హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 65వ అధ్యాయం: మరణాన్ని గుర్తుచేసుకుంటూ ఉండటం, కోరికల్ని అదుపులో ఉంచుకోవటం. ఈ అధ్యాయంలో 6 ఖుర్ఆన్ ఆయతులు, 7 హదీసులు (హదీసు 574 – 580) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
65. మరణాన్ని గుర్తుచేసుకుంటూ ఉండటం, కోరికల్ని అదుపులో ఉంచుకోవటం…..
باب ذكر الموت وقصر الأمل
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ సెలవిచ్చాడు :
{كُلُّ نَفْسٍ ذَائِقَةُ الْمَوْتِ وَإِنَّمَا تُوَفَّوْنَ أُجُورَكُمْ يَوْمَ الْقِيَامَةِ فَمَنْ زُحْزِحَ عَنِ النَّارِ وَأُدْخِلَ الْجَنَّةَ فَقَدْ فَازَ وَمَا الْحَيَاةُ الدُّنْيَا إِلاَّ مَتَاعُ الْغُرُورِ} [آل عمران:١٨٥]
"చివరకు ప్రతి జీవీ మరణిస్తుంది. మీరంతా మీ పూర్తి ప్రతిఫలాన్ని ప్రళయంనాడు పొందుతారు. అక్కడ నరకాగ్ని నుండి కాపాడబడి, స్వర్గంలో ప్రవేశపెట్టబడేవాడు మాత్రమే యదార్థానికి సఫలీకృతుడు. ఇక ఈ ప్రపంచం, అది కేవలం మాయావస్తువు మాత్రమే." (ఆలి ఇమ్రాన్ : 185)
{وَمَا تَدْرِي نَفْسٌ مَاذَا تَكْسِبُ غَداً وَمَا تَدْرِي نَفْسٌ بِأَيِّ أَرْضٍ تَمُوتُ} [لقمان: ٣٤]
"తాను రేపటి రోజున ఏమి సంపాదించనున్నదో ఏ ప్రాణీ ఎరుగదు. ఏ భూభాగంపై తనకు మృత్యువు రానున్నదో ఏ వ్యక్తీ ఎరుగడు." (లుఖ్మాన్ : 34)
{فَإِذَا جَاءَ أَجَلُهُمْ لاَ يَسْتَأْخِرُونَ سَاعَةً وَلا يَسْتَقْدِمُونَ} [النحل: ٦١]
"ఆ కాలం వచ్చేసినప్పుడు, అది ఒక్క గడియ కూడా వెనుకా ముందూ కాజాలదు." (అన్ నహ్ల్ : 61)
{يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لاَ تُلْهِكُمْ أَمْوَالُكُمْ وَلا أَوْلادُكُمْ عَنْ ذِكْرِ اللَّهِ وَمَنْ يَفْعَلْ ذَلِكَ فَأُولَئِكَ هُمُ الْخَاسِرُونَ وَأَنْفِقُوا مِنْ مَا رَزَقْنَاكُمْ مِنْ قَبْلِ أَنْ يَأْتِيَ أَحَدَكُمُ الْمَوْتُ فَيَقُولَ رَبِّ لَولا أَخَّرْتَنِي إِلَى أَجَلٍ قَرِيبٍ فَأَصَّدَّقَ وَأَكُنْ مِنَ الصَّالِحِينَ وَلَنْ يُؤَخِّرَ اللَّهُ نَفْساً إِذَا جَاءَ أَجَلُهَا وَاللَّهُ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ} [المنافقون:٩-١١]
