హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 55. ఐహిక అనాసక్తత, నిరాడంబర జీవితం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 55వ అధ్యాయం: ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి. ఈ అధ్యాయంలో 7 ఖుర్ఆన్ ఆయతులు, 34 హదీసులు (హదీసు 457 – 490) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

55. ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి…

↑ విషయ సూచిక

باب فضل الزهد في الدنيا والحث عَلَى التقلل منهاوفضل الفقر

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు :

{إِنَّمَا مَثَلُ الْحَيَاةِ الدُّنْيَا كَمَاءٍ أَنْزَلْنَاهُ مِنَ السَّمَاءِ فَاخْتَلَطَ بِهِ نَبَاتُ الأَرْضِ مِمَّا يَأْكُلُ النَّاسُ وَالأَنْعَامُ حَتَّى إِذَا أَخَذَتِ الأَرْضُ زُخْرُفَهَا وَازَّيَّنَتْ وَظَنَّ أَهْلُهَا أَنَّهُمْ قَادِرُونَ عَلَيْهَا أَتَاهَا أَمْرُنَا لَيْلاً أَوْ نَهَاراً فَجَعَلْنَاهَا حَصِيداً كَأَنْ لَمْ تَغْنَ بِالأَمْسِ كَذَلِكَ نُفَصِّلُ الْآياتِ لِقَوْمٍ يَتَفَكَّرُونَ} [يونس:٢٤]

"ఈ ప్రాపంచిక జీవితాన్ని ఈ విధంగా పోల్చి చెప్పవచ్చు. మేము ఆకాశం నుండి నీటిని కురిపించగా మనుషులూ, పశువులూ అందరూ తినే భూ ఉత్పత్తులు బాగా దట్టంగా తయారవుతాయి. ఆపై భూమి మంచి స్థితిలో ఉండి, పొలాలు బాగా పండి శోభిల్లుతూ ఉన్నప్పుడు వాటి యజమానులు "ఇక మేము వాటి వల్ల లాభం పొందగలము' అని అనుకుంటున్న సమయంలో, అకస్మాత్తుగా రాత్రి వేళనో, పగటి పూటనో మా ఆజ్ఞ వచ్చేస్తుంది. అప్పుడు మేము అసలు అక్కడ నిన్న ఏమీ లేనట్లు దానిని సర్వనాశనం చేస్తాము. యోచన చేసి అర్థం చేసుకునే వారికొరకు మేము మా వాక్యాలను ఇలాగే (ఉదాహరణలతో సహా) స్పష్టంగా వివరించి చెబుతాము. (యూనుస్ : 24)

ఇంకొకచోట ఆయన ఇలా అంటున్నాడు :

{وَاضْرِبْ لَهُمْ مَثَلَ الْحَيَاةِ الدُّنْيَا كَمَاءٍ أَنْزَلْنَاهُ مِنَ السَّمَاءِ فَاخْتَلَطَ بِهِ نَبَاتُ الأَرْضِ فَأَصْبَحَ هَشِيماً تَذْرُوهُ الرِّيَاحُ وَكَانَ اللَّهُ عَلَى كُلِّ شَيْءٍ مُقْتَدِراً الْمَالُ وَالْبَنُونَ زِينَةُ الْحَيَاةِ الدُّنْيَا وَالْبَاقِيَاتُ الصَّالِحَاتُ خَيْرٌ عِنْدَ رَبِّكَ ثَوَاباً وَخَيْرٌ أَمَلاً} [الكهف:٤٦،٤٥]

"ప్రవక్తా! ఇహలోక జీవిత వాస్తవాన్ని వారికి ఈ ఉపమానం ద్వారా బోధించు : మేము ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తే నేలపై పచ్చిక బాగా దట్టంగా పెరుగుతుంది. మరునాడు అదే పచ్చిక పొట్టుగా మారిపోతుంది. దానిని గాలులు లేపుకుపోయి తిరుగుతూ ఉంటాయి. అల్లాహ్ 'ప్రతి దానిపై అధికారం కలవాడు. ఈ సంపద, సంతాన సౌభాగ్యాలు కేవలం ఐహిక జీవితపు తాత్కాలిక అలంకారాలు మాత్రమే. అసలు, శాశ్వతంగా ఉండిపోయే పుణ్యకార్యాలే నీ ప్రభువు దృష్టిలో ఉత్తమమైనవి. కాబట్టి వాటిని నమ్ముకోవటమే మంచిది." (అల్ కహఫ్ : 45, 46)

మరొకచోట ఆయన సెలవిస్తున్నాడు :

{اعْلَمُوا أَنَّمَا الْحَيَاةُ الدُّنْيَا لَعِبٌ وَلَهْوٌ وَزِينَةٌ وَتَفَاخُرٌ بَيْنَكُمْ وَتَكَاثُرٌ فِي الأَمْوَالِ وَالأَوْلادِ كَمَثَلِ غَيْثٍ أَعْجَبَ الْكُفَّارَ نَبَاتُهُ ثُمَّ يَهِيجُ فَتَرَاهُ مُصْفَرّاً ثُمَّ يَكُونُ حُطَاماً وَفِي الآخِرَةِ عَذَابٌ شَدِيدٌ وَمَغْفِرَةٌ مِنَ اللَّهِ وَرِضْوَانٌ وَما الْحَيَاةُ الدُّنْيَا إِلاَّ مَتَاعُ الْغُرُورِ} [الحديد:٢٠]

"బాగా తెలుసుకోండి, ఇహలోక జీవితం ఒక ఆట, ఒక వినోదం, బాహ్య పటాటోపం, పరస్పరం ప్రగల్భాలు చెప్పుకోవటం, సంపద, సంతానాల విషయంలో ఒకరిపై ఒకరు ఆధిక్యం పొందటానికి ప్రయత్నించటం తప్ప మరేమీ కాదు. దాని దృష్టాంతం ఇలా ఉంది : ఒకసారి వర్షం కురిసినప్పుడు దాని వల్ల మొలకెత్తి పెరిగిన చెట్లూ చేమలను చూచి, రైతులు సంబరపడతారు. తరువాత అవి పండుతాయి. ఆ తరువాత అవి పసుపు పచ్చగా, ఆపై ఎండిపోయిన పొట్టుగా మారిపోవటాన్ని మీరు గమనిస్తూనే ఉంటారు. దీనికి భిన్నంగా పరలోకంలో తీవ్రమైన శిక్ష ఉంటుంది. అల్లాహ్ పెట్టే క్షమాభిక్ష, ఆయన ప్రసన్నతలు ఉంటాయి. (కనుక) ప్రాపంచిక జీవితం ఒక మాయతడిక తప్ప మరేమీ కాదు. (అల్ హదీద్ : 20)

వేరొకచోట ఆయన ఇలా అంటున్నాడు :

{زُيِّنَ لِلنَّاسِ حُبُّ الشَّهَوَاتِ مِنَ النِّسَاءِ وَالْبَنِينَ وَالْقَنَاطِيرِ الْمُقَنْطَرَةِ مِنَ الذَّهَبِ وَالْفِضَّةِ وَالْخَيْلِ الْمُسَوَّمَةِ وَالأَنْعَامِ وَالْحَرْثِ ذَلِكَ مَتَاعُ الْحَيَاةِ الدُّنْيَا وَاللَّهُ عِنْدَهُ حُسْنُ الْمَآبِ} [آل عمران:١٤]

స్త్రీలూ, సంతానమూ, వెండి బంగారు రాసులూ, మేలుజాతి గుర్రాలూ, పశువులూ, సేద్యపు భూములు వంటి వాటిపై వ్యామోహాన్ని ప్రజల కొరకు ఆకర్షణీయంగా చేయబడింది. కాని ఇవన్నీ అశాశ్వతమైన ఐహిక జీవన సంపదలు మాత్రమే. అసలైన ఉత్తమ నివాసం అల్లాహ్ వద్ద ఉన్నదే. (ఆలి ఇమ్రాన్ : 14)

ఆయన ఇంకా ఇలా అంటున్నాడు :

{يَا أَيُّهَا النَّاسُ إِنَّ وَعْدَ اللَّهِ حَقٌّ فَلا تَغُرَّنَّكُمُ الْحَيَاةُ الدُّنْيَا وَلا يَغُرَّنَّكُمْ بِاللَّهِ الْغَرُورُ} [فاطر:٥]

"మానవులారా! అల్లాహ్ వాగ్దానం నిస్సందేహంగా సత్యమైనది. కనుక ఇహలోక జీవితం మిమ్మల్ని మోసంలో పడవేయకూడదు." (ఫాతిర్ : 5)

ఇంకొకచోట ఇలా సెలవిచ్చాడు :

{أَلْهَاكُمُ التَّكَاثُرُ، حَتَّى زُرْتُمُ الْمَقَابِرَ، كَلاَّ سَوْفَ تَعْلَمُونَ، ثُمَّ كَلاَّ سَوْفَ تَعْلَمُونَ، كَلاَّ لَوْ تَعْلَمُونَ عِلْمَ الْيَقِينِ} [التكاثر:١،٥]

"ఒకరిని మించి ఒకరు ఎక్కువగా ప్రపంచాన్ని పొందాలనే ధ్యాస మిమ్మల్ని ఏమరుపాటులో పడవేసింది. చివరకు మీరు ఈ వ్యామోహంలోనే శ్మశానికి చేరుకుంటారు. మీరనుకునేది ఎంతమాత్రం కాదు, త్వరలోనే మీకా విషయం తెలిసిపోతుంది. మరొకసారి వినండి, మీరనుకునేది ఎంతమాత్రం నిజం కాదు, అతి త్వరలోనే మీకు తెలిసిపోతుంది. ఎంతమాత్రం కాదు, మీరు గనక నిశ్చయజ్ఞానంతో తమ వైఖరి పర్యవసానాన్ని తెలుసుకుంటే (మీ నడవడిక ఇలా ఉండేది కాదు). (అత్ తకాసుర్ : 1 – 5)

ఇంకొకచోట ఆయన ఇలా అంటున్నాడు :

{وَمَا هَذِهِ الْحَيَاةُ الدُّنْيَا إِلاَّ لَهْوٌ وَلَعِبٌ وَإِنَّ الدَّارَ الآخِرَةَ لَهِيَ الْحَيَوَانُ لَوْ كَانُوا يَعْلَمُونَ} [العنكبوت:٦٤]

ఈ ప్రాపంచిక జీవితం ఒక క్రీడ, ఒక వినోదం తప్ప మరేమీ కాదు, అసలు జీవన గృహం పరలోక గృహమే. ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. (అల్ అన్‌కబూత్ : 64)

ఈ అధ్యాయానికి సంబంధించిన సుప్రసిద్ధమైన సూక్తులు ఇంకా ఎన్నో ఉన్నాయి.

ఇకపోతే హదీసులు కూడా లెక్కలేనన్ని ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇక్కడ ప్రస్తావిస్తున్నాం.

English

“Verily, the likeness of (this) worldly life is as the water (rain) which We send down from the sky; so by it arises the intermingled produce of the earth of which men and cattle eat: until when the earth is clad in its adornments and is beautified, and its people think that they have all the powers of disposal over it, Our Command reaches it by night or by day and We make it like a clean-mown harvest, as if it had not flourished yesterday! Thus, do We explain the Ayat (proofs, evidences, verses, lessons, signs, revelations, laws, etc.) in detail for the people who reflect.” [Yūnus 10:24]

“And put forward to them the example of the life of this world: it is like the water (rain) which We send down from the sky, and the vegetation of the earth mingles with it, and becomes fresh and green. But (later) it becomes dry and broken pieces, which the winds scatter. And Allah is Able to do everything. Wealth and children are the adornment of the life of this world. But the good righteous deeds that last, are better with your Rubb for rewards and better in respect of hope.” [Al-Kahf 18:45–46]

“Know that the life of this world is only play and amusement, pomp and mutual boasting among you, and rivalry in respect of wealth and children. (It is) as the likeness of vegetation after rain, thereof the growth is pleasing to the tiller; afterwards it dries up and you see it turning yellow; then it becomes straw. But in the Hereafter (there is) a severe torment (for the disbelievers-evildoers), and (there is) forgiveness from Allah and (His) Good Pleasure (for the believers-gooddoers). And the life of this world is only a deceiving enjoyment”. [Al-Ḥadīd 57:20]

“Beautified for men is the love of things they covet; women, children, much of gold and silver (wealth), branded beautiful horses, cattle and well-tilled land. This is the pleasure of the present world’s life; but Allah has the excellent return (Jannah with flowing rivers) with Him.” [Āl ‘Imrān 3:14]

“O mankind! Verily, the Promise of Allah is true. So let not this present life deceive you, and let not the chief deceiver (Satan) deceive you about Allah.” [Fāṭir 35:5]

“The mutual rivalry (for piling up of worldly things) diverts you. Until you visit the graves (i.e., till you die). Nay! You shall come to know! Again nay! You shall come to know! Nay! If you knew with a sure knowledge (the end result of piling up, you would not have been occupied yourselves in worldly things)”. [At-Takāthur 102:1–5]

“And this life of the world is only amusement and play! Verily, the home of the Hereafter is the real life if they but knew”. [Al-‘Ankabūt 29:64]

457

హదీసు 457

عن عمرو بنِ عوفٍ الأَنْصاريِّ. رضي اللَّه عنه، أَنَّ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم بَعَثَ أَبا عُبيدةَ بنَ الجرَّاحِ، رضي اللَّه عنه، إِلَى البَحْرَيْنِ يَأْتِي بِجزْيَتِهَا فَقَدمَ بِمالٍ منَ البحْرَينِ، فَسَمِعَت الأَنصَارُ بقُدومِ أَبي عُبَيْدَةَ، فوافَوْا صَلاةَ الفَجْرِ مَعَ رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَلَمَّا صَلى رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، انْصَرَفَ، فَتَعَرَّضُوا لَهُ، فَتَبَسَّمَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم حِينَ رَآهُمْ، ثُمَّ قَالَ: "أَظُنُّكُم سَمِعتُم أَنَّ أَبَا عُبَيْدَةَ قَدِمَ بِشَيء مِنَ الْبَحْرَيْنِ"فقالوا: أَجَل يَا رسول اللَّه، فقال:"أَبْشِرُوا وأَمِّلُوا مَا يَسرُّكُمْ، فواللَّه مَا الفقْرَ أَخْشَى عَلَيْكُمْ. وَلكنّي أَخْشى أَنْ تُبْسَطَ الدُّنْيَا عَلَيْكُم كَمَا بُسطَتْ عَلَى مَنْ كَانَ قَبْلَكُمْ، فَتَنَافَسُوهَا كَمَا تَنَافَسُوهَا. فَتَهْلِكَكُمْ كَمَا أَهْلَكَتْهُمْ "متفقٌ عليه.

