హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 56. పస్తులతో, నిరాడంబరంగా జీవితం గడపటం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 56వ అధ్యాయం: పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితం గడపటం, మామూలు అన్నపానీయాలు, వస్త్ర సౌకర్యాలతోనే తృప్తిగా బతకటం, మనోవాంఛలకు దూరంగా ఉండటం గురించి. ఈ అధ్యాయంలో 4 ఖుర్ఆన్ ఆయతులు, 31 హదీసులు (హదీసు 491 – 521) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

56. పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితం గడపటం, మామూలు అన్నపానీయాలు, వస్త్ర సౌకర్యాలతోనే తృప్తిగా బతకటం, మనోవాంఛలకు దూరంగా ఉండటం గురించి……

↑ విషయ సూచిక

باب فضل الجوع وخشونة العيش والاقتصار عَلَى القليل من المأكول والمشروب والملبوس وغيرها من حظوظ النفس وترك الشهوات

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు :

{فَخَلَفَ مِنْ بَعْدِهِمْ خَلْفٌ أَضَاعُوا الصَّلاةَ وَاتَّبَعُوا الشَّهَوَاتِ فَسَوْفَ يَلْقَوْنَ غَيّاً، إِلاَّ مَنْ تَابَ وَآمَنَ وَعَمِلَ صَالِحاً فَأُولَئِكَ يَدْخُلُونَ الْجَنَّةَ وَلا يُظْلَمُونَ شَيْئاً} [مريم:٥٩،٦٠]

"వారి తదనంతరం వారి స్థానంలో కొందరు అయోగ్యులు వచ్చారు. వారు నమాజును త్యజించారు, మనోవాంఛలను అనుసరించారు. కనుక వారు త్వరలోనే మార్గం తప్పిన దానికి ఫలితం అనుభవిస్తారు. అయితే పశ్చాత్తాపపడి మరలే వారూ, విశ్వసించి సత్కార్యాలు చేసే వారూ స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి రవ్వంత అన్యాయం కూడా జరగదు. (మర్యమ్ : 59, 60)

{فَخَرَجَ عَلَى قَوْمِهِ فِي زِينَتِهِ قَالَ الَّذِينَ يُرِيدُونَ الْحَيَاةَ الدُّنْيَا يَا لَيْتَ لَنَا مِثْلَ مَا أُوتِيَ قَارُونُ إِنَّهُ لَذُو حَظٍّ عَظِيمٍ، وَقَالَ الَّذِينَ أُوتُوا الْعِلْمَ وَيْلَكُمْ ثَوَابُ اللَّهِ خَيْرٌ لِمَنْ آمَنَ وَعَمِلَ صَالِحاً} [القصص:٧٩،٨٠]

"ఒకరోజు ఖారూన్ తన జాతి ముందు తన పూర్తి వైభవంతో ప్రత్యక్షమయ్యాడు. ఐహిక జీవితం పట్ల వ్యామోహం కలవారు అతణ్ణి చూసి, "ఖారూన్‌కు ఇవ్వబడింది మాకూ లభిస్తే ఎంత బాగుండేది. అతను చాలా అదృష్టవంతుడు" అని అన్నారు. కాని జ్ఞాన సంపన్నులు మాత్రం, "అయ్యో దౌర్భాగ్యులారా! విశ్వసించి మంచి పనులు చేసే వ్యక్తికి అల్లాహ్ ఇచ్చే ప్రతిఫలమే శ్రేష్ఠమైనది. ఈ మహాభాగ్యం సహనం చూపే వారికి తప్ప మరెవరికీ దొరకదు" అని అన్నారు. (అల్ ఖసస్ : 79, 80)

{ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ} [التكاثر:٨]

"ఆ రోజున (ప్రళయదినాన) మీరు తప్పనిసరిగా (ఇహలోక) సౌఖ్యాలను గురించి ప్రశ్నించబడతారు. (అత్ తకాసుర్ : 8)

{مَنْ كَانَ يُرِيدُ الْعَاجِلَةَ عَجَّلْنَا لَهُ فِيهَا مَا نَشَاءُ لِمَنْ نُرِيدُ ثُمَّ جَعَلْنَا لَهُ جَهَنَّمَ يَصْلاهَا مَذْمُوماً مَدْحُوراً} [الإسراء:١٨]

"ఇహలోక ప్రయోజనాలను కోరుకునేవాడికి మేము ఇక్కడే వాటిని ఇచ్చివేస్తాము. ఎవరికి ఎంత ఇవ్వదలచుకుంటామో అంతమేరకు. తరువాత అతని జాతకంలో నరకం వ్రాసేస్తాము. అందులో అతడు దూషింపబడినవాడై, కారుణ్యానికి దూరమైనవాడై దహింపబడతాడు. (అల్ ఇస్రా : 18)

ఈ అధ్యాయం క్రింద సుప్రసిద్ధమైన సూక్తులు ఇంకా చాలా ఉన్నాయి.

మనిషి ఇహలోక సౌఖ్యాల్ని పొందటం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు అతని అదృష్టంలో వ్రాసివుంచినంతమేరకే అతనికి సౌఖ్యాలు లభిస్తాయి. మరి అలాంటప్పుడు దేవుణ్ణి మరచిపోయి ప్రాపంచిక ఆనందాల కోసం వెంపర్లాడటమెందుకు? దానికి బదులు సహనాన్ని, సంతృప్తభావాన్ని అలవరచుకుంటే ఇహపరాల్లోనూ ఆనందమయమైన జీవితాన్ని గడపవచ్చుకదా! అందుకని మనిషి ఎల్లప్పుడూ పరలోక జీవితాన్ని మెరుగుపరచుకోవటం కోసమే కృషిచేస్తూ ఉండాలని పై సూక్తులు బోధిస్తున్నాయి.

English

“Then, there has succeeded them a posterity who have given up As-Salat (the prayers) [i.e., made their Salat (prayers) to be lost, either by not offering them or by not offering them perfectly or by not offering them in their proper fixed times] and have followed lusts. So they will be thrown in Hell. Except those who repent and believe (in the Oneness of Allah and His Messenger Muhammad ﷺ), and work righteousness. Such will enter Jannah and they will not be wronged in aught.” [Maryam 19:59–60]

“So he went forth before his people in his pomp. Those who were desirous of the life of the world, said: `Ah, would that we had the like of what Qarun (Korah) has been given! Verily, he is the owner of a great fortune.’ But those who had been given (religious) knowledge said: `Woe to you! The reward of Allah (in the Hereafter) is better for those who believe and do righteous good deeds’.” [Al-Qaṣaṣ 28:79–80]

“Then, on that Day, you shall be asked about the delights (you indulged in, in this world)!” [At-Takāthur 102:8]

“Whoever desires the quick-passing (transitory enjoyment of this world), We readily grant him what We will for whom We like. Then, afterwards, We have appointed for him Hell; he will burn therein disgraced and rejected (far away from Allah’s Mercy).” [Al-Isrā’ 17:18]

491

హదీసు 491

وعن عائشةَ، رضي اللَّه عنها، قالت: مَا شَبعَ آلُ مُحمَّدٍ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم مِنْ خُبْزِ شَعِيرٍ يَوْمَيْنِ مُتَتَابِعَيْنِ حَتَّى قُبِضَ. متفقٌ عَلَيْهِ. وفي رواية: مَا شَبِعَ آلُ مُحَمَّد صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم مُنْذُ قَدِمَ المَدِينةَ مِنْ طَعامِ البرِّ ثَلاثَ لَيَال تِبَاعاً حَتَّى قُبِض.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : ముహమ్మద్ ﷺ ఇంటివారు ఎన్నడూ వరుసగా రెండురోజులయినా బార్లీ రొట్టెలు కడుపునిండా తిని ఎరుగరు. ఆయన మరణించేవరకూ పరిస్థితి అలాగే ఉండింది.

(బుఖారీ – ముస్లిం)

వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : ముహమ్మద్ ﷺ ఇంటివారు మదీనా వచ్చినప్పటినుంచి ఎన్నడూ వరుసగా మూడురోజుల పాటుకూడా గోధుమ రొట్టెలు కడుపునిండా తినలేదు. ఆయన మరణించేదాకా అదే పరిస్థితి.

(సహీహ్ బుఖారీలోని అన్నపానీయాల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని ఐహిక అనాసక్తత, ప్రేమైక వచనాల ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha) reported: The family of Muhammad ﷺ never ate to the fill the bread of barley for two successive days until he died.[Al-Bukhari and Muslim].

Another narration is: `Aishah (radiyallahu anha) said: Never did the family of Muhammad ﷺ eat to the fill, since their arrival to Al-Madinah, the bread of wheat for three successive nights until his death.

ముఖ్యాంశాలు

దైవప్రవక్త ﷺ తన జీవితపు ఆఖరి దశలో కుటుంబ ఖర్చుల నిమిత్తం ఒక ఏడాదికి సరిపోయేధనాన్ని నిల్వచేసి ఉంచుకోవాలనుకున్నారు. కాని తన దాతృస్వభావం మూలంగా అలా చేయలేకపోయారు. సంపాదించిన ధనాన్నంతటిని ఆయన నిరుపేదలు, అభాగ్యుల కోసమే ఖర్చుపెట్టేవారు. చివరకు ఆయన నిర్యాణం చెందేటప్పటికి ఇంట్లో చిల్లిగవ్వ కూడా మిగలలేదు. ఒకరోజు కడుపునిండా తింటే రెండోరోజు తినడానికి ఒక్క రొట్టెముక్క కూడా లభించేదికాదు. కొన్ని కొన్ని వారాలపాటు ఒక్కపొద్దులు గడపవలసివచ్చేది. ప్రవక్త గారి నిరుపమాన ఐహిక అనాసక్తతకు, అసామాన్యమైన నిరపేక్షాభావానికి ఈ హదీసు ఒక మచ్చుతునక మాత్రమే.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|56. పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితం గడపటం, మామూలు అన్నపానీయాలు, వస్త్ర సౌకర్యాలతోనే తృప్తిగా బతకటం, మనోవాంఛలకు దూరంగా ఉండటం గురించి……|హదీసు 491

492

హదీసు 492

وعن عُرْوَةَ عَنْ عائشة رضي اللَّه عنها، أَنَّهَا كَانَتْ تَقُولُ: وَاللَّه يَا ابْنَ أُخْتِي إِنْ كُنَّا لَنَنْظُرُ إلى الهِلالِ ثمَّ الهِلالِ. ثُمَّ الهلالِ ثلاثةُ أَهِلَّةٍ في شَهْرَيْنِ. وَمَا أُوقِدَ في أَبْيَاتِ رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم نارٌ قُلْتُ: يَا خَالَةُ فَمَا كَانَ يُعِيشُكُمْ؟ قالتْ: الأَسْوَدَانِ: التَّمْرُ وَالمَاءُ إِلاَّ أَنَّهُ قَدْ كَانَ لرسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم جِيرانٌ مِنَ الأَنْصَارِ. وَكَانَتْ لَهُمْ مَنَائِحُ وَكَانُوا يُرْسِلُونَ إِلى رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم مِنْ أَلبانها فَيَسْقِينَا. متفقٌ عَلَيْهِ.

విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) తనతో ఇలా అనేవారని హజ్రత్ ఉర్వా (రదియల్లాహు అన్హు) తెలియజేశారు: "బాబూ! దైవసాక్షిగా చెబుతున్నాను. మేము ఒక నెలవంకను చూసేవాళ్ళం; రెండు నెలవంకలు చూసేవాళ్ళం. ఆ విధంగా రెండు మాసాల్లో మాకు మూడు నెలవంకలు కనిపించేవి. కాని ఆ రెండు మాసాలవరకు దైవప్రవక్త ఇండ్లలో పొయ్యి రాజేయబడేది కాదు.

ఆ మాట విని ఉర్వా (రదియల్లాహు అన్హు) ఆయిషా (రదియల్లాహు అన్హా)ను "పిన్నీ! మరి మీరప్పుడు ఏం తిని ఉండేవారు?" అని అడిగారు. దానికి సమాధానమిస్తూ హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా), 'రెండు నల్లని వస్తువులు. అంటే ఖర్జూరపండ్లు, నీళ్ళతో కడుపునింపుకునేవాళ్ళం. అయితే దైవప్రవక్తకు ఇరుగుపొరుగున కొందరు అన్సార్ ముస్లింలు నివసించేవారు. వారిదగ్గర పాలిచ్చే పశువులుండేవి. అప్పుడప్పుడూ వారు దైవప్రవక్తకు పాలు (కానుకగా) పంపితే ఆయన మాక్కూడా ఆ పాలు త్రాగటానికి ఇచ్చేవారు" అని చెప్పారు.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని కానుకల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని ఐహిక అనాసక్తత ప్రకరణం)

English

`Urwah from `Aishah (radiyallahu anha) reported that she used to say to Urwah (radiyallahu anhu): “O son of my sister, by Allah, I used to see the new moon, then the new moon, then the new moon, i.e., three moons in two months, and a fire was not kindled in the house of Messenger of Allah ﷺ. “I (`Urwah) said, “O my aunt, what were your means of sustenance?” She said; “Dates and water. But it (so happened) that Messenger of Allah ﷺ had some Ansar neighbours who had milch animals. They used to send Messenger of Allah ﷺ some milk of their (animals) and he gave that to us to drink.”[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|56. పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితం గడపటం, మామూలు అన్నపానీయాలు, వస్త్ర సౌకర్యాలతోనే తృప్తిగా బతకటం, మనోవాంఛలకు దూరంగా ఉండటం గురించి……|హదీసు 492

493

హదీసు 493

وعن أَبي سعيدٍ المقْبُريِّ عَنْ أَبي هُرَيرةَ رضي اللَّه عنه. أَنه مَرَّ بِقَوم بَيْنَ أَيْدِيهمْ شَاةٌ مَصْلِيةٌ. فَدَعَوْهُ فَأَبى أَنْ يَأْكُلَ، وقال: خَرج رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم مَنْ الدُّنْيَا ولمْ يشْبعْ مِنْ خُبْزِ الشَّعِيرِ. رواه البخاري. "مَصْلِيَّةٌ"بفتحِ الميم: أَيْ: مَشْوِيةٌ.

హజ్రత్ అబూ సయీద్ మఖ్‌బురి (రదియల్లాహు అన్హు) కథనం : కొంతమంది (ఓ విందు భోజనంలో) వేయించిన మేకను తమ ముందు పెట్టుకొని ఉన్నారు. అంతలో అబూ హురైరా (రదియల్లాహు అన్హు) అటుగా వెళుతుండటం చూసి వారు ఆయన్ని కూడా (విందుకు) ఆహ్వానించారు. కాని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) "దైవప్రవక్త ﷺ తాను ఇహలోకం వదలి వెళ్ళినప్పుడు బార్లీ రొట్టెలతోనయినా కడుపునిండా అన్నం తినలేకపోయారు" అని చెప్పి ఆ భోజనం తినకుండా వెళ్ళిపోయారు. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని అన్నపానీయాల ప్రకరణం)

English

Abu Sa`id Maqburi reported: Abu Hurairah (radiyallahu anhu) said that he happened to pass by some people who had a roast lamb before them. They invited him, but he declined, saying: “The Messenger of Allah ﷺ left the world without having eaten his fill with barley bread.”[Al-Bukhari].

ముఖ్యాంశాలు

  1. దైవప్రవక్త సహచరులు ఆయన్ని అనుసరించటానికి ఎంతగా తాపత్రయపడేవారో ఈ హదీసు ద్వారా విదితమవుతోంది. చివరికి దైవప్రవక్తను అనుసరించటం విధికానటువంటి విషయాల్లో కూడా వారు ఆయన్ని అనుసరించటానికి ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు. దైవప్రవక్త ﷺ పట్ల వారికి గల ఎనలేని ప్రేమాభిమానాలకు ఇది దర్పణం పడుతోంది. ప్రస్తుత కాలంలో తాము దైవప్రవక్త ప్రేమికులం అంటూ నోటిమాటలతో కపటప్రేమను ప్రదర్శించే వారిలాంటి వారు కారు దైవప్రవక్త సహచరులు. వారు నిజమైన ప్రేమికులు. ఆ ప్రేమకు ప్రతిరూపమే దైవప్రవక్త అనుసరణ పట్ల వారికి ఇంత తపన, తాపత్రయం!
  2. దుబారాతో కూడిన విందు భోజనాలను నిరుత్సాహపరిచే ఉద్దేశ్యంతో వాటిని బహిష్కరిం చటం, అలాంటి విందులకు హాజరుకాకపోవటం షరీఅత్‌కు విరుద్ధం కాదు. పైగా ఇలా చేస్తే షరీఅత్ సూత్రాలను, దాని ప్రమాణాలను రక్షించినట్లు అవుతుంది. కాని నేడు చాలావరకు విందుభోజనాల్లో ఈ దుబారా ఖర్చు సర్వసామాన్యమైపోయింది. చివరికి తమను తాము ధార్మిక వ్యక్తులుగా చెప్పుకునే పెద్ద మనుషుల విందు భోజనాలు కూడా అందుకు తీసిపోనట్టుగా ఉండటం మరింత ఆందోళనకరమైన విషయం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|56. పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితం గడపటం, మామూలు అన్నపానీయాలు, వస్త్ర సౌకర్యాలతోనే తృప్తిగా బతకటం, మనోవాంఛలకు దూరంగా ఉండటం గురించి……|హదీసు 493

494

హదీసు 494

وعن أَنسٍ رضي اللَّه عنه، قَالَ: لمْ يأْكُل النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم عَلَى خِوَانٍ حَتَّى مَات، وَمَا أَكَلَ خُبزاً مرَقَّقاً حَتَّى مَاتَ. رواه البخاري. وفي روايةٍ لَهُ: وَلا رَأَى شَاةَ سَمِيطاً بِعَيْنِهِ قطُّ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ తన జీవితంలో ఎన్నడూ బల్ల (టేబుల్)పై భోజనం చేయలేదు. అలాగే జీవితాంతం వరకు మెత్తటి పిండితో చేసిన రొట్టెలు (కూడా) తినలేదు. (బుఖారీ)

వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : ఆయన వేయించిన మేక మొహం కూడా చూడలేదు.

(సహీహ్ బుఖారీలోని అన్నపానీయాల ప్రకరణం)

English

Anas (radiyallahu anhu) reported: The Prophet ﷺ neither ate on a dining cloth, nor ate soft bread throughout his life.[Al-Bukhari].

One narration adds: He ﷺ never even saw a Samit lamb.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|56. పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితం గడపటం, మామూలు అన్నపానీయాలు, వస్త్ర సౌకర్యాలతోనే తృప్తిగా బతకటం, మనోవాంఛలకు దూరంగా ఉండటం గురించి……|హదీసు 494

495

హదీసు 495

وعن النُّعمانِ بن بشيرٍ رضي اللَّه عنهما قَالَ: لَقَدْ رَأَيْتُ نَبِيَّكُمْ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وَمَا يَجِدُ مِنْ الدَّقَلِ مَا يَمْلأُ بِهِ بَطْنَهُ، رواه مسلم. الدَّقَلُ: تمْرٌ رَدِيءٌ.

