హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 57. ఆత్మతృప్తితో బ్రతకటం, ఖర్చులో మధ్యేమార్గం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 57వ అధ్యాయం: ఆత్మ తృప్తితో బ్రతకటం, ఇతరుల ముందు చెయ్యి చాపకుండా ఉండటం, ఖర్చుచేయుటంలో మధ్యేమార్గాన్ని అవలంబించటం గురించి. ఈ అధ్యాయంలో 4 ఖుర్ఆన్ ఆయతులు, 16 హదీసులు (హదీసు 522 – 537) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

57. ఆత్మ తృప్తితో బ్రతకటం, ఇతరుల ముందు చెయ్యి చాపకుండా ఉండటం, ఖర్చుచేయుటంలో మధ్యేమార్గాన్ని అవలంబించటం గురించి……

↑ విషయ సూచిక

باب القناعة والعَفاف والاقتصاد في المعيشة والإنفاق وذم السؤال من غير ضرورة

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

{وَمَا مِنْ دَابَّةٍ فِي الأَرْضِ إِلاَّ عَلَى اللَّهِ رِزْقُهَا} [هود:٦]

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు : "ధరణిపై సంచరించే ప్రతి ప్రాణి ఉపాధి బాధ్యత అల్లాహ్‌పైనే ఉంది." (హూద్ : 6)

{لِلْفُقَرَاءِ الَّذِينَ أُحْصِرُوا فِي سَبِيلِ اللَّهِ لاَ يَسْتَطِيعُونَ ضَرْباً فِي الأَرْضِ يَحْسَبُهُمُ الْجَاهِلُ أَغْنِيَاءَ مِنَ التَّعَفُّفِ تَعْرِفُهُمْ بِسِيمَاهُمْ لاَ يَسْأَلونَ النَّاسَ إِلْحَافاً} [البقرة:٢٧٣]

ఇంకొకచోట ఆయన ఇలా అంటున్నాడు : "అల్లాహ్ కార్యంలో నిమగ్నులైన కారణంగా, తమ జీవనోపాధి కోసం భూమిపై తిరిగే అవకాశం లేనందువల్ల లేమికి గురిఅయిన వారు ప్రత్యేకంగా ధన సహాయానికి అర్హులు. వారిని ఎరుగని మనిషి వారి ఆత్మాభిమానం చూసి వారు భాగ్యవంతులని భావిస్తాడు. వారి ముఖాలను చూసి మీరు వారి నిజస్థితిని గ్రహించగలరు. లోకుల వెంటపడి సహాయం చెయ్యండి అని బ్రతిమాలే మనుషులు కారు వారు." (అల్ బఖర : 273)

{وَالَّذِينَ إِذَا أَنْفَقُوا لَمْ يُسْرِفُوا وَلَمْ يَقْتُرُوا وَكَانَ بَيْنَ ذَلِكَ قَوَاماً} [الفرقان:٦٧]

వేరొకచోట ఇలా సెలవిచ్చాడు : "(కరుణామయుని దాసులు ఎవరంటే), ఖర్చుపెడితే దుబారాగానూ ఖర్చుపెట్టకుండా, లోభత్వాన్నీ ప్రదర్శించకుండా – ఈ రెండు తీవ్రవైఖరుల మధ్య సమతూకాన్ని పాటించే వారు." (అల్ ఫుర్ఖాన్ : 67)

{وَمَا خَلَقْتُ الْجِنَّ وَالأِنْسَ إِلاَّ لِيَعْبُدُونِ مَا أُرِيدُ مِنْهُمْ مِنْ رِزْقٍ وَمَا أُرِيدُ أَنْ يُطْعِمُونِ} [الذريات:٥٧،٥٦]

ఆయన ఇంకా ఇలా అంటున్నాడు : "నేను జిన్నాతులనూ, మానవులనూ కేవలం నా ఆరాధన కోసమే పుట్టించాను. నేను వారి నుండి ఎలాంటి ఉపాధినీ కోరను; వారు నాకు అన్నం పెట్టాలనీ కోరను." (అజ్ జారియాత్ : 56, 57)

ఈ అధ్యాయానికి సంబంధించిన అనేక హదీసులు గత రెండు అధ్యాయాల్లోనూ వచ్చాయి. తతిమ్మా హదీసులను ఇక్కడ పొందుపరుస్తున్నాం.

English

“And no moving (living) creature is there on earth but its provision is due from Allah.” [Hūd 11:6]

“(Charity is) for Fuqara (the poor), who in Allah’s Cause are restricted (from travel), and cannot move about in the land (for trade or work). The one who knows them not, thinks that they are rich because of their modesty. You may know them by their mark, they do not beg of people at all.” [Al-Baqarah 2:273]

“And those, who, when they spend, are neither extravagant nor niggardly, but hold a medium (way) between those (extremes).” [Al-Furqān 25:67]

“And I (Allah) created not the jinn and mankind except that they should worship Me (Alone). I seek not any provision from them (i.e., provision for themselves or for My creatures) nor do I ask that they should feed Me (i.e., feed themselves or My creatures).” [Adh-Dhāriyāt 51:56–57]

522

హదీసు 522

عن أَبي هُرَيْرَةَ رضي اللَّه عنه عن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "لَيس الغِنَي عَن كثْرَةِ العَرضِ، وَلكِنَّ الغنِيَ غِنَي النَّفسِ "متفقٌ عَلَيْهِ. "العَرَضُ"بفتح العين والراءِ: هُوَ المَالُ.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : సిరిసంపదల విస్తృతి కలిమి కాదు. మనసులోని నిరపేక్షా భావమే అసలు కలిమి.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని ప్రేమైక వచనాల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “Richness is not the abundance of wealth, rather it is self-sufficiency.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

మనిషి తన దగ్గరున్న ధనంతో తృప్తిగా జీవించడమే నిరపేక్షాభావం. నిరపేక్షాభావాన్ని అలవరచుకున్న వ్యక్తి ఇతరుల ముందు చేయి చాపకుండా, దురాశలకు పోకుండా ఆత్మ సంతృప్తితో బ్రతుకుతాడు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|57. ఆత్మ తృప్తితో బ్రతకటం, ఇతరుల ముందు చెయ్యి చాపకుండా ఉండటం, ఖర్చుచేయుటంలో మధ్యేమార్గాన్ని అవలంబించటం గురించి……|హదీసు 522

523

హదీసు 523

وعن عبد اللَّه بن عمرو رضي اللَّه عنهما أَن رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "قَدْ أَفلَحَ مَنْ أَسَلَمَ، وَرُزِقَ كَفَافاً، وَقَنَّعَهُ اللَّه بِمَا آتَاهُ" رواه مسلم.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : "ఇస్లాం స్వీకరించి, చాలినంత ఉపాధిని పొంది, దైవప్రసాదితాలపై తృప్తినొసగబడిన వ్యక్తి ముక్తి పొందాడు." (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణం)