హజ్రత్ అమ్ర్ బిన్ ఔఫ్ అన్సారీ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ అబూ ఉబైదా బిన్ జర్రాహ్ (రదియల్లాహు అన్హు) ను బహ్‌రైన్ ప్రాంతం నుంచి జిజ్‌యా సొమ్మును వసూలు చేసుకొని రమ్మని పంపించారు. ఆయన బహ్‌రైన్ వెళ్ళి జిజ్‌యా సొమ్ము తీసుకొని (మదీనాకు) తిరిగొచ్చారు. ఆయన వచ్చిన సంగతి అన్సార్లందరికీ తెలిసిపోయింది. మరునాడు వాళ్ళందరూ దైవప్రవక్త వెంట ఫజ్ర్ నమాజ్‌లో పాల్గొన్నారు. ఆయన నమాజ్ చేయించారు. ఆ తరువాత వెళ్ళిపోతుండగా వాళ్ళు ఆయన చుట్టూ గుమిగూడారు. దైవప్రవక్త ﷺ వారిని చూసి చిరునవ్వు నవ్వుతూ "అబూ ఉబైదా బహ్‌రైన్ నుంచి ఎంతోకొంత సొమ్ము తీసుకువచ్చాడని మీకు తెలిసిపోయిందనుకుంటా" అని అన్నారు. "ఔను, అది తెలుసుకునే వచ్చాం. దైవప్రవక్తా!" అని విన్నవించుకున్నారు అనుచరులు. అందుకు ఆయన "మీకు శుభవార్తే! (నిజంగానే బహ్‌రైన్ నుంచి సొమ్ము వచ్చింది). మీరు ఇష్టపడే సంపద దొరుకుతుందని ఆశించండి. (కాని ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి). దైవసాక్షిగా చెబుతున్నాను. మీరు ఆర్థిక ఇబ్బందులకు గురవుతారన్న భయం నాకు లేదు. కాని గత సమాజాల్లో మాదిరిగా మీక్కూడా పుష్కలంగా ప్రాపంచిక సిరిసంపదలు లభిస్తే మీరూ వారిలాగే ప్రాపంచిక వ్యామోహంలో పోటీ పడతారేమోనని నాకు భయంగా ఉంది. అలా చేస్తే ఈ ప్రాపంచిక వ్యామోహం గత సమాజాలను నాశనం చేసినట్లుగా మిమ్మల్ని కూడా నాశనం చేయవచ్చు" అని వారిని హెచ్చరించారు.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని ఫర్జుల్ ఖమ్స్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని ప్రేమైక వచనాల ప్రకరణం)

English

`Amr bin `Auf Al-Ansari (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ sent Abu `Ubaidah bin Al-Jarrah (radiyallahu anhu) to Bahrain to collect (Jizyah). So he returned from Bahrain with wealth. The Ansar got news of it and joined with the Prophet ﷺ in the Fajr prayer. When the Prophet ﷺ concluded the prayer, they stood in his way. When he saw them, he smiled and said, “I think you have heard about the arrival of Abu `Ubaidah with something from Bahrain”. They said, “Yes! O Messenger of Allah!”. He ﷺ said, “Rejoice and hope for that which will please you. By Allah, it is not poverty that I fear for you, but I fear that this world will be opened up with its wealth for you as it was opened to those before you; and you vie with one another over it as they did and eventually it will ruin you as it ruined them”.[Muslim].

ముఖ్యాంశాలు

ఒక జాతి దారిద్ర్యావస్థలో కునారిల్లటంకన్నా అంతులేని ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉండటమే ధార్మికంగా ఎంతో ప్రమాదకరమని ఈ హదీసు ద్వారా తెలుస్తోంది. అందుకే దైవప్రవక్త తన అనుచర సమాజాన్ని ప్రాపంచిక సిరిసంపదల సమృద్ధిని గురించి అప్రమత్తం చేశారు. ఇహలోకపు భోగభాగ్యాల వలలో చిక్కుకోకుండా తమల్ని తాము కాపాడుకోమని హెచ్చరించారు. పధ్నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం దైవప్రవక్త ﷺ ఊహించిన పరిణామాలు నేడు నిజమవుతున్నట్లు అనిపిస్తున్నాయి. అనేకమంది ధనవంతులు ప్రాపంచిక భోగలాలస మైకంలో పడి విశ్వాసాన్ని, సదాచరణను విస్మరిస్తున్నారు. ధర్మం విషయంలో ఏమరుపాటుకు లోనై ఉన్నారు. ప్రజలు ఇలాంటి ఉపద్రవాలకు లోనవుతారనే దైవప్రవక్త ﷺ హెచ్చరించింది!

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|55. ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి…|హదీసు 457

458

హదీసు 458

وعن أَبي سعيدٍ الخدريِّ، رضيَ اللَّه عنه. قالَ: جَلَسَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم عَلى المِنْبَرِ، وَجَلسْنَا حَوْلَهُ. فقال: "إِنَّ مِمَّا أَخَافُ عَلَيْكُم مِنْ بَعْدِي مَا يُفْتَحُ عَلَيْكُمْ مِن زَهْرَةِ الدُّنيَا وَزيَنتهَا" متفقٌ عيه.

హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం : ఓసారి దైవప్రవక్త ﷺ (మస్జిదె నబవీలోని) వేదికపై కూర్చొని ఉండగా మేము కూడా ఆయన చుట్టూ కూర్చున్నాం. ఆ సందర్భంగా ఆయన మాకు హితబోధ చేస్తూ, "నా తదనంతరం ప్రాపంచిక సౌందర్యం, దాని పటాటోపం మీపై (వెల్లువలా) వచ్చిపడుతుందేమోనని నాకు భయంగా ఉంది" అని ఆందోళన వ్యక్తం చేశారు.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని జకాత్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణం)

English

Abu Sa`id Al-Khudri (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ sat on the pulpit and we sat around him. He said: “What I am concerned most is the flourishment and the beauty of this world will be available to you”.[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|55. ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి…|హదీసు 458

459

హదీసు 459

عنه أَنَّ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، قَالَ: "إِنَّ الدُّنْيَا حُلْوَةٌ خَضِرَةٌ وَإِنَّ اللَّه تَعالى مُسْتَخْلِفكُم فِيهَا، فَيَنْظُرُ كَيْفَ تَعْملُونَ فاتَّقُوا الدُّنْيَا واتَّقُوا النِّسَاءِ" رواه مسلم.

హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : నిశ్చయంగా ఈ ప్రపంచం తియ్యనైనది, సస్యశ్యామలమైనది. వాస్తవా నికి దేవుడు మిమ్మల్ని ఈ ప్రపంచంలో ప్రతినిధులుగా పుట్టించి, మీరు ఎలా పనిచేస్తారోనని పరీక్షిస్తున్నాడు. కనుక మీరు ప్రాపంచిక (మాయల) విషయంలో, స్త్రీల (ద్వారా ఎదురయ్యే పరీక్షల) విషయంలో అప్రమత్తంగా ఉండండి.

(ముస్లిం)

English

Abu Sa`id Al-Khudri (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said: “The world is sweet and green (alluring); and verily, Allah is making you to succeed each other, generations after generations in it in order to see how you act. So beware of this world and beware of women”.[Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో ప్రాపంచిక సిరిసంపదలు, స్త్రీల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పబడింది. ముఖ్యంగా స్త్రీల మూలంగా తలెత్తే ఉపద్రవాలకు దూరంగా ఉండాలని తాకీదు చేయబడింది. దానికోసం ప్రజలు ఇస్లామీయ షరీఅత్ సూచించే జాగ్రత్తల్ని పాటించాలి. స్త్రీలు పరదా పద్ధతిని అవలంబించాలి. బజారుల్లో నడుస్తున్నప్పుడు చూపులు క్రిందికి వాల్చి నడవాలి. పరాయి పురుషులూ, స్త్రీల కలయిక జరగకుండా నిరోధించాలి. ఏ స్త్రీ కూడా పరాయి పురుషుడితో ఏకాంతంలో ఉండకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అలా చేసినప్పుడే సమాజం అసభ్య కార్యాలకు దూరంగా, లజ్జారహిత చేష్టల నుండి పరిశుద్ధంగా ఉంటుంది. షరీఅత్ నిబంధనల్ని తేలిగ్గా కొట్టిపారేసే ప్రభృతులే సాధారణంగా స్త్రీల వలలో చిక్కుకొని, వారి చంచలమైన చూపుల బాణాలకు క్షతగాత్రులై, వారి అందచందాలకు ఆహుతి అయిపోతుంటారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|55. ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి…|హదీసు 459

460

హదీసు 460

وعن أَنسٍ رضيَ اللَّه عنه. أَنَّ النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "اللَّهُمَّ لاَ عَيْشَ إِلاَّ عَيْشُ الآخِرَةِ" متفقٌ عَلَيْهِ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ "దైవమా! అసలు జీవితమంటే పరలోక జీవితమే" అని అన్నారు. (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లింలోని జిహాద్ ప్రకరణాలు)

English

Anas (radiyallahu anhu) reported: The Prophet ﷺ said: “O Allah, there is no true life but the life of the Hereafter”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

దైవప్రవక్త ﷺ రెండు సందర్భాల్లో ఈ మాట చెప్పారు. వాస్తవానికి ఇదో చిన్న కవిత. కందక యుద్ధం జరిగిన రోజుల్లో ఆయన అనుచరులు కందకాలు తవ్వి మట్టిమోస్తున్నప్పుడు వారిలో ఉత్సాహాన్ని కలిగించటానికి వారి ముందు ఈ కవిత చదివారు. "దేవా! జీవితమంటే అసలు పరలోక జీవితమే" అంటూ ముహాజిర్, అన్సార్ ముస్లింలను క్షమించమని దైవాన్ని వేడుకున్నారు. కందక యుద్ధం జరిగినప్పుడు ముస్లింలు ఎంతో గడ్డు పరిస్థితుల్లో జీవితం గడుపుతున్నారు. వారి దగ్గర తినడానికి సరిగ్గా తిండి కూడా లేని కాలం అది. నకనకలాడుతున్న కడుపులతో శత్రువులనుంచి ఆత్మ రక్షణ కోసం కందకాలు తవ్వుతున్న అనుచరులను ఓదార్చుతూ ఆయన ఈ కవిత చదివారు. ఇహలోకంలో కొద్దిరోజులపాటు కష్టాలను, బాధల్ని దైవం కోసం సహిస్తే, పరలోకంలో సుఖశాంతులతో కూడిన శాశ్వత జీవితం లభిస్తుందని ఈ కవిత ద్వారా తన అనుచరులకు బోధించారాయన.

రెండవసారి దైవప్రవక్త ﷺ తన వీడ్కోలు హజ్ సందర్భంగా అసంఖ్యాక ముస్లిం జనవాహినిని చూసినప్పుడు కూడా ఆయన ఇదేమాట అన్నారు. తమ సంఖ్యాబలాన్ని, శక్తిసామర్థ్యాలను, ఆధిపత్యాన్ని చూసుకొని ఆనందంతో మిడిసిపాటుకు లోను కారాదనీ, ఇహలోకపు శక్తిసామర్థ్యాలు, ప్రాపంచిక పటాటోపాలు ఏదో ఒకనాడు నశించిపోగలవని హెచ్చరించారు. పరలోక జీవితమే అసలు శాశ్వత జీవితమనీ, దానికోసం కృషి చేయమని ఉపదేశించారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|55. ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి…|హదీసు 460

461

హదీసు 461

وعنهُ عن رَسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "يَتْبَعُ المَيِّتَ ثَلاثَةٌ: أَهْلُهُ وَمالُهُ وَعَمَلُهُ: فَيَرْجِعُ اثْنَانِ. وَيَبْقَى معه وَاحدٌ: يَرْجِعُ أَهْلُهُ وَمَالُهُ وَيَبْقَى عَمَلُهُ "متفقٌ عَلَيهِ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : మృతుని వెంట మూడు వస్తువులు (సమాధి దగ్గరికి) వెళతాయి. (1) అతని కుటుంబీకులు. (2) అతని సంపద (3) అతని కర్మలు. రెండు వస్తువులు వెనక్కి తిరిగివస్తాయి. ఒకటి మాత్రం అక్కడే ఉండిపోతుంది. కుటుంబీకులు, సంపద తిరిగివస్తాయి. కాని కర్మలు మాత్రం అతని వెంటే ఉంటాయి. (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలోని ప్రేమైక వచనాల ప్రకరణాలు)

English

Anas (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said: “Three (things) follow a dead person: Members of his family, his property and his deeds. Two of them return; and one remains with him. The people and his wealth return; his deeds remain with him”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

మనిషి మరణించినప్పటి నుంచి పరలోకంలో దైవసన్నిధిలో తన లెక్క తెమలేదాకా తాను గత జీవితంలో చేసుకున్న కర్మలే అతనికి తోడుగా ఉంటాయి. ఆ కర్మల ఆధారంగానే పరలోకంలో అతన్ని సౌభాగ్యుడిగానో, దౌర్భాగ్యుడిగానో తేల్చటం జరుగుతుంది. ఒకవేళ అతను ప్రపంచంలో మంచిపనులు చేసి వుంటే మరణానంతరం సుఖవంతమైన శాశ్వత జీవితం అతనికి స్వాగతం పలుకుతుంది. దురాచరణకు ఒడిగట్టిన దౌర్భాగ్యుడికి ప్రపంచంలో ఎనలేని సంపదలున్నా మరణానంతరం అవేమీ అతనికి ప్రయోజనాన్ని చేకూర్చలేవు. పైగా అతను చేసిన పాపాలకు పర్యవసానంగా సమాధినుంచే అతనికి శిక్ష మొదలౌతుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|55. ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి…|హదీసు 461

