగే వారిని అల్లాహ్ ప్రేమించడు" అన్నారు….. చివరకు మేము అతన్నీ, అతని గృహాన్నీ భూమిలోనికి అణగద్రొక్కాము. (అల్ ఖసస్ : 76 – 81)
English
“That home of the Hereafter (i.e., Jannah), We shall assign to those who rebel not against the truth with pride and oppression in the land nor do mischief by committing crimes. And the good end is for the Muttaqun (the pious and righteous persons).” [Al-Qaṣaṣ 28:83]
“And walk not on earth with conceit and arrogance.” [Al-Isrā’ 17:37]
“And turn not your face away from men with pride, nor walk in insolence through the earth. Verily, Allah likes not any arrogant boaster.” [Luqmān 31:18]
“Verily, Qarun (Korah) was of Musa’s (Moses) people, but he behaved arrogantly towards them. And We gave him of the treasures, that of which the keys would have been a burden to a body of strong men. Remember when his people said to him: `Do not exult (with riches, being ungrateful to Allah). Verily, Allah likes not those who exult (with riches, being ungrateful to Allah…(up to)… So We caused the earth to swallow him and his dwelling place.” [Al-Qaṣaṣ 28:76–81]
హదీసు 612
وعن عبدِ اللَّهِ بن مسعُودٍ رضيَ اللَّهُ عنه، عن النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "لاَ يَدْخُل الجَنَّةَ مَنْ كَانَ في قَلْبِهِ مثْقَالُ ذَرَّةٍ مَنْ كِبرٍ"فَقَالَ رَجُلٌ: إِنَّ الرَّجُلَ يُحِبُّ أَنْ يَكُونَ ثَوْبُه حَسَناً، ونعلهُ حَسَنَةً؟ قَالَ:"إِنَّ اللَّه جَمِيلٌ يُحِبُّ الجَمالَ الكِبْرُ بَطَرُ الحَقِّ وغَمْطُ النَّاسِ "رواه مسلم. بَطَرُ الحقِّ: دفْعُهُ وردُّهُ عَلَى قائِلِهِ. وغَمْطُ النَّاسِ: احْتِقَارُهُمْ.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ఓసారి దైవప్రవక్త ﷺ (ప్రజలకు) ఉపదేశం చేస్తూ, "మనసులో లేశమాత్రమయినా గర్వముంటే అతను స్వర్గంలోకి ప్రవేశించలేడు" అన్నారు. అది విని ఒక వ్యక్తి సందేహపడుతూ, "(దైవప్రవక్తా!) మనిషి తన బట్టలూ, తన చెప్పులు నీటుగా ఉండాలని కోరుకుంటాడు (మరి ఇది కూడా గర్వమేనా?)" అని అడిగాడు. అందుకాయన "దేవుడు సుందర స్వరూపుడు, సౌందర్యాన్ని యిష్టపడతాడు. వాస్తవానికి గర్వమంటే సత్యాన్ని త్రోసిపుచ్చటం, ప్రజల్ని నీచులుగా భావించటం" అని సమాధానమిచ్చారు.
(ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణం)
English
`Abdullah bin Mas`ud (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “He who has, in his heart, an ant’s weight of arrogance will not enter Jannah.” Someone said: “A man likes to wear beautiful clothes and shoes?” Messenger of Allah ﷺ said, “Allah is Beautiful, He loves beauty. Arrogance means ridiculing and rejecting the Truth and despising people.”[Muslim].