English

`Abdullah bin `Amr bin Al-as (radiyallahu anhuma) reported: the Messenger of Allah ﷺ said, “Successful is the one who has entered the fold of Islam and is provided with sustenance which is sufficient for his needs, and Allah makes him content with what He has bestowed upon him.”.[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|57. ఆత్మ తృప్తితో బ్రతకటం, ఇతరుల ముందు చెయ్యి చాపకుండా ఉండటం, ఖర్చుచేయుటంలో మధ్యేమార్గాన్ని అవలంబించటం గురించి……|హదీసు 523

524

హదీసు 524

وعن حَكيم بن حِزَام رضي اللَّه عنه قَالَ: سَأَلْتُ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَأَعطَاني، ثُمَّ سَأَلْتُهُ فَأَعطَاني، ثُمَّ سَأَلْتُهُ فَأَعطَاني، ثُمَّ قَالَ: "يَا حَكيمُ، إِنَّ هَذَا المَالَ خَضِرٌ حُلْوٌ، فَمن أَخَذَهُ بِسَخَاوَةِ نَفس بُوركَ لَهُ فِيه، وَمَن أَخَذَهُ بِإِشرَافِ نَفْسٍ لَم يُبَارَكْ لهُ فيهِ، وكَانَ كَالَّذِي يَأْكُلُ وَلاَ يَشْبَعُ، واليدُ العُلَيا خَيرٌ مِنَ اليَدِ السُّفلَى "قَالَ حَكيمٌ فقلتُ: يَا رسول اللَّه وَالَّذِي بَعثَكَ بالحَقِّ لاَ أَرْزَأُ أَحداً بَعدَكَ شَيْئاً حَتَّى أُفَارِقَ الدُّنيَا، فَكَانَ أَبُو بكرٍ رضي اللَّه عنه يَدْعُو حَكيماً لِيُعطيَهُ العَطَاءَ، فَيَأْبَى أنْ يَقْبَلَ مِنْهُ شَيْئاً. ثُمَّ إِنَّ عُمر رضي اللَّه عنه دَعَاهُ لِيُعطيهُ، فَأَبَى أَن يَقْبلَهُ. فقالَ: يَا مَعشَرَ المُسْلمينَ، أُشْهِدُكُم عَلى حَكيمٍ أَنِي أَعْرضُ عَلَيه حَقَّهُ الَّذِي قَسَمَهُ اللَّه لَهُ في هَذَا الْفيءِ، فيَأْبَى أَن يَأْخُذَهُ. فَلَمْ يَرْزَأْ حَكيمُ أَحداً مِنَ النَّاسِ بَعْدَ النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم حَتَّى تُوُفي. متفقٌ عَلَيْهِ. "يرْزَأُ"براءٍ ثُمَّ زايٍ ثُمَّ همزةٍ، أيْ لَمْ يأْخُذْ مِن أَحدٍ شَيْئاً، وأَصلُ الرُّزْءِ: النُّقصَانُ، أَي لَم ينْقُصْ أَحَداً شَيئاً بالأَخذِ مِنْهُ. وَ"إِشْرَافُ النَّفسِ": تَطَلُّعُها وطَمعُهَا بالشَّيءِ. وَ"سَخَاوَةُ النَّفْسِ": هيَ عدمُ الإِشَرَاف إِلى الشَّيءِ، والطَّمَع فِيهِ، والمُبالاةِ بِهِ والشَّرهِ.

హజ్రత్ హకీమ్ బిన్ హిజామ్ (రదియల్లాహు అన్హు) కథనం : నేనొకసారి దైవప్రవక్త ﷺను (ధనం) ఇవ్వమని అడిగితే ఆయన ఇచ్చారు. నేను మళ్ళీ అడిగాను. ఆయన నాకు (మరికొంత ధనం) ఇచ్చారు. నేను ఇంకా ఇవ్వమని అడిగాను. అప్పుడు ఆయన నాకు (ఇంకాస్త ధనం) ఇస్తూ, "హకీమ్! ఈ ధనం (పైకి) పచ్చగా, తియ్యగా కనిపిస్తుంది. కాని దాన్ని నిరపేక్షా భావంతో తీసుకున్న వ్యక్తికి అందులో శుభం కలుగుతుంది. అత్యాశతో తీసుకున్న వ్యక్తికి అందులో శుభం కలగదు. అతను ఎంత తిన్నా కడుపునిండని (రోగి) లాంటివాడు. పైచేయి (ఇచ్చే చెయ్యి) క్రింది చెయ్యి (పుచ్చుకునే చెయ్యి) కన్నా ఎంతో శ్రేష్ఠమైనది" అని ఉపదేశించారు.

అప్పుడు నేనాయనతో, "దైవప్రవక్తా! మిమ్మల్ని సత్య సందేశాన్నిచ్చి పంపిన దేవుని సాక్షిగా చెబుతున్నాను. ఇకపై నేను ఇహలోకాన్ని వదలివెళ్ళేవరకు ఎవరినీ ఏమీ చేయిచాపి అడగను" అని అన్నాను.

హజ్రత్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) (తన పాలనా కాలంలో) (ధనం ఇవ్వటానికి) హకీమ్ (రదియల్లాహు అన్హు)ని ఎన్నిసార్లు పిలిచినప్పటికీ ఆయన దాన్ని స్వీకరించటానికి నిరాకరించారు. ఆ తరువాత ఉమర్ (రదియల్లాహు అన్హు) (తన హయాంలో) ఆయనకు కానుకలు ఇవ్వటానికి అనేకసార్లు పిలిపించారు. కాని అప్పుడు కూడా ఆయన వాటిని స్వీకరించటానికి నిరాకరించారు. ఆ సందర్భంగా హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు), ప్రజలతో మాట్లాడుతూ ఇలా అన్నారు: ముస్లింలారా! నేను హకీమ్‌కు విజయ ప్రాప్తి నుండి రావలసిన వాటాను తీసి ఆయనకు ఇస్తున్నాను. కాని ఆయన దాన్ని స్వీకరించటానికి నిరాకరిస్తున్నారు. దీనికి మీరు సాక్షులుగా ఉండాలి."

ఆ విధంగా హజ్రత్ హకీమ్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త ﷺ నుండి దానం స్వీకరించిన నాటి నుంచి చనిపోయేవరకు ఎవరి నుండీ, ఎలాంటి వస్తువూ తీసుకోలేదు.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని వీలునామాల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణం)

English

Hakim bin Hizam (radiyallahu anhu) reported: I begged Messenger of Allah ﷺ and he gave me; I begged him again and he gave me. I begged him again and he gave me and said, “O Hakim, wealth is pleasant and sweet. He who acquires it with self-contentment, it becomes a source of blessing for him; but it is not blessed for him who seeks it out of greed. He is like one who goes on eating but his hunger is not satisfied. The upper hand is better than the lower one.” I said to him, “O Messenger of Allah, by Him Who sent you with the Truth I will not, after you, ask anyone for anything till I leave this world.” So Abu Bakr (radiyallahu anhu) would summon Hakim (radiyallahu anhu) to give his rations, but he would refuse. Then ‘Umar (radiyallahu anhu) would call him but he would decline to accept anything. So ‘Umar (radiyallahu anhu) said addressing Muslims: “O Muslims, I ask you to bear testimony that I offer Hakim his share of the booty that Allah has assigned for him but he refuses my offer.” Thus Hakim did not accept anything from anyone after the death of Messenger of Allah ﷺ, till he died.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

మనిషి ఎంత డబ్బు కూడబెట్టుకున్నా అతని ధనదాహం మాత్రం తీరదు. పైగా ధనం పెరిగినకొద్దీ అతని ధనాశ కూడా విచ్చలవిడిగా పెరుగుతూ పోతుంది. ఒక లోయనిండా బంగారం లభిస్తే మనిషి రెండవదానికోసం అర్రులు చాస్తాడు. ఆఖరికి నోట్లో (సమాధి) మన్నుపడితే గాని అతని ఆత్రం చల్లారదు.