462

హదీసు 462

وعنه قَالَ: قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "يُؤْتِيَ بَأَنْعَمِ أَهْلِ الدُّنْيَا مِن أَهْلِ النَّارِ يَوْمَ الْقِيَامَةِ، فَيُصْبَغُ في النَّارِ صَبْغَةً ثُمَّ يُقَالُ: يَا ابْنَ آدَمَ هَلْ رَأَيْتَ خَيْراً قَطُّ؟ هَلْ مَرَّ بِكَ نَعيمٌ قَطُّ؟ فيقول: لا واللَّه يارَبِّ. وَيُؤْتِى بأَشَدِّ النَّاسِ بُؤْساً في الدُّنْيَا مِنْ أَهْلِ الجَنَّةِ فَيُصْبَغُ صَبْغَةً في الجَنَّةِ، فَيُقَالُ لَهُ: يَا ابْنَ آدَمَ هَلْ رَأَيْتَ بُؤْساً قَطُّ؟ هَلْ مَرَّ بِكَ شِدَّةُ قَطُّ؟ فيقولُ: لاَ، وَاللَّه، مَا مَرَّ بِي بُؤْسٌ قَطُّ، وَلا رَأَيْتُ شِدَّةً قَطُّ" رواه مسلم.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు : ప్రళయదినాన ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా సౌఖ్యం అనుభవించిన నరకవాసి ప్రవేశపెట్టబడతాడు. ఒకసారి నరకంలో ముంచి తీసిన పిదప అతనితో, "ఆదం పుత్రుడా! గతంలో నీవెప్పుడయినా సౌఖ్యాన్ని చవిచూశావా? నీకు ఇంతకు ముందు సౌఖ్యాన్ని అనుభవించినట్లు గుర్తుందా?" అని అడగటం జరుగుతుంది. దానికావ్యక్తి, "(అమ్మో) లేదు. దైవసాక్షి! ప్రభూ! గతంలో నేనెప్పుడూ సౌఖ్యాన్ని అనుభవించలేదు" అని అంటాడు. ఆ తరువాత ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా కష్టాలు అనుభవించిన స్వర్గవాసి హాజరుపరచబడతాడు. అతన్ని ఒకసారి స్వర్గంలో ఉంచి తీసిన తరువాత అతనితో "ఓ ఆదం పుత్రుడా! గతంలో నువ్వెప్పుడైనా కష్టాలు ఎదుర్కొన్నావా? నీకు ఇంతకు ముందు కష్టాలు వచ్చినట్లు గుర్తుందా?" అని అడగటం జరుగుతుంది. దానికి సమాధానంగా ఆ స్వర్గవాసి "దైవసాక్షి! నేనెన్నడూ కష్టాలు చూడలేదు. గతంలో నేను బాధపడినట్లు నాకు గుర్తే లేదు" అని అంటాడు. (ముస్లిం)

English

Anas bin Malik (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Among the inmates of Hell, a person who had led the most luxurious life in this world will be brought up on the Day of Resurrection and dipped in the Fire and will be asked: `O son of Adam! Did you ever experience any comfort? Did you happen to get any luxury?’ He will reply: `By Allah, no, my Rubb.’ And then one of the people of Jannah who had experienced extreme misery in the life of this world will be dipped in Jannah. Then he will be asked: `O son of Adam! Did you ever experience any misery? Did you ever encounter difficulty?’ He will say: “By Allah, no my Rubb, I neither experienced misery nor passed through hardship”.[Muslim].

ముఖ్యాంశాలు

మనిషి ఇహలోకపు భోగభాగ్యాల కోసం, ఇక్కడి విలాసాల కోసం ధర్మాధర్మాలను కూడా లెక్కచేయడు. ఇహలోకాన్నే సర్వస్వంగా తలపోసి, ప్రాపంచిక మజాలు జుర్రుకోవటమే జీవిత పరమార్ధంగా భావించి అధర్మంగా ప్రవర్తిస్తాడు. ప్రపంచంలో ఎదురయ్యే కష్టాలను, బాధలను భరించటానికి వెనుకాడతాడు. వాస్తవానికి నరకంలో విధించే శిక్షతో పోల్చుకుంటే ప్రాపంచిక కష్టాలు అసలు కష్టాలే కావు. అదేవిధంగా స్వర్గవాసులకు లభించే సుఖాల ముందు, ఇహలోకపు భోగభాగ్యాలకు, సుఖశాంతులకు పూచిక పుల్లంత విలువ కూడా లేదు. ఒక్కసారి నరకంలో ముంచితీస్తే ఇహలోకపు భోగభాగ్యాలు, విలాసాలు అన్నీ మర్చిపోతాడు మనిషి!

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|55. ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి…|హదీసు 462

463

హదీసు 463

وعن المُسْتَوْردِ بنِ شدَّادٍ رَضِيَ اللَّه عنه، قَالَ: قالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: مَا الدُّنْيَا في الآخِرَةِ إِلاَّ مِثْلُ مَا يَجْعَلُ أَحدُكُمْ أُصْبُعَهُ في الْيَمِّ. فَلْيَنْظُرْ بِمَ يَرْجِعُ؟ " رواه مسلم.

హజ్రత్ ముస్తౌరిద్ బిన్ షద్దాద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : మీరు సముద్రంలో వ్రేలు ముంచి తీస్తే దానికి ఎంత నీరు అంటుకుంటుందో పరలోక జీవితం ముందు ఇహలోక జీవితం (విలువ) కూడా అంతే సుమా!"

(ముస్లిం)

English

Al-Mustaurad bin Shaddad (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “This world (i.e., its pleasures and duration) in comparison with the Hereafter is (similar to the amount of water) one gets when he puts his finger in the sea. Let him then see what it returns with”.[Muslim].

ముఖ్యాంశాలు

ఇహలోకంలో ఎదురయ్యే కష్టసుఖాలు పరలోకంలో లభించే శిక్షలు, అనుగ్రహాల ముందు సముద్రంలోని నీటి బొట్టుతో సమానం. పరలోక శిక్షలతో పోల్చుకుంటే ఇహలోకంలోని కష్టాలు, బాధలను అనుభవించటమే తేలిక. అదేవిధంగా పరలోకంలోని దైవానుగ్రహాలు, స్వర్గసుఖాల ముందు ఇహలోకపు భోగలాలసకు, విలాసవంతమైన జీవితానికి పూచికపుల్లంత విలువ కూడా ఉండదు. అసలు స్వర్గసుఖాల గురించి మనిషి ఊహించనయినా ఊహించలేడు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|55. ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి…|హదీసు 463

464

హదీసు 464

وعن جابرٍ، رضِيَ اللَّه عنهُ أَنَّ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم مَرَّ بِالسُّوقِ وَالنَّاسُ كنفته، فَمَرَّ بِجَدْيٍ أَسَكَّ مَيِّتٍ، فَتَنَاوَلَهُ، فَأَخَذَ بَأُذُنِهِ، ثُمَّ قَالَ: "أَيُّكُمْ يُحِبُّ أَنْ يَكُونَ هَذَا لَهُ بِدِرْهَمٍ؟ "فَقالوا: مَا نُحِبُّ أَنَّهُ لَنَا بِشَيْءٍ، وَمَا نَصْنَعُ بِهِ؟ ثُمَّ قَالَ:"أَتُحِبُّونَ أَنَّهُ لَكُمْ؟ قَالُوا: وَاللَّه لَوْ كَانَ حَيًّا كَانَ عَيْباً فيه، لأنه أَسَكُّ. فكَيْفَ وَهو مَيَّتٌ، فقال:"فَوَ اللَّه للدُّنْيَا أَهْونُ عَلى اللَّه مِنْ هَذَا عَلَيْكُمْ" رواه مسلم. قوله"كنفته"أَيْ: عن جانبيه. وَ"الأَسكُّ"الصغير الأُذُن.

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం : ఒకసారి దైవప్రవక్త ﷺ ఓ బజారుగుండా వెళుతున్నారు. ఆయన ఇరుప్రక్కలా జనం ఉన్నారు. అలా వెళుతూ ఉండగా ఆయన పొట్టి చెవులుగల ఒక చచ్చిన మేక పిల్లను చూశారు. దాని చెవి పట్టుకొని ఆయన అక్కడున్న వారితో, "మీలో ఎవరైనా దీన్ని ఒక్క దిర్హముకైనా కొనటానికి యిష్టపడతారా?" అని అడిగారు. అక్కడున్నవారు, "(ఒక్క దిర్హం కాదు కదా) దానికన్నా తక్కువ ఖరీదుకు కూడా మేము దాన్ని తీసుకోము. ఒకవేళ తీసుకున్నా దాన్ని మేమేం చేసుకుంటాం" అని అన్నారు. ఆయన, "ఒకవేళ ఉచితంగా లభించినా తీసుకోవటానికి యిష్టపడతారా?" అని మళ్ళీ అడిగారు. దానికి వారు, "దైవంతోడు, ఇది బ్రతికున్నా (మేము దీన్ని తీసుకోవటానికి యిష్టపడేవాళ్ళం కాము) దీనిలో లోపం ఉంది. దీని చెవులు పొట్టిగా ఉన్నాయి. ఇక చచ్చిపోయిన తరువాత ఏం తీసుకుంటాం?" అని అన్నారు. అప్పుడు ఆయన "దైవసాక్షి! మీరు ఈ మేకపిల్లను ఎంత తుచ్ఛమైనదిగా భావిస్తున్నారో దేవుని దృష్టిలో ఈ లోకం అంతకన్నా తుచ్ఛమైనది" అని చెప్పారు. (ముస్లిం)

'అసక్కు' అంటే పొట్టిచెవులు గలది అని అర్థం.

(సహీహ్ ముస్లింలోని ప్రేమైక వచనాల ప్రకరణం)

English

Jabir bin `Abdullah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ was passing through the bazaar with his Companions on his both sides, when he saw a dead skinny lamb. He held its ear and said, “Who of you would like to have it for a dirham”. They replied, “We do not like to get it for nothing, and what shall we do with it?”. Then he ﷺ asked, “Would you like to have it for nothing?”. They replied, “Had it been alive, it would have been defective because it is skinny; but when dead it is of no use”. Messenger of Allah ﷺ said, “Truly, the world is more contemptible to Allah than this (the dead lamb) is to you”.[Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసు ద్వారా కూడా ఈ లోకం నిజస్థితి ఏమిటో అవగతమవుతోంది. కాని దీనికోసం ఈ మనిషి ఎన్ని పిల్లిమొగ్గలు వేస్తాడో?!

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|55. ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి…|హదీసు 464

465

హదీసు 465

وعن أَبي ذرٍّ رَضِيَ اللَّه عنه، قَالَ: كُنْتُ أَمْشِي مَعَ النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، في حَرَّةٍ بِالمَدِينَةِ، فَاسْتَقْبلَنَا أَحُدٌ فقال: "يَا أَبَا ذَرٍّ". قلت: لَبَّيْكَ يَا رسولَ اللَّه. فقال:"مَا يَسُرُّني أَنَّ عِنْدِي مِثل أَحُدٍ هَذَا ذَهباً تَمْضِي عَلَيَّ ثَلاثَةُ أَيَّامٍ وعِنْدِي مِنْهُ دِينَارٌ، إِلاَّ شَيْءٌ أَرْصُدُهُ لِدَيْنِ، إِلاَّ أَنْ أَقُولَ بِهِ في عِبَاد اللَّه هكَذَا وَهَكَذا"عن يَمِينهِ وعن شِمَالِهِ وَمِنْ خَلْفِهِ، ثُمَّ سَارَ فقال:"إِنَّ الأَكثَرِينَ هُمُ الأَقَلُّونَ يَومَ القيامةِ إِلاَّ مَنْ قَالَ بالمَالِ هكذَا وَهكَذَا "عن يمينهِ، وعن شمالهِ، ومِنْ خَلفه"وَقَليلٌ مَا هُمْ". ثُمَّ قَالَ لي: "مَكَانَك لاَ تَبْرَحْ حَتَّى آتيَكَ ". ثُمَّ انْطَلَقَ في سَوَادِ اللَّيْلِ حَتَّى تَوَارَى، فسمِعْتُ صَوْتاً قَدِ ارْتَفَعَ، فَتَخَوَّفْتُ أَنْ يَكُونَ أَحَدٌ عَرَضَ للنَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَأَرَدْتُ أَنْ آتِيَهُ فَذَكَرْتُ قَوْله: "لا تَبْرَحْ حَتَّى آتيَكَ"فلم أَبْرَحْ حَتَّى أَتَاني، فَقُلْتُ: لَقَدْ سَمِعْتُ صَوتاً تَخَوَّفْتُ مِنْهُ، فَذَكَرْتُ لَهُ. فقال:"وَهَلْ سَمِعْتَهُ؟ "قلت: نَعَم، قَالَ:"ذَاكَ جِبريلُ أَتاني فقال: مَن ماتَ مِنْ أُمتِكَ لايُشرِكُ باللَّه شَيئاً دَخَلَ الجَنَّةَ، قلتُ: وَإِنْ زَنَي وَإِنْ سَرَقَ؟ قَالَ: وَإِنْ زَنَى وَإِنْ سَرَقَ" متفقٌ عليه. وهذا لفظ البخاري.

హజ్రత్ అబూజర్ర్ (రదియల్లాహు అన్హు) కథనం: ఒకరోజు నేను దైవప్రవక్త ﷺ వెంట మదీనా నగరం వెలుపల కంకర నేలపై నడుస్తుండగా మా ఎదురుగా ఉహుద్ పర్వతం వచ్చింది. అప్పుడు ఆయన 'అబూజర్ర్' అని పిలిచారు. నేను సెలవియ్యండి దైవప్రవక్తా!' అని అన్నాను. ఆ సందర్భంగా ఆయన (ఉహుద్ పర్వతంవైపు చూపుతూ) నాతో ఇలా అన్నారు: "నా దగ్గర ఉహుద్ పర్వతమంత బంగారం ఉంటే నేను అందులో అప్పు తీరిపోయేంత బంగారాన్ని మాత్రం సంభాళించు కోగలను. ఆ తర్వాత మూడు రాత్రులు గడిచినంత కాలంలో అందులో ఒక్క దీనారు కూడా నా దగ్గర మిగిలి ఉండటాన్ని నేను యిష్టపడను. నేనా ధనాన్నంతా ప్రజలకు 'అలా ఇలా' పంచిపెట్టేస్తాను. ఈ మాట అన్నప్పుడు ఆయన తన కుడివైపు నుంచి, ఎడమవైపు నుంచి, వెనుక నుంచి ఖర్చుపెడతానని చేతిని అటూ ఇటూ త్రిప్పి చూపించారు.

