హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 46వ అధ్యాయం: దైవం కోసం ప్రేమించమని ప్రోత్సహించటం గురించి, తోటి మనిషిని ప్రేమిస్తే అతని ముందు తన ప్రేమను ప్రకటించటం గురించి, దానికి ఎదుటి వ్యక్తి ఇచ్చే సమాధానం గురించి. ఈ అధ్యాయంలో 2 ఖుర్ఆన్ ఆయతులు, 11 హదీసులు (హదీసు 376 – 386) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
46. దైవం కోసం ప్రేమించమని ప్రోత్సహించటం గురించి, తోటి మనిషిని ప్రేమిస్తే అతని ముందు తన ప్రేమను ప్రకటించటం గురించి, దానికి ఎదుటి వ్యక్తి ఇచ్చే సమాధానం గురించి…..
باب فضل الحب في الله والحث عليه وإعلام الرجل من يحبه أنه يحبه، وماذا يقول لَهُ إِذَا أعلمه
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ సెలవిచ్చాడు :
{مُحَمَّدٌ رَسُولُ اللَّهِ وَالَّذِينَ مَعَهُ أَشِدَّاءُ عَلَى الْكُفَّارِ رُحَمَاءُ} [الفتح:٢٩]
ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త. ఆయన వెంట ఉన్నవారు అవిశ్వాసుల పట్ల కఠినులుగానూ, పరస్పరం దయార్ద్ర హృదయులుగానూ ఉంటారు. (సూరా చివరి వరకు). (అల్ ఫతహ్ : 29)
వేరొకచోట ఆయన ఇలా అంటున్నాడు :
{وَالَّذِينَ تَبَوَّأُوا الدَّارَ وَالإيمَانَ مِنْ قَبْلِهِمْ يُحِبُّونَ مَنْ هَاجَرَ إِلَيْهِمْ} [الحشر:٩]
"శరణార్థుల రాకకు పూర్వమే, విశ్వసించి వలస కేంద్రంలో స్థిరపడినవారు తమ దగ్గరికి వలస వచ్చిన వారిని ప్రేమిస్తారు." (అల్ హష్ర్ : 9)
పైన పేర్కొనబడిన రెండు సూక్తులు విశ్వాసుల మధ్య స్నేహపూర్వక సంబంధాలుండాలనీ, వారు పరస్పరం ప్రేమభావంతో మెలగాలని ప్రబోధిస్తున్నాయి. ప్రవక్త సహచరులు కేవలం దైవప్రసన్నత కోసమే పరస్పరం ప్రేమించు కునేవారు. స్నేహ భావంతో కలిసిమెలిసి ఉండే వారు. వారి స్నేహంలో ప్రాపంచిక ఉద్దేశ్యాలు ఉండేవి కావు. విశ్వాసుల మధ్య ప్రేమ, సఖ్యతలు స్వార్థ ప్రయోజనాలకు అతీతంగా ఉంటాయి.