అర్థింపు, అత్యాశలు లేకుండా ధనం లభించినప్పుడు దాన్ని స్వీకరించడంలో తప్పులేదు. కాని అలాంటి ధనాన్ని కూడా తృణీకరించటం గొప్పవారి లక్షణం. అది వారిలోని ఐహిక అనాసక్తతను, నిరపేక్షాభావాన్ని సూచిస్తుంది. హకీమ్ (రదియల్లాహు అన్హు) అలాంటి నిరపేక్షతనే ప్రదర్శించారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|57. ఆత్మ తృప్తితో బ్రతకటం, ఇతరుల ముందు చెయ్యి చాపకుండా ఉండటం, ఖర్చుచేయుటంలో మధ్యేమార్గాన్ని అవలంబించటం గురించి……|హదీసు 524

525

హదీసు 525

وعن أَبي بُردَةَ عن أَبي موسى الأشعَريِّ رضي الله عنه قَالَ: خَرَجْنَا مَعَ رَسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم في غَزاةٍ، ونحْن سِتَّةُ نَفَرٍ بيْنَنَا بَعِير نَعْتَقِبهُ، فَنَقِبتْ أَقدامُنا، وَنَقِبَتْ قَدَمِي، وَسَقَطَتْ أَظْفاري، فَكُنَّا نَلُفُّ عَلى أَرْجُلِنا الخِرَقَ، فَسُميت غَزوَةَ ذَاتِ الرِّقاعِ لِما كُنَّا نَعْصِبُ عَلى أَرْجُلِنَا مِنَ الخِرَقَ، قالَ أَبو بُردَةَ: فَحَدَّثَ أَبو مُوسَى بِهَذا الحَدِيثِ، ثُمَّ كَرِهَ ذلكَ، وقالَ: مَا كنْتُ أَصْنَعُ بِأَنْ أَذْكُرهُ، قالَ: كَأَنَّهُ كَرِهَ أَنْ يَكُونَ شَيْئاً مِنْ عَمَلِهِ أَفْشاهُ. متفقٌ عَلَيْهِ.

హజ్రత్ అబూ మూసా అష్‌అరీ (రదియల్లాహు అన్హు) నుండి అబూ బుర్దా చేసిన కథనం: మేము దైవప్రవక్త ﷺ వెంట ఒకానొక యుద్ధానికి బయలుదేరాము. అప్పుడు మేము ఆరుగురం ఉన్నాం. మా దగ్గర ఒకే ఒక ఒంటె ఉంది. దానిమీద మేము వంతులవారీగా ప్రయాణించసాగాము. (చాలాదూరం నడిచిన కారణంగా) మా కాళ్లు పగిలిపోయాయి. నా కాళ్ళు కూడా పగిలి గోళ్ళు ఊడిపోయాయి. (ఆ బాధను భరించలేక మేము) కాళ్ళకు చింపిరిగుడ్డలు కట్టుకున్నాం. మేము మా కాళ్ళకు చింపిరిగుడ్డలు కట్టుకున్న కారణంగానే ఆ యుద్ధానికి జాతుర్రిఖా (చింపిరిగుడ్డల) యుద్ధమనే పేరు పడింది.

అబూ మూసా అష్‌అరీ (రదియల్లాహు అన్హు) ఈ హదీసును ఉల్లేఖించిన తరువాత దీని గురించి చెప్పినందుకు అయిష్టత వ్యక్తం చేశారు. "నేనసలు దీన్ని ప్రస్తావించకుండా ఉందామనుకున్నాను" అన్నారు. తను చేసిన సత్కార్యాలను గురించి ఇతరులకు చెప్పుకోవటం ఆయనకు ఇష్టం లేదన్నమాట. (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని జిహాద్ ప్రకరణం)

English

Abu Burdah (radiyallahu anhu) reported: Abu Musa Al-Ash`ari (radiyallahu anhu) said: “Six of us accompanied Messenger of Allah ﷺ in an expedition. We had one camel with us; we rode it in turn. Our feet got injured and my nails also fell out. We wrapped up our feet in rags; and because of this the campaign came to be known as Dhat-ur-Riqa` (the Campaign of Rags).” Abu Burdah (radiyallahu anhu) says: Abu Musa reported this Hadith but regretted having done so. He said, “Would that I had not mentioned it!” He said so because he disliked to disclose anything concerning his deeds.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

  1. ఈ హదీసులో కూడా దైవప్రవక్త సహచరుల ఐహిక అనాసక్తత, నిరాడంబరమైన వారి జీవితం, దైవనిర్ణయాల పట్ల వారి అంగీకారభావాలు పొందుపరచబడ్డాయి.
  2. ప్రదర్శనాబుద్ధికి దూరంగా ఉండటం కోసం చేసిన మంచి పనుల గురించి ఇతరులకు చెప్పకుండా ఉండటమే ఉత్తమం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|57. ఆత్మ తృప్తితో బ్రతకటం, ఇతరుల ముందు చెయ్యి చాపకుండా ఉండటం, ఖర్చుచేయుటంలో మధ్యేమార్గాన్ని అవలంబించటం గురించి……|హదీసు 525

526

హదీసు 526

وعن عمرو بن تَغْلِب بفتح التاءِ المثناةِ فوقَ وإِسكان الغين المعجمة وكسر الَّلام رضي الله عنه، أَنَّ رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أُتِيَ بمالٍ أَوْ سَبْيٍ فَقسَّمهُ، فَأَعْطَى رِجَالاً، وتَرَكَ رِجالاً، فَبَلَغَهُ أَنَّ الَّذِينَ تَرَكَ عَتبُوا، فَحَمِدَ اللَّه، ثُمَّ أَثْنَى عَلَيهِ، ثُمَّ قَالَ: "أَمَا بَعدُ، فَوَاللَّه إِنِّي لأُعْطِي الرَّجُلَ وَأَدَعُ الرَّجُلَ، والَّذِي أَدَعُ أَحَبُّ إليَّ مِنَ الَّذِي أُعْطِي، وَلكِنِّي إِنَّمَا أُعْطِي أَقوَاماً لِما أَرى في قُلُوبِهِمْ مِن الجَزعِ والهَلَعِ، وَأَكِلُ أَقْواماً إِلى مَا جعَلَ اللَّه في قُلُوبِهِمْ مِنَ الغِني والخَيْرِ، مِنْهُمْ عَمْروُ بنُ تَغلِبَ" قَالَ عمرُو بنُ تَغْلِبَ: فَواللَّهِ مَا أُحِبُّ أَن لِي بِكلِمةِ رَسُولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم حُمْرَ النَّعَمِ. رواه البخاري. "الهلَعُ": هُو أَشَدُّ الجَزَعِ، وقِيل: الضَّجرُ.

