హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 54వ అధ్యాయం: దైవభీతితో కంటతడిపెట్టటం, దైవాన్ని కలుసుకోవాలని వేగిరపడటం గురించి. ఈ అధ్యాయంలో 2 ఖుర్ఆన్ ఆయతులు, 10 హదీసులు (హదీసు 447 – 456) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
54. దైవభీతితో కంటతడిపెట్టటం, దైవాన్ని కలుసుకోవాలని వేగిరపడటం గురించి….
باب فضل البكاء من خشية الله تَعَالَى وشوقاً إِليه
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ సెలవిచ్చాడు:
{وَيَخِرُّونَ لِلأَذْقَانِ يَبْكُونَ وَيَزِيدُهُمْ خُشُوعاً} [الإسراء:١٠٩]
(విశ్వాసులు) తమ గడ్డాలను నేలకు ఆనించి విలపిస్తూ పడిపోతారు. దానిని (అంటే ఖుర్ఆన్ను) విన్న తరువాత వారి అణకువ మరింత పెరిగిపోతుంది. (బనీ ఇస్రాయీల్ : 109)
మరోచోట ఆయన ఇలా అన్నాడు :
{أَفَمِنْ هَذَا الْحَدِيثِ تَعْجَبُونَ وَتَضْحَكُونَ وَلا تَبْكُونَ} [النجم:٥٩،٦٠]
"మీరు ఖుర్ఆన్ గురించి ఆశ్చర్యపోతున్నారా? ఏడ్వాల్సింది పోయి నవ్వుతున్నారా?" (అన్ నజ్మ్ : 59, 60)
వివరణ
విశ్వాసుల ముందు ఖుర్ఆన్ పారాయణం జరిగినప్పుడు వారు దైవభీతితో కంపించిపోతారు. దైవశిక్ష ప్రస్తావన వినగానే విలపించటం మొదలుపెడతారు. కాని అవిశ్వాసులకు ఖుర్ఆన్ వినిపించినా వారిలో ఎలాంటి ప్రతిస్పందన ఉండదు. పైగా వారు ఖుర్ఆన్ పారాయణాన్ని అపహాస్యం చేస్తారు. ఆటపాటలతో దానిని నిర్లక్ష్యం చేస్తారు. దైవప్రస్తావన వినగానే భయంతో విలపించటం, ఆయన్ని కలుసుకోవాలని తాపత్రయ పడటం విశ్వాసుల లక్షణం.
English
“And they fall down on their faces weeping and it increases their humility.” [Al-Isrā’ 17:109]
“Do you then wonder at this recitation (the Qur’an)? And you laugh at it and weep not”. [An-Najm 53:59–60]
హదీసు 447
وعَن أبي مَسعودٍ، رضي اللَّه عنه. قالَ: قَالَ لي النبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "اقْرَأْ علَّي القُرآنَ"قلتُ: يَا رسُولَ اللَّه، أَقْرَأُ عَلَيْكَ، وَعَلَيْكَ أُنْزِلَ؟، قالَ:"إِني أُحِبُّ أَنْ أَسْمَعَهُ مِنْ غَيْرِي"فقرَأْتُ عَلَيْهِ سورَةَ النِّساء، حَتَّى جِئْتُ إِلى هذِهِ الآية: {فَكَيْفَ إِذا جِئْنا مِنْ كُلِّ أُمَّة بِشَهيد وِجئْنا بِكَ عَلى هَؤلاءِ شَهِيداً} [الآية: ٤١] قَالَ:"حَسْبُكَ الآنَ"فَالْتَفَتَّ إِليْهِ. فَإِذَا عِيْناهُ تَذْرِفانِ. متفقٌ عَلَيْهِ.
