హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 71. తోటి విశ్వాసుల పట్ల నమ్రత

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 71వ అధ్యాయం: తోటి విశ్వాసుల పట్ల నమ్రతతో, అణకువతో వ్యవహరించాలి. ఈ అధ్యాయంలో 5 ఖుర్ఆన్ ఆయతులు, 10 హదీసులు (హదీసు 602 – 611) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

71. తోటి విశ్వాసుల పట్ల నమ్రతతో, అణకువతో వ్యవహరించాలి

↑ విషయ సూచిక

باب التواضع وخفض الجناح للمؤمنين

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు :

{وَاخْفِضْ جَنَاحَكَ لِمَنِ اتَّبَعَكَ مِنَ الْمُؤْمِنِينَ} [الشعراء:٢١٥]

"ప్రవక్తా! విశ్వాసులలో నిన్ను అనుసరించేవారిపట్ల మృదువుగా మెలగు." (అష్ షుఅరా : 215)

{يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا مَنْ يَرْتَدَّ مِنْكُمْ عَنْ دِينِهِ فَسَوْفَ يَأْتِي اللَّهُ بِقَوْمٍ يُحِبُّهُمْ وَيُحِبُّونَهُ أَذِلَّةٍ عَلَى الْمُؤْمِنِينَ أَعِزَّةٍ عَلَى الْكَافِرِينَ} [المائدة: ٥٤]

"విశ్వాసులారా! మీలో ఎవరైనా తమ ధర్మం నుండి వైదొలగిపోతే (పోవచ్చు). అల్లాహ్ ఇంకా ఎంతోమందిని సృష్టిస్తాడు. అల్లాహ్ వారిని ప్రేమిస్తాడు. వారు అల్లాహ్‌ను ప్రేమిస్తారు. వారు విశ్వాసుల పట్ల మృదువుగానూ, అవిశ్వాసుల పట్ల కఠినంగానూ ప్రవర్తిస్తారు." (అల్ మాయిదా : 54)

{يَا أَيُّهَا النَّاسُ إِنَّا خَلَقْنَاكُمْ مِنْ ذَكَرٍ وَأُنْثَى وَجَعَلْنَاكُمْ شُعُوباً وَقَبَائِلَ لِتَعَارَفُوا إِنَّ أَكْرَمَكُمْ عِنْدَ اللَّهِ أَتْقَاكُمْ} [الحجرات: ١٣]

"మానవులారా! మేము మిమ్మల్ని ఒకే పురుషుని నుండి, ఒకే స్త్రీ నుండి సృజించాము. తరువాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగానూ, తెగలుగానూ చేశాము. వాస్తవానికి మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవపాత్రుడు." (అల్ హుజురాత్ : 13)

{فَلا تُزَكُّوا أَنْفُسَكُمْ هُوَ أَعْلَمُ بِمَنِ اتَّقَى} [النجم:٣٢]

"మీరు మీ పవిత్రతను గురించి గొప్పలు చెప్పుకోకండి. నిజమైన భయభక్తులు గలవాడెవడో అయనకు బాగా తెలుసు." (అన్ నజ్మ్ : 32)

"ఆరాఫ్ జనులు ప్రతి ఒక్కణ్ణీ అతని ముఖాకృతిని బట్టి గుర్తుపడతారు. స్వర్గవాసులను పిలిచి, 'మీకు శాంతి కలుగుగాక!' అని అంటారు. వారు స్వర్గంలోకి ప్రవేశించనేలేదు. కాని దానిని ఆశిస్తున్నారు. వారి దృష్టి నరకవాసుల వైపునకు మళ్ళినప్పుడు ఇలా అంటారు, "ప్రభూ! మమ్మల్ని మటుకు ఈ దుర్మార్గులలో చేర్చకు."