హజ్రత్ అమ్ర్ బిన్ తగ్‌లిబ్ (రదియల్లాహు అన్హు) కథనం : ఒకసారి దైవప్రవక్త ﷺ దగ్గరికి (విజయసొత్తుగా) కొంత ధనమో లేక కొంతమంది ఖైదీలో వచ్చారు. ఆయన ﷺ దాన్ని ప్రజలకు పంచిపెట్టారు. అయితే ఆ ధనం కొంతమందికిచ్చి మరికొంతమందికి ఇవ్వనందున ధనం లభించని వారు అలిగారు. ఈ విషయం దైవప్రవక్త ﷺకు తెలిసింది. ఆయన (వేదికపైకెక్కి) దైవస్తోత్రం చేసిన తరువాత ఇలా అన్నారు : దైవసాక్షి! నేను కొందరికి ఇస్తాను. మరికొందరికి ఇవ్వకుండా ఉంటాను. కాని నిజానికి నేనిచ్చే వారికన్నా ఇవ్వకుండా ఉండేవారే నాకు అత్యంత ప్రియతములు. నేను వారి హృదయాల్లో అశాంతి, ఆందోళనా భావాల్ని గమనిస్తున్నాను. అందుకే ఆ ధనం వారికిచ్చాను. ఇక మిగతావారి హృదయాల్లో దేవుడు మంచితనాన్ని, నిరపేక్షాభావాన్ని ఉంచాడు. నాకు వారి మీద నమ్మకముంది. అమ్ర్ బిన్ తగ్‌లిబ్ కూడా అలాంటివాడే.

అమ్ర్ బిన్ తగ్‌లిబ్ ఇలా అంటున్నారు: దైవసాక్షి! దైవప్రవక్త ﷺ చెప్పిన ఆ మాటకు బదులుగా నాకు ఎరుపు ఒంటెలిచ్చినా నేను వాటిని తీసుకోవటానికి ఇష్టపడను. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని జుమా ప్రకరణం)

English

`Amr bin Taghlib (radiyallahu anhu) reported: Some booty or prisoners of war were brought to Messenger of Allah ﷺ and he distributed them, giving some men and neglecting others. Then, he was informed that those whom he had not given a thing were displeased. On this the Messenger of Allah ﷺ praised Allah and glorified Him and said, “It is a fact that I give to one and overlook another. The one I ignore is dearer to me than the one I give. I give to those in whose hearts I perceive anxiety; others I leave with the richness and contentment that Allah has put in their hearts. One of them is `Amr bin Taghlib.” Upon this `Amr bin Taghlib said, “By Allah I shall not accept a herd of red camels in exchange for what the Prophet said (about me).”[Al-Bukhari].

ముఖ్యాంశాలు

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం తన దగ్గరికి వచ్చే ధనాన్నంతా పేదలకు పంచిపెట్టేవారు. ధనం పంచిపెట్టేటప్పుడు ఆయన అనేక విషయాలను దృష్టిలో పెట్టుకునేవారు. అవసరాల్లో ఉన్నవారికి ఇచ్చేవారు. ఎవరికయినా ఆ ధనం మీద హక్కు ఉంటే వారికి పంచిపెట్టేవారు. అలాగే ధనం ఇవ్వకపోతే అసహనంతో మూతి ముడుచుకుంటారనే భయమున్నవారికి కూడా ఆయన ఎంతోకొంత ఇచ్చిపంపేవారు. ఈ సందర్భంగా ఆత్మతృప్తితో బ్రతికే నిరపేక్షాపరులైన ముస్లింలను ఆయన ఉద్దేశ్యపూర్వకంగానే ఉపేక్షించేవారు. ఈ హదీసులో అమ్ర్ బిన్ తగ్‌లిబ్‌ను ఆయన అలాంటి వ్యక్తిగానే పరిగణించారు. దీనిద్వారా అమ్ర్ బిన్ తగ్‌లిబ్ ప్రశస్తి వెల్లడౌతోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|57. ఆత్మ తృప్తితో బ్రతకటం, ఇతరుల ముందు చెయ్యి చాపకుండా ఉండటం, ఖర్చుచేయుటంలో మధ్యేమార్గాన్ని అవలంబించటం గురించి……|హదీసు 526

527

హదీసు 527

وعن حَكيمِ بن حِزامٍ رضي اللَّه عنه أَنَّ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ: "اليدُ العُليا خَيْرُ مِنَ اليَدِ السُّفْلى، وابْدَأ بمنْ تَعُولُ، وَخَيْرُ الصَّدَقَةِ عنْ ظَهْرِ غِنى، ومَنْ يَسْتعْففْ يُعفُّهُ اللَّه، ومَنْ يَسْتغْن يُغْنِهِ اللَّه" متفقٌ عَلَيْهِ. وهذا لفظ البخاري، ولفظ مسلم أَخصر.

హజ్రత్ హకీమ్ బిన్ హిజామ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : ఇచ్చే చెయ్యి పుచ్చుకునే చెయ్యికన్నా ఎంతో గొప్పది. నువ్వు ధనం ఖర్చుపెట్టేటప్పుడు నీపై ఆధారపడివున్న వారితోనే మొదలుపెట్టు. అవసరాలు తీరిన తరువాత చేసే దానమే అత్యుత్తమ దానం. ఇతరుల ముందు చేయి చాపకుండా ఉండాలనుకున్న వాడ్ని దేవుడు దాన్నుండి కాపాడతాడు. అలాగే నిరపేక్షాభావాన్ని అవలంబించాలనుకున్న వ్యక్తిని దేవుడు నిరపేక్షాపరునిగా చేసేస్తాడు.

(బుఖారీ – ముస్లిం)

ఇవి బుఖారీ వాక్యాలు. ముస్లిం వాక్యాలు మరింత క్లుప్తంగా ఉన్నాయి.

(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలలోని జకాత్ ప్రకరణాలు)

English

Hakim bin Hizam (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “The upper hand is better than the lower one; and begin (charity) with those who are under your care; and the best charity is (the one which is given) out of surplus; and he who wishes to abstain from begging will be protected by Allah; and he who seeks self-sufficiency will be made self-sufficient by Allah.” [Al-Bukhari].

