హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 49. బాహ్యాచరణల్ని బట్టి వ్యవహరించాలి

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 49వ అధ్యాయం: ప్రజలతో వారి బాహ్యాచరణల్ని బట్టి వ్యవహరించాలి, వారి ఆంతరంగిక వ్యవహారాలు దేవుడు చూసుకుంటాడు. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 6 హదీసులు (హదీసు 391 – 396) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

49. ప్రజలతో వారి బాహ్యాచరణల్ని బట్టి వ్యవహరించాలి, వారి ఆంతరంగిక వ్యవహారాలు దేవుడు చూసుకుంటాడు

↑ విషయ సూచిక

باب إجراء أحكام الناس على الظاهروسرائرهم إِلَى الله تَعَالَى

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిస్తున్నాడు:

{فَإِنْ تَابُوا وَأَقَامُوا الصَّلاةَ وَآتَوُا الزَّكَاةَ فَخَلُّوا سَبِيلَهُمْ} [التوبة:٥]

"ఒకవేళ వారు (దైవతిరస్కారులు, బహుదైవారాధకులు) పశ్చాత్తాపపడితే, నమాజు స్థాపిస్తే, జకాత్ ఇస్తే ఇక వారి మానాన వారిని వదలిపెట్టండి." (అత్ తౌబా : 5)

వివరణ

అవిశ్వాసులెవరైనా తాము గతంలో చేసిన దైవతిరస్కారానికి, బహుదైవారాధనకు పశ్చాత్తాప భావంతో కుమిలిపోతూ ఇస్లాం స్వీకరించి, నమాజ్, జకాత్, ఉపవాసాలు మొదలగు ఇస్లామీయ ఆదేశాల్ని ఆచరించటం మొదలుపెడితే ఇక వారి ధనమాన ప్రాణాలను కాపాడటం తోటి ముస్లింల బాధ్యతగా పరిగణించబడుతుంది. ఒకవేళ వారి విశ్వాసంలో కాపట్యమున్నా లేదా స్వార్థ ప్రయోజనాల కోసం ఇస్లాం స్వీకరించినా పైకి వారు నమాజ్, జకాత్ లాంటి విధులు నిర్వర్తిస్తూ ఉన్నంత కాలం వారిని ముస్లింలుగానే పరిగణించాలి. ఇతర ముస్లింల మాదిరిగా వారి ధనప్రాణాలకూ ఇస్లామీయ రాజ్యంలో రక్షణ కల్పించాలి. ఇస్లాం ధర్మం ప్రజలతో వారి బాహ్య ఆచరణల్ని బట్టి వ్యవహరించమని ఆదేశిస్తోంది. కనుక ఒక వ్యక్తిలో కాపట్యం, అవిశ్వాసం స్పష్టంగా బహిర్గతం కానంతవరకూ అతన్ని కపటిగా, అవిశ్వాసిగా ఖరారు చేయటం తగదు. ఎవరి మనసులో ఏముందో ఎవరు తొంగిచూడగలరు? కనుక వారి అంతర్గత వ్యవహారాన్ని దైవానికి వదలిపెట్టాలి. ఆ విషయాన్ని దేవుడు చూసుకుంటాడు.

అయితే ఎవరైనా నోటితో తాము ఇస్లాం స్వీకరించామని చెప్పి, ధర్మంలోని మౌలిక విషయాలను విశ్వసించటానికి నిరాకరిస్తే మాత్రం వారు ముస్లింలుగా పరిగణించబడటానికి అర్హులు కారు. ఉదాహరణకు దైవప్రవక్త ﷺ అంతిమ ప్రవక్త అనీ, ఆయనతో ప్రవక్తల పరంపర సమాప్తమయిపోయిందన్నది ఇస్లాం ధర్మంలోని ప్రధానాంశం. దీనిని అంగీకరించకపోతే మొత్తం ధర్మాన్నే తిరస్కరించినట్లవుతుంది. ఇలాంటి వారికి ఇస్లాంలో ఎలాంటి స్థానం లేదు. ఇంకా చెప్పాలంటే వీరిని ధర్మభ్రష్టులుగా, మార్గవిహీనులుగా పరిగణించాలి.

