హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 67వ అధ్యాయం: ఆపదలు వచ్చిపడినప్పుడు చావుని కోరుకోవటం అవాంఛనీయం, ధర్మంలో ఉపద్రవాలు తలెత్తినప్పుడు మాత్రం అలా కోరుకోవడంలో తప్పులేదు. ఈ అధ్యాయంలో 3 హదీసులు (హదీసు 585 – 587) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
67. ఆపదలు వచ్చిపడినప్పుడు చావుని కోరుకోవటం అవాంఛనీయం, ధర్మంలో ఉపద్రవాలు తలెత్తినప్పుడు మాత్రం అలా కోరుకోవడంలో తప్పులేదు
باب كراهية تمني الموت بسبب ضرر نزل بِهِ وَلاَ بأس بِهِ لخوف الفتنة في الدين
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 585
عنْ أَبي هُريرة رضيَ اللَّهُ عنه أَنَّ رَسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ: "لا يَتَمَنَّ أَحَدُكُمُ المَوْتَ إِمَا مُحسِناً، فَلَعَلَّهُ يَزْدادُ، وَإِمَّا مُسِيئاً فَلَعَلَّهُ يَسْتَعْتِبُ "متفقٌ عَلَيْهِ، وهذا لفظ البخاري. وفي روايةٍ لمسلم عن أَبي هُريْرةَ رضي اللَّهُ عنه عَنْ رسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "لاَ يَتَمَنَّ أَحَدُكُمُ المَوْتَ، وَلا يَدْعُ بِهِ مِنْ قَبْلِ أَنْ يَأْتِيَهُ، إِنَّهُ إِذا ماتَ انْقَطَعَ عَمَلُهُ، وَإِنَّهُ لاَ يَزيدُ المُؤْمِنَ عُمْرُهُ إِلاَّ خَيراً".
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : మీలో ఎవరూ (కావాలని) చావుని కోరుకోరాదు. ఎందుకంటే ఒకవేళ అతను మంచివాడైతే (బ్రతికుంటే) మరిన్ని మంచిపనులు చేసుకోగల్గుతాడు! లేదా అతను చెడ్డవాడయినా (మున్ముందు) పశ్చాత్తాపం చెందగలడు!
(బుఖారీ – ముస్లిం)
ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారి కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: మీలో ఎవరూ చావుని కోరుకోరాదు. అది రాకమునుపే దానికోసం ప్రార్థించరాదు. ఎందుకంటే చావుతోటే అతని కర్మల పరంపర ఆగిపోతుంది. ఒక విశ్వాసి ఆయుష్షు పెరిగితే దాని వల్ల అతనికి లాభమే (గాని నష్టం లేదు).
(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలలోని ప్రార్థనల ప్రకరణాలు)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “None of you should wish for death. If he is righteous, perhaps he may add to (his) good works, and if he is a sinner, possibly he may repent (in case he is given a longer life).”[Al-Bukhari].
In Muslim, Abu Hurairah (radiyallahu anhu) reported : Messenger of Allah ﷺ said, “Let none of you wish for death, nor he ask for it before it comes to him, because when he dies, his actions will be terminated; certainly the age of a (true) believer does not add but good.”
