హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 63. పారలౌకిక విషయాల్లో పోటీ

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 63వ అధ్యాయం: పారలౌకిక విషయాల్లో ఒకర్నొకరు మించిపోవటానికి ప్రయత్నించటం, శుభప్రదమైన వస్తువుల పట్ల ఆసక్తిని కనబరచటం. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 2 హదీసులు (హదీసు 569 – 570) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

63. పారలౌకిక విషయాల్లో ఒకర్నొకరు మించిపోవటానికి ప్రయత్నించటం, శుభప్రదమైన వస్తువుల పట్ల ఆసక్తిని కనబరచటం…..

↑ విషయ సూచిక

باب التنافس في أمور الآخرة والاستكثار مما يُتَبَرَّكُ فيه

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు :

{وَفِي ذَلِكَ فَلْيَتَنَافَسِ الْمُتَنَافِسُونَ} [المطففين:٢٦]

"ఇతరుల్ని మించిపోవాలని కోరుకునేవారు దీన్ని (స్వర్గాన్ని) పొందే విషయంలో మించిపోవటానికి కృషిచేయాలి." (అల్ ముతఫ్ఫిఫీన్ : 26)

English

“Let (all) those strive who want to strive (i.e., hasten earnestly to the obedience of Allah).” [Al-Muṭaffifīn 83:26]

569

హదీసు 569

وعن سهلِ بنِ سعدٍ رضي اللَّه عنه أَن رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أُتِيَ بِشَرَابٍ، فَشَرِبَ مِنهُ وَعَن يَمِينِهِ غُلامٌ، وَعَن يسارِهِ الأَشْيَاخُ، فَقَالَ لِلْغُلام: " أَتَأْذَنُ لِي أَن أُعْطِيَ هُؤلاءِ؟ فَقَالَ الغُلامُ: لاَ وَاللَّهِ يَا رسُولَ اللَّه لا أُوثِرُ بِنَصيبي مِنكَ أَحَداً، فَتَلَّهُ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم في يَدِهِ. متفقٌ عَلَيْهِ. "تَلَّهُ"بالتاءِ المثناةِ فوق، أَيْ: وَضَعَهُ، وَهَذَا الغُلامُ هُوَ ابنُ عَبَّاسٍ رضي اللَّه عنهما.

హజ్రత్ సహ్ల్ బిన్ సాద్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺకు ఎవరో ఏదో పానీయం (కానుకగా) సమర్పించుకున్నారు. ఆయన అందులో కొంత తాగారు. ఆ సమయంలో ఆయనకు కుడి ప్రక్కన ఒక బాలుడు ఉన్నాడు. ఎడమ ప్రక్కన పెద్దవాళ్ళున్నారు. దైవప్రవక్త ﷺ ఆ పిల్లవాడితో, "నువ్వు అనుమతిస్తే నేనీ పానీయాన్ని పెద్దలకు ఇస్తాను" అన్నారు. దానికా బాలుడు, "దైవసాక్షి! నేను ఒప్పుకోను. మీరిచ్చే వస్తువుని నేను ఇతరులకు త్యాగం చెయ్యలేను దైవప్రవక్తా!" అని అన్నాడు. అప్పుడు దైవప్రవక్త ﷺ పానీయ గిన్నెను ఆ బాలునికే ఇచ్చేశారు.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని అత్యాచారాల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని పానీయాల ప్రకరణం)

English

Sahl bin Sa`d (radiyallahu anhu) reported: A drink was brought to the Messenger of Allah ﷺ and he drank some of it. On his right was a boy and on his left were elderly people. He said to the boy, “Would you permit me to give the rest of this drink to these on my left?” The boy said, “O Messenger of Allah, I would certainly not give preference to anyone in anything that might come to me from you.” So he handed over the rest of the drink to him.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