{وَنَادَى أَصْحَابُ الأَعْرَافِ رِجَالاً يَعْرِفُونَهُمْ بِسِيمَاهُمْ قَالُوا مَا أَغْنَى عَنْكُمْ جَمْعُكُمْ وَمَا كُنْتُمْ تَسْتَكْبِرُونَ أَهَؤُلاءِ الَّذِينَ أَقْسَمْتُمْ لا يَنَالُهُمُ اللَّهُ بِرَحْمَةٍ ادْخُلُوا الْجَنَّةَ لاَ خَوْفٌ عَلَيْكُمْ وَلا أَنْتُمْ تَحْزَنُونَ} [الأعراف:٤٨-٤٩]

తరువాత ఎత్తైన ప్రదేశాలలో ఉన్న ఈ (ఆరాఫ్) ప్రజలు నరకంలో ఉన్న కొందరు పెద్ద మనుషులను వారి ఆనవాళ్ళ ద్వారా గుర్తుపట్టి ఇలా అంటారు: "చూశారా మీరూ, మీ అనుచర వర్గాలుగానీ, మీరు గొప్పగా భావించిన ఆస్తిపాస్తులుగానీ, ఈ రోజు మీకు ఏ విధంగానూ పనికిరాలేదుగదా! మీరు "వీరికి అల్లాహ్ తన కారుణ్యాన్ని ఏమాత్రం ప్రసాదించడు" అని ప్రమాణాలు చేసి అంటూ ఉండిన వారే కదా ఈ స్వర్గవాసులు. ఈ రోజు వారితోనే "స్వర్గంలోకి ప్రవేశించండి. మీకు భయంగాని, దుఃఖంగాని లేదు" అని అనటం జరిగింది." (అల్ ఆరాఫ్ : 48 – 49)

వివరణ

మొదటి రెండు సూక్తుల్లో విశ్వాసుల పట్ల మృదువుగా వ్యవహరించాలని ఆదేశించబడింది. మూడో సూక్తిలో – మీ అందరి మూలం ఒక్కటే. మీరంతా ఆది దంపతులైన ఆదం హవ్వాల సంతానమే. కనుక కులగోత్రాలు, వంశప్రాతిపదికలపై మీలో ఎవరికీ ఎవరి మీదా ఎలాంటి విశిష్ఠత లేదు. ఈ తెగలు, వంశాలు పరస్పర పరిచయాల కోసం పుట్టుకొచ్చినవేగాని ఒకరిమీద ఒకరు గర్వాన్ని, పొగరుమోతుతనాన్ని ప్రదర్శించటానికి, బీరాలు పోవటానికి ఏర్పడినవి కావు. అల్లాహ్ దృష్టిలో వంశాలకు, తెగలకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. ఆయన దృష్టిలో విశ్వాసం, ధర్మపరాయణతలు మాత్రమే విలువైనవి. ఎవరిలో ఎంత విశ్వాసం, మరెంత దైవభీతి అయితే ఉంటాయో వారు అంత గౌరవవంతులుగా భావింపబడతారు. ఈ సుగుణాలు లేని వ్యక్తిని అతని కులగోత్రాలు, వంశప్రతిష్ఠలు దేవుని సమక్షంలో అతణ్ణి గౌరవవంతునిగా నిలబెట్టలేవు – అని (మూడో సూక్తిలో) చెప్పబడింది.

చివరి సూక్తిలో ఆరాఫ్ వాసుల ప్రస్తావన వచ్చింది. స్వర్గానికి – నరకానికి మధ్యలో ఒక గోడ లేక ఒక ప్రత్యేకమైన చోటు ఉంది. దాన్నే ఆరాఫ్ అని అంటారు. ఎవరి సత్కర్మలు, దుష్కర్మలు సమానంగా ఉంటాయో వారు ఈ ప్రదేశంలో తాత్కాలికంగా ఉంటారు. అక్కణ్ణుంచి నరకవాసుల కష్టాలను, స్వర్గవాసుల సుఖాలను తిలకిస్తూ ఉంటారు. ప్రపంచంలో తమ అండదండల్ని చూసుకొని గర్వం ప్రదర్శిస్తూ ముస్లింల పేదరికాన్ని, వెనకబాటుతనాన్ని హేళనచేస్తూ, "వీరికి దైవకారుణ్యం లభించదు" అని పగలబడి నవ్వుకున్న పొగరుమోతుల్ని కూడా వీరు అక్కడ చూస్తారు. వారి ముఖకవళికల్ని చూసి ఆరాఫ్ వాసులు వారిని గుర్తుపడతారు. ఆ పొగరుమోతుల కళ్ళముందే నిరుపేదలు, బలహీనులైన విశ్వాసులను స్వర్గంలోకి వెళ్ళమని ఆదేశించటం జరుగుతుంది. వారు స్వర్గానికి వెళ్తారు.