ముఖ్యాంశాలు
మనిషి మనసులో లేశమాత్రం గర్వమున్నా దేవుడు అతణ్ణి యిష్టపడడు. గర్వాహంకారాలకు లోనయి దైవాన్ని, ఆయన ధర్మాన్ని విశ్వసించటానికి నిరాకరించేవారు నరకాగ్నికి ఆహుతి అవుతారనటంలో సందేహం లేదు. కాని ఎవరయినా తమ సిరిసంపదలను, అందచందాలను, పేరుప్రతిష్ఠల్ని, హోదా అంతస్థులను చూసుకొని మిడిసిపాటుకు లోనయి సత్యాన్ని తృణీకరిస్తే, లేదా తోటివారిని నీచులుగా లెక్కగడితే – అలాంటి మిడిసిపాటు కూడా గర్హనీయమే కాని – వీరికి శాశ్వత నరకయాతన మాత్రం ఉండదు. కొంతకాలంపాటు నరకంలో శిక్షననుభవించిన తరువాత వీరు కూడా స్వర్గభోగాలకు నోచుకోగల్గుతారు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|72. గర్వాహంకారాలను ప్రదర్శించటం నిషిద్ధం|హదీసు 612
హదీసు 613
وعنْ سلمةَ بنِ الأَكْوع رضي اللَّه عنه أَن رجُلاً أَكَل عِنْدَ رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم بشِمالِهِ فَقَالَ: "كُلْ بِيَمِينِكَ"قالَ: لاَ أَسْتَطِيعُ، قَالَ:"لا اسْتَطَعْتَ" مَا مَنَعَهُ إِلاَّ الكبْرُ. قَالَ: فما رَفَعها إِلى فِيهِ. رواه مسلم.
హజ్రత్ సలమా బిన్ అక్వా (రదియల్లాహు అన్హు) కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺ సమక్షంలో ఎడమచేత్తో తిన్నాడు. ఆయన ఆ వ్యక్తిని కుడిచేత్తో తినమని ఆదేశించారు. అతను "నేను (కుడిచేత్తో) తినలేను" అన్నాడు. దానికి ఆయన "నువ్వు (నిజంగానే కుడిచేత్తో) తినలేకపోదువుగాక!" అని శపించారు. అతని గర్వం అతణ్ణి దైవప్రవక్త ﷺ మాట వినకుండా చేసింది.
(ఇక ఆ తరువాత నుంచి) ఆ వ్యక్తి తన కుడిచేతిని నోటిదాకా లేపలేకపోయేవాడు. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని అన్నపానీయాల ప్రకరణం)
English
Salamah bin Al-Akwa` (radiyallahu anhu) reported: A man ate in the presence of Messenger of Allah ﷺ with his left hand. He ﷺ said, “Eat with your right hand.” He said: “I cannot.” Thereupon he (the Prophet ﷺ) said, “May you never be able to do that.” It was arrogance that prevented him from doing it, and he could not raise it (the right hand) up to his mouth afterwards.[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|72. గర్వాహంకారాలను ప్రదర్శించటం నిషిద్ధం|హదీసు 613
హదీసు 614
وعن حَارثَةَ بنِ وهْبٍ رضي اللَّه عنه قَالَ: سَمِعْتُ رسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقولُ: "أَلاَ أُخْبِرُكُمْ بِأَهْلِ النَّارِ؟: كُلُّ عُتُلٍّ جَوَّاظٍ مُسْتَكْبِرٍ "متفقٌ عَلَيْهِ. وتقدَّم شرحُه في بابِ ضَعفَةِ المسلمينَ.
దైవప్రవక్త ﷺ ఇలా అంటుండగా తాను విన్నానని హజ్రత్ హారిసా బిన్ వహబ్ (రదియల్లాహు అన్హు) తెలిపారు : నరకవాసులెవరో నేను మీకు తెలియజేయనా? పొగరుబోతు, పిసినిగొట్టు, గర్విష్టిఅయిన ప్రతివాడూ (నరకవాసియే).
(బుఖారీ – ముస్లిం)
English
Harithah bin Wahab (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Shall I not inform you about the inmates of Hell? It is every violent, impertinent and proud person.”[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|72. గర్వాహంకారాలను ప్రదర్శించటం నిషిద్ధం|హదీసు 614
హదీసు 615
وعن أَبي سعيدٍ الخُدريِّ رضيَ اللَّهُ عنه، عن النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "احْتَجَّتِ الجَنَّةُ والنَّارُ، فقالتِ النَّارُ: فيَّ الجَبَّارُونَ والمُتَكَبِّرُونَ، وقالَتِ الجنَّةُ: فيَّ ضُعَفاءُ النَّاسِ ومَسَاكِينُهُمْ. فَقَضَى اللَّه بيْنَهُمَا: إِنَّكِ الجَنَّةُ رَحْمَتي، أَرْحَمُ بِكِ مَنْ أَشَاءُ وإِنَّكِ النَّارُ عذَابي، أُعَذِّبُ بِكِ مَنْ أَشَاءُ، ولِكِلَيْكُما عليَّ مِلْؤُها "رواهُ مسلم.
హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు : స్వర్గం మరియు నరకం పరస్పరం వాదులాడుకున్నాయి. నాలో తలబిరుసులు, అహంకారులు ఉంటారని నరకం అంటే, నాలో బలహీనులు, నిస్సహాయులు ఉంటారని స్వర్గం అన్నది. అప్పుడు అల్లాహ్ వారిద్దరినీ సముదాయిస్తూ, (స్వర్గంతో) "నువ్వు నా కారుణ్యానివి. నేను నీ ద్వారా నాకిష్టమైన వారిని కరుణిస్తాను. (తరువాత నరకంతో) నువ్వు నా శిక్షవి. నేను నీ ద్వారా నేను తలచిన వారిని శిక్షిస్తాను. (ఇకపోతే) మీ ఇద్దరినీ నింపాల్సిన బాధ్యత నాది" అని అన్నాడు.
(ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని స్వర్గసుఖాల ప్రకరణం)
English
Abu Sa`id Al-Khudri (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “There was a dispute between Hell and Jannah, and Hell said: `The haughty and proud are in me.’ The Jannah said: `In me are the weak and the humble.’ Thereupon Allah, the Exalted, judged between them saying: `You the Jannah are My Mercy, and through you I shall show mercy to those whom I wish.’ (And addressing the Hell) He said: `You are My punishment to punish whom I wish amongst My slaves, and each one of you will have its fill.”’[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|72. గర్వాహంకారాలను ప్రదర్శించటం నిషిద్ధం|హదీసు 615
హదీసు 616
وعن أبي هُريرة رضي اللَّه عنه أَن رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "لاَ يَنْظُرُ اللَّه يَوْم القِيامةِ إِلى مَنْ جَرَّ إِزارَه بَطَراً" متفقٌ عَلَيْهِ.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : అహంకారంతో తన ధోవతీని (లుంగీ, షరాయీని) నేలమీద ఈడుస్తూ నడిచేవాని వైపు ప్రళయదినాన దేవుడు కన్నెత్తి అయినా చూడడు.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని వస్త్రధారణ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “On the Day of Resurrection, Allah will not look at him who trails his lower garment out of pride.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ఇక్కడ 'కన్నెత్తి చూడడు' అంటే కారుణ్యదృష్టితో చూడడని అర్థం. ప్రళయదినాన దేవుడు అహంకారులు, పొగరుబోతుల వైపు కారుణ్యదృష్టితో చూడడు. పైగా ఆగ్రహంతో చూస్తాడు. ఈ హదీసులో 'ఇజార్' అనే పదం ఉపయోగించబడింది. ఇజార్ అంటే శరీరంలోని క్రింది సగభాగానికి తొడుక్కునే వస్త్రం. అది షరాయి, ప్యాంటు, లుంగీ, ధోవతి ఏదయినా కావచ్చు. వేరొక హదీసులో దైవప్రవక్త ﷺ పురుషులు క్రింది అంగవస్త్రాన్ని చీలమండలకు పైన ఉండేవిధంగా ధరించాలని తాకీదు చేశారు. అంగవస్త్రాన్ని నేలపై ఈడిస్తూ నడవటం అహంకారుల లక్షణం. ప్రళయదినాన అలాంటివారు గొప్ప అవమానాన్ని ఎదుర్కొంటారు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|72. గర్వాహంకారాలను ప్రదర్శించటం నిషిద్ధం|హదీసు 616
హదీసు 617
وعنه قَالَ: قالَ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:" ثَلاثةٌ لاَ يُكَلِّمُهُمُ اللَّه يَوْمَ القِيامَةِ، وَلا يُزَكِّيهِمْ، وَلاَ يَنْظُرُ إِلَيْهِمْ، وَلهُمْ عَذَابٌ أَلِيمٌ: شَيْخٌ زانٍ، ومَلِكٌ كَذَّابٌ، وعائلٌ مُسْتَكْبِرٌ "رواهُ مسلم"العائِلُ": الفَقِير.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు : ముగ్గురు వ్యక్తుల్ని ప్రళయదినాన దేవుడు పలకరించడు. వారిని ప్రక్షాళనం చేయడు. అసలు వారివైపు చూడనయినా చూడడు. పైగా అక్కడ వారి కోసం బాధాకరమైన శిక్ష ఉంటుంది. వారు; వృద్ధ వ్యభిచారి, అబద్ధాలకోరు అయిన రాజు, పొగరుబోతు నిరుపేద. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “There are three (types of) people to whom Allah will not speak on the Day of Resurrection, nor will He purify them, nor look at them, and they will have a painful punishment. These are: An aged man who commits Zina (illicit sexual act), a ruler who lies, and a proud poor person.”[Muslim].
