హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 50. దైవభీతి

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 50వ అధ్యాయం: దైవభీతి. ఈ అధ్యాయంలో 8 ఖుర్ఆన్ ఆయతులు, 16 హదీసులు (హదీసు 397 – 412) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

50. దైవభీతి

↑ విషయ సూచిక

باب الخوف

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు:

{وَإِيَّايَ فَارْهَبُونِ} [البقرة:٤٠]

కేవలం నాకు మాత్రమే భయపడండి. (అల్ బఖర : 40)

ఇంకొకచోట ఆయన ఇలా అంటున్నాడు :

{إِنَّ بَطْشَ رَبِّكَ لَشَدِيدٌ} [البروج:١٢]

నిస్సందేహంగా నీ ప్రభువు పట్టు బహుగట్టిది. (అల్ బురూజ్ : 12)

మరొకచోట ఆయన ఇలా సెలవిస్తున్నాడు :

{وَكَذَلِكَ أَخْذُ رَبِّكَ إِذَا أَخَذَ الْقُرَى وَهِيَ ظَالِمَةٌ إِنَّ أَخْذَهُ أَلِيمٌ شَدِيدٌ إِنَّ فِي ذَلِكَ لَآيَةً لِمَنْ خَافَ عَذَابَ الْآخِرَةِ ذَلِكَ يَوْمٌ مَجْمُوعٌ لَهُ النَّاسُ وَذَلِكَ يَوْمٌ مَشْهُودٌوَمَا نُؤَخِّرُهُ إِلاَّ لِأَجَلٍ مَعْدُودٍ يَوْمَ يَأْتِ لا تَكَلَّمُ نَفْسٌ إِلاَّ بِإِذْنِهِ فَمِنْهُمْ شَقِيٌّ وَسَعِيدٌ فَأَمَّا الَّذِينَ شَقُوا فَفِي النَّارِ لَهُمْ فِيهَازَفِيرٌ وَشَهِيقٌ} [هود:١٠٢-١٠٦]

నీ ప్రభువు ఒక దుర్మార్గపు నగరాన్ని శిక్షించదలిస్తే ఆయన శిక్ష ఇలాగే ఉంటుంది. నిజంగానే ఆయన శిక్ష బహు కఠినమైనది. బహుబాధాకరమైనది. వాస్తవానికి పరలోక శిక్షకు భయపడే ప్రతి మనిషికీ ఇందులో ఒక సూచన ఉంది. అది మానవులందరూ సమావేశమయ్యే రోజు. ఆ రోజు జరిగేదంతా అందరి కళ్ళముందే జరుగుతుంది. మేము ఆ రోజుని తీసుకు రావటంలో ఎక్కువ ఆలస్యమేమీ చెయ్యటం లేదు. దానికోసం ఒక గడువు నిర్ణయించబడి ఉంది. అది వచ్చినప్పుడు దేవుని అనుమతితో ఏమైనా మనవి చేసుకోవటం తప్ప ఆ రోజు నోరెత్తటానికి కూడా ఎవరికీ ధైర్యం ఉండదు. ఆ రోజున దురదృష్టవంతులు కొందరుంటారు. అదృష్టవంతులు కొందరుంటారు. దురదృష్టవంతులైన వారు నరకానికి పోతారు. (అక్కడి తీవ్రమైన వేడి, దప్పికల వల్ల) వారు అరుస్తూ రొప్పుతూ ఉంటారు. (హూద్ : 102 – 105)

ఆయన ఇంకా ఇలా సెలవిస్తున్నాడు :

{وَيُحَذِّرُكُمُ اللَّهُ نَفْسَهُ} [آل عمران:٢٨]

"దేవుడు తనను గురించి (అంటే తన అప్రసన్నత గురించి) మిమ్మల్ని భయపెడుతున్నాడు." (ఆలి ఇమ్రాన్ : 28)

వేరొకచోట ఆయన ఇలా అన్నాడు:

{يَوْمَ يَفِرُّ الْمَرْءُ مِنْ أَخِيهِ وَأُمِّهِ وَأَبِيه وَصَاحِبَتِهِ وَبَنِيهِ لِكُلِّ امْرِئٍ مِنْهُمْ يَوْمَئِذٍ شَأْنٌ يُغْنِيه} [عبس:٣٤-٣٧]

"ఆ రోజు మనిషి తన సోదరునికీ, తన తల్లికీ, తన తండ్రికీ, తన భార్యకూ, తన సంతానానికీ దూరంగా పరుగెత్తుతాడు. ఆ రోజున వారిలో ప్రతి ఒక్కరికీ తమను గురించి తప్ప ఇతరుల్ని గురించి పట్టించుకోలేని ఆపత్సమయం వస్తుంది." (అబస్ : 34-37)

ఇంకొకచోట ఆయన ఇంకా ఇలా అన్నాడు :

{يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمْ إِنَّ زَلْزَلَةَ السَّاعَةِ شَيْءٌ عَظِيمٌ يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّا أَرْضَعَتْ وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا وَتَرَى النَّاسَ سُكَارَى وَمَا هُمْ بِسُكَارَى وَلَكِنَّ عَذَابَ اللَّهِ شَدِيدٌ} [الحج:١-٢]

మానవులారా! మీ ప్రభువు ఆగ్రహం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. నిస్సందేహంగా ప్రళయం నాటి భూకంపం మహాభయంకరంగా ఉంటుంది. దానిని మీరు చూసినప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంటుందంటే, పాలుపట్టే స్త్రీ పాలు త్రాగుతున్న తన బిడ్డను మరచిపోతుంది, గర్భిణీ గర్భం పడిపోతుంది, ప్రజలు మీకు మత్తులో ఉన్నట్లు కనిపిస్తారు. కాని వాస్తవానికి వారు తాగిన మైకంలో ఉండరు. అల్లాహ్ శిక్షే అంత తీవ్రంగా ఉంటుంది. (అల్ హజ్ : 1,2)

ఆయన ఇంకా ఇలా అన్నాడు :

{وَلِمَنْ خَافَ مَقَامَ رَبِّهِ جَنَّتَانِ} [الرحمن:٤٦]

తన ప్రభువు సన్నిధిలో హాజరుకావలసి ఉంటుందనే భయం కలిగి ఉండే ప్రతి వ్యక్తికి రెండు స్వర్గాలు (తోటలు) లభిస్తాయి. (అర్ రహ్మాన్ : 46)

ఆయన ఇంకా ఇలా అన్నాడు :

{وَأَقْبَلَ بَعْضُهُمْ عَلَى بَعْضٍ يَتَسَاءَلُونَ قَالُوا إِنَّا كُنَّا قَبْلُ فِي أَهْلِنَا مُشْفِقِينَ فَمَنَّ اللَّهُ عَلَيْنَا وَوَقَانَا عَذَابَ السَّمُومِ إِنَّا كُنَّا مِنْ قَبْلُ نَدْعُوهُ إِنَّهُ هُوَ الْبَرُّ الرَّحِيمُ} [الطور:٢٥-٢٨]

స్వర్గవాసులు స్వర్గంలో పరస్పరం (ప్రాపంచిక జీవితంలో జరిగిన) విషయాలను గురించి అడిగి తెలుసుకుంటారు. వారు, "మేము మొదట మా కుటుంబీకుల మధ్య ఉన్నప్పటికీ దైవానికి భయపడేవాళ్ళం. చివరికి దేవుడు మాపై కనికరం చూపాడు. మమ్మల్ని తీవ్రమైన వడగాలి శిక్ష నుండి రక్షించాడు. మేము గత జీవితంలో ఆయన్నే వేడుకుంటూ ఉండేవాళ్ళం. ఆయన నిజంగానే మహోపకారి మరియు అనంత కరుణామయుడు." (అత్ తూర్ : 25 – 28)

ఈ అధ్యాయం క్రింద సుప్రసిద్ధమైన సూక్తులు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మాత్రమే ఇక్కడ ప్రస్తావించాం. ఇకపోతే ఈ అధ్యాయానికి సంబంధించి హదీసులు కూడా చాలా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇక్కడ పేర్కొంటున్నాం. ఆ సద్బుద్ధిని ప్రసాదించేవాడు కూడా దేవుడే.