English

“But if they repent and perform As-Salat (Iqamat-As-Salat), and give Zakat, then leave their way free. Verily, Allah is Oft-Forgiving, Most Merciful.” [At-Tawbah 9:5]

391

హదీసు 391

وعن ابن عمر رضي اللَّه عنهما، أَن رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "أُمِرْتُ أَنْ أُقَاتِلَ النَّاسَ حَتَّى يَشْهَدُوا أَنْ لا إِلهَ إِلاَّ اللَّه، وَأَنَّ مُحَمَّداً رسولُ اللَّهِ، ويُقِيمُوا الصَّلاةَ، وَيُؤتوا الزَّكاةَ، فَإِذَا فَعَلُوا ذلكَ، عَصمُوا مِنِّي دِماءَهُمْ وَأَمْوالَهُمْ إِلاَّ بِحَقِّ الإِسْلامِ، وحِسابُهُمْ عَلى اللَّه تَعَالَى" متفقٌ عَلَيهِ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : "అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడనీ, ముహమ్మద్ ﷺ దైవప్రవక్త అనీ ప్రజలు సాక్ష్యం ఇవ్వనంతవరకూ, (ఆ తరువాత) నమాజ్ స్థాపించి, జకాత్ దానం చెల్లించనంతవరకూ వారితో యుద్ధం చేస్తూ ఉండాలని నాకు ఆదేశ మయింది. వారు ఈ విధులు నెరవేరిస్తే ఇస్లామీయ చట్టాలకు అనుగుణంగా వారి ధనప్రాణాలకు నా నుండి రక్షణ ఉంటుంది. (ఇస్లామీయ చట్టాలకు అనుగుణంగా అంటే వారు ఎవరినన్నా అన్యాయంగా హత్య చేస్తే దానికి ప్రతిగా వారికి కూడా మరణదండన ఉంటుంది). ఆ తరువాత వారి (అంతర్గత వ్యవహారాల) లెక్కను దేవుడు చూసుకుంటాడు."

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లింలలోని విశ్వాస ప్రకరణాలు)

English

`Abdullah bin `Umar (radiyallahu anhuma) reported: Messenger of Allah ﷺ said, “I have been commanded (by Allah) to fight people until they testify that there is no true god except Allah, and that Muhammad is the Messenger of Allah, and perform Salat and pay Zakat. If they do so, they will have protection of their blood and property from me except when justified by Islam, and then account is left to Allah”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఇస్లాంలో జిహాద్ లక్ష్యం – ఈ ధరిత్రిని దైవతిరస్కార మాలిన్యం నుంచి, బహుదైవత్వ పోకడల నుంచి ప్రక్షాళనం చేయటం. లోకం నుండి అన్యాయాన్ని, అక్రమాలను, దౌర్జన్యాలను పారద్రోలటం. ఈ ఆశయ సిద్ధికోసం ఇస్లాం ధర్మం సదా కృషి చేస్తూ ఉంటుంది. ఈ సమున్నత లక్ష్యం పూర్తిగా నెరవేరనంతవరకు లోకంలో జిహాద్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. అందుకే ఒక హదీసులో జిహాద్ ప్రళయం వరకు కొనసాగుతుందని చెప్పబడింది. పై హదీసులో 'ప్రజలు' అంటే బహుదైవారాధకులు, విగ్రహ పూజారులని అర్థం చేసుకోవాలి.

ఇస్లాం స్వీకరించే ప్రజల ధనప్రాణాలకు ఇస్లామీయ రాజ్యం రక్షణ కల్పిస్తుంది. వారి సిరిసంపదలకు, ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా కాపాడుతుంది. అయితే ఇతర ముస్లింలలాగానే క్రొత్తగా విశ్వసించిన వారు కూడా తమ ధనంలో నుండి జకాత్ దానం చెల్లించవలసి ఉంటుంది. వాళ్ళలో ఎవరైనా హత్యకు పాల్పడితే ఇస్లామీయ రాజ్యం హంతకులకు మరణశిక్ష విధిస్తుంది. ఇస్లామీయ చట్టాలు వీరందరికీ సమానంగా వర్తిస్తాయి.

ఇకపోతే ఈ హదీసులో వివరించబడిన ఆఖరి విషయం – క్రొత్తగా ఇస్లాం స్వీకరించే ప్రజలతో, వారి బాహ్య ఆచరణలకు అనుగుణంగానే వ్యవహరించాలి. వారి ఆంతరంగిక విషయాలను త్రవ్వి చూడాల్సిన అవసరం లేదు. వారి అవిశ్వాసం స్పష్టంగా బహిర్గతం కానంతవరకు వారికి ఎలాంటి హాని తలపెట్టరాదు. వారి మనోమయ వ్యవహారాలను గురించి దైవానికి నివేదించుకోవాలి. దైవానికి నివేదించుకోవటమంటే, ప్రళయదినాన దేవుడు వారి విషయంలో సరైన తీర్పు ఇస్తాడు. వారి రహస్య వ్యవహారాల గురించి ఇతర ముస్లింలను ప్రశ్నించటం జరగదు. ఈ ఆఖరి విషయాన్ని బోధించటం కోసమే గ్రంథకర్త ఈ హదీసును సదరు అధ్యాయం క్రింద ప్రస్తావించారు. దీని ప్రకారం ఒకే దేవుణ్ణి ఆరాధిస్తూ ధర్మంలో అనాచారాలకు పాల్పడే ముస్లింలను అవిశ్వాసులనటం భావ్యం కాదని పండితులు అంటున్నారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|49. ప్రజలతో వారి బాహ్యాచరణల్ని బట్టి వ్యవహరించాలి, వారి ఆంతరంగిక వ్యవహారాలు దేవుడు చూసుకుంటాడు|హదీసు 391