ఇంకాస్త దూరం వెళ్ళిన తరువాత ఆయన "ఎక్కువ సిరిసంపదలు కలిగివున్నవారే (ప్రళయదినాన) తక్కువ పుణ్యం పొందుతారు. ధనాన్ని అలా ఇలా కుడి నుంచి, ఎడమవైపు నుంచి, వెనుక నుంచి (ప్రజల కోసం) ఖర్చుపెట్టేవారు తప్ప. కాని అలాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు" అని అన్నారు. ఆ తరువాత నాతో, "నువ్విక్కడే ఉండు. నేను తిరిగొచ్చేదాకా ఇక్కడి నుంచి కదలకు" అని చెప్పి ఆయన చీకట్లో నాకు కనపడకుండా ముందుకు వెళ్ళిపోయారు. అంతలో ఏదో శబ్దం వినిపించింది. ఎవడైనా (శత్రువు) ఆయన మీద దాడి చేశాడేమోనని నాకు భయం వేసింది. ఆయన వెళ్ళినవైపు నేను కూడా పోదామనుకున్నాను. కాని నేనొచ్చేదాకా ఇక్కడ్నుంచి కదలకు అన్న ఆజ్ఞ గుర్తొచ్చి అక్కడే ఆగిపోయాను. కాస్సేపటికి ఆయనే వచ్చారు. నాకు శబ్దం వినిపించిన సంగతి, దానికి నేను భయపడిన సంగతి అంతా ఆయనకు తెలియజేశాను. ఆయన "నీకా శబ్దం వినిపించిందా?" అని అడిగారు. నేను వినిపించిందన్నాను. అప్పుడు ఆయన ఆ శబ్దం గురించి చెబుతూ ఇలా అన్నారు : "అది జిబ్రయీల్ (దూత) నా దగ్గరికి వచ్చినప్పుడు అయిన శబ్దం. 'మీ అనుచర సమాజంలో దైవానికి ఇతరుల్ని ఏ మాత్రం సాటికల్పించకుండా మరణించిన వ్యక్తి స్వర్గానికి వెళ్తాడు" అని ఆయన నాతో చెప్పారు. నేనామాటలు విని "అతను వ్యభిచారం చేసివున్నా, దొంగతనాలకు పాల్పడివున్నా (స్వర్గానికి వెళతాడా?)"అని అడిగాను. దానికి జిబ్రయీల్ "ఔను, వ్యభిచారం చేసివున్నా, దొంగతనాలకు పాల్పడి వున్నా సరే" అని అన్నారు. (బుఖారీ – ముస్లిం, వాక్యాలు మాత్రం బుఖారీవి).

(సహీహ్ బుఖారీలోని ప్రేమైక వచనాల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణం)

English

Abu Dharr (radiyallahu anhu) reported: I was walking with the Prophet on the stony ground in Al-Madinah in the afternoon when Uhud Mount came into sight. Messenger of Allah ﷺ said, “O Abu Dharr!” I said, “O Messenger of Allah, here I am responding to you”. He said, “If I had as much gold as the weight of Uhud, it would not please me to have a single dinar out of it with me after the passage of three days, but I would hold back something for the repayment of a debt. I would distribute it among the slaves of Allah like this and like this and like this.” And he ﷺ pointed in front of him, and on his right side and on his left side. We then walked a little further and he ﷺ said: “The rich would be poor on the Day of Resurrection, except he who spent like this and like this and like this,”. and he pointed as he did the first time. “But such persons are few”. Then he said, “Stay where you are till I come back to you”. He (the Prophet ﷺ) walked ahead a little further in the darkness of the night and disappeared from my sight. I heard a loud voice. I said (to myself): “The Messenger of Allah might have met (mishap or an enemy)”. I wished I could go after him but I remembered his commanding me to stay till he came back. So I waited for him; and when he came, I made mention of what I had heard. He asked, “Did you hear it?”. I said, “Yes”. Then he said, “It was Jibril (Gabriel), who came to me and said: `He who dies among your Ummah without having associated anything with Allah (in worship) will enter Jannah.’ I said: `Even if he committed illicit sexual intercourse or steals?’ He (Jibril) said: `Even if he has committed illicit sexual intercourse or steals”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసులోని చివరి వాక్యాలకు భావం ఒకే దేవుణ్ణి నమ్మి, ఆయన్ని మాత్రమే ఆరాధిస్తూ ఉండే విశ్వాసి వల్ల ఘోరపాపాలు జరిగివున్నా కూడా అంతిమంగా అతను స్వర్గవాసియే అవుతాడని. అల్లాహ్ తలచుకుంటే తన కరుణాకటాక్షాలతో అతన్ని క్షమించి నరకానికి పంపించవచ్చు లేదా అతను కొంతకాలం శిక్ష అనుభవించిన తరువాత స్వర్గానికి వెళ్ళవచ్చు లేదా కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం ఈ హదీసులో ప్రస్తావించబడిన వ్యక్తి తన మరణానికి ముందు చిత్తశుద్ధితో స్వచ్ఛమైన 'తౌబా' చేసుకున్నప్పటికీ ఆ తర్వాత మంచిపనులు చేసే వ్యవధి లభించనివాడు కావచ్చు. ఇలాంటి వారి వల్ల జరిగిన ఘోరపాపాలను కూడా అల్లాహ్ క్షమించేస్తాడు.

ఈ హదీసులోని తొలిభాగం సదరు అధ్యాయానికి సంబంధించినది. ఇందులోని వాక్యాలు ప్రజలు తమ దగ్గర ప్రాపంచిక సిరిసంపదలు చాలా తక్కువగా ఉంచుకోవాలని ప్రబోధిస్తున్నాయి. ఎందుకంటే ఇహలోకంలో ఎక్కువ సిరిసంపదలున్నవారు పరలోకంలో చాలా తక్కువ పుణ్యాన్ని పొందే అవకాశాలున్నాయి. ఈ హదీసు ద్వారా బోధపడే రెండో విషయం ఏమిటంటే, అప్పు తీర్చటం కోసం ధనాన్ని కూడబెట్టడం కేవలం ధర్మ సమ్మతమే కాదు, పైగా విధి కూడాను. స్వచ్ఛంద (నఫిల్) దానధర్మాలు చేయటంకన్నా అప్పు తీర్చటం చాలా అవసరం. వీటన్నింటిని మించి ఈ హదీసు దైవప్రవక్త దాతృత్వాన్ని, ఆయన ఉదార స్వభావాన్ని వెల్లడిస్తోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|55. ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి…|హదీసు 465

466

హదీసు 466

وعن أبي هريرة رضي اللَّه عنه، عنْ رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "لَوْ كَانَ لِي مِثلُ أُحُدٍ ذَهَباً، لَسرَّني أَنْ لاَ تَمُرَّ علَيَّ ثَلاثُ لَيَالٍ وَعِندِي مِنْهُ شَيءٌ إلاَّ شَيءٌ أُرْصِدُه لِدَينٍ "متفقٌ عليه.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు : నా దగ్గర ఉహుద్ పర్వతమంత బంగారం ఉంటే అందులో నా అప్పు తీరిపోయేటంత (ధనం) తప్ప మూడు రాత్రులు గడిచేలోగా అందులో ఒక్క చిల్లిగవ్వ కూడా మిగలకుండా ఉండటాన్నే నేను యిష్టపడతాను.

(బుఖారీ – ముస్లిం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said: “If I had gold equal to Mount Uhud (in weight), it would not please me to pass three nights and I have a thing of it left with me, except what I retain for repayment of a debt”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

అంటే మూడు రాత్రులు గడిచేలోగా నేనా ధనాన్నంతటినీ దైవమార్గంలో ఖర్చుపెట్టి చేతులు దులుపుకుంటానని అర్థం. దీనిద్వారా ఆయన ఇహలోక సిరిసంపదల పట్ల ఎంత అనాసక్తత కనబరిచేవారో తెలుస్తోంది. తన దగ్గర ధనం నిల్వ ఉండటాన్ని ఆయన సుతరామూ యిష్టపడేవారు కాదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|55. ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి…|హదీసు 466

467

హదీసు 467

وعنه قال: قال رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: انْظُرُوا إِلَى منْ أَسفَل منْكُمْ وَلا تَنْظُرُوا إِلَى مَنْ هَوَ فَوقَكُم فهُوَ أَجْدرُ أَن لاَ تَزْدَرُوا نعمةَ اللَّه عَليْكُمْ" متفقٌ عَلَيْهِ وهذا لفظ مسلمٍ. وفي رواية البخاري، "إِذا نَظَر أَحَدُكُمْ إِلَى مَنْ فُضلَ عليهِ في المالِ وَالخَلْقِ فلْينْظُرْ إِلَى مَنْ هُوَ أَسْفَلُ مِنْهُ".

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: మీరు (ప్రాపంచిక సిరిసంపదల రీత్యా) మీకన్నా తక్కువ స్థితిలో ఉన్నవారి వైపు చూడండి. అంతేగాని మీకన్నా ఉచ్ఛస్థితిలో ఉన్నవారి వైపు చూడకండి. దేవుడు మీకు ప్రసాదించిన అనుగ్రహాల పట్ల మీరు కృతజ్ఞతా భావంతో ఉండటానికి ఇదెంతో అనువైన పద్ధతి.

(బుఖారీ – ముస్లిం, వాక్యాలు మాత్రం ముస్లింవి.)

బుఖారీ వాక్యాలు ఈ విధంగా ఉన్నాయి: మీలో ఎవరైనా సిరిసంపదల రీత్యా, అందం రీత్యా తనకన్నా మంచి స్థితిలో ఉన్నవారిని చూస్తే, అతను (ఆయా విషయాల్లో) తనకన్నా హీనస్థితిలో ఉన్నవారివైపు కూడా దృష్టి సారించాలి."

(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలోలలోని ప్రేమైక వచనాల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Look at those who are inferior to you and do not look at those who are superior to you, for this will keep you from belittling Allah’s Favour to you.”[Al-Bukhari and Muslim].

This is the wording in Sahih Muslim. The narration in Al-Bukhari is: Messenger of Allah ﷺ said: “When one of you looks at someone who is superior to him in property and appearance, he should look at someone who is inferior to him”.

ముఖ్యాంశాలు

ప్రాపంచిక సిరిసంపదల్లో, అందచందాల్లో తనకన్నా మంచి స్థితిలో ఉన్నవారిని చూసినప్పుడు సహజంగానే మనిషి ఈర్ష్యాసూయలకు లోనవుతాడు. దైవానుగ్రహాల పట్ల అతనిలో ఒకింత కృతఘ్నతా భావం జనిస్తుంది. ఇలాంటి దుష్టభావాలు జనించకుండా ఉండాలంటే మనిషి తనకన్నా హీనస్థితిలో ఉన్నవారివైపు కూడా దృష్టి సారిస్తూ ఉండాలి. ఈ రోగానికి ఇదే సరైన చికిత్స. మనం ఒక మామూలు ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా జీవితం గడుపుతున్నప్పుడు మనకన్నా ఉచ్ఛస్థితిలో ఉన్న ధనవంతుల సుందర హర్మ్యాలను, ఎత్తైన బంగ్లాలను చూసి న్యూనతాభావానికి లోనుకాకూడదు. పైగా మన పరిసరాల్లో మనకన్నా హీనమైన స్థితిని అనుభవిస్తున్న వారిని చూసి దేవుడు మనల్ని వారికన్నా మంచిస్థితిలో ఉంచినందుకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎండల్లో మాడిపోతూ, వానల్లో తడిసిపోతూ చెట్లక్రింద, రోడ్లప్రక్కన బ్రతుకులు వెళ్ళదీస్తున్న వారిని చూసి మనకు ఆ గతి పట్టనందుకు సంతోషించాలి. అంతేగాని ప్రాపంచిక సిరిసంపదల తళుకుబెళుకులను చూసి అసంతృప్తికి లోనుకారాదు. అయితే దైవభీతి, ధర్మపరాయణత లాంటి విషయాల్లో మాత్రం ఎల్లప్పుడూ మనకన్నా గొప్పవారినే ఆదర్శంగా తీసుకోవాలి. దానివల్ల మనలో కూడా ధార్మిక చింతన, దైవారాధనా భావాలు పెంపొందుతాయి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|55. ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి…|హదీసు 467

468

హదీసు 468

وعنه عن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "تَعِسَ عبْدُ الدِّينَارِ وَالدِّرْهَمِ وَالقطيفَةِ وَالخَمِيصَةِ، إِنْ أُعطِيَ رَضِيَ، وَإِنْ لَمْ يُعطَ لَمْ يَرْضَ "رواه البخاري.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు : దిర్హములు, దీనార్ల పూజారి ఒకటి రెండు ఉన్ని దుప్పట్ల పూజారి, నాశనమయిపోవునుగాక! అతను ఈ వస్తువులు దొరికితే సంబరపడతాడు. లేకపోతే అలుగుతాడు.

(బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని జిహాద్ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “May he be miserable, the worshipper of the dinar and dirham, and the worshipper of the striped silk cloak. If he is given anything, he is satisfied; but if not, he is unsatisfied”.[Al-Bukhari]

ముఖ్యాంశాలు

దిర్హములు, దీనార్ల పూజారి అంటే దైవాదేశాలకన్నా ప్రాపంచిక సిరిసంపదలను ఎక్కువగా ఆరాధించేవాడని అర్థం. ఇలాంటి వ్యక్తి రేయింబవళ్లు ధనసంపాదనలోనే తలమునకలై ఉండి దైవాన్ని మరిచిపోతాడు. దేవుణ్ణి పూజించటానికి బదులు ధనాన్నే పూజించటం మొదలుపెడతాడు. ఆఖరికి ఈ ధనపూజే అతణ్ణి వినాశ కూపంలోకి నెట్టివేస్తుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|55. ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి…|హదీసు 468

469

హదీసు 469

وعنه، رضي اللَّه عنه، قَالَ: لقَدْ رَأَيْتُ سبعِين مِنْ أَهْلِ الصُّفَّةِ، مَا منْهُم رَجُلٌ عَلَيْهِ رداءٌ، إِمَّا إِزَارٌ، وإِمَّا كِسَاءٌ، قدْ ربطُوا في أَعْنَاقِهِمْ، فَمنْهَا مَا يبْلُغُ نِصفَ السَّاقَيْن. ومنْهَا مَا يَبْلُغُ الكَعْبينِ. فَيجْمَعُهُ بيدِه كراهِيَةَ أَنْ تُرَى عوْرتُه"رواه البخاري.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం : నేను డెబ్భైమంది సుఫ్ఫా మనుషుల్ని (విద్యార్థుల్ని) చూశాను. వారిలో ఎవరిదగ్గరా శరీరానికి చాలినంత వస్త్రం ఉండేది కాదు. ఉంటే లుంగీ ఉండేది లేకపోతే (పొడువాటి) దుప్పటి ఉండేది. దాన్ని వాళ్ళు భుజాల మీది నుంచి చుట్టుకునేవారు. అది కూడా (చాలీచాలనట్టుగా) పిక్కల వరకు లేదా గిలకల వరకు (వ్రేలాడుతూ) ఉండేది. ఆచ్ఛాదనం తొలగిపోతుందేమోనని భయంతో వాళ్ళు ఆ వస్త్రాన్ని ముడుచుకొని పట్టుకునేవారు. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని ప్రార్థనా స్థలాల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: I saw seventy of the people of the Suffah and none of them had a cloak. They had either a lower garment or a blanket which they suspended from their necks. Some (cloaks) reached halfway down to the legs and some to the ankles; and the man would manage to keep it in his hand to avoid exposing his private parts.[Al-Bukhari].