English

“And fear none but Me”. [Al-Baqarah 2:40]

“Verily, (O Muhammad ﷺ) the Grip (punishment) of your Rubb is severe”. [Al-Burūj 85:12]

“Such is the Seizure of your Rubb when He seizes the (population of) towns while they are doing wrong. Verily, His Seizure is painful, (and) severe. Indeed in that (there) is a sure lesson for those who fear the torment of the Hereafter. That is a Day whereon mankind will be gathered together, and that is a Day when all (the dwellers of the heavens and the earth) will be present. And We delay it only for a term (already) fixed. On the Day when it comes, no person shall speak except by His (Allah’s) Leave. Some among them will be wretched and (others) blessed. As for those who are wretched, they will be in the Fire, sighing in a high and low tone”. [Hūd 11:102–106]

“And Allah warns you against Himself (His punishment)”. [Āl ‘Imrān 3:30]

“That Day shall a man flee from his brother. And from his mother and his father. And from his wife and his children. Every man that Day will have enough to make him careless of others”. [‘Abasa 80:34–37]

“O mankind! Fear your Rubb and be dutiful to Him! Verily, the earthquake of the Hour (of Resurrection) is a terrible thing. The Day you shall see it, every nursing mother will forget her nursling, and every pregnant one will drop her load, and you shall see mankind as in a drunken state, yet they will not be drunken, but severe will be the Torment of Allah”. [Al-Ḥajj 22:1–2]

“But for him who fears the standing before his Rubb, there will be two Gardens (i.e., in Jannah)”. [Ar-Raḥmān 55:46]

“And some of them draw near to others, questioning. Saying: `Aforetime, we were afraid (of the punishment of Allah) in the midst of our families. So Allah has been gracious to us, and has saved us from the torment of the Fire. Verily, we used to invoke Him (Alone and none else) before. Verily, He is Al-Barr (the Most Subtle, Kind, Courteous, and Generous), the Most Merciful.”. [Aṭ-Ṭūr 52:25–28]

397

హదీసు 397

عن ابنِ مسعودٍ، رضي اللَّه عنه، قَالَ: حدثنا رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، وَهُوَ الصَّادِقُ المصدوقُ: "إِنَّ أَحَدَكُمْ يُجْمَعُ خَلْقُهُ في بَطْن أُمِّهِ أَرْبَعِينَ يَوْماً نُطْفَةً، ثُمَّ يَكُونُ عَلَقَةً مِثْلَ ذلِكَ، ثُمَّ يَكُونُ مُضْغَةً مثْلَ ذلِكَ، ثُمَّ يُرْسَلُ المَلَكُ، فَيَنْفُخُ فِيهِ الرَّوحَ، وَيُؤْمَرُ بِأَرْبَعِ كَلِماتٍ: بِكَتْبِ رِزقِةِ، وَأَجلِهِ، وَعمَلِهِ، وَشَقيٌّ أَوْ سعِيدٌ. فَوَ الَّذِي لا إِله غَيْرُهُ إِنَّ أَحَدَكُمْ لَيَعْمَلُ عَمَلَ أَهْلِ الجَنَّةِ حَتَّى مَا يَكُونُ بَيْنَهُ وبَيْنَهَا إِلاَّ ذِراعٌ، فَيَسْبقُ عَلَيْهِ الْكِتابُ، فَيَعْمَلُ بِعَمَلِ أَهْل النَّارِ، فَيَدْخُلُهَا، وَإِنَّ أَحَدَكُمْ لَيَعْمَلُ بِعَمَلِ أَهْلِ النَّارِ حَتَّى مَا يَكُونُ بَيْنَهُ وَبَيْنَهَا إِلاَّ ذِرَاعٌ، فَيَسْبِقُ عَلَيْهِ الْكِتَابُ فَيَعْمَلُ بِعَمَلِ أَهْلِ الجَنَّةِ فَيََدْخُلُهَا" متفقٌ عَلَيهِ.

హజ్రత్ ఇబ్నె మస్‌ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త సత్యమూర్తి. దేవుని సృష్టిచేత తనను సత్యమూర్తి అని పిలిపించుకున్నవారాయన. ఆయన ఇలా ప్రబోధించారు :

"మీలో ప్రతి ఒక్కడూ తన మాతృగర్భంలో (మొదట) నలభై రోజులదాకా వీర్యపు బిందువు రూపంలో ఉంటాడు. ఆ తరువాత మరో నలభై రోజులపాటు పేరుకుపోయిన రక్తపు ముద్ద ఆకారంలో ఉంటాడు. ఆ తరువాత ఇంకో నలభై రోజులపాటు మాంసపు ముద్దలా ఉంటాడు. ఆ తరువాత దాని దగ్గరికి ఒక దైవదూతను పంపటం జరుగుతుంది. అతను ఆ పిండంలో ప్రాణాన్ని పోస్తాడు. అప్పుడు దాని ఉపాధిని, మరణాన్ని, అతని ఆచరణను, అతను దురదృష్టవం తుడవుతాడా లేక అదృష్టవంతుడవుతాడా అనే విషయాలను వ్రాసి పెట్టమని ఆ దైవదూతకు ఆజ్ఞ అవుతుంది.

ఏకైక ఆరాధ్యదైవం సాక్షిగా చెబుతున్నాను. నిస్సందేహంగా మీలో ఒకడు స్వర్గానికి గొనిపోయే మంచిపనులు చేస్తూ ఉంటాడు. అతను స్వర్గానికి పోవటానికి ఇంకా ఒక అడుగు దూరమే మిగిలి ఉంటుంది. అంతలో విధివ్రాత అతన్ని మించిపోతుంది. దాంతో అతను నరకానికి గొనిపోయే చెడ్డపనులు చేసి నరకంలో ప్రవేశిస్తాడు. దీనికి భిన్నంగా మీలో ఒకడు నరకానికి గొనిపోయే పనులు చేస్తుంటాడు. ఆఖరికి అతనికీ నరకానికి మధ్య ఒక అడుగు దూరం మాత్రమే మిగిలి ఉంటుంది. అంతలో విధి అతన్ని మించిపోతుంది. ఫలితంగా అతను స్వర్గానికి గొనిపోయే మంచి పనులు చేసి స్వర్గంలోకి ప్రవేశిస్తాడు.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని సృష్టి ఆరంభ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని విధివ్రాత ప్రకరణం)

English

`Abdullah bin Mas`ud (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ, the truthful and the receiver of the truth informed us, saying, “The creation of you (humans) is gathered in the form of semen in the womb of your mother for forty days, then it becomes a clinging thing in similar (period), then it becomes a lump of flesh like that, then Allah sends an angel who breathes the life into it; and (the angel) is commanded to record four things about it: Its provision, its term of life (in this world), its conduct; and whether it will be happy or miserable. By the One besides Whom there is no true god! Verily, one of you would perform the actions of the dwellers of Jannah until there is only one cubit between him and it (Jannah), when what is foreordained would come to pass and he would perform the actions of the inmates of Hell until he enter it. And one of you would perform the actions of the inmates of Hell, until there is only one cubit between him and Hell. Then he would perform the acts of the dwellers of Jannah until he would enter it.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఒక మనిషి పెరిగి పెద్దయిన తర్వాత మంచివాడవుతాడా లేక చెడ్డవాడవుతాడా, స్వర్గానికి పోతాడా లేక నరకానికి పోతాడా అన్న విషయం దేవుడికి మనిషి పుట్టకముందు నుంచే తెలుసు. దేవుడు తన జ్ఞానంతో ఈ విషయాలన్నిటినీ వ్రాసిపెట్టాడు. దేవుడు విధివ్రాతను ముందుగానే వ్రాసిపెట్టాడంటే ఇక మనిషి గత్యంతరం లేనివాడుగా పుట్టించబడతాడని అర్థం ఎంతమాత్రం కాదు. దేవుడు మనిషికి మంచీచెడుల, ధర్మాధర్మాల విచక్షణా జ్ఞానాన్ని ప్రసాదించాడు. సన్మార్గమేదో, దుర్మార్గమేదో సుస్పష్టంగా విశదపరచాడు. స్వర్గానికి గొనిపోయే మార్గాన్ని, నరకానికి గొనిపోయే మార్గాన్ని చూపించి మనిషి తన బుద్ధిని, విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించుకొని వాటిలో ఏదో ఒకటి ఎన్నుకునే 'ఎంపిక అధికారాన్ని' కూడా దేవుడు ప్రసాదించాడు. అందుకే దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఇలా అంటున్నాడు : మేము అతనికి మార్గం చూపాం. ఇక అతను కృతజ్ఞతలు తెలిపేవాడయినా కావచ్చు లేదా సత్యాన్ని తిరస్కరించేవాడయినా కావచ్చు. (దహ్ర్ : 3) మరొకచోట అల్ కహఫ్ సూరాలో, "ఇష్టమైనవారు సత్యాన్ని స్వీకరించనూ వచ్చు. యిష్టం లేనివారు దానిని తిరస్కరించనూవచ్చు' అని అంటున్నాడు. దీని ద్వారా విధివ్రాత విషయంలో మనిషి అశక్తుడిగా, గత్యంతరం లేనివాడుగా పుట్టించబడలేదని తెలుస్తోంది.