English
“Muhammad ﷺ is the Messenger of Allah. And those who are with him are severe against disbelievers, and merciful among themselves. You see them bowing and falling down prostrate (in prayer), seeking bounty from Allah and (His) Good Pleasure. The mark of them (i.e., of their Faith) is on their faces (foreheads) from the traces of prostration (during prayers). This is their description in the Taurat (Torah). But their description in the Injeel (Gospel) is like a (sown) seed which sends forth its shoot, then makes it strong, and becomes thick and it stands straight on its stem, delighting the sowers, that He may enrage the disbelievers with them. Allah has promised those among them who believe (i.e., all those who follow Islamic Monotheism, the religion of Prophet Muhammad ﷺ till the Day of Resurrection) and do righteous good deeds, forgiveness and a mighty reward (i.e., Jannah).” [Al-Fatḥ 48:29]
“And those who, before them, had homes (in Al-Madinah) and had adopted the Faith, – love those who emigrate to them…” [Al-Ḥashr 59:9]
హదీసు 376
وعن أَنسٍ رضي اللَّه عنه عن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "ثَلاثٌ مَنْ كُنَّ فِيهِ وَجَدَ بِهِنَّ حَلاَوَةَ الإِيَمَانِ: أَنْ يَكُونَ اللَّهُ وَرَسُولُهُ أَحَبَّ إِلَيْهِ مِمَّا، سِواهُما، وأَنْ يُحِبَّ المَرْءَ لاَ يُحِبُّهُ إِلاَّ للَّهِ، وَأَنْ يَكْرَه أَنْ يَعُودَ في الكُفْرِ بَعْدَ أَنْ أَنْقَذَهُ اللَّهُ مِنْهُ، كَمَا يَكْرَهُ أَنْ يُقْذَفَ في النَّارِ "متفقٌ عليه.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : ఈ మూడు లక్షణా లున్న వ్యక్తి విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదిస్తాడు. (ఒకటి) దేవుడు మరియు దైవప్రవక్త ﷺ తనకు అందరికన్నా ప్రియతములై ఉండాలి. (రెండు) కేవలం దైవప్రసన్నత కోసమే తోటి వ్యక్తిని ప్రేమించాలి. (మూడు) దేవుడు తనను అవిశ్వాస స్థితినుండి రక్షించిన తరువాత తిరిగి దాని వైపుకు మరలిపోవటాన్ని తను అగ్నిలో పడటాన్ని ఎంతగా అసహ్యించుకుంటాడో అంతగా అసహ్యించుకోవాలి. (బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణాలు)
English
Anas bin Malik (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “There are three qualities whoever has them, will taste the sweetness of Iman: To love Allah and His Messenger ﷺ more than anyone else; to love a slave (of Allah) only for (the sake of) Allah; and to abhor returning to infidelity after Allah has saved him from it as he would abhor to be thrown into the fire (of Hell)”.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
- విశ్వాసికి ఉండవలసిన ముఖ్య లక్షణాలలో ఒకటి, కేవలం దైవం కోసం ఇతరుల్ని ప్రేమించటం. దైవం కోసం ఇతరుల్ని ప్రేమించేవాడే వాస్తవానికి విశ్వాసమాధుర్యాన్ని ఆస్వాదించగలడు. అతని ప్రేమ, అతని స్నేహం ప్రాపంచిక ప్రయోజనాలకు అతీతంగా, నిస్వార్థంగా ఉంటుంది. అప్పుడు ఎన్ని కష్టాలెదురైనప్పటికీ ఆ స్నేహం చెక్కుచెదరకుండా స్థిరంగా ఉంటుంది.
- విశ్వంలోని ప్రతి వస్తువుకన్నా దేవుణ్ణీ, దైవప్రవక్తనే ఎక్కువగా అభిమానించాలి. వారి ఆజ్ఞల్ని, ఆదేశాల్ని పాలించాలి. ఆలుబిడ్డలు, తల్లిదండ్రుల ప్రేమకన్నా, ప్రాపంచిక వ్యామోహం కన్నా దేవుడు, దైవప్రవక్త ప్రసన్నతకే ఎక్కువ ప్రాధాన్యత నివ్వాలి.
- ఒకసారి ఇస్లాం స్వీకరించిన తరువాత ఇక దాని పట్ల వైముఖ్యం చూపకూడదు. తన అవిశ్వాసం మూలంగా నరకాగ్నిలో పడబోతున్న మనిషిని దేవుడు రక్షించి విశ్వాస భాగ్యాన్ని ప్రసాదించాడు. ఆ వ్యక్తి తిరిగి అవిశ్వాసం వైపుకు మరలితే నరకంలో పడక తప్పదు. కావాలని ఎవరూ అగ్నిగుండంలో దూకరు. మరలాంటప్పుడు దైవ అవిధేయతకు పాల్పడకుండా ఉండాలి కదా!