ముఖ్యాంశాలు
పై రెండు హదీసులు మనిషి చావుని కోరుకోరాదని చెబుతున్నాయి. విశ్వాసులైన వారికి ఎక్కువ ఆయుష్షు లభిస్తే అది వారికి అన్నివిధాలా ప్రయోజనకరమే. విశ్వాసులు ఎంత ఎక్కువ కాలం బ్రతికితే అన్ని ఎక్కువ పుణ్యకార్యాలు చేసుకుంటారు. ఒకవేళ పొరపాటున ఏదైనా తప్పు జరిగిపోయినా తిరిగి పశ్చాత్తాపం చెందుతారు. కనుక విశ్వాసులు తమకు లభించిన ఆయుష్షును సువర్ణావకాశంగా భావించి వీలైనంత ఎక్కువగా పుణ్యాలు చేసుకోవటానికి ప్రయత్నించాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|67. ఆపదలు వచ్చిపడినప్పుడు చావుని కోరుకోవటం అవాంఛనీయం, ధర్మంలో ఉపద్రవాలు తలెత్తినప్పుడు మాత్రం అలా కోరుకోవడంలో తప్పులేదు|హదీసు 585
హదీసు 586
وعن أنسٍ رضي اللَّه عنه قَالَ: قالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: لا يَتَمَنَّيَنَّ أَحَدُكُمُ المَوْتَ لِضُرٍّ أَصَابَهُ فَإِنْ كانْ لابُدَّ فاعِلاَ، فَلْيَقُل: اللَّهُمَّ أَحْيِني مَا كانَتِ الحَياةُ خَيْراً لِي، وتَوَفَّني إِذا كانَتِ الوفاةُ خَيراً لي" متفقٌ عليه.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : మీలో ఎవరూ కూడా తనకేదయినా నష్టం కలిగినప్పుడు చావుని కోరుకోరాదు. గత్యంతరం లేదనుకుంటే ఇలా వేడుకోవాలి :
"అల్లాహుమ్మ అహ్యినీ మాకానతిల్ హయాతు ఖైరన్ లీ, వ తవప్ఫనీ ఇజా కానతిల్ వఫాతు ఖైరన్ లీ." "దేవా! జీవితం నా పాలిట ప్రయోజనకరమైనంతవరకూ నన్ను సజీవంగా ఉంచు, ఒకవేళ మరణమే నాకోసం మేలయితే అప్పుడు నాకు మరణాన్ని ప్రసాదించు."
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని వ్యాధిగ్రస్తుల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని ప్రార్థనల ప్రకరణం)
English
Anas bin Malik (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Let none of you wish for death on account of an affliction that befalls him. If he has no alternative, let him pray: `Allahumma ahyine ma kanatil-hayatu khairan li, wa tawaffani idha kanatil-wafatu khairan li (O Allah! Give my life so long as the life is good for me, and take away my life if death is good for me)’.”[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|67. ఆపదలు వచ్చిపడినప్పుడు చావుని కోరుకోవటం అవాంఛనీయం, ధర్మంలో ఉపద్రవాలు తలెత్తినప్పుడు మాత్రం అలా కోరుకోవడంలో తప్పులేదు|హదీసు 586
హదీసు 587
وعَنْ قَيسِ بنِ أَبي حازمٍ قَالَ: دَخَلْنَا عَلى خَباب بنِ الأَرَتِّ رضيَ اللَّهُ عنهُ نَعُودُهُ وَقَدِ اكْتَوى سَبْعَ كَيَّاتٍ فَقَالَ: إِنَّ أَصْحابنا الَّذِينَ سَلَفُوا مَضَوْا، ولَم تَنْقُصْهُمُ الدُّنْيَا، وإِنَّا أَصَبْنَا مَا لاَ نجِدُ لَهُ مَوْضِعاً إِلاَّ الترابَ ولَوْلاَ أَنَّ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم نهانَا أَنْ نَدْعُوَ بالمَوْتِ لَدَعَوْتُ بِهِ ثُمَّ أَتَيْنَاهُ مَرَّةً أُخْرَى وهُوَ يَبْني حَائِطاً لَهُ، فَقَالَ: إِنَّ المُسْلِمَ لَيُؤْجَرُ فِي كُلِّ شَيءٍ يُنْفِقُهُ إِلاَّ فِي شَيءٍ يَجْعَلُهُ في هَذَا الترابِ. متفقٌ عَلَيْهِ، وهذا لفظ رواية البخاري.
హజ్రత్ ఖైస్ బిన్ అబూ హాజిం (రహిమహుల్లాహ్) కథనం: మేము ఖబ్బాబ్ బిన్ అరత్ (రదియల్లాహు అన్హు)ని పరామర్శించేందుకు ఆయన ఇంటికి వెళ్ళాం. ఆ సమయంలో ఆయన (ఏదో వ్యాధికి చికిత్సగా) ఏడు వాతలు పెట్టించుకొని వున్నారు. అప్పుడాయన మాతో మాట్లాడుతూ ఇలా అన్నారు :
"మన పూర్వీకులైన సహచరులు గతించిపోయారు. వారు ప్రపంచంలో జీవించినా వారి పుణ్యంలో మాత్రం ఎలాంటి లోటు ఏర్పడలేదు. (కారణం వారు ఇహలోకపు భాగ్యాల్ని అనుభవించలేదు). కాని ఇప్పుడు మనకు ఎన్నో సిరిసంపదలు కలిగాయి. వాటిని భవన నిర్మాణాల్లో ఉపయోగించటం తప్ప ఖర్చుపెట్టటానికి మనకు వేరే మార్గం కనిపించటం లేదు. దైవప్రవక్త ﷺ చావును కోరుకోవద్దని మనకు తాకీదు చేశారు. లేకపోతే నేను తప్పకుండా చావుని కోరుకునేవాణ్ణి."