392

హదీసు 392

وعن أَبي عبدِ اللَّه طَارِقِ بن أُشَيْمٍ، رضي اللَّه عنه، قَالَ: سمعتُ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَقُولُ: "مَنْ قالَ لاَ إِلهَ إِلاَّ اللَّهُ، وَكَفَرَ بِما يُعْبَدُ مِنْ دُونِ اللَّهِ، حَرُمَ مالُهُ وَدَمُهُ، وَحِسابُهُ عَلَى اللَّه تَعَالَى" رواه مسلم.

దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూ అబ్దుల్లాహ్ తారిఖ్ బిన్ అష్యమ్ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు : అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడులేడని ప్రకటించి, అల్లాహ్‌ను త్రోసిరాజని పూజించబడే ఇతర ఆరాధ్యవస్తువులను తిరస్కరించిన వ్యక్తి ధనప్రాణాలు (ఇతరుల కోసం) నిషిద్ధం అయిపోతాయి. అతని (లోపలి) వ్యవహారాన్ని దేవుడు చూసుకుంటాడు.

(ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణం)

English

Abu Abdullah bin Tariq bin Ashyam (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “He who professes La ilaha illallah (There is no true god except Allah), and denies of everything which the people worship besides Allah, his property and blood become inviolable, and it is for Allah to call him to account”.[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|49. ప్రజలతో వారి బాహ్యాచరణల్ని బట్టి వ్యవహరించాలి, వారి ఆంతరంగిక వ్యవహారాలు దేవుడు చూసుకుంటాడు|హదీసు 392

393

హదీసు 393

وعن أَبي مَعْبدٍ المقْدَادِ بنِ الأَسْوَدِ، رضي اللَّه عنه، قَالَ: قُلْتُ لرِسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: أَرَأَيْتَ إِنْ لَقيتُ رَجُلاً مِنَ الكُفَّارِ، فَاقْتَتَلْنَا، فَضَرَبَ إِحْدَى يَدَيَّ بِالسَّيْفِ، فَقَطَعهَا ثُمَّ لاذَ مِنِّي بِشَجَرَةٍ، فَقَالَ: أَسْلَمْتُ للَّهِ، أَأَقْتُلُهُ يَا رسولَ اللَّه بَعْدَ أَنْ قَالَها؟ فَقَالَ:"لا تَقْتُلْهُ"، فَقُلْتُ يَا رسُولَ اللَّهِ قطعَ إِحدَى يَدَيَّ، ثُمَّ قَالَ ذلكَ بَعْدَما قَطعَها؟ فَقَالَ: "لا تَقْتُلْهُ، فِإِنْ قَتَلْتَهُ، فَإِنَّهُ بِمنَزِلَتِكَ قَبْلَ أنْ تَقْتُلَهُ. وَإِنَّكَ بِمَنْزِلَتِهِ قَبْلَ أَنْ يَقُولَ كَلِمَتَهُ التي قَالَ" متفقٌ عَلَيهِ. ومعنى"إِنَّهُ بِمَنْزِلَتِك"أَيْ: مَعْصُومُ الدَّمِ مَحْكُومٌ بِإِسْلامِهِ، ومعنى"إنَّكَ بِمَنْزِلَته"أَيْ: مُبَاحُ الدَّمِ بِالْقِصَاص لِوَرَثَتِهِ، لا أَنَّهُ بِمَنْزِلَتِهِ في الْكُفْرِ، واللَّه أعلم.