ముఖ్యాంశాలు

ఇతరుల ముందు చెయ్యిచాపి అడుక్కోకుండా, ప్రజల సిరిసంపదల పట్ల నిరపేక్షాభావాన్ని కనబరిచేవారు దైవానికి ప్రియమైనదాసులుగా పరిగణించబడతారు. దేవుడు అలాంటి వారికి సహాయం చేసి వారి ఆత్మగౌరవాన్ని కాపాడతాడు. వారికి ఆత్మ సంతృప్తిని, సహన సౌభాగ్యాలను ప్రసాదిస్తాడు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|57. ఆత్మ తృప్తితో బ్రతకటం, ఇతరుల ముందు చెయ్యి చాపకుండా ఉండటం, ఖర్చుచేయుటంలో మధ్యేమార్గాన్ని అవలంబించటం గురించి……|హదీసు 527

528

హదీసు 528

وعن سفيانَ صَخْرِ بنِ حَرْبٍ رضي اللَّه عنه قَالَ: قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لاَ تُلْحِفُوا في المسأَلَةِ، فوَاللَّه لاَ يَسْأَلُني أَحَدٌ مِنْكُمْ شَيْئاً، فَتُخرِجَ لَهُ مَسْأَلَتُهُ مِنِّي شَيْئاً وَأَنا لَهُ كارِهٌ، فَيُبَارَكَ لَهُ فِيمَا أَعْطَيْتُهُ "رواه مسلم.

హజ్రత్ అబూ సుఫ్యాన్ సఖర్ బిన్ హర్బ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : లోకుల వెంటపడి బ్రతిమాలి అడుక్కోకండి. దైవసాక్షి! మీరు నన్ను ఏదైనా వస్తువు అడిగి, నేను అన్యమనస్కంగా మీకు ఆ వస్తువు ఇవ్వాల్సివస్తే, అలాంటప్పుడు నేను మీకిచ్చే వస్తువులో శుభం ప్రాప్తించదు." (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణం)

English

Abu Sufyan (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Do not be importunate in begging. By Allah! If one of you asks me for something and I give it to him unwillingly, there is no blessing in what I give him.”[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|57. ఆత్మ తృప్తితో బ్రతకటం, ఇతరుల ముందు చెయ్యి చాపకుండా ఉండటం, ఖర్చుచేయుటంలో మధ్యేమార్గాన్ని అవలంబించటం గురించి……|హదీసు 528

529

హదీసు 529

وعن أَبي عبدِ الرحمنِ عَوف بن مالِك الأَشْجَعِيِّ رضي اللَّه عنه قالَ: كُنَّا عِنْدَ رسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم تِسَعْةً أَوْ ثَمَانِيَةً أَوْ سَبْعَةً، فَقَال: أَلاَ تُبَايِعُونَ رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وكُنَّا حَدِيثي عَهْدٍ بِبيْعَةٍ، فَقُلْنا: قَدْ بايعْناكَ يَا رسُولَ اللَّهِ، ثمَّ قالَ: "ألا تُبَايِعُونَ رسولَ اللهِ؟ "فَبَسَطْنا أيْدينا وقلنا قد بايعناك يا رسول الله فَعَلاَم نَبَايِعُكَ؟ قَالَ:"عَلَى أَنْ تَعْبُدُوا اللَّه وَلاَ تُشْرِكُوا بِهِ شَيْئاً، والصَّلَوَاتِ الخَمْس وَتِطيعُوا" وَأَسرَّ كلمَة خَفِيةً:" وَلاَ تَسْأَلُوا النَّاسِ شَيْئاً" فَلَقَدْ رَأَيتُ بَعْضَ أُولِئكَ النَّفَرِ يَسْقُطُ سَوْطُ أَحدِهِمْ فَما يَسْأَلُ أَحَداً يُنَاوِلُهُ إِيَّاهُ رواه مسلم.

హజ్రత్ అబూ అబ్దుర్రహ్మాన్ ఔఫ్ బిన్ మాలిక్ అష్‌జయీ (రదియల్లాహు అన్హు) కథనం : మేము తొమ్మిది లేక ఎనిమిది లేక ఏడుమందిమి దైవప్రవక్త ﷺ దగ్గర కూర్చొని ఉండగా ఆయన మమ్మల్ని, "మీరు దైవప్రవక్తకు ప్రమాణం చెయ్యరా?" అని అడిగారు. మేము కొంతకాలం ముందే ఆయనకు ప్రమాణం చేసివున్నాం. అందుచేత, "దైవప్రవక్తా! మేము (ఇంతకు ముందే) మీకు ప్రమాణం చేశాం" అని విన్నవించుకున్నాం. ఆయన మళ్ళీ, "మీరు దైవప్రవక్తకు ప్రమాణం చెయ్యరా?" అని అడిగారు. అప్పుడు మేము (ప్రమాణం చేయుటానికి) చేతులు చాపుతూ, "దైవప్రవక్తా! మేము మీకు ప్రమాణం చేసి ఉన్నాం కదా! ఇక ఇప్పుడు దేని గురించి మీకు ప్రమాణం చెయ్యాలి?" అని అడిగాం. దానికి ఆయన ﷺ "ఒకే దేవుణ్ణి ఆరాధిస్తామని, ఆయనకు ఎవరినీ సాటి కల్పించమని, ఐదు పూటలా నమాజ్ చేస్తామని, దైవానికి విధేయత చూపుతామని" – తరువాత మెల్లిగా అన్నారు: "ప్రజలనుండి ఏమీ అడుక్కోమని ప్రమాణం చెయ్యండి." ఆ విధంగా ప్రమాణం చేసిన వారిలో కొందరిని, నేను గమనించిన విషయం చెబుతున్నాను. వారు (వాహనం మీద ఉన్నప్పుడు) కొరడా క్రిందజారిపోతే దాన్ని అందివ్వమని కూడా ఎవరినీ అడిగేవారు కారు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణం)

English

`Auf bin Malik Al-Ashja`i (radiyallahu anhu) reported: Seven, eight or nine people, including myself, were with Messenger of Allah ﷺ on an occasion when he ﷺ remarked, “Would you pledge allegiance to Messenger of Allah?” As we had taken oath of allegiance shortly before, we said, “We have already done so, O Messenger of Allah.” He again asked, “Would you not pledge allegiance to Messenger of Allah?” So we stretched out our hands and said, “We have already made our pledge with you, O Messenger of Allah, on what should we make a pledge with you?” He said, “To worship Allah and not to associate anything with Him, to perform the five (daily) Salat and to obey.” Then he added in a low tone, “And not to ask people for anything.” Thereafter, I noticed that some of these people who were present did not ask anyone to pick up even the whip for them if it fell from their hands.[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|57. ఆత్మ తృప్తితో బ్రతకటం, ఇతరుల ముందు చెయ్యి చాపకుండా ఉండటం, ఖర్చుచేయుటంలో మధ్యేమార్గాన్ని అవలంబించటం గురించి……|హదీసు 529

530

హదీసు 530

وعن ابن عمر رضي اللَّه عنهما أَنَّ النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "لاَ تَزَالُ المَسأَلَةُ بِأَحَدِكُمْ حَتى يَلْقى اللَّه تَعَالَى ولَيْسَ في وَجْهِهِ مُزْعةُ لَحْمٍ" متفقٌ عَلَيْهِ. "المُزْعَةُ"بضم الميمِ وإِسكانِ الزاي وبالعينِ المهملة: القِطْعَة.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు : నిత్యం ప్రజల దగ్గర అడుక్కుంటూ తిరిగేవాడు ముఖంపై ఒక్క మాంసపు తునకయినా లేని స్థితిలో దైవాన్ని కలుసుకుంటాడు.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలలోని జకాత్ ప్రకరణాలు)