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|46. దైవం కోసం ప్రేమించమని ప్రోత్సహించటం గురించి, తోటి మనిషిని ప్రేమిస్తే అతని ముందు తన ప్రేమను ప్రకటించటం గురించి, దానికి ఎదుటి వ్యక్తి ఇచ్చే సమాధానం గురించి…..|హదీసు 376
హదీసు 377
وعن أبي هريرة رضي اللَّه عنه عن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "سبْعَةٌ يُظِلُّهُم اللَّه في ظِلِّهِ يَوْمَ لاَ ظِلَّ إِلاَّ ظِلُّهُ: إِمامٌ عادِلٌ، وَشَابٌ نَشَأَ في عِبَادَةِ اللَّهِ عَزَّ وَجلَّ، وَرَجُلٌ قَلْبُهُ مَعلَّقٌ بِالمَسَاجِدِ ورَجُلان تَحَابَّا في اللَّهِ اجْتَمَعَا عَلَيْهِ، وَتَفَرَّقَا عَلَيْهِ، ورَجُلٌ دَعَتْهُ امْرَأَةٌ ذَاتُ مَنْصِبٍ وَجَمَالٍ، فَقال: إِنِّي أَخافُ اللَّه، وَرَجُلٌ تَصَدَّقَ بصَدَقَةٍ، فَأَخْفَاهَا حَتَّى لاَ تَعْلَمَ شِمَالُهُ مَا تُنْفِقُ يَمِينُهُ، وَرَجُلٌ ذَكَرَ اللَّهَ خَالِياً فَفَاضَتْ عَيْنَاهُ" متفقٌ عَلَيهِ.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు : దేవుని నీడ తప్ప మరెలాంటి నీడ కనబడని (ప్రళయ) దినాన దేవుడు ఏడుగురిని తన (కారుణ్య) నీడలో ఉంచుతాడు. ఆ ఏడుగురు : (1) న్యాయంగా పాలించిన పరిపాలకుడు. (2) తన యవ్వనాన్ని దైవారాధనలో గడిపిన యువకుడు. (3) మనసు ధ్యాస అంతా మస్జిద్లోనే ఉండే వ్యక్తి. (4) కేవలం దైవప్రసన్నత కోసం పరస్పరం ప్రేమించుకునే ఇద్దరు వ్యక్తులు. (అలాగే), దైవప్రసన్నత ప్రాతిపదికగా పరస్పరం విడిపోయేవారు. (5) సౌందర్యం, సౌకుమార్యం కలిగి వున్న స్త్రీ చెడు కార్యానికి పిలిస్తే తాను దేవునికి భయపడుతున్నానంటూ ఆమె కోరికను నిరాకరించిన వ్యక్తి. (6). కుడి చేత్తో చేసింది ఎడమ చేతికి కూడా తెలియనంత గోప్యంగా దానాలు చేసిన వ్యక్తి. (7) ఏకాంతంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని (ఆయన భీతితో) కన్నీరు కార్చిన వ్యక్తి. (బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని అజాన్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “Seven are (the persons) whom Allah will give Shade of His Thrown on the Day when there would be no shade other than His Throne’s Shade: A just ruler; a youth who grew up worshipping Allah; a man whose heart is attached to mosques; two persons who love and meet each other and depart from each other for the sake of Allah; a man whom an extremely beautiful woman seduces (for illicit relation), but he (rejects this offer by saying): `I fear Allah’; a man who gives in charity and conceals it (to such an extent) that the left hand does not know what the right has given; and a person who remembers Allah in solitude and his eyes well up”.