హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 66. పురుషులు సమాధుల్ని సందర్శించటం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 66వ అధ్యాయం: పురుషులు సమాధుల్ని సందర్శించటం గురించి. ఈ అధ్యాయంలో 4 హదీసులు (హదీసు 581 – 584) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

66. పురుషులు సమాధుల్ని సందర్శించటం గురించి…..

↑ విషయ సూచిక

باب استحباب زيارة القبور للرجال وما يقوله الزائر

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

581

హదీసు 581

عن بُرَيْدَةَ، رضي اللَّهُ عنه، قَالَ: قالَ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "كُنْتُ نَهَيْتُكُمْ عَنْ زِيارَة القُبُورِ فَزُوروها" رواهُ مسلم. وفي رواية "فَمَنْ أرَادَ أنْ يَزُورَ القبور فليزر فإنها تذكرنا بالآخرة".

హజ్రత్ బురైదా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఓసారి ప్రజలతో ఇలా అన్నారు : ఇంతకు ముందు నేను మిమ్మల్ని సమాధులను సందర్శించవద్దని వారించేవాణ్ణి. కాని ఇప్పుడు చెబుతున్నాను. మీరు సమాధులను సందర్శించండి. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జనాయెజ్ ప్రకరణం)

English

Buraidah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “(In the past) I forbade you from visiting graves, but visit them now.”

In another narration Messenger of Allah ﷺ said, “Whoever wants to visit a graveyard, let him do so, because it reminds us of the Hereafter.”[Muslim].

ముఖ్యాంశాలు

ఇస్లాం ఆవిర్భవించిన తొలినాళ్ళలో దైవప్రవక్త ﷺ తన అనుచరులను సమాధుల్ని సందర్శించవద్దని వారించారు. అనుచరులు క్రొత్తగా ఇస్లాం స్వీకరించిన వారవటంచేత సమాధులను సందర్శించినప్పుడు అజ్ఞానకాలపు భావోద్రేకాలకు లోనయి షరీఅత్‌కు విరుద్ధమయిన పనులు చేస్తారేమోనని ఆయన తల్లడిల్లేవారు. అయితే ఆ తరువాతి కాలంలో వారు ఇస్లామీయ సూత్రాల్ని బాగా ఆకళింపు చేసుకొని నికార్సయిన ముస్లింలుగా పరిణతిచెందిన తరువాత ఆయనకు ఆ భయం వీడిపోయింది. అప్పుడాయన తన అనుచరులు సమాధుల్ని సందర్శించేందుకు అనుమతినిచ్చారు. పైగా తరచూ సందర్శిస్తూ ఉండాలని తాకీదు చేశారు. తామూ ఏదో ఒకనాడు మరణించేవారమేనన్న భావన ప్రజల మనోమస్తిష్కాలలో మెదులుతూ ఉండాలన్నదే ఆయన ప్రవచనంలోని ఉద్దేశ్యం.

ఇకపోతే స్త్రీలు సమాధుల్ని సందర్శించవచ్చా లేదా? అన్న విషయంలో పండితులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వాటిలో అన్నిటికన్నా సహేతుకమైన విషయం ఏమిటంటే, స్త్రీలు కూడా సమాధుల్ని సందర్శించవచ్చు. అయితే వారు అక్కడికి వెళ్ళి షరీఅత్‌కు విరుద్ధమైన అవాంఛనీయ చేష్టలకు పాల్పడకుండా జాగ్రత్తపడాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|66. పురుషులు సమాధుల్ని సందర్శించటం గురించి…..|హదీసు 581

582

హదీసు 582

وعن عائشَةَ رضي اللَّهُ عنها قَالَتْ: كَانَ رسُولُ اللَّهِ، صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، كُلَّما كَانَ لَيْلَتها منْ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَخْرُجُ مِنْ آخِرِ اللَّيْلِ إِلى البَقِيعِ، فَيَقُولُ: "السَّلامُ عَلَيْكُمْ دَارَ قَوْمٍ مُؤمِنينَ، وأَتَاكُمْ مَا تُوعَدُونَ، غَداً مُؤَجَّلُونَ، وإِنَّا إِنْ شَاءَ اللَّهُ بِكُمْ لاحِقُونَ، اللَّهُمَّ اغْفِرْ لأَهْلِ بَقِيعِ الغَرْقَدِ" رواهُ مسلم.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త ﷺతో నా దాంపత్య వంతు వచ్చిన ప్రతి రాత్రి ఆఖరి జాములో ఆయన 'బఖీ' శ్మశానానికి వెళ్ళి ఇలా ప్రార్థించేవారు :