దీనిద్వారా చెప్పదలచుకున్నదేమిటంటే, ప్రాపంచిక అండదండలు, అధికారం అంగబలాలు, ఐహిక సిరిసంపదలు అల్లాహ్ దగ్గర పనికిరావు. అక్కడ కేవలం విశ్వాసం మాత్రమే పనికివస్తుంది. ఆ విశ్వాసికి ప్రాపంచిక అండదండలు, ఐహిక సిరిసంపదలు లేకున్నాసరే. ఇప్పుడు దీనికి సంబంధించిన హదీసులు చూడండి :

English

“And be kind and humble to the believers who follow you.” [Ash-Shu‘arā’ 26:215]

“O you who believe! Whoever from among you turns back from his religion (Islam), Allah will bring a people whom He will love and they will love Him; humble towards the believers, stern towards the disbelievers.” [Al-Mā’idah 5:54]

“O mankind! We have created you from a male and a female, and made you into nations and tribes, that you may know one another. Verily, the most honourable of you with Allah is that (believer) who has At-Taqwa [he is one of the Muttaqun (the pious)].” [Al-Ḥujurāt 49:13]

“So ascribe not purity to yourselves. He knows best him who fears Allah and keeps his duty to Him [i.e., those who are Al-Muttaqun (the pious)].” [An-Najm 53:32]

“And the men on Al-a`raf (the wall) will call unto the men whom they would recognise by their marks, saying: `Of what benefit to you were your great numbers (and hoards of wealth), and your arrogance (against Faith)?’ Are they those, of whom you swore that Allah would never show them mercy. (Behold! It has been said to them): `Enter Jannah, no fear shall be on you, nor shall you grieve.”’ [Al-A‘rāf 7:48–49]

602

హదీసు 602

وعن عِيَاضِ بنِ حِمَارٍ رضي اللَّه عنه قَالَ: قالَ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِن اللَّه أَوحَى إِليَّ أَنْ تَواضَعُوا حَتَّى لاَ يَفْخَرَ أَحَدٌ عَلى أَحدٍ، وَلاَ يَبغِيَ أَحَدٌ عَلَى أَحَدٍ "رواه مسلم.

హజ్రత్ ఇయాజ్ బిన్ హిమార్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు : పరస్పరం అణకువతో వ్యవహరించమని, ఎవరూ ఎవరిమీదా గొప్పలు చెప్పుకోకూడదని, ఎవరూ ఎవరి మీదా అత్యాచారానికి పాల్పడకూడదని దేవుడు నన్ను వహీద్వారా ఆదేశించాడు.

(ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని స్వర్గసుఖాల ప్రకరణం)

English

`Iyad bin Himar (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Allah has revealed to me that you should humble yourselves to one another. One should neither hold himself above another nor transgress against another.”[Muslim].

ముఖ్యాంశాలు

కులగోత్రాలు, సిరిసంపదల ప్రాతిపదికపై ఒకర్ని నీచంగా భావించటం, ఒకరిపై అన్యాయానికి ఒడిగట్టడం సమంజసమైన విషయం కాదు. దేవుడు సమాజంలో ఎవరికయినా ఏదయినా గొప్ప స్థానాన్ని ప్రసాదిస్తే దానికి అతను కృతజ్ఞతలు తెలుపుకోవాలిగాని సాటి మానవులను అల్పులుగా భావించటం, వారిమీద అత్యాచారాలకు పాల్పడటం చేయరాదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|71. తోటి విశ్వాసుల పట్ల నమ్రతతో, అణకువతో వ్యవహరించాలి|హదీసు 602