హజ్రత్ ఇబ్నె మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) కథనం : ఒకసారి దైవప్రవక్త ﷺ తన ముందు ఖుర్ఆన్ చదివి వినిపించవలసిందిగా నన్ను కోరారు. నేను ఆశ్చర్యపోతూ, "దైవప్రవక్తా! ఖుర్ఆన్ మీపైనే అవతరించింది కదా! అలాంటప్పుడు మీకు నేను ఖురాన్ చదివి వినిపించటమేమిటి?" అని అన్నాను. "నాకు ఇతరుల ద్వారా ఖుర్ఆన్ పారాయణం వినాలనిపిస్తోంది" అని అన్నారు దైవప్రవక్త. అప్పుడు నేను 'నిసా' సూరా పారాయణం మొదలుపెట్టాను. ఆ విధంగా నేను పారాయణం చేస్తూ, "మేము ప్రతి సమాజం నుండి ఒక సాక్షిని తెచ్చి, నిన్ను (అంటే ముహమ్మద్‌ను) వారందరిపై సాక్షిగా నిలబెట్టినప్పుడు వీరి పరిస్థితి ఏమిటి?" అనే వాక్యం దగ్గరికి చేరుకోగానే ఆయన "ఇక చాలు" అన్నారు. నేను తలపైకెత్తి చూస్తే ఆయన కళ్ళు అశ్రుధారలై ప్రవహిస్తున్నాయి." (బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని వ్యాఖ్యానాల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)
English
Ibn Mas`ud (radiyallahu anhu) reported: The Prophet ﷺ said to me: “Recite the Qur’an to me”. I said, “O Messenger of Allah! Shall I recite the Qur’an to you, when it has been revealed to you?” He ﷺ replied, “I love to hear it recited by others”. So I recited to him a portion from Surat An-Nisa’. When I reached the Ayah:
“How (will it be) then, when We bring from each nation a witness and We bring you (O Muhammad ﷺ) as a witness against these people?”. (4:41)
He ﷺ said, “Enough for now”. When I looked at him I saw his eyes were shedding tears.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
దివ్య ఖుర్ఆన్ను పూర్తి ఏకాగ్రతతో, అర్థం చేసుకుంటూ పారాయణం చేసినప్పుడు లేదా విన్నప్పుడు భక్తీ పారవశ్యంతో హృదయం తాదాత్మ్యం చెందుతుంది. సహజంగానే మనిషి కంటతడిపెడతాడు. ఈ లక్షణాలు మనిషిలోని విశ్వాసాన్ని, దైవం పట్ల అతనిలోవున్న భీతిభావాన్ని సూచిస్తాయి. తాము స్వయంగా ఖుర్ఆన్ పారాయణం చేయటంతో పాటు ఇతరుల ద్వారా కూడా వినటం పుణ్యప్రదమన్న సంగతి ఈ హదీసు ద్వారా రూఢీఅవుతోంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|54. దైవభీతితో కంటతడిపెట్టటం, దైవాన్ని కలుసుకోవాలని వేగిరపడటం గురించి….|హదీసు 447
హదీసు 448
وعن أنس، رضي اللَّه عنه، قالَ: خَطَبَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم خُطْبَةً مَا سَمِعْتُ مِثْلَهَا قَطُّ، فقالَ: "لَوْ تعْلمُونَ مَا أَعْلَمُ لَضَحِكْتُمْ قَلِيلاً وَلَبَكَيْتُمْ كَثِيراً "قَالَ: فَغَطَّى أَصْحَابُ رَسُولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم. وُجُوهَهُمْ. ولهمْ خَنِينٌ. متفقٌ عَلَيْهِ. وَسَبَقَ بيَانُهُ في بابِ الخَوفِ.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : ఒకసారి దైవప్రవక్త ﷺ మాకు ఒక ఉపన్యాసమిచ్చారు. అలాంటి ఉపన్యాసం నేనెప్పుడూ వినలేదు. ఆయన ﷺ ఇలా అన్నారు : (ప్రజలారా!) నాకు తెలిసిన విషయాలు గనక మీకు తెలిస్తే మీరు తక్కువగా నవ్వుతారు. ఎక్కువగా ఏడుస్తారు.
ఈ మాట విని ఆయన సహచరులు తమ ముఖాలు కప్పుకున్నారు. ఆ సమయంలో వారు ఏడుస్తున్న శబ్దం వినిపించింది. (బుఖారీ – ముస్లిం)
ఈ హదీసు ఇంతకుముందు 'దైవభీతి' అధ్యాయంలో కూడా వచ్చింది.
English
Anas bin Malik (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ delivered a Khutbah to us the like of which I had never heard from him before. In the course of the Khutbah, he said: “If you knew what I know, you would laugh little and weep much”. Thereupon those present covered their faces and began to sob.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
దైవప్రవక్త ﷺ తన అనుచరులకు హితబోధ చేసినప్పుడు వారు దైవభీతితో విలపించేవారు. దుష్కర్మలు చేస్తే దేవుడు శిక్షిస్తాడని వింటే చాలు భయంతో వణకిపోయేవారు. ఇది దైవం పట్ల వారికున్న భయభక్తులకు అద్దం పడుతోంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|54. దైవభీతితో కంటతడిపెట్టటం, దైవాన్ని కలుసుకోవాలని వేగిరపడటం గురించి….|హదీసు 448
హదీసు 449
وعن أبي هريرةَ، رضي اللَّه عنه، قَالَ: قالَ رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لاَيَلِجُ النَّارَ رَجْلٌ بَكَى مِنْ خَشْيَةِ اللَّه حَتَّى يَعُودَ اللَّبَنُ في الضَّرْع وَلا يَجْتَمعُ غُبَارٌ في سَبِيلِ اللَّه ودُخانُ جَهَنَّمَ "رواه الترمذي وقال: حديثٌ حسنٌ صحيحٌ.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : (పితకబడిన) పాలు తిరిగి పొదుగులోకి వెళ్ళిపోయే వరకూ దైవభీతితో కంటతడిపెట్టినవాడు నరకానికి పోడు. అదేవిధంగా దైవమార్గంలో లేపబడిన దుమ్ముధూళి, నరకధూమంతో కలవదు.