హజ్రత్ అబూ మాబద్ మిఖ్దాద్ బిన్ అస్వద్ (రదియల్లాహు అన్హు) కథనం : ఒకసారి నేను దైవప్రవక్తతో మాట్లాడుతూ, "యుద్ధరంగంలో నాకు ఏ అవిశ్వాసి అయినా ఎదురై మేమిద్దరం పరస్పరం తలపడి పోరాడుకుంటున్నప్పుడు, అతను తన ఖడ్గంతో నా చేయినొకదాన్ని నరికి ఆ తరువాత వెంటనే ఏదో ఒక చెట్టుచాటుకెళ్ళి 'నేను దేవుణ్ణి విశ్వసించాను' అని అన్నాడనుకోండి. అలాంటి వ్యక్తిని నేను హతమార్చవచ్చా?" అని అడిగాను. అందుకాయన ﷺ, "అలాంటి వ్యక్తిని హతమార్చకూడదు" అని అన్నారు. "దైవప్రవక్తా! అతను నా చేయి ఒకటి నరికిన తరువాత కదా అతను ఈ మాట అన్నది!" అని నేను సందేహపడగా, "లేదు, నువ్వతన్ని హతమార్చకూడదు. నువ్వు గనక అతన్ని హతమారిస్తే దానికి పూర్వం నువ్వున్న స్థానంలో అతనుంటాడు. అలాగే ఆ మాట అనకముందు అతనున్న స్థానంలో నువ్వుంటావు" అని హెచ్చరించారు దైవప్రవక్త ﷺ.

(బుఖారీ – ముస్లిం)

అతను నువ్వున్న స్థానంలో ఉంటాడంటే, అతని ప్రాణానికి రక్షణ ఏర్పడుతుంది. అతను ముస్లింగా పరిగణించబడతాడని అర్థం. అలాగే నువ్వు అతని స్థానంలో ఉంటావంటే, నీ హత్యకు ప్రతిహత్యగా అతని వారసులు నిన్ను హతమార్చవచ్చని అర్థం. అంతేగాని నువ్వు అవిశ్వాసివి అవుతావని అర్థం మాత్రం కాదు.

(సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణం)

English

Al-Miqdad bin Al-Aswad (radiyallahu anhu) reported: I said, “Tell me, O Messenger of Allah, if I meet an infidel, and we fight together, and he cuts off my hands with his sword, then hides from me behind a tree and (then) says he has submitted himself to Allah. Shall I kill him after he has said it?” He ﷺ replied, “Do not kill him.” I submitted, “But O Messenger of Allah, he cut off one of my hands and only then he said it.” Messenger of Allah ﷺ then replied, “Do not kill him, for if you do so, he will be in the position in which you were before you killed him (i.e., he will be considered a Muslim and thus his life will be inviolable), and you will be in the position in which he was before he made his testimony (i.e., your life will not be inviolable, for his heirs can ask for Qisas)”.[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|49. ప్రజలతో వారి బాహ్యాచరణల్ని బట్టి వ్యవహరించాలి, వారి ఆంతరంగిక వ్యవహారాలు దేవుడు చూసుకుంటాడు|హదీసు 393

394

హదీసు 394

وعن أُسامةَ بنِ زَيْدٍ، رضي اللَّه عنهما، قَالَ: بعثَنَا رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم إِلَى الحُرَقَةِ مِنْ جُهَيْنَةَ، فَصَبَّحْنا الْقَوْمَ عَلى مِياهِهمْ، وَلحِقْتُ أَنَا وَرَجُلٌ مِنَ الأَنْصَارِ رَجُلاً مِنهُمْ فَلَمَّا غَشِيناهُ قَالَ: لاَ إِلهِ إلاَّ اللَّه، فَكَفَّ عَنْهُ الأَنْصارِيُّ، وَطَعَنْتُهُ بِرْمِحِي حَتَّى قَتَلْتُهُ، فَلَمَّا قَدِمْنَا المَدينَةَ، بلَغَ ذلِكَ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَقَالَ لِي: "يَا أُسامةُ أَقَتَلْتَهُ بَعْدَ مَا قَالَ: لا إِلهَ إِلاَّ اللَّهُ؟ قلتُ: يَا رسولَ اللَّه إِنَّمَا كَانَ مُتَعَوِّذاً، فَقَالَ:"أَقًتَلْتَهُ بَعْدَ مَا قَالَ لا إِلهَ إِلاَّ اللَّهُ؟،" فَما زَالَ يُكَرِّرُهَا عَلَيَّ حَتَّى تَمنَّيْتُ أَنِّي لَمْ أَكُنْ أَسْلَمْتُ قَبْلَ ذلِكَ الْيَوْمِ. متفقٌ عَلَيهِ. وفي روايةٍ: فَقالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "أَقَالَ: لا إِلهَ إِلاَّ اللَّهُ وَقَتَلْتَهُ؟، قلتُ: يَا رسولَ اللَّهِ، إِنَّمَا قَالَهَا خَوْفاً مِنَ السِّلاحِ، قَالَ:"أَفَلا شَقَقْتَ عَنْ قَلْبِهِ حَتَّى تَعْلَمَ أَقَالَهَا أَمْ لا؟، "فَمَا زَالَ يُكَرِّرُهَا حَتَّى تَمَنَّيْتُ أَنِّي أَسْلَمْتُ يَؤْمئذٍ. "الحُرَقَةُ"بضم الحاءِ المهملة وفتح الراءِ: بَطْنٌ مِنْ جُهَيْنَةَ القَبِيلةُ المَعْرُوفَةُ، وقوله مُتَعَوِّذاً: أيْ مُعْتَصِماً بِهَا مِنَ القَتْلِ لاَ معْتَقِداً لَهَا.