హజ్రత్ నోమాన్ బిన్ బషీర్ (రదియల్లాహు అన్హుమా) ఇలా అంటున్నారు : నేను మీ ప్రవక్తను చూశాను. ఆయన దగ్గర కడుపునింపుకోవటానికి తాలు ఖర్జూరాలు కూడా ఉండేవి కావు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని ఐహిక అనాసక్తత ప్రకరణం)

English

An-Nu`man bin Bashir (radiyallahu anhuma) reported: I have seen your Prophet ﷺ when he did not find enough of even the inferior quality of dates to eat and fill his belly.[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|56. పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితం గడపటం, మామూలు అన్నపానీయాలు, వస్త్ర సౌకర్యాలతోనే తృప్తిగా బతకటం, మనోవాంఛలకు దూరంగా ఉండటం గురించి……|హదీసు 495

496

హదీసు 496

وعن سهل بن سعدٍ رضي اللَّه عنه، قال: ما رَأى رُسولُ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم النّقِيّ منْ حِينَ ابْتعَثَهُ اللَّه تَعَالَى حتَّى قَبَضَهُ اللَّه تَعَالَى، فقِيلَ لَهُ هَلْ كَانَ لَكُمْ في عهْد رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم مَنَاخلُ؟ قَالَ: مَا رَأى رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم مُنْخَلاَ مِنْ حِينَ ابْتَعثَهُ اللَّه تَعَالَى حَتَّى قَبَضُه اللَّه تَعَالَى، فَقِيلَ لهُ: كَيْفَ كُنْتُمْ تَأْكُلُونَ الشَّعِيرَ غيرَ منْخُولٍ؟ قَالَ: كُنَّا نَطْحُنَهُ ونَنْفُخُهُ، فَيَطيرُ مَا طارَ، وَمَا بَقِي ثَرَّيْناهُ. رواه البخاري. قَوْله:"النَّقِيّ": هُوَ بفتح النون وكسر القاف وتشديد الياءِ. وهُوَ الخُبْزُ الحُوَّارَى، وَهُوَ: الدَّرْمَكُ، قَوْله:"ثَرَّيْنَاهُ"هُو بثاءٍ مُثَلَّثَةٍ، ثُمَّ رَاءٍ مُشَدَّدَةٍ، ثُمَّ ياءٍ مُثَنَّاةٍ مِنْ تَحْت ثُمَّ نون، أَيْ: بَلَلْناهُ وعَجَنَّاهُ.

హజ్రత్ సహ్ల్ బిన్ సాద్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ తాను దైవప్రవక్తగా ఎన్నికయినప్పటి నుంచి మరణించేవరకు మెత్తటి పిండితో తయారుచేసిన రొట్టెల మొహం కూడా చూడలేదు.

కొంతమంది సహ్ల్ (రదియల్లాహు అన్హు)తో మాట్లాడుతూ, "దైవప్రవక్త కాలంలో మీ దగ్గర జల్లెడలు ఉండేవా?" అని అడిగారు. దానికి సమాధానమిస్తూ ఆయన "దైవప్రవక్త ﷺ తాను ప్రవక్తగా ఎన్నికయినప్పటి నుంచి మరణించే వరకు ఒక్క జల్లెడ కూడా చూడలేదు" అని అన్నారు. "మరి మీరు జల్లెడపట్టని యవలు (రొట్టెలు) ఎలా తినేవార"ని ప్రజలు సందేహపడగా, దానికి ఆయన "మేము యవలు గింజల్ని దంచిన తరువాత పిండిని ఊదేవాళ్ళం. దాంతో పొట్టంతా ఎగిరిపోయేది. మిగతా పిండిని మేము (రొట్టెలకోసం) నానబెట్టుకునేవాళ్ళం" అని చెప్పారు. (బుఖారీ)

'నఖీ' అంటే మైదా పిండి. 'సర్రైనా' అంటే 'మేమా పిండిని నానబెట్టుకునేవాళ్ళం' అని అర్థం.

(సహీహ్ బుఖారీలోని అన్నపానీయాల ప్రకరణం)

English

Sahl bin Sa`d (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ had never seen bread made out of fine flour throughout his life, since Allah commissioned him until his death. He was asked, “Did you not have sieves at the time of the Messenger of Allah?” He replied, “Messenger of Allah ﷺ never saw a sieve.” He was asked, “How did you manage to eat barley bread made of unsieved flour?” He said, ”We used to ground it and then blew away the husk, and what remained we kneaded into dough.”[Al-Bukhari].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|56. పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితం గడపటం, మామూలు అన్నపానీయాలు, వస్త్ర సౌకర్యాలతోనే తృప్తిగా బతకటం, మనోవాంఛలకు దూరంగా ఉండటం గురించి……|హదీసు 496

497

హదీసు 497

وعن أبي هُريرةَ رضي اللَّه عنه قَالَ: خَرَجَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم ذاتَ يَوْمٍ أَوْ لَيْلَةٍ، فَإِذا هُوَ بِأَبي بكْرٍ وعُمَرَ رضي اللَّه عنهما، فَقَالَ:"مَا أَخْرَجَكُمَا مِنْ بُيُوتِكُما هذِهِ السَّاعَةَ؟ "قَالا: الجُوعُ يَا رَسولَ اللَّه. قالَ:"وَأََنا، والَّذِي نَفْسِي بِيَدِهِ، لأَخْرَجَني الَّذِي أَخْرَجَكُما. قُوما"فقَاما مَعَهُ، فَأَتَى رَجُلاً مِنَ الأَنْصارِ، فَإِذَا هُوَ لَيْسَ في بيتهِ، فَلَمَّا رَأَتْهُ المرَأَةُ قالَتْ: مَرْحَباً وَأَهْلاً. فقال لَهَا رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "أَيْنَ فُلانٌ"قالَتْ: ذَهَبَ يَسْتَعْذِبُ لَنَا الماءَ، إِذْ جاءَ الأَنْصَاريُّ، فَنَظَرَ إِلَى رَسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وَصَاحِبَيْهِ، ثُمَّ قالَ: الحَمْدُ للَّه، مَا أَحَدٌ اليَوْمَ أَكْرَمَ أَضْيافاً مِنِّي فانْطَلقَ فَجَاءَهُمْ بِعِذْقٍ فِيهِ بُسْرٌ وتَمْرٌ ورُطَبٌ، فَقَالَ: كُلُوا، وَأَخَذَ المُدْيَةَ، فَقَالَ لَهُ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"إِيَّاكَ وَالحَلُوبَ"فَذَبَحَ لَهُمْ، فَأَكلُوا مِنَ الشَّاةِ وَمِنْ ذلكَ العِذْقِ وشَرِبُوا. فلمَّا أَنْ شَبعُوا وَرَوُوا قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم لأَبي بكرٍ وعُمَرَ رضي اللَّه عنهما:"وَالَّذِي نَفْسي بِيَدِهِ، لَتُسْأَلُنَّ عَنْ هذَا النَّعيمِ يَوْمَ القِيامَةِ، أَخْرَجَكُمْ مِنْ بُيُوتِكُمُ الجُوعُ، ثُمَّ لَمْ تَرْجِعُوا حَتَّى أَصَابَكُمْ هذا النَّعِيمُ" رواه مسلم. قَوْلُها:"يَسْتَعْذبُ"أَيْ: يَطْلبُ الماءَ العَذْبَ، وهُوَ الطَّيبُ. وَ"العِذْقُ"بكسر العين وإسكان الذال المعجمة: وَهُو الكِباسَةُ، وهِيَ الغُصْنُ. وَ"المُدْيةُ"بضم الميم وكسرِها: هي السِّكِّينُ. وَ"الحلُوبُ"ذاتُ اللبَن. وَالسؤالُ عَنْ هَذَا النعِيم سُؤالُ تَعدِيد النِّعَم لا سُؤالُ توْبيخٍ وتَعْذِيبٍ. واللَّهُ أَعْلَمُ وَهَذَا الأنصارِيُّ الَّذِي أَتَوْهُ هُوَ أَبُو الهَيْثمِ بنُ التَّيِّهان رضي اللَّه عنه، كَذا جاءَ مُبَيناً في روايةِ الترمذي وغيره.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం : ఒకరోజు పగలో లేక రాత్రో దైవప్రవక్త ఇంటినుంచి బయలుదేరారు. దారిలో ఆయనకు అబూబక్ర్, ఉమర్ (రదియల్లాహు అన్హుమా)లు కలిశారు. దైవప్రవక్త ﷺ వారిని చూసి, "ఈ వేళప్పుడు బయలుదేరారేమిటి?" అని అడిగారు. "ఆకలి (భరించలేక బయటికొచ్చాం) దైవప్రవక్తా!" అని విన్నవించుకున్నారు ఆ ఇద్దరు అనుచరులు. "ఎవరి గుప్పెట్లోనయితే నా ప్రాణముందో ఆయన సాక్షిగా చెబుతున్నాను. మీరిద్దరు ఎందుకు బయలుదేరారో నేనూ అందుకే బయలుదేరాను. పదండి" అని అన్నారు దైవప్రవక్త ﷺ. ఇద్దరూ ఆయన వెంట నడిచారు. దైవప్రవక్త ఓ అన్సార్ ముస్లిం ఇంటిదగ్గర ఆగారు. ఆ సమయంలో అతను ఇంట్లో లేడు. అతని ఇల్లాలు దైవప్రవక్తను చూసి 'స్వాగతం, సుస్వాగతం' అంటూ ఆయన్ని లోపలికి ఆహ్వానించింది. "మీ ఆయన ఏడి?" అని అడిగారు దైవప్రవక్త ﷺ. "మంచినీళ్ళు తీసుకురావటానికి వెళ్ళారు" అని చెప్పిందామె. అంతలో ఆ అన్సార్ వ్యక్తి కూడా వచ్చాడు. దైవప్రవక్తను, ఆయన వెంట ఉన్న ఇద్దరు అనుచరుల్ని చూసి అతను "అల్‌హమ్దులిల్లాహ్. ఈ రోజు ఆతిథ్య మిచ్చేవారిలో నాకన్నా అదృష్టవంతుడు ఉండడు" అని అన్నాడు సంతోషాన్ని వ్యక్తంచేస్తూ. ఆ తరువాత అతనెళ్ళి ఖర్జూరపు గెల ఒకటి పట్టుకొచ్చాడు. అందులో దోరమాగిన, ఎండిన, పచ్చిగా ఉన్న ఖర్జూరాలు ఉన్నాయి. అతను "మీరు ఇవి తింటూ ఉండండి" అని (గెలవారికిచ్చి) తను కత్తి చేతిలోకి తీసుకున్నాడు.

దైవప్రవక్త (అతని ఉద్దేశ్యాన్ని పసిగట్టి) "పాలిచ్చే మేకను మాత్రం కోయకు సుమా!" అని అన్నారు. అతను ఒక మేకను కోసి వారికి (వండి) పెట్టాడు. వారు ఆ మేకమాంసం, ఖర్జూర పండ్లు తిని కడుపునింపుకున్నారు. ఆ తరువాత దైవప్రవక్త ﷺ అబూబక్ర్, ఉమర్‌లను ఉద్దేశ్యించి "ఎవరి గుప్పెట్లోనయితే నా ప్రాణముందో ఆయన సాక్షిగా చెబుతున్నాను. ప్రళయదినాన మిమ్మల్ని ఈ అనుగ్రహాలను గురించి తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది. మీరు ఆకలితో (కడుపు చేతపట్టుకొని) ఇండ్లనుంచి బయలుదేరారు. కాని ఇప్పుడు ఈ అనుగ్రహాలను అనుభవించి తిరిగివెళుతున్నారు" అని అన్నారు.

(ముస్లిం)

"ఈ అనుగ్రహాలను గురించి మిమ్మల్ని ప్రశ్నించటం జరుగుతుందం"టే దేవుడు మీకు తన అనుగ్రహాలు గుర్తుచేస్తాడని అర్థం. అంతేగాని మిమ్మల్ని దండించటం కోసమో లేక మందలిం చటం కోసమో ప్రశ్నించటం జరుగు తుందని అర్థం ఎంతమాత్రం కాదు. వాస్తవం దేవునికే బాగా తెలుసు. ఇకపోతే ఈ హదీసులో దైవప్రవక్తకు ఆతిథ్యమిచ్చిన అన్సార్ వ్యక్తి అబుల్ హైసమ్ బిన్ తీహాన్ (రదియల్లాహు అన్హు) అని తిర్మిజీ, తదితరుల ఉల్లేఖనాల ద్వారా తెలుస్తోంది.

(సహీహ్ ముస్లింలోని పానీయాల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ went out (of his house) one day, or one night, and there he met Abu Bakr and `Umar (radiyallahu anhum) also. He ﷺ said, “What made you leave your houses at this hour?” They said, “It is hunger, O Messenger of Allah.” He said, “By Him in Whose Hands my soul is, what made you leave, made me also leave, so come along!” And he went along with them to a man from the Ansar, but they did not find him in his house. When the wife of that man saw the Prophet, she said, “You are most welcome.” Messenger of Allah ﷺ said to her, “Where is so-and-so?” She said, “He went to fetch some fresh water for us.” In the meantime, the Ansari came back, saw Messenger of Allah ﷺ and his two companions and said: “Praise be to Allah, today no one has more honourable guests than I.” He then went out and brought them a bunch of date fruit, having dates, some still green, some ripe, and some fully ripe, and requested them to eat from it. He then took his knife (to slaughter a sheep). Messenger of Allah ﷺ said to him, “Do not kill a milch sheep.” So he slaughtered a sheep for them. After they had eaten and drunk to their fill, Messenger of Allah ﷺ said to Abu Bakr and `Umar (radiyallahu anhuma), “By Him in Whose Hand my soul is, you will certainly be questioned about this treat on the Day of Resurrection. Hunger brought you out of your homes, and you do not return to your homes till you have been blessed with this treat.”[Muslim].

ముఖ్యాంశాలు

ఇస్లాం ఆవిర్భవించిన తొలినాళ్ళలో, మదీనాకు వలసవచ్చిన తరువాత కూడా దైవప్రవక్త, ఆయన అనుచరులు దుర్భర దారిద్ర్యాన్ని ఎదుర్కొన్నారు. వారాలు గడిచిపోయినా ఒక్కపూట కూడా కడుపునిండా భోజనం దొరికేది కాదు. నకనకలాడే కడుపులతో దైవప్రవక్త అనుచరులు ఆహారాన్వేషణలో బయలుదేరేవారు. ఎక్కడయినా తినడానికి ఏమయినా దొరికితే దాంతోనే తృప్తి చెందేవారు. ఒకవైపు దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూనే మరోవైపు తాము తిన్న ఆహారానికి ప్రళయదినాన లెక్కచూపవలసి ఉంటుందని భయంతో బ్రతికేవారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|56. పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితం గడపటం, మామూలు అన్నపానీయాలు, వస్త్ర సౌకర్యాలతోనే తృప్తిగా బతకటం, మనోవాంఛలకు దూరంగా ఉండటం గురించి……|హదీసు 497

498

హదీసు 498

وعن خالدِ بنِ عُمَرَ العَدَويِّ قَالَ: خَطَبَنَا عُتْبَةُ بنُ غَزْوانَ، وكانَ أَمِيراً عَلى البَصْرَةِ، فَحمِدَ اللَّه وأَثْنى عليْهِ، ثُمَّ قَالَ: أَمَا بعْدُ، فَإِنَّ الدُّنْيَا قَدْ آذَنَتْ بصُرْمٍ، ووَلَّتْ حَذَّاءَ، وَلَمْ يَبْقَ مِنْهَا إِلاَّ صُبَابَةٌ كَصُبابةِ الإِناءِ يتصابُّها صاحِبُها، وإِنَكُمْ مُنْتَقِلُونَ مِنْها إِلَى دارٍ لاَ زَوالَ لهَا، فانْتَقِلُوا بِخَيْرِ مَا بِحَضْرَتِكُم فَإِنَّهُ قَدْ ذُكِرَ لَنا أَنَّ الحَجَرَ يُلْقَى مِنْ شَفِير جَهَنَّمَ فَيهْوى فِيهَا سَبْعِينَ عَاماً لاَ يُدْركُ لَها قَعْراً، واللَّهِ لَتُمْلأَنَّ.. أَفَعَجِبْتُمْ،؟ ولَقَدْ ذُكِرَ لَنَا أَنَّ مَا بَيْنَ مِصْراعَيْنِ مِنْ مَصاريعِ الجَنَّةِ مَسيرةَ أَرْبَعِينَ عَاماً، وَلَيَأْتِينَّ عَلَيها يَوْمٌ وهُوَ كَظِيظٌ مِنَ الزِّحامِ، وَلَقَدْ رأَيتُني سابعَ سبْعَةٍ مَعَ رَسُولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم مالَنا طَعامٌ إِلاَّ وَرَقُ الشَّجَرِ، حَتَّى قَرِحَتْ أَشْداقُنا، فالْتَقَطْتُ بُرْدَةً فشَقَقْتُها بيْني وَبَينَ سَعْدِ بنِ مالكٍ فَاتَّزَرْتُ بنِصْفِها، وَاتَّزَر سَعْدٌ بنِصفِها، فَمَا أَصْبَحَ اليَوْم مِنَّا أَحَدٌ إِلاَّ أَصْبَحَ أَمِيراً عَلى مِصْرٍ مِنْ الأَمْصَارِ. وإِني أَعُوذُ باللَّهِ أَنْ أَكْونَ فِي نَفْسي عَظِيماً. وعِنْدَ اللَّهِ صَغِيراً. رواهُ مسلم. قَوْله:"آذَنَتْ"هُوَ بَمدِّ الأَلِفِ، أَيْ: أَعْلَمَتْ. وَقَوْلُه:"بِصُرْمٍ": هُوَ بضم الصاد. أيْ: بانْقطاعِها وَفَنائِها. وَقوله"ووَلَّتْ حَذَّاءَ"هُوَ بحاءٍ مهملةٍ مفتوحةٍ، ثُمَّ ذال معجمة مشدَّدة، ثُمَّ أَلف ممدودَة. أَيْ: سَريعَة وَ"الصُّبابةُ"بضم الصاد المهملة: وهِي البقِيَّةُ اليَسِيرَةُ. وقولُهُ:"يَتَصابُّها"هُوَ بتشديد الباءِ قبل الهاء. أَيْ: يجْمَعُها. وَالكَظِيظُ: الكثيرُ المُمْتَلئُ. وَقَوْلُه:"قَرِحَتْ"هُوَ بفتحِ القاف وكسر الراءِ، أَيْ: صارَتْ فِيهَا قُرُوحٌ.

హజ్రత్ ఖాలిద్ బిన్ ఉమైర్ అదవీ (రదియల్లాహు అన్హు) కథనం : ఒకసారి ఉత్బా బిన్ గజ్వాన్ మాముందు ప్రసంగించారు. ఆయన బస్రా ప్రాంతానికి గవర్నర్‌గా ఉండేవారు. తన ప్రసంగానికి ముందు దేవుణ్ణి స్తుతించి ఆ తరువాత ఇలా అన్నారు : "నిస్సందేహంగా ప్రపంచం తన ముగింపుని ప్రకటించుకున్నది. బహువేగంతో వెనుదిరిగింది. పాత్రలో మిగిలిపోయిన పానీయంలా ఉంది ఇప్పుడు దాని పరిస్థితి. త్రాగేవాడు మిగిలిపోయింది (కూడా) తాగేస్తాడు. మీరు (ఇహలోకాన్ని వీడి) శాశ్వతమైన (పర)లోకానికి చనిపోనున్నారు. కనుక మీరక్కడికి మీ దగ్గరున్న మంచి వస్తువుల్ని పట్టుకెళ్ళండి. ఎందుకంటే నరకం అంచునుండి ఒక రాయిని అందులో పడవేస్తే డెబ్భై ఏళ్ళ దాకా అది నరకంలో పడుతూ ఉంటుందని, అప్పటికీ అడుగుభాగానికి చేరుకోలేదని మనకు తెలియజేయబడింది. దైవసాక్షి! ఆ నరకం మానవులతోనే నింపబడు తుంది. ఆశ్చర్యంగా ఉందా?! అంతేకాదు, స్వర్గద్వారం వెడల్పు ఒక తలుపు నుంచి ఇంకో తలుపుకి మధ్య నలభైయేండ్ల వ్యవధి అంత దూరం ఉంటుందని కూడా మనకు తెలియజేయబడింది. ఏదో ఒకరోజు అలాంటి స్వర్గం కూడా జనంతో కిక్కిరిసిపోతూ ఉంటుంది.