ముఖ్యాంశాలు
ఇక్కడ కూడా దేవుడు ముగ్గురు వ్యక్తులను పలకరించడంటే వారిపట్ల ప్రేమతో, సంతోషంగా గాకుండా క్రోధంతో, ఆగ్రహంతో మాట్లాడతాడని అర్థం. ఇకపోతే హదీసులో పేర్కొనబడిన ఆ ముగ్గురు వ్యక్తులు చేసే నేరాలు సాధారణంగా చాలామంది చేస్తుంటారు, మరి దేవుడు ఆ ముగ్గురినే పలకరించకుండా ఉండటానికి కారణమేమిటి అనే సందేహం రావచ్చు. దానికి సమాధానం ఏమిటంటే వారు తామున్న స్థితిలో ఆ నేరాలు చేస్తే అవి ఇంకా ఘోర నేరాలుగా పరిగణించబడతాయి. యువకులకయినా, వృద్ధులకయినా వ్యభిచారం అనేది పాపమే. కాని ఒక వృద్ధుడు ఆ పని చేస్తే అది ఘోరాతిఘోర నేరంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే వృద్ధాప్యంలో వ్యభిచరించటమనేది మనిషిలోని చిత్తచాంచల్యాన్ని, దైవం పట్ల నిర్భీతిని సూచిస్తుంది. అదేవిధంగా అబద్ధం చెప్పటమనేది ప్రతి ఒక్కరికీ నిషిద్ధమే. కాని సత్యాన్ని, న్యాయాన్ని కాపాడవలసిన రాజే ధర్మాసనంపై కూర్చొని అబద్ధం చెబితే అది మరింత లజ్జావిహీనమైన విషయం అనిపించుకుంటుంది. రాజుకు సర్వాధికారాలూ ఉంటాయి. అతను ఎవరికైనా భయపడి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండదు. అయినా కూడా అతను అబద్ధం చెబుతున్నాడంటే అది అతని నీతి మాలినతనానికి అద్దం పడుతుంది.
అదేవిధంగా గర్వాహంకారాలనేవి మానవుల్లో ఎవరికీ శోభించవు. కాని అదే పూటకు కూడా గతిలేని ఓ కటిక దరిద్రుడు అహంకారాన్ని ప్రదర్శిస్తే అది ఇంకా దారుణం. వాస్తవానికి అతను దైవం విషయంలోనే నిరపేక్షాభావాన్ని కనబరుస్తున్నాడు. అది చాలా ప్రమాదకరమైన విషయం.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|72. గర్వాహంకారాలను ప్రదర్శించటం నిషిద్ధం|హదీసు 617
హదీసు 618
وعنه قَالَ: قَالَ رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"قَالَ اللَّه عزَّ وجلَّ: العِزُّ إِزاري، والكِبْرياءُ رِدَائِي، فَمَنْ يُنَازعُني في واحدٍ منهُما فقدْ عذَّبتُه"رواه مسلم.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ దేవుడు ఇలా అంటున్నాడని తెలియజేశారు : గౌరవం నా అంగవస్త్రం. అహంకారం నా దుప్పటి. ఎవరయినా వాటిని లాక్కోవాలని ప్రయత్నిస్తే నేనతణ్ణి శిక్షిస్తాను. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని సత్కార్యాల ప్రకరణం, సుననె ఇబ్నె మాజాలోని ఐహిక అనాసక్తత ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Allah, the Exalted says: `Honour is My Izar and Pride is My Cloak. Whoever vies with Me regarding one of them, shall be tormented.”’[Muslim].