హజ్రత్ ఒసామా బిన్ జైద్ కథనం: దైవప్రవక్త ﷺ ఓసారి మమ్మల్ని జుహైనా తెగకు ఉప తెగ అయిన హుర్ఖా వారి వైపు (యుద్ధానికి) పంపించారు. (మరునాడు) ఉదయాన్నే మేము వారి నీటి కొలనులపై దాడిచేశాము. యుద్ధం జరుగుతున్నప్పుడు నేను మరియు ఒక అన్సార్ వ్యక్తి ఇద్దరం కలిసి ఒక అవిశ్వాసితో పోరాడుతూ అతన్ని చుట్టుముట్టాము. అదే సమయంలో అతను "అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యదేవుడు లేడు" అని అన్నాడు. ఆ మాట వినగానే (నా సహచరుడైన) అన్సార్ వ్యక్తి అతన్ని వదిలేశాడు. కాని నేను మాత్రం నా (చేతిలో వున్న) ఈటెను విసిరి అతన్ని హతమార్చాను.

మేము మదీనాకు తిరిగి వచ్చిన తరువాత దైవప్రవక్త ﷺకు ఈ విషయం తెలిసిపోయింది. "ఒసామా! అతను అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని పలికిన తరువాత కూడా నువ్వతడ్ని వధించావా?" అని ఆయన నన్ను అడిగారు. అందుకు నేను "అతను ప్రాణం కాపాడుకోవటానికే అలా అన్నాడు దైవప్రవక్తా!" అని సంజాయిషీ చెప్పుకున్నాను. కాని ఆయన మళ్ళీ అదే విషయాన్ని ప్రస్తావిస్తూ, "ఒసామా! అతడు అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని అన్న తరువాత కూడా నువ్వతడ్ని వధించావా?" అని నిలదీశారు. ఆ తరువాత కూడా ఆయన మాటిమాటికీ అదే ప్రశ్న వేయటం మొదలెట్టారు. దాంతో (నాకు భయం పుట్టుకొచ్చి) నేను ఆ రోజు వరకు అసలు ముస్లిం అయి ఉండకపోతే బావుండేది కదా! (నా వల్ల ఈ తప్పు జరగకుండా ఉండేది) అని అనుకున్నాను. (బుఖారీ – ముస్లిం)

హుర్ఖా అరబ్బులో ప్రసిద్ధిచెందిన తెగ. ఇది జుహైనా తెగలో ఒక శాఖ. 'ముఅవ్విజన్' అంటే దైవంపై విశ్వాసంతో కాదు, చంపకుండా ఉండటానికి మాత్రమే అతనలా అన్నాడని అర్థం.

(సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణం)

English

Usamah bin Zaid (radiyallahu anhuma) reported: Messenger of Allah ﷺ sent us to Huraqat, a tribe of Juhainah. We attacked that tribe early in the morning and defeated them, (then) a man from the Ansar and I caught hold of a man (of the defeated tribe). When we overcame him, he said: `La ilaha illallah (There is no true god except Allah).’ At that moment, the Ansari spared him, but I attacked him with my spear and killed him. By the time we went back to Al-Madinah, news had already reached Messenger of Allah ﷺ. He said to me, “O Usamah, did you kill him after he professed La ilaha illallah (There is no true god except Allah)?’‘ I said, “O Messenger of Allah! He professed it only to save his life.” Messenger of Allah ﷺ repeated, “Did you kill him after he had professed La ilaha illallah?” He went on repeating this to me until I wished I had not embraced Islam before that day (so that I would have not committed this sin).[Al-Bukhari and Muslim].

Another narration is: Messenger of Allah ﷺ said, “Did you kill him in spite of his professing La ilaha illallah?” I said, “O Messenger of Allah! He said out of fear of our arms.” He ﷺ said, “Why did you not cut his heart open to find out whether he had done so sincerely or not?” He continued repeating it until I wished that I had embraced Islam only that day.