"విశ్వాసులారా! మీ సిరిసంపదలూ, మీ సంతానమూ, మిమ్మల్ని అల్లాహ్ సంస్మరణ నుండి మరల్చరాదు. ఎవరైతే ఇలా మరల్చబడతారో వారే నష్టానికి గురి అయ్యేవారు. మీలో ఎవరికైనా మరణ సమయం సమీపించి, అతను, 'ఓ నా ప్రభూ! నీవు నాకు మరికొంత వ్యవధి ఎందుకివ్వలేదు, నేను దానధర్మాలు చేసి సజ్జనులలో కలిసిపోయే వాణ్ణికదా?' అని వాపోయే పరిస్థితి రాకముందే మేము మీకు ఇచ్చిన ఉపాధినుండి ఖర్చుపెట్టండి. కాని ఎవరి ఆచరణ వ్యవధి అయినా ముగిసిపోయే సమయం ఆసన్నమైనప్పుడు, అల్లాహ్ ఇక అతనికి ఎంతమాత్రం అదనపు వ్యవధి ఇవ్వడు. మీరు చేస్తున్నదంతా అల్లాహ్కు బాగా తెలుసు." (అల్ మునాఫిఖూన్ : 9 – 11)
"చివరకు వారిలో ఎవడికైనా మరణం వస్తే వాడు, "ప్రభూ! నేను వదలిపెట్టివచ్చిన లోకానికే నన్ను తిరిగి పంపెయ్యి, ఇక నేను మంచిపనులు చేస్తానని ఆశిస్తున్నాను" అని అనటం మొదలుపెడతాడు. ఇది ఎంతమాత్రం జరిగే పనికాదు, అతను పలికేది కేవలం ఒక మాట మాత్రమే. ఇప్పుడు ఈ (మరణించేవారి) అందరివెనుక ఒక గోడ అడ్డంగా ఉన్నది. అది మరొక జీవితం వచ్చే రోజు వరకు ఉంటుంది. తరువాత శంఖం ఊదబడినంతనే వారి మధ్య ఏ బంధుత్వమూ ఉండదు. వారు ఒకరినొకరు పరామర్శించుకోరు. అప్పుడు ఎవరి (త్రాసు) పళ్ళెములు బరువుగా ఉంటాయో వారే సాఫల్యం పొందుతారు. ఎవరి (త్రాసు) పళ్లెములు తేలికగా ఉంటాయో, వారే తమను తాము నష్టానికి గురిచేసుకునేవారు. వారు నరకంలో శాశ్వతంగా ఉంటారు, అగ్ని వారి ముఖాల చర్మాన్ని తినివేన్తుంది, వారి దవడలు బయటపడతాయి –
(దేవుడు అడుగుతాడు), "నా వాక్యాలు మీకు వినిపించబడేటప్పుడు వాటిని నిరాకరించినవారు మీరేకదా?"దానికి వారు "ఓ మా ప్రభూ! మా దౌర్భాగ్యం మమ్మల్ని కప్పేసింది. నిజంగానే మేము మార్గం తప్పినవారము. ఓ స్వామీ! ఇక మమ్మల్ని ఇక్కణ్ణుంచి బయటకు తీయి. తరువాత మేము అలాంటి పాపాలు చేస్తే దుర్మార్గులవుతాము" అని అంటారు. అల్లాహ్ దానికి సమాధానం పలుకుతూ "నా ముందు నుంచి వెళ్ళిపోండి, ఇందులోనే పడి ఉండండి, నాతో మాట్లాడకండి" అంటాడు.
"నా దాసులు కొందరు, మా ప్రభూ! మేము విశ్వసించాము, మమ్మల్ని క్షమించు. మాపై దయచూపు, నీవు కరుణామయులలోకెల్లా ఉత్తమ కరుణామయుడవు" అని అన్నప్పుడు, వారిని పరిహసించింది మీరేకదా! చివరకు వారిపట్ల మీ మంకువైఖరి మిమ్మల్ని, "నేనూ ఒకణ్ణి ఉన్నాను" అనే విషయాన్ని కూడా మరచిపోయేలా చేసింది. మీరు వారిని పరిహసిస్తూనేపోయారు. ఈనాడు నేను వారి సహనానికి ఈ ప్రతిఫలం ఇచ్చాను. వారే సఫలురు. తరువాత అల్లాహ్ వారిని ఇలా అడుగుతాడు, "చెప్పండి, భూలోకంలో మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు?" దానికి వారు 'ఒకరోజో లేక రోజులో కొంత భాగమో అక్కడ ఉన్నాము. లెక్కపెట్టేవారిని అడగండి" అంటారు. అప్పుడు ఇలా సెలవీయబడుతుంది :
