హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 64వ అధ్యాయం: కృతజ్ఞుడైన ధనవంతుడు. ఈ అధ్యాయంలో 4 ఖుర్ఆన్ ఆయతులు, 3 హదీసులు (హదీసు 571 – 573) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
64. కృతజ్ఞుడైన ధనవంతుడు
باب فضل الغَنِيّ الشاكر وهو من أخذ المال من وجه وصرفه في وجوهه المأمور بِهَا
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ సెలవిచ్చాడు :
{فَأَمَّا مَنْ أَعْطَى وَاتَّقَى وَصَدَّقَ بِالْحُسْنَى فَسَنُيَسِّرُهُ لِلْيُسْرَى} [الليل:٥-٧]
ఎవరు (దైవమార్గంలో) ధనాన్ని వినియోగించాడో, (దైవ అవిధేయతకు) భయపడ్డాడో, మంచిని సత్యమని అంగీకరించాడో అతనికి మేము సన్మార్గంలో నడిచేందుకు సౌకర్యాన్ని కలుగజేస్తాము. (అల్ లైల్ : 5 – 7)
{وَسَيُجَنَّبُهَا الأَتْقَى الَّذِي يُؤْتِي مَالَهُ يَتَزَكَّى وَمَالأَحَدٍ عِنْدَهُ مِنْ نِعْمَةٍ تُجْزَى إِلاَّ ابْتِغَاءَ وَجْهِ رَبِّهِ الأَعْلَى} [الليل:١٧-٢١]
పరిశుద్ధుడు కావటానికి తన సంపదను ఖర్చు చేసే పరమ దైవభీతిపరుడు దానికి (నరకానికి) దూరంగా ఉంచబడతాడు. అతనికి ఎవ్వరూ ఏ విధమైన ఉపకారం చెయ్యలేదు, దానికి అతను బదులు తీర్చేందుకు. అతను కేవలం మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే ఈ పని చేస్తున్నాడు. ఆ ప్రభువు తప్పకుండా అతడంటే సంతోషిస్తాడు. (అల్ లైల్ : 17 – 21)
{إِنْ تُبْدُوا الصَّدَقَاتِ فَنِعِمَّا هِيَ وَإِنْ تُخْفُوهَا وَتُؤْتُوهَا الْفُقَرَاءَ فَهُوَ خَيْرٌ لَكُمْ وَيُكَفِّرُ عَنْكُمْ مِنْ سَيِّئَاتِكُمْ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ} [البقرة:٢٧١]
"మీరు మీ దానధర్మాలను బహిరంగంగా చేసినా మంచిదే. కాని రహస్యంగా నిరుపేదలకు దానమివ్వటం మీకు ఎక్కువ మేలు చేకూరుస్తుంది. మీ వల్ల జరిగిన దుష్కార్యాలెన్నో దానివల్ల సమసిపోతాయి. మీరు ఏమి చేసినా అది అల్లాహ్కు తెలుస్తుంది. (అల్ బఖర : 271)
{لَنْ تَنَالُوا الْبِرَّ حَتَّى تُنْفِقُوا مِمَّا تُحِبُّونَ وَمَا تُنْفِقُوا مِنْ شَيْءٍ فَإِنَّ اللَّهَ بِهِ عَلِيمٌ} [آل عمران:٩٢]
"మీరు అమితంగా ప్రేమించే వస్తువులను (దైవమార్గంలో) ఖర్చుపెట్టనంతవరకు మీరు సత్కార్యస్థాయికి చేరుకోలేరు. మీరు ఖర్చుచేసేదంతా అల్లాహ్కు బాగా తెలుసు." (ఆలి ఇమ్రాన్ : 92)
English
“As for him who gives (in charity) and keeps his duty to Allah and fears Him, and believes in Al-Husna. We will make smooth for him the path of ease (goodness).” [Al-Layl 92:5–7]
“And Al-Muttaqun (the pious and righteous) will be far removed from it (Hell). He who spends his wealth for increase in self-purification. And who has (in mind) no favour from anyone to be paid back. Except to seek the Countenance of his Rubb, the Most High. He surely, will be pleased (when he will enter Jannah).” [Al-Layl 92:17–21]
“If you disclose your Sadaqat (alms-giving), it is well; but if you conceal them and give them to the poor, that is better for you. (Allah) will expiate you some of your sins. And Allah is Well-Acquainted with what you do.” [Al-Baqarah 2:271]