ముఖ్యాంశాలు

తోటి ముస్లింల పట్ల వారి బాహ్యాచరణల ఆధారంగానే వ్యవహరించాలని ఈ హదీసు కూడా నొక్కి వక్కాణిస్తోంది. బాహ్య ఆచరణల ఆధారంగా వ్యవహరించే విధానం ముస్లిం సమాజానికి అన్ని విధాలా మేలైనది. ఇది ప్రజల ప్రతీకార చర్యలకు అడ్డుకట్ట వేస్తుంది. లేకపోతే ప్రతి వ్యక్తీ ప్రత్యర్థిని ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశ్యంతో హత్యచేసి ఆనక 'ప్రాణరక్షణ కోసమే అతను ఇస్లాం స్వీకరించాడ'ని చెప్పే ప్రమాదముంది. అందుకే ఇలాంటి ప్రతీకార చర్యలకు ఆస్కారం లేకుండా ఆదిలోనే అడ్డుకట్ట వేయటం జరిగింది. తోటి ముస్లింల లోపలి వ్యవహారాల్ని త్రవ్వి చూడటం, కూపీలు లాగడం వ్యర్థమైన పని కాకపోతే మరేమిటి?

ఇకపోతే హజ్రత్ ఒసామా (రదియల్లాహు అన్హు) చేసిన హత్యా నేరానికి ఆయన్నుండి ప్రతీకారం తీర్చుకోకపోవటానికి కారణం ఏమిటంటే ఆయన ఉద్దేశ్యపూర్వకంగా ఆ వ్యక్తిని చంపలేదు. ప్రాణరక్షణ కోసం నోటిమాటల ద్వారా విశ్వాసం ప్రకటించేవారిని వధించవచ్చని ఆయన అనుకున్నారు. ఆ విధంగా పొరపాటుగా ఆయన వల్ల ఈ హత్య జరిగింది. అయితే ఇలాంటి సందర్భంలోనూ హంతకుడు హతుని వారసులకు రక్తపరిహారం (దియత్) చెల్లించవలసి ఉంటుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|49. ప్రజలతో వారి బాహ్యాచరణల్ని బట్టి వ్యవహరించాలి, వారి ఆంతరంగిక వ్యవహారాలు దేవుడు చూసుకుంటాడు|హదీసు 394

395

హదీసు 395

وعن جُنْدبِ بنِ عبد اللَّه، رضي اللَّه عنه، أَنَّ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم بعثَ بعْثاً مِنَ المُسْلِمِينَ إِلى قَوْمٍ مِنَ المُشْرِكِينَ، وَأَنَّهُمْ الْتَقَوْا، فَكَانَ رَجُلٌ مِنَ المُشْرِكِينَ إِذا شَاءَ أَنْ يَقْصِدَ إِلى رَجُلٍ مِنَ المُسْلِمِينَ قَصَدَ لَهُ فَقَتَلَهُ، وَأَنَّ رَجُلاً مِنَ المُسْلِمِينَ قَصَدَ فقتلَهُ، وَكُنَّا نَتَحَدَّثُ أَنَّهُ أُسَامَةُ بْنُ زَيْدٍ فَلمَّا رَفَعَ عَلَيهِ السَّيْفَ، قَالَ: لا إِله إِلاَّ اللَّهُ، فقَتَلَهُ، فَجَاءَ الْبَشِيرُ إِلى رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَسَأَلَهُ، وأَخْبَرَهُ، حَتَّى أَخْبَرَهُ خَبَر الرَّجُلِ كَيْفَ صنَعَ، فَدَعَاهُ فَسَأَلَهُ، فَقَالَ:"لِمَ قَتَلْتَهُ؟ "فَقَالَ: يَا رسولَ اللَّهِ أَوْجَعَ في المُسْلِمِينَ، وقَتلَ فُلاناً وفُلاناً وسَمَّى لَهُ نَفراً وإِنِّي حَمَلتْ عَلَيْهِ، فَلَمَّا رَأَى السَّيْفَ قَالَ: لا إِله إِلاَّ اللَّهُ. قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"أَقَتَلْتَهُ؟ "قَالَ: نَعمْ، قَالَ:"فَكيْفَ تَصْنَعُ بلاَ إِله إِلاَّ اللَّهُ، إِذا جاءَت يوْمَ القيامَةِ؟ "قَال يَا رسولَ اللَّه اسْتَغْفِرْ لِي. قَالَ:"وكيفْ تَصْنَعُ بِلا إِله إِلاَّ اللَّهُ، إِذا جاءَت يَوْمَ القِيامَةِ؟ "فَجَعَلَ لاَ يَزيدُ عَلى أَنْ يَقُولَ:"كيفَ تَصْنَعُ بِلا إِلهَ إِلاَّ اللَّهُ إِذَا جاءَتْ يَوْمَ القِيامَةِ" رواه مسلم.