{كَمْ لَبِثْتُمْ فِي الأَرْضِ عَدَدَ سِنِينَ قَالُوا لَبِثْنَا يَوْماً أَوْ بَعْضَ يَوْمٍ فاسْأَلِ الْعَادِّينَ قَالَ إِنْ لَبِثْتُمْ إِلاَّ قَلِيلاً لَوْ أَنَّكُمْ كُنْتُمْ تَعْلَمُونَ أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَاكُمْ عَبَثاً وَأَنَّكُمْ إِلَيْنَا لاَ تُرْجَعُونَ} [المؤمنون:٩٩-١١٥]
"కొంతకాలమే ఉన్నారు కదా! అయ్యో మీరు ఈ విషయాన్ని అప్పుడు తెలుసుకొని ఉంటే ఎంత బాగుండేది. మేము మిమ్మల్ని వృధాగానే పుట్టించామని, మా వైపుకు మీరు ఎన్నడూ మరలిరావటమనేది జరగదని భావించారా?" (అల్ మూమినూన్ : 99 – 115)
{أَلَمْ يَأْنِ لِلَّذِينَ آمَنُوا أَنْ تَخْشَعَ قُلُوبُهُمْ لِذِكْرِ اللَّهِ وَمَا نَزَلَ مِنَ الْحَقِّ وَلا يَكُونُوا كَالَّذِينَ أُوتُوا الْكِتَابَ مِنْ قَبْلُ فَطَالَ عَلَيْهِمُ الْأَمَدُ فَقَسَتْ قُلُوبُهُمْ وَكَثِيرٌ مِنْهُمْ فَاسِقُونَ} [الحديد:١٦]
"విశ్వాసుల హృదయాలు అల్లాహ్ ప్రస్తావనతో చలించే సమయం, ఆయన అవతరింపజేసిన సత్యం ముందు వంగిపోయే సమయం ఇంకా రాలేదా? పూర్వం గ్రంథం ఇవ్వబడిన ప్రజల మాదిరిగా వారు మారిపోకూడదు. ఒక సుదీర్ఘ కాలం వారిపై గడచిపోయింది. అప్పుడు వారి హృదయాలు కఠినమయ్యాయి. ఈనాడు వారిలో అనేకులు పరమ దుర్మార్గులు. (అల్ హదీద్ : 16)
వివరణ :
ఇహలోకం అశాశ్వతం. ఇక్కడి సుఖాలు, ఆనందైశ్వర్యాలన్నీ ఓ మాయతడిక మాత్రమే. ఆ తర్వాత ఎన్నటికీ అంతంకాని పరలోక జీవితం మొదలవుతుంది. అక్కడి సౌఖ్యాలు, భోగభాగ్యాలు అనంతమైనవి, శాశ్వతమైనవి. అయితే ఆ శాశ్వత సుఖమయ పరలోక జీవితానికి అర్హులు కేవలం విశ్వాసులు మాత్రమే అవుతారు. దైవ అవిధేయులకు, దైవధిక్కారులకు అక్కడ బాధాకరమైన శిక్ష ఉంటుంది. మనిషి జీవించి ఉన్నంతకాలం ఈ విషయాలేవీ పట్టించుకోడు. ఎందుకంటే ప్రాపంచిక సుఖాలు అతని కళ్ళపై ఏమరుపాటు తెరలు వేసి ఉంచుతాయి. కాని మరణించిన తరువాత వాస్తవాలు కళ్ళముందు వచ్చినప్పుడు మనిషి ఇంకోసారి ప్రపంచానికి వెళ్ళి మంచిపనులు చేసుకునే అవకాశం కోసం దేవుణ్ణి ప్రార్థిస్తాడు. కాని అది అసంభవమని తెలుసుకొని పరిపరి విధాలా చింతిస్తాడు.
మరణం ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. కనుక మనిషి నిత్యం మరణాన్ని గుర్తుచేసుకుంటూ ఉండాలి. పరలోక జీవితం కోసం సన్నాహాలు చేసుకోవటంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదు.