ఇకపోతే గ్రంథకర్త ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) విధివ్రాతకు సంబంధించిన హదీసును 'దైవభీతి' అన్న అధ్యాయం క్రింద ప్రస్తావించటంలోని ఆంతర్యం ఏమిటంటే, మనిషి ఎల్లప్పుడూ దైవానికి భయపడుతూ తనకు విశ్వాస స్థితిలోనే మరణం సంభవించాలని కోరుకుంటూ ఉండాలి. దానికోసం అనువైన పద్ధతుల్ని అవలంబించాలి. వీలైనంతవరకు విశ్వాసాన్ని (ఈమాన్‌ను), దైవభీతిని అంటిపెట్టుకొని ఉండాలి. మనిషి మంచిపని చేయాలనుకుంటే మంచికి మార్గం సుగమం అవుతుందని, అలాగే చెడుపని చేయాలనుకున్నప్పుడు దానికోసం కూడా అనేక మార్గాలు తెరుచుకుంటాయన్న వాస్తవాన్ని గ్రహించి మసలుకోవాలి. అంతేకాదు; ఎట్టి పరిస్థితుల్లోనూ చెడును దరిచేరనీయకూడదు. ఎందుకంటే ఆ స్థితిలోనే అతనికి మరణం సంభవిస్తే జీవితాంతం చేసుకున్న పుణ్యకార్యాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయిపోతాయి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|50. దైవభీతి|హదీసు 397

398

హదీసు 398

وعنه قَالَ: قالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "يُؤْتَى بِجَهَنَّمَ يَوْمَئِذٍ لَهَا سَبْعُونَ أَلْفَ زِمَامٍ، مَعَ كُلِّ زِمَامٍ سَبْعُونَ أَلْفَ مَلَكٍ يَجُرُّونَهَا" رواه مسلم.

హజ్రత్ ఇబ్నె మస్వూద్ (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : ఆ రోజు (అంటే ప్రళయదినాన) నరకాన్ని (అందరి ముందుకు) తీసుకొచ్చినప్పుడు దానికి డెబ్భైవేల కళ్ళాలుంటాయి. ప్రతి కళ్ళాన్ని డెబ్భైవేలమంది దైవదూతలు పట్టుకొని లాగుతూ ఉంటారు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని స్వర్గసుఖాల ప్రకరణం)

English

Ibn Mas`ud (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Hell will be brought on that Day (the Day of Resurrection) with seventy bridles; and with every bridle will be seventy thousand angels, pulling it”.[Muslim].

ముఖ్యాంశాలు

ప్రళయదినావ నరక దృశ్యం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ హదీసులో వర్ణించటం జరిగింది. ఈ స్థితి అగోచర విషయాలకు సంబంధించినది. మానవులెవరూ ఆ భయంకర దృశ్యాన్ని ఊహించనయినా ఊహించలేరు. అయినప్పటికీ దానిని విశ్వసించటం మాత్రం ప్రతి ముస్లిం విధి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|50. దైవభీతి|హదీసు 398

399

హదీసు 399

وعن النُّعْمَانِ بنِ بَشِيرٍ، رضي اللَّه عنهما، قَالَ: سمِعتُ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، يقول: "إِنَّ أَهْوَنَ أَهْلِ النَّارِ عَذَاباً يَوْمَ الْقِيامَة لَرَجُلٌ يُوضَعُ في أَخْمَصِ قَدميْهِ جمْرَتَانِ يغْلي مِنْهُمَا دِمَاغُهُ مَا يَرى أَنَّ أَحداً أَشَدُّ مِنْه عَذَاباً، وَإِنَّه لأَهْونُهُمْ عذَاباً" مُتَّفَقٌ عَلَيهِ.

దైవప్రవక్త ﷺ ఇలా చెబుతుండగా తాను విన్నానని హజ్రత్ నోమాన్ బిన్ బషీర్ (రదియల్లాహు అన్హుమా) తెలియజేశారు : ప్రళయదినాన నరకవాసుల్లో అతి తేలికపాటి శిక్షననుభవించేవాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే, అతని పాదాల క్రింద రెండు నిప్పు రవ్వలు ఉంచబడతాయి. వాటి మంటకు అతని మెదడు కుత కుత ఉడికిపోతూ ఉంటుంది. ఆ శిక్ష అనుభవిస్తున్నవాడు అందరికంటే కఠినమైన శిక్ష తనకే విధించబడుతోందని అనుకుంటాడు. కాని వాస్తవానికి అందరికన్నా తేలికైన శిక్షననుభవించేది అతనే.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని ప్రేమైక వచనాల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణం)

English

Nu`man bin Bashir (radiyallahu anhuma) reported: Messenger of Allah ﷺ said, “The least tortured man on the Day of Resurrection is one underneath whose feet will be placed two live coal, and his brain will be boiling, and he would think that he is the most tortured, while he is the least tortured”,[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో అలాంటి వ్యక్తికి నిప్పుతో తయారుచేయబడిన చెప్పులు తొడిగించటం జరుగుతుందనీ, దాంతో పొయ్యి మీదున్న కుండ ఉడికినట్లు అతని మెదడు కుత కుత ఉడికిపోతూ ఉంటుందని చెప్పబడింది. మరికొన్ని ఉల్లేఖనాల ద్వారా ఆ వ్యక్తి ఎవరోకాదు, స్వయాన దైవప్రవక్త గారి సొంత బాబాయి అబూ తాలిబ్ అని తెలుస్తోంది. ఈయన దైవప్రవక్త ﷺను బాల్యంలో పెంచిపోషించారు. ప్రవక్త పదవి లభించిన తరువాత కూడా అడుగడుగునా ఆయనకు సహాయపడ్డారు. అవిశ్వాసులకు వ్యతిరేకంగా జీవితాంతం ఆయనకు సహకరించి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. కాని తాను మాత్రం విశ్వాస భాగ్యానికి నోచుకోలేకపోయారు. అందుకే కడకు ఆయన నరకాగ్నికి ఆహుతి కావలసి వచ్చింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|50. దైవభీతి|హదీసు 399

400

హదీసు 400

وعن سمُرةَ بنِ جُنْدبٍ، رضي اللَّه عنه، أَن نبيَّ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مِنْهُمْ مَنْ تَأْخُذهُ النَّارُ إِلى كَعْبَيهِ، ومِنْهُمْ منْ تأْخُذُهُ إِلى رُكْبَتَيْهِ، وَمِنْهُمْ منْ تَأْخُذُهُ إِلى حُجْزتِهِ، وِمِنْهُمْ منْ تَأْخُذُهُ إِلى تَرْقُوَتِهِ" رواه مسلم. "الحُجْزَةُ": مَعْقِدُ الإِزارِ تحْتَ السُّرَّةِ. وَ"التَّرْقُوَةُ"بفتحِ التاءِ وضم القاف: هِي العظْمُ الذِي عِندَ ثُغْرةِ النَّحْرِ، وللإِنْسَانِ ترْقُوَتانِ في جَانِبَي النَّحْرِ.

హజ్రత్ సమురా బిన్ జుందుబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : నరకవాసుల్లో కొందరు తమ కాళ్ళ చీలమండల దాకా, మరికొందరు మోకాళ్ళదాకా, ఇంకొందరు నడుందాకా, ఇంకా కొందరైతే రొమ్ము పైభాగందాకా అగ్నిలో చిక్కుకొని ఉంటారు. (ముస్లిం)

'హజ్‌జతున్' అంటే బొడ్డుక్రింద షరాయి తదితర వస్త్రాలు కట్టుకునే మొలభాగం. 'తర్‌ఖూతున్' అంటే కుత్తుక దగ్గరుండే ఎముక. మనిషి రొమ్ముకు ఇరువైపులా రెండు ఎముకలు ఉంటాయి.

(సహీహ్ ముస్లింలోని స్వర్గసుఖాల ప్రకరణం)

English

Samurah bin Jundub (radiyallahu anhu) reported: Prophet of Allah ﷺ said, “Among the people of Hell are there those who will be emersed in fire to their ankels, some to their knees, some to their waists, and some to their throats”.[Muslim].