(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి, హసన్ మరియు సహీహ్గా పేర్కొన్నారు)
(సుననె తిర్మిజీలోని జిహాద్ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “One who weeps out of fear of Allah, will not enter the Hell till milk returns back in the udder; and the dust raised on account of fighting in the path of Allah and the smoke of Hell will never exist together”.[At-Tirmidhi].
ముఖ్యాంశాలు
కంట తడిపెట్టేంత దైవభీతి ఉన్న వ్యక్తి ఘోరపాపాలకు ఒడిగట్టటాన్ని ఊహించగలమా? సాధారణంగా అలాంటి వ్యక్తి దేవుని ఆదేశాలను పాటిస్తూ పాపాలకు దూరంగా మసలుకుంటూనే జీవితం గడుపుతాడు. అందుకే పితికినపాలు తిరిగి పొదుగులోకి వెళ్ళిపోవటం ఎంత అసంభవమో అలాంటి మంచివ్యక్తి నరకానికి పోవటం కూడా అంతే అసంభవమని అంటే అది అతిశయోక్తి కాదు.
అదేవిధంగా దైవమార్గంలో పోరాడే యోధునికి కూడా దేవుడు నరకాన్ని నిషిద్ధం చేశాడు. దైవమార్గంలో పోరాడటం వల్ల దుమ్ముధూళి కొట్టుకున్న యోధుని శరీరాన్ని నరకాగ్ని కూడా కాల్చలేదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|54. దైవభీతితో కంటతడిపెట్టటం, దైవాన్ని కలుసుకోవాలని వేగిరపడటం గురించి….|హదీసు 449
హదీసు 450
وعنه قالَ: قالَ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "سَبْعَةٌ يُظِلُّهُمُ اللَّهُ في ظِلِّهِ يَوْمَ لاَ ظِلَّ إلاَّ ظِلُّهُ: إِمامٌ عادِلٌ، وشابٌّ نَشَأَ فِي عِبَادَةِ اللَّه تَعالى. وَرَجُلٌ قَلْبُهُ مُعَلَّق بالمَسَاجِدِ. وَرَجُلانِ تَحَابَّا في اللَّه. اجتَمَعا عَلَيهِ. وتَفَرَّقَا عَلَيهِ، وَرَجَلٌ دَعَتْهُ امْرَأَةٌ ذَاتُ مَنْصِبٍ وَجَمالٍ. فَقَالَ: إِنّي أَخافُ اللَّه. ورَجُلٌ تَصَدَّقَ بِصَدَقَةَ فأَخْفاها حتَّى لاَ تَعْلَمَ شِمالهُ مَا تُنْفِقُ يَمِينهُ. ورَجُلٌ ذَكَرَ اللَّه خالِياً فَفَاضَتْ عَيْنَاهُ" متفقٌ عَلَيْهِ.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు : దేవుని నీడ తప్ప మరెలాంటి నీడ కనబడని (ప్రళయ) దినాన దేవుడు ఏడుగురిని తన (కారుణ్య) ఛాయలో ఉంచుతాడు. ఆ ఏడుగురు : (1) న్యాయంగా పరిపాలించిన పాలకుడు. (2) తన యవ్వనాన్ని దైవారాధనలో గడిపిన యువకుడు. (3) మనసంతా మస్జిద్‌లోనే ఉండే వ్యక్తి. (4) కేవలం దైవ ప్రసన్నత కోసం పరస్పరం ప్రేమించుకునే ఇద్దరు వ్యక్తులు (అలాగే), దైవ ప్రసన్నత ప్రాతిపదికగా పరస్పరం విడిపోయేవారు. (5) అందం, అంతస్థు కలిగి వున్న స్త్రీ చెడు కార్యానికి పిలిస్తే తాను దేవునికి భయపడుతున్నానంటూ ఆమె కోరికను నిరాకరించిన వ్యక్తి. (6) కుడి చేత్తో చేసింది ఎడమచేతికి కూడా తెలియనంత గోప్యంగా దానాలు చేసిన వ్యక్తి. (7) ఏకాంతంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని (ఆయన భీతితో) కన్నీరు కార్చిన వ్యక్తి. (బుఖారీ – ముస్లిం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Seven people Allah will give them His Shade on the Day when there would be no shade but the Shade of His Throne (i.e., on the Day of Resurrection): And they are: a just ruler; a youth who grew up with the worship of Allah; a person whose heart is attached to the mosques, two men