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ఈ హదీసులో దేవుడు ప్రళయదినాన ముఖ్యంగా ఏడుగురికి తన కారుణ్య ఛాయలో ఆశ్రయం కల్పిస్తాడని చెప్పబడింది. మరికొన్ని హదీసుల్లో ఈ ఆచరణలుగాక ఇతర ఆచరణల వల్ల కూడా ప్రళయదినాన ఆ సౌభాగ్యం లభిస్తుందని చెప్పబడింది. ఇలాంటి ఆచరణల సంఖ్య డెబ్బై వరకు ఉండవచ్చని పండితులు అభిప్రాయపడుతున్నారు. దైవప్రవక్త ﷺ ఈ హదీసుల్ని వేర్వేరు సమయాలలో సందర్భోచితంగా చెప్పి ఉంటారు కాబట్టి వీటిమధ్య ఎలాంటి వైరుధ్యం లేదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|46. దైవం కోసం ప్రేమించమని ప్రోత్సహించటం గురించి, తోటి మనిషిని ప్రేమిస్తే అతని ముందు తన ప్రేమను ప్రకటించటం గురించి, దానికి ఎదుటి వ్యక్తి ఇచ్చే సమాధానం గురించి…..|హదీసు 377
హదీసు 378
وعنه قَالَ: قَالَ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إنّ اللَّه تَعَالَى يقولُ يَوْمَ الْقِيَامةِ: أَيْنَ المُتَحَابُّونَ بِجَلالِي؟ الْيَوْمَ أُظِلُّهُمْ فِي ظِلِّي يَومَ لاَ ظِلَّ إِلاَّ ظِلِّي" رواه مسلم.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు : ప్రళయదినాన దేవుడు, "నా ఔన్నత్యం ప్రాతిపదికపై పరస్పరం అభిమానించుకున్న వారు ఎక్కడున్నారు? నా (కారుణ్య) నీడ తప్ప మరే నీడా లభించని ఈ రోజు నేను వారికి నా నీడ పట్టున ఆశ్రయం కల్పిస్తాను" అని అంటాడు. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని సత్కార్యాలు – సత్సంబంధాల ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “On the Day of Resurrection, Allah, the Exalted, will say: `Where are those who have mutual love for the sake of My Glory? Today I shall shelter them in My Shade when there will be no shade except Mine”.[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|46. దైవం కోసం ప్రేమించమని ప్రోత్సహించటం గురించి, తోటి మనిషిని ప్రేమిస్తే అతని ముందు తన ప్రేమను ప్రకటించటం గురించి, దానికి ఎదుటి వ్యక్తి ఇచ్చే సమాధానం గురించి…..|హదీసు 378
హదీసు 379
وعنه قَالَ: قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "وَالَّذِي نَفْسِي بِيَدِهِ لا تَدْخُلُوا الجَنَّةَ حَتَّى تُؤْمِنُوا، وَلا تُؤْمِنُوا حَتَّى تَحَابُّوا، أَوَلا أَدُلُّكُمْ عَلَى شَيءٍ إِذَا فَعَلْتُمُوه تَحَابَبْتُمْ؟ أَفْشُوا السَّلامَ بينَكم" رواه مسلم.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : ఎవరి చేతిలోనయితే నా ప్రాణముందో ఆయన సాక్షిగా చెబుతున్నాను! మీరు విశ్వసించనంతవరకు స్వర్గంలోకి ప్రవేశించలేరు. అలాగే మీరందరూ (కేవలం దైవం కోసం) పరస్పరం అభిమానించుకోనంత వరకూ (నిజమైన) విశ్వాసులు కాజాలరు. మీ మధ్య అభిమానం పెంపొందాలంటే మీరు ఏం చెయ్యాలో చెప్పనా? 'సలాంను మీ మధ్య సర్వసామాన్యం చేసుకోండి.' (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “By Him in Whose Hand my soul is! You will not enter Jannah until you believe, and you shall not believe until you love one another. May I inform you of something, if you do, you love each other. Promote greeting amongst you (by saying As-salamu `alaikum to one another)”.[Muslim].