603

హదీసు 603

وعَنْ أَبي هريرة رضي اللَّه عنه أَن رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَا نَقَصَتْ صَدقَةٌ مِنْ مالٍ، وَمَا زَادَ اللَّه عَبداً بِعَفوٍ إِلاَّ عِزّاً، ومَا تَوَاضَعَ أَحَدٌ للَّهِ إِلاَّ رَفَعَهُ اللَّهُ" رواه مسلم.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు)గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : దానధర్మాలు సంపదలో లోటు ఏర్పరచవు. దాసుడు మన్నింపుల వైఖరిని అవలంబిస్తే దేవుడు అతని గౌరవాన్ని ఇతోధికం చేస్తాడు. ఎవరయినా దైవం కోసం అణకువను ప్రదర్శిస్తే దేవుడు అతనికి ఔన్నత్యాన్ని ప్రసాదిస్తాడు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని సత్కార్యాల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Wealth does not diminish by giving Sadaqah (charity). Allah augments the honour of one who forgives; and one who serves another seeking the pleasure of Allah, Allah will exalt him in ranks.”[Muslim].

ముఖ్యాంశాలు

దానధర్మాల వల్ల సంపద పైకి తరిగిపోతున్నట్లు కనిపిస్తుంది. కాని కొన్ని సందర్భాల్లో అల్లాహ్ దానికి ప్రతిఫలంగా మరింత సంపదను ప్రసాదిస్తాడు. ఒకవేళ సంపదలో వృద్ధి జరిగినా జరగకపోయినా పరలోకంలో మాత్రం అందుకు గొప్ప ప్రతిఫలాన్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. అలా జరిగితే ఆ సంపదలో ఏర్పడిన లోటు పూర్తయినట్లే కదా!

లేదా ఈ హదీసుకు భావం, మిగతా సంపదలో అల్లాహ్ శుభాన్ని ప్రసాదించి సంపద తరిగినట్లు కనిపించకుండా చేస్తాడని కావచ్చు.

మృదుత్వాన్ని, మన్నింపుల వైఖరిని అవలంబిస్తే జనం తమను తక్కువగా అంచనా వేస్తారనీ, తాము వారికి లోకువ అయిపోతామని భావిస్తారు సాధారణంగా మనుషులు. కాని దైవప్రవక్త ﷺ చెబుతున్నారు – ఈ వైఖరిని గనక అవలంబిస్తే అంతిమంగా గౌరవమర్యాదలే లభిస్తాయి. జనం తమను మునుపుకంటే ఎక్కువగా గౌరవించటం మొదలుపెడతారు. ఇకపోతే పరలోకంలో ఉన్నత స్థానాలు ఎలాగూ దక్కుతాయి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|71. తోటి విశ్వాసుల పట్ల నమ్రతతో, అణకువతో వ్యవహరించాలి|హదీసు 603

604

హదీసు 604

وعن أَنس رضي اللَّه عنه أَنَّهُ مَرَّ عَلَى صِبيانٍ فَسَلَّم عَلَيْهِم وقال: كَانَ النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَفْعَلُهُ. متفقٌ عَلَيْهِ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఓసారి కొంత మంది పిల్లల సమీపం నుంచి వెళ్తూ వారికి సలాం చేసి, దైవప్రవక్త ﷺ కూడా ఇలాగే (చిన్నపిల్లలకు) సలాం చేసేవారని చెప్పారు. (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని ఇస్తీజాన్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని సలాం ప్రకరణం)

English

Anas (radiyallahu anhu) passed by some children and greeted them (by saying As-salamu `alaikum to them). Then he said: The Prophet ﷺ used to do the same.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