రెండోసారి మేమాయన్ని పరామర్శించటానికి వెళ్ళినప్పుడు ఆయన ఏదో గోడ కట్టే పనిలో ఉన్నారు. మమ్మల్ని చూసి ఆయన, "విశ్వాసి దేనికోసం డబ్బు ఖర్చుపెట్టినా అతనికి పుణ్యం లభిస్తుంది. కాని ఈ మట్టి (నిర్మాణాల) కోసం ఖర్చుపెడితే మాత్రం అతనికి పుణ్యం లభించదు" అని అన్నారు.
(బుఖారీ – ముస్లిం, వాక్యాలు బుఖారీవి).
(సహీహ్ బుఖారీలోని వ్యాధిగ్రస్తుల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని దైవధ్యానం, ప్రార్థనల ప్రకరణం).
English
Qais bin Abu Hazim (radiyallahu anhu) reported: I went to visit Khabbab bin Aratt (radiyallahu anhu) during his illness. He had been cauterized in seven places. He said: “Our companions who have died have left (this world) without having enjoyed the pleasures of the world (in order to get a great full reward in the Hereafter) while we have amassed wealth exceeding our needs for which there is no place to keep except in the earth. Had Messenger of Allah ﷺ not prohibited us from longing for death, I would have prayed for it.” Then we visited him again and he was building a wall. He said: “There is a reward in store for a Muslim in respect of everything on which he spends except for something he places in the earth (i.e., something exceeding our needs or essentials).”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
పూర్వ కాలంలో కొన్ని రోగాలకు చికిత్స నిమిత్తం శరీరంమీద వాతలు పెట్టించుకునేవారు. సదరు హదీసులో దైవప్రవక్త అనుచరులు ఖబ్బాబ్ (రదియల్లాహు అన్హు) కూడా తన శరీరం మీద ఏడుచోట్ల వాతలు పెట్టించుకున్నారని తెలుస్తోంది. అయితే చికిత్స నిమిత్తమయినా ఈ విధంగా శరీరం మీద వాతలు పెట్టటం ఎంతవరకు సమంజసం? దీనిగురించి దైవప్రవక్త ﷺ బోధనలు చెప్పేదేమిటంటే ఇతర చికిత్సావిధానాలు, మందులు ఉన్నప్పుడు ఈ విధంగా శరీరం మీద వాతలుపెట్టే చికిత్సను ఆశ్రయించకుండా ఉండటమే మంచిది.
"ఈ మట్టికోసం ఖర్చుపెడితే పుణ్యం లభించదు" అంటే అవసరానికి మించి భవన నిర్మాణపు పనుల్లో డబ్బు ఖర్చుపెడితే దానివల్ల పుణ్యం లభించదని భావం. మనిషికి తలదాచుకోవటానికి, ఎండకు వానకు చలికి తట్టుకోవటానికి, క్రూరమృగాల నుంచి సురక్షితంగా ఉండటానికి ఒక ఇల్లు ఎంతైనా అవసరం. అది మనిషి జీవితపు కనీస అవసరం. కనుక పై హదీసులో వచ్చిన హెచ్చరిక కేవలం అవసరానికి మించిన భవన నిర్మాణాలపై అవసరానికి మించి ఖర్చు చేయటానికి మాత్రమే సంబంధించినది. శోచనీయమైన విషయం ఏమిటంటే ఈ రోజుల్లో ముస్లింల సంపద మొత్తం వివాహ వేడుకల సందర్భంగా అనవసరమైన ఆచారాల పేరిట దుబారాగా ఖర్చవుతోంది లేదా పెద్ద పెద్ద భవంతులు, ఎత్తయిన మేడలు కట్టడంలో ఖర్చవుతోంది!
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|67. ఆపదలు వచ్చిపడినప్పుడు చావుని కోరుకోవటం అవాంఛనీయం, ధర్మంలో ఉపద్రవాలు తలెత్తినప్పుడు మాత్రం అలా కోరుకోవడంలో తప్పులేదు|హదీసు 587
You must be logged in to post a comment.