English

Ibn `Umar (radiyallahu anhuma) reported: The Prophet ﷺ said, “If one of you would keep begging (of people) until he meets Allah (on the Day of Resurrection) his face will be without a shred of flesh.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ముఖం మీద మాంసం ఉండదంటే బహుశా పరలోకంలో అతనికి ఘోర అవమానం ఎదురౌతుందని అర్థం కావచ్చు లేదా అందుకు శిక్షగానో, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగానో నిజంగా అలా జరగవచ్చు. పూర్వాపరాల దృష్ట్యా రెండవ మాటే సరైనదనిపిస్తోంది. ఈ హదీసులో ముష్టెత్తుకోవటాన్ని ఛీత్కరించుకోవటం జరిగింది. దానికి ఫలితంగా ఇహపరాల్లోనూ ఘోర అవమానాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించటం జరిగింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|57. ఆత్మ తృప్తితో బ్రతకటం, ఇతరుల ముందు చెయ్యి చాపకుండా ఉండటం, ఖర్చుచేయుటంలో మధ్యేమార్గాన్ని అవలంబించటం గురించి……|హదీసు 530

531

హదీసు 531

وعنه أَنَّ رَسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ وَهُوَ عَلَى المِنبرِ، وَذَكَرَ الصَّدقَةَ والتَّعَفُّفَ عَنِ المسأَلَةِ: "اليَد العلْيا خَيْرٌ مِنَ اليَدِ السُّفْلى" وَاليَد العُليا هِيَ المُنْفِقة، والسُّفْلَى هِيَ السَّائِلَة. متفقٌ عَلَيْهِ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ ఒకసారి వేదికపై నించొని దానధర్మాల గురించి, ఇతరుల ముందు చేయి చాపకుండా ఉండటం గురించి ప్రస్తావించారు. ఆ సందర్భంగానే ఆయన ఇలా అన్నారు: పైచేయి క్రిందిచేయికన్నా ఎంతో శ్రేష్ఠమైనది. పైచెయ్యి ఖర్చుపెట్టే చెయ్యి. క్రింది చెయ్యి అర్థించే చెయ్యి.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలలోని జకాత్ ప్రకరణాలు)

English

Ibn `Umar (radiyallahu anhuma) reported: While Messenger of Allah ﷺ was on his pulpit (in the mosque) delivering a Khutbah (religious talk) about Sadaqah (charity) and begging, he said, “The upper hand is better than the lower hand, the upper hand is the one which gives and the lower hand is the begging one.”[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|57. ఆత్మ తృప్తితో బ్రతకటం, ఇతరుల ముందు చెయ్యి చాపకుండా ఉండటం, ఖర్చుచేయుటంలో మధ్యేమార్గాన్ని అవలంబించటం గురించి……|హదీసు 531

532

హదీసు 532

وعن أَبي هُريرة رضي اللَّه عنه قال: قال رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَنْ سَأَلَ النَّاس تَكَثُّراً فَإِنَّمَا يَسْأَلُ جَمْراً، فَلْيسْتَقِلَّ أَوْ لِيَسْتَكْثِرْ" رواه مسلم.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : ధనాన్ని కూడబెట్టే ఉద్దేశ్యంతో అడుక్కునేవాడు వాస్తవానికి అగ్నిజ్వాలల్ని కోరుకుంటున్నాడు. కనుక అతను ఎక్కువ అడుక్కోవచ్చు లేదా తక్కువ అడుక్కోవచ్చు. (అది అతని యిష్టం). (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “He who begs to increase his riches is in fact asking only for a live coal. It is up to him to decrease it or increase it.”[Muslim].

ముఖ్యాంశాలు

అవసరం లేకపోయినా ఇతరుల ముందు చేయి చాపి అడుక్కోవటం ఎంత పెద్ద పాపమంటే ఆ విధంగా మనిషి తన్ను తాను నరకజ్వాలలకు గురిచేసుకుంటాడు. కాని శోచనీయమైన విషయం ఏమిటంటే ఏ మతంలోనయితే ముష్టెత్తుకోవటాన్ని ఇంత ఘోరమైన పాపంగా పరిగణిం చబడిందో ఆ మతావలంబీకుల్లోనే ఈ రుగ్మత సర్వసామాన్యంగా ఉంది. ఇస్లామీయ బోధనల పట్ల ముస్లింల ఈ ఏమరుపాటుతనం, ఈ నిర్లక్ష్యవైఖరి ఎంతైనా తూలనాడదగినదే.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|57. ఆత్మ తృప్తితో బ్రతకటం, ఇతరుల ముందు చెయ్యి చాపకుండా ఉండటం, ఖర్చుచేయుటంలో మధ్యేమార్గాన్ని అవలంబించటం గురించి……|హదీసు 532

533

హదీసు 533

وعن سمُرَةَ بنِ جُنْدبٍ رضي اللَّه عنه قَالَ: قَالَ رسُولُ اللَّه صلى اللَّه عليه وآله وسَلَّم: "إِنَّ المَسأَلَةَ كَدُّ يكُدُّ بِهَا الرَّجُلُ وجْهَهُ، إِلاَّ أَنْ يَسأَلَ الرَّجُلُ سُلْطاناً أَوْ في أَمْر لابُدَّ مِنْهُ" رواهُ الترمذي وقال: حديث حسن صحيح "الكَدُّ": الخَدشُ وَنحوُهُ.

హజ్రత్ సమురా బిన్ జుందుబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు : భిక్షాటన ఒక గాయం లాంటిది. మనిషి భిక్షాటన చేసి తన ముఖాన్ని గాయపరచుకొంటాడు. అయితే (తన హక్కు ఇవ్వమని) అధికారిని అడగటం లేదా గత్యంతరం లేని పరిస్థితిలో అడుక్కోవటం మాత్రం (గాయపరచుకునే భిక్షాటనల క్రిందికి రావు).

(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హసన్, సహీహ్‌గా పేర్కొన్నారు.)

English

Samurah bin Jundub (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Begging is a cut that a person inflicts upon his face; except for asking a ruler, or under the stress of circumstances from which there is no escape.”[At-Tirmidhi].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|57. ఆత్మ తృప్తితో బ్రతకటం, ఇతరుల ముందు చెయ్యి చాపకుండా ఉండటం, ఖర్చుచేయుటంలో మధ్యేమార్గాన్ని అవలంబించటం గురించి……|హదీసు 533

534

హదీసు 534

وعن ابن مسعودٍ رضيَ اللَّه عنه قَالَ: قَالَ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَنْ أَصابَتْهُ فَاقَةٌ فَأَنْزَلَهَا بِالنَّاسِ لَمْ تُسَدَّ فاقَتُهُ، وَمَنْ أَنْزَلها باللَّه، فَيُوشِكُ اللَّه لَهُ بِرِزقٍ عاجِلٍ أَوْ آجِلِ "رواهُ أَبو داود، والترمذي وَقالَ: حديث حسن. "يُوشكُ"بكسر الشين: أَي يُسرِعُ.