సమావేశంలో కూర్చొని ఉన్నవారికి ఏదైనా పంచిపెట్టాలనుకున్నప్పుడు కుడివైపు నుండి మొదలుపెట్టాలి. హదీసులో ప్రస్తావనకు వచ్చిన సంఘటనలో దైవప్రవక్త ﷺకు కుడివైపున అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ ఉన్నారు. ఆయన ఆ సమావేశంలోని వారందరికన్నా చాలా చిన్నవారు. పెద్దలంతా దైవప్రవక్త ﷺకు ఎడమవైపు కూర్చొని ఉన్నారు. సాధారణ పరిస్థితుల్లో ఏదయినా వస్తువు పంచిపెట్టాలన్నప్పుడు పెద్దలనుండి మొదలుపెడతారు. కాని మరోవైపు సమావేశాల్లో ఉన్నప్పుడు కుడివైపు నుండి మొదలుపెట్టాలన్న నియమం కూడా ఉంది. అంచేత దైవప్రవక్త ﷺ ఇబ్నె అబ్బాస్ చిన్న పిల్లవాడని చూడకుండా ఆయన హక్కుని గుర్తించి, ఆయన అనుమతితో ఆ పానీయాన్ని పెద్దలికివ్వాలని నిశ్చయించుకున్నారు.

ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఆ సమావేశంలో అందరికన్నా చిన్నవారు. నైతికంగా చూస్తే పెద్దల గౌరవార్థం ఆయన తన హక్కుని త్యాగం చేసి ఆ పానీయం పెద్దలకే ఇవ్వమని చెప్పాలి. కాని ఆయన తన హక్కుని త్యాగం చేయటంకన్నా దైవప్రవక్త శుభ అధరాలు తాకిన పానీయాన్ని ముందుగా తాను సేవించటానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|63. పారలౌకిక విషయాల్లో ఒకర్నొకరు మించిపోవటానికి ప్రయత్నించటం, శుభప్రదమైన వస్తువుల పట్ల ఆసక్తిని కనబరచటం…..|హదీసు 569

570

హదీసు 570

وعن أَبي هريرة رضي اللَّه عنه عَنِ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "بيْنَا أَيُّوبُ عليه السلام يَغتَسِلُ عُريَاناً، فَخَرَّ عَلَيْهِ رجل جَرَادٌ مِن ذَهَبٍ، فَجَعَلَ أَيُّوبُ يَحِثي في ثَوبِهِ، فَنَادَاهُ رَبُّهُ عَزَّ وَجلَّ: يَا أَيُّوبُ، أَلَم أَكُنْ أغنيك عمَّا تَرَى؟، قال: بَلَى يا رب، وَلكِن لاَ غِنَى بي عَن بَرَكَتِكَ" رواه البخاري. كتَاب الأدَب

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు : ఒకసారి అయ్యూబ్ (అలైహి) దిగంబరులై స్నానం చేస్తుండగా ఆయనపై బంగారు మిడుతలు వచ్చి పడసాగాయి. అయ్యూబ్ వాటిని దోసిళ్ళతో పట్టుకొని వస్త్రంలో సమీకరించుకోసాగారు. అప్పుడు ఆకాశం నుండి దేవుడు ఆయన్ని పిలుస్తూ, "ఓ అయ్యూబ్! నేను (నీకు విపరీతమైన సిరిసంపదలను ప్రసాదించి) నువ్వు ప్రోగుచేసుకుంటున్నవాటి నుంచి నిన్ను నిరపేక్షాపరునిగా చెయ్యలేదా?" అని అడిగాడు. దానికి అయ్యూబ్ "నీ ఔన్నత్యం సాక్షి! నిస్సందేహంగా చేశావు. కాని నాపై అవతరించే శుభం విషయంలోనయితే నిరపేక్షాపరునిగా చెయ్యలేదు కదా!" అన్నారు అయ్యూబ్ (అలైహిస్సలాం) (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని దైవప్రవక్తల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “While Ayyub ﷺ the Prophet was taking a bath, naked, a large number of gold locusts fell on him. He tried to collect them in a piece of cloth, when he heard his Rubb (Allah) calling him: `O Ayyub ! Have I not sufficed you to care for what you see (the worldly possessions)?’ Ayyub ﷺ said: `Indeed by Your Power, but I can never do away with Your Blessings.”’[Al-Bukhari].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|63. పారలౌకిక విషయాల్లో ఒకర్నొకరు మించిపోవటానికి ప్రయత్నించటం, శుభప్రదమైన వస్తువుల పట్ల ఆసక్తిని కనబరచటం…..|హదీసు 570