ముఖ్యాంశాలు

స్వర్గంలో వివిధ అంతస్తులు ఉన్నట్లే నరక శిక్షలో కూడా హెచ్చు తగ్గులుంటాయని ఈ హదీసు తెలుపుతోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|50. దైవభీతి|హదీసు 400

401

హదీసు 401

وعن ابنِ عمر رضي اللَّه عنهما أنَّ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "يَقُومُ النَّاسُ لِرَبِّ العالمِينَ حَتَّى يَغِيب أَحدُهُمْ في رَشْحِهِ إِلى أَنْصَافِ أُذُنَيه" متفقٌ عَلَيهِ. و"الرَّشْحُ"العرَقُ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : (ప్రళయదినాన) మానవులు సకల లోకాల ప్రభువు ముందు నిలబడినప్పుడు (భయాందోళనలతో వారికి చెమట ధారలు కారుతూ ఉంటాయి.) కొంతమంది తమ చెవుల సగభాగం దాకా చెమటలో మునిగిపోయి ఉంటారు. (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని వ్యాఖ్యానాల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని స్వర్గ సుఖాల ప్రకరణం)

English

Ibn `Umar (radiyallahu anhuma) reported: I heard Messenger of Allah ﷺ as saying, “Mankind will stand before Allah, the Rubb of the worlds (on the Day of Resurrection), some of them will stand submerged in perspiration up to half of their ears”.[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|50. దైవభీతి|హదీసు 401

402

హదీసు 402

وعن أَنس، رضي اللَّه عنه، قَالَ: خَطَبَنَا رَسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، خُطْبَةً مَا سَمِعْتُ مِثْلَهَا قَطُّ، فَقَالَ: " لَوْ تَعْلَمُونَ مَا أَعْلَمُ لَضَحِكْتُمْ قلِيلا ولبَكيْتمْ كَثِيراً" فَغَطَّى أَصْحابُ رسولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وجُوهَهمْ، وَلهُمْ خَنينٌ. متفقٌ عَلَيهِ. وفي رواية: بَلَغَ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم عَنْ أَصْحابِهِ شَيءٌ فَخَطَبَ، فَقَالَ: "عُرضَتْ عَلَيَّ الجنَّةُ والنَّارُ، فَلَمْ أَر كَاليَوْمِ في الخَيْر وَالشَّرِّ، ولَوْ تَعْلَمُونَ مَا أَعلَمُ لَضحِكْتُمْ قلِيلاً، وَلَبَكَيْتُمْ كَثِيراً" فَما أتَى عَلَى أَصْحَابِ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يوْمٌ أَشَدُّ مِنْهُ غَطَّوْا رُؤُسهُمْ وَلَهُمْ خَنِينٌ. "الخَنِينُ"بِالخاءِ المعجمة: هُوَ البُكَاءُ مَعَ غُنَّةٍ وَانْتِشَاقُ الصَّوتِ مِنَ الأَنْفِ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ఒకసారి మాకో ఉపన్యాసం ఇచ్చారు. అలాంటి ఉపన్యాసం నేనెప్పుడూ వినలేదు. ఆ సందర్భంగా ఆయన ఇలా అన్నారు : నాకు తెలిసిన విషయాలు మీకు గనక తెలిస్తే మీరు చాలా తక్కువగా నవ్వుతారు. ఎక్కువగా విలపిస్తారు. ఆ మాట వినగానే ఆయన అనుచరులు ముఖాలమీద గుడ్డలు కప్పుకున్నారు. కాసేపటికి (లోపలి నుంచి)వారి శోకాలు వినిపించసాగాయి.

(బుఖారీ – ముస్లిం)

వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : దైవప్రవక్తకు తన అనుచరుల గురించి ఒక ఫిర్యాదు అందింది. అప్పుడాయన తమ అనుచరుల్ని ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ ఇలా అన్నారు : స్వర్గం మరియు నరకం నాకు కనిపించాయి. నేను ఈ రోజు చూసినంతటి మంచినీ, చెడునూ ఇదివరకెన్నడూ చూడలేదు. ఒకవేళ నాకు తెలిసిన విషయాలు గనక మీకు తెలిస్తే మీరు తక్కువగా నవ్వుతారు, ఎక్కువగా ఏడుస్తారు.

దైవప్రవక్త నుంచి ఆ మాట విన్న తర్వాత అనుచరులకు ఆ రోజు అత్యంత కఠినంగా గడిచింది. వాళ్ళు తలల మీద (గుడ్డలు) కప్పుకొని విలపించటం మొదలుపెట్టారు.

'ఖనీన్' అంటే ఏడుస్తూ ముక్కునుండి శోకాలు తీయటం అని అర్థం.

(సహీహ్ బుఖారీలోని ప్రేమైక వచనాల ప్రకరణం)

English

Anas bin Malik (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ delivered a Khutbah to us the like of which I had never heard from him before. He said, “If you knew what I know, you would laugh little and weep much”. Thereupon those present covered their faces and began sobbing.[Al-Bukhari and Muslim].

Another narration is: Messenger of Allah ﷺ heard of something about his Companions upon which he addressed them and said, “Jannah and (Hell) Fire were shown to me and I have never seen the like of this day in good and in evil. If you were to know what I know, you would laugh little and weep much”. His Companions experienced such suffering on that day that had no equal. They covered their faces and began to weep. [Al-Bukhari].

ముఖ్యాంశాలు

  1. ఈ హదీసు ద్వారా స్వర్గం మరియు నరకం ఎప్పుడో ఉనికిలోకి వచ్చివున్నాయని తెలుస్తోంది. దైవప్రవక్తకు వాటి దర్శనం కూడా చేయించటం జరిగింది.
  2. అతిగా నవ్వటం మంచిది కాదు. పరలోకం పట్ల ఏమరుపాటులో ఉన్నవారే, ఎక్కువగా నవ్వుతారు. కనుక ముస్లిం అయిన వ్యక్తి ఎల్లప్పుడూ సావధానంగా ఉంటూ, పరలోక చింతనలో జీవితం గడపాలి. ఎక్కువగా నవ్వటం వల్ల మనిషి హృదయం నిర్జీవమైపోతుందని మరికొన్ని హదీసులు హెచ్చరిస్తున్నాయి.
  3. ఒక విశ్వాసి హృదయం ఎల్లప్పుడూ దైవభీతితో, పరలోక చింతనతో నిండి ఉండాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|50. దైవభీతి|హదీసు 402

403

హదీసు 403

وعن المِقْدَاد، رضيَ اللَّه عنه، قَالَ: سَمِعْتُ رسولَ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَقُولُ: "تُدْني الشَّمْسُ يَومَ القِيَامَةِ مِنَ الخَلْقِ حتَّى تَكُونَ مِنْهُمْ كَمِقْدَارِ مِيل"قَالَ سُلَيمُ بْنُ عَامرٍ الرَّاوي عنْ المِقْدَاد: فَوَاللَّهِ مَا أَدْرِي مَا يَعْني بِالميلِ، أَمَسَافَةَ الأَرضِ أَمِ المِيل الَّذي تُكْتَحَلُ بِهِ العيْنُ"فَيَكُونُ النَّاسُ عَلَى قَدْرِ أَعْمالِهمْ في العَرَقِ، فَمِنْهُمْ مَنْ يَكُونُ إِلى كعْبَيْهِ، وَمِنْهُمْ مَنْ يَكُونُ إِلى رُكْبَتَيْهِ، ومِنْهُمْ منْ يَكون إِلى حِقْوَيْهِ ومِنْهُمْ مَنْ يُلْجِمُهُ العَرَقُ إِلجاماً" وَأَشَارَ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم بِيدِهِ إِلى فِيه. رواه مسلم.

దైవప్రవక్త ﷺ ఇలా చెబుతుండగా తాను విన్నానని హజ్రత్ మిఖ్దాద్ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు : ప్రళయదినాన సూర్యుడు సృష్టికి దగ్గర చేయబడతాడు. ఆఖరికి సూర్యునికీ – వారికీ మధ్య ఒక మైలు దూరమే మిగిలిపోతుంది.

మిఖ్దాద్ (రదియల్లాహు అన్హు) నుండి ఈ హదీసును గ్రహించిన ఉల్లేఖకుడు సులైమ్ బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు: దైవప్రవక్త ﷺ ఈ సందర్భంగా 'మీల్' అనే పదాన్ని వాడారు. అయితే మీల్ అంటే మైలు దూరమా లేక కళ్ళకు సుర్మా పెట్టుకోవటానికి ఉపయోగించే పుల్లమాదిరి వస్తువా? దైవసాక్షి! ఆయన ఏ ఉద్దేశ్యంతో 'మీల్' అని అన్నారో నాకు మాత్రం ఖచ్చితంగా తెలియదు. (ఎందుకంటే అరబీలో మీల్ అనే పదానికి రెండో అర్థం కూడా ఉంది.)