who love and meet each other and depart from each other for the sake of Allah; a man whom an extremely beautiful woman seduces (for illicit relation), but he (rejects this offer and) says: `I fear Allah’; a man who gives in charity and conceals it (to such an extent) that the left hand does not know what the right has given; and a man who remembers Allah in solitude and his eyes become tearful”.[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|54. దైవభీతితో కంటతడిపెట్టటం, దైవాన్ని కలుసుకోవాలని వేగిరపడటం గురించి….|హదీసు 450
హదీసు 451
وعَن عبد اللَّه بنِ الشِّخِّير. رضي اللَّه عنه. قَالَ: أَتَيْتُ رسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وَهُو يُصلِّي ولجوْفِهِ أَزِيزٌ كَأَزِيزِ المرْجَلِ مِنَ البُكَاءِ. حديث صحيح رواه أَبو داود. والتِّرمذيُّ في الشَّمائِل بإِسنادٍ صحيحٍ.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ షిఖ్ఖీర్ (రదియల్లాహు అన్హు) కథనం : నేనొకసారి దైవప్రవక్త ﷺ దగ్గరికి వెళ్ళాను. ఆ సమయంలో ఆయన నమాజ్ చేస్తున్నారు. (నమాజ్‌లో) ఆయన ఏడుస్తుంటే పొయ్యిపై ఉంచిన కుండ శబ్దం చేసినట్టు ఆయన రొమ్ము నుండి శబ్దం రాసాగింది.
(ఈ హదీసు ప్రామాణికమైనది, అబూ దావూద్ దీనిని ఉల్లేఖించారు. దీన్నే ఇమామ్ తిర్మిజీ 'షమాయిల్'లో ప్రామాణికమైన ఆధారంతో ఉల్లేఖించారు.)
(సుననె అబూదావూద్‌లోని నమాజ్ ప్రకరణం, సుననె తిర్మిజీలోని "షమాయిలె ముహమ్మదియ్యహ్" ప్రకరణం)
English
`Abdullah bin Ash-Shikhkhir (radiyallahu anhu) reported: I came to Messenger of Allah ﷺ when he was performing prayers. He was sobbing and his chest sounded like a boiling kettle.[Abu Dawud and At-Tirmidhi].
ముఖ్యాంశాలు
ఈ హదీసు ద్వారా దైవప్రవక్త ﷺ నమాజ్ చేస్తున్నప్పుడు దైవభీతితో ఎంతగానో విలపించేవారని తెలుస్తోంది. దైవసన్నిధిలో బాధాతప్త హృదయంతో దేవుణ్ణి వేడుకుంటూ కంటతడిపెట్టడం కూడా మహాభాగ్యమే. ఆ భాగ్యం నికార్సయిన విశ్వాసులకే లభిస్తుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|54. దైవభీతితో కంటతడిపెట్టటం, దైవాన్ని కలుసుకోవాలని వేగిరపడటం గురించి….|హదీసు 451
హదీసు 452
وعن أَنسٍ رضي اللَّه عنه. قالَ: قالَ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، لأَبِيِّ بنِ كَعْبٍ. رضي اللَّه عنه: "إِنَّ اللَّه، عَزَّ وجَلَّ، أَمْرَني أَنْ أَقْرَأَ علَيْكَ: لَمْ يَكُن الَّذِينَ كَفَرُوا"قَالَ: وَسَمَّاني؟ قَالَ:"نَعَمْ"فَبَكى أُبَيٌّ. متفقٌ عَلَيْهِ. وفي رواية: فَجَعَلَ أُبَيٌّ يَبْكي.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : ఓసారి దైవప్రవక్త ﷺ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు)తో, "నేను నీ ముందు 'లమ్యకు నిల్లజీ' సూరా చదివి వినిపించాలని దేవుడు ఆదేశించాడు" అని అన్నారు. 'దేవుడు నా పేరు తీసుకొని మరీ ఆదేశించాడా?' అడిగారు ఉబై బిన్ కాబ్ (ఆశ్చర్యపోతూ). దైవప్రవక్త ﷺ 'ఔను' అని అనగానే ఉబై బిన్ కాబ్ (పట్టరాని నంతోషంతో) ఒక్కసారిగా బావురుమన్నారు. (బుఖారీ – ముస్లిం)
వేరొక ఉల్లేఖనంలో రోదించటం మొదలుపెట్టారు అని ఉంది.