నిజం చెప్పాలంటే (ఇస్లాం ఆవిర్భవించిన తొలినాళ్ళలో) దైవప్రవక్తకు తోడయిన ఏడుగురిలో నేను ఏడో వ్యక్తిని. ఆ కాలంలో మా దగ్గర తినడానికి చెట్ల ఆకులు తప్ప మరేమీ ఉండేవికావు. అవి తినటం వల్ల మా పెదాల చివర్లు కందిపోయేవి. ఆ రోజుల్లోనే నాకు ఓ దుప్పటి దొరికింది. నేను దాన్ని రెండు భాగాలుగా చించి ఒకటి నేనుంచుకొని రెండోది సాద్ బిన్ అబూ వఖ్ఖాస్‌కు ఇచ్చాను. మేమిద్దరం వాటిని లుంగీలుగా కట్టుకునేవాళ్ళం. కాని ఈ రోజు మనలోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక నగరానికి అధికారులుగా ఉన్నారు. కనుక ఇప్పుడు నేను దేవుని దృష్టిలో చిన్నవాణ్ణయినప్పటికీ మనసులో మాత్రం గొప్పవాడిగా ఊహించుకోవటం నుంచి కాపాడమని దైవాన్ని వేడుకుంటున్నాను. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని ఐహిక అనాసక్తత ప్రకరణం)

English

Khalid bin `Umar Al-`Adawi reported: `Utbah bin Ghazwan, the governor of Basrah, delivered a Khutbah. He praised Allah, glorified Him, then said: “Amma b`adu, verily, the world has been given the news of its end and is running to meet its end swiftly. Nothing is left out of it but a very little amount. Similar to the remainder in a dish whose owner is collecting it to drink; and you are going to move to an abode which knows no end, and you should proceed there with the good before you, for we have been informed (by the Prophet ﷺ) that a stone would be thrown at one side of the Hell and it would travel down for seventy years but would not reach its bottom. By Allah, it will be filled (with men and jinn). Do you find it strange? We have been informed (i.e., by the Prophet ﷺ) that the distance between two shutters of the gate of Jannah is forty years (distance). And a day would come when it would be fully packed; I was the seventh amongst the seven who had been with Messenger of Allah ﷺ, and we had nothing to eat but the leaves of the tree until the sides of our mouth were injured. We found a sheet which we tore into two and divided between myself and Sa`d bin Malik. I made the lower garment with half of it and so did Sa`d. Today, there is none amongst us who has not become the governor of a city, and I seek refuge with Allah that I should consider myself great while I am insignificant to Allah.”[Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో దైవప్రవక్త సహచరుల నిరుపేద జీవనంతో పాటు ఈ క్రింది ముఖ్య విషయాలు వివరించబడ్డాయి.

1. ఈ హదీసులో పరలోకాన్ని గుర్తుచేసి నరకశిక్ష గురించి హెచ్చరించటం జరిగింది.

2. ప్రపంచం క్షీణత, వినాశం వైపు అత్యంత వేగంగా పరుగిడుతోందని చెప్పబడింది.

3. స్వర్గనరకాల వైశాల్యం, వాటి ఔన్నత్యాలు వివరించబడ్డాయి.

4. తర్వాతి కాలంలో దైవప్రవక్త సహచరులకు కలిగిన సిరిసంపదల విస్తృతి గురించి ప్రస్తావించబడింది. దీనిద్వారా దేవుడు వారికి ప్రపంచంలో అధికారాన్ని, ఆధిక్యతను ప్రసాదిస్తాడన్న వాగ్దానం నెరవేరిందని చెప్పబడింది.

5. తర్వాత దైవప్రవక్త సహచరుల గుణవిశేషాలు ఈ హదీసులో పొందుపరచబడ్డాయి. ప్రపంచంలో అధికారం లభించిన తర్వాత కూడా వారిలో ఎలాంటి గర్వం పొడసూపలేదు. ఎప్పటిలాగే వారిలో వినమ్రత, అణకువ భావాలే కనిపించాయి. తమల్ని తాము గర్వం నుంచి కాపాడుకోవటానికి వారు ఎల్లప్పుడూ దైవసహాయం కోరుతూ ఉండేవారు.

6. ప్రజల దృష్టిలో గొప్పవాడు కావాలని కోరుకోరాదు. అల్లాహ్ సన్నిధిలో గొప్పవాడుగా అవ్వాలని కోరుకోవాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|56. పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితం గడపటం, మామూలు అన్నపానీయాలు, వస్త్ర సౌకర్యాలతోనే తృప్తిగా బతకటం, మనోవాంఛలకు దూరంగా ఉండటం గురించి……|హదీసు 498

499

హదీసు 499

وعن أَبي موسى الأَشْعَريِّ رضي اللَّهُ عنه قَالَ: أَخْرَجَتْ لَنا عائِشَةُ رضي اللَّهُ عنها كِساء وَإِزاراً غَلِيظاً قالَتْ: قُبِضَ رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم في هَذَيْنِ. متفقٌ عَلَيْهِ.

హజ్రత్ అబూ మూసా అష్‌అరీ (రదియల్లాహు అన్హు) కథనం : ఒకసారి ఆయిషా (రదియల్లాహు అన్హా) పైన వేసుకునే దుప్పటిని, క్రింద (లుంగీలాగా) కట్టుకునే మందంగా ఉన్న ఇంకో దుప్పటిని తీసి చూపిస్తూ, "దైవప్రవక్త ﷺ ఈ రెండు దుప్పట్లలోనే తనువు చాలించార"ని చెప్పారు.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని జిహాద్ ప్రకరణం)

English

Abu Musa Al-Ash`ari (radiyallahu anhu) reported: `Aishah (radiyallahu anha) showed us a sheet and a thick lower garment and said to us Messenger of Allah ﷺ was wearing them when he died.[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|56. పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితం గడపటం, మామూలు అన్నపానీయాలు, వస్త్ర సౌకర్యాలతోనే తృప్తిగా బతకటం, మనోవాంఛలకు దూరంగా ఉండటం గురించి……|హదీసు 499

500

హదీసు 500

وعنْ سَعد بن أَبي وَقَّاصٍ. رضيَ اللَّه عنه قَالَ: إِنِّي لأَوَّلُ العَربِ رَمَى بِسَهْمِ في سَبِيلِ اللَّهِ، وَلَقَدْ كُنا نَغْزُو مَعَ رسولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم مَا لَنَا طَعَامٌ إِلاَّ وَرَقُ الحُبْلَةِ. وَهذا السَّمَرُ. حَتى إِنْ كانَ أَحَدُنا لَيَضَعُ كما تَضَعُ الشاةُ مالَهُ خَلْطٌ. متفقٌ عَلَيْهِ. "الحُبْلَةِ"بضم الحاءِ المهملة وإِسكانِ الباءِ الموحدةِ: وَهِيَ والسَّمُرُ، نَوْعانِ مَعْروفانِ مِنْ شَجَرِ البَادِيَةِ.

హజ్రత్ సాద్ బిన్ అబూ వఖ్ఖాస్ (రదియల్లాహు అన్హు) కథనం : మొట్టమొదటిసారిగా దైవమార్గంలో (శత్రువులపై) బాణాలు విసిరిన అరబ్బు వ్యక్తిని నేను. మేము దైవప్రవక్త ﷺతో పాటు యుద్ధాలు చేసినప్పుడు మా దగ్గర తినడానికి హుబ్లా, తుమ్మ చెట్ల ఆకులు తప్ప మరేమీ ఉండేవి కావు. అవి తినటం వల్ల మాలో కొందరికి మేకపెంటికల్లాంటి మల విసర్జన జరిగేది. (పొడిగా ఉండటం చేత) మలం విడివిడిగా ఉండేది.

(బుఖారీ – ముస్లిం)

హుబ్లా, సముర్ అనేవి పేరుగాంచిన అడవివృక్షాలు.

(సహీహ్ బుఖారీలోని ప్రవక్త సహచరుల మహిమోన్నతుల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని ఐహిక అనాసక్తత ప్రకరణం)

English

Sa`d bin Abu Waqqas (radiyallahu anhu) reported: By Allah, I am the first Arab who shot an arrow in the Cause of Allah. We fought along with Messenger of Allah ﷺ when our food was only the leaves of Hublah and Samur trees (wild trees) until one of us would defecate like the droppings of sheep.[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|56. పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితం గడపటం, మామూలు అన్నపానీయాలు, వస్త్ర సౌకర్యాలతోనే తృప్తిగా బతకటం, మనోవాంఛలకు దూరంగా ఉండటం గురించి……|హదీసు 500

501

హదీసు 501

وعن أبي هُرَيْرَةَ رضي اللَّه عنه. قَالَ: قالَ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "اللَّهُمَّ اجْعَلْ رزْقَ آلِ مُحَمَّدٍ قُوتاً" متفقٌ عليه. قَالَ أَهْلُ اللُّغَة والْغَرِيبِ: معْنَى"قُوتاً"أَيْ مَا يَسدُّ الرَّمَقَ.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రార్థించారు : "దేవా! ముహమ్మద్ కుటుంబానికి పూటకు సరిపోయేటంత ఉపాధిని ప్రసాదించు చాలు." (బుఖారీ – ముస్లిం)

భాషావేత్తలు, పదకోవిదులు 'ఖూత్' అనే పదానికి అర్థం ప్రాణాన్ని నిలిపి ఉంచేటంత ఆహారమని చెప్పారు.

(సహీహ్ బుఖారీలోని ప్రేమైక వచనాల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని ఐహిక అనాసక్తత ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ used to supplicate: “O Allah, make the provisions of family of Muhammad ﷺ bare subsistence.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

దైవప్రవక్తలు ఎందుకు పుడతారు? ఆర్భాటం, యాంత్రిక జీవనం నుంచి సుఖమయమైన జీవితం వైపు, ప్రాపంచిక పటాటోపాల నుంచి పరలోక జీవిత వాస్తవాల వైపు ప్రజల దృష్టిని మళ్ళించటానికే కదా! అందుకని దైవప్రవక్తలు ముందు తాము స్వయంగా విలాసాలకు, భోగభాగ్యాలకు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. తమ జీవితం మీద మచ్చరాకుండా, తద్వారా తమ లక్ష్యం ప్రభావితం కాకుండా జాగ్రత్తపడతారు. ఆ కారణంగానే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం పై విధంగా దుఆ చేశారు. ఇందులో పండితులకు, ధర్మసందేశ ప్రదాతలకూ హితబోధ ఉంది. వారి జీవితాలు కూడా నిరాడంబరంగా, ప్రాపంచిక పటాటోపాల నుంచి స్వచ్ఛంగా ఉండాలి లేదా 'బుద్ధిచెప్పి గడ్డి తినేవార'ని ప్రజలు వారిని నిందిస్తారు. ఒకవేళ దేవుడు వారికి సిరిసంపదలు ప్రసాదించి ఉంటే వారు దైవప్రవక్తగారి ధనిక సహచరుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి. ధనరాశులను కూడబెట్టుకోవటం, వాటికోసం శక్తియుక్తులన్నింటిని ధారపోయటం వారి జీవిత లక్ష్యం కాకూడదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|56. పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితం గడపటం, మామూలు అన్నపానీయాలు, వస్త్ర సౌకర్యాలతోనే తృప్తిగా బతకటం, మనోవాంఛలకు దూరంగా ఉండటం గురించి……|హదీసు 501

502

హదీసు 502

وعن أَبي هُرَيْرَةَ رضي اللَّه عنه قَالَ: واللَّه الَّذِي لاَ إِلهَ إِلاَّ هُوَ، إِنْ كُنْتُ لأعَتمِدُ بِكَبِدِي عَلَى الأَرْضِ مِنَ الجُوعِ، وإِنْ كُنْتُ لأشُدُّ الحجَرَ عَلَى بَطْني منَ الجُوعِ. وَلَقَدْ قَعَدْتُ يوْماً على طَرِيقهِمُ الذي يَخْرُجُونَ مِنْهُ، فَمَرَّ النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَتَبَسَّمَ حِينَ رَآنِي، وعَرَفَ مَا فِي وجْهي ومَا فِي نَفْسِي، ثُمَّ قال:"أَباهِرٍّ،،"قلتُ: لَبَّيْكَ يَا رسولَ اللَّه، قَالَ:"الحَقْ"ومَضَى، فَاتَّبَعْتُهُ، فدَخَلَ فَاسْتَأْذَنَ، فَأُذِنَ لِي فدَخَلْتُ، فوَجَدَ لَبَناًفي قَدحٍ فَقَالَ:"مِنْ أَيْنَ هذَا اللَّبَنُ؟ "قَالُوا: أَهْداهُ لَكَ فُلانٌ أَو فُلانة قَالَ:"أَبا هِرٍّ،،"قلتُ: لَبَّيْكَ يَا رسول اللَّه، قَالَ:"الْحَقْ إِلى أَهْل الصُّفَّةِ فادْعُهُمْ لِي". قَالَ: وأَهْلُ الصُّفَّةِ أَضيَافُ الإِسْلام، لاَ يَأْوُون عَلى أَهْلٍ، وَلاَ مَالٍ، وَلاَ عَلَى أَحَدٍ، وكانَ إِذَا أَتَتْهُ صدقَةٌ بَعَثَ بِهَا إِلَيْهِمْ. ولَمْ يَتَنَاوَلْ مِنْهَا شَيْئاً، وإِذَا أَتَتْهُ هديَّةٌ أَرْسلَ إِلَيْهِمْ وأَصَابَ مِنْهَا وَأَشْرَكَهُمْ فِيهَا، فسَاءَني ذلكَ فَقُلْتُ: وَمَا هذَا اللَّبَنُ في أَهْلِ الصُّفَّةِ؟ كُنْتَ أَحَقَّ أَن أُصِيب منْ هَذَا اللَّبَنِ شَرْبَةً أَتَقَوَّى بِهَا، فَإِذا جاءُوا أَمَرنِي، فكُنْتُ أَنا أُعْطِيهِمْ، وَمَا عَسَى أَن يبْلُغَني منْ هَذَا اللَّبَنِ، ولمْ يَكُنْ منْ طَاعَةِ اللَّه وطَاعَةِ رسوله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم بدٌّ. فأَتيتُهُم فدَعَوْتُهُمْ، فأَقْبَلُوا واسْتأْذَنوا، فَأَذِنَ لهُمْ وَأَخَذُوا مَجَالِسَهُمْ مِنَ الْبَيْتِ قَالَ:"يَا أَبا هِرّ،،"قلتُ: لَبَّيْكَ يَا رسولَ اللَّه، قَالَ:"خذْ فَأَعْطِهِمْ"قَالَ: فَأَخَذْتُ الْقَدَحَ فَجَعَلْت أُعْطِيهِ الرَّجُلَ فيَشْرَبُ حَتَّى يَرْوَى، ثُمَّ يردُّ عليَّ الْقَدَحَ، فَأُعطيهِ الآخرَ فَيَشْرَبُ حَتَّى يروَى، ثُمَّ يَرُدُّ عَليَّ الْقَدحَ، حتَّى انْتَهَيتُ إِلى النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، وََقَدْ رَوِيَ الْقَوْمُ كُلُّهُمْ، فَأَخَذَ الْقَدَحَ فَوَضَعَهُ عَلَى يَدِهِ، فَنَظَرَ إِليَّ فَتَبَسَّمَ، فَقَالَ:"أَبا هِرّ"قلتُ: لَبَّيْكَ يَا رسول اللَّه قَالَ:"بَقِيتُ أَنَا وَأَنْتَ"قلتُ صَدَقْتَ يَا رسولَ اللَّه، قَالَ:"اقْعُدْ فَاشْرَبْ"فَقَعَدْتُ فَشَربْتُ: فَقَالَ:"اشرَبْ"فشَربْت، فَمَا زَالَ يَقُولُ:"اشْرَبْ"حَتَّى قُلْتُ: لا وَالَّذِي بعثكَ بالحَقِّ ما أَجِدُ لَهُ مسْلَكاً، قَالَ:"فَأَرِني"فأَعطيْتهُ الْقَدَحَ، فحمِدَ اللَّه تَعَالَى، وَسمَّى وَشَربَ"الفَضَلَةَ" رواه البخاري.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం : తాను తప్ప వేరొక అరాధ్యుడు లేని దేవుని సాక్షిగా చెబుతున్నాను. ఒకప్పుడు నేను ఆకలి బాధకు (తట్టుకోలేక) నేలమీద బోర్లా పడుకునేవాణ్ణి. (అలాగే కొన్నిసార్లు) తీవ్రమైన ఆకలితో కడుపుకి రాళ్ళు కట్టుకునేవాణ్ణి. ఒకరోజు నేను జనం నడిచేదారిలో కూర్చొని ఉండగా దైవప్రవక్త ﷺ నా సమీపం నుంచి వెళ్తున్నారు. నన్ను చూసి ఆయన చిరునవ్వు నవ్వారు. నా ముఖ కవళికల్ని, మనసులో ఉన్న బాధను అర్థం చేసుకొని 'అబూ హురైరా!' అని పిలిచారు. నేను 'సెలవియ్యండి దైవప్రవక్తా!' అన్నాను. 'నాతోరా' అని చెప్పి ఆయన బయలుదేరారు. నేను కూడా ఆయన వెంట నడిచాను. (అలా నడుస్తూ ఉండగా ఆయన ఇల్లు వచ్చింది.)

ఆయన ఇంట్లోకి ప్రవేశించారు. ఆయన అనుమతితో నేను కూడా లోపలికి వెళ్ళాను. ఇంట్లో ఆయనకు పాలతో నిండివున్న గిన్నె కనిపించింది. "ఈ పాలెక్కడివి?" అని ఇంట్లోవాళ్ళని అడిగారు. ఫలానా అతను లేదా ఫలానా ఆమె మీకు కానుకగా పంపించారని ఇంట్లో వాళ్ళు చెప్పారు. అప్పుడు ఆయన 'అబూహురైరా!' అని పిలిచారు. 'సెలవియ్యండి దైవప్రవక్తా!' అన్నాను నేను. "నువ్వెళ్ళి అరుగు దగ్గర ఉన్న వాళ్ళందరినీ నా దగ్గరికి తీసుకురా" అని ఆదేశించారాయన.

(దైవప్రవక్త ﷺ దగ్గర ధార్మిక జ్ఞానం నేర్చుకుంటూ మస్జిదె నబవీ) అరుగు దగ్గర ఉండేవాళ్ళు ఇస్లాం ధర్మ అతిథులుగా భావించబడేవాళ్ళు. వారు నిరాశ్రయులు. 'నా' అన్నవారెవరూ లేకుండా, సిరిసంపదలతో నిమిత్తం లేకుండా నిరాధారులుగా బ్రతికేవారు. దైవప్రవక్త ﷺ తన దగ్గరికి దానం చేయబడిన వస్తువేదయినా వస్తే ఆయన దాన్ని సుఫ్ఫావాళ్ళకే పంపించేవారు. తాను మాత్రం దానిని అనుభవించేవారు కారు. కాని కానుకలు వచ్చినప్పుడు మాత్రం ఆయన సుఫ్ఫా(అరుగు)వాళ్ళను పిలిపించి ఆ కానుకను తానూ అనుభవించేవారు, వారికి కూడా పంచి ఇచ్చేవారు.

కాని ఇప్పుడు నేనున్న పరిస్థితిలో ఆయన అరుగు దగ్గరున్న వారిని కూడా పిలవమన్నమాట నేను సహించలేకపోయాను. ఆ తర్వాత మనసులోనే ఇలా అనుకున్నాను: "అరుగు దగ్గరవున్న వాళ్ళందరికీ ఈ కాసిన్నిపాలు ఏం సరిపోతాయి? నేనొక్కణ్ణి తాగేసినా నాక్కాస్త బలం వచ్చినట్లుంటుంది. వాళ్ళందరూ వచ్చిన తరువాత దైవప్రవక్త ﷺ వాళ్ళకు పాలు త్రాపించమని నన్నే ఆదేశిస్తారు. నా వంతు వచ్చేటప్పటికి పాలు మిగిలుంటాయన్న నమ్మకం లేదు. కాని దేవునికి దైవప్రవక్తకు విధేయత చూపక తప్పదు కదా!"