ముఖ్యాంశాలు

సుఫ్ఫా అంటే అరుగు అని అర్థం. మస్జిదె నబవీ ముందు ఓ అరుగు ఉండేది. ఆ అరుగు దగ్గర దైవప్రవక్త వద్ద ధార్మిక జ్ఞానాన్ని ఆర్జించే విద్యార్థులు, సైనిక శిక్షణ పొందే యోధులు ఉండేవారు. వీరిని అహ్లెసుప్ఫా (సుఫ్ఫా విద్యార్థులు) అని పిలిచేవారు. సుప్ఫా విద్యార్థుల సంఖ్య ఎంతో ఇతమిత్థంగా తెలియదు. ఇస్లాంలో ఇది తొలి పాఠశాలగా, తొలి సైనిక శిబిరంగా విరాజిల్లింది. నేడు ధర్మజ్ఞానాన్ని ఆర్జించే విద్యార్థులకు ఈ సుప్ఫా పాఠశాలలో ఎంతో గుణపాఠం ఉంది. ప్రవక్త అనుచరులు అన్నపానీయాలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా రేయింబవళ్లు ఆ అరుగు దగ్గరే ఉంటూ కష్టపడి ధర్మజ్ఞానాన్ని ఆర్జించటంతోపాటు సైనిక శిక్షణ కూడా పొందేవారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|55. ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి…|హదీసు 469

470

హదీసు 470

وعنه قَالَ: قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "الدُّنْيَا سِجْنُ المُؤْمِنِ وجنَّةُ الكَافِرِ" رواه مسلم.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : విశ్వాసికి ప్రపంచం చెరసాల వంటిది. అవిశ్వాసికి ఇది స్వర్గం లాంటిది. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని ప్రేమైక వచనాల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said: “The world is the believer’s prison and the infidel’s Jannah”.[Muslim].

ముఖ్యాంశాలు

విశ్వాసికి ఇహలోకంలో తన మనోవాంఛల్ని, కోరికల్ని అదుపులో పెట్టుకొని భక్తీవిశ్వాసాలతో కూడిన జీవితాన్ని గడపవలసి ఉంటుంది. దైవాదేశాలకు, షరీఅత్ నిబంధనలకు లోబడి వ్యవహరించవలసి ఉంటుంది. ఆ విధంగా చూస్తే ఒక విశ్వాసి పాలిట ఈ ప్రపంచం చెరసాలతో సమానం. కాని అవిశ్వాసికి అలాంటి నియమనిబంధనలేవీ ఉండవు. అతను షరీఅత్ ఆదేశాలకు కట్టుబడి జీవితం గడపడు. పైగా తన మనోవాంఛలకు అనుగుణంగా ప్రవర్తిస్తాడు. ఎల్లప్పుడూ ఇహలోకపు భోగభాగ్యాల మజాలు జుర్రుకోవటంలో మునిగి ఉంటాడు. ఆ విధంగా అవిశ్వాసులకు ఇహలోకమే స్వర్గంలా కనిపిస్తుంది. కాని యదార్థానికి ఇహలోకపు భోగభాగ్యాలు అశాశ్వతమైనవి. ప్రాపంచిక సిరిసంపదలు ఒక మాయతడిక తప్ప మరేమీ కావు. ప్రపంచంలో కొద్దిపాటి కష్టాన్ని దైవం కోసం సంతోషంగా అనుభవించిన వారికి పరలోకంలో ఎన్నటికీ తరగని సుఖాలు లభిస్తాయి. వారు అక్కడ అలాగే శాశ్వతంగా ఉంటారు. దీనికి విరుద్ధంగా ఇహలోకపు భోగభాగ్యాల వలలో చిక్కుకొని దైవాన్ని విస్మరించినవారి భోగలాలస వారి మరణంతోనే మూన్నాళ్ల ముచ్చటగా తీరిపోతుంది. ఆ తరువాత పరలోకంలో వారు భగభగమండే నరకాగ్నికి ఆహుతి అవుతారు. అక్కడ వారు చావనూ లేరు. అందులోనుంచి తప్పించుకోనూ లేరు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|55. ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి…|హదీసు 470

471

హదీసు 471

وعن ابن عمر، رضي اللَّه عنهما، قَالَ: أَخَذ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم بِمَنْكِبَيَّ، فقال: "كُنْ في الدُّنْيا كأَنَّكَ غريبٌ، أَوْ عَابِرُ سبيلٍ ". وَكَانَ ابنُ عمرَ، رضي اللَّه عنهما، يقول: إِذَا أَمْسيْتَ، فَلا تَنْتظِرِ الصَّباحَ وإِذَا أَصْبحْت، فَلا تنْتَظِرِ المَساءَ، وخُذْ منْ صِحَّتِكَ لمرضِكَ ومِنْ حياتِك لِموتكَ. رواه البخاري. قالوا في شَرْحِ هَذَا الحديث معناه لاَ تَركَن إِلَى الدُّنْيَا وَلاَ تَتَّخِذْهَا وَطَناً، وَلاَ تُحدِّثْ نَفْسكَ بِطُول الْبقَاءِ فِيهَا، وَلا بالاعْتِنَاءِ بِهَا، وَلاَ تَتَعَلَّقْ مِنْهَا إلاَّ بِما يَتَعَلَّقُ بِه الْغَرِيبُ في غيْرِ وطَنِهِ، وَلاَ تَشْتَغِلْ فِيهَا بِما لاَ يشتَغِلُ بِهِ الْغرِيبُ الَّذِي يُريدُ الذَّهاب إِلَى أَهْلِهِ. وَبِاللَّهِ التَّوْفِيقٌ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ నా భుజాలు పట్టుకొని, "ప్రపంచంలో ఓ అపరిచిత వ్యక్తిలా, ఓ బాటసారిలా జీవితం గడుపు" అని అన్నారు.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఇలా అనేవారు : మీరు సాయంత్రం పూట (ఏదైనా మంచిపని చేయదలచుకుంటే) ఉదయం కోసం ఎదురుచూడకండి. ఉదయమైతే సాయంత్రం కోసం ఎదురుచూడకండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు అనారోగ్యావస్థ కోసం, జీవించి ఉన్నప్పుడు చావుకోసం ఏమైనా (మంచి పనులు) చేసుకోండి." (బుఖారీ)

ఈ హదీసుని వివరిస్తూ పండితులు ఇలా అన్నారు : దీని భావం ఏమిటంటే, నీవు ఈ ప్రపంచాన్ని అతిగా పట్టించుకోకు. దాన్ని శాశ్వత నిలయంగా భావించకు. ఎక్కువ కాలం వరకు ప్రపంచంలో ఉండాలని, దాన్ని చూడాలని మాత్రం కోరుకోకు. ఒక అపరిచిత బాటసారి తన దేశం కాని దేశంలో ఎలా ఉంటాడో ప్రపంచంలో అలా ఉండు. తన ఇంటికి బయలుదేరిన బాటసారి పరదేశాన్ని (సుఖాల్ని) పట్టించుకోడు. అలాగే నీవు కూడా ఇహలోకంపై అంతగా మోజు పడకు.

(సహీహ్ బుఖారీలోని ప్రేమైక వచనాల ప్రకరణం)

English

`Abdullah bin `Umar (radiyallahu anhuma) reported: Messenger of Allah ﷺ took hold of my shoulders and said, “Be in the world like a stranger or a wayfarer”.

Ibn `Umar (radiyallahu anhuma) used to say: “When you survive till the evening, do not expect to live until the morning; and when you survive until the morning, do not expect to live until the evening; (do good deeds) when you are in good health before you fall sick, and (do good deeds) as long as you are alive before death strikes”.[Al-Bukhari].

ముఖ్యాంశాలు

ఇహలోకపు భోగభాగ్యాలు మూన్నాళ్ళముచ్చట అని తెలుసుకున్నవాడు ప్రపంచంలో తనకు బంగారపు కొండలు కావాలని ఎన్నటికీ కోరుకోడు. మరణానంతర శాశ్వత జీవితం గురించి ఆలోచిస్తాడు. కాని మానవుడు ఎంత మూర్ఖుడు! క్షణక్షణం అనిశ్చింతగా నడిచే ఈ ఇహలోక జీవితపు ఆనందాల కోసం అంతులేని సిరిసంపదలు కూడబెట్టుకుంటున్నాడు. ఇహలోకంలోనే శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాడేమో!

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|55. ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి…|హదీసు 471

472

హదీసు 472

وعن أَبي الْعبَّاس سَهْلِ بنِ سعْدٍ السَّاعديِّ، رضي اللَّه عنه، قَالَ: جاءَ رجُلٌ إِلَى النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: فقالَ: يَا رسولَ اللَّه دُلَّني عَلى عمَلٍ إِذا عَمِلْتُهُ أَحبَّني اللَّه، وَأَحبَّني النَّاسُ، فقال: " ازْهَدْ في الدُّنيا يُحِبَّكَ اللَّه، وَازْهَدْ فِيمَا عِنْدَ النَّاسِ يُحبَّكَ النَّاسُ" حديثٌ حسنٌ رواه ابن مَاجَه وغيره بأَسانيد حسنةٍ.

హజ్రత్ అబుల్ అబ్బాస్ సహ్ల్ బిన్ సాద్ సాయిదీ (రదియల్లాహు అన్హు) కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺ దగ్గరికి వచ్చి, "దైవప్రవక్తా! దేవుడు, ప్రజలు నన్ను అభిమానించాలంటే ఏం చెయ్యాలో చెప్పండి" అని అడిగాడు. "లోకంపట్ల అనాసక్తత చూపు. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఆ తర్వాత ప్రజల దగ్గర ఉన్నవాటి పట్ల అనాసక్తత కనబరచు. అప్పుడు ప్రజలు నిన్ను అభిమానిస్తారు" అని సమాధానమిచ్చారు దైవప్రవక్త ﷺ.

(ఈ హదీసు హసన్ కోవకు చెందినది. ఇబ్నెమాజా తదితరులు దీనిని ప్రామాణికమైన ఆధారాలతో వెలికితీశారు.)

(సుననె ఇబ్నెమాజాలోని ఐహిక అనాసక్తత ప్రకరణం)

English

Sahl bin Sa`d As-Sa`idi (radiyallahu anhu) reported: A man came to the Prophet ﷺ and said, “O Messenger of Allah, guide me to such an action which, if I do Allah will love me and the people will also love me.” He ﷺ said, “Have no desire for this world, Allah will love you; and have no desire for what people possess, and the people will love you.”[Ibn Majah]

ముఖ్యాంశాలు

'ఐహిక అనాసక్తత' అంటే ప్రాపంచిక జీవన సామగ్రిని పూర్తిగా కాలదన్ని భిక్షాటన చేసుకొని లేదా పస్తులుండి జీవితం గడపమని అర్థం ఎంతమాత్రం కాదు. వాస్తవానికి ఐహిక అనాసక్తత అంటే ధర్మసమ్మతమైన మార్గాల ద్వారా వచ్చే సంపదపై సంతృప్తి చెందటం, దొడ్డిదోవల్లో డబ్బు సంపాదించకుండా ఉండటం అని అర్థం. మనిషి బ్రతుకుతెరువు కోసం మార్గాలు అన్వేషించకుండా ఉండటాన్ని, ఇహలోకపు సంబంధ బాంధవ్యాలన్నింటిని త్రెంచుకొని ఒంటరి జీవితం గడుపుతూ దేహాన్ని శుష్కించుకోవటాన్ని ఇస్లాం ధర్మం సుతరామూ ఇష్టపడదు. కనుక అవసరం మేరకు ప్రాపంచిక సంబంధాలు కలిగి ఉండటం, జీవనోపాధి కోసం కృషిచేయటం 'ఐహిక అనాసక్తత' కు విరుద్ధం కాదు. పైగా ధర్మసమ్మతమైన మార్గాల ద్వారా డబ్బు సంపాదించటాన్ని, దాంతో సంతృప్తి చెందటాన్ని ఇస్లాం ఒక 'ఆరాధన'గా పరిగణిస్తుంది.

అయితే మనిషి పరులవద్ద ఉన్న సిరిసంపదల కోసం అర్రులు చాచకూడదు. ఎల్లప్పుడూ వాటి పట్ల నిరపేక్షాభావంతో ఉండాలి. ప్రజల ధనం పట్ల అనాసక్తత కనబరిచేవాడిని ప్రజలు అభిమానిస్తారు. అలాంటి మనిషికి ప్రజల దృష్టిలో గౌరవప్రదమైన స్థానం లభిస్తుంది. దీనికి భిన్నంగా పరుల ధనం కోసం వెంపర్లాడేవాడిని, ఏ కష్టం చేయకుండా భిక్షాటన చేసేవాడిని ప్రజలు నీచుడిగా చూస్తారు. అలాంటి వ్యక్తి సమాజంలో అప్రతిష్ఠ పాలౌతాడు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|55. ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి…|హదీసు 472

473

హదీసు 473

وعن النُّعْمَانِ بنِ بَشيرٍ، رضيَ اللَّه عنهما، قالَ: ذَكَر عُمَرُ بْنُ الخَطَّاب، رضي اللَّه عنه، مَا أَصَابَ النَّاسُ مِنَ الدُّنْيَا، فَقَالَ: لَقَدْ رَأَيْتُ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَظَلُّ الْيَوْمَ يَلْتَوي مَا يَجِدُ مِنَ الدَّقَل مَا يمْلأُ بِهِ بطْنَهُ. رواه مسلم. "الدَّقَلُ"بفتح الدال المهملة والقاف: رَدِئُ التَّمْرِ.

హజ్రత్ నోమాన్ బిన్ బషీర్ (రదియల్లాహు అన్హుమా) కథనం : హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గతంలో ప్రజల ప్రాపంచిక స్థితిని గుర్తుచేస్తూ ఇలా అన్నారు : "దైవప్రవక్త ﷺ ఒక్కోసారి రోజంతా (తినటానికి తిండిలేక) ఆకలి బాధతో పొట్టను వంచి ఉంచటం నేను కళ్ళారా చూశాను. ఆయనకు కడుపునింపుకోవటానికి తాలు ఖర్జూరాలు కూడా దొరికేవి కావు." (ముస్లిం)

'దఖల్' అంటే తప్ప, తాలు అయిన ఖర్జూరాలు అని అర్థం.

