హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 48వ అధ్యాయం: సజ్జనుల్ని, బలహీనుల్ని, అభాగ్యుల్ని హింసించటం మహా పాపం. ఈ అధ్యాయంలో 2 ఖుర్ఆన్ ఆయతులు, 1 హదీసులు (హదీసు 390) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
48. సజ్జనుల్ని, బలహీనుల్ని, అభాగ్యుల్ని హింసించటం మహా పాపం
باب التحذير من إيذاء الصالحين والضعفة والمساكين
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ సెలవిచ్చాడు :
{وَالَّذِينَ يُؤْذُونَ الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ بِغَيْرِ مَااكْتَسَبُوا فَقَدِ احْتَمَلُوا بُهْتَاناً وَإِثْماً مُبِيناً} [الأحزاب:٥٨]
ఏ తప్పూ చేయకపోయినప్పటికీ విశ్వాసులైన స్త్రీ పురుషుల్ని కష్టపెట్టేవారు, ఒక పెద్ద అభాండ భారాన్ని, ఒక బహిరంగ నేరాన్ని తమ నెత్తిన మోపుకున్నట్లే. (అల్ అహ్జాబ్ : 57)
ఇంకొకచోట ఆయన ఇలా అన్నాడు :
{فَأَمَّا الْيَتِيمَ فَلا تَقْهَرْوَأَمَّا السَّائِلَ فَلا تَنْهَرْ} [الضحى:١٠،٩]
"నీవు అనాధల పట్ల దురుసుగా ప్రవర్తించకు. యాచకుణ్ణి కసురుకోకు." (అజ్ జుహా : 9,10)
ఈ అధ్యాయానికి సంబంధించిన హదీసులు చాలా ఉన్నాయి. వాటిలో ఇంతకు ముందు అధ్యాయంలో వచ్చిన, "ఎవరైనా నా దాసుడ్ని ద్వేషిస్తే నేనతనిపై యుద్ధాన్ని ప్రకటిస్తాను" అన్న హదీసు, ఇంకా 'అనాధుల పట్ల మృదువుగా వ్యవహరించాలి' అన్న అధ్యాయంలో "ఓ అబూబక్ర్! నీవు గనక వారి మనసును నొప్పించినట్లయితే దేవుడు కూడా నిన్ను కోపగించుకుంటాడు" అన్న ప్రస్తావన గల సాద్ బిన్ అబూ వఖ్ఖాస్ హదీసులు ఈ అధ్యాయానికీ వర్తిస్తాయి.
English
“And those who annoy believing men and women undeservedly, they bear (on themselves) the crime of slander and plain sin.” [Al-Aḥzāb 33:58]
“Therefore, treat not the orphan with oppression. And repulse not the beggar.” [Aḍ-Ḍuḥā 93:9–10]
హదీసు 390
وعن جُنَدَبِ بنِ عبد اللَّه رضي اللَّه عنه قال: قالَ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَنْ صَلَّى صَلاَةَ الصُّبْحِ، فَهُوَ في ذِمَّةِ اللَّه، فَلا يَطْلُبَنَّكُمْ اللَّهُ مِنْ ذِمَّتِهِ بِشَيءٍ، فَإِنَّهُ مَنْ يَطْلُبْهُ مِنْ ذِمَّتِهِ بِشَيءٍ، يُدْرِكْهُ، ثُمَّ يَكُبُّهُ عَلى وَجْهِهِ في نَارِ جَهَنَّمَ" رواه مسلم.
హజ్రత్ జుందుబ్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉద్బోధించారు : ఉదయం (ఫజ్ర్) నమాజు చేసిన వ్యక్తి దేవుని రక్షణలో ఉంటాడు. తన రక్షణ విషయంలో (జోక్యం కల్పించుకున్నారని) దేవుడు మిమ్మల్ని నిలదీసే స్థితి రాకూడదు సుమా! ఎందుకంటే ఆయన ఎవరినయినా ఏదయినా విషయంలో నిలదీశాడంటే, ఇక అతన్ని పట్టుకొని నరకాగ్నిలో బోర్లాపడేస్తాడు. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని మస్జిదుల ప్రకరణం)
English
Jundub bin Abdullah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “He who performs the Fajr (dawn) prayer comes under the Protection of Allah, so beware lest Allah questions you about what you owe Him. For if He questions anyone of you and he falls short of fulfilling the duty which he owes Him, He will requite and then throw upon his face into the Hell-fire”.[Muslim].
ముఖ్యాంశాలు
ఈ హదీసులో 'జిమ్మతుల్లాహ్' అనే పదం వాడబడింది. దీనికి 'దేవుని రక్షణ' లేదా 'దేవుని ఒప్పందం' అనే రెండు అర్థాలున్నాయి. కాబట్టి ఈ హదీసుని మనం రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. దేవుని రక్షణ అనే అర్థాన్ని తీసుకుంటే దాని ప్రకారం, ఫజ్ర్ (ఉదయం) నమాజు చేసిన వ్యక్తికి దేవుని రక్షణ ఏర్పడుతుంది. అతన్ని రక్షించే బాధ్యత దేవుడు తనపై వేసుకుంటాడు. అలాంటప్పుడు ఆ సత్పురుషుణ్ణి బాధిస్తే దేవుడి రక్షణలో జోక్యం కల్పించుకున్నట్లవుతుంది. ఆ పాపానికి ఒడిగట్టిన వారిని దేవుడు పట్టుకొని శిక్షిస్తాడు.
ఇకపోతే జిమ్మతుల్లాహ్ అనే పదానికి దేవుని రక్షణకు బదులు దైవ ఒప్పందం అనే అర్థాన్ని తీసుకుంటే, అప్పుడు హదీసు భావం ఈ విధంగా ఉంటుంది : ఫజ్ర్ నమాజు చేసిన వ్యక్తి తాను ఇక ఆ రోజల్లా మంచిపనులే చేస్తానని, చెడులకు దూరంగా ఉంటానని దేవునితో ఒప్పందం చేసుకున్నట్లు లెక్క. ఇక ఆ తరువాత అతను తన వాగ్దానాన్ని భంగపరచి చెడు కార్యాలకు పాల్పడితే పరలోకంలో దేవుడు అతన్ని తన ఒప్పందం గురించి నిలదీస్తాడన్నమాట. మొదటి భావాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ హదీసును ఈ అధ్యాయం క్రింద ప్రస్తావించటం జరిగింది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|48. సజ్జనుల్ని, బలహీనుల్ని, అభాగ్యుల్ని హింసించటం మహా పాపం|హదీసు 390
You must be logged in to post a comment.