ముఖ్యాంశాలు
ఇక్కడ 'లాక్కోవట'మంటే అలాంటి దైవిక గుణాల్ని తాము అవలంబించటానికి ప్రయత్నించటం అని అర్థం. అధికారం, ఆధిక్యతలు, గర్వాహంకారాలు సకల లోకాలకూ ప్రభువైన అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. మానవుల్లో ఎవరికయినా కొద్దో గొప్పో అధికారం, ఆధిక్యతలు లభించాయంటే అవి దైవప్రసాదితాలే. అందుకు వారు దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలిగాని తలబిరుసుతనానికి పాల్పడకూడదు. పరలోకంలో తలబిరుసులకు నరకమే నివాస స్థలం!
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|72. గర్వాహంకారాలను ప్రదర్శించటం నిషిద్ధం|హదీసు 618
హదీసు 619
وعنْه أَنَّ رسولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "بيْنَمَا رَجُلٌ يَمْشِي في حُلَّةٍ تُعْجِبُه نفْسُه، مرَجِّلٌ رأسَه، يَخْتَالُ فِي مَشْيَتِهِ، إِذْ خَسَفَ اللَّهُ بِهِ، فَهُوَ يَتَجَلْجَلُ في الأَرْضِ إِلَى يوْمِ القِيامةِ" متفقٌ عَلَيْهِ. "مُرجِّلٌ رَأْسَهُ"أَي: مُمَشِّطُهُ."يَتَجلْجَلُ"بالجيمين: أَيْ: يغُوصُ وينْزِلُ.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం: పూర్వం ఒకడు ఖరీదైన బట్టలు ధరించి అహంకారంతో, చక్కగా తల దువ్వుకొని నిక్కుతూ నడవసాగాడు. అంతలో దేవుడు అతణ్ణి భూమిలోకి దిగదోశాడు. ఇక అతను ప్రళయదినం వరకూ అలా భూమిలోకి దిగబడిపోతూనే ఉంటాడు. (బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలలోని వస్త్రధారణ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “While a man was walking, dressed in clothes admiring himself, his hair combed, walking haughtily when Allah caused the earth to swallow him. Now he will continue to go down in it (as a punishment) until the Day of Resurrection.”[Muslim].
ముఖ్యాంశాలు
ఈ హదీసు మనిషి తన ఠీవిని, సౌందర్యాన్ని చూసుకొని మిడిసిపాటుకు లోనుకాకూడదని, పైగా దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మసలుకోవాలని ప్రబోధిస్తోంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|72. గర్వాహంకారాలను ప్రదర్శించటం నిషిద్ధం|హదీసు 619
హదీసు 620
وعن سَلَمَة بنِ الأَكْوع رضيَ اللَّه عنه قَالَ: قَالَ رسُولُ اللِّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لاَ يزَالُ الرَّجُلُ يَذْهَبُ بِنفْسِهِ حَتَّى يُكْتَبَ في الجَبَّارينَ، فَيُصِيبُهُ مَا أَصابَهمْ" رواهُ الترمذي وقال: حديث حسن. "يَذْهَبُ بِنَفْسِهِ"أَي: يَرْتَفعُ وَيَتَكَبَّرُ.
హజ్రత్ సలమా బిన్ అక్వా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు : మనిషి ఎల్లప్పుడూ అహంకారాన్ని ప్రదర్శిస్తూపోతే చివరికి అతను తలబిరుసుల జాబితాలో నమోదుచేయబడతాడు. ఆ తరువాత ఇతనికి కూడా వారికి పట్టిన గతే పడుతుంది. (తిర్మిజీ దీనిని ఉల్లేఖించి 'హసన్'గా పేర్కొన్నారు).
(సుననె తిర్మిజీలోని సత్కార్యాలు – సత్సంబంధాల ప్రకరణం)
English
Salamah bin Al-Akwa` (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Man continues to display haughtiness and arrogance until he is recorded among the arrogant and will be therefore afflicted with what afflicts them.”[At-Tirmidhi].
ముఖ్యాంశాలు
మంచివారి అలవాట్లను, సద్గుణాలను అవలంబించటం అభిలషమైనట్లే చెడ్డవారి చెడు విధానాలను, వారి దుర్గుణాలను అవలంబించటం కూడా అత్యంత అసహ్యకరం. మనిషి ఎలాంటి వారి పోకడలను అనుసరిస్తాడో అంతిమంగా అతను వారి వర్గంలోనే చేరతాడు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|72. గర్వాహంకారాలను ప్రదర్శించటం నిషిద్ధం|హదీసు 620
You must be logged in to post a comment.