English
“Everyone shall taste death. And only on the Day of Resurrection shall you be paid your wages in full. And whoever is removed away from the Fire and admitted to Jannah, he indeed is successful. The life of this world is only the enjoyment of deception (a deceiving thing).” [Āl ‘Imrān 3:185]
“No person knows what he will earn tomorrow, and no person knows in what land he will die…” [Luqmān 31:34]
“…when their term comes, neither can they delay nor can they advance it an hour (or a moment).” [An-Naḥl 16:61]
“O you who believe! Let not your properties or your children divert you from the remembrance of Allah. And whosoever does that, then they are the losers. And spend (in charity) of that with which We have provided you, before death comes to one of you, and he says: `My Rubb! If only You would give me respite for a little while (i.e., return to the worldly life), then I should give Sadaqah (i.e., Zakat) of my wealth, and be among the righteous [i.e., perform Hajj (pilgrimage to Makkah) and other good deeds].’ And Allah grants respite to none when his appointed time (death) comes. And Allah is All-Aware of what you do.” [Al-Munāfiqūn 63:9–11]
“Until, when death comes to one of them (those who join partners with Allah), he says: `My Rubb! Send me back. So that I may do good in that which I have left behind!’ No! It is but a word that he speaks; and behind them is Barzakh (a barrier) until the Day when they will be resurrected. Then, when the Trumpet is blown, there will be no kinship among them that Day, nor will they ask of one another. Then, those whose Scales (of good deeds) are heavy, they are the successful. And those whose Scales (of good deeds) are light, they are those who lose their ownselves, in Hell will they abide. The Fire will burn their faces, and therein they will grin, with displaced lips (disfigured). `Were not My Verses (this Qur’an) recited to you, and then you used to deny them?’ They will say: `Our Rubb! Our wretchedness overcame us, and we were (an) erring people. `Our Rubb! Bring us out of this; if ever we return (to evil), then indeed we shall be Zalimun (polytheists, oppressors, unjust, wrong-doers, etc? He (Allah) will say: `Remain you in it with ignominy! And speak you not to Me!’ Verily! There was a party of My slaves, who used to say: `Our Rubb! We believe, so forgive us, and have mercy on us, for you are the Best of all who show mercy!’ `But you took them for a laughing stock, so much so that they made you forget My remembrance while you used to laugh at them! Verily! I have rewarded them this Day for their patience, they are indeed the ones that are successful. He (Allah) will say: `What number of years did you stay on earth?’ They will say: `We stayed a day or part of a day. Ask of those who keep account.’ He (Allah) will say: `You stayed not but a little, if you had only known! Did you think that We had created you in play (without any purpose), and that you would not be brought back to Us?”’ [Al-Mu’minūn 23:99–115]
“Has not the time come for the hearts of those who believe (in the Oneness of Allah – Islamic Monotheism) to be affected by Allah’s Reminder (this Qur’an), and that which has been revealed of the truth, lest they become as those who received the Scripture [the Taurat (Torah) and the Injeel (Gospel)] before (i.e., Jews and Christians), and the term was prolonged for them and so their hearts were hardened? And many of them were Fasiqun (the rebellious, the disobedient to Allah).” [Al-Ḥadīd 57:16]
హదీసు 574
وعن ابن عمر رضي اللَّه عنهما قَالَ: أَخَذَ رَسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم بِمنكِبِي فَقَالَ: "كُنْ في الدُّنْيَا كَأَنَّكَ غَرِيبٌ أَو عابرُ سَبِيلٍ "وَكَانَ ابْنُ عُمَرَ رضي اللَّه عنهما يقول: إِذا أَمسَيتَ، فَلا تَنْتَظِرِ الصَّبَاحَ، وَإِذَا أَصْبَحْتَ، فَلا تَنْتَظِرِ المَسَاءَ، وَخُذْ مِن صِحَّتِكَ لَمَرَضِك وَمِن حَيَاتِكَ لمَوتِكَ"رواه البخاري.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ ఓసారి నా భుజం మీద చెయ్యేసి, "ప్రపంచంలో ఓ పరదేశీయుడిలాగా లేదా ఓ బాటసారిలాగా జీవించు" అని ఉపదేశించారు.
ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ప్రజలతో ఇలా అనేవారు : సాయంత్రమయితే తెల్లారేదాకా వేచిచూడకు. తెల్లారితే సాయంత్రం వరకు వేచిచూడకు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు అనారోగ్య పరిస్థితుల కోసం, బ్రతికుండగానే మరణానంతర జీవితం కోసం ఏర్పాట్లు చేసుకో. (బుఖారీ)
English
`Abdullah bin `Umar (radiyallahu anhuma) reported: Messenger of Allah ﷺ took hold of my shoulders and said, “Be in the world like a stranger or a wayfarer.” Ibn `Umar (radiyallahu anhuma) used to say: When you survive till the evening do not expect to live until the morning; and when you survive till the morning do not expect to live until the evening. While in good health (do good deeds) before you fall sick; and while you are alive (do good deeds) before death strikes.[Al-Bukhari].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|65. మరణాన్ని గుర్తుచేసుకుంటూ ఉండటం, కోరికల్ని అదుపులో ఉంచుకోవటం…..|హదీసు 574
హదీసు 575
وعنه أَنَّ رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قال: "ما حَقُّ امْرِيءٍ مُسلِمٍ لَهُ شَيءٌ يُوصِي فِيهِ. يبِيتُ لَيْلَتَيْنِ إِلاَّ وَوَصِيَّتُهُ مَكْتُوبَةٌ عِنْدَهُ" متفقٌ عَلَيْهِ. هَذَا لفظ البخاري. وفي روايةٍ لمسلمٍ:"يَبِيتُ ثَلاثَ لَيَالٍ"قَالَ ابن عمر: مَا مَرَّتْ عَلَيَّ لَيْلَةٌ مُنذُ سَمِعتُ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ ذلِكَ إِلاَّ وَعِنْدِي وَصِيَّتِي.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా)గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు : ఒక ముస్లిం దగ్గర వీలునామా వ్రాయవలసిన వస్తువేదయినా ఉండి రెండు రాత్రులు గడిచిపోయినా కూడా అతను వీలునామా వ్రాయకుండా ఉంటే అది అతనికి ఎంతమాత్రం సమ్మతం కాదు. (బుఖారీ – ముస్లిం. పై వాక్యాలు బుఖారీవి.)