హజ్రత్ జుందుబ్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ఒక ముస్లిం సైనిక పటాలాన్ని కొంతమంది బహుదైవారాధకుల వైపు పంపారు. ఇరుపక్షాల మధ్య పోరు మొదలయింది. ఆ సమయంలో బహుదైవారాధకుడొకడు గురిపెట్టి మరీ ఒక్కొక్క ముస్లింను వధించసాగాడు. అది చూసి ఒక ముస్లిం యోధుడు అదను దొరికితే అతణ్ణి కూడా అలాగే వధించాలని కాచుకొని ఉన్నాడు. ఆ ముస్లిం వ్యక్తి ఒసామా బిన్ జైదే అని మేము చెప్పుకుంటుండగా ఒసామా (రదియల్లాహు అన్హు) ఆ బహుదైవారాధకుణ్ణి అదుపులోకి తీసుకొని ఒక్క వేటు వేద్దామని ఖడ్గం పైకెత్తేసరికి ఆ బహుదైవోపాసి "అల్లాహ్ తప్ప వేరొక దేవుడు లేడు" అని అన్నాడు. కాని ఆయన (అతని మాటలేవీ పట్టించుకోకుండా) అతన్ని వధించారు. (ఈ యుద్ధంలో ముస్లింలకు విజయం వరించింది.)

ముస్లింలకు విజయం లభించిందన్న శుభవార్తను అందజేయటానికి ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺ సన్నిధికి వెళ్ళాడు. దైవప్రవక్త ﷺ ఆ వ్యక్తిని యుద్ధ సంగతుల గురించి అడిగారు. ఆ వ్యక్తి అన్ని విషయాలు, ఆఖరికి ఒసామా (రదియల్లాహు అన్హు) సంఘటన కూడా ఆయనకు వివరించాడు. ఆయన ఒసామా బిన్ జైద్ (రదియల్లాహు అన్హు)ని పిలిపించి "ఆ వ్యక్తిని హతమార్చావెందుకు?" అని అడిగారు. అందుకాయన, "దైవప్రవక్తా! అతను ముస్లింలకు చాలా తిప్పలు పెట్టాడు. ఫలానా, ఫలానా ముస్లింలను వధించాడు. అందుకే అతనిపై ఎగబడ్డాను. కాని నా ఖడ్గం పైకి లేవగానే (ప్రాణభయంతో) అతను "అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు" అన్నాడు. అయినా నేనతన్ని వదలకుండా కడతేర్చాను" అని సంజాయిషీ చెప్పుకుంటూ ఆ వ్యక్తి ఎవరెవరిని హత్య చేశాడో పేర్లతో సహా చెప్పారు. కాని దైవప్రవక్త ﷺ మళ్ళీ అదే మాటను ప్రస్తావిస్తూ "అందుకని నువ్వతన్ని వధించావా?" అని నిలదీశారు. ఒసామా (రదియల్లాహు అన్హు) 'అవున'న్నారు. "మరి అతనన్న అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడనే మాట ప్రళయదినాన దైవసన్నిధికి వస్తే అప్పుడు నువ్వేం జవాబు చెబుతావు?" అని మందలించారు దైవప్రవక్త ﷺ.

అప్పుడు ఒసామా (రదియల్లాహు అన్హు) పశ్చాత్తాపంతో, "దైవప్రవక్తా! దేవుడు నాకు క్షమాభిక్ష పెట్టాలని ప్రార్థించండి" అన్నారు. "(అది సరే) ప్రళయదినాన అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడన్న మాట దైవసన్నిధికి వస్తే ఏం చేస్తావ్?" మళ్ళీ మందలింపు ధోరణిలో అడిగారు దైవప్రవక్త ﷺ. ఆయన మాటిమాటికీ ఇదే ప్రశ్న వేస్తూ పోయారుగాని ఇంకేమీ మాట్లాడలేదు.

(ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణం)

English

Jundub bin `Abdullah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ dispatched a contingent of the Muslims to a tribe of the polytheists. The two sides met (in combat) at one place. A man among the polytheists was so dashing that, whenever he intended to kill a man from Muslims, he killed him. Amongst the Muslims, too, was a man looking forward to (an opportunity of) his (polytheist’s) unmindfulness. He (the narrator) said: We talked that he was Usamah bin Zaid (radiyallahu anhu). When he raised his sword, he (the soldier of the polytheists) uttered: “La ilaha illallah (There is no true god except Allah).” But he (Usamah bin Zaid) killed him. When the good news of victory reached Messenger of Allah ﷺ he asked him (about the events of the battle), and he informed him about the man (Usamah) and what he had done. He (Messenger of Allah ﷺ) sent for him and asked him why he had killed him. He (Usamah) said, “O Messenger of Allah, he struck the Muslims and killed such and such of them.” And he named some of them. (He continued): “I attacked him and when he saw the sword he said: `La ilaha illallah.”’ Messenger of Allah ﷺ said, “Did you kill him?” He (Usamah) replied in the affirmative. The Messenger of Allah then remarked, “What would you do with regard to (the utterance): La ilaha illallah, when it comes (before you) on the Day of Resurrection?” He (Usamah) said, “O Messenger of Allah! Beg forgiveness for me”. He (the Prophet ﷺ) said, “What would you do with regard to (the utterance): La ilaha illallah, when it comes (before you) on the Day of Resurrection?” He (Messenger of Allah ﷺ) added nothing to it but kept repeating, “What would you do with regard to (the utterance): La ilaha illallah, when it comes (before you) on the Day of Resurrection?”.[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|49. ప్రజలతో వారి బాహ్యాచరణల్ని బట్టి వ్యవహరించాలి, వారి ఆంతరంగిక వ్యవహారాలు దేవుడు చూసుకుంటాడు|హదీసు 395

396

హదీసు 396

وعن عبدِ اللَّه بنِ عتبة بن مسعودٍ قَالَ: سمِعْتُ عُمَر بْنَ الخَطَّابِ، رضي اللَّه عنه يقولُ: "إِنَّ نَاساً كَانُوا يُؤْخَذُونَ بالوَحْي في عَهْدِ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، وإِنَّ الوَحْيَ قَدِ انْقَطَعَ، وإِنَّمَا نَأْخُذُكُمُ الآنَ بِما ظَهَرَ لَنَا مِنْ أَعْمَالِكُمْ، فَمَنْ أَظْهَرَ لَنا خَيْراً، أَمَّنَّاهُ، وقرَّبناه وَلَيْس لنَا مِنْ سَرِيرَتِهِ شيءٌ، اللَّهُ يُحاسِبُهُ فِي سرِيرَتِهِ، ومَنْ أَظْهَرَ لَنَا سُوءاً، لَمْ نأْمنْهُ، وَلَمْ نُصَدِّقْهُ وإِنْ قَالَ إِنَّ سَرِيرَتَه حَسنَةٌ"رواه البخاري.

హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) చెబుతుండగా తాను విన్నానని హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉత్బా బిన్ మస్‌ఊద్ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు: "దైవప్రవక్త కాలంలో కొంతమంది (తప్పుచేసిన వారి)ని వహీ (దైవవాణి) ద్వారా నిలదీయటం జరిగేది. కాని ఇప్పుడు వహీ అవతరణ ఆగిపోయింది. (కనుక ఒకరి అంతరంగ స్థితిగతులను గురించి తప్పుపట్టడం ఇప్పుడిక సాధ్యం కాదు). కనుక ఇప్పుడు మీ బాహ్య ఆచరణల ఆధారంగానే మిమ్మల్ని నిలదీస్తాం. ఎవరైతే పైకి మంచిపనులు చేస్తాడో మేమతనికి రక్షణ కల్పిస్తాం. అతణ్ణి చేరదీస్తాం. అతని లోపలి వ్యవహారం గురించి పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. దానిని దేవుడు చూసుకుంటాడు. మరెవరైనా పైకి చెడ్డపనులు చేసి మా ఉద్దేశం మంచిదే అన్నాసరే; అతనికి మా రక్షణ ఉండదు. మేమతని మంచితనాన్ని ధృవీక రించము."

(బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని సాక్ష్యాధారాల ప్రకరణం)

English

`Abdullah bin `Utbah bin Mas`ud reported: I heard `Umar bin Al-Khattab (radiyallahu anhu) reported saying: “In the lifetime of Messenger of Allah ﷺ some people were called to account through Revelation. Now Revelation has discontinued and we shall judge you by your apparent acts. Whoever displays to us good, we shall grant him peace and security, and treat him as a near one. We have nothing to do with his insight. Allah will call him to account for that. But whosoever shows evil to us, we shall not grant him security nor shall we believe him, even if he professed that his intention is good.”[Al-Bukhari].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|49. ప్రజలతో వారి బాహ్యాచరణల్ని బట్టి వ్యవహరించాలి, వారి ఆంతరంగిక వ్యవహారాలు దేవుడు చూసుకుంటాడు|హదీసు 396