(సహీహ్ ముస్లింలోని ప్రేమైక వచనాల ప్రకరణం)

English

An-Nu`man bin Bashir (radiyallahu anhuma) reported: `Umar bin Al-Khattab (radiyallahu anhu) spoke at length regarding the worldly prosperity that people had achieved and said: “I saw that the Messenger of Allah ﷺ would pass his days in hunger and could not get even degraded dates to fill his stomach”.[Muslim].

ముఖ్యాంశాలు

రెండవ ఖలీఫా హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కాలంలో ముస్లింలు ఎన్నో విజయాలు సాధించారు. ముస్లింల ధాన్యాగారం అపారమైన సిరిసంపదలతో నిండిపోయింది. ప్రజలు అష్టైశ్వర్యాలతో తులతూగుతున్నారు. అప్పుడు హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ప్రజల్లో కృతజ్ఞతాభావం పెంపొందించాలన్న ఉద్దేశ్యంతో వారికి ఇస్లాం ఆరంభ దినాలను గుర్తుచేశారు. ఆ కాలంలో దైవప్రవక్త అనుచరులు చాలా కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. కొన్ని కొన్ని రోజుల వరకూ పస్తులు గడపాల్సి వచ్చేది. చివరికి దైవప్రవక్తకు కూడా తినడానికి ఏమీ దొరికేది కాదు. అలాంటి గడ్డు పరిస్థితుల్లోనే వారు ఇస్లాం ధర్మ ఔన్నత్యం కోసం కృషిచేశారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఆనాటి పరిస్థితుల్ని గుర్తుచేసి నేడు మీరు ప్రాపంచిక సిరిసంపదలు, భోగభాగ్యాల ప్రవాహంలో కొట్టుకుపోరాదని, ఇహలోక ఐశ్వర్యాల్లో మునిగిపోయి దైవాన్ని విస్మరించకూడదని హెచ్చరించారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|55. ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి…|హదీసు 473

474

హదీసు 474

وعن عائشةَ، رضي اللَّه عنها، قالت: تُوفِّيَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، وَمَا في بَيْتي مِنْ شَيْءٍ يَأْكُلُهُ ذُو كَبِدٍ إِلاَّ شَطْرُ شَعيرٍ في رَفٍّ لي، فَأَكَلْتُ مِنْهُ حَتَّى طَال علَيَّ، فَكِلْتُهُ فَفَنِيَ. متفقٌ عليه. "شَطْرُ شَعيرٍ"أَي شَيْء مِنْ شَعيرٍ. كَذا فسَّرهُ التِّرمذيُّ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త ﷺ చనిపోయినప్పుడు మా ఇంట్లో ప్రాణమున్న జీవి తినగలిగే వస్తువేదీ లేదు. నా గూడులో ఉండిపోయిన కొన్ని బార్లీ బియ్యం తప్ప. నేను చాలాకాలం వరకు ఆ కాస్త ధాన్యమే తింటుండేదాన్ని ఆ తరువాత ఒకరోజు నేను దాన్ని కొలిచిచూశాను. దాంతో అది (కూడా) నిండుకుంది.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలలోని ప్రేమైక వచనాల ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha) reported: Messenger of Allah ﷺ died when my house was void of any edible thing except for a small quantity of barley I had on a shelf and from which I kept eating it for a long time. Then when I measured what was left of it, it soon finished.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

దైవప్రవక్త ﷺ మరణించేకాలం నాటికి ముస్లింలు యుద్ధాల ద్వారా వచ్చిన ధనంతో మునుపటికన్నా కాస్త మెరుగైన జీవితాన్ని గడుపుతున్నారు. కాని స్వయంగా దైవప్రవక్త ﷺ మాత్రం జీవితాంతం నిరుపేదగా బ్రతకటాన్నే యిష్టపడ్డారు. ఆయన యుద్ధప్రాప్తి ద్వారా వచ్చిన ధనంలో కొంతైనా తన దగ్గర ఉంచుకునేవారు కాదు. మరోవిషయం ఏమిటంటే ఈ హదీసును ఆయనగారి ప్రియాతి ప్రియమైన సతీమణి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) వివరించారు. ఆవిడ ఇంటి పరిస్థితే ఇలా ఉందంటే ఆయన ఇహలోక సిరిసంపదల పట్ల ఎంత అనాసక్తతా భావంతో ఉండేవారో ఊహించవచ్చు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|55. ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి…|హదీసు 474

475

హదీసు 475

وعن عمرو بنِ الحارِث أَخي جُوَيْرِية بنْتِ الحَارثِ أُمِّ المُؤْمِنِينَ، رضي اللَّه عنهما، قَالَ: مَا تَرَكَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، عِنْدَ مَوْتِهِ دِينَاراً وَلا دِرْهَماً، وَلاَ عَبْداً، وَلا أَمَةً، وَلا شَيْئاً إِلاَّ بَغْلَتَهُ الْبَيْضَاءَ الَّتي كَان يَرْكَبُهَا، وَسِلاحَهُ، وَأَرْضاً جَعَلَهَا لابْنِ السَّبيِلِ صَدَقَةً"رواه البخاري.

విశ్వాసుల మాతృమూర్తి జువైరియా (రదియల్లాహు అన్హా) సోదరులు అమ్ర్ బిన్ హారిస్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ మరణించినప్పుడు తాను ప్రయాణం కోసం ఉపయోగించే తెల్లని కంచరగాడిదను, తన ఆయుధాలను, ఇంకా బాటసారులకు విరాళంగా ఇచ్చిన కొంత భూమిని మాత్రం వదలివెళ్ళారు. ఇవి తప్ప ఆయన ఒక్క దీనారుగాని దిర్హముగాని, బానిసగాని, బానిసరాలిని గాని వదలివెళ్ళలేదు. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని వీలునామాల ప్రకరణం)

English

`Amr bin Al-Harith (radiyallahu anhu) the brother of Juwairiyah (radiyallahu anha), the Mother of believers) reported: (When he died) Messenger of Allah ﷺ left neither a dinar nor a dirham nor a male slave nor a female slave, nor anything else except his white riding mule, his weapons and his land which he had given in charity to wayfarers.[Al-Bukhari].

ముఖ్యాంశాలు

హిజ్రీ శకం ఐదో ఏట బనూ ముస్తలిఖ్ యుద్ధం జరిగినప్పుడు చాలామంది అవిశ్వాస స్త్రీలు, పురుషులు ఖైదీలుగా పట్టుబడ్డారు. వారిలో జువైరియా (రదియల్లాహు అన్హా) కూడా ఉన్నారు. ఈమె దైవప్రవక్త ﷺ వాటాలోకి వచ్చారు. ఆయన ఈవిడకు స్వేచ్ఛనొసగి తన ధర్మపత్నిగా చేసుకున్నారు. ఈ విషయం ఆయన అనుచరులకు తెలియగానే వారు తమ మాతృమూర్తి గౌరవార్థం ఆమె తెగకు చెందిన ఖైదీలందరినీ విడుదల చేసేశారు. అలా విడుదలైన వారు సుమారు వందమంది వరకూ ఉన్నారు. ఈ విధంగా హజ్రత్ జువైరియా (రదియల్లాహు అన్హా) తన తెగ ఖైదీలందరికీ స్వేచ్ఛకల్పించిన సౌభాగ్యవతిగా పేరుమోశారు.

దైవప్రవక్తకు తన జీవితకాలంలో ఫిదక్ మరియు ఖైబర్ ప్రాంతాల మధ్య కొంతభూమి లభించింది. అయితే ఆయన దాన్ని కూడా ప్రజలకు దానంగా ఇచ్చివేశారు. ఒకానొక సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ, "మా ప్రవక్తల వర్గంలో ఎవరైనా చనిపోతే వారి ధనం వారసులకు చెందదు. మేము వదలిపెట్టిపోయేదంతా విరాళంగానే పరిగణించబడుతుంది" అని అన్నారు. తాను చనిపోయే ముందు ఆయన తన దాసదాసీలందరికీ స్వేచ్ఛను ప్రసాదించారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|55. ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి…|హదీసు 475

476

హదీసు 476

وعن خَبَّابِ بنِ الأَرَتِّ، رضي اللَّه عنه، قَالَ هَاجَرْنَا مَعَ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم نَلْتَمِسُ وَجهَ اللَّه تَعَالَى فَوَقَعَ أَجْرُنا عَلى اللَّه، فَمِنَّا مَنْ مَاتَ وَلَمْ يأْكُلْ مِنْ أَجرِهِ شَيْئاً. مِنْهُم مُصْعَبُ بن عَمَيْر، رضي اللَّه عنه، قُتِلَ يَوْمَ أُحُدٍ، وَتَرَكَ نَمِرَةً، فَكُنَّا إِذَا غَطَّيْنا بهَا رَأْسَهُ، بَدَتْ رجْلاهُ، وَإِذَا غَطَّيْنَا بِهَا رِجْلَيْهِ، بَدَا رَأْسُهُ، فَأَمَرَنا رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، أَنْ نُغَطِّيَ رَأْسَهُ، وَنَجْعَلَ عَلى رجْليهِ شَيْئاً مِنَ الإِذْخِرِ، ومِنَّا مَنْ أَيْنَعَتْ لَهُ ثَمَرَتُهُ. فَهُوَ يَهدبُهَا، متفقٌ عَلَيْهِ. "النَّمِرَةُ":كسَاء مُلَوَّنٌ منْ صُوفٍ. وَقَوْلُه:"أينَعَت"أَيْ: نَضَجَتْ وَأَدْرَكَتْ. وقوله:"يَهْدِبُهَا"هو بفتح الباءِ وضم الدال وكسرها. لُغَتَان. أَيْ: يَقْطِفُهَا وَيجْتَنِيهَا وَهَذِهِ اسْتِعَارَةٌ لمَا فَتَحَ اللَّه تَعَالى عَلَيْهِمْ مِنَ الدُّنْيَا وَتَمَكنُوا فيهَا.

హజ్రత్ ఖబ్బాబ్ బిన్ అరత్ (రదియల్లాహు అన్హు) కథనం : మేము దైవప్రసన్నత కోసం దైవప్రవక్త ﷺ వెంట (మక్కా నుండి మదీనాకు) వలసవెళ్ళాం. కాబట్టి మాకు దాని ప్రతిఫలం ప్రసాదించటం దేవుని బాధ్యత అయిపోయింది. మాలో కొందరు ఇహలోకంలో తమ ప్రతిఫలంలో ఏమీ అనుభవించ కుండానే చనిపోయారు. వారిలో ముస్అబ్ బిన్ ఉమైర్ (రదియల్లాహు అన్హు) ఒకరు. ఆయన ఉహుద్ యుద్ధంలో అమరగతి నొందినప్పుడు ఒక గొంగళి మాత్రం వదలివెళ్ళారు. దాంతో (ఆయన శవాన్ని) తలవైపు నుంచి కప్పితే కాళ్లు బయట ఉండేవి. కాళ్లవైపు నుంచి కప్పితే తల బయట ఉండేది. అందుచేత దైవప్రవక్త "ఆ దుప్పటిని తలవైపు నుంచి కప్పి కాళ్ళను ఇజ్ఖిర్ గడ్డితో కప్పమ"ని మాకు ఆజ్ఞాపించారు.

మాలో ఇంకొందరి పుణ్యఫలాలు పండినాయి. వారు ఇప్పుడు వాటిని ఏరుకుంటున్నారు. (అంటే ప్రయోజనం పొందుతున్నారని అర్థం.)

(బుఖారీ – ముస్లిం)

దేవుడు వారికోసం ప్రాపంచిక సిరిసంపదల ద్వారాలను తెరిచాడని, వాటిపై వారికి ఆధిక్యతను ప్రసాదించాడన్న విషయాన్ని ఇక్కడ ఈ విధంగా పోల్చి చెప్పటం జరిగింది.

(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలలోని జనాయెజ్ ప్రకరణాలు)

English

Al-Khabbab bin Al-Aratt (radiyallahu anhu) reported: We emigrated with Messenger of Allah ﷺ seeking the pleasure of Allah and expecting our reward from Him. Some of us died without enjoying anything of it. Among them was Mus`ab bin `Umair (radiyallahu anhu), who was killed in the battle of Uhud, leaving only a small coloured sheet of wool (which we used as his shroud). When we covered his head with it, his feet were exposed, and when we covered his feet with it, his head was uncovered. So the Prophet ﷺ told us to cover his head and to put some Idhkhir (i.e., fragrant grass) over his feet. Others among us enjoy prosperity.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసు ద్వారా దైవమార్గంలో చేయబడే పోరాటం, ప్రస్థానాల గొప్పదనం వెల్లడౌతోంది. ఇస్లామీయ యోధులకు ఇహలోకంలో యుద్ధప్రాప్తి రూపంలో వాటి ప్రతిఫలం లభిస్తుంది. అలాగే పరలోకంలోనూ వాటి పుణ్యం లభిస్తుంది. అయితే యుద్ధరంగంలోనే అమరగతినొందే వీరులు ఇహలోకంలో విజయప్రాప్తికి నోచుకోలేకపోయినప్పటికీ పరలోకంలో వారికోసం ఆ పుణ్యం నిక్షిప్తం చేయబడి ఉంటుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|55. ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి…|హదీసు 476

477

హదీసు 477

وعن سَهْلِ بنِ سَعْد السَّاعديِّ، رضي اللَّه عنه، قَالَ: قَالَ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"لَوْ كَانَت الدُّنْيَا تَعْدِلُ عِنْدَ اللَّه جَنَاحَ بَعُوضَةٍ، مَا سَقَى كَافراً منْها شَرْبَةَ مَاءٍ" رواه الترمذي. وَقالَ حديث حسن صحيح.

హజ్రత్ సహ్ల్ బిన్ సాద్ సాయిదీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : దేవుని దృష్టిలో ఈ లోకానికి దోమ రెక్కపాటి విలువ అయినా ఉండి ఉంటే ఆయన అవిశ్వాసులకు ఈ లోకంలో గ్రుక్కెడు మంచినీళ్ళు కూడా త్రాగించేవాడు కాడు.

(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హసన్ మరియు సహీహ్ కోవకు చెందిన హదీసుగా పేర్కొన్నారు.)

(సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత అధ్యాయం)

English

Sahl bin Sa`d (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Were this world worth a wing of mosquito, He would not have given a drink of water to an infidel.”