ముస్లింలోని వాక్యాలు ఈ విధంగా ఉన్నాయి. మూడు రాత్రులు గడిచిపోయినా వీలునామా వ్రాయకుండా ఉండటం (సమ్మతం కాదు).
హజ్రత్ ఇబ్నె ఉమర్ ఉవాచ : దైవప్రవక్త ﷺ ఈ మాట అన్న తరువాత నేను ఒక్క రాత్రయినా నా దగ్గర వీలునామా వ్రాసిపెట్టుకోకుండా గడపలేదు.
(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలలోని వీలునామాల ప్రకరణం)
English
`Abdullah bin `Umar (radiyallahu anhuma) reported: Messenger of Allah ﷺ said, “It is the duty of a Muslim who has something which is to be given as a bequest not to have it for two nights without executing a written will.”[Al-Bukhari and Muslim].
In the narration of Muslim it is narrated as `three nights’. Ibn `Umar (radiyallahu anhuma) said: Since I heard the Messenger of Allah say this, I have never spent a night without having my will with me.
ముఖ్యాంశాలు
ఎవరి మరణం ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ధనవంతులైన వాళ్ళు ముందుగానే తమ ఆస్తికి సంబంధించిన వీలునామాలు వ్రాసిపెట్టుకోవాలి. దాంతో వారి మరణానంతరం ఆస్తి పంపిణీ వ్యవహారాల్లో వారి బాధ్యత తీరిపోయినట్లవుతుంది. వారసుల మధ్య తగాదాలు చెలరేగకుండా ఉంటాయి. అందుకే దైవప్రవక్త ﷺ ముస్లింలు వీలైనంత త్వరగా వీలునామాలు వ్రాసి ఉంచుకోవాలని తాకీదు చేశారు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|65. మరణాన్ని గుర్తుచేసుకుంటూ ఉండటం, కోరికల్ని అదుపులో ఉంచుకోవటం…..|హదీసు 575
హదీసు 576
وعن أَنس رضي اللَّه عنه قَالَ: خَطَّ النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم خُطُوطاً فَقَالَ: "هَذا الإِنسَانُ وَهَذا أَجَلُهُ. فَبَيْنَما هُوَ كَذَلِكَ إِذ جَاءَ الخَطُّ الأَقْرَبُ "رواه البخاري.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ అనేక గీతలు గీసి చూపిస్తూ, "ఈ (గీత) మానవుడు (అంటే అతని కోరికలు). ఇది అతని చావు. మానవుడు తన కోరికల్లో నిమగ్నుడై ఉన్నంతలోనే అతని దగ్గరికి సమీప గీత (చావు) వచ్చేస్తుంది. (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని ప్రేమైక వచనాల ప్రకరణం)
English
Anas (radiyallahu anhu) reported: The Prophet ﷺ drew a few lines and said, “One of them represents man and another indicates death; and a man continues like this until the nearest line (i.e., death) overtakes him.”[Al-Bukhari].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|65. మరణాన్ని గుర్తుచేసుకుంటూ ఉండటం, కోరికల్ని అదుపులో ఉంచుకోవటం…..|హదీసు 576
హదీసు 577