"అస్సలాము అలైకుమ్ దార ఖౌమిన్ మూమినీన్ వ ఆతాకుమ్ మా తూఅదూన, గదన్ ముఅజ్జలూన వ ఇన్నా ఇన్‌షా అల్లాహు బికుమ్ లాహిఖూన, అల్లాహుమ్మగ్‌ఫిర్ లి అహ్లి బఖీయిల్ గర్‌ఖద్."

ఓ ముస్లిం వాడ ప్రజలారా! మీకు శాంతి కల్గుగాక! మీతో వాగ్దానం చేయబడిన రేపటి దినం వచ్చేసింది. దైవం తలిస్తే మేము కూడా మిమ్మల్ని కలుసుకుంటాం. దేవా! బఖీవాసులను క్షమించు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జనాయెజ్ ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha): reported Whenever it was her turn to spend with Messenger of Allah ﷺ, he used to go to the Baqi` (graveyard in Al-Madinah) at the last part of night and say, “May you be safe, O abode of the believing people. What you have been promised has come to you. You are tarried till tomorrow and certainly we shall follow you if Allah wills. O Allah, forgive the inmates of the Baqi`-al-Gharqad.”[Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసు ద్వారా రాత్రివేళ కూడా సమాధుల్ని సందర్శించటానికి వెళ్ళవచ్చునని తెలుస్తోంది. సందర్శకులు శ్మశానానికి వెళ్ళినప్పుడు హదీసులో పేర్కొనబడిన విధంగా ప్రార్థించాలి. సమాధుల్లో ఉన్నవారి మన్నింపుకోసం దైవాన్ని వేడుకోవాలి. అయితే ఒక విషయం గమనార్హం. ఇక్కడ 'అస్సలాము అలైకుం' అనేది ఒక ప్రార్థన మాత్రమే. ఎందుకంటే సమాధుల్లో ఉన్నవారు సందర్శకుల సలాంను విని వారికి జవాబుగా ప్రతి సలాం చేస్తారని ఎక్కడా లేదు. ఒకవేళ దైవం కోరితే ప్రజల మాటల్ని సమాధుల్లో ఉన్న మృతులకు వినిపించగలడు. అంతేకాని వారు తప్పకుండా విని సలాంకు ప్రతి సలాం చేస్తారన్న భావన సరైనది కాదు. నిజమేమిటో దైవానికే బాగా తెలుసు. కాబట్టి మనవరకు మనం దైవప్రవక్త ﷺ సంప్రదాయాన్ని పాటిస్తున్నామనే భావనతోనే సమాధుల్లో ఉన్నవారికి సలాం చెయ్యాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|66. పురుషులు సమాధుల్ని సందర్శించటం గురించి…..|హదీసు 582

583

హదీసు 583

وعن بُرَيْدَةَ رضي اللَّهُ عنهُ، قَالَ: كَانَ النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يُعَلِّمُهُمْ إِذا خَرَجُوا إِلى المَقابِرِ أَنْ يَقُولَ قَائِلُهُم: "السَّلامُ عَلَيكُمْ أَهْل الدِّيارِ مِنَ المُؤْمِنِينَ والمُسْلِمِينَ وَإِنَّا إِنْ شَاءَ اللَّهُ بِكُمْ لاَحِقُونَ، أَسْأَلُ اللَّه لَنَا وَلَكُمُ العافِيَةَ" رواه مسلم.