నేను అరుగువాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని, పిలుచుకొని వచ్చాను. వాళ్ళు దైవప్రవక్త ﷺ అనుమతితో ఇంట్లోకి వచ్చి కూర్చున్నారు. ఆయన 'అబూహురైరా!' అని పిలిచారు. నేను 'సెలవియ్యండి దైవప్రవక్తా!' అన్నాను. 'ఈ పాల గిన్నె పట్టుకొని వీళ్ళందరికి పాలు త్రాపించు' అని ఆదేశించారాయన. నేనా గిన్నెను చేత్తో పట్టుకొని ఒక్కొక్కరికి ఇస్తూపోయాను. ఒకతనికిస్తే అతను కడుపునిండా త్రాగి ఇచ్చేవాడు. నేనా గిన్నెను ఇంకొకడి చేతికిచ్చేవాణ్ణి. ఆ విధంగా అందరూ కడుపునిండా త్రాగిన తరువాత దైవప్రవక్త వంతు వచ్చింది. ఆయన గిన్నె చేతిలోకి తీసుకొని నా వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ "అబూహురైరా!" అన్నారు. నేను "సెలవియ్యండి దైవప్రవక్తా!" అన్నాను. "ఇక నువ్వూ, నేనూ మాత్రమే మిగిలిపోయాం" అన్నారాయన. "ఔను దైవప్రవక్తా!" అన్నాను నేను. "కూర్చో, కూర్చొని పాలు త్రాగు" అంటూ (గిన్నె నా చేతికిచ్చారు). నేను కూర్చొని త్రాగాను. ఆయన ఇంకా త్రాగమన్నారు. నేను మళ్ళీ త్రాగటం మొదలుపెట్టాను. ఆయన ﷺ ఇంకా త్రాగు; ఇంకా త్రాగు; అని అంటున్నారు. (నేను త్రాగుతూ పోయాను) ఆఖరికి ఇక త్రాగలేక, "మీకు సత్యధర్మం ఇచ్చిపంపిన దేవుని సాక్షిగా చెబుతున్నాను. నా కడుపులో ఇక దీనికి ఏమాత్రం చోటు లేదు" అని అన్నాను. అప్పుడు ఆయన "ఏది, ఆ గిన్నె ఇటివ్వు" అన్నారు. నేను పాలగిన్నె ఆయన చేతికందించాను. ఆయన దేవుణ్ణి స్తుతించి, ఆయన పేరుతో మిగిలివున్న పాలు త్రాగారు. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని ప్రేమైక వచనాల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: By Allah other than Whom there is none worthy of worship, I used to press my stomach against the earth owing to my hunger; I would tie a stone over it. One day, I was sitting on the way they usually take when the Prophet ﷺ passed by me. When he saw me he smiled at me and knew my condition and my feelings. He called me and I replied, “At your service, O Messenger of Allah.” He said, “Follow me.” So I followed him. Having arrived at home, he sought permission and entered. He allowed me in and I, too, entered. He found milk in a bowl and asked, “Where is this from?” He was told that it was a gift for him from so-and-so. He called me and I responded: “At your service, O Messenger of Allah.” He said, “Go to the people of As-Suffah and usher them in.” He Abu Hurairah (radiyallahu anhu) explained: The people of As-Suffah were guests of Islam; they had no family, no property and no relations. When Messenger of Allah ﷺ used to receive something in charity, he would send it to them without taking anything from it. When he received a present, he would send for them and share it with them. On this occasion, I disliked to give them anything. I said to myself: “This meagre quantity of milk will not be enough for all the people of As-Suffah! I am more deserving of it than anyone else. By drinking it I may attain some strength. When they come, he will order me to give it to them. I do not expect that anything will be left for me from this milk.” As there was no alternative but to obey Allah and His Messenger ﷺ. I went and called them. They came and sought permission which was granted. They took their seats. The Prophet ﷺ called me and I responded, “At your service, O Messenger of Allah.” He then said, “Take the milk and give it to them.” I took the bowl and gave it to one man who drank his fill and returned it to me, and I gave it to the next and he did the same. I went on doing this till the bowl reached Messenger of Allah ﷺ. By that time all had taken their fill. He ﷺ took the bowl, put it on his hand, looked at me, smiled and said, “Abu Hirr.” I said, “At your service, O Messenger of Allah.” He said, “Now you and I are left.’‘ I said, “That is true, O Messenger of Allah.” He said, “Sit down and drink.” I drank, but he went on saying, “Drink some more.” I said, “By Him Who has sent you with the Truth, I have no room for it.” He said, “Then give it to me.’‘ So I gave him the bowl. He praised Allah, uttered the Name of Allah and drank the remainder.[Al-Bukhari].

ముఖ్యాంశాలు

  1. ఈ హదీసులో దైవప్రవక్త మహిమతోపాటు అరుగువాసుల పట్ల ఆయనకు గల ప్రేమావాత్సల్యాలు కూడా వివరించబడ్డాయి.
  2. దైవప్రవక్త ﷺ సదఖా సొమ్ము తినేవారు కాదు. కానుకలు మాత్రం స్వీకరించేవారు.
  3. కానుకగా లభించిన తినుబండారాలను కూడా ఆయన ఇతరులతో కలిసి భుజించేవారు.
  4. ఒక ముస్లిం వదలిపెట్టిన ఎంగిలి ఆహారపదార్థాలు తినవచ్చు, త్రాగవచ్చు.
  5. అతిథికి మరింత తినమని, త్రాగమని చెప్పటం అభిలషణీయం.
  6. దేవుడు పుష్కలంగా ప్రసాదించినప్పుడు కడుపునిండా తినేయటంలో తప్పులేదు. ముఖ్యంగా పేదవాడికి, ఆకలిగొన్నవాడికి కడుపునిండా అన్నం పెట్టడం అభిలషణీయం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|56. పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితం గడపటం, మామూలు అన్నపానీయాలు, వస్త్ర సౌకర్యాలతోనే తృప్తిగా బతకటం, మనోవాంఛలకు దూరంగా ఉండటం గురించి……|హదీసు 502

503

హదీసు 503

وعن مُحَمَّدِ بنِ سِيرينَ عن أَبي هريرةَ، رضي اللَّه عنه، قَالَ: لَقَدْ رأَيْتُني وإِنِيّ لأَخِرُّ فِيما بَيْنَ مِنْبَرِ رسولِ اللَّه صلى الله عليه وسلم إِلَى حُجْرَةِ عائِشَةَ رضي اللَّه عنها مَغْشِيّاً عَلَيَّ، فَيجِيءُُ الجَائي، فيَضَعُ رِجْلَهُ عَلى عُنُقي، وَيرَى أَنِّي مَجْنونٌ وما بي مِن جُنُونٍ، وما بي إِلاَّ الجُوعُ. رواه البخاري.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) తనతో ఇలా చెప్పారని ముహమ్మద్ బిన్ సీరీన్ తెలియజేశారు: ఒకప్పుడు నేను ప్రవక్త ﷺ వేదికకు – ఆయిషా (రదియల్లాహు అన్హా) కుటీరానికి మధ్య స్పృహ తప్పి పడివుండేవాణ్ణి. వచ్చేపోయేవాళ్లు నాకు పిచ్చి పట్టిందేమోననుకొని నా మెడ మీద కాలుపెట్టి చూసేవారు. నిజానికి నాకెలాంటి పిచ్చితనం ఉండేది కాదు. ఆకలికి తట్టుకోలేక నేను అలా పడిపోయేవాణ్ణి. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని ఏతెసామ్ ప్రకరణం)

English

Muhammad bin Sirin (radiyallahu anhu) reported: Abu Hurairah (radiyallahu anhu) said: “I would fall in swoon between the pulpit of (the mosque of) Messenger of Allah ﷺ and the chamber of `Aishah (radiyallahu anha) and every passer-by would put his foot on my neck thinking I was insane. I was not insane but I was awfully hungry.”[Al-Bukhari].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|56. పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితం గడపటం, మామూలు అన్నపానీయాలు, వస్త్ర సౌకర్యాలతోనే తృప్తిగా బతకటం, మనోవాంఛలకు దూరంగా ఉండటం గురించి……|హదీసు 503

504

హదీసు 504

وعن عائشةَ، رضيَ اللَّه عنها، قَالَتْ: تُوُفِّيَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم ودِرْعُهُ مرْهُونَةٌ عِند يهودِيٍّ في ثَلاثِينَ صَاعاً منْ شَعِيرٍ. متفقٌ عَلَيْهِ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త ﷺ మరణించిన కాలం నాటికి ఆయన కవచం ముప్పై 'సా'ల బార్లీ ధాన్యానికి బదులుగా ఓ యూదుడి దగ్గర తాకట్టుపెట్టబడి ఉంది. (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని జిహాద్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని వాణిజ్య ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha) reported: When Messenger of Allah ﷺ died, his armour was mortgaged with a Jew for thirty Sa` (measures) of barley.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

దైవప్రవక్త గారి నిరాడంబర జీవితానికి, ఐహిక నిరపేక్షా భావానికి ఈ హదీసు ఓ మచ్చుతునక మాత్రమే. ఆయన త్యాగమయ జీవితంలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఆయన అనుంగు అనుచరుల్లో అనేకమంది ధనవంతులున్నప్పటికీ ఆయన వారినుండి ధనం అప్పు తీసుకోవటానికి కూడా మనస్కరించేవారు కారు. అనుచరులు తనకు ఇచ్చిన అప్పుని తిరిగి వాపసుతీసుకోరని ఆయనకు తెలుసు. ఇది ఆయనకు నచ్చేదికాదు. అందుకే ఆయన ముస్లిమేతరుల నుండి అప్పు తీసుకునేవారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|56. పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితం గడపటం, మామూలు అన్నపానీయాలు, వస్త్ర సౌకర్యాలతోనే తృప్తిగా బతకటం, మనోవాంఛలకు దూరంగా ఉండటం గురించి……|హదీసు 504

505

హదీసు 505

وعن أَنس رضي اللَّه عنه قَالَ: رَهَنَ النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم دِرْعهُ بِشَعِيرٍ، ومشيتُ إِلى النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم بِخُبْزِ شَعيرٍ، وَإِهَالَةٍ سَنِخَةٍ، وَلَقَدْ سمِعْتُهُ يقُولُ: " مَا أَصْبحَ لآلِ مُحَمَّدٍ صاعٌ وَلاَ أَمْسَى وَإِنَّهُم لَتِسْعَةُ أَبْيَاتٍ"رواه البخاري. "الإِهَالَةُ"بكسر الهمزة: الشَّحْمُ الذَّائِبُ. وَالسَّنِخَةُ"بِالنون والخاءِ المعجمة، وَهِي: المُتَغَيِّرةُ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ బార్లీ ధాన్యానికి బదులుగా తన కవచాన్ని తాకట్టుపెట్టారు. నేనాయన దగ్గరికి బార్లీ రొట్టె, కరగబెట్టిన కొవ్వు తీసుకొని వెళ్ళాను. ఆ కొవ్వు కూడా కాస్తంత పాడయిపోయినట్లే ఉంది. ఆయన తరచూ ఇలా అంటుండేవారు, "ముహమ్మద్ కుటుంబంలో ఉదయం, సాయంత్రం కలిపి మొత్తం ఒక 'సా' ధాన్యమైనా ఉడకవు." మరి చూడబోతే ఆయన కుటుంబంలో మొత్తం తొమ్మిది ఇళ్ళు ఉండేవి. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని వాణిజ్య ప్రకరణం)

English

Anas (radiyallahu anhu) reported: The Prophet ﷺ mortgaged his armour for a quantity of barley, and I took to him some barley bread and rancid fat. I heard him saying: “The family of Muhammad never possessed a measure of wheat from dawn to dusk although they were nine houses (to feed).”

[Al-Bukhari].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|56. పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితం గడపటం, మామూలు అన్నపానీయాలు, వస్త్ర సౌకర్యాలతోనే తృప్తిగా బతకటం, మనోవాంఛలకు దూరంగా ఉండటం గురించి……|హదీసు 505

506

హదీసు 506

وعن أَبي هُرَيْرَةَ رضي اللَّه عنه، قَالَ: لَقدْ رَأَيْتُ سبْعينَ مِنْ أَهْلِ الصُّفَّةِ، مَا مِنْهُم رَجلٌ عَلَيهِ رِدَاء، إِمَّا إِزارٌ وإِمَّا كِسَاءٌ، قَدْ ربطُوا في أَعْنَاقِهم فمِنهَا مَا يَبْلُغُ نِصفَ السَّاقيْنِ، وَمِنهَا مَا يَبلُغُ الكَعْبَينِ، فيجمعُهُ بِيَدِهِ كَراهِيَةَ أَن تُرَى عَوْرَتُهُ. رواه البخاري.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం : నేను డెబ్భై మంది సుఫ్ఫా విద్యార్థుల్ని చూశాను. వారిలో ఎవరి దగ్గరా ఒంటికి చాలినంత బట్టకూడా ఉండేది కాదు. కొందరి దగ్గర ఒక లుంగీ మాత్రమే ఉండేది. మరికొందరి దగ్గర ఒక దుప్పటి ఉండేది. దాన్ని వాళ్ళు భుజాల మీద కట్టుకునేవారు. అది కూడా పిక్కల దాకా లేదా గిలకల దాకా వచ్చేది. ఆచ్ఛాదనం తొలగిపోతుందేమోనన్న భయంతో వాళ్ళు ఆ దుప్పటిని చేత్తో ముడుచుకొని పట్టుకునేవారు.

(బుఖారీ)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: I saw seventy of the people of As-Suffah and none of them had a cloak. They had either a lower cloth or a blanket which they suspended from their necks. Some reached half way down to the legs and some to the ankles, and one of them would manage to keep it in his hand to avoid exposing his private parts.[Al-Bukhari].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|56. పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితం గడపటం, మామూలు అన్నపానీయాలు, వస్త్ర సౌకర్యాలతోనే తృప్తిగా బతకటం, మనోవాంఛలకు దూరంగా ఉండటం గురించి……|హదీసు 506

507

హదీసు 507

وعن عائشةَ رضي اللَّه عنها قَالَتْ: كَانَ فِرَاشُ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم مِن أدَمٍ حشْوُهُ لِيف. رواه البخاري.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త ﷺ పరుపు తోలుతో తయారుచేయబడింది. అందులో పలుచటి ఖర్జూర చెట్ల బెరడు నింపబడి ఉండేది. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని ప్రేమైక వచనాల ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha) reported: The mattress of Messenger of Allah ﷺ was a piece of tanned skin stuffed with palm fibres.[Al-Bukhari].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|56. పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితం గడపటం, మామూలు అన్నపానీయాలు, వస్త్ర సౌకర్యాలతోనే తృప్తిగా బతకటం, మనోవాంఛలకు దూరంగా ఉండటం గురించి……|హదీసు 507

508

హదీసు 508

وعن ابن عمر رضي اللَّه عنهما قَالَ: كُنَّا جُلُوساً مَعَ رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم إِذْ جاءَ رَجُلٌ مِن الأَنْصارِ، فسلَّم علَيهِ، ثُمَّ أَدبرَ الأَنْصَارِيُّ، فقال رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "يَا أَخَا الأَنْصَارِ، كَيْفَ أَخِي سعْدُ بنُ عُبادةَ؟ "فَقَالَ: صَالحٌ، فَقَالَ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"مَنْ يعُودُهُ مِنْكُمْ؟ "فَقام وقُمْنا مَعَهُ، ونَحْنُ بضْعَةَ عشَر مَا علَينَا نِعالٌ وَلا خِفَافٌ، وَلا قَلانِسُ، وَلاَ قُمُصٌ نَمْشِي في تلكَ السِّبَاخِ، حَتَّى جِئْنَاهُ، فاسْتَأْخَرَ قَوْمُهُ مِنْ حَوْله حتَّى دنَا رسولُ اللهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وَأَصْحابُهُ الَّذِين مَعهُ. رواه مسلم.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: ఒకసారి మేము దైవప్రవక్త ﷺతోపాటు కూర్చొని ఉండగా ఒక అన్సార్ వ్యక్తి వచ్చాడు. అతను దైవప్రవక్త ﷺకు సలాంచేసి తిరిగి వెళుతుండగా ఆయన అతన్నుద్దేశించి, "ఓ అన్సారీ సోదరా! నా సోదరుడు సాద్ బిన్ ఉబాదా ఎలా ఉన్నాడ"ని అడిగారు. క్షేమంగానే ఉన్నారని చెప్పాడా వ్యక్తి. అప్పుడు దైవప్రవక్త ﷺ "ఆయన్ని పరామర్శించటానికి (నాతోపాటు) ఎవరొస్తారు?" అంటూ లేచి నించున్నారు. మేము కూడా ఆయనతోపాటు లేచి నించున్నాం. అప్పుడు మేము పదిమందికి పైనే ఉన్నాం. మా దగ్గర చెప్పులుగాని, మేజోళ్లుగాని, టోపీలుగాని ఏమీ లేవు. (ఆఖరికి ఒంటిమీద) చొక్కాలు కూడా లేవు. ఆ కంకర నేలమీద అలాగే నడుస్తూ ఆయన దగ్గరికి చేరుకున్నాం. (మమ్మల్ని చూసి) ఆయన ఇంటివాళ్ళు ప్రక్కకు తప్పుకున్నారు. అప్పుడు దైవప్రవక్త ﷺ, ఆయన వెంట వెళ్ళిన సహచరులు సాద్ బిన్ ఉబాదాను దగ్గరికెళ్ళి పరామర్శించారు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జనాయెజ్ ప్రకరణం)

English

Ibn `Umar (radiyallahu anhuma) reported: We were once sitting in the company of Messenger of Allah ﷺ when a man from the Ansar came and greeted. As he was leaving, Messenger of Allah ﷺ said to him, “O brother of the Ansar, how is my brother Sa`d bin `Ubadah?” He replied, “He is well.” Messenger of Allah ﷺ asked, “Which of you is desirous of visiting him?” Having said this he got up and we followed him. We were ten and odd in number and we had neither shoes nor light boots nor caps nor shirts. We walked on foot through the barren plain till we came to the residence of Sa`d (radiyallahu anhu). His people made way and Messenger of Allah ﷺ along with those who accompanied him went up to him.[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|56. పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితం గడపటం, మామూలు అన్నపానీయాలు, వస్త్ర సౌకర్యాలతోనే తృప్తిగా బతకటం, మనోవాంఛలకు దూరంగా ఉండటం గురించి……|హదీసు 508

509

హదీసు 509

وعن عِمْرانَ بنِ الحُصَينِ رضي اللَّه عنهما، عن النَّبي صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أَنه قَالَ: "خَيْرُكُمْ قَرنِي، ثُمَّ الَّذِينَ يلوُنَهم، ثُمَّ الَّذِينَ يلُونَهُم" قَالَ عِمرَانُ: فَمَا أَدري قَالَ النبي صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم مَرَّتَيْن أَو ثَلاثاً "ثُمَّ يَكُونُ بَعدَهُمْ قَوْمٌ يشهدُونَ وَلاَ يُسْتَشْهَدُونَ، وَيَخُونُونَ وَلا يُؤْتَمَنُونَ، وَيَنْذِرُونَ وَلا يُوفُونَ، وَيَظْهَرُ فِيهمْ السِّمَنُ" متفقٌ عَلَيْهِ.