وعن ابن مسعُودٍ رضيَ اللَّه عنه قَالَ: خَطَّ النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم خَطًّا مُرَبَّعاً، وخَطَّ خَطًّا في الْوَسَطِ خَارِجاً منْهُ، وَخَطَّ خُططاً صِغَاراً إِلى هَذَا الَّذِي في الوَسَطِ مِنْ جَانِبِهِ الَّذِي في الوَسَطِ، فَقَالَ: "هَذَا الإِنسَانُ، وَهَذَا أَجَلُهُ مُحِيطاً بِهِ أَوْ قَد أَحَاطَ بِهِ وَهَذَا الَّذِي هُوَ خَارِجٌ أَمَلُهُ وَهَذِهِ الُخطَطُ الصِّغَارُ الأَعْراضُ، فَإِنْ أَخْطَأَهُ هَذَا، نَهَشَهُ هَذا، وَإِنْ أَخْطَأَهُ هَذا نَهَشَهُ هَذا "رواه البخاري. وَهَذِهِ صُورَتَهُ: الأجل -الأعراض -الأمل
హజ్రత్ ఇబ్నె మస్వూద్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ చతురస్రాకారపు గీతలు గీశారు. దాని మధ్యలో నుండి బయటికి వచ్చేలా మరో (పెద్ద) గీత గీశారు. దాని ప్రక్కన ఇంకొన్ని చిన్న చిన్న గీతలు గీశారు. ఆ తరువాత వాటి వైపు చూపిస్తూ, ఇది మానవుడు. అతని చుట్టూవున్న ఈ (చతురస్రాకారపు) గీతలు అతని చావు. ఈ బయటికి వెళ్తున్న గీత అతని కోరికలు. ఈ చిన్న చిన్న గీతలు మనిషికి ఎదురయ్యే విపత్తులు. ఒక విపత్తు తప్పిపోయినా మరో విపత్తు అతనిపై వచ్చిపడుతుంది. ఒకదాని నుండి బయటపడినా మరో విపత్తులో చిక్కుకుంటాడు. (బుఖారీ)
దాని రేఖాచిత్రం ఇలా ఉంటుంది :

(సహీహ్ బుఖారీలోని ప్రేమైక వచనాల ప్రకరణం)
English
Ibn Mas`ud (radiyallahu anhu) reported: The Prophet ﷺ drew up a square and in the middle of it he drew a line, the end of which jutted out beyond the square. Further across the middle line, he drew a number of smaller lines. Then he ﷺ said, “The figure represents man and the encircling square is the death which is encompassing him. The middle line represents his desires and the smaller lines are vicissitudes of life. If one of those misses him, another distresses him, and if that one misses him, he falls victim to another.”[Al-Bukhari].
ముఖ్యాంశాలు
మానవ జీవితం విపత్తుల వలయం. మనిషికి ఎప్పుడూ ఏదో ఒక రకమైన ఆపదలు వస్తూనే ఉంటాయి. ఆ ఆపదల్లోనే అతని జీవితం కడతేరుతుంది. అలాంటి అనిశ్చిత జీవితంలోనే మనిషి అంతులేని కోరికలు కోరుకుంటాడు. వాటిని తీర్చుకోవటానికి దైవాన్ని, ధర్మాన్ని విస్మరించి ఎడారుల్లో ఎండమావుల కోసం పరుగెత్తినట్లు తన మనోవాంఛల వెంట పరుగెత్తుతాడు. చివరికి మిగిలేది శూన్యం. అతని కోరికలు ఎన్నటికీ తీరవు. తీరిన ప్రతికోరిక మరో కోరికను వెంటేసుకొని వస్తుంది. అతని కోరికలు నెరవేరకముందే అతనిపైకి మృత్యువు పంజా విసురుతుంది.
మనిషి చావు ఎల్లప్పుడూ అతని తలమీదే వ్రేలాడుతూ ఉంటుంది. అంచేత మనిషి ఎన్నడూ చావుపట్ల ఏమరుపాటుకు లోనుకారాదు. ఎన్నటికీ నెరవేరని కోరికల వెంటపడి చావుని విస్మరించడం వివేకం అనిపించుకోదు సుమా!