హజ్రత్ బురైదా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రజలు శ్మశానానికి వెళ్ళినప్పుడు దైవప్రవక్త ﷺ వారికి ఈవిధంగా ప్రార్థించమని బోధించేవారు :

"అస్సలాము అలైకుం అహ్లద్దియారి మినల్ మూమినీన వల్ ముస్లిమీన వ ఇన్నా ఇన్షాఅల్లాహు బికుమ్ లలాహిఖూన, అస్‌అలుల్లాహ లనా వలకుముల్ ఆఫియహ్."

విశ్వాసుల, ముస్లింల వాడ ప్రజలారా! మీకు శాంతి కల్గుగాక! దైవం తలచుకుంటే తప్పకుండా మేము కూడా మిమ్మల్ని కలుసుకుంటాం. నాకూ, మీకూ క్షేమాన్ని ప్రసాదించమని నేను దైవాన్ని కోరుకుంటున్నాను. (ముస్లిం)

(సహీహ్ ముస్లిం – జనాయెజ్ ప్రకరణం)

English

Buraidah (radiyallahu anhu) reported: The Prophet ﷺ used to teach them (i.e., the Companions) whenever they came out to visit the graveyard to say: “As-salamu `alaikum ahlad-diyyari minal-Mu’minina wal-Muslimina, wa inna in sha’ Allahu bikum lahiqun. As’alul-laha lana wa-lakumul- `afiyyah (May you be safe, O inmates of the abodes of the believers and the Muslims, and if Allah pleases, we shall follow you, we pray to Allah for well-being for ourselves and for you).”[Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసు ద్వారా ప్రజలు శ్మశానాలకు వెళ్ళి చనిపోయిన తమ బంధుమిత్రుల మన్నింపుకోసం ప్రార్థించుకోవచ్చని తెలుస్తోంది. బ్రతికున్నవారి ప్రార్థనవల్ల చనిపోయినవారికి ప్రయోజనం కలుగుతుంది. అంతేగాని సమాధులపై పుష్పగుచ్ఛాలు ఉంచటం వల్ల, వాటిపై దుప్పట్లు కప్పటం వల్ల మృతులకు ఎలాంటి ప్రయోజనం కలగదు. అదో వ్యర్థ ప్రయాస మాత్రమే.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|66. పురుషులు సమాధుల్ని సందర్శించటం గురించి…..|హదీసు 583

584

హదీసు 584

وعن ابن عَبَّاسٍ، رَضَيَ اللَّه عنهما، قال: مَرَّ رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم بِقُبورٍ بالمَدِينَةِ فَأَقْبَلَ عَلَيْهِمْ بوَجْهِهِ فقالَ: "السَّلامُ عَلَيْكُمْ يَا أَهْلَ القُبُورِ، يَغْفِرُ اللَّهُ لَنا وَلَكُمْ، أَنْتُم سَلَفُنا ونحْنُ بالأَثَرِ" رواهُ الترمذي وقال: حديثٌ حسن.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: ఓసారి దైవప్రవక్త ﷺ మదీనాలో కొందరి సమాధుల సమీపం నుండి వెళ్తూ వాటి వైపునకు తిరిగి ఇలా అన్నారు :

"అస్సలాము అలైకుం యా అహ్లల్ ఖుబూర్ యగ్‌ఫిరుల్లాహు లనా వలకుమ్ అంతుమ్ సలఫునా వ నహ్‌ను బిల్ అస్రి."

"ఓ సమాధి వాసులారా! మీకు శాంతి కల్గుగాక! దేవుడు మమ్మల్ని, మిమ్మల్నందరినీ క్షమించాలి, మీరు మాకంటే ముందే వెళ్ళిపోయారు. మేము మీ వెనకే రాబోతున్నాం."(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి 'హసన్'గా పేర్కొన్నారు)

(సుననె తిర్మిజీలోని జనాయెజ్ అధ్యాయం)

English

Ibn `Abbas (radiyallahu anhuma) reported: Messenger of Allah ﷺ passed by the graves at Al-Madinah. He turned his face towards them and said, “May you be granted safety, O inmates of the graves. May Allah forgive us and you. You have preceded us, and we are to follow.”[At-Tirmidhi].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|66. పురుషులు సమాధుల్ని సందర్శించటం గురించి…..|హదీసు 584