"సూర్యుడు అంత సమీపంలో మండుతున్నప్పుడు మానవులు తాము చేసుకున్న కర్మలకనుగుణంగా చెమటలో మునిగిపోయి ఉంటారు. కొంతమంది కాలి చీలమండల దాకా, మరికొందరు మోకాళ్ళదాకా, మరికొందరు నడుందాకా మునిగిపోయి ఉంటారు. మరికొందరికి చెమట కళ్ళెం వేసినట్లుంటులది. ఆ సందర్భంగా ఆయన తన నోటివైపు సైగ చేసి చూపించారు. (అంటే నోటి దాకా చెమటలో మునిగిపోయి ఉంటారని భావం). (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని స్వర్గసుఖాల ప్రకరణం)

English

Al-Miqdad (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “On the Day of Resurrection, the sun will come so close to people that there would be left only a distance of one Meel”. Sulaim bin `Amir said: By Allah, I do not know whether he meant by “Meel”, the mile of the distance measure or the stick used for applying antimony powder to the eye. (Messenger of Allah ﷺ is, however, reported to have said:) “The people then will be submerged in perspiration according to their deeds, some up to their ankles, some up to their knees, some up to the waist and some will have the bridle of perspiration (reaching their mouth and nose) and, while saying this Messenger of Allah ﷺ pointed to his mouth with his hand”.[Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో 'మీల్' అనే పదానికి సరైన అర్థమేమిటో ఉల్లేఖకునికి తెలియలేదు. ఒక మైలు దూరం అనే అర్థం తీసుకున్నప్పటికీ ఆ స్థితిలో మానవులపై సూర్యప్రతాపం ఎంత తీవ్రంగా ఉంటుందో కాస్త ఆలోచించండి! నేటి శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సూర్యుడు భూమికి 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు. అంతదూరాన ఉన్నప్పటికీ ఎండాకాలంలో ప్రజలు దాని వేడికి మలమల మాడిపోతారు. చెమటపట్టి బట్టలు కూడా తడిసిపోతాయి. మరి అదే సూర్యుడు భూమికి ఒక మైలంత సమీపానికి వచ్చేస్తే ఇక అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి!

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|50. దైవభీతి|హదీసు 403

404

హదీసు 404

وعن أَبي هريرة، رضيَ اللَّه عنه، أَنَّ رسولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "يَعْرَقُ النَّاسُ يَوْمَ القِيامَةِ حَتَّى يذْهَب عَرَقُهُمْ في الأَرْضِ سَبْعِينَ ذِراعاً، ويُلْجِمُهُمْ حَتَّى يَبْلُغَ آذَانَهُمْ" متفقٌ عَلَيهِ. ومعنى"يَذْهَبُ في الأَرْضِ": ينزِل ويغوص.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : ప్రళయదినాన మానవులు చెమటలో మునిగిపోయి ఉంటారు. వారి చెమట భూమిలోపల డెబ్భై గజాల దాకా ఇంకిపోయి ఉంటుంది. అది వారికి కళ్ళెం వేస్తుంది (అంటే నోటిదాకా వస్తుంది). ఆ తరువాత చెవుల దాకా వస్తుంది.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని ప్రేమైక వచనాల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని స్వర్గసుఖాల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “The people will perspire on the Day of Resurrection and their perspiration will be seventy cubits down in the earth and it will reach up to their ears (they will be bridled with it)”.[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|50. దైవభీతి|హదీసు 404

405

హదీసు 405

وعنه قَالَ: كُنَّا مَعَ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم إِذ سَمِعَ وَجْبَةً فَقَالَ: "هَلْ تَدْرُونَ مَا هَذَا؟ "قُلْنَا: اللَّه وَرَسُولُهُ أَعْلَمُ، قَالَ: هذَا حَجَرٌ رُمِيَ بِهِ في النَّارِ مُنْذُ سَبْعِينَ خَريفاً فَهُوَ يهْوِي في النَّارِ الآنَ حَتَّى انْتَهَى إِلى قَعْرِهَا، فَسَمِعْتُمْ وجْبَتَهَا" رواه مسلم.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు)గారే చేసిన కథనం : ఒకసారి మేము దైవప్రవక్త ﷺ వెంట ఉండగా ఏదో వస్తువు క్రింద పడ్డట్టు పెద్ద శబ్దం వినిపించింది. అప్పుడాయన మమ్మల్ని ఉద్దేశించి, "ఇప్పుడు వినపడిన శబ్దం ఏమిటో మీకు తెలుసా?" అని అడిగారు. మేము, "దేవునికి, ఆయన ప్రవక్తకే బాగా తెలుసు" అని అన్నాం. "డెబ్భై యేళ్ళ క్రితం ఒక రాయిని నరకంలో పడవేయటం జరిగింది. ఇప్పటివరకూ అది నరకం (కూపం)లో పడుతూనే ఉంది. ఇప్పుడే దాని అడుగు భాగానికి చేరుకుంది. ఇప్పుడు వినపడిన పెద్ద శబ్దం అదే!" అని అన్నారు దైవప్రవక్త ﷺ.

(ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని స్వర్గ సుఖాల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: We were in the company of Messenger of Allah ﷺ when we heard a bang. Thereupon Messenger of Allah ﷺ said. “Do you know what this (sound) is?” We said, “Allah and His Messenger know better.” He ﷺ said, “That is a stone which was thrown into Hell seventy years before and it has just reached its bottom”.[Muslim].

ముఖ్యాంశాలు

  1. నరక కూపమే డెబ్భై సంవత్సరాల లోతు ఉందంటే, అక్కడి శిక్ష ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఊహించండి.
  2. ఈ హదీసు ద్వారా ప్రవక్త సహచరుల మహిమ వెల్లడౌతోంది. దైవప్రవక్తతో పాటు వాళ్ళు కూడా నరకంలో రాయి పడిన శబ్దం విన్నారు.
  3. మానవులు అత్యంత బాధాకరమైన నరక శిక్షకు భయపడి చెడు ఆలోచనలకు, చెడు చేష్టలకు దూరంగా ఉండాలన్నదే ఈ హదీసు ఉద్దేశ్యం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|50. దైవభీతి|హదీసు 405

406

హదీసు 406

وعن عَدِيِّ بنِ حاتمٍ، رضي اللَّه عنه، قَالَ: قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَا مِنْكُمْ مِنْ أَحَدٍ إِلاَّ سَيُكَلِّمُهُ رَبُّهُ لَيْسَ بيْنَهُ وبَيْنَهُ تَرْجُمَانٌ، فَيَنْظُرُ أَيْمنَ مِنْهُ، فَلا يَرَى إِلاَّ مَا قَدَّمَ، وَيَنْظُرُ أَشْأَمَ مِنْهُ فَلاَ يَرى إلاَّ مَا قَدَّمَ، وينْظُرُ بيْنَ يَدَيهِ، فَلا يَرَى إِلاَّ النَّارِ تِلْقَاءَ وَجهِهِ، فاتَّقُوا النَّارِ وَلَوْ بِشِقِّ تَمْرَةٍ" متفقٌ عَلَيهِ.

హజ్రత్ అదీ బిన్ హాతిం (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు : మీలోని ప్రతి ఒక్కరితోనూ అతని ప్రభువు త్వరలోనే (నేరుగా) సంభాషించనున్నాడు. ఆ సమయంలో అతనికి అతని ప్రభువుకు మధ్య ఏ అనువాదకుడూ ఉండడు. అప్పుడు మానవుడు తన కుడివైపు చూస్తాడు. అక్కడ అతనికి తాను అంతకుముందు చేసిన కర్మలే కనిపిస్తాయి. ఎడమవైపు చూసినా తాను అంతకుముందు చేసిన ఆచరణే కనిపిస్తుంది. ఆ తరువాత అతను ముందువైపు చూస్తాడు. తన ముఖం ముందు నరకాగ్ని (భగభగ) మండుతూ కనిపిస్తుంది. అందుకే (చెబుతున్నాను), ఒక్క ఖర్జూరపు ముక్క (దానం) చేసి అయినా సరే మిమ్మల్ని మీరు నరకాగ్ని బారినుండి కాపాడుకోండి.