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|65. మరణాన్ని గుర్తుచేసుకుంటూ ఉండటం, కోరికల్ని అదుపులో ఉంచుకోవటం…..|హదీసు 577
హదీసు 578
وعن أبي هريرة رضيَ اللَّه عنه أَنَّ رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "بَادِرُوا بِالأَعْمَالِ سَبْعاً، هَل تَنْتَظِرُونَ إلاَّ فَقْراً مُنْسِياً، أَو غِنَى مُطغِياً، أَوْ مَرَضاً مُفسِداً، أَوْ هَرَماً مُفَنِّداً، أَو مَوتاً مُجْهزِاً، أَو الدَّجَّالَ، فَشَرُّ غَائِبٍ يُنْتَظَرُ، أَوِ السَّاعَةَ وَالسَّاعَةُ أَدْهَى وأَمَرُّ؟،" رواهُ الترمذي وَقالَ: حديثٌ حسنٌ.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : ఏడు రకాల పరిస్థితులు దాపురించకమునుపే త్వరగా మంచి పనులు చేసుకోండి. మిమ్మల్ని (ధర్మం) మరచిపోయేటట్లు చేసే పేదరికం కోసం నిరీక్షిస్తున్నారా? లేక హద్దు మీరి ప్రవర్తించేటట్టు చేసే కలిమిని కోరుకుంటున్నారా? లేక మీ ఆరోగ్యాన్ని పాడుచేసే రోగం కోసం ఎదురుచూస్తున్నారా? లేక బుద్ధిని, వివేకాన్ని చెడగొట్టే వృద్ధాప్యం కోసం ఎదురుచూస్తున్నారా? లేక తృటిలో ప్రాణాలు తీసే మరణం కోసం ఎదురుచూస్తున్నారా? లేక దజ్జాల్ రాక కోసం ఎదురుచూస్తున్నారా? అతను అగోచరాల్లో అత్యంత హానికరమైనవాడు. ప్రళయం కోసం ఎదురుచూస్తున్నారా? ప్రళయం అతి భయంకరమైనది, అత్యంత చేదైనది. (తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హసన్గా పేర్కొన్నారు).
(సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత అధ్యాయాలు)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Hasten to do good deeds before you are overtaken by one of the seven afflictions.’‘ Then (giving a warning) he said, “Are you waiting for poverty which will make you unmindful of devotion, or prosperity which will make you corrupt, or a disease which will disable you, or senility which will make you mentally unstable, or sudden death which will take you all of a sudden, or Ad-Dajjal who is the worst expected, or the Hour; and the Hour will be most grievous and most bitter.”[At-Tirmidhi].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|65. మరణాన్ని గుర్తుచేసుకుంటూ ఉండటం, కోరికల్ని అదుపులో ఉంచుకోవటం…..|హదీసు 578
హదీసు 579
وعنه قالَ: قالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:" أَكْثِرُوا ذِكْرَ هَاذِمِ اللَّذَّاتِ" يَعني المَوْتَ، رواه الترمذي وقال: حديثٌ حسنٌ.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : మజాలను హరించేదాన్ని అంటే చావుని అతి ఎక్కువగా గుర్తుచేసుకుంటూ ఉండండి. (తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హసన్గా పేర్కొన్నారు).
(సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత అధ్యాయాలు)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Remember more often the destroyer of pleasures – death.”[At-Tirmidhi].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|65. మరణాన్ని గుర్తుచేసుకుంటూ ఉండటం, కోరికల్ని అదుపులో ఉంచుకోవటం…..|హదీసు 579
హదీసు 580
وعن أَبي بن كعبٍ رضي اللَّهُ عنه: كانَ رَسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم إِذا ذَهَبَ ثُلثُ اللَّيْلِ، قامَ فقالَ: "يَا أَيها النَّاسُ اذْكُرُوا اللَّه جَاءَتِ الرَاجِفَةُ تَتْبَعُهُا الرَّادِفَةُ، جاءَ المَوْتُ بِمَا فِيهِ، جاءَ المَوْتُ بِمَا فِيهِ"قلتُ: يَا رَسُولَ اللَّهِ إنِّي أكْثِرُ الصَّلاةَ عَلَيْكَ، فَكَمْ أَجْعَلُ لكَ مِن صَلاتي؟ قال:"مَا شِئْتَ"قُلْتُ الرُّبُعَ؟ قَالَ:"مَا شئْتَ، فَإِنْ زِدتَ فَهُوَ خَيْرٌ لكَ"قُلُتُ: فَالنِّصْفَ؟ قالَ"مَا شِئْتَ، فإِنْ زِدْتَ فَهُوَ خَيرٌ لكَ"قُلْتُ: فَالثلثَينِ؟ قالَ:"مَا شِئْتَ، فإِنْ زِدْتَ فَهُوَ خَيرٌ لكَ"قُلْتُ: أَجْعَلُ لكَ صَلاتي كُلَّها؟ قَالَ: إذاً تُكْفي هَمَّكَ، ويُغُفَرُ لكَ ذَنْبُكَ" رواه الترمذي وقال: حديث حسن.