హజ్రత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : మీలో నా జీవిత కాలంలో ఉన్నవారే అందరికన్నా శ్రేష్ఠులు. ఆ తరువాత మీ కాలానికి సమీపంలో ఉండేవారు శ్రేష్ఠులు. ఆ తరువాత వారికి సమీపంలో ఉండేవారు (తరువాతి తరాల వారందరికన్నా) శ్రేష్ఠులు – దైవప్రవక్త ﷺ తన జీవిత కాలం తరువాత రెండు కాలాలను ప్రస్తావించారా లేక మూడు కాలాలను ప్రస్తావించారా అన్న విషయం నాకు గుర్తులేదు – ఆ తరువాతి కాలంలో ఇతరులు అడగకముందే తమంతట తాము సాక్ష్యాలు చెప్పేవారు పుడతారు. వారు నమ్మకద్రోహులై ఉంటారు. వారిలో నిజాయితి అన్న మాటే ఉండదు. వారు మొక్కుబడులు చేసుకుంటారు కాని వాటిని నెరవేర్చరు. (ప్రాపంచిక భోగలాలసకు అలవాటు పడి) బాగా బలిసి లావుగా కనిపిస్తారు.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని సాక్ష్యాల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని ప్రవక్త సహచరుల మహిమోన్నతుల ప్రకరణం)

English

`Imran bin Husain (radiyallahu anhuma) reported: The Prophet ﷺ said, “The best of you, are my contemporaries, then those who follow them, then those who will come after them. (`Imran said, I do not know if he said this twice or thrice). Then, they will be followed by those who will testify but will not be called upon to testify; they will betray the trust, and will not be trusted. They will make vows but will not fulfill them, and obesity will prevail among them.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో మూడు కాలాలను అత్యంత శ్రేష్ఠమైన కాలాలుగా అభివర్ణించటం జరిగింది. మొదటిది : దైవప్రవక్త ﷺ జీవిత కాలం. రెండోది : ప్రవక్త సహచరుల అనుయాయుల (తాబయీన్ల) కాలం. మూడోది : తాబయీన్ల అనుయాయుల కాలం. మొత్తానికి ఈ మూడు కాలాల్లోనూ ఇస్లాం ధర్మం మూడుపువ్వులు, ఆరుకాయలుగా విరాజిల్లింది. ప్రజల్లో దైవభీతి, ధర్మపరాయణతా భావాలు మెండుగా ఉండేవి. ధర్మవిరోధులు వ్యాపింపజేసే దురాచారాల (బిద్‌అత్‌ల)కు నిలువ నీడ లేకుండేది. కాని దైవప్రవక్త ﷺ చెప్పినట్లుగానే ఆ తరువాతి కాలాల్లో క్రమంగా ప్రజల భక్తివిశ్వాసాలు క్షీణిస్తూపోయాయి. వారిలో ఆచరణా భావం సన్నగిల్లింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|56. పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితం గడపటం, మామూలు అన్నపానీయాలు, వస్త్ర సౌకర్యాలతోనే తృప్తిగా బతకటం, మనోవాంఛలకు దూరంగా ఉండటం గురించి……|హదీసు 509

510

హదీసు 510

وعن أَبي أُمامة رضي اللَّه عنه قَالَ: قالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "يَا ابْنَ آدمَ: إِنَّكَ إِنْ تَبْذُل الفَضلَ خَيْرٌ لَكَ، وَأَن تُمْسِكهُ شرٌّ لَكَ، ولاَ تُلامُ عَلى كَفَافٍ، وَابدأ بِمنْ تَعُولُ "رواه الترمذي وقال: حديث حسن صحيح.

హజ్రత్ అబూ ఉమామా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : "ఓ మనిషీ! మిగిలి పోయిన ధనాన్ని దైవమార్గంలో ఖర్చు పెడితే దానివల్ల నీకు ప్రయోజనం కలుగుతుంది. ఒకవేళ నువ్వు దాన్ని నిల్వచేసి ఉంచుకుంటే దానివల్ల నీకే నష్టం. నీకు చాలినంత ధనాన్ని ఉంచుకుంటే మాత్రం నువ్వు నిందార్హుడివి కావు. (అయితే) ఖర్చుపెట్టేటప్పుడు నీపై ఆధారపడివున్న వారితోనే మొదలు పెట్టాలిసుమా!

(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హసన్‌గా పేర్కొన్నారు.)

(సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణం, సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత అధ్యాయాలు).

English

Abu Umamah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “O son of Adam, if you spend the surplus, it will be better for you; and if you retain it, it will be evil for you. You will not be reprimanded for storing what is enough for your need. First of all spend upon those who are your dependents.”[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

మనిషి తన దగ్గర తన ఆలుబిడ్డల ఖర్చులకు సరిపోయేటంతటి ధనాన్ని నిల్వ ఉంచుకోవటంలో తప్పులేదు. పైగా ఇది చాలా అవసరం కూడా. అయితే అవసరానికి మించి ధనం కూడబెట్టటం మాత్రం ఖండించదగిన విషయం. ఎందుకంటే ఇది ప్రాపంచికంగా, పారలౌకికంగా రెండు విధాలుగానూ మానవులకు నష్టకరమే. ప్రపంచంలో ధనం కూడబెట్టటం వల్ల సంపద ప్రవాహం నిలిచిపోయి ఆర్థిక వ్యవస్థలో అనేక వైపరీత్యాలు చోటుచేసుకుంటాయి. ఇది ఎన్నో సామాజిక దుష్పరిణామాలకు దారితీయవచ్చు. ఇకపోతే ప్రపంచంలో జకాత్ చెల్లించకుండా ధనం కూడబెట్టే పిసినారి పుంగవులకు పరలోకంలో బాధాకరమైన శిక్షల రుచిచూడక తప్పదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|56. పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితం గడపటం, మామూలు అన్నపానీయాలు, వస్త్ర సౌకర్యాలతోనే తృప్తిగా బతకటం, మనోవాంఛలకు దూరంగా ఉండటం గురించి……|హదీసు 510

511

హదీసు 511

وعن عُبَيد اللَّه بِن مِحْصَنٍ الأَنْصارِيِّ الخَطْمِيِّ رضي اللَّه عنه قَالَ: قَالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "منْ أَصبح مِنكُمْ آمِناً في سِرْبِهِ، مُعَافَىً في جَسدِه، عِندهُ قُوتُ يَومِهِ، فَكَأَنَّمَا حِيزَتْ لَهُ الدُّنْيَا بِحذافِيرِها".رواه الترمذي وقال: حديثٌ حسنٌ. "سِرْبِهِ"بكسر السين المهملة، أَي: نَفْسِهِ، وقِيلَ: قَومِه.

హజ్రత్ ఉబైదుల్లాహ్ బిన్ మిహ్‌సన్ అన్సారీ ఖుతమీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: మీరు మీ ఇంట్లో (మానసిక) ప్రశాంతతతో, శారీరకమైన ఆరోగ్యంతో ఉండి, మీ దగ్గర ఆ రోజుకి సరిపోయే ఆహారం ఉంటే చాలు మీకు ప్రాపంచిక వస్తు సరంజామా అంతా దొరికి పోయినట్లే."

(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హసన్‌గా పేర్కొన్నారు.)

(సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత అధ్యాయాలు)

English

`Ubaidullah bin Mihsan Al-Ansari (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Whosoever begins the day feeling family security and good health; and possessing provision for his day is as though he possesed the whole world.”[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

శరీరారోగ్యం, మానసిక ప్రశాంతతలతోపాటు ఓ పూట కడుపునిండా అన్నం దొరకటం నిజంగా మహా అదృష్టం. ఆరోగ్యం, మనశ్శాంతే కరువయిపోయినప్పుడు మనిషి దగ్గర ఎనలేని సంపదలున్నా ఏం ప్రయోజనం? ధనం మానసిక అశాంతిని దూరం చేయలేదు. మనిషి ఆయుష్షునూ పెంచలేదు. కనుక మనిషి ప్రాపంచిక సిరిసంపదల కోసం అర్రులు చాచేబదులు సహనాన్నీ, తృప్తినీ అలవరచుకోవాలి. అందులోనే అతనికి సుఖశాంతులు లభిస్తాయి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|56. పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితం గడపటం, మామూలు అన్నపానీయాలు, వస్త్ర సౌకర్యాలతోనే తృప్తిగా బతకటం, మనోవాంఛలకు దూరంగా ఉండటం గురించి……|హదీసు 511

512

హదీసు 512

وعن عبدِ اللَّه بن عمرو بنِ العاصِ رضي اللَّه عنهما، أَن رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "قَدْ أَفَلَحَ مَن أَسلَمَ، وكَانَ رِزقُهُ كَفَافاً، وَقَنَّعَهُ اللَّه بِمَا آتَاهُ "رواه مسلم.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : ఇస్లాం స్వీకరించి, తగినంత ఉపాధిని పొంది, దేవుడు ప్రసాదించిన దానితోనే తృప్తి చెందినవాడు ముక్తి పొందాడు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణం)

English

`Abdullah bin `Amr bin Al-`as (radiyallahu anhuma) reported: Messenger of Allah ﷺ said, “Successful is the one who enters the fold of Islam and is provided with sustenance which is sufficient for his day’s needs, and Allah makes him content with what He has bestowed upon him.”[Muslim].

ముఖ్యాంశాలు

విజయమంటే పరలోకంలో దేవుని కరుణాకటాక్షాలు పొందటం. దేవుని కారుణ్యం పొందటానికి ఇస్లాం మాత్రమే ఏకైక మార్గం. దురదృష్టవశాత్తు మనిషికి గనక ఇస్లాం భాగ్యం లభించకపోతే ఇక భూమండలం నిండా సిరిసంపదలు కూడా పరలోకంలో మనిషికి విజయాన్ని సాధించి పెట్టలేవు. పైగా ప్రపంచంలో కళ్ళు మూయటంతోనే దైవశిక్ష అతన్ని తన అదుపులోకి తీసుకుంటుంది. అతన్ని నరక సంకెళ్ళతో బంధించటం జరుగుతుంది. ఆ విధంగా అతను ఘోర పరాజయం పాలౌతాడు.

మరొక విషయం, దైనందిన జీవితావసరాలు తీరిపోయేటంతటి ధనంతోనే తృప్తి చెందటం జీవితంలో సుఖసౌఖ్యాలకు ఆయువుపట్టు. ప్రాపంచికమైన దురాశ, అత్యంత ఎక్కువగా ధనం సంపాదించాలన్న కోరిక మనిషికి మనశ్శాంతి లేకుండా చేస్తాయి. అందుకే ఒక హదీసులో "సిరిసంపదల విస్తృతి కలిమి కాదు. మనసులోని నిరపేక్షాభావమే అసలు కలిమి" అని చెప్పబడింది. (ఈ హదీసు ముందు రాబోతోంది. 522వ హదీసు చూడండి).

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|56. పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితం గడపటం, మామూలు అన్నపానీయాలు, వస్త్ర సౌకర్యాలతోనే తృప్తిగా బతకటం, మనోవాంఛలకు దూరంగా ఉండటం గురించి……|హదీసు 512

513

హదీసు 513

وعن أَبي مُحَمَّد فَضَالَةَ بنِ عُبَيْد الأَنْصَارِيِّ رضي اللَّه عنه، أَنَّهُ سَمِعَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَقُولُ: "طُوبَى لِمَنْ هُدِيَ إِلى الإِْسلام، وَكَانَ عَيْشهُ كَفَافاً، وَقَنِعَ" رواه الترمذي وقال: حديثٌ حسن صحيح.

దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూ ముహమ్మద్ ఫజాలా బిన్ ఉబైద్ అన్సారీ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు : ఇస్లాం భాగ్యం లభించి, జీవితం గడిచిపోయేటంత ఉపాధిని పొంది, దాంతో తృప్తి చెందిన వాడికోసం శుభవార్త ఉంది. (తిర్మిజీ దీనిని ఉల్లేఖించి 'హసన్' 'సహీహ్'గా పేర్కొన్నారు).

English

Fadalah bin `Ubaid Al-Ansari (radiyallahu anhu) reported: I heard Messenger of Allah ﷺ say: “Happiness is due to him who is guided to Islam and possesses provision that suffices him for his day and remains content.”[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో 'తూబా' అనే పదం వచ్చింది. నిఘంటువుపరంగా దీనికి శుభవార్త అని అర్థం. అయితే స్వర్గాన్ని కూడా తూబా అని పిలుస్తారు. మరికొన్ని ఉల్లేఖనాల ద్వారా స్వర్గంలో ఒకానొక చెట్టుపేరు తూబా అని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇస్లాం ధర్మాన్ని నిక్కచ్చిగా ఆచరించి, దేవుడు ప్రసాదించిన ఉపాధితో తృప్తిపడి, ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ జీవితం గడిపేవాడికి స్వర్గసుఖాల శుభవార్త ఉందన్నమాట మాత్రం వాస్తవం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|56. పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితం గడపటం, మామూలు అన్నపానీయాలు, వస్త్ర సౌకర్యాలతోనే తృప్తిగా బతకటం, మనోవాంఛలకు దూరంగా ఉండటం గురించి……|హదీసు 513

514

హదీసు 514

وعن ابن عباسٍ رضي اللَّه عنهما قَالَ: كَانَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَبِيتُ اللَّيَالِيَ المُتَتَابِعَةَ طَاوِياً، وَأَهْلُهُ لاَ يَجِدُونَ عَشاءَ، وَكَانَ أَكْثَرُ خُبْزِهِمْ خُبْز الشَّعِيرِ. رواه الترمذي وقال: حديثٌ حسنٌ صحيح.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ వరుసగా కొన్ని రేత్రులపాటు పస్తులు గడిపేవారు. ఆయన కుటుంబీకులకు కూడా రాత్రి భోజనం లభించేది కాదు. వారు రొట్టెల్లో ఎక్కువగా యవల రొట్టెలు తినేవారు. (తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హసన్, సహీహ్‌గా పేర్కొన్నారు).

(సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత అధ్యాయాలు)

English

Ibn `Abbas (radiyallahu anhuma) reported: Messenger of Allah ﷺ went to bed hungry for several successive nights, nor did his family have a thing for supper for many consecutive nights; and their bread was mostly of barley.[At-Tirmidhi].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|56. పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితం గడపటం, మామూలు అన్నపానీయాలు, వస్త్ర సౌకర్యాలతోనే తృప్తిగా బతకటం, మనోవాంఛలకు దూరంగా ఉండటం గురించి……|హదీసు 514

515

హదీసు 515

وعن فضَالَةَ بنِ عُبَيْدٍ رضي اللَّه عنه، أَن رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كَانَ إِذَا صَلَّى بِالنَّاسِ يَخِرُّ رِجَالٌ مِنْ قَامَتِهِمْ في الصَّلاةِ مِنَ الخَصَاصةِ وَهُمْ أَصْحابُ الصُّفَّةِ حَتَّى يَقُولَ الأَعْرَابُ: هُؤُلاءِ مَجَانِينُ، فَإِذَا صلَّى رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم انْصَرفِ إِلَيْهِمْ، فَقَالَ: "لَوْ تَعْلَمُونَ مَا لَكُمْ عِنْدَ اللَّه تَعَالَى، لأَحْبَبْتُمْ أَنْ تَزْدادُوا فَاقَةً وَحَاجَةً "رواه الترمذي، وقال حديثٌ صحيحٌ. "الخَصاصَةُ": الْفَاقَةُ والجُوعُ الشَّديدُ.

హజ్రత్ ఫజాలా బిన్ ఉబైద్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ప్రజలకు నమాజ్ చేయించినప్పుడు (వెనుక) పంక్తుల్లో నించున్న వారిలో కొంతమంది ఆకలితో (సొమ్మసిల్లి) పడిపోయేవారు – సుప్ఫా వాళ్ళే వారు – పల్లెటూరి బైతులు వాళ్ళను అలా పడిపోవటం చూసి పిచ్చోళ్ళనేవారు. దైవప్రవక్త ﷺ నమాజ్ ముగించిన తరువాత వారి వైపునకు తిరిగి, "దేవుని దగ్గర మీకు ఎంత పుణ్యం లభిస్తుందో తెలిస్తే మీరు ఇంతకన్నా ఎక్కువ అగత్యాన్ని, ఆకలిని తట్టుకోవటానికి ఇష్టపడతారు" అని చెప్పేవారు.

(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి దృఢమైనదిగా పేర్కొన్నారు)

(సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత అధ్యాయాలు)

English

Fadalah bin `Ubaid (radiyallahu anhu) reported: When Messenger of Allah ﷺ led Salat, some people would fall down from their standing posture out of extreme hunger. They were of the people of As-Suffah. The nomad Arabs would say that they were insane. After concluding Salat, Messenger of Allah ﷺ would turn to them and say, “If you were to know what is in store for you with Allah, the Exalted, you would wish to augment your starvation and lack of provisions.”[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

ధార్మిక విద్యనభ్యసించే విద్యార్థులకు ఇందులో గొప్ప గుణపాఠం ఉంది. వారు పాఠశాలలను ఎంచుకునేటప్పుడు సౌకర్యాలు, సదుపాయాలు, స్కాలర్‌షిప్పులు పుష్కలంగా దొరికే పాఠశాలలను ఎంచుకోరాదు. భోజన సదుపాయాలు, ఇతరత్రా సౌకర్యాలు లేకున్నా ఉన్నత విద్యా ప్రమాణాలతో ఉత్తమ శిక్షణను అందించే పాఠశాలలను మాత్రమే ఎంచుకోవాలి. ధార్మిక విద్యార్థులకు ఈ హదీసు బోధించే మరొక విషయం ఏమిటంటే, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు పస్తులతోనయినా కాలం గడపాలికాని ప్రజలముందు చేయి చాపకూడదు. సుప్ఫా విద్యార్థుల నడవడికను అందుకు ఆదర్శంగా తీసుకోవాలి. విద్యార్థి దశలోని నిరపేక్షాభావం మనిషిని జీవితాంతం నిరపేక్షాపరునిగా, సహనశీలునిగా ఉంచుతుంది. ఈ దశలో అడుక్కునే అలవాటు జీవితాంతం అదే నీచమైన అలవాటుకి గురిచేస్తుంది. సహనం, తృప్తి, నిరపేక్షాభావంలోనే పండితుల గౌరవమర్యాదలు ఇమిడి ఉన్నాయి. అంతేగాని ప్రజల జేబులవంక ఆబగా చూడటంలో, వారి ముందు ముష్టెత్తుకోవటంలో లేదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|56. పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితం గడపటం, మామూలు అన్నపానీయాలు, వస్త్ర సౌకర్యాలతోనే తృప్తిగా బతకటం, మనోవాంఛలకు దూరంగా ఉండటం గురించి……|హదీసు 515

516

హదీసు 516

وعن أَبي كَريمَةَ المِقْدامِ بن معْدِ يكَرِب رضي اللَّه عنه قالَ: سمِعتُ رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقَولُ: "مَا ملأَ آدمِيٌّ وِعَاءً شَرّاً مِنْ بَطنِه، بِحسْبِ ابنِ آدمَ أُكُلاتٌ يُقِمْنَ صُلْبُهُ، فإِنْ كَانَ لا مَحالَةَ، فَثلُثٌ لطَعَامِهِ، وثُلُثٌ لِشرابِهِ، وَثُلُثٌ لِنَفَسِهِ". رواه الترمذي وقال: حديث حسن."أُكُلاتٌ"أَيْ: لُقمٌ.

దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూ కరీమా మిఖ్‌దామ్ బిన్ మాదీ కరిబ్ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు : మనిషి నింపుకునే పొట్టకన్నా నికృష్టమయిన కంచం మరొకటి లేదు. మనిషి వెన్నెముకను నిలిపి ఉంచటానికి కొన్ని ముద్దల తిండి చాలు. ఇంకా ఎక్కువ తినటం తప్పదనుకుంటే మొత్తం కడుపులో మూడోవంతును అన్నం కోసం మరో మూడోవంతును నీళ్ళకోసం, ఇంకో మూడోవంతును శ్వాసకోసం కేటాయించుకోవాలి. (తిర్మిజీ దీనిని ఉల్లేఖించి 'హసన్' కోవకు చెందినదిగా పేర్కొన్నారు.)

(సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత అధ్యాయాలు)

English

Miqdad bin Ma`dikarib (radiyallahu anhu) reported: I heard Messenger of Allah ﷺ say: “No man fills a container worse than his stomach. A few morsels that keep his back upright are sufficient for him. If he has to, then he should keep one-third for food, one-third for drink and one-third for his breathing.”[At-Tirmidhi].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|56. పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితం గడపటం, మామూలు అన్నపానీయాలు, వస్త్ర సౌకర్యాలతోనే తృప్తిగా బతకటం, మనోవాంఛలకు దూరంగా ఉండటం గురించి……|హదీసు 516

517

హదీసు 517

وعن أَبي أُمَامَةَ إِيَاسِ بنِ ثَعْلَبَةَ الأَنْصَارِيِّ الحارثيِّ رضي اللَّه عنه قَالَ: ذَكَرَ أَصْحابُ رَسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يوْماً عِنْدَهُ الدُّنْيَا، فَقَالَ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "أَلا تَسْمَعُونَ؟ أَلا تَسْمَعُونَ؟ إِنَّ الْبَذَاذَة مِن الإِيمَان إِنَّ الْبَذَاذَةَ مِنَ الإِيمَانِ"ي عْني: التَّقَحُّلَ. رواهُ أَبو داود. "الْبَذَاذَةُ": بِالْبَاءِ المُوَحَّدةِ وَالذَّالَينِ المُعْجمَتَيْنِ، وَهِيَ رَثاثَةُ الهَيْئَةِ، وَتَرْكُ فَاخِرِ اللِّبَاسِ وأَمَّا"التَّقَحُّلُّ"فَبِالْقَافِ والحاء، قَالَ أَهْلُ اللُّغَة: المُتَقَحِّل: هُوَ الرَّجُلُ الْيَابِسُ الجِلدِ مِنْ خُشُونَةَ الْعَيْشِ، وَتَرْكِ التَّرَفَّهِ.

హజ్రత్ అబూ ఉమామా ఇయాస్ బిన్ సాలబా అన్సారీ హారిసీ (రదియల్లాహు అన్హు) కథనం : ఒకరోజు దైవప్రవక్త ﷺ ముందు ఆయన అనుచరులు ప్రాపంచిక భోగభాగ్యాల గురించి ప్రస్తావించారు. అప్పుడు ఆయన తన సహచరుల నుద్దేశ్యించి, "మీరు వినటం లేదా? మీరు వినటం లేదా? నిరాడంబరత విశ్వాసంలో అంతర్భాగం. నిస్సందేహంగా నిరాడంబరత విశ్వాసంలో అంతర్భాగం" అని అన్నారు. అంటే ఆడంబరాలతో కూడుకున్న వస్తువులకు దూరంగా ఉండటం అని ఆయన ఉద్దేశ్యం. (అబూ దావూద్)

'బజాజా' అంటే మనిషి బాహ్య అవతారం బాగా ఉండకపోవటం, ఖరీదైన వస్త్రాలు వాడకుండా ఉండటం అని అర్థం. భాషావేత్తల దృష్టిలో 'ముతఖహ్హిల్' అంటే పొడి ఆహారం తింటూ సౌఖ్యాలకు దూరంగా ఉండటం వలన చర్మం ముడుతలు పడినవాడని అర్థం.

(సుననె అబూదావూద్‌లోని సంస్కార ప్రకరణం)

English

Abu Umamah bin Tha`labah (radiyallahu anhu) reported: The Companions of Messenger of Allah ﷺ mentioned the life of the world before him. He ﷺ said, “Do you not hear? Do you not hear? Simplicity (in life) is part of Faith, simplicity is part of Faith.”[Abu Dawud].

ముఖ్యాంశాలు

మనిషికి ఐహిక సౌఖ్యాల పట్ల ఆసక్తి పెరిగిన కొద్దీ అతనిలో పరలోక చింతన సన్నగిల్లి, క్రమంగా ప్రాపంచిక వ్యామోహం అతన్ని ఆవహిస్తుంది. దీనికి భిన్నంగా ఆడంబరాలకు దూరంగా ఉండే వ్యక్తి సదా తన పరలోక జీవితాన్ని మెరుగుపరచుకునే ప్రయత్నంలోనే తలమునకలై ఉంటాడు. అందుకే ఈ హదీసు – మనిషి వీలైనంతవరకు నిరాడంబర జీవితాన్ని గడపటానికి కృషిచేయాలని ఉపదేశిస్తోంది. ఇక్కడ గమనించదగిన విషయం మరొకటుంది. నిరాడంబరంగా బ్రతకటమంటే అపరిశుభ్రంగా ఉండటమని అర్థం ఎంతమాత్రం కాదు. నిజానికి ఇస్లాం ధర్మం పరిశుభ్రత సగం విశ్వాసమని చెబుతోంది. మరలాంటప్పుడు పరిశుభ్రత ప్రాముఖ్యతను ఒక విశ్వాసి ఎలా కాదనగలడు?

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|56. పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితం గడపటం, మామూలు అన్నపానీయాలు, వస్త్ర సౌకర్యాలతోనే తృప్తిగా బతకటం, మనోవాంఛలకు దూరంగా ఉండటం గురించి……|హదీసు 517

518

హదీసు 518

وعن أبي عبدِ اللَّه جابر بن عبدِ اللَّه رضي اللَّه عنهما قَالَ: بَعَثَنَا رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وَأَمَّرَ عَلَينَا أَبَا عُبَيْدَةَ رضي اللَّه عنه، نتَلَقَّي عِيراً لِقُرَيْشٍ، وَزَّودَنَا جِرَاباً مِنْ تَمْرٍ لَمْ يجِدْ لَنَا غَيْرَهُ، فَكَانَ أَبُو عُبَيْدةَ يُعْطِينَا تَمْرةً تَمْرَةً، فَقِيل: كَيْف كُنْتُمْ تَصْنَعُونَ بِهَا؟ قَالَ: نَمَصُّهَا كَمَا يَمَصُّ الصَّبِيُّ، ثُمَّ نَشْرَبُ عَلَيهَا مِنَ المَاءِ، فَتَكْفِينَا يَوْمَنَا إِلى اللَّيْلِ، وكُنَّا نَضْرِبُ بِعِصيِّنا الخَبَطَ، ثُمَّ نَبُلُّهُ بِالمَاءِ فَنَأْكُلُهُ. قَالَ: وانْطَلَقْنَا عَلَى ساَحِلِ البَحْرِ، فرُفعَ لنَا عَلَى ساحِلِ البَحْرِ كهَيْئَةِ الكَثِيبِ الضَّخْمِ، فَأَتيْنَاهُ فَإِذا هِي دَابَّةٌ تُدْعى العَنْبَرَ، فَقَالَ أَبُو عُبَيْدَةَ: مَيْتَةٌ، ثُمَّ قَالَ: لا، بلْ نحْنُ رسُلُ رسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، وفي سبيلِ اللَّه، وقَدِ اضْطُرِرتمْ فَكلُوا، فَأَقَمْنَا علَيْهِ شَهْراً، وَنَحْنُ ثَلاثُمائَة، حتَّى سَمِنَّا، ولقَدْ رَأَيتُنَا نَغْتَرِفُ مِن وقْبِ عَيْنِهِ بالْقِلالِ الدُّهْنَ ونَقْطَعُ منْهُ الْفِدَرَ كَالثَّوْرِ أَو كقَدْرِ الثَّوْرِ، ولَقَدْ أَخَذَ مِنَّا أَبُو عُبيْدَةَ ثَلاثَةَ عَشَرَ رَجُلاً فأَقْعَدَهُم في وقْبِ عَيْنِهِ وَأَخَذَ ضِلَعاً منْ أَضْلاعِهِ فأَقَامَهَا ثُمَّ رَحَلَ أَعْظَمَ بَعِيرٍ مَعَنَا فَمَرَّ منْ تَحْتِهَا وَتَزَوَّدْنَا مِنْ لحْمِهِ وَشَائِقَ، فَلمَّا قدِمنَا المديِنَةَ أَتَيْنَا رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَذكْرَنَا ذلكَ لَهُ، فَقَالَ:"هُوَ رِزْقٌ أَخْرَجَهُ اللَّه لَكُمْ، فَهَلْ معَكمْ مِنْ لحْمِهِ شَيء فَتطْعِمُونَا؟ " فَأَرْسلْنَا إِلَى رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم مِنْهُ فَأَكَلَهُ. رواه مسلم. "الجِرَابُ": وِعاء مِنْ جِلْدٍ مَعْرُوف، وَهُو بكَسِر الجيم وفتحِها، والكسرُ أَفْصحُ. قَوْلُهُ:"نَمَصُّهَا"بفتح الميم"والخَبْطَ"وَرَقُ شَجَرٍ مَعْرُوف تَأْكُلُهُ الإِبلُ."وَالكَثِيبُ"التَّلُّ مِنَ الرَّمْلِ،"والوَقْبُ": بفتحِ الواوِ وإِسكان القافِ وبعدهَا بَاءٌ موحدةٌ، وَهُو نقرة العيْن"وَالقِلالُ"الجِرَارُ."والفِدَرُ"بكسرِ الفاءِ وفتح الدال: القِطعُ."رَحَلَ البَعِيرَ"بتخفيفِ الحاءِ أيْ جعلَ عليه الرحْلَ. و"الْوَشَائق"بالشينِ المعجمةِ والقافِ: اللَّحْمُ الَّذي اقْتُطِعَ ليقَدَّدَ مِنْه، واللَّه أعلم.

హజ్రత్ అబూ అబ్దుల్లాహ్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హుమా) కథనం : ఒకసారి దైవప్రవక్త ﷺ అబూ ఉబైదా (రదియల్లాహు అన్హు)ను మాకు నాయకునిగా నియమించి, మమ్మల్ని ఖురైష్ తెగకు చెందిన ఒక బిడారు కోసం మాటేసి ఉండమని చెప్పి పంపించారు. ఆ సందర్భంగా ఆయన మాకు ప్రయాణంలో తినటం కోసమని ఖర్జూర పండ్ల బస్తా ఒకటి ఇచ్చారు. మాకివ్వటానికి ఆయన దగ్గర ఇంకేమీ లేదు. అబూ ఉబైదా (రదియల్లాహు అన్హు) మాకు ఒక్కొక్క ఖర్జూర పండు మాత్రమే ఇచ్చేవారు.

'మరి మీరు ఆ ఒక్క ఖర్జూర పండుతో ఎలా గడిపేవార'ని ఎవరో అడిగితే, దానికి సమాధానమిస్తూ ఆయన ఇలా అన్నారు : మేము దాన్ని చిన్నపిల్లలు చూషించినట్లు చూషించేవాళ్ళం. ఆ తరువాత నీళ్ళు త్రాగి కడుపునింపుకునేవాళ్ళం. అది ఆ రోజు రాత్రి వరకు సరిపోయేది. ఇంకా మేము మా దగ్గరున్న కర్రలతో చెట్ల ఆకులు రాల్చి వాటిని నీటిలో నానబెట్టి తినేవాళ్ళం.

హదీసు ఉల్లేఖకులు ఇలా అంటున్నారు: మేము సముద్ర తీరం వెంబడి ప్రయాణిస్తుండగా అక్కడ మాకు ఒక పెద్ద ఇసుక దిబ్బ మాదిరిగా ఉన్న వస్తువేదో కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే అదో పెద్ద (సముద్ర) జంతువు. దాన్ని 'అంబర్' అని పిలుస్తారు. (మా నాయకుడు) అబూ ఉబైదా (రదియల్లాహు అన్హు) దాన్ని చూసి ముందు "ఇది మృత జంతువు (అంచేత తినడానికి పనికిరాదు)" అని అన్నారు. మరికాసేపటికి ఆయనే, "అయినా ఫర్వాలేదు, మనం దైవప్రవక్త తరపున పంపబడిన వాళ్ళం. దైవమార్గంలో బయలుదేరాం. ఇప్పుడు (దీని మాంసం తినడం తప్ప మనకు గత్యంతరం లేదు. కాబట్టి తినండి" అని అన్నారు.

ఆ తరువాత నెల రోజులపాటు మేము ఆ మాంసంతోనే గడిపాం. ఆ సమయంలో మేము మూడొందలమందిమి ఉన్నాం. ఆ మాంసం తిని మా శరీరాలు లావెక్కాయి. మేమా జంతువు కనుగుంతల నుండి కొన్ని బుంగల నూనె తోడాము. ఇంకా దాని శరీరం నుండి ఎద్దులాంటి లేదా ఎద్దంతటి మాంసపు ముక్కలు కోశాము. అబూ ఉబైదా (రదియల్లాహు అన్హు) మాలో పదమూడు మందిని దాని కనుగుంతలో కూర్చోబెట్టారు. ఇంకా దాని ప్రక్కటెముకల్లోనుంచి ఒక ఎముకను నిలబెట్టారు. మా దగ్గరున్న అతి ఎత్తైన ఒంటెపై అంబారి ఉంచి దాన్ని ఆ ఎముక సందుగుండా పోనిచ్చారు. మేము దాని మాంసాన్ని ముక్కలు ముక్కలుగా కోసి ప్రయాణంలో తినటానికి ఉంచుకున్నాం.

మదీనా చేరుకున్న తరువాత మేము దైవప్రవక్త ﷺ సన్నిధికి వెళ్ళి ఆయన ﷺకు ఆ (వింత) జంతువు గురించి తెలియజేశాం. అంతా విన్న తరువాత ఆయన "అది దేవుడు మీ కోసం (సముద్రం నుండి) వెలికి తీసిన ఆహారం. మీ దగ్గర దాని మాంసం మిగిలివుంటే కాస్త మాక్కూడా తినిపించండి" అని కోరారు. అప్పుడు మేమా మాంసంలో కొంతభాగం దైవప్రవక్తకు పంపించగా ఆయన దాన్ని తిన్నారు."

(ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జంతువేట ప్రకరణం)

English

Jabir bin `Abdullah (radiyallahu anhuma) reported: Messenger of Allah ﷺ sent us in an expedition under the command of Abu `Ubaidah (radiyallahu anhu) to intercept a caravan of the Quraish. He provided us with a bag of dates, apart from which he found nothing for us. Abu `Ubaidah (radiyallahu anhu) gave each of us one date (every day). He (the narrator) was asked: “What did you do with that?” He said: We sucked that just like a baby and then drank water over that, and it was sufficient for us for the day until night. We beat off leaves with the help of our sticks, then drenched them with water and ate them. We then went to the seaside, when there appeared before us something like a big mound. We came near it and we found that it was a beast called Al-Anbar. Abu ‘Ubaidah (radiyallahu anhu) said: “It is dead (so it useless for us).” He then said: “No (but it does not matter), we have been sent by Messenger of Allah ﷺ in the way of Allah and you are hard-pressed (on account of the scarcity of food), so you can eat that.” We, three hundred in number, stayed there for a month until we fattened up (having plenty to eat of that fish). He (Jabir) said: I saw how we extracted pitcher after pitcher full of fat from the cavity of its eye, and sliced from it compact piece of meat equal to a bull or almost like a bull. Abu ‘Ubaidah (radiyallahu anhu) called thirteen men from us and he made them sit in the cavity of its eye, and he held one of its ribs and raised it erect and then saddled the biggest of the camels we had with us and it passed through it (the arched rib), and we carried large pieces of meat for use in our journey. When we came back to Al-Madinah we went to Messenger of Allah ﷺ and told him about that, whereupon he said, “That was a sustenance Allah had brought forth for you. Do you have any piece of meat left with you, for us to eat.” Jabir (radiyallahu anhu) said: We sent to Messenger of Allah ﷺ some of that (meat) and he ate it.[Muslim].

ముఖ్యాంశాలు

ఇస్లాం ఆవిర్భవించిన తొలినాళ్ళలో ముస్లింలకు దుర్భర దారిద్ర్యాన్ని ఎదుర్కొనవలసి వచ్చింది. రోజులు గడవటమే కష్టంగా ఉండేది. కొన్నిసార్లు ఒక ఖర్జూర పండు, గ్రుక్కెడు నీళ్ళుతాగి రోజంతా దాంతోనే గడపవలసి వచ్చేది. అయినప్పటికీ ప్రవక్త సహచరులు దైవప్రసన్నత కోసం దాన్ని సంతోషంతో భరించేవారు.

ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, ఈ హదీసు ద్వారా సముద్రపు మృతజంతువులను తినడం ధర్మసమ్మతమేనని తెలుస్తోంది. సముద్రపు నీరు, సముద్రపు మృతజంతువులు రెండూ ధర్మసమ్మతమేనని మరికొన్ని హదీసులు స్పష్టంగా పేర్కొంటున్నాయి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|56. పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితం గడపటం, మామూలు అన్నపానీయాలు, వస్త్ర సౌకర్యాలతోనే తృప్తిగా బతకటం, మనోవాంఛలకు దూరంగా ఉండటం గురించి……|హదీసు 518

519

హదీసు 519

وعن أَسْمَاءَ بنْتِ يَزِيدَ رضي اللَّه عنها قالت: كانَ كُمُّ قمِيصِ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم إِلى الرُّصْغِ رواه أَبو داود، والترمذي، وقال: حديث حسن. "الرُّصْغُ"بالصادِ والرُّسْغُ بالسينِ أَيضاً: هوَ المُفْصِلُ بينْ الكَفِّ والسَّاعِدِ.

హజ్రత్ అస్మా బిన్తె యజీద్ (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త ﷺ చొక్కా చేతులు మణికట్ల వరకు ఉండేవి. (అబూదావూద్, తిర్మిజీలు దీనిని ఉల్లేఖించారు. ఇంకా తిర్మిజీ దీనిని హసన్‌గా పేర్కొన్నారు.)

English

Asma’ bint Yazid (radiyallahu anhuma) reported: The sleeves of the shirt of Messenger of Allah ﷺ reached his wrists.[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

అవసరానికి మించి పొడవైన దుస్తులు ధరించటం సాధారణంగా గర్వానికి చిహ్నంగా భావించబడుతుంది. అంతేకాదు, అటూ ఇటూ కదలటానికి, పనులు చేసుకోవటానికి కూడా ఇటువంటి వస్త్రధారణ ఇబ్బందికరంగా ఉంటుంది. మరోవైపు అవసరానికి మించి పొట్టి దుస్తులు వేసవి తాపం నుంచి, చలి తీవ్రతల నుంచి రక్షించలేవు. కనుక మధ్యేమార్గమే అత్యుత్తమ మార్గం. దైవప్రవక్త మార్గమూను.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|56. పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితం గడపటం, మామూలు అన్నపానీయాలు, వస్త్ర సౌకర్యాలతోనే తృప్తిగా బతకటం, మనోవాంఛలకు దూరంగా ఉండటం గురించి……|హదీసు 519