(బుఖారీ – ముస్లిం)

(ఈ హదీసు ఇంతకు ముందు కూడా వచ్చింది)

English

`Adi bin Hatim (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Everyone of you will speak to his Rubb without an interpreter between them. He will look to his right side and will see only the deeds he had previously done; he will look to his left and will see only the deeds he had previously done, and he will look in front of him and will see nothing but Fire (of Hell) before his face. So protect yourselves from Fire (of Hell), even by giving half a date-fruit (in charity)”.[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|50. దైవభీతి|హదీసు 406

407

హదీసు 407

وعن أَبي ذَرٍّ، رضي اللَّهُ عنه، قَالَ: قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِنِّي أَرى مالا تَرَوْنَ، وأسمع مالا تسمعون, أَطَّتِ السَّماءُ وحُقَّ لَهَا أَنْ تَئِطَّ، مَا فِيهَا موْضِعُ أَرْبَعِ أَصَابِعَ إِلاَّ وَمَلَكٌ واضِعٌ جبهتهُ ساجِداً للَّهِ تَعَالى، واللَّه لَوْ تَعْلَمُونَ مَا أَعْلَمُ، لضَحِكْتمْ قَلِيلاً، وَلَبكَيْتُمْ كَثِيراً، وَمَا تَلَذَّذتُم بِالنِّسَاءِ عَلَى الْفُرُشِ وَلَخَرجْتُمْ إِلى الصُّعُداتِ تَجْأَرُون إِلى اللَّه تَعَالَى "رواه الترمذي وَقالَ: حديثٌ حسن. وَ"أَطَّتْ"بفتح الهمزة وتشديد الطاءِ، وَتَئِطُّ"بفتح التاءِ وبعدها همزة مكسورة، والأَطِيطُ: صَوْتُ الرَّحلِ وَالْقَتَبِ وشِبْهِهِمَا، ومعْناهُ: أَنَّ كَثْرَةَ مَنْ في السَّماءِ مِنَ المَلائِكَةِ الْعابِدينَ قَدْ أَثْقَلَتْهَا حَتَّى أَطَّتْ. وَ"الصُّعُدَاتِ"بضم الصاد والعين: الطُّرُقَاتُ، ومعنى"تَجأَرُونَ": تَسْتَغِيثُونَ.

హజ్రత్ అబూజర్ర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : మీరు చూడలేని విషయాలు నేను చూస్తున్నాను. ఆకాశం కిక్కిరిసి పోతోంది. కిక్కిరిసిపోక తప్పదు కూడాను! (ఎందుకంటే) అక్కడ నాలుగు అంగుళాల ఖాళీ స్థలమయినా లేకుండా ప్రతిచోటా దైవదూతలు తమ నుదుటితో దైవానికి సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నారు. దైవసాక్షి! నాకు తెలిసిన విషయాలు మీకు గనక తెలిస్తే మీరు తక్కువగా నవ్వుతారు. ఎక్కువగా ఏడుస్తారు. (అంతేకాదు) మీరు మీ భార్యల ద్వారా పొందే పడక సుఖాన్ని కూడా విడిచిపెడతారు. దేవుణ్ణి వేడుకుంటూ (కొండల, అడవుల) మార్గాల్లో బయలుదేరుతారు.

(దీనిని తిర్మిజీ ఉల్లేఖించి 'హసన్'గా పేర్కొన్నారు)

'అత్తత్' (భూత క్రియాపదం) 'తయిత్తు' (వర్తమాన క్రియాపదం) దానినుంచే అతీత్ అనే పదం వస్తుంది. అంబారీ, చవుడోలు లాంటి వస్తువుల శబ్దం అని అర్థం. ఆకాశాన అత్యధిక సంఖ్యలో దూతలు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండటం చేత ఆకాశం కిక్కిరిసినట్లు శబ్దం వస్తోందని దీని భావం. 'సువుదాత్' అంటే దారులు, 'తజ్‌అరూన్' అంటే శరణును, సహాయాన్ని అర్థిస్తూ అని అర్థం.

(సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత ప్రకరణం)

English

Abu Dharr (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “I see what you do not see and I hear what you do not hear; heaven has squeaked, and it has right to do so. By Him, in Whose Hand my soul is, there is not a space of four fingers in which there is not an angel who is prostrating his forehead before Allah, the Exalted. By Allah, if you knew what I know, you would laugh little, weep much, and you would not enjoy women in beds, but would go out to the open space beseeching Allah”.[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

  1. మానవులు దైవానికి భయపడుతూ జీవితం గడపాలని ఈ హదీసు నొక్కి వక్కాణించింది. ఒక విశ్వాసి దేవుని గొప్పదనాన్ని ఎంత ఎక్కువగా శ్లాఘిస్తే అంత ఎక్కువగా అతని హృదయంలో దైవభీతి, ధర్మపరాయణతా భావాలు పెంపొందుతాయి. మనిషి దేవుని కారుణ్యం పట్ల ఆశాభావంతో పాటు దైవశిక్ష పట్ల భయంతో జీవితం గడుపుతాడు. ఫలితంగా మంచిపనులు చేస్తూ చెడులకు దూరంగా మసలుకోగల్గుతాడు.
  2. ఆకాశాన అత్యధిక సంఖ్యలో దైవదూతలు క్షణం తీరికలేకుండా ఎల్లప్పుడూ దైవం ముందు సాష్టాంగపడి దైవారాధన చేస్తూ ఉంటారు. దైవదూతలు దైవాజ్ఞల్ని ఉల్లంఘించటమనే ప్రసక్తే ఉండదు. అలాంటి దైవదూతలే అంతటి అకుంఠిత దీక్షతో దైవారాధన చేస్తున్నారంటే, ఇక అనునిత్యం దేవుని ఆదేశాలను అతిక్రమించే మానవులు దైవారాధన చేయటం ఎంత అవసరమో ఆలోచించండి! కనుక మనిషి అవిధేయతకు పాల్పడకుండా సత్కార్యాలు చేయటానికి దేవుని సహాయాన్ని అర్థిస్తూ, దుష్కార్యాల బారినుండి ఆయన శరణు వేడుకుంటూ ఉండటం చాలా అవసరం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|50. దైవభీతి|హదీసు 407

408

హదీసు 408

وعن أَبي بَرْزَة بِراءٍ ثُمَّ زايٍ نَضْلَةَ بنِ عُبَيْدٍ الأَسْلَمِيِّ، رضي اللَّه عنه، قَالَ: قالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لا تَزُولُ قَدمَا عبْدٍ حَتَّى يُسْأَلَ عَنْ عُمْرِهِ فِيمَ أَفْنَاهُ، وَعَنْ عِلْمِهِ فِيم فَعَلَ فِيهِ، وعَنْ مالِهِ منْ أَيْنَ اكْتَسبهُ، وَفِيمَ أَنْفَقَهُ، وَعَن جِسْمِهِ فِيمَ أَبْلاهُ "رواه الترمذي وَقالَ: حديث حسن صحيح.

హజ్రత్ అబూ బర్జా నజ్‌లా బిన్ ఉబైద్ అస్లమీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: ప్రళయదినాన ఈ ఐదు విషయాల గురించి దర్యాప్తు జరగనిదే దాసుడు దైవసన్నిధి నుంచి కదల్లేడు. 1. అతను తన జీవితాయుష్షును ఏ పనుల్లో గడిపాడు? 2. తన జ్ఞానాన్ని దేనికోసం ఉపయోగించాడు? 3. ధనాన్ని ఏ విధంగా సంపాదించాడు? 4. సంపాదించిన ధనాన్ని ఏ పనుల కోసం ఖర్చుపెట్టాడు? 5. (దేవుడు ప్రసాదించిన) శరీరాన్ని ఏ పనుల్లో వినియోగించాడు?