హజ్రత్ ఇబ్నె మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : ఎవరికయినా పస్తులు ఎదురయినప్పుడు తన పస్తుల గురించి ప్రజల ముందు వెళ్ళబుచ్చుకుంటే అతని పస్తులు తీరవు. దానికి బదులు దేవుని ముందు వెళ్ళబుచ్చుకుంటే దేవుడు త్వరగాగాని లేదా ఆలస్యంగా గాని అతనికి ఉపాధిని ప్రసాదిస్తాడు. (దీనిని అబూదావూద్, తిర్మిజీలు ఉల్లేఖించారు. ఇంకా తిర్మిజీ దీనిని 'హసన్'గా పేర్కొన్నారు).

(సుననె అబూదావూద్‌లోని జకాత్ ప్రకరణం, సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత అధ్యాయాలు)

English

Ibn Mas`ud (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “He who suffers poverty and seeks relief from people, he will not be relieved; but he who seeks relief from Allah Alone, he will be relieved sooner or later.”[Abu Dawud and At-Tirmidhi].

ముఖ్యాంశాలు

  1. అందరి అవసరాలనూ తీర్చేవాడు అల్లాహ్ ఒక్కడే. కనుక ఆపదలు, అవసరాలు ఎదురైనప్పుడు ఆయనవైపుకే మరలాలి.
  2. అయితే భౌతిక కారణాల దృష్ట్యా, అవసరం మేరకు మనుషుల్ని కూడా అర్థించవచ్చు. కాని అప్పుడు కూడా మనసులో 'దేవుడు తలచుకుంటేనే ఈ మనిషి ఇస్తాడు, లేకపోతే ఇవ్వలేడు' అని గట్టి నమ్మకముండాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|57. ఆత్మ తృప్తితో బ్రతకటం, ఇతరుల ముందు చెయ్యి చాపకుండా ఉండటం, ఖర్చుచేయుటంలో మధ్యేమార్గాన్ని అవలంబించటం గురించి……|హదీసు 534

535

హదీసు 535

وعَنْ ثَوْبانَ رضيَ اللَّه عنه قَالَ: قَالَ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَنْ تَكَفَّلَ لِي أَن لاَ يسْأَلَ النَّاسَ شَيْئاً، وَأَتَكَفَّلُ لَهُ بالجَنَّة؟ " فقلتُ: أَنا، فَكَانَ لاَ يسْأَلُ أَحَداً شَيْئاً، رواه أَبُو داود بإِسنادٍ صحيح.

హజ్రత్ సౌబాన్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఒకసారి ప్రజలతో మాట్లాడుతూ "ప్రజల దగ్గర అడుక్కోనని ఎవరయినా నాకు పూచీ ఇస్తే నేనతనికి స్వర్గం ప్రాప్తించే విషయంలో పూచీ వహిస్తాను" అని అన్నారు. అప్పుడు నేను దైవప్రవక్తతో "నేను పూచీ ఇస్తున్నాను" అని చెప్పాను. ఆ తరువాత నుంచి సౌబాన్ (రదియల్లాహు అన్హు) ప్రజల దగ్గర నుండి ఏ వస్తువూ అడిగేవారు కాదు.

(అబూ దావూద్ దీనిని ప్రామాణికమైన ఆధారంతో వెలికి తీశారు.)

(సుననె అబూదావూద్‌లోని జకాత్ ప్రకరణం)

English

Thauban (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “He who guarantees me that he will not beg anything from anyone, I will guarantee him (to enter) Jannah.” I said, “I give you the guarantee.” Then Thauban (radiyallahu anhu) never begged anything from anyone.[Abu Dawud].

ముఖ్యాంశాలు

ప్రజల దగ్గర అడుక్కోకూడదంటే అనవసరంగా అడగకూడదని అని అర్థం. అవసరం వచ్చినప్పుడు అడగటంలో తప్పులేదు. కాని అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరి ముందూ చేయి చాపకుండా ఉండటం ఉత్తమ గుణం. హదీసులో సౌబాన్ (రదియల్లాహు అన్హు) తర్వాతి కాలంలో ఈ గుణాన్నే అలవరచుకున్నారు. ఆయన గురించి ఇబ్నెమాజా గ్రంథంలో చెప్పబడింది. గుర్రం మీద ఎక్కి ఉన్నప్పుడు తన చేతిలో నుంచి కొరడా గనక జారిపోతే దాన్ని అందివ్వమని కూడా ఆయన అడిగేవారు కారట. తను స్వయంగా గుర్రం దిగి కొరడా ఎత్తుకునేవారట.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|57. ఆత్మ తృప్తితో బ్రతకటం, ఇతరుల ముందు చెయ్యి చాపకుండా ఉండటం, ఖర్చుచేయుటంలో మధ్యేమార్గాన్ని అవలంబించటం గురించి……|హదీసు 535

536

హదీసు 536

وعن أَبي بِشْرٍ قَبِيصَةَ بنِ المُخَارِقِ رضي اللَّه عنه قَالَ: تَحمَّلْت حمَالَةً فَأَتَيْتُ رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أَسْأَلُهُ فِيهَا، فَقَالَ: "أَقِمْ حَتَّى تَأْتِينَا الصَّدَقَةُ فَنأْمُرَ لكَ بِها"ثُمَّ قَالَ:"ياَ قَبِيصَةُ إِنَّ المَسأَلَةَ لاَ تَحِلُّ إِلاَّ لأَحَدِ ثَلاثَةٍ: رَجُلٌ تَحَمَّلَ حمالَةً، فَحَلَّتْ لَهُ المَسْأَلَةُ حَتَّى يُصيبَها، ثُمَّ يُمْسِكُ. ورجُلٌ أَصابَتْهُ جائِحَةٌ اجْتَاحَتْ مالَهُ، فَحَلَّتْ لهُ المَسأَلَةُ حَتَّى يُصِيبَ قِوَاماً مِنْ عيْشٍ، أَوْ قَالَ: سِداداً مِنْ عَيْشٍ، ورَجُلٌ أَصابَتْهُ فاقَة، حَتى يقُولَ ثلاثَةٌ مِنْ ذَوي الحِجَى مِنْ قَوْمِهِ: لَقَدْ أَصَابَتْ فُلاناً فَاقَةٌ، فحلَّتْ لَهُ المسْأَلةُ حتَّى يُصِيبَ قِواماً مِنْ عَيْشٍ، أَوْ قالَ: سِداداً مِنْ عَيْشٍ. فَمَا سِواهُنَّ مِنَ المَسأَلَةِ يَا قَبِيصَةُ سُحْتٌ، يأَكُلُها صاحِبُها سُحْتاً "رواهُ مسلم. "الحمالَةُ"بفتح الحاءِ: أَنْ يَقَعَ قِتَالٌ وَنحوُهُ بَين فَرِيقَينِ، فَيُصلحُ إِنْسَانٌ بيْنهمْ عَلى مالٍ يَتَحَمَّلُهُ ويلْتَزِمُهُ عَلى نَفْسِهِ. وَ"الجائِحَةُ": الآفَةُ تُصِيبُ مالَ الإِنْسانِ. وَ"القَوامُ"بكسر القاف وفتحهَا: هوَ مَا يقومُ بِهِ أَمْرُ الإِنْسانِ مِنْ مَالٍ ونحوِهِ وَ"السِّدادُ"بكسر السين: مَا يَسدُّ حاجةَ المُعْوِزِ ويَكْفِيهِ، وَ"الفَاقَةُ": الفَقْرُ. وَ"الحِجَى": العقلُ.