“By no means shall you attain Al-Birr (piety, righteousness – here it means Allah’s reward, i.e., Jannah), unless you spend (in Allah’s Cause) of that which you love; and whatever of good you spend, Allah knows it well.” [Āl ‘Imrān 3:92]
హదీసు 571
وعن عبدِ اللَّهِ بنِ مسعودٍ رضي اللَّه عنه قال: قالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لاَ حَسَدَ إِلاَّ في اثَنَتَيْنِ: رَجُلٌ آتَاهُ اللَّهُ مَالاً، فَسَلَّطَهُ عَلَى هَلكَتِهِ في الحَقِّ. ورَجُلٌ آتَاه اللَّهُ حِكْمَةً فُهو يَقضِي بِها وَيُعَلِّمُهَا" متفقٌ عَلَيْهِ وتقدم شرحه قريباً.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : ఇద్దరు వ్యక్తుల పట్ల తప్ప మరెవ్వరి పట్లా అసూయ చెందటం ధర్మసమ్మతం కాదు. వారిలో ఒకడు : దేవుడు సిరిసంపదలను ప్రసాదించి, వాటిని సత్యమార్గంలో ఖర్చుపెట్టే సద్బుద్ధిని ప్రసాదించినవాడు. రెండో వ్యక్తి: దేవుడు విజ్ఞతా వివేచనాలను ప్రసాదిస్తే వాటి ప్రకారం నిర్ణయాలు తీసుకుంటూ, ఆ వివేచనను ఇతరులకు కూడా బోధించేవాడు.
(బుఖారీ – ముస్లిం)
English
Ibn Mas`ud (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Envy is permitted only in two cases: A man whom Alah gives wealth, and he disposes of it rightfully, and a man to whom Allah gives knowledge which he applies and teaches it.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ఈ హదీసు ఇంతకు ముందు వచ్చినప్పటికీ ఇందులోని విషయం సదరు అధ్యాయానికి కూడా వర్తిస్తుండటంతో దీనిని మళ్లీ ఇక్కడ ప్రస్తావించటం జరిగింది. అల్లాహ్ ఎవరికైనా ధనం ఇస్తే వారు అందుకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అల్లాహ్ ఆదేశించిన మార్గంలో ఆ ధనాన్ని ఖర్చుపెడితే ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకున్నట్లవుతుంది. అదేవిధంగా విద్యను అభ్యసించిన తర్వాత దాన్ని ఆచరణలో పెట్టడమే ఆ దైవానుగ్రహానికి కృతజ్ఞతలు! మరో విషయం, ఇతరులకు మంచి చేసే ఉద్దేశ్యంతో విద్యనభ్యసించాలనీ, ధనం సంపాదించాలని ఆశపడటంలో తప్పులేదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|64. కృతజ్ఞుడైన ధనవంతుడు|హదీసు 571
హదీసు 572
وعن ابْنِ عمر رضي اللَّه عنهما عن النَّبي صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "لا حَسَد إِلاَّ في اثنَتَين: رَجُلٌ آتَاهُ اللَّه القُرآنَ، فَهُوَ يَقُومُ بِهِ آنَاءَ اللَّيل وآنَاءَ النَّهارِ. وَرَجُلٌ آتَاهُ اللَّه مَالاً. فهوَ يُنْفِقهُ آنَاءَ اللَّيْلِ وآنَاءَ النَّهارِ" متفقٌ عليه. "الآنَاءُ"السَّاعَاتُ.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : ఇద్దరు వ్యక్తుల పట్ల తప్ప మరెవ్వరిపట్లా అసూయ చెందరాదు. ఒకరు; దేవుడు ఖుర్ఆన్ జ్ఞానాన్ని ప్రసాదించగా రేయింబవళ్ళు దాన్ని ఆచరించే వ్యక్తి. రెండోవాడు: దేవుడు సిరిసంపదలు అనుగ్రహించగా వాటిని రేయింబవళ్ళు (దైవమార్గంలో) ఖర్చుపెట్టే వ్యక్తి.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని తౌహీద్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)