(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి, హసన్ మరియు సహీహ్‌గా పేర్కొన్నారు)

(సుననె తిర్మిజీలోని ప్రళయ వర్ణన ప్రకరణం)

English

Abu Barzah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Man’s feet will not move on the Day of Resurrection before he is asked about his life, how did he consume it, his knowledge, what did he do with it, his wealth, how did he earn it and how did he dispose of it, and about his body, how did he wear it out.”[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

  1. జీవితమనేది మనిషికి దేవుడు ప్రసాదించిన అమూల్య వరం. జీవితంలోని ప్రతి క్షణం ఎంతో విలువైనది. ప్రళయదినాన దేవుడు తాను అనుగ్రహించిన వరాల గురించి లెక్క తీసుకుంటాడు. కనుక మనిషి అమూల్యమైన తన జీవితాన్ని అవిధేయతా మార్గంలో వెచ్చించకూడదు.
  2. మనిషి తాను నేర్చుకున్న విద్యకు అనుగుణంగా ఆచరించాడా లేదా అనే విషయం గురించి దేవుని దర్బారులో ప్రశ్నించటం జరుగుతుంది. విద్యార్థి అనేవాడు తాను ఆర్జిస్తున్న జ్ఞానం ద్వారా సృష్టికర్తను గ్రహించగలగాలి. విద్య ద్వారా అతనిలో మంచిని ప్రేమించి, చెడుని విడనాడే విచక్షణా జ్ఞానం పెంపొందాలి. తన విద్య సాటి మానవులకు ప్రయోజనం చేకూర్చాలి. వారిని సన్మార్గంపై నడిపించాలి. అలాంటి జ్ఞానమే ప్రయోజనకరమైన జ్ఞానంగా పరిగణించబడుతుంది. ఇంకా పరలోకంలోనూ అదే ముక్తికి సోపానంగా కూడా పరిణమిస్తుంది.
  3. మనిషి ధర్మసమ్మతమైన మార్గాల ద్వారానే డబ్బు సంపాదించాలి. సంపాదించిన ధనాన్ని తిరిగి షరీఅత్ అనుమతించే పనుల్లోనే ఖర్చుపెట్టాలి. అక్రమంగా ఆర్జించటంగాని, దైవాజ్ఞల్ని ఉల్లంఘిస్తూ దుబారాగా డబ్బు ఖర్చుపెట్టడంగాని చేస్తే పరలోకంలో అలాంటి వ్యక్తి నేరస్తుడిగా పరిగణించబడతాడు. దేవుని సన్నిధిలో అతను తన పనులకు జవాబుదారీ వహించవలసి ఉంటుంది. అదేవిధంగా మనిషి శరీరం కూడా దేవుడు ప్రసాదించిందే! కాబట్టి దానిని చెడుపనుల నుండి కాపాడుకోవాలి. తమ శారీరక శక్తిని, సామర్థ్యాన్ని దేవుని ఆదేశాల్ని నిర్వర్తించటం కోసం ఉపయోగించాలి. అందులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా దేవుడు ప్రళయదినాన నిలదీస్తాడన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

మొత్తానికి ఈ హదీసు మానవుడు దైవానికి భయపడుతూ, పరలోకంలో తన కర్మలకు లెక్క చూపవలసి ఉంటుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాధ్యతాయుతంగా జీవితం గడపాలని ప్రబోధిస్తోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|50. దైవభీతి|హదీసు 408

409

హదీసు 409

وعن أبي هريرةَ، رضي اللَّه عنه، قَالَ: قرأَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: {يَوْمَئِذٍ تُحَدِّثُ أَخْبَارَهَا} [الزلزلة:٤] ثُمَّ قَالَ: "أَتَدْرُونَ مَا أَخَبَارُهَا؟ "قالوا: اللَّهُ ورَسُولُهُ أَعْلَمُ. قَالَ:"فَإِنَّ أَخْبَارَها أَنْ تَشْهَدَ عَلَى كُلِّ عَبْدٍ أَوْ أَمةٍ بِمَا عَمِلَ عَلَى ظَهْرِهَا، تَقُولُ: عَمِلْتَ كَذَا وكذَا في يَوْمِ كَذَا وَكَذَا، فهَذِهِ أَخْبَارُهَا" رواه التِّرْمِذِي وَقالَ: حديثٌ حسنٌ.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ఈ సూక్తిని పఠించారు : "ఆ రోజున భూమి తన (పైన సంభవించిన) విశేషాలను వివరిస్తుంది." (జిల్‌జాల్ సూరా)

ఆ తరువాత ఆయన తన సహచరులను, "భూమి వివరించే విశేషాలేమిటో మీకు తెలుసా?" అని అడిగారు. అందుకు సహచరులు "దేవుడు, దైవప్రవక్తకే బాగా తెలుసు" అని విన్నవించుకున్నారు. అప్పుడాయన ఈ విధంగా తెలియజేశారు: దేవుని దాసదాసీలు (అంటే మానవులు) తన వీపుపై చేసిన పనుల గురించి భూమి (ఆ రోజున) సాక్ష్యం చెబుతుంది. నువ్వు ఫలానా రోజు, ఫలానా పని చేశావు కదూ! అని అంటుంది. భూమి విశేషాలను వివరించటమంటే ఇదే! (తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హసన్‌గా పేర్కొన్నారు).

(సుననె తిర్మిజీలోని ప్రళయ వర్ణన ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ recited, “That Day it (the earth) will reveal its news (about all that happened over it of good or evil).” (99:4). Then he ﷺ inquired, “Do you know what its news are?” He was told: “Allah and His Messenger know better”. He said, “Its news is that it shall bear witness against every slave man and woman they did on its back. It will say: `You did this and this on such and such day.’ Those will be its news.”[At-Tirmidhi]

ముఖ్యాంశాలు

దేవుడు ప్రళయదినాన భూమికి కూడా మాట్లాడే శక్తిని ప్రసాదిస్తాడు. అప్పుడు అది మానవులు చేసిన పనుల్ని పూసగ్రుచ్చినట్లు వివరిస్తుంది. ప్రతి మనిషికి అతను చేసిన పనుల్ని సమయం, స్థలంతో సహా గుర్తు చేస్తుంది. తను చేసిన మంచిపనులకు లేదా చెడు పనులకు ఆ స్థలమే సాక్షిగా నిలబడుతుంది. కనుక మానవుడికి దాన్ని తిరస్కరించే అవకాశమే లేకుండాపోతుంది. మనిషి ఎంత రహస్యంగా పాపం చేసివున్నా సరే అతను దేవుని లెక్కనుండి మాత్రం తప్పించుకోలేడు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|50. దైవభీతి|హదీసు 409

410

హదీసు 410

وعن أَبي سعيدٍ الخُدْرِيِّ، رضي اللَّه عنه، قَالَ: قَالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:" كَيْفَ أَنْعَمُ وَصَاحِبُ الْقَرْنِ قَدِ الْتَقَمَ الْقَرْنَ، وَاسْتَمَعَ الإِذْنَ مَتَى يُؤْمَرُ بِالنَّفْخِ فَيَنْفُخُ"فَكَأَنَّ ذلِكَ ثَقُلَ عَلى أَصْحَابِ رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فقالَ لَهُمْ:"قُولُوا: حَسْبُنَا اللَّه وَنِعْمَ الْوكِيلُ "رواه الترمذي وقال حديثٌ حسنٌ. "الْقَرْنُ": هُوَ الصُّورُ الَّذِي قَالَ اللَّه تَعَالَى: {وَنُفِخَ في الصُّورِ} كَذَا فَسَّرَهُ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم.

హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ తన సహచరులతో మాట్లాడుతూ ఇలా అన్నారు : ప్రళయ శంఖం పూరించేవాడు (దైవదూత) శంఖాన్ని నోటి దగ్గర పెట్టుకొని (పూరించటానికి సిద్ధంగా) ఉన్నాడు. శంఖం పూరించటానికి దేవుని అనుమతి ఎప్పుడు లభిస్తుందా అని చెవులు రిక్కించి మరీ ఎదురు చూస్తున్నాడు. మరి అలాంటప్పుడు నేను నవ్వుతూ, త్రుళ్ళుతూ ఎలా ఉండగలను?!" ఆ మాట వినగానే సహచరులు భయంతో వణికిపోయారు. అది గమనించి దైవప్రవక్త "(భయపడకండి) హస్బునల్లాహు వనీమల్ వకీల్ (మాకు దేవుడున్నాడు. ఆయన శ్రేష్ఠుడైన కార్యసాధకుడు) అని అనండి" అంటూ వారికి ధైర్యం చెప్పారు.

(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి 'హసన్'గా పేర్కొన్నారు)

దివ్య ఖుర్‌ఆన్‌లో "ప్రళయదినాన శంఖం పూరించబడుతుందని" చెప్పబడిన శంఖమే ఈ హదీసులోని శంఖం కూడాను. శంఖం గురించి దైవప్రవక్త ﷺ కూడా ఇలాగే వివరించారు.