హజ్రత్ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ మూడోవంతు రాత్రి గడిచిన తరువాత లేచి ఇలా అనేవారు : ప్రజలారా! దైవాన్ని స్మరించండి. శరీరంలో దడ పుట్టించేది (తొలి శంఖారావం) వచ్చేసింది. దాని తరువాత వచ్చేది కూడా (రెండో శంఖారావం) సమీపించింది. మృత్యువు తన భీతావహరూపంతో వచ్చేసింది, మృత్యువు తన భీతావహ రూపంతో వచ్చేసింది.
నేను దైవప్రవక్త ﷺతో మాట్లాడుతూ, "దైవప్రవక్తా! నేను చాలా ఎక్కువగా మీకోసం దరూద్ పంపుతూ ఉంటాను. అయితే నేను మీ దరూద్ కోసం ఎంత సమయం కేటాయించనూ?" అని అడిగాను. దానికాయన 'నీకిష్టమైనంతసేపు కేటాయించుకో' అని అన్నారు. నేను, "నాల్గోవంతు సమయం కేటాయించుకోనా?" అని అడిగాను. "నీ యిష్టం. ఇంకా ఎక్కువ కేటాయించుకుంటే నీకే లాభం" అని అన్నారాయన. "అయితే సగం సమయం దానికోసమే కేటాయించుకోమంటారా?" అని అడిగాను. "నీ యిష్టం. ఇంకా ఎక్కువ కేటాయించుకుంటే నీకే లాభం" అని అన్నారాయన. నేను మళ్ళీ "అయితే మూడింట రెండొంతుల సమయం మీ దరూద్ కోసమే కేటాయించుకుంటాను" అని అన్నాను. అప్పుడు కూడా ఆయన, "నీ యిష్టం. ఇంకా ఎక్కువ కేటాయించుకుంటే నీకే మంచిది" అనే అన్నారు. ఆఖరికి నేను, "దైవప్రవక్తా! నేను నా సమయమంతా మీ దరూద్ కోసమే అంకితం చేసుకుంటున్నాను" అని అన్నాను. అందుకాయన, "అలాగయితే నువ్వు చేసే ఈ ఆచరణ నీ దుఃఖాలకు (విరుగుడుగా) పనికొస్తుంది. ఇంకా దీనివల్ల నీ పాపాలు కూడా క్షమించబడతాయి" అని చెప్పారు. (తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హసన్గా పేర్కొన్నారు).
(సుననె తిర్మిజీలోని ప్రళయ వర్ణన అధ్యాయం)
English
Ubayy bin Ka`b (radiyallahu anhu) reported: When one-third of the night would pass, Messenger of Allah ﷺ would get up and call out, “O people, remember Allah. The Rajifah (i.e., the first Blowing of the Trumpet which will shake the whole universe and thus cause all life to cease) has come, followed by Ar-Radifah (i.e., the second Blowing of the Trumpet which will restore life and thus mark the Resurrection Day). Death has approached with all that it comprises. Death has approached with all that it comprises.” I said: “O Messenger of Allah ﷺ, I frequently invoke Allah to elevate your rank. How much of my supplications should I devote to you?” He said, “You may devote as much as you wish.” When I suggested a quarter, he said, “Do whatever you wish, but it will be better for you if you increase it.” I suggested half, and he said, “Do whatever you wish, but it will be better for you if you increase.” I suggested two-thirds, and he said, “Do whatever you wish but it will be better for you if you increase it.” I said, “Shall I devote all my supplications invoking Allah to elevate your rank?” He said, “Then you will be freed from your worries and your sins will be forgiven.”[At-Tirmidhi].
ముఖ్యాంశాలు
'రాజిఫహ్' అంటే దడ పుట్టించేదని అర్థం. ప్రళయం సంభవించే కాలంలో ఇస్రాఫీల్ దూత మొదటిసారి శంఖం పూరించినప్పుడు భూమి, పర్వతాలు మొదలగు సృష్టిరాసులన్నీ నుజ్జునుజ్జయిపోతాయి. అందుకే ప్రళయాన్ని తొలిశంఖారావం పేరుతో 'రాజిఫహ్' అని కూడా పిలుస్తారు. ఆ తరువాత రెండోసారి శంఖం పూరించబడుతుంది. దాన్ని 'రాదిఫహ్' అని అంటారు. మొత్తానికి దైవప్రవక్త ﷺ ఈ హదీసులో మనిషికి మరణ సమయంలో ఎదురయ్యే భీతావహ పరిస్థితుల్ని గురించి వివరించారు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|65. మరణాన్ని గుర్తుచేసుకుంటూ ఉండటం, కోరికల్ని అదుపులో ఉంచుకోవటం…..|హదీసు 580
You must be logged in to post a comment.