ముఖ్యాంశాలు
'సలాం' (అస్సలాము అలైకుమ్ అని అనటం) పరస్పర ప్రేమ భావాన్ని పెంపొందింపజేస్తుంది. అందుకే పరిచితులైనా, అపరిచితులైనా ప్రతి ఒక్కరికీ సలాం చెయ్యాలని తాకీదు చేయబడింది. కేవలం సలాం చేయటం మూలంగానే విశ్వాసులు అయిపోతారని, స్వర్గంలోకి ప్రవేశిస్తారని దీనర్థం ఎంతమాత్రం కాదు. ఆచరణ లేని విశ్వాసం వల్ల ప్రయోజనం ఉండదని చెప్పటమే ఈ హదీసు ఉద్దేశ్యం. విశ్వాసం మరియు ఆచరణ రెండూ తోడయితేనే మనిషికి స్వర్గభాగ్యం లభించేది!
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|46. దైవం కోసం ప్రేమించమని ప్రోత్సహించటం గురించి, తోటి మనిషిని ప్రేమిస్తే అతని ముందు తన ప్రేమను ప్రకటించటం గురించి, దానికి ఎదుటి వ్యక్తి ఇచ్చే సమాధానం గురించి…..|హదీసు 379
హదీసు 380
وعنه عن النَّبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:" أَنَّ رَجُلاً زَار أَخاً لَهُ في قَرْيَةٍ أُخْرَى، فَأَرْصَد اللَّهُ لَهُ عَلَى مَدْرَجتِهِ مَلَكاً"وذكر الحديث إِلَى قوله:"إِن اللَّه قَدْ أَحَبَّكَ كَمَا أَحْبَبْتَهُ فِيهِ "رواه مسلم. وقد سبق بالبابِ قبله.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం : ఒక వ్యక్తి వేరొక ఊరిలో ఉంటున్న తన సోదరుణ్ణి కలవటానికని బయలుదేరాడు. అది గమనించి దేవుడు అతను వెళ్ళేదారిలో అతని రక్షణ నిమిత్తం ఒక దూతను కూర్చో బెట్టాడు…. (ఈ హదీసు ఇంతకు ముందు కూడా వచ్చింది. అందులో చివరిలో ఈ వాక్యం ఉంది:) నీవు నీ సోదరుణ్ణి దైవప్రసన్నత కోసం ప్రేమించినట్లే దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు." (ముస్లిం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “A man set out to visit a brother (in Faith) in another town and Allah sent an angel on his way. When the man met the angel, the latter asked him, “Where do you intend to go?” He said, “I intend to visit my brother in this town”. The angel said, “Have you done any favour to him?” He said, “No, I have no desire except to visit him because I love him for the sake of Allah, the Exalted, and Glorious.” Thereupon the angel said, “I am a messenger to you from Allah (to inform you) that Allah loves you as you love him (for His sake)”.[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|46. దైవం కోసం ప్రేమించమని ప్రోత్సహించటం గురించి, తోటి మనిషిని ప్రేమిస్తే అతని ముందు తన ప్రేమను ప్రకటించటం గురించి, దానికి ఎదుటి వ్యక్తి ఇచ్చే సమాధానం గురించి…..|హదీసు 380
హదీసు 381
وعن البَرَاءِ بْنِ عَازبٍ رضي اللَّهُ عنهما عن النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أَنه قَالَ في الأَنْصَار: "لاَ يُحِبُّهُمْ إِلاَّ مُؤمِنٌ، وَلا يُبْغِضُهُمْ إِلاَّ مُنَافِقٌ، مَنْ أَحَبَّهُمْ أحبَّه اللَّهُ، وَمَنْ أَبْغَضَهُمْ أَبْغَضَهُ اللَّه" متفقٌ عَلَيهِ.