(సుననె తిర్మిజీలోని వ్యాఖ్యానాల ప్రకరణం)

English

Abu Sa`id Al-Khudri (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “How can I feel at ease when the Angel of the Trumpet, (Israfil) has put his lips to the Trumpet and is waiting for the order to blow it”. He ﷺ perceived as if this had shocked his Companions, so he ﷺ told them to seek comfort through reciting: `Hasbunallah wa ni`mal-Wakil [Allah (Alone) is Sufficient for us, and He is the Best Disposer of affairs (for us)]”.[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

దైవప్రవక్త ﷺ మరియు ఆయన సహచరుల వల్ల సాధారణంగా తప్పులు జరిగేవి కావు. ఆ మహానుభావులు పాపాలకు పాల్పడకుండా ఉండటానికి శాయశక్తులా ప్రయత్నించేవారు. మానవ సహజమైన దౌర్బల్యం వల్ల ఏదైనా తప్పు జరిగిపోతే వెంటనే పాపభీతితో నిలువెల్లా కంపించిపోయేవారు. అంతేకాదు, తమవల్ల జరిగిన వెనుకటి పాపాలన్నిటినీ మన్నించేశానని దేవుడు ప్రకటించినప్పటికీ, తమ ముందు ఎప్పుడైనా పరలోక ప్రస్తావన వస్తే, భయంతో వణికిపోయేవారు. కాని నేడు మనం పీకల దాకా పాపాల్లో కూరుకుపోయి ఉన్నాం. రేయింబవళ్ళలో ఎన్నో దైవాజ్ఞల్ని, దైవవిధులను నిర్లక్ష్యం చేస్తుంటాం. అయినా గాని మన హృదయాలలో దైవభీతి, పరలోక చింతన మచ్చుకైనా కానరాదు. మనలో రోజురోజుకీ పాపభీతి నశించిపోతోంది. మనం దీని గురించి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|50. దైవభీతి|హదీసు 410

411

హదీసు 411

وعن أَبي هريرة، رضي اللَّه عنه قال: قال رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَنْ خَافَ أَدْلَجَ، وَمَنْ أَدْلَجَ، بَلَغَ المَنْزلَ ألا إِنَّ سِلْعَةَ اللَّهِ غَاليةٌ، أَلا إِنَّ سِلْعةَ اللَّهِ الجَنَّةُ" رواه الترمذي وَقالَ: حديثٌ حسنٌ. وَ"أَدْلَجَ"بِإِسْكان الدَّال، ومعناه: سَارَ مِنْ أَوَّلِ اللَّيْلِ، وَالمُرَادُ: التَّشْمِيرُ في الطَّاعَة. واللَّه أعلم.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: భయపడినవాడు తెల్లవారక ముందే బయలుదేరుతాడు. తెల్లవారక ముందే బయలుదేరినవాడు గమ్యానికి చేరుకుంటాడు. జాగ్రత్తగా వినండి! అల్లాహ్ బేరం ఎంతో విలువైనది. ఇంకా జాగ్రత్తగా వినండి! అల్లాహ్ బేరమంటే స్వర్గమే సుమా!

(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హసన్‌గా పేర్కొన్నారు)

'అద్‌లజ' అంటే వేకువ జామున బయలుదేరటం. దైవాజ్ఞల్ని శిరసావహించటంలో త్వరపడటమని ఇక్కడ దాని భావం.

(సుననె తిర్మిజీలోని ప్రళయ వర్ణన ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: I heard Messenger of Allah ﷺ saying, “He who is afraid of the pillage of the enemy, sets out in the early part of the night; and he who sets out early, reaches his destination. Be on your guard that the commodity of Allah is precious. Verily the commodity of Allah is Jannah”.[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో దైవప్రవక్త ﷺ పరలోక చింతనతో జీవితం గడిపే ఒక విశ్వాసిని, శత్రువు దాడి నుండి కాపాడుకోవటానికి తెల్లవారకముందే బయలుదేరే బాటసారితో పోల్చారని ఇమామ్ తీబి (రహిమహుల్లాహ్) అభిప్రాయపడ్డారు. షైతాన్ విశ్వాసిని భ్రష్టుపట్టించటానికి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. మరోవైపు మనిషి మనసులోని చాంచల్యం, అతని మనోవాంఛలు కూడా షైతాన్‌కు దోహదం చేస్తాయి. మనిషి గనక ఈ పరలోక ప్రయాణంలో కడు జాగరూకతతో వ్యవహరిస్తూ, తన ఆచరణల్లో చిత్తశుద్ధిని కాపాడుకుంటే అతను షైతాన్ వలలో చిక్కుకోకుండా నిక్షేపంగా గమ్యానికి చేరుకుంటాడు.

ఈ పరలోక ప్రయాణం ఏమంత సులభమైన పని కాదు. ఈ మార్గంలో ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకోవలసి ఉంటుంది. దేవుడు విశ్వాసులకు ప్రసాదించే స్వర్గం ఓ అమూల్య వరం. మనిషి తన ధనప్రాణాలను దైవం కోసం త్యాగం చేయనంతవరకు ఆ అమూల్య వరాన్ని పొందలేడు.

"విశ్వాసుల నుండి అల్లాహ్ వారి ప్రాణాలనూ, వారి సంపదలను స్వర్గానికి బదులుగా కొన్నాడు." (అత్ తౌబా : 111వ సూక్తి)

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|50. దైవభీతి|హదీసు 411

412

హదీసు 412

وعن عائشةَ، رضي اللَّه عنها، قَالَتْ: سمعتُ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، يقول: "يُحْشَرُ النَّاسُ يَوْمَ الْقِيَامَةِ حُفَاةً عُراةً غُرْلاً"قُلْتُ: يَا رَسُول اللَّه الرِّجَالُ وَالنِّسَاءُ جَمِيعاً يَنْظُرُ بَعْضُهُمْ إِلى بَعْضٍ،؟ قَالَ:"يَا عَائِشَةُ الأَمرُ أَشَدُّ مِنْ أَنْ يُهِمَّهُم ذلكَ". وفي روايةٍ:"الأَمْرُ أَهَمُّ مِن أَن يَنْظُرَ بَعضُهُمْ إِلى بَعْضٍ"متفقٌ عَلَيهِ. "غُرلاً"بضَمِّ الغَيْنِ المعجمة, أي: غير مختونين.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : ఒకసారి దైవప్రవక్త ﷺ "ప్రళయదినాన మానవులు (హష్ర్ ప్రదేశంలో) బోసి పాదాలతో, నగ్న శరీరాలతో, వడుగులు చేయ బడనివారుగా సమీకరించబడతారు" అని చెప్పారు. అది విని నేను ఆశ్చర్యపోతూ "దైవప్రవక్తా! ఆ స్థితిలో స్త్రీ పురుషులు ఒకర్నొకరు చూసుకుంటారా?" అని అడిగాను. దానికాయన "ఆయిషా! ఆ స్థితి మహా ఆందోళనకరంగా ఉంటుంది. కనుక ఆ సమయంలో వారికి ఒకర్నొకరు చూసుకోవాలనే ఆలోచనే ఉండదు" అని అన్నారు. వేరొక ఉల్లేఖనం ప్రకారం "ఆ పరిస్థితి ఒకర్నొకరు చూసుకోలేనంత తీవ్రంగా ఉంటుంది" అని అన్నారు.

(బుఖారీ – ముస్లిం)

'గుర్‌లన్' అంటే వడుగులు చేయబడనివారుగా అని అర్థం.

(సహీహ్ బుఖారీలోని ప్రేమైక వచనాల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని స్వర్గ సుఖాల ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha) reported: I heard Messenger of Allah ﷺ saying, “The people will be assembled on the Day of Resurrection barefooted, naked and uncircumcised”. I said, “O Messenger of Allah! Will the men and the women be together on that Day; looking at one another?” Upon this Messenger of Allah ﷺ said, “O Aishah, the matter will be too serious for them to look at one another”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ప్రళయదినాన హష్ర్ స్థలంలో మానవులు భయాందోళనకరమైన పరిస్థితుల్ని ఎదుర్కోవలసి ఉంటుందని ఈ హదీసు హెచ్చరిస్తోంది. కనుక విశ్వాసులు పరలోకంలో దైవం ముందు తాము చేసివచ్చిన పనులకు జవాబుదారీ వహించవలసి ఉంటుందని గ్రహించాలి. దైవసన్నిధిలో హాజరుకాకముందే తమ ఆచరణలకు జవాబు చెప్పుకోవటానికి అన్నివిధాలా సిద్ధంగా ఉండాలి. ఒక్క క్షణమైనా పరలోకం పట్ల ఏమరుపాటు తగదు. ఆ రోజు ఎదురయ్యే పరాభవం, అవమానాల నుండి కాపాడుకోవటానికి ఇహలోకంలో భక్తీ విశ్వాసాలతో కూడిన జీవితం గడపాలి. దీనికి భిన్నంగా దైవం పట్ల, పరలోకం పట్ల ఏమాత్రం భయం లేకుండా, నిర్లజ్జగా బ్రతికేవారు ఎలాంటి ఘాతుకాలకయినా ఒడిగడతారు. దేవుడు విధించిన హద్దుల్ని చాలా సులువుగా అతిక్రమిస్తారు. అయితే అలాంటి వారు తమ కోసం దైవశిక్ష ఎల్లప్పుడూ మాటేసి ఉంటుందని గ్రహించాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|50. దైవభీతి|హదీసు 412