(సహీహ్ బుఖారీలోని మహిమోన్నతుల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)
English
Anas (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said to Ubayy bin Ka`b (radiyallahu anhu), “Allah (SWT) has ordered me to recite to you Surat-Al-Baiyyinah (98): `Those who disbelieve …”
Ubayy (radiyallahu anhu) asked, “Did He name me?” Messenger of Allah ﷺ replied in the affirmative. Whereupon Ubayy (radiyallahu anhu) began to weep.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
- ఈ హదీసు ద్వారా ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) ఘనత, గొప్పదనాలు వెల్లడౌతున్నాయి. ఆయన స్వయంగా ఖుర్ఆన్ సంస్మర్త. ఖుర్ఆన్ను మధురాతిమధురంగా పారాయణం చేసేవారు. ఖుర్ఆన్ విద్యలో అసామాన్య నైపుణ్యం మూలంగానే దేవుడు ఆయనకు అంత గొప్ప స్థానాన్ని ప్రసాదించాడు.
- ఇతరులకు ఖుర్ఆన్ పఠించి వినిపించటం కూడా సున్నత్ (సంప్రదాయం).
- 'జ్ఞానం' విషయంలో వినమ్రత వాంఛనీయమే కాదు, అత్యంత అవసరం కూడా. మహాప్రవక్త ﷺ ద్వారా (ఈ సందర్భంగా) ఈ వినమ్రతే ఉట్టిపడింది. అన్యధా జ్ఞానాహంకారం మహామహులనే నాశనం చేసేస్తుంది.
- సంతోషాతిశయంతో ఆనందభాష్పాలు రాలటం, ఎక్కిఎక్కి ఏడ్వటం సహజ విషయమే. ఆ సంతోషంలో అణకువ, అశక్తత కూడా వెల్లడైతే సుబ్హానల్లాహ్! అంతకన్నా కావలసిందేముంటుందీ?!
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|54. దైవభీతితో కంటతడిపెట్టటం, దైవాన్ని కలుసుకోవాలని వేగిరపడటం గురించి….|హదీసు 452
హదీసు 453
وعنه قالَ: قالَ أَبو بَكْرٍ لعمرَ، رضي اللَّه عنهما. بعدَ وفاةِ رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: انْطَلِقْ بِنا إِلَى أُمِّ أَيمنَ. رضي اللَّه عنها. نَزُورُها كَمَا كَانَ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، يَزُورُهافَلَمَّا انْتَهَيا إِليْها بَكَتْ فقَالا لَهَا: مَا يُبْكِيكِ؟ أَمَا تَعْلَمِينَ أَنَّ مَا عِنْدَ اللَّه تَعَالَى خَيْرٌ لِرَسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، قالَتْ: إِني لاَ أَبْكِي، أَنِّي لأَعْلَمُ أَنَّ مَا عنْدَ اللَّه خَيرٌ لِرَسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، ولكِنِّي أَبْكِي أَنَّ الوَحْيَ قَدِ انْقَطَعَ مِنَ السَّماءِ فَهَيَّجَتْهُما عَلى البُكاءِ، فَجَعَلا يَبْكِيانِ مَعهَا رواهُ مسلم. وقد سبق في بابِ زيارَةِ أَهل الخَيْرِ.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ తదనంతరం ఒకసారి హజ్రత్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) ఉమర్ (రదియల్లాహు అన్హు)తో "ఉమ్మె ఐమన్ (రదియల్లాహు అన్హా) దగ్గరికి పోయి వద్దాం పదండి. దైవప్రవక్త ﷺ ఆమెను పరామర్శించటానికి వెళ్ళినట్లు మనం కూడా వెళదాం" అని అన్నారు. ఆ తరువాత వాళ్ళిద్దరూ కలిసి ఆమె దగ్గరికి వెళ్ళగానే ఆమె ఒక్కసారిగా బావురుమన్నది. "ఏడుస్తావెందుకు? దైవప్రవక్తకు దేవుని దగ్గర (ఇహలోకంలో కంటే) ఎంతో శ్రేష్ఠమైన స్థానం లభిస్తుందని నీకు తెలియదా?"అని వాళ్ళిద్దరూ ఆమెను ఓదార్చారు. అప్పుడు ఆమె, "దైవప్రవక్తకు దేవుని దగ్గర గొప్ప స్థానముందని తెలియక నేను ఏడ్వటం లేదు. ఆకాశం నుండి వహీ (దైవవాణి) అవతరణ ఆగిపోయినందుకు ఏడుస్తున్నాను" అని అన్నారు. ఆ మాట వినగానే వాళ్ళిద్దరికి కూడా ఏడ్పు ఆగలేదు. ఆమెతోపాటు వాళ్ళూ రోదించటం మొదలుపెట్టారు. (ముస్లిం)
(ఈ హదీసు ఇంతకుముందు సజ్జనుల్ని సందర్శించే అధ్యాయంలో కూడా వచ్చింది.)