English
Ibn `Umar (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said: “Envy is justified in regard to two types of persons only: a man whom Allah has given knowledge of the Qur’an, and so he recites it during the night and during the day; and a man whom Allah has given wealth and so he spends from it during the night and during the day.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ఇంతకు ముందు హదీసులో ఇక్కడ 'ఖుర్ఆన్' అని చెప్పినచోట 'వివేచనం' అన్న పదం వాడబడింది. 'వివేచనం' అన్నా 'ఖుర్ఆన్' అన్నా అర్థం ఒక్కటే! ఖుర్ఆన్ను ఆచరించటం అనే మాటలో దాన్ని పారాయణం చేయటం, దాన్ని ఇతరులకు బోధించటం, దాని ఆధారంగా తీర్పులు ఇవ్వటం, దానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీచేయటం అన్నీ వచ్చేస్తాయి. ఈ విధంగా పై రెండు హదీసులకూ భావం ఒక్కటే.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|64. కృతజ్ఞుడైన ధనవంతుడు|హదీసు 572
హదీసు 573
وعَن أبي هُريرة رضي اللَّه عنه أَنَّ فُقَرَاءَ المُهَاجِرِينَ أَتَوْا رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم. فَقَالُوا: ذَهَبَ أَهْلُ الدُّثُورِ بِالدَّرَجاتِ العُلَى. والنَّعِيمِ المُقِيمِ. فَقَال:"ومَا ذَاكَ؟ "فَقَالُوا: يُصَلُّونَ كمَا نُصَلِّي، ويَصُومُونَ كمَا نَصُومُ. وَيَتَصَدَّقُونَ وَلاَ نَتَصَدَّقُ، ويَعتِقُونَ وَلاَ نَعتقُ فَقَالَ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"أَفَلا أُعَلِّمُكُمْ شَيئاً تُدرِكُونَ بِهِ مَنْ سبَقَكُمْ، وتَسْبِقُونَ بِهِ مَنْ بَعْدَكُمْ وَلاَ يَكُونُ أَحَدٌ أَفْضَلَ مِنْكُم إِلاَّ مَنْ صَنَعَ مِثلَ مَا صَنَعْتُم؟ "قالوا: بَلَى يَا رسولَ اللَّه، قَالَ:"تُسبحُونَ، وتحمَدُونَ وتُكَبِّرُونَ، دُبُر كُلِّ صَلاة ثَلاثاً وثَلاثِينَ مَرَّةً"فَرَجَعَ فُقَرَاءُ المُهَاجِرِينَ إِلى رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَقَالُوا: سمِعَ إِخْوَانُنَا أَهْلُ الأَموَالِ بِمَا فَعلْنَا، فَفَعَلوا مِثْلَهُ؟ فَقَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"ذَلِكَ فَضْلُ اللَّهِ يُؤْتِيهِ مَن يشَاءُ" متفقٌ عَلَيْهِ، وَهَذا لفظ روايةِ مسلم. "الدُّثُورُ": الأَموالُ الكَثِيرَةُ، واللَّه أعلم.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం : ముహాజిర్లలో పేద ప్రజలైన కొంతమంది ఓ రోజు దైవప్రవక్త ﷺ దగ్గరికి వచ్చి, "(దైవప్రవక్తా!) ధనికులు (మాకన్నా) గొప్ప స్థానాలను, శాశ్వత సుఖాలను పొదుతారు" అని అన్నారు. "అదెలాగూ?" అని అడిగారు దైవప్రవక్త ﷺ. దానికి వారు సమాధానమిస్తూ, "వారూ మాలాగే నమాజులు చేస్తున్నారు. ఉపవాసాలు పాటిస్తున్నారు. అయితే వారు దానధర్మాలు కూడా చేస్తున్నారు. కాని (స్తోమత లేనికారణంగా) మేము (దానధర్మాలు) చేయటం లేదు. వారు బానిసల్ని కూడా విడిపిస్తున్నారు. మేమా పని చేయలేకపోతున్నాం" అని అన్నారు.