హజ్రత్ బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు : అన్సార్ ముస్లింలను (నిజమైన) విశ్వాసులు అభిమానిస్తారు. కపటులు మాత్రమే వారిని ద్వేషించగలరు. (తెలుసుకోండి!) అన్సార్లను అభిమానించిన వారిని దేవుడు అభిమానిస్తాడు. వారిని ద్వేషించినవారిని దేవుడు (కూడా) ద్వేషిస్తాడు. (బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని ప్రవక్త సహచరుల మహిమోన్నతుల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణం)
English
Al-Bara’ bin `Azib (radiyallahu anhuma) reported: The Prophet ﷺ said about the Ansar: “Only a believer loves them, and only a hypocrite hates them. Allah loves him who loves them and Allah hates him who hates them”.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
మదీనాలో ఔస్ మరియు ఖజ్రజ్ అనే రెండు తెగలుండేవి. ఇస్లాంకు పూర్వం ఈ రెండు తెగల మధ్య ఎల్లప్పుడూ చీటికిమాటికి తగాదాలు, కొట్లాటలు జరుగుతుండేవి. ఇస్లాం స్వీకరించిన తరువాత ఈ రెండు తెగలవారు ఐకమత్యంతో మెలగటమేగాక ఇతర ప్రాంతాలనుండి మదీనాకు వలస వచ్చిన విశ్వాసుల పట్ల నిరుపమాన ఔదార్యాన్ని ప్రదర్శించారు. అన్సార్లు ఇస్లాంకు, ముస్లింలకు, స్వయాన దైవప్రవక్తకు చేసిన సేవలు ఇస్లామీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవి. వారు అడుగడుగునా దైవప్రవక్తకు సహకరించారు. ఇస్లాం ధర్మ ఔన్నత్యం కోసం తమ సర్వస్వాన్ని ధారపోశారు. వారు ఇస్లాంకు చేసిన ఎనలేని సేవలకు గుర్తింపుగా దేవుడు వారికి 'అన్సార్' (సహాయకులు) అనే కితాబు ఇచ్చాడు. వారి పట్ల అభిమానం కల్గి వుండటం విశ్వాసానికి చిహ్నంగా చేశాడు. వారిని ప్రేమించేవారు, వారిని తమ అభిమానులుగా భావించినవారే నిజమైన విశ్వాసులని, వారిని ద్వేషించేవారు, వారిపట్ల విరోధాన్ని పెంచుకునేవారు కపటులని ప్రకటించాడు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|46. దైవం కోసం ప్రేమించమని ప్రోత్సహించటం గురించి, తోటి మనిషిని ప్రేమిస్తే అతని ముందు తన ప్రేమను ప్రకటించటం గురించి, దానికి ఎదుటి వ్యక్తి ఇచ్చే సమాధానం గురించి…..|హదీసు 381
హదీసు 382
وعن مُعَاذٍ رضي اللَّه عنه قالَ: سمِعتُ رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقول: " قَالَ اللَّهُ عَزَّ وَجَلَّ: المُتَحَابُّونَ في جَلالي، لَهُمْ مَنَابِرُ مِنْ نُورٍ يَغْبِطُهُمْ النَّبِيُّونَ وَالشُّهَدَاءُ". رواه الترمذي وَقالَ: حديثٌ حسنٌ صحيحٌ.
దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించగా తాను విన్నానని హజ్రత్ ముఆజ్ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు : దేవుడు ప్రళయదినాన, "నా ఔన్నత్యం ప్రాతిపదికపై పరస్పరం అభిమానించుకున్న వారు ఎక్కడున్నారు? వారికోసం ప్రవక్తలు, అమరవీరులు సయితం అసూయ చెందేటటువంటి జ్యోతిర్మయ వేదికలు (సిద్ధంగా) ఉన్నాయి" అని అంటాడు.
(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి, హసన్ మరియు సహీహ్గా పేర్కొన్నారు.)
(సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత ప్రకరణం)
English
Mu`adh (bin Jabal) (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Allah, the Exalted, has said: `For those who love one another for the sake of My Glory, there will be seats of light (on the Day of Resurrection), and they will be envied by the Prophets and martyrs”.[At-Tirmidhi].