English
Anas bin Malik (radiyallahu anhu) reported: After the death of Messenger of Allah ﷺ, Abu Bakr said to `Umar (radiyallahu anhuma): “Let us visit Umm Aiman (radiyallahu anhu) as Messenger of Allah ﷺ used to visit her.” As we came to her, she wept. They (Abu Bakr and `Umar (radiyallahu anhuma) said to her, “What makes you weep? Do you not know that what Allah has in store for His Messenger ﷺ is better than (this worldly life)?” She said, “I weep not because I am ignorant of the fact that what is in store for Messenger of Allah ﷺ (in the Hereafter) is better than this world, but I weep because the Revelation has ceased to come.” This reply moved both of them to tears and they began to weep along with her.[Muslim].
ముఖ్యాంశాలు
ఈ హదీసు ద్వారా శుభాలు తొలగిపోయినప్పుడు విలపించటం ధర్మసమ్మతమేనని తెలుస్తోంది. సజ్జనుల ఉనికి ఎంతోమందికి ప్రయోజనకరంగా ఉంటుంది. అటువంటి మహానుభావులు లోకం వదలివెళ్ళిపోయినప్పుడు ప్రజలు సహజంగానే దుఃఖిస్తారు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|54. దైవభీతితో కంటతడిపెట్టటం, దైవాన్ని కలుసుకోవాలని వేగిరపడటం గురించి….|హదీసు 453
హదీసు 454
وعن ابن عَمَر، رضي اللَّه عنهما، قَالَ: "لَمَّا اشْتَدَّ بِرَسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وَجَعُهُ قيلَ لَهُ في الصَّلاَةِ فقال: "مُرُوا أَبا بَكْرِ فَلْيُصَلِّ بالنَّاسِ "فقالتْ عائشةُ، رضي اللَّه عنها: إِنَّ أَبَا بَكْرٍ رَجُلٌ رَقيقٌ إِذا قَرَأَ القُرآنَ غَلَبَهُ البُكاءُ"فقال:"مُرُوهُ فَلْيُصَلِّ". وفي رواية عن عائشةَ، رضي اللَّه عنها، قالَتْ: قلتُ: إِنَّ أَبا بَكْرٍ إِذا قَامَ مقامَكَ لَم يُسْمع النَّاس مِنَ البُكَاءِ. متفقٌ عليه.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ వ్యాధి తీవ్ర రూపం దాల్చినప్పుడు (ప్రజలు సామూహిక) నమాజ్ విషయమై ఆయన్ని ప్రశ్నించారు. అప్పుడు ఆయన "ప్రజలకు సారథ్యం వహించి నమాజ్ చేయించమని అబూబక్ర్‌కు చెప్పండి" అని ఆదేశించారు. అందుకు ఆయిషా (రదియల్లాహు అన్హా) "(దైవప్రవక్తా!) అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) సున్నిత మనస్కులు. (నమాజ్‌లో) ఖుర్ఆన్ పఠించినప్పుడు ఆయన తీవ్రంగా విలపిస్తారు. (కాబట్టి ఈ విషయంలో ఆయన్ని క్షమించండి)" అని విన్నవించుకున్నారు. కాని దైవప్రవక్త ﷺ (ఆమె మాటను నిరాకరిస్తూ) "ఆయనకు నమాజ్ చేయించమని చెప్పండి" అని అన్నారు.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనంలో ఇలా ఉంది : నేను దైవప్రవక్తకు "అబూబక్ర్ మీ స్థానంలో నిలబడితే తీవ్ర దుఃఖానికి లోనయి ప్రజలకు ఖుర్ఆన్ చదివి వినిపించలేరు" అని విన్నవించుకున్నాను. (బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని అజాన్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని నమాజ్ ప్రకరణం)
English
Ibn `Umar (radiyallahu anhuma) reported: When the illness of Messenger of Allah ﷺ became serious, he was asked about the leading of Salat and he said, “Ask Abu Bakr to lead Salat.” Whereupon, `Aishah (radiyallahu anha) said; “Abu Bakr is very tender hearted. He is bound to be overcome by weeping when he recites the Qur’an.” Messenger of Allah ﷺ repeated, “Ask him (Abu Bakr) to lead Salat”.
In another narration: `Aishah (radiyallahu anha) said: “When Abu Bakr stands in your place, he will not be able to recite the Noble Qur’an to the people on account of weeping.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
- ఈ హదీసు ద్వారా హజ్రత్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) వైశిష్ఠ్యం వెల్లడౌతోంది. ఈ వైశిష్ఠ్యం మూలంగానే దైవప్రవక్త సహచరులు ఆయన్ని దైవప్రవక్త ﷺ తదనంతరం తమ 'ఖలీఫా' (నాయకుడి)గా ఎన్నుకున్నారు. ఆ సమయంలో హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) మాట్లాడుతూ, "దైవప్రవక్త ﷺ మన ధర్మం కోసం ఎంపిక చేసిన వ్యక్తినే మనం మన ప్రాపంచిక వ్యవహారాల నాయకుడిగా ఎన్నుకుందాం" అంటూ ప్రజల్లో ఎలుగెత్తి చాటారు.