హజ్రత్ అబూ బిష్ర్ ఖబీసా బిన్ ముఖారిఖ్ (రదియల్లాహు అన్హు) కథనం : నేను (ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవను సద్దుమణచటం కోసం ధనం చెల్లించే) పూచీ వహించాను. ఆ తరువాత దైవప్రవక్త ﷺ దగ్గరికి వెళ్ళి ఈ విషయంలో నాకు సహాయం చెయ్యమని అర్థించాను. దానికి ఆయన, "కాస్సేపాగు, దానధర్మాలేమైనా వస్తే ఇప్పిస్తాను" అన్నారు.

ఆ తరువాత కాసేపటికి ఆయన నాతో ఇలా అన్నారు : "ఖబీసా! ముగ్గురికి తప్ప మరెవరికీ ఇతరుల దగ్గర ధనం అర్థించటం ధర్మసమ్మతం కాదు. వారిలో ఒకడు; (నీలాగా) పూచీ వహించిన వాడు. ఇలాంటి వ్యక్తి తన అవసరం మేరకు అర్థించవచ్చు. అవసరం తీరిన తరువాత అర్థించటం మానుకోవాలి. రెండోవ్యక్తి; ఏదైనా ఆపదలో చిక్కుకొని ధనాన్ని పోగొట్టుకున్నవాడు. ఇలాంటి వ్యక్తి తనకు జరుగుబాటు అయ్యేంత (లేదా) తన అవసరాలు తీరేటంత ధనాన్ని మాత్రమే అర్థించాలి. మూడో వ్యక్తి; పస్తులుండాల్సిన గతి పట్టినవాడు. అతన్ని ఎరిగినవాళ్ళలో ఎవరైనా ముగ్గురు ప్రాజ్ఞులు అతని పస్తుపరిస్థితిని గురించి ధృవీకరిస్తే అప్పుడు అతను కూడా తనకు జరుగుబాటు అయ్యేంత (లేదా) తన అవసరాలు తీరేటంత ధనం మాత్రమే అర్థించాలి. ఓ ఖబీసా! ఈ ముగ్గురు మినహా ఇతరులు ధనం అర్థించటం నిషిద్ధం. ఒకవేళ ఎవరైనా అలా అర్థిస్తే అతను నిషిద్ధవస్తువు తింటున్నాడని తెలుసుకోవాలి. (ముస్లిం)

ఇద్దరు వ్యక్తులు లేదా రెండు పక్షాల మధ్య ఏదైనా వ్యవహారంలో వివాదం జరిగినప్పుడు మూడోవ్యక్తి ఎవరైనా – వారి మధ్య ఒప్పందాన్ని కుదిర్చి, వారిలో ఒకరికి రెండోవ్యక్తి నుండి పైకం రావలసి ఉంటే, ఆ పైకం చెల్లించే విషయంలో తాను పూచీ వహించి -ఆ తరువాత రుణగ్రహీత రుణం చెల్లించలేకపోయినప్పుడు మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి తన పూచీని నిర్వర్తించటానికి ఇతరుల దగ్గర ధనం అర్థించవచ్చు. దీనినే 'హమాలా' అంటారు.

(సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణం)

English

Qabisah bin Al-Mukhariq (radiyallahu anhu) reported: I stood as surety for a debt and came to Messenger of Allah ﷺ to seek his help in discharging it. Messenger of Allah ﷺ said, “Wait till we receive charity and I shall give you out of it.’‘ He ﷺ added, “O Qabisah, begging is not lawful except for three people. One who has incurred debt (for assuming guarantee), for him begging is permissible till the guarantee is discharged and he should then refrain; a person whose property has been destroyed by a calamity is allowed to beg till he attains self-sufficiency; a person who meets with dire necessity (due to hunger) provided that three men of understanding from his people affirm the genuineness (of his poverty), for him begging is lawful till he attains means of his subsistence. Other than these, O Qabisah, anything received through begging is unlawful, its recipient devours it unlawfully.”[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|57. ఆత్మ తృప్తితో బ్రతకటం, ఇతరుల ముందు చెయ్యి చాపకుండా ఉండటం, ఖర్చుచేయుటంలో మధ్యేమార్గాన్ని అవలంబించటం గురించి……|హదీసు 536

537

హదీసు 537

وعن أبي هريرة رضيَ اللَّه عنه أَنَّ رسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "لَيْسِ المِسْكِينُ الَّذِي يطُوفُ عَلى النَّاسِ تَرُدُّهُ اللُّقْمَةُ واللُّقْمَتانِ، وَالتَّمْرَةُ والتَّمْرتَانِ، وَلَكِنَّ المِسْكِينَ الَّذِي لاَ يجِدُ غِنًى يُغنِيهِ، وَلاَ يُفْطَنُ لَهُ، فَيُتَصدَّقَ عَلَيْهِ، وَلاَ يَقُومُ فَيسْأَلَ النَّاسَ" متفقٌ عليه.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు : ప్రజల దగ్గర ఒకటి రెండు ముద్దలు లేదా ఒకటి రెండు ఖర్జూరపండ్లు అడుక్కుంటూ తిరిగేవాడు నిరుపేద కాడు. సిసలైన నిరుపేద ఎవరంటే, అతని దగ్గర ఇతరుల్ని యాచించకుండా ఉండేందుకు తగిన ఆర్థిక స్తోమత ఉండదు. మరోవైపు ప్రజలు అతనికి దానం చేయాలన్నా అతను పేదవాడిగా కనిపించడు. (తాను ఎంత పేదరికంతో బాధపడుతున్న ప్పటికీ) ఇతరుల ముందు చేయి చాపటానికి సిద్ధపడడు. (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని జకాత్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “A needy person is not the one who goes from door to door, begging and is turned away with a morsel or two or with a date or two. But a needy person is the one who does not have enough to live upon, and neither from his appearance it occurs that he is needy and should be given alms, nor does he himself beg anything from others.”[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|57. ఆత్మ తృప్తితో బ్రతకటం, ఇతరుల ముందు చెయ్యి చాపకుండా ఉండటం, ఖర్చుచేయుటంలో మధ్యేమార్గాన్ని అవలంబించటం గురించి……|హదీసు 537