ముఖ్యాంశాలు
దైవప్రసన్నత కోసం, దైవధర్మ ఔన్నత్యం కోసం పరస్పరం అభిమానించుకునేవారికి ప్రళయదినాన దేవుని సన్నిధిలో ఎంతో గౌరవప్రదమైన స్థానం లభిస్తుందని చెప్పబడింది. ఇక్కడ దైవప్రవక్తలు వారి గౌరవస్థానాన్ని చూసి ఈర్ష్య చెందుతారంటే వారికి ప్రవక్తల కంటే గొప్ప స్థానం లభిస్తుందని భావం ఎంతమాత్రం కాదు. స్వర్గంలో అందరికంటే గొప్ప స్థానాన్ని పొందేవారు దైవప్రవక్తలే. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ధర్మం ప్రాతిపదికపై పరస్పరం అభిమానించుకునేవారికి కూడా ఎంతో ఉన్నతస్థానం లభిస్తుంది. దాన్ని చూసి ప్రవక్తలు, అమరవీరులు కూడా అబ్బురపోతారు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|46. దైవం కోసం ప్రేమించమని ప్రోత్సహించటం గురించి, తోటి మనిషిని ప్రేమిస్తే అతని ముందు తన ప్రేమను ప్రకటించటం గురించి, దానికి ఎదుటి వ్యక్తి ఇచ్చే సమాధానం గురించి…..|హదీసు 382
హదీసు 383
وعن أَبي إِدريس الخَولانيِّ رَحِمَهُ اللَّهُ قَالَ: دَخَلْتُ مَسْجِدَ دِمَشْقَ، فَإِذَا فَتًى بَرَّاقُ الثَّنَايَا وَإِذَا النَّاسُ مَعهُ، فَإِذَا اخْتَلَفُوا في شَيءٍ، أَسْنَدُوهُ إِلَيْهِ، وَصَدَرُوا عَنْ رَأْيهِ، فَسَأَلْتُ عَنْهُ، فَقِيلَ: هَذَا مُعَاذُ بْنُ جَبَلٍ رضي اللَّه عنه، فَلَمَّا كَانَ مِنَ الْغَدِ، هَجَّرْتُ، فَوَجَدْتُهُ قَدْ سَبَقَنِي بِالتَّهْجِيرِ، ووَجَدْتُهُ يُصَلِّي، فَانْتَظَرْتُهُ حَتَّى قَضَى صلاتَهُ، ثُمَّ جِئْتُهُ مِنْ قِبَلِ وجْهِهِ، فَسَلَّمْتُ عَلَيْهِ، ثُمَّ قُلْتُ: وَاللَّهِ إِنِّي لأَحِبُّكَ للَّهِ، فَقَالَ: آللَّهِ؟ فَقُلْتُ: أَللَّهِ، فَقَالَ: آللَّهِ؟ فَقُلْتُ: أَللَّهِ، فَأَخَذَني بِحَبْوَةِ رِدَائي، فَجَبذَني إِلَيْهِ، فَقَالَ: أَبْشِرْ، فَإِنِّي سَمِعْتُ رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقول: "قالَ اللَّهُ تَعَالَى وَجَبَتْ مَحبَّتِي لِلْمُتَحَابِّينَ فيَّ، والمُتَجالِسِينَ فيَّ، وَالمُتَزَاوِرِينَ فيَّ، وَالمُتَباذِلِينَ فيَّ" حديث صحيح رواه مالِكٌ في المُوطَّإِ بإِسنادِهِ الصَّحيحِ. قَوْلُهُ"هَجَّرْتُ"أَيْ بَكَّرْتُ، وهُوَ بتشديد الجيم قوله:"آللَّهِ فَقُلْتُ: أَللَّهِ"الأَوَّلُ بهمزةٍ ممدودةٍ للاستفهامِ، والثاني بِلا مدٍ.
హజ్రత్ అబూ ఇద్రీస్ ఖౌలానీ (రహిమహుల్లాహ్) కథనం : నేనొకసారి డెమాస