- దీనిద్వారా దివ్య ఖుర్ఆన్ పారాయణం చేస్తున్నప్పుడు విలపించటం ధర్మసమ్మతమేని తెలుస్తోంది. హజ్రత్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) కూడా దివ్య ఖుర్ఆన్ను పారాయణం చేసినప్పుడు తీవ్రమైన భావోద్వేగానికి లోనయి దుఃఖించేవారు. ఈ లక్షణం ఆయన సంపూర్ణ విశ్వాసానికి ప్రతిబింబం.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|54. దైవభీతితో కంటతడిపెట్టటం, దైవాన్ని కలుసుకోవాలని వేగిరపడటం గురించి….|హదీసు 454
హదీసు 455
وعن إِبراهيمَ بنِ عبدِ الرَّحمنِ بنِ عوفٍ أَنَّ عبدَ الرَّحمنِ بنَ عَوْفٍ، رَضيَ اللَّه عنهُ أُتِيَ بطَعامٍ وكانَ صائِماً، فقالَ: قُتِلَ مُصْعَبُ بنُ عُمَيرٍ، رضيَ اللَّه عنه، وهُوَ خَيْرٌ مِنِّي، فَلَمْ يُوجَدْ لَه مَا يُكَفَّنُ فيهِ إِلاَّ بُرْدَةٌ إِنْ غُطِّي بِها رَأْسُهُ بَدَتْ رِجْلاُه، وإِنْ غُطِّيَ بِهَا رِجْلاه بَدَا رأْسُهُ، ثُمَّ بُسِطَ لَنَا مِنَ الدُّنْيَا مَا بُسِطَ أَوْ قالَ: أُعْطِينَا مِنَ الدُّنْيا مَا أُعْطِينَا وقَدْ خَشِينَا أَنْ تَكُونَ حَسَنَاتُنا عُجِّلَتْ لَنا. ثُمَّ جَعَلَ يبْكي حَتَّى تَرَكَ الطَّعامَ. رواهُ البخاري.
హజ్రత్ ఇబ్రాహీం బిన్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రహిమహుల్లాహ్) కథనం: ఓసారి అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు) ఉపవాసంలో ఉన్నప్పుడు (ఇఫ్తార్ వేళ) ఆయనకు అన్నం వడ్డించబడింది. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ముస్‌అబ్ బిన్ ఉమైర్" అమరగతులయ్యారు. ఆయన నాకన్నా గొప్పవారు. ఆయన అంత్యక్రియలు జరిపినప్పుడు (తన దగ్గర) ఒక దుప్పటి మాత్రమే ఉంది. (అది కూడా ఎంత చిన్నదంటే) దాంతో ఆయన ముఖాన్ని కప్పితే ఆయన కాళ్లు బయటికి కనిపించేవి. కాళ్లను కప్పితే ముఖంపై ఆచ్ఛాదనం ఉండేది కాదు. ఆ తరువాత మాకు ఎంత సమృద్ధిగా ప్రాపంచిక సిరిసంపదలు వొసగబడ్డాయో మీరు చూస్తున్నారుగా! (లేక) దేవుడు ఎంత ఎక్కువగా సిరిసంపదలు ప్రసాదించాడో కనబడుతూనే ఉంది. కాని ఈ సిరిసంపదలు చూస్తుంటే మనం చేసుకున్న పుణ్యకార్యాలకు ప్రతిఫలం ప్రపంచంలోనే ఇవ్వబడుతుందేమోనని పిస్తోంది" అని చెప్పి అన్నం కూడా తినకుండా రోదించటం మొదలు పెట్టారు. (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని జనాయెజ్ ప్రకరణం)
English
Ibrahim bin `Abdur-Rahman bin `Auf reported: Food was brought to `Abdur-Rahman bin `Auf (radiyallahu anhu) when he was observing Saum (fast) and he said: “Mus`ab bin `Umair (radiyallahu anhu) was martyred and he was better than me, but only one sheet was available to shroud him. It was so small that when his head was covered; his feet remained uncovered and if his feet were covered, his head remained uncovered. Then the bounties of this world have been bestowed upon us generously. I am afraid that the reward of our good deeds have been awarded to us in this world.” On this he began to sob and left the food untouched.[Al-Bukhari].