520

హదీసు 520

وعن جابر رضي اللَّه عنه قَالَ: إِنَّا كُنَّا يَوْم الخَنْدَقِ نَحْفِرُ، فَعَرضَتْ كُدْيَةٌ شَديدَةٌ، فجاءُوا إِلى النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فقالوا: هَذِهِ كُدْيَةٌ عَرَضتْ في الخَنْدَقِ. فَقَالَ: "أَنَا نَازِلٌ"ثُمَّ قَامَ وبَطْنُهُ معْصوبٌ بِحَجرٍ، وَلَبِثْنَا ثَلاثَةَ أَيَّامٍ لاَ نَذُوقُ ذَوَاقاً، فَأَخَذَ النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم المِعْول، فَضرَب فَعَادَ كَثيباً أَهْيَلَ، أَوْ أَهْيَمَ. فقلتَ: يَا رسولَ اللَّه ائْذَن لي إِلى البيتِ، فقلتُ لامْرَأَتي: رَأَيْتُ بِالنَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم شَيْئاً مافي ذلكَ صبْرٌ فِعِنْدَكَ شَيءٌ؟ فقالت: عِندِي شَعِيرٌ وَعَنَاقٌ، فَذَبحْتُ العَنَاقَ، وطَحَنْتُ الشَّعِيرَ حَتَّى جَعَلْنَا اللحمَ في البُرْمَة، ثُمَّ جِئْتُ النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وَالعجِينُ قَدْ انْكَسَرَ والبُرْمَةُ بيْنَ الأَثَافِيِّ قَد كَادَتَ تَنْضِجُ. فقلتُ: طُعَيِّمٌ لي فَقُمْ أَنْت يَا رسولَ اللَّه وَرَجُلٌ أَوْ رَجُلانِ، قَالَ:"كَمْ هُوَ؟ "فَذَكَرتُ لَهُ فَقَالَ:"كثِير طَيِّبٌ، قُل لَهَا لاَ تَنْزِع البُرْمَةَ، ولا الخُبْزَ مِنَ التَّنُّورِ حَتَّى آتيَ"فَقَالَ:"قُومُوا"فقام المُهَاجِرُون وَالأَنْصَارُ، فَدَخَلْتُ عليها فقلت: وَيْحَكِ جَاءَ النبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وَالمُهَاجِرُونَ، وَالأَنْصارُ وَمن مَعَهم، قالت: هَلْ سأَلَكَ؟ قلتُ: نَعَمْ، قَالَ:"ادْخُلوا وَلا تَضَاغَطُوا"فَجَعَلَ يَكْسِرُ الخُبْزَ، وَيجْعَلُ عليهِ اللحمَ، ويُخَمِّرُ البُرْمَةَ والتَّنُّورَ إِذا أَخَذَ مِنْهُ، وَيُقَرِّبُ إِلى أَصْحَابِهِ ثُمَّ يَنْزِعُ فَلَمْ يَزَلْ يَكْسِرُ وَيَغْرفُ حَتَّى شَبِعُوا، وَبَقِيَ مِنه، فَقَالَ:"كُلِي هذَا وَأَهدي، فَإِنَّ النَّاسَ أَصَابَتْهُمْ مَجَاعَةٌ "متفقٌ عَلَيْهِ. وفي روايةٍ: قَالَ جابرٌ: لمَّا حُفِرَ الخَنْدَقُ رَأَيتُ بِالنبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم خَمَصاً، فَانْكَفَأْتُ إِلى امْرَأَتي فقلت: هَلْ عِنْدَكِ شَيْء، فَإِنِّي رَأَيْتُ بِرسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم خَمَصاً شَدِيداً؟ فَأَخْرَجَتْ إِليَّ جِراباً فِيهِ صَاعٌ مِنْ شَعِيرٍ، وَلَنَا بُهَيْمَةٌ، داجِنٌ فَذَبحْتُهَا، وَطَحنتِ الشَّعِير فَفَرَغَتْ إِلَى فَرَاغِي، وَقَطَّعْتُهَا في بُرَمتِهَا، ثُمَّ وَلَّيْتُ إِلَى رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَقَالَتْ: لاَ تفضحْني برسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وَمَنْ معَهُ، فجئْتُه فَسَارَرْتُهُ فقلتُ يَا رسول اللَّه، ذَبَحْنا بُهَيمَةً لَنَا، وَطَحَنْتُ صَاعاً مِنْ شَعِيرٍ، فَتَعالَ أَنْتَ وَنَفَرٌ مَعَكَ، فَصَاحَ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَقَالَ: "يَا أَهْلَ الخَنْدَق: إِنَّ جَابِراً قدْ صنَع سُؤْراً فَحَيَّهَلاًّ بكُمْ"فَقَالَ النبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"لاَ تُنْزِلُنَّ بُرْمَتَكُمْ وَلا تَخْبِزُنَّ عجِينَكُمْ حَتَّى أَجيءَ". فَجِئْتُ، وَجَاءَ النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقْدُمُ النَّاسَ، حَتَّى جِئْتُ امْرَأَتي فقالتْ: بِك وَبِكَ، فقلتُ: قَدْ فَعَلْتُ الَّذِي قُلْتِ. فَأَخْرَجَتْ عَجِيناً فَبسَقَ فِيهِ وبارَكَ، ثُمَّ عَمَدَ إِلى بُرْمَتِنا فَبَصَقَ وَبَارَكَ، ثُمَّ قال:"ادْعُ خَابزَةً فلْتَخْبزْ مَعكِ، وَاقْدَحِي مِنْ بُرْمَتِكُم وَلا تَنْزلُوها"وَهُمْ أَلْفٌ، فَأُقْسِمُ بِاللَّه لأَكَلُوا حَتَّى تَركُوهُ وَانَحرَفُوا، وإِنَّ بُرْمَتَنَا لَتَغِطُّ كَمَا هِيَ، وَأَنَّ عَجِينَنَا لَيخْبَز كَمَا هُوَ. قَوْلُه:"عَرَضَت كُدْيَةٌ": بضم الكاف وإِسكان الدال وبالياءِ المثناة تَحْتَ، وَهِيَ قِطْعَةٌ غَلِيظَةٌ صُلْبَةٌ مِنَ الأَرْضِ لا يَعْمَلُ فيها الْفَأْسُ."وَالْكَثِيبُ"أَصْلُهْ تَلُّ الرَّمْلِ، والمُرَادُ هُنَا: صَارتْ تُراباً ناعِماً، وَهُوَ مَعْنَى"أَهْيَلَ". وَ"الأَثَافي": الأَحْجَارُ الَّتي يَكُونُ عَلَيْهَا القِدرُ. وَ"تَضَاغَطُوا": تَزَاحَمُوا. وَ"المَجاعَةُ": الجُوعُ، وَهُوَ بفتحِ الميم. وَ"الخَمصُ"بفتحِ الخاءِ المعجمة والميم: الجُوعُ. وَ"انْكَفَأْتُ": انْقَلَبْتُ وَرَجَعْتُ. و"الْبُهَيمَةُ"بضم الباءِ: تَصغير بَهْمَة، وَهِيَ الْعنَاقُ بفتح العين وَ"الدَّاجِنُ": هِيَ الَّتي أَلِفَتِ الْبيْتَ. وَ"السُّؤْر": الطَّعَام الَّذِي يُدْعَى النَّاسُ إَلَيْه وَهُوَ بُالْفارِسيَّةِ، وَ"حَيَّهَلا"أيْ: تَعَالوا. وَقَوْلها"بكَ وَبكَ"أَي: خَاصَمَتْهُ وَسَبَّتْهُ، لأَنَّهَا اعْتَقْدَت أَنَّ الَّذي عندهَا لاَ يَكفيهم، فَاسْتَحْيَتْ وَخَفِيَ علَيْهَا مَا أَكَرَم اللَّه سُبحانَهُ وَتَعَالَى بِهِ نَبِيَّهُ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم مِنْ هذِهِ المُعْجِزَةِ الظَّاهِرةِ والآيَةِ الْبَاهِرَةِ."بَسقَ"أَي: بصَقَ، وَيُقَالُ أَيضاً: بَزقَ ثَلاثُ لُغَاتٍ. وَ"عَمَد"بفتح الميم: قصَد. وَ"اقْدَحي"أَي: اغرِفي، والمِقْدَحةُ: المِغْرفَةُ. وَ"تَغِطُّ"أَي لِغَلَيَانِهَا صَوْتٌ. واللَّه أعلم.

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం : కందక యుద్ధం జరిగిన రోజుల్లో మేము కందకాలు త్రవ్వుతుంటే గట్టి చట్టుబండ ఒకటి అడ్డం వచ్చింది (ప్రవక్త సహచరులు దాన్ని పగులగొట్టలేకపోయారు). వాళ్ళంతా దైవప్రవక్త ﷺ దగ్గరికి వెళ్ళి, "కందకంలో ఈ చట్టుబండ అడ్డం వచ్చింది (ఎంత ప్రయత్నించినా పగలటం లేదు)" అని విన్నవించుకున్నారు. దానికి ఆయన "సరే, నేనే స్వయంగా కందకంలో దిగి ప్రయత్నిస్తాను" అన్నారు.

ఆ తరువాత ఆయన లేచి నిలబడ్డారు. ఆ సమయంలో ఆయన (తీవ్రమైన ఆకలివల్ల) కడుపుకు రాయి కట్టుకొని ఉన్నారు. మూడ్రోజుల నుంచి మేము దేని రుచీ చూడలేదు. అలాంటి పరిస్థితిలోనే దైవప్రవక్త ﷺ సుత్తెతో ఆ చట్టుబండమీద గట్టిగా మోదారు. దాంతో అది ఇసుక దిబ్బలా మారి పోయింది. అంటే ఇసుక మాదిరిగా నుజ్జునుజ్జయి పోయింది.

నేను దైవప్రవక్త ﷺను, "నేను ఇంటికి వెళ్ళటానికి అనుమతించండి" అని కోరాను. (ఆయన అనుమతి ఇచ్చిన తరువాత ఇంటికి వెళ్ళి) భార్యతో, "దైవప్రవక్త ﷺ (తీవ్రమైన ఆకలితో) ఉన్నారు. నేనాయన పరిస్థితిని చూసి సహించలేకుండా ఉన్నాను. నీ దగ్గర తినే పదార్థాలు ఏమైనా ఉన్నాయా?" అని అడిగాను. "మనింట్లో కాసిన్ని బార్లీ గింజలు, ఒక మేకపిల్ల మాత్రం ఉన్నాయండీ" అని చెప్పింది నా భార్య. నేనా మేకపిల్లను కోశాను. బార్లీ గింజల్ని దంచాను. ఆ తరువాత మాంసాన్ని కుండలో వేసి (పొయ్యి మీద) పెట్టాను. కాసేపటికి (రొట్టెల కోసం) పిండి తయారయింది, పొయ్యిమీద ఉన్న కుండలు కూడా ఉడకటానికి సిద్ధంగా ఉన్నాయి.

అప్పుడు నేను దైవప్రవక్త ﷺ దగ్గరికి వెళ్ళి ఆయనతో, "దైవప్రవక్తా! నేను కొంచెం భోజనం తయారుచేశాను. కనుక మీరు (మా ఇంటికి) దయచేయండి, ఒకరిద్దర్ని తమ వెంట తీసుకురావచ్చు" అని అన్నాను. "ఆ అన్నం ఎంతుంది?" అని అడిగారు దైవప్రవక్త ﷺ. నేనాయనకు దాని గురించి వివరంగా తెలియజేశాను. అందుకాయన 'చాలా ఎక్కువే ఉంది, బ్రహ్మాండమైన అన్నం తయారు చేశావ్. నేనొచ్చేదాకా పొయ్యి మీద నుంచి కుండలు దించవద్దు, కాగుగంపనుండి రొట్టెలు కూడా తీయవద్దు, ఈ విషయం నీ భార్యతో చెప్పు" అని అన్నారు. ఆ తరువాత ఆయన (తన సహచరులందరితో) "పదండి" అని అన్నారు. ఆయన పిలుపు విని ముహాజిర్లు, అన్సార్లందరూ బయలుదేరారు.

నేను తొందరతొందరగా ఇంటికి వెళ్ళి మా ఆవిడతో "దేవుడే మమ్మల్ని కాపాడాలి. దైవప్రవక్త ﷺ, ఆయన వెంట ముహాజిర్లు, అన్సార్లు అందరూ బయలుదేరి వస్తున్నారు" అని చెప్పాను. అప్పుడు మా ఆవిడ నాతో "దైవప్రవక్త ﷺ అన్నం ఎంతుందని అడిగారా?" అని అంది. నేను అడిగారని చెప్పాను.

దైవప్రవక్త ﷺ తన సహచరులందరితో, "లోపలికి వచ్చేయండి, ఇరుకు ఇరుకుగా కూర్చోకండి" అని అన్నారు. ఆ తరువాత ఆయన రొట్టెల్ని ముక్కలు ముక్కలుగా చేసి వాటి మీద మాంసాన్ని ఉంచుతూ పోయారు. కుండలోనుండి మాంసాన్ని, కాగుగంప నుండి రొట్టెల్ని తీసిన తరువాత (వెంటనే) వాటిని మూసేవారు. ఆ రొట్టెలు, మాంసాన్ని సహచరులకు పంచిపెట్టేవారు. ఆ తరువాత మళ్ళీ తీసి (మిగిలిన వారికి) ఇచ్చేవారు. ఆ విధంగా ఆయన రొట్టెల్ని ముక్కలు ముక్కలుగా చేసి వాటిమీద మాంసాన్ని ఉంచి అందరికీ ఇస్తూ పోయారు. సహచరులందరూ కడుపునిండా తిన్న తరువాత కూడా ఆహారపదార్థాలు మిగిలిపోయాయి. చివర్లో ఆయన మా ఆవిడతో "ఈ అన్నం తిను, ఇతరులకు కూడా కానుకగా ఇవ్వు. ప్రజలు ఆకలితో ఉన్నారు" అని అన్నారు. (బుఖారీ – ముస్లిం)

వేరొక ఉల్లేఖనం ప్రకారం హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు : కందకాలు త్రవ్వుతున్న రోజుల్లో దైవప్రవక్త ﷺ విపరీతమైన ఆకలితో ఉండటం గమనించి నేను మా ఆవిడ దగ్గరికి వెళ్ళి, "దైవప్రవక్త ﷺ విపరీతమైన ఆకలితో ఉన్నట్లు కనిపిస్తున్నారు. నీ దగ్గర (తినే వస్తువులు) ఏమైనా ఉన్నాయా?" అని అడిగాను. ఆమె నాకు ఒక సంచి తీసి చూపించింది. అందులో ఒక 'సా' బార్లీ ధాన్యం ఉన్నాయి. మా ఇంట్లో ఒక పెంపుడు మేకపిల్ల కూడా ఉంది. నేను దాన్ని జిబహ్ చేశాను. మా ఆవిడ బార్లీ గింజలు విసరి పిండి తయారు చేసింది. నేను మాంసం కోసినంతసేపట్లో నా భార్య బార్లీ విసరి పిండి తయారుచేసి ఉంచింది. అప్పుడు నేను మాంసాన్ని ముక్కలు ముక్కలుగా కోసి కుండల్లో పెట్టి దైవప్రవక్త ﷺ దగ్గరికి బయలుదేరుతుండగా మా ఆవిడ నాతో, "(ఇంట్లో అన్నం చాలా తక్కువగా ఉంది. ఎక్కువ మందిని పిలుచుకొని వచ్చి) దైవప్రవక్త ﷺ, ఆయన సహచరుల ముందు నన్ను అవమాన పరచకండి" అని అన్నది.

నేను దైవప్రవక్త ﷺ దగ్గరికి వెళ్ళి మెల్లిగా ఆయనతో మాట్లాడుతూ, "దైవప్రవక్తా! మేము మా దగ్గరున్న మేకపిల్లను కోశాము. ఒక 'సా' బార్లీ గింజలు విసరి పిండి తయారు చేశాము. కనుక మీరు, మీతోపాటు మరికొంతమంది మా ఇంటికి దయచేయండి" అని అన్నాను. నేను చెప్పింది విన్న తరువాత దైవప్రవక్త ﷺ బిగ్గరగా కేకవేసి పిలుస్తూ, "కందకం (త్రవ్వుతున్న) ప్రజలారా! జాబిర్ భోజనం తయారుచేశాడు. కనుక మీరందరూ వచ్చేయండి" అని అన్నారు. ఆ తరువాత ఆయన నాతో, "నేనొచ్చేంతవరకు (పొయ్యిమీద నుంచి) కుండలు దించకండి. ఆ పిండితో రొట్టెలు కూడా తయారుచేయకండి" అని అన్నారు.

నేను ఇంటికి తిరిగొచ్చాను. దైవప్రవక్త ﷺ కూడా ప్రజల్ని వెంటబెట్టుకొని బయలుదేరి వస్తున్నారు. నేను మా ఆవిడ దగ్గరికి వెళ్ళాను (ఆయన అనుచరులందరూ వస్తున్నారని చెప్పాను). మా ఆవిడ నా మీద రుసరుసలాడటం మొదలుపెట్టింది. "(ఇందులో నా తప్పేముంది) నేను నువ్వు చెప్పినట్లే చేశాను" అని అన్నాను నేను. అంతలో దైవప్రవక్త ﷺ వచ్చేశారు. మా ఆవిడ ఆ పిండి తీసుకొచ్చి ఆయన ముందు పెట్టింది. ఆయన అందులో తన లాలాజలాన్ని కలిపి శుభప్రాప్తి కోసం ప్రార్థించారు. ఆ తరువాత ఆయన మా కుండల దగ్గరికి వచ్చారు. వాటిల్లో కూడా తన లాలాజలాన్ని కలిపి శుభప్రాప్తి కోసం ప్రార్థించారు. తరువాత మా ఆవిడతో "రొట్టెలు చేసే ఆమెను పిలిచి నీతోపాటు రొట్టెలు తయారుచెయ్యమని చెప్పు నువ్వు కుండల్లో నుంచి (కూర) తీసి కంచాల్లో పెడ్తూపో, దాన్ని పొయ్యిమీద నుంచి మాత్రం దించమాకు" అని అన్నారు.

అప్పుడు భోజనానికి వచ్చిన వాళ్ళు మొత్తం వెయ్యిమంది ఉన్నారు. దైవసాక్షిగా చెబుతున్నాను. వాళ్ళందరూ (కడుపు నిండా) భోజనం చేశారు. ఇంకా మిగిల్చారు కూడా. వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత చూస్తే మా కుండలు ఇంతకు ముందులాగే నిండుగా ఉడుకుతున్నాయి. పిండితో రొట్టెలు ఇంకా తయారవుతూనే ఉన్నాయి.

'కుద్‌యతున్' అనగా గొడ్డలి కూడా పని చేయని గట్టినేల. "కసీబున్"కు అసలు అర్థం 'ఇసుక తిన్నె.' రాయి ఇసుకలాగా మెత్తబడిపోయిందని ఇక్కడ దాని భావం. "అహ్‌యల"కు కూడా అదే అర్థం. "అసాఫియ్యు" అనగా పాత్ర ఉంచబడే రాయి (పొయ్యికి ఉపయోగించే మూడు రాళ్ళు అని భావం). 'తజాగతూ' అంటే 'గుంపుగా రండి' అని అర్థం. 'మజాఅతు' అనగా ఆకలి. 'ఇంకఫాతు' అనగా 'నేను వెనక్కి తిరిగాను' అని అర్థం. 'బుహైమా' అనేది బహీమకు న్యూనపదం. మేకపిల్ల (అనాఖ్)ని ఈ విధంగా పిలుస్తారు. 'దాజిన్' అనగా పెంపుడు జంతువు. 'సూర్' అనగా విందులో ఆహ్వానితులకు సమర్పింపబడే అన్నం. ఇది పారశీక పదం. 'హయ్యహలా' అనగా రండి అని అర్థం. 'బిక వబిక' అనగా ఆమె తన భర్తతో పోట్లాడింది. అతని మీద రుసరుసలాడింది. ఎందుకంటే తన దగ్గరవున్న ఆహారపదార్థాలు ఆ అతిథులందరికీ సరిపోవని భావించి తను చిన్నబుచ్చుకుంది. అల్లాహ్ తన ప్రవక్తకు ప్రసాదించిన బహిరంగ మహిమ, స్పష్టమైన నిదర్శనం ఆమెకు తెలియదు. 'బసఖ' దీన్ని మూడు విధాలుగా చదవవచ్చు. మూడింటికీ ఒకే అర్థం. అతను ఉమ్మాడు అని. 'అమద' అనగా అతను సంకల్పించుకున్నాడని అర్థం. 'ఇఖ్‌దహీ' అనగా 'గరిటతో తీసిఇస్తూ పో' అని అర్థం. 'మిఖ్‌దహతున్' అనగా గరిట లేక చెమ్చా. 'తగిత్తు' అనగా పొంగినప్పుడు వచ్చే శబ్దం. వల్లాహు ఆలము.

(సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని పానీయాల ప్రకరణం)

English

Jabir (radiyallahu anhu) reported: On the day of the battle of Al-Khandaq (the Trench), we were digging the trench when a very hard boulder came in our way. The Companions went to Messenger of Allah ﷺ and told him about it. He said, “I will go down the trench to see it.” He stood up and it was noticed that he had tied a stone over his stomach due to intense hunger. We had not tasted anything for three days. He took up a spade and struck the hard rock with it and it turned into sand. I sought his permission to go home, (after reaching home I) said to my wife, “I have seen the Prophet ﷺ in a state that I am unable to endure. Have you got anything in the house?” She said, “I have a small quantity of barley and a lamb.” I slaughtered the lamb, ground the barley and put the meat in the cooking pot. Then I went to the Prophet ﷺ. In the meantime the flour had been kneaded and the meat in the pot was nearly cooked. I said to him, “O Messenger of Allah, I have some food, will you come along with one or two Companions?” He asked, “How many men should go there?” I told him the number. He said, “It will be better if they are more in number. Tell your wife not to remove the pot from the hearth nor the bread from the oven till I arrive.” Then he said to the Muhajirun and the Ansar: “Let us go (to eat).” They all rose (and went with him). I went to my wife and said, “Bless you, the Prophet ﷺ, the Muhajirun, the Ansar and the whole company are coming.” She said, “Did he ﷺ ask you?” I replied in the affirmative. (When they arrived) Messenger of Allah ﷺ said to his Companions, “Enter, but do not crowd in.” Then he started breaking up the bread and putting meat on it. He would take from the pot and the oven then would cover them up, approach his Companions and hand it over to them. He would then go back and uncover the pot and the oven. He continued to break up the bread and put meat on it till all had eaten to their fill and still some of the food remained. Then he said to my wife, “Eat from it, and send it as a present, for the people have been afflicted with severe hunger.”[Al-Bukhari and Muslim].