చిన్న పిల్లలకు సలాం చెయ్యటమనేది మనిషిలోని నమ్రతా భావాన్ని సూచిస్తుంది. దైవప్రవక్త ﷺ ఎప్పుడయినా చిన్నపిల్లలు ఎదురయితే తానే ముందుగా వారికి సలాం చేసేవారు. ఇస్లాం ధర్మం మనిషి తన ఇంటికి వెళ్ళినప్పుడు తన ఆలుబిడ్డలకు కూడా సలాం చెయ్యాలని ఆదేశిస్తోంది. అంతేకాదు తన అధీనంలో ఉన్నవారికి, నౌకర్లకు, సేవకులకు కూడా సలాం చెయ్యాలి. ఇతరులకు సలాం చెయ్యనివారు గర్వానికి లోనయి ఉన్నారని గ్రహించాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|71. తోటి విశ్వాసుల పట్ల నమ్రతతో, అణకువతో వ్యవహరించాలి|హదీసు 604

605

హదీసు 605

وعنه قَالَ: إِنْ كَانَتِ الأَمَةُ مِن إِمَاءِ أهل المَدِينَةِ لَتَأْخُذُ بِيَدِ النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَتَنْطَلِقُ بِهِ حَيثُ شَاءَتْ. رواه البخاري.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : మదీనాలోని దాసీలలో ఎవరయినా దైవ ప్రవక్త ﷺను ఆయన చెయ్యిపట్టుకొని తాము కోరిన చోటుకి తీసుకెళ్ళగలిగేవారు. (అంతటి మృదు స్వభావి ఆయన). (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని సంస్కార ప్రకరణం)

English

Anas bin Malik (radiyallahu anhu) reported: A slave-girl of Al-Madinah would take hold of the hand of the Prophet ﷺ and take him wherever she desired.[Al-Bukhari].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|71. తోటి విశ్వాసుల పట్ల నమ్రతతో, అణకువతో వ్యవహరించాలి|హదీసు 605

606

హదీసు 606

وعن الأسوَد بنِ يَزيدَ قَالَ: سُئلَتْ عَائِشَةُ رضيَ اللَّه عنها: مَا كانَ النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَصنعُ فِي بَيْتِهِ؟ قالت: كَانَ يَكُون في مِهْنَةِ أَهْلِهِ يَعني: خِدمَةِ أَهلِه فإِذا حَضَرَتِ الصَّلاة، خَرَجَ إِلى الصَّلاةِ، رواه البخاري.

హజ్రత్ అస్వద్ బిన్ యజీద్ (రహిమహుల్లాహ్) కథనం : దైవప్రవక్త ﷺ ఇంట్లో ఏం చేసేవారని ఆయిషా (రదియల్లాహు అన్హా)ను అడగ్గా, "ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి పనుల్లో నిమగ్నులై ఉండేవారు, కాని నమాజ్‌కు వేళ అవగానే లేచి నమాజ్‌కు వెళ్ళిపోయే వారు" అని చెప్పారామె. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని అజాన్ ప్రకరణం)

English

Al-Aswad bin Yazid (radiyallahu anhu) reported: `Aishah (radiyallahu anha) was asked: “What did Messenger of Allah ﷺ used to do inside his house?” She answered: “He used to keep himself busy helping members of his family, and when it was the time for Salat (the prayer), he would get up for prayer.”[Al-Bukhari].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో కూడా దైవప్రవక్త ﷺ గారి పరిపూర్ణ అణకువ భావం వివరించబడింది. చాలామంది పురుషులు ఇంటిపనుల్లో తమ భార్యలకు లేక ఇంటి ఆడవాళ్ళకు సహాయం చేయటాన్ని అవమానకరంగా, తమ కీర్తికి కళంకంగా భావిస్తారు. ఈ వైఖరి దైవప్రవక్త విధానానికి పూర్తిగా విరుద్ధం. ఇంటిపనుల్లో స్త్రీకి సహాయం చేయటం కూడా దైవప్రవక్త గారి ఆదర్శ సంప్రదాయమే. ఇందులో అవమానాన్ని ఊహించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇంటి పనుల్లోనే పూర్తిగా మునిగిపోయి నమాజును సైతం మర్చిపోవటం కూడా మంచిపద్ధతి కాదు. నమాజ్ వేళ అవగానే పురుషులు నమాజ్ కోసం మస్జిద్‌కు వెళ్ళిపోవాలి. స్త్రీలు కూడా తమకు ఎక్కడ వీలయితే అక్కడ తప్పకుండా నమాజ్ చేసుకోవాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|71. తోటి విశ్వాసుల పట్ల నమ్రతతో, అణకువతో వ్యవహరించాలి|హదీసు 606