ముఖ్యాంశాలు
దైవప్రవక్త సహచరులు ఒండొకరి గొప్పదనాన్ని గుర్తించి గౌరవించేవారు. ఇహలోకంలోనే స్వర్గసుఖాల శుభవార్త వినిపించబడిన పదిమందిలో హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు) కూడా ఉన్నారు. ఆ విధంగా చూస్తే ముస్‌అబ్ బిన్ ఉమైర్ (రదియల్లాహు అన్హు)కన్నా అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫే గొప్పవారు. కానీ ఆయన ముస్‌అబ్ (రదియల్లాహు అన్హు) వీర మరణాన్నీ, ఆయన గడిపిన నిరుపేద జీవితాన్ని తలచుకొని తనకంటే ముస్‌అబ్ బిన్ ఉమైరే గొప్పవారని చెప్పేవారు.
రెండో విషయం ఏమిటంటే, దైవప్రవక్త సహచరులు ప్రాపంచిక సిరిసంపదలకు దూరంగా ఉండేవారు. అవిశ్వాసులకు ఇచ్చినట్లు దేవుడు తమ సత్కార్యాలకు కూడా ఇహలోకంలోనే ప్రతిఫలాన్ని ప్రసాదిస్తున్నాడేమోనని తల్లడిల్లేవారు. మరి చూడబోతే వారు తాము సంపాదించిన ధనాన్నంతటినీ తిరిగి దైవమార్గంలోనే ఖర్చుపెట్టేవారు. అయినప్పటికీ ప్రాపంచిక ఐశ్వర్యాలు తమల్ని వినాశానికి గురి చేస్తాయేమోనని ఆందోళన చెందేవారు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|54. దైవభీతితో కంటతడిపెట్టటం, దైవాన్ని కలుసుకోవాలని వేగిరపడటం గురించి….|హదీసు 455
హదీసు 456
وعن أَبي أُمامة صُدَيِّ بْنِ عَجلانَ الباهِليِّ، رضيَ اللَّه عنه، عن النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ:"لَيْسَ شَيءٌ أَحَبَّ إِلى اللَّه تَعَالَى مِنْ قَطْرَتَين. وأَثَرَيْنِ: قَطْرَةُ دُمُوعٍ مِنْ خَشيَةِ اللَّه وَقَطرَةُ دَمٍ تُهرَاقُ في سَبِيلِ اللَّه تعالى، وَأَمَّا الأَثَرَانِ فَأَثَرٌ في سَبيلِ اللهِ تَعَالَى وَأَثَرٌ في فَرِيضَةٍ منْ فَرَائِضِ اللَّه تَعَالَى "رواه الترمذي وقال: حديثٌ حسنٌ. وفي البابِ أحاديثُ كثيرةٌ، منها:
హజ్రత్ అబూ ఉమామా సుదై బిన్ అజ్లాన్ బాహిలీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: దేవునికి రెండు బొట్లు, రెండు మచ్చల కన్నా ఎక్కువ ప్రియమైన వస్తువు మరేదీ లేదు. ఒకటి దైవభీతి మూలంగా రాలిన కన్నీటి బొట్టు, రెండు దైవమార్గంలో (పోరాడినప్పుడు) చిందే రక్తపు బొట్టు. ఇకపోతే రెండు మచ్చల్లో ఒకటి దైవమార్గంలో పోరాడినప్పుడు (కలిగిన గాయం వల్ల) ఏర్పడిన మచ్చ. రెండోది: ఏదయినా దైవవిధిని నిర్వర్తించినప్పుడు కలిగిన మచ్చ.
(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హసన్‌గా పేర్కొన్నారు).
(సుననె తిర్మిజీలోని జిహాద్ ప్రకరణం)
ఈ అధ్యాయం క్రింద ఇంకా అనేక హదీసులున్నాయి. వాటిలో ఇర్బాజ్ బిన్ సారియా (రదియల్లాహు అన్హు) హదీసు కూడా ఒకటి. అందులో ఆయన ఇలా తెలియజేశారు : దైవప్రవక్త ﷺ ఓసారి మాకు హితబోధ చేశారు. దాంతో మా హృదయాలు కంపించాయి. కళ్ళవెంబడి అశ్రుధారలు ప్రవహించాయి.
English
Abu Umamah Sudaiy bin `Ajlan Al-Bahili (radiyallahu anhu) reported: The Prophet ﷺ said: “Nothing is dearer to Allah than two drops and two marks: A drop of tears shed out of fear of Allah and a drop of blood shed in Allah’s way. Regarding the two marks, they are: Marks left in the Cause of Allah and a mark left in observing one of the obligatory act of worship of Allah, the Exalted”.[At-Tirmidhi].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|54. దైవభీతితో కంటతడిపెట్టటం, దైవాన్ని కలుసుకోవాలని వేగిరపడటం గురించి….|హదీసు 456
You must be logged in to post a comment.