[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

దీనిద్వారా ఇహలోక సిరిసంపదలకు, ఇక్కడి భోగభాగ్యాలకు దేవుని దృష్టిలో ఎలాంటి ప్రాముఖ్యం లేదని తెలుస్తోంది. కనుక విశ్వాసులు కూడా వీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకూడదు. పరలోక జీవితాన్ని మెరుగుపరచుకోవటానికి వీటిని సాధన సామగ్రిగా మాత్రమే ఉపయోగించుకోవాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|55. ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి…|హదీసు 477

478

హదీసు 478

وعن أَبي هُرَيْرَة رضي اللَّه عنه، قالَ: سمعتُ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقول: "أَلاَ إِنَّ الدُّنْيَا مَلْعُونَةٌ، مَلعون مَا فِيهَا، إِلاَّ ذِكْرَ اللَّه تَعَالَى، ومَا وَالاَه وَعالماً وَمُتَعلِّماً ". رواه الترمذي وقال: حديثٌ حسنٌ.

దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) తెలియజేశారు : ప్రజలారా జాగ్రత్త! ఈ లోకం ముదనష్టపుది. ఇందులో వున్నవన్నీ ముదనష్టపు వస్తువులే. దైవధ్యానం, దానితో సంబంధమున్న ఇతర విషయాలు, ధర్మజ్ఞానం కలవారు. ఇంకా దానిని అభ్యసించేవారు తప్ప. (తిర్మిజీ దీనిని ఉల్లేఖించి 'హసన్' కోవకు చెందిన హదీసుగా పేర్కొన్నారు.)

(సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత అధ్యాయం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Verily! The world is accursed and what it contains is accursed, except remembrance of Allah and those who associate themselves with Allah; and a learned man, and a learning person.”[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

ఈ హదీసుని చూసి నిజంగానే లోకంలోని వస్తువులన్నీ ముదనష్టపు వస్తువులని అర్థం చేసుకోకూడదు. మనిషిని దైవధ్యానం నుండి దూరంచేసే వస్తువులే వాస్తవానికి ముదనష్టపు వస్తువులు. ఆ విధంగా లోకంలో ఒక వస్తువు ముదనష్టపుదయినా కావచ్చు లేదా ప్రశంసించదగినదయినా కావచ్చు. అది ఆ వస్తువు ఉపయోగంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ధనాన్ని ధర్మసమ్మతమయిన మార్గాల ద్వారా సంపాదించి ఖర్చుపెడితే అది అభినందించదగిన విషయమే. కాని అదే ధనాన్ని దొడ్డిదోవలగుండా ఆర్జిస్తే ఆ ధనమే ధూర్త వస్తువు అయిపోతుంది. అలాగే దైవసామీప్యానికి దోహదపడి, దాసులకు మార్గదర్శకత్వం వహించే జ్ఞానం ప్రశంసించదగినది, ఆర్జించదగినదీను. అన్యధా అది తూలనాడదగినదే. మనిషి విద్యా విషయికంగా ఎన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించినా, ఎన్ని డిగ్రీలు సంపాదించినా సృష్టికర్తను గ్రహించలేని డిగ్రీలన్నీ వ్యర్థమే! ఈ హదీసు ద్వారా ధర్మజ్ఞానుల, విద్యార్థుల ప్రశస్తి వెల్లడవుతోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|55. ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి…|హదీసు 478

479

హదీసు 479

وعن عَبْدِ اللَّه بنِ مسعودٍ، رضي اللَّه عنه، قَالَ: قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لا تَتَّخِذُوا الضَّيْعَةَ فَتَرْغَبُوا في الدُّنْيا". رواه الترمذي وقال: حديثٌ حسنٌ.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : సంపదను కూడబెట్టుకోకండి. దానివల్ల మీలో ఇహలోక జీవితం పట్ల ఆసక్తి పెరిగే ప్రమాదముంది.

(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హసన్‌గా పేర్కొన్నారు)

(సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత అధ్యాయం)

English

`Abdullah bin Mas`ud (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said: “Do not crave for property lest you should be absorbed in the desire of worldly life.”[At-Tirmidhi]

ముఖ్యాంశాలు

ఇక్కడ 'సంపద' అంటే సేద్యపుభూములు, ధనం మొదలగు ఉత్పత్తి సాధనాలని అర్థం. మనిషి దైవప్రసన్నతను విస్మరించి రేయింబవళ్ళు ధనసంపదలు కూడబెట్టుకోవటమే తన జీవిత లక్ష్యంగా చేసుకోకూడదని ఈ హదీసు భావం. అయితే మనిషి తన దగ్గర అవసరానికి సరిపడ సేద్యపు భూములను, యంత్రాలను, ధనాన్ని ఉంచుకోవటం మాత్రం ఆక్షేపణీయం కాదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|55. ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి…|హదీసు 479

480

హదీసు 480

وعن عبدِ اللَّه بنِ عمرو بنِ العاصِ رضي اللَّه عنهما، قال: مَرَّ عَلَيْنَا رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وَنحنُ نُعالجُ خُصًّا لَنَا فَقَالَ: "مَا هَذَا؟ "فَقُلْنَا: قَدْ وَهِي، فَنَحْنُ نُصْلِحُه، فَقَالَ:"مَا أَرَى الأَمْرَ إِلاَّ أَعْجَلَ مِنْ ذلكَ". رواه أَبو داود، والترمذيُّ بإِسناد البخاريِّ ومسلم، وقال الترمذيُّ: حديثٌ حسنٌ صحيحٌ.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) కథనం : ఒకసారి మేము మా ఇంటికప్పు మరమ్మత్తు చేసుకుంటుండగా దైవప్రవక్త ﷺ అటుగా వెళుతున్నారు. ఆయన మమ్మల్ని చూసి "ఏమిటి మీరు చేస్తున్నది?" అని అడిగారు. మేము "ఈ గుడిసె కూలిపోయేలా ఉంది. అందుకని మేము దీనికి మరమ్మత్తు చేస్తున్నామ"ని చెప్పాం. అప్పుడు ఆయన, "నేను దానికన్నా ముందే వ్యవహారం (మరణం) సంభవిస్తుందే మోననుకుంటున్నాను" అని అన్నారు.

అబూదావూద్, తిర్మిజీలు దీనిని బుఖారీ,ముస్లింల ఆధారంతో ఉల్లేఖించారు. తిర్మిజీ దీనిని 'హసన్, సహీహ్'గా పేర్కొన్నారు.

(సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత అధ్యాయం, అబూదావూద్‌లోని సంస్కార ప్రకరణం)

English

`Abdullah bin `Amr bin Al-`as (radiyallahu anhuma) reported: We were repairing our thatchy hut when Messenger of Allah ﷺ passed by and asked us, “What are you doing?” We said, “The thatch had gone weak and we are repairing it.” He ﷺ said, “I see the sure thing (death) approaching sooner than this.”[Abu Dawud].

ముఖ్యాంశాలు

ఇండ్లకు మరమ్మత్తులు చేసుకోరాదన్నది దైవప్రవక్త ఉద్దేశ్యం ఎంతమాత్రం కాదు. మనిషి నిత్యం మరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఉండాలని, ఏ క్షణంలోనూ చావుపట్ల ఏమరుపాటుకు లోనుకాకూడదని ఈ హదీసు భావం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|55. ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి…|హదీసు 480

481

హదీసు 481

وعن كَعْبِ بنِ عِيَاضٍ، رضي اللَّه عنه، قَالَ: سمعتُ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقُولُ: "إِنَّ لِكُلِّ أُمَّةٍ فتنةً، فِتنَةُ أُمَّتي المَالُ" رواه الترمذي وقال: حديثٌ حسنٌ صحيحٌ.

దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ కాబ్ బిన్ ఇయాజ్ (రదియల్లాహు అన్హు) తెలిపారు : ప్రతి సమాజంలోనూ ఓ ఉపద్రవం తలెత్తుతుంది. నా అనుచర సమాజానికి పొంచివున్న ఉపద్రవం ధనవ్యామోహం.

(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హసన్, సహీహ్‌గా పేర్కొన్నారు.)

(సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత అధ్యాయం)

English

Ka`b bin `Iyad (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Verily, there is a Fitnah (trial) for every nation and the trial for my nation (or Ummah) is wealth.”[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో 'ఫిత్నా' అనే పదం ఉపయోగించబడింది. అరబ్బీ భాషలో ఈ పదానికి ఉపద్రవం, పరీక్షావస్తువు అనే అర్థాలున్నాయి. దివ్య ఖుర్‌ఆన్‌లో సిరిసంపదలు, సంతానం మానవుల పాలిట పరీక్షా వస్తువులని చెప్పబడింది. మరి చూడబోతే ఈ రెండూ దేవుడు ప్రసాదించే వరాలే. కాకపోతే ఈ వరాల ద్వారా ఇహలోకంలో మానవులను పరీక్షించటం జరుగుతుంది. అంచేతనే వాటిని 'ఫిత్నా'గా అభివర్ణించటం జరిగింది. ఈ హదీసు ముహమ్మదీయ అనుచర సమాజాన్ని ధన సంపదల విషయంలో మధ్యేమార్గాన్ని అనుసరించాలని లేకపోతే దేవుడు ప్రసాదించిన వరాలే తమ పాలిట తలవంపుగా మారే అవకాశముందని హెచ్చరిస్తోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|55. ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి…|హదీసు 481

482

హదీసు 482

وعن أَبي عمرو، ويقالُ: أَبو عبدِ اللَّه، ويقالُ: أَبو لَيْلى عُثْمَانُ بنُ عَفَّانَ رضي اللَّه عنه، أَنَّ النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "لَيْسَ لابْن آدَمَ حَقٌّ في سِوى هَذِهِ الخِصَال: بَيْتٌ يَسْكُنُهُ، وَثَوْبٌ يُوَارِي عَوْرَتَهُ وَجِلْفُ الخُبز، وَالمَاءِ " رواه الترمذي وقال: حديث صحيح. قَالَ الترمذي: سمعتُ أَبَا داوُدَ سلَيمَانَ بنَ سَالمٍ البَلْخِيَّ يقولُ: سَمِعْتُ النَّضْر بْنَ شُمَيْلٍ يقولُ: الجلفُ: الخُبزُ لَيْس مَعَهُ إِدَامٌ. وقَالَ: غيرُهُ: هُوَ غَلِيظُ الخُبْزِ. وقَالَ الرَّاوِي: المُرَادُ بِهِ هُنَا وِعَاءُ الخُبزِ، كالجَوَالِقِ وَالخُرْجِ، واللَّه أعلم.

హజ్రత్ అబూ అమ్ర్ – ఈయన్ని అబూ అబ్దుల్లాహ్, అబూ లైలా ఉస్మాన్ బిన్ అప్ఫాన్ అని కూడా అంటారు – కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : మనిషికి ఈ (క్రింది) వస్తువుల్లో తప్ప ఇతర వస్తువుల్లో ఎలాంటి హక్కులేదు.

1. అతను నివసించే ఇల్లు. 2. తొడుక్కునే బట్టలు. 3. కూరలేని రొట్టె. 4. నీళ్లు.

(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు.)

ఇమామ్ తిర్మిజీ ఇలా అంటున్నారు : జిల్‌ఫ్ అంటే కూరలేని రొట్టె. మరికొంత మంది జిల్‌ఫ్ అంటే మందంగా ఉండే రొట్టె అని అన్నారు. ఇమామ్ హర్వీ (రహిమహుల్లాహ్) ఇక్కడ జిల్ఫ్ అంటే రొట్టెలు ఉంచే వస్తువనీ, ఉదాహరణకు గోనె సంచి, గంప లాంటిదని అభిప్రాయపడ్డారు. వాస్తవం దేవునికే బాగా తెలుసు.

(సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత ప్రకరణం)

English

`Uthman bin `Affan (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “There is no right for the son of adam except in these (four) things: A house to live in, a cloth to cover therewith his private parts, bread and water.”[At-Tirmidhi].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|55. ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి…|హదీసు 482

483

హదీసు 483

وعنْ عبْدِ اللَّه بنِ الشِّخِّيرِ"بكسر الشين والخاءِ المشددةِ المعجمتين"رضي اللَّه عنه، أَنَّهُ قَالَ: أَتَيْتُ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وهُوَ يَقْرَأُ: {أَلهَاكُمُ التَّكَاثُرُ} قَالَ: "يَقُولُ ابنُ آدَم: مَالي، مَالي، وَهَل لَكَ يَا ابْنَ آدمَ مِنْ مالِكَ إِلاَّ مَا أَكَلت فَأَفْنيْتَ، أَو لبِستَ فَأَبْلَيْتَ، أَوْ تَصَدَّقْتَ فَأَمْضيْتَ؟ " رواه مسلم.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ షిఖ్ఖీర్ (రదియల్లాహు అన్హు) కథనం : నేనొకసారి దైవప్రవక్త ﷺ దగ్గరికి వెళ్ళాను. ఆ సమయంలో ఆయన "వీలైనంత ఎక్కువగా ప్రాపంచిక సిరిసంపదలు పొందాలన్న ధ్యాన మిమ్మల్ని ఏమరుపాటులో పడవేసింది" అనే దైవసూక్తిని పఠిస్తున్నారు. తరువాత ఆయన ﷺ ఇలా అన్నారు : మనిషి నా ధనం, నా సంపద అని అంటాడు. ఓ మనిషీ! వాస్తవానికి నువ్వు (ఈ లోకంలో) తిని అవజేసింది, తొడుక్కొని వాడుకున్నది, ఇంకా దానధర్మాలు చేసి (పరలోక జీవితం కోసం) పంపుకున్నదే నీ ధనం! (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని ఐహిక అనాసక్తత, ప్రేమైక వచనాల ప్రకరణం)

English

`Abdullah bin Ash-Shikhkhir (radiyallahu anhu) reported: I came to the Prophet ﷺ while he was reciting (Surat At-Takathur 102):

“The mutual rivalry (for hoarding worldly things) preoccupy you. Until you visit the graves (i.e., till you die). Nay! You shall come to know! Again nay! You shall come to know! Nay! If you knew with a sure knowledge (the end result of hoarding, you would not have been occupied in worldly things). Verily, you shall see the blazing Fire (Hell)! And again, you shall see it with certainty of sight! Then (on that Day) you shall be asked about the delights (you indulged in, in this world)!” (102:1-8)

(After reciting) he ﷺ said, “Son of adam says: `My wealth, my wealth.’ Do you own of your wealth other than what you eat and consume, and what you wear and wear out, or what you give in Sadaqah (charity) (to those who deserve it), and that what you will have in stock for yourself.”[Muslim].