607

హదీసు 607

وعن أَبي رِفَاعَةَ تَميم بن أُسَيدٍ رضي اللَّه عنه قَالَ: انْتَهَيْتُ إِلى رَسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وَهُوَ يَخْطُبُ. فقلتُ: يَا رسولَ اللَّه، رجُلٌ غَرِيبٌ جَاءَ يَسْأَلُ عن دِينِهِ لا يَدري مَا دِينُهُ؟ فَأَقْبَلَ عَليَّ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وتَركَ خُطْبتهُ حَتَّى انتَهَى إِليَّ، فَأُتى بِكُرسِيٍّ، فَقَعَدَ عَلَيهِ، وجَعَلَ يُعَلِّمُني مِمَّا عَلَّمَه اللَّه، ثُمَّ أَتَى خُطْبَتَهُ، فأَتمَّ آخِرَهَا. رواه مسلم.

హజ్రత్ అబూ రిఫాఅ తమీమ్ బిన్ ఉసైద్ (రదియల్లాహు అన్హు) కథనం : ఓసారి దైవప్రవక్త ﷺ ప్రసంగిస్తుండగా నేనాయన దగ్గరికి వెళ్ళి, "దైవప్రవక్తా! ఓ బాటసారి ధర్మం గురించి తెలుసుకోవాలని వచ్చాడు. అతనికి తన ధర్మమేమిటో తనకే తెలియదు" అని అన్నాను. ఆ మాట విని దైవప్రవక్త ﷺ నావైపు దృష్టి మళ్ళించారు. ప్రసంగం ఆపి నా దగ్గరికొచ్చారు. ఆయన కోసం ఓ కుర్చీ హాజరుపరచబడింది. ఆయన దానిపై కూర్చొని దేవుడు తనకు నేర్పిన విషయాలను నాకు బోధించటం మొదలుపెట్టారు. (కాసేపయిన తరువాత) మళ్ళీ ప్రసంగం చెయ్యటానికి వెళ్ళి (తాను చెప్పదలచుకున్న) మాటను పూర్తిచేశారు.

(ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జుమా ప్రకరణం)

English

Tamim bin Usaid (radiyallahu anhu) reported: I came to Messenger of Allah ﷺ while he was delivering a Khutbah and said: “O Messenger of Allah, a stranger (meaning himself) has come to inquire about his Deen. He is quite ignorant about his Deen.” Messenger of Allah ﷺ interrupted his Khutbah and turned to me. Then a chair was brought for him and he sat on it. He started instructing me what Allah had taught him. Then he resumed his Khutbah and completed it.[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|71. తోటి విశ్వాసుల పట్ల నమ్రతతో, అణకువతో వ్యవహరించాలి|హదీసు 607

608

హదీసు 608

وعن أَنسٍ رضي اللَّه عنه أَنَّ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كَانَ إِذَا أَكَلَ طَعَاماً لَعِقَ أَصابِعه الثلاثَ قَالَ: وقال: "إِذَا سَقطَتْ لُقْمَةُ أَحَدِكُمْ، فَلْيُمِطْ عَنْها الأَذى، ولْيأْكُلْها، وَلا يَدَعْها للشَّيْطَانِ" وَأَمَر أَنْ تُسْلَتَ القَصْعَةُ قالَ: "فَإِنَّكُمْ لاَ تدْرُونَ في أَيِّ طَعامِكُمُ البَركَةُ "رواه مسلم.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺఅన్నం తిన్న తరువాత తన మూడువ్రేళ్ళనూ నాక్కునేవారు. తరచూ ఇలా అంటుండేవారు: మీలో ఎవరి (చేతిలో నుంచైనా అన్నం) ముద్ద క్రిందపడిపోతే వారు దాన్ని ఎత్తుకొని శుభ్రంచేసుకొని తినాలి. అంతేగాని దాన్ని షైతాన్‌కోసం వదిలేయకూడదు."