Another narration is: Jabir said: When the trench was being dug, I noticed the signs of hunger on the face of the Prophet ﷺ. I returned to my wife and said to her, “Have you got anything in the house? I have seen the signs of severe hunger on the face of Messenger of Allah ﷺ.” She brought out a bag which contained a Sa` (a measure that equals approximately 3kg.) of barley. We had a lamb which was reared in the home. I slaughtered the lamb and she ground the flour for baking bread. I then cut the meat and put it in the cooking pot. When I was returning to Messenger of Allah ﷺ, my wife said to me, “Do not embarass me before Messenger of Allah ﷺ and his Companions.” (She said this because she thought that the food would not be enough for everyone, for how can very little food cater for a thousand people?) When I came to him, I said to him in a low tone, “O Messenger of Allah ﷺ, we have slaughtered a small lamb and have ground a Sa` of barley. Please accompany me with a few of your Companions.” Thereupon he ﷺ announced in a loud voice, “O people of the Trench, Jabir has arranged a feast for you, so all of you are welcome.” And addressing me he said, “Do not take the pot off the fire, nor bake the kneaded flour till I arrive.” So I came home and he came ahead of the people. My wife said, “It will be a matter of disgrace for you (because there is not enough food).” I said, “I did only what you told me.” She brought out the kneaded flour and Messenger of Allah ﷺ spat into it, and invoked the blessing of Allah on it, and then he spat into the cooking pot and invoked the blessing of Allah on it. Then he said, “Call another woman to help bake bread and let her take out from the cooking pot, but do not take it off the fire.” There were about a thousand guests. All of them ate till they left the food and went off. Our pot still bubbled as before and the dough was being baked as before.

ముఖ్యాంశాలు

  1. ఈ హదీసులో కూడా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లంతో పాటు ఆయన సహచరుల పేదరికం, వారు పస్తులతో గడిపిన జీవితాలు వివరించబడ్డాయి. దైవప్రవక్త మహిమతో అతికొద్ది అన్నం ఎంతోమంది ప్రజలకు సరిపోయింది. ఇంకా ఈ హదీసులో దైవప్రవక్త ﷺ గారి అణకువభావం కూడా వివరించబడింది. ఆయన తన సహచరులతో కలిసి ఎంతో కష్టమైన పనులు కూడా చేసేవారు. మన నేతలు, నాయకులు కూడా ఈ గొప్ప ఆదర్శాన్ని అవలంబిస్తే ఎంత బాగుంటుంది!
  2. కానుకలు ఇవ్వటం అభిలషణీయం. ముఖ్యంగా ఎదుటివారు ఆకలిగా ఉన్నప్పుడు, అవసరాల్లో ఉన్నప్పుడు దీని ప్రాముఖ్యత మరింత పెరిగిపోతుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|56. పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితం గడపటం, మామూలు అన్నపానీయాలు, వస్త్ర సౌకర్యాలతోనే తృప్తిగా బతకటం, మనోవాంఛలకు దూరంగా ఉండటం గురించి……|హదీసు 520

521

హదీసు 521

وعن أَنس رضي اللَّه عنه قَالَ: قَالَ أَبو طَلْحَةَ لأُمِّ سُلَيْم: قَد سَمعتُ صَوتَ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم ضَعِيفاً أَعرِفُ فِيهِ الجُوعَ، فَهَل عِندَكِ مِن شيءٍ؟ فَقَالَتْ: نَعَمْ، فَأَخْرَجَتْ أَقَرَاصاً مِن شَعيرٍ، ثُمَّ أَخَذَت خِمَاراً لَهَا فَلَفَّتِ الخُبزَ بِبَعضِه، ثُمَّ دسَّتْهُ تَحْتَ ثَوبي وَرَدَّتْني بِبَعضِه، ثُمَّ أَرْسلَتْنِي إِلى رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَذَهَبتُ بِهِ، فَوَجَدتُ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم جالِساً في المَسْجِدِ، ومَعَهُ النَّاسُ، فَقُمتُ عَلَيهِمْ، فقالَ لي رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "أَرْسَلَكَ أَبُو طَلْحَةَ؟ "فقلت: نَعم، فَقَالَ:"أَلِطَعَام"فقلت: نَعَم، فَقَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"قُومُوا"فَانْطَلَقُوا وَانْطَلَقْتُ بَيْنَ أَيديِهِم حَتَّى جِئتُ أَبَا طَلْحَةَ فَأَخبَرتُهُ، فَقَالَ أَبُو طَلْحَةَ: يَا أُمِّ سُلَيمٍ: قَد جَاءَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم بالنَّاسِ وَلَيْسَ عِنْدَنَا مَا نُطْعِمُهُمْ؟ فقالتْ: اللَّهُ وَرسُولُهُ أَعْلَمُ. فَانطَلَقَ أَبُو طَلْحةَ حتَّى لَقِيَ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فأَقبَلَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم مَعَه حَتَّى دَخَلا، فَقَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"هَلُمِّي مَا عِندَكِ يَا أُمِّ سُلَيْمٍ"فَأَتَتْ بِذلكَ الخُبْزِ، فَأَمَرَ بِهِ رسولُ اللَّه ففُتَّ، وعَصَرَت عَلَيه أُمُّ سُلَيمٍ عُكَّةً فَآدَمَتْهُ، ثُمَّ قَالَ فِيهِ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم مَا شَاءَ اللَّه أَنْ يَقُولَ، ثُمَّ قَالَ:"ائذَن لِعَشَرَةٍ"فَأَذِنَ لَهُم، فَأَكَلُوا حَتَّى شَبِعُوا ثُمَّ خَرَجُوا، ثُمَّ قَالَ:"ائذَن لِعَشَرَةٍ"فَأَذنَ لَهُمْ، فَأَكَلُوا حتى شَبِعُوا، ثُمَّ خَرَجوا، ثُمَّ قَالَ:"ائذَنْ لِعَشَرَةٍ"فَأَذِنَ لهُم حَتَّى أَكل القَوْمُ كُلُّهُم وَشَبِعُوا، وَالْقَوْمُ سَبْعونَ رَجُلاً أَوْ ثَمَانُونَ. متفقٌ عَلَيْهِ. وفي روايةٍ: فَمَا زَالَ يَدخُلُ عشَرَةٌ وَيَخْرُجُ عَشَرَةٌ، حَتَّى لَمْ يَبْقَ مِنهم أَحَدٌ إِلا دَخَلَ، فَأَكَلَ حَتَّى شَبِعَ، ثُمَّ هَيَّأَهَا فَإِذَا هِي مِثلُهَا حِينَ أَكَلُوا مِنها. وفي روايةٍ: فَأَكَلُوا عَشَرَةً عَشَرةً، حَتَّى فَعَلَ ذلكَ بثَمانِينَ رَجُلاً ثُمَّ أَكَلَ النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم بَعْدَ ذلكَ وََأَهْلُ البَيت، وَتَركُوا سُؤراً. وفي روايةٍ: ثمَّ أفضَلُوا مَا بَلَغُوا جيرانَهُم. وفي روايةٍ عن أَنسٍ قَالَ: جِئتُ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يوْماً فَوَجَدتُهُ جَالِساً مَعَ َأَصحابِهِ، وَقد عَصَبَ بَطْنَهُ بِعِصابَةٍ، فقلتُ لِبَعضِ أَصحَابِهِ: لِمَ عَصَبَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم بطْنَهُ؟ فقالوا: مِنَ الجُوعِ، فَذَهَبْتُ إِلى أَبي طَلحَةَ، وَهُوَ زَوْجُ أُمِّ سُليمٍ بنتِ مِلحَانَ، فقلتُ: يَا أَبتَاه، قَدْ رَأَيْت رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم عَصبَ بطنَهُ بِعِصَابَةٍ، فَسَأَلتُ بَعضَ أَصحَابِهِ، فقالوا: مِنَ الجُوعِ. فَدَخل أَبُو طَلحَةَ عَلَى أُمِّي فَقَالَ: هَل مِن شَيءٍ؟ قالت: نَعَمْ عِندِي كِسَرٌ مِنْ خُبزٍ وَتمرَاتٌ، فإِنْ جَاءَنَا رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وَحْدهُ أَشبَعنَاه، وإِن جَاءَ آخَرُ مَعَهُ قَلَّ عَنْهمْ، وذَكَرَ تَمَامَ الحَديث.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : ఒకసారి హజ్రత్ అబూ తల్హా (రదియల్లాహు అన్హు) (తన సతీమణి) ఉమ్మె సులైమ్ (రదియల్లాహు అన్హా)తో మాట్లాడుతూ, "దైవప్రవక్త ﷺ గొంతు బలహీనంగా వినబడుతోంది. బహుశా ఆకలివల్లనేనేమో! నీ దగ్గర (ఆయన తినడానికి) ఏదయినా ఉందా?" అని అడిగారు. ఆమె ఉందంటూ బార్లీ పిండితో చేసిన కొన్ని రొట్టెలు తీసి చూపించారు. వాటిని తన వోణీలో ఒక మూలన కట్టి దాన్ని నా బట్టల క్రింద దాచిపెట్టారు. వోణీ మిగతా భాగాన్ని నా ఒంటికి చుట్టి నన్ను దైవప్రవక్త ﷺ దగ్గరికి పంపించారు.

నేనా రొట్టెలు తీసుకొని వెళ్ళాను. ఆ సమయంలో దైవప్రవక్త ﷺ మస్జిద్‌లో కూర్చొని ఉన్నారు. ఆయనతోపాటు సహచరులు కూడా కూర్చొని ఉన్నారు. నేను వారి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. దైవప్రవక్త ﷺ నన్ను చూసి "నిన్ను అబూ తల్హా పంపించారా?" అని అడిగారు. నేను ఔనన్నాను. ఆయన "భోజనానికా?" అని మళ్ళీ అడిగారు. 'ఔనండీ' అని నేను జవాబు చెప్పాను. అప్పుడు దైవప్రవక్త ﷺ (తన సహచరులందరితో) "పదండి" అంటూ లేచారు. దాంతో వాళ్ళందరూ బయలుదేరారు. నేను వాళ్ళకు ముందు నడుస్తూ అబూ తల్హా (రదియల్లాహు అన్హు) దగ్గరికి వెళ్ళి ఈ విషయం ఆయనకు తెలియజేశాను.

అబూ తల్హా (రదియల్లాహు అన్హు) ఉమ్మె సులైమ్ (రదియల్లాహు అన్హా) తో "ఉమ్మె సులైమ్! దైవప్రవక్త ﷺ తన సహచరులందరినీ వెంటబెట్టుకొని వస్తున్నారు. మనదగ్గరేమో వాళ్ళందరికి సరిపోయేటంత ఆహారం లేదు (ఇప్పుడేం చేద్దాం?)" అని (కంగారు పడిపోతూ)అన్నారు. "దేవునికి, దైవప్రవక్తకు అంతా తెలుసు" అని అన్నారామె. ఆ తరువాత అబూతల్హా (రదియల్లాహు అన్హు) కూడా ఇంటినుంచి బయలుదేరారు. దారిలో దైవప్రవక్త ﷺను కలుసుకున్నారు. దైవప్రవక్త ﷺ అబూ తల్హాతో పాటు ఆయన ఇంటిముఖం పట్టారు. ఇంటికి చేరుకున్నాక ఇద్దరూ ఇంట్లోకి ప్రవేశించారు. దైవప్రవక్త ﷺ ఉమ్మె సులైమ్‌తో "మీ ఇంట్లో ఏముందో తీసుకురండి" అని అన్నారు. అప్పుడామె ఆ రొట్టెల్ని దైవప్రవక్త ﷺ ముందు ఉంచారు.

దైవప్రవక్త ﷺ ఆదేశంతో ఆ రొట్టెల్ని ముక్కలు ముక్కలుగా చేయటం జరిగింది. ఉమ్మె సులైమ్ (రదియల్లాహు అన్హా) అందులో నెయ్యి కుప్పెనుండి నెయ్యిని తుడిచిపోశారు. అది ఆ రొట్టెల్లోకి కూరలాగా పనికొచ్చింది. తరువాత దైవప్రవక్త ﷺ దానిపై దేవుడు తలచినది పఠించి "పదిమందిని భోజనానికి పిలవండి" అని అన్నారు. అబూ తల్హా (రదియల్లాహు అన్హు) పదిమందిని పిలవగా వారు కడుపునిండా తిని వెళ్ళిపోయారు. తరువాత దైవప్రవక్త ﷺ "మరో పదిమందిని రానివ్వండి" అన్నారు. అబూ తల్హా మరో పదిమందిని పిలిచారు. వారు కూడా కడుపునిండా తిని వెళ్ళిపోయారు. ఇంకో పదిమందిని రానివ్వండి అన్నారు దైవప్రవక్త ﷺ. ఆయన ఇంకో పదిమందికి అనుమతినిచ్చారు. ఆ విధంగా అందరూ కడుపునిండా తిని వెళ్ళిపోయారు. వాళ్ళు మొత్తం డెబ్భై, ఎనభై మంది ఉన్నారు. (బుఖారీ – ముస్లిం)

వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: నహచరులు పదిమంది చొప్పున లోపలికి వెళ్ళి వచ్చేవారు. లోపలికి వెళ్ళి కడుపునిండా తినకుండా వచ్చినవాడు బహుశా వారిలో ఒక్కడూ ఉండడు. చివరికి అందరూ తిన్న తర్వాత అన్నాన్ని ఒకచోట సమీకరించి చూస్తే అది ప్రజలు తినకముందు ఎలా ఉందో అలాగే ఉంది.

మరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : ప్రజలు పదిమంది చొప్పున అన్నం తిన్నారు. ఆ విధంగా ఎనభైమంది తిన్నారు. ఆ తరువాత దైవప్రవక్త ﷺ, ఆ ఇంటివారు తిన్నారు. ఆ తరువాత మిగిలిన అన్నాన్ని వారు వదలిపెట్టారు.

ఇంకొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : వారు తిన్న తరువాత కూడా ఎంతో అన్నం మిగిలిపోయింది. దాన్ని వారు ఇరుగుపొరుగు వారికి పంపించుకున్నారు.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) గారే చేసిన వేరొక ఉల్లేఖనం ఇలా ఉంది : నేనొకసారి దైవప్రవక్త ﷺ సన్నిధికి వెళ్ళాను. అప్పుడు ఆయన తన సహచరులతో పాటు కూర్చొని ఉన్నారు. తన కడుపుకు ఏదో కట్టు కట్టుకొని ఉన్నారు. నేను ఆయన సహచరుల్ని, "దైవప్రవక్త ﷺ కడువుకు కట్టు ఎందుకు కట్టుకున్నార"ని అడిగాను. 'ఆకలి వల్ల' అని వారు సమాధానమిచ్చారు.

ఆ మాట విని నేను ఉమ్మె సులైమ్ బిన్తె మిల్‌హాన్ భర్త అబూ తల్హా (రదియల్లాహు అన్హు) దగ్గరికి వెళ్ళి "నాన్నా! దైవప్రవక్త ﷺ తన కడుపుకు కట్టుకట్టుకొని ఉన్నారు. అలా ఎందుకు చేశారని నేనాయన సహచరుల్ని అడిగితే, వారు తీవ్రమైన ఆకలివల్ల అలా చేశారని చెప్పారు" అని అన్నాను. అప్పుడు అబూ తల్హా (రదియల్లాహు అన్హు) మా అమ్మ దగ్గరికి వెళ్ళి, "తినటానికి ఏమైనా ఉందా?" అని అడిగారు. "అవును. మనింట్లో కొన్ని రొట్టె ముక్కలు, కొన్ని ఖర్జూర పండ్లు ఉన్నాయండీ. దైవప్రవక్త ﷺ ఒక్కరే వస్తే మనం ఆయనకు కడువునిండా తినిపించగలం. ఆయనతోపాటు ఇతరులు కూడా వస్తే ఇవి సరిపోవు" అని చెప్పింది మా అమ్మ.

(సహీహ్ బుఖారీలోని ప్రవక్తల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని పానీయాల ప్రకరణం)

English

Anas (radiyallahu anhu) reported: Abu Talhah (radiyallahu anhu) said to (to his wife) Umm Sulaim(radiyallahu anha), “I noticed some weakness in the voice of Messenger of Allah ﷺ and I feel it was due to hunger. Have you got any food?” She said, “Yes.” So she brought out barley loaves, took off her head covering, in a part of which she wrapped these loaves and then put them beneath my mantle and covered me with a part of it. She then sent me to Messenger of Allah ﷺ. I set forth and found Messenger of Allah ﷺ sitting in the mosque in the company of some people. I stood near them whereupon Messenger of Allah ﷺ asked, “Has Abu Talhah sent you?” I said, “Yes.” Thereupon he said to those who were with him to get up (and follow him). He went forth and so did I, ahead of them until I came to Abu Talhah and informed him. Abu Talhah said, “O Umm Sulaim, here comes Messenger of Allah ﷺ along with the people and we do not have enough (food) to feed them.” She said, “Allah and His Messenger know better.” Abu Talhah went out (to receive him) until he met Messenger of Allah ﷺ, and he came forward along with him until they both (Messenger of Allah ﷺ and Abu Talhah (radiyallahu anhu) came in. Then Messenger of Allah ﷺ said, “O Umm Sulaim, bring forth what you have with you.” So she brought the bread. Messenger of Allah ﷺ commanded that the bread be broken into small pieces and after Umm Sulaim (radiyallahu anha) had squeezed clarified butter out of a butter container and made it just like soup. Messenger of Allah ﷺ recited over it what Allah wished him to recite. He then said, “Allow ten guests to come in.” They ate until they had their fill. They then went out. He (Messenger of Allah ﷺ) again said, “Allow ten (more to come in)”, and he (the host) ushered them in. They ate to their fill. Then they went out. He ﷺ again said, “Allow ten (more),” until all the people ate to their fill. They were seventy or eighty persons.[Al-Bukhari and Muslim].

Another narration is: Anas said: When all had eaten, the remaining food was collected. It was as much as there was in the beginning.

Yet another narration is: Anas said: The groups of ten people ate by turn. After eighty persons had eaten, Messenger of Allah ﷺ and the family of that house ate, and there was still a quantity left over.

Another narration is: Anas (radiyallahu anhu) said: I visited Messenger of Allah ﷺ one day, and found him sitting in the company of his Companions, with a belt tied over his waist. I asked, “Why has Messenger of Allah ﷺ tied the belt on his waist?” I was told, “Due to hunger.” I went to Abu Talhah (radiyallahu anhu) the husband of Umm Sulaim (radiyallahu anha) and said, “O father, I have seen Messenger of Allah ﷺ with a belt tied over his waist. I asked one of his Companions about the reason of it and he said that it was on account of severe hunger.” Abu Talhah (radiyallahu anhu) went to my mother and asked, “Have you got anything?” She said, “Yes. I have a piece of bread and some dry dates. Were Messenger of Allah ﷺ to come alone, we could feed him his fill, but if he comes along with others, there would not be enough food.” Anas then narrated the Hadith in full.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|56. పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితం గడపటం, మామూలు అన్నపానీయాలు, వస్త్ర సౌకర్యాలతోనే తృప్తిగా బతకటం, మనోవాంఛలకు దూరంగా ఉండటం గురించి……|హదీసు 521