అది విని దైవప్రవక్త ﷺ, అయితే నేను మీకో విషయం తెలియజేయనా? దాన్ని గనక మీరు పాటిస్తే, మిమ్మల్ని మించిపోయినవారి స్థాయికి మీరూ చేరుకుంటారు. మీ తరువాత వచ్చిన వారికంటే కూడా మీరు మించిపోతారు. మీ పద్ధతిని పాటించేవారు తప్ప మీకన్నా శ్రేష్ఠులు మరెవ్వరూ ఉండబోరు" అని అన్నారు.
"తప్పకుండా తెలియజేయండి దైవప్రవక్తా!" అని విన్నవించుకున్నారు సహచరులు. అప్పుడాయన "ప్రతి నమాజు తరువాత 'సుబ్హానల్లాహ్', 'అల్హమ్దులిల్లాహ్', 'అల్లాహుఅక్బర్' అని (ప్రతి ఒక్కటి) ముప్ఫైమూడుమార్లు చొప్పున పఠించండి" అని అన్నారు.
(పేద ప్రజలు దాన్ని ఆచరించటం మొదలుపెట్టారు. కొంతకాలానికి ధనికులకు కూడా ఆ విషయం తెలిసిపోయింది. వాళ్ళు కూడా దాన్ని పాటించసాగారు). అప్పుడు ముహాజిర్ నిరుపేదలు మళ్ళీ దైవప్రవక్త ﷺ సన్నిధికి వెళ్ళి, "మేము చేస్తున్నది ధనిక సోదరులకు కూడా తెలిసిపోయింది. వాళ్ళూ మాలాగే దాన్ని ఆచరించటం మొదలుపెట్టారు" అని ఫిర్యాదు చేసుకున్నారు. దానికాయన "అది దేవుని అనుగ్రహం. దేవుడు తాను కోరినవారికి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు" అని అన్నారు.
(బుఖారీ – ముస్లిం)
(వాక్యాలు మాత్రం ముస్లింవి).
(సహీహ్ బుఖారీలోని అజాన్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని మస్జిదుల ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Some of the poor Emigrants came to Messenger of Allah ﷺ and said to him, “The wealthy have obtained all high ranks and everlasting bliss.” He asked, “How is that?” They replied: “They offer Salat as we do, and observe Saum (fasting) as we do, but they give in Sadaqah (charity) and we do not, and they emancipate slaves and we cannot.” He ﷺ said, “Shall I not teach you something whereby you will catch up with those who have preceded you and will get ahead of those who follow you, and no one will surpass you unless he does the same as you do?” They said, “Surely, O Messenger of Allah.” He said, “Say: Subhan Allah, and Allahu Akbar, and praise Him (by saying Al-hamdu lillah) thirty-three times at the end of every Salat.” They returned to him and said: “Our brothers, the possessors of wealth, having heard what we are doing, have started doing the same.” Messenger of Allah ﷺ said, “This is Grace of Allah which He gives to whom He wishes.”[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|64. కృతజ్ఞుడైన ధనవంతుడు|హదీసు 573
You must be logged in to post a comment.