ఇంకా దైవప్రవక్త ﷺ కంచాన్ని నాకి శుభ్రం చేసుకోవాలని ఆదేశించేవారు. "మీరు తినే భోజనంలోని ఏ భాగంలో శుభం ఉందో మీకు తెలియదు" అని అనేవారు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని అన్నపానీయాల ప్రకరణం)

English

Anas (radiyallahu anhu) reported: When the Messenger of Allah ﷺ finished eating his food, he would lick his three fingers (i.e., the forefinger, the middle finger and the thumb). He ﷺ said, “If anyone of you drops a morsel, he should remove anything harmful from it and then eat it. He should not leave it for Shaitan.” He commanded us to clean out the dish saying, “You do not know in what portion of your food the blessing lies.”[Muslim].

ముఖ్యాంశాలు

భోజనం చేసిన తరువాత కంచాన్ని, వ్రేళ్ళను నాకి శుభ్రం చేసుకోవటంలో మనిషిలోని అణకువభావం ఉట్టిపడుతుంది. అన్నం తింటున్నప్పుడు చేతిలోనుండి క్రిందపడిపోయిన ముద్దను ఎత్తుకోకపోవటం, వ్రేళ్ళను నాకి శుభ్రం చేసుకోకపోవటం, కంచంలో సగం అన్నం మెతుకులు అలాగే వదిలేయటం లాంటివి అహంకారుల చేష్టలు. అలాచేస్తే దేవుడు ప్రసాదించిన ఆహారాన్ని అగౌరవపరచినట్లవుతుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|71. తోటి విశ్వాసుల పట్ల నమ్రతతో, అణకువతో వ్యవహరించాలి|హదీసు 608

609

హదీసు 609

وعن أَبي هُريرة رضي اللَّه عنه، عن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَا بعثَ اللَّهُ نَبِيّاً إِلاَّ رَعَى الغنَمَ"قالَ أَصحابه: وَأَنْتَ؟ فَقَالَ:"نَعَمْ كُنْتُ أَرْعَاهَا عَلَى قَرارِيطَ لأَهْلِ مَكَّةَ" رواهُ البخاري.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఓసారి తన అనుచరులతో మాట్లాడుతూ, "దేవుడు పంపిన ప్రతి ప్రవక్త మేకల్ని కాసాడు" అన్నారు. ఆ మాట విని, "మీరు కూడా కాసారా?" అని అడిగారు అనుచరులు. "ఔను, నేను కూడా కొన్ని ఖీరాతుల జీతంపై మక్కావాసుల మేకల్ని కాసేవాణ్ణి" అని చెప్పారు దైవప్రవక్త ﷺ. (బుఖారీ)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “Every Prophet has tended sheep.” He was asked: “And did you?” He replied: “Yes, I tended them for a few carats for the Makkans.”[Al-Bukhari].

ముఖ్యాంశాలు

ఈ హదీసు ఇంతకుముందు 'ఏకాంతాన్ని ఆశ్రయించటం' అనే అధ్యాయంలో వచ్చింది. ఇది సదరు అధ్యాయానికి సంబంధించినది కాబట్టి దీన్ని ఇక్కడ కూడా ప్రస్తావించటం జరిగింది. ఈ హదీసు మనిషి తన కష్టార్జితాన్ని మాత్రమే అనుభవించాలనీ, ఏదో ఒక వృత్తిని చేపట్టి అందులో కష్టపడి పనిచేయటం వినమ్రుల లక్షణమని ప్రబోధిస్తోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|71. తోటి విశ్వాసుల పట్ల నమ్రతతో, అణకువతో వ్యవహరించాలి|హదీసు 609

610

హదీసు 610

وعنهُ عن النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "لَوْ دُعِيتُ إِلى كُراعٍ أَوْ ذِرَاعٍ لأَجَبْتُ. وَلَوْ أُهْدى إِليَّ ذِراعٌ أَو كُراعٌ لَقَبِلْتُ" رواهُ البخاري.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు)గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు : ఎవరయినా నన్ను (మేక మొదలగు జంతువుల) కాళ్ళు, భుజాలు (వండి) విందుకు ఆహ్వానించినా నేను వారి ఆహ్వానాన్ని అంగీకరిస్తాను. ఎవరయినా నాకు (ఆ) భుజాలు, కాళ్ళే గనక కానుకగా ఇస్తే వాటిని నేను (సంతోషంగా) స్వీకరిస్తాను. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని సమర్పణల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said: “If I am invited to a meal consisting of a sheep’s foot or shoulder, I would respond and I would accept as a gift a shoulder or a foot of a sheep.”[Al-Bukhari].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|71. తోటి విశ్వాసుల పట్ల నమ్రతతో, అణకువతో వ్యవహరించాలి|హదీసు 610

611

హదీసు 611

وعن أَنسٍ رضي اللَّهُ عنه قَالَ: كَانَتْ نَاقَةُ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم العَضْبَاءُ لاَ تُسبَقُ، أَوْ لاَ تكَادُ تُسْبَقُ، فَجَاءَ أَعْرابيٌّ عَلى قَعُودٍ لهُ، فَسبقَها، فَشَقَّ ذَلِكَ عَلى المُسْلمِينَ حَتَّى عَرفَهُ النبي صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَقَالَ: "حَقٌّ عَلى اللَّهِ أَنْ لاَ يَرْتَفِعَ شَيء مِنَ الدُّنْيَا إِلاَّ وَضَعَهُ" رواهُ البخاري.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ దగ్గర 'అజ్‌బా' అనే పేరుగల ఒక ఆడ ఒంటె ఉండేది. ఇతర ఒంటెలేవీ దాన్ని మించిపోగలిగేవి కావు. ఒకసారి ఓ పల్లెటూరి వ్యక్తి తన ఒంటెపై ప్రయాణిస్తూ వచ్చి దైవప్రవక్త ఒంటెను మించిపోయాడు. అది చూసి ముస్లింలు నిర్ఘాంతపోయారు. దైవప్రవక్త ﷺ వారి నిర్ఘాంతాన్ని చూసి, "ప్రపంచంలో ఏదయినా వస్తువు వర్ధిల్లుతుంటే దేవుడు దాన్ని (ఎప్పుడో ఒకప్పుడు) నొక్కిపెడతాడు. ఇలా చేయటం దేవుని విధి" అని అన్నారు. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని జిహాద్ ప్రకరణం)

English

Anas bin Malik (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ had a she-camel called Al-`Adba’ which would not allow any other camel to surpass her. A bedouin came riding his camel which outstripped it. The Muslims were much grieved at this. Messenger of Allah ﷺ perceived it and said, “It is Allah’s Way that he lowers whatever raises itself in the world.”[Al-Bukhari].

ముఖ్యాంశాలు

ఈ ప్రపంచంలో ఏ వస్తువూ ఎల్లకాలం ఉచ్ఛస్థితిలో ఉండలేదు. సృష్టిలోని చరాచరాలకు నిమ్నోన్నతలు, ఉచ్ఛనీచ స్థితులు, ప్రగతి అధోగతులు కాలక్రమంలో సహజంగానే సంక్రమిస్తూ వస్తున్నాయి. ఈ సృష్టిలోని ప్రతి వస్తువు – అది ఎంత గొప్పదయినాసరే; ఏదో ఒకనాడు వినాశాన్ని చవిచూడాల్సిందే. కనుక అహంకారాన్ని ప్రదర్శించటానికి, గర్వాన్ని ఒలకబోయటానికి ఈ సృష్టిలో దేనికీ అర్హత లేదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|71. తోటి విశ్వాసుల పట్ల నమ్రతతో, అణకువతో వ్యవహరించాలి|హదీసు 611