ముఖ్యాంశాలు

దేవుడు మనిషికి ఇహలోకంలో సమృద్ధిగా సిరిసంపదలు ప్రసాదించి ఉంటే అతను వాటిని వీలైనంత ఎక్కువగా దానధర్మాలు చేసి ఖర్చుపెట్టాలి. ఈ దానధర్మాల పుణ్యం అతనికి పరలోకంలో ఉపయోగపడుతుంది. ఇకపోతే అతను తన అన్నవస్త్రాల కోసం ఇతర అవసరాల కోసం ఖర్చుపెట్టుకొనే ధనం ఇహలోకంలోనే అంతమయిపోతుంది. పరలోకంలో దానికి ఎలాంటి ప్రతిఫలం మిగిలి ఉండదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|55. ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి…|హదీసు 483

484

హదీసు 484

وعن عبدِ اللَّه بن مُغَفَّلٍ، رضي اللَّه عنه، قَالَ: قَالَ رجُلٌ للنَّبِيِّ صلى الله عليه وسلم: يارسولَ اللَّه، واللَّه إِنِّي لأُحِبُّكَ، فَقَالَ: "انْظُرْ مَاذَا تَقُولُ؟ "قَالَ: وَاللَّه إِنِّي لأُحِبُّكَ، ثَلاثَ مَرَّاتٍ، فَقَالَ:"إِنْ كُنْتَ تُحبُّني فَأَعِدَّ لَلفقْر تِجْفافاً، فإِنَّ الفَقْر أَسْرَعُ إِلَى مَنْ يُحِبُّني مِنَ السَّيْل إِلَى مُنْتَهَاهُ "رواه الترمذي وقال حديث حسن. "التِّجْفَافُ"بكسرِ التاءِ المثناةِ فوقُ وَإسكانِ الجيمِ وبالفاءِ المكررة، وَهُوَ شَيْءُ يَلْبِسُهُ الفَرسُ، لِيُتَّقَى بِهِ الأَذَى، وَقَدْ يَلْبَسُهُ الإِنْسَانُ.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ముగప్ఫల్ (రదియల్లాహు అన్హు) కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్తతో మాట్లాడుతూ, "దైవప్రవక్తా! దైవసాక్షిగా చెబుతున్నాను. నేను మిమ్మల్ని అభిమానిస్తున్నాను" అని అన్నాడు. దానికాయన "నువ్వేం మాట్లాడుతున్నావో బాగా ఆలోచించుకొని మాట్లాడు" అని అన్నారు. ఆ వ్యక్తి మళ్ళీ, "నిజం, దైవసాక్షిగా చెబుతున్నాను. నేను మిమ్మల్ని అభిమానిస్తున్నాను" అని అన్నాడు. మూడుసార్లు ఇదేమాట అన్నాడావ్యక్తి. అప్పుడు దైవప్రవక్త ﷺ, "మరయితే పేదరికం కోసం చాపను సిద్ధంగా ఉంచుకో, ఎందుకంటే నన్ను అభిమానించేవాడి వైపునకు పేదరికం వరదలా ముంచుకు వస్తుంది" అని అన్నారు.

(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హసన్‌గా పేర్కొన్నారు.)

(సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత అధ్యాయం)

English

`Abdullah bin Mughaffal (radiyallahu anhu) reported: A man came to the Prophet ﷺ and said, “O Messenger of Allah! By Allah, I love you.” He ﷺ said, “Think about what you are saying.” The man repeated thrice, “I swear by Allah that I love you.” He (Prophet ﷺ) said, “If you love me, you should be ready for acute poverty; because poverty comes to those who love me, faster than a flood flowing towards its destination.”[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

ఈ హదీసు ఆధారాల రీత్యా బలహీనమైనదేగాకుండా దీని మూలం కూడా ప్రామాణిక హదీసులకు విరుద్ధంగా ఉందని పండితులు తేల్చిచెప్పారు. ఎందుకంటే ప్రామాణికమైన హదీసుల్లో పేదరికం ప్రియమైనదని, ధనం అసహ్యకరమైన వస్తువని ఎక్కడా లేదు. పైగా సజ్జనులు ధనం సంపాదించటం అభిలషణీయమని చెప్పబడింది. సజ్జనులు ధర్మసమ్మతమైన మార్గాల ద్వారా ధనాన్ని ఆర్జిస్తారు. ఖర్చుపెట్టేటప్పుడు కూడా దైవప్రసన్నతను దృష్టిలో పెట్టుకునే ఖర్చు చేస్తారు. ఆ విధంగా వారు ధనం మూలంగా ఇతరులకన్నా ఎక్కువ పుణ్యాలను సంపాదిస్తారు. అలాంటప్పుడు ధనం అయిష్టకరమైనది ఎలా అవుతుంది?!

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|55. ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి…|హదీసు 484

485

హదీసు 485

وعن كَعبِ بنِ مالكٍ، رضي اللَّه عنه، قَالَ: قَالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَاذِئْبَان جَائعَانِ أُرْسِلا في غَنَم بأَفْسَدَ لَهَا مِنْ حِرْصِ المَرْءِ عَلَى المالِ وَالشرفِ لِدِينهِ" رواه الترمذي وقال: حديث حسن صحيح.

హజ్రత్ కాబ్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : ఆకలితో ఉన్న రెండు తోడేళ్ళను మేకల మందలోకి వదలితే అవి మేకలకు కలిగించే నష్టం మనిషిలోని ఆస్తీ అంతస్తుల వ్యామోహం ధర్మానికి కలిగించే నష్టంకన్నా ఎక్కువేమీ కాదు. (తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హసన్, సహీహ్‌గా పేర్కొన్నారు.)

(సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత అధ్యాయం)

English

K`ab bin Malik (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Two hungry wolves sent in the midst of a flock of sheep are no more destructive to them than a man’s greed for wealth and fame is to his Deen.”

[At-Tirmidhi]

ముఖ్యాంశాలు

ఆస్తీఅంతస్తుల వ్యామోహం ఎంతటి వినాశాన్ని సృష్టిస్తుందో నేడు మనం మన పరిసరాల్లోనే చూడవచ్చు. ఆఖరికి ధార్మిక పండితులు, తమల్ని తాము ధర్మపరాయణులుగా చెప్పుకునే వారు సైతం నేడు మన సమాజంలో ఈ రుగ్మతకు గురై ఉన్నారు. అనేక ధార్మిక సంస్థల్లో ధన,పదవీ వ్యామోహాల ప్రాతిపదికమీదే విభేదాలు తలెత్తుతున్నాయి. ఎంతోమంది ధార్మిక పండితులు కూడా ఈ రొంపిలో దిగబడి ఉండటం ఎంతో శోచనీయమైన విషయం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|55. ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి…|హదీసు 485

486

హదీసు 486

وعن عبدِ اللَّه بنِ مَسْعُودٍ رضي اللَّه عنه، قَالَ: نَامَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم عَلَى حَصيرٍ فَقَامَ وَقَدْ أَثَّرَ في جَنْبِهِ، قُلْنَا: يَا رَسُولَ الَّله لوِ اتَّخَذْنَا لكَ وِطَاءً، فقال: "مَالي وَلَلدُّنْيَا؟ مَا أَنَا في الدُّنْيَا إِلاَّ كَرَاكبٍ اسْتَظَلَّ تَحْتَ شَجَرَةٍ ثُمَّ رَاحَ وَتَرَكَهَا ". رواه الترمذي وَقالَ: حديث حسن صحيح

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్వూద్ (రదియల్లాహు అన్హు) కథనం : ఒకసారి దైవప్రవక్త ﷺ ఓ చాపపై పడుకొని లేచారు. దాంతో ఆయన ఒంటిపై చాప తాలూకు చారలు ఏర్పడ్డాయి. అది చూసి మేము "దైవప్రవక్తా! మీరు గనక అనుమతిస్తే మేము మీ కోసం మెత్తటి పరుపు ఒకటి తయారుచేసి ఇస్తాం" అని విన్నవించుకున్నాము. దానికి ఆయన "అలాంటివి ఎందుకు నాకు? ఓ చెట్టుక్రింద కాసేపు సేదతీర్చుకొని తిరిగి చెట్టుని వదలివెళ్ళిపోయే బాటసారి లాంటిది నా ఇహలోక జీవితం" అని అన్నారు. (తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హసన్ మరియు సహీహ్‌గా పేర్కొన్నారు.)

(సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత అధ్యాయం)

English

`Abdullah bin Mas`ud (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ slept on a straw mat and got up with the marks left by it on his body. Ibn Mas`ud (radiyallahu anhu) said, “O Messenger of Allah! Would that you make us spread out a soft bedding for you.” He ﷺ replied, “What have I to do with the world? I am like a rider who had sat under a tree for its shade, then went away and left it.”[At-Tirmidhi].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|55. ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి…|హదీసు 486

487

హదీసు 487

وعن أَبي هريرةَ رضي اللَّه عنه، قَالَ: قالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "يَدْخُلُ الفُقَراءُ الجَنَّةَ قَبْلَ الأَغْنِيَاءِ بِخَمْسِمائَةِ عَامٍ" رواه الترمذي وقال: حديث صحيح.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు : నిరుపేదలు ధన వంతులకన్నా ఐదొందల సంవత్సరాల ముందే స్వర్గంలోకి ప్రవేశిస్తారు.

(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు.)

(సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత అధ్యాయం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “The poor will enter Jannah five hundred years before the rich.”[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

ఇక్కడ నిరుపేదలంటే లోకంలో విశ్వసించి, సత్కార్యాలు చేసిన సదాచార సంపన్నులయిన పేదవారని అర్థం. వీళ్ళు ధనవంతుల కన్నా ముందుగా స్వర్గానికి పోతారు. దేవుడు ధనవంతుల నుండి వారి సంపాదన ఖర్చుల గురించి లెక్క తీసుకుంటాడు. నిరుపేదలకు అలాంటి ఆటంకాలేవీ ఉండవు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|55. ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి…|హదీసు 487

488

హదీసు 488

وعن ابن عَبَّاسِ، وعِمْرَانَ بن الحُصَيْن، رضي اللَّه عنهم، عن النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "آطَّلعْتُ في الجَنَّةِ فَرَأَيْت أَكْثَرَ أَهلِهَا الفُقَراءَ. وَاطَّلَعْتُ في النَّارِ فَرَأَيْتُ أَكْثَرَ أَهْلِهَا النِّساءَ" متفقٌ عَلَيْهِ. من رواية ابن عباس. ورواه البخاري أيْضاً من روايةِ عِمْرَان بنِ الحُصَينِ..

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా), ఇమ్రాన్ బిన్ హుసైన్ (రదియల్లాహు అన్హు)ల కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు : నేను స్వర్గంలోకి తొంగిచూశాను. స్వర్గవాసుల్లో అధికంగా నాకు నిరుపేదలే కనిపించారు. ఆ తరువాత నేను నరకంలోకి తొంగిచూశాను. నరకవాసుల్లో ఎక్కువగా నాకు స్త్రీలే కనిపించారు. (బుఖారీ – ముస్లింలు ఇరువురూ ఈ హదీసును ఇబ్నె అబ్బాస్ నుండి సేకరించారు. అంతేకాక బుఖారీ దీనిని ఇమ్రాన్ బిన్ హుసైన్ నుండి కూడా ఉల్లేఖించారు.)

(సహీహ్ బుఖారీలోని సృష్టి ఆరంభ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని ప్రేమైక వచనాల ప్రకరణం)

English

Ibn `Abbas and `Imran bin Al-Husain (radiyallahu anhuma) reported: The Prophet ﷺ said, “I looked into Jannah and saw that most of its dwellers are the poor; and I looked into Hell and saw that most of its inmates were women.”[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|55. ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి…|హదీసు 488

489

హదీసు 489

وعن أُسامةَ بنِ زيدٍ رضيَ اللَّه عنهما، عن النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "قُمْتُ عَلى بَاب الجَنَّةِ، فَكَانَ عَامَّةُ مَنْ دَخَلَهَا المَساكينُ. وأَصَحَابُ الجِدِّ محبُوسُونَ، غَيْرَ أَنَّ أَصحَابَ النَّار قَد أُمِرَ بِهمْ إِلَى النَّارِ" متفقٌ عَلَيْهِ. وَ"الجَدُّ"الحَظُّ وَالغِنَى. وقد سبق بيان هَذَا الحديث في باب فضلِ الضَّعَفَةِ.

హజ్రత్ ఉసామా బిన్ జైద్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు : నేను స్వర్గ ద్వారంలో నించొని చూశాను. స్వర్గంలో ప్రవేశించే వారిలో నాకు చాలామంది అభాగ్యులే కనిపించారు. ధనవంతులు (స్వర్గంలో ప్రవేశించలేక) ఆగిపోతున్నారు. (అంతలో) నరకవాసుల్ని నరకానికి తీసుకెళ్ళమని ఆదేశమయింది.

(బుఖారీ – ముస్లిం)

ఈ హదీసు ఇంతకుముందు 'బలహీన ముస్లింల విశిష్టత' అధ్యాయంలో కూడా వచ్చింది.

English

Usamah bin Zaid (radiyallahu anhuma) reported: The Prophet ﷺ said, “I stood at the gate of Jannah and saw that most of those who enter it were poor, whereas the rich were held back; but those who were destined to go to Hell were ordered to be sent there (immediately).”[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|55. ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి…|హదీసు 489

490

హదీసు 490

وعن أَبي هريرة، رضي اللَّه عنه، عن النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "أَصْدَقُ كَلِمَةٍ قَالَهَا شَاعِرٌ كَلِمَةُ لَبِيدٍ: أَلا كُلُّ شيْءٍ مَا خَلا اللهَ بَاطِلُ متفقٌ عليه.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు : కవుల కవితలలో "దేవుడు తప్ప ప్రతిదీ నశించిపోయేదే" అంటూ లబీద్ చెప్పిన కవిత అత్యంత సత్యవంతమైనది. (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని మహిమోన్నతుల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని కవితా ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “The most truthful statement a poet has ever made is the saying of Labid: Everything besides Allah is vain.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసు ద్వారా మంచి కవితలు చెప్పటం, వినటం సందర్భానుసారం వాటిని ఉపయోగించటం కూడా ధర్మసమ్మతమేనని తెలుస్తోంది. ఇకపోతే గ్రంథకర్త ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) ఈ హదీసును ఈ అధ్యాయం క్రింద ప్రస్తావించటంలోని మర్మం ఏమిటంటే, ప్రజలు ఇహలోకం అశాశ్వతమైనదనీ, పరాత్పరుడైన దేవుడు తప్ప ప్రపంచంలోని ప్రతి వస్తువూ ఏదో ఒకనాడు నశించిపోయేదేనన్న కఠోర సత్యాన్ని గ్రహించాలి. తద్వారా పరలోక జీవితాన్ని మెరుగుపరచుకోవటం కోసం కృషిచెయ్యాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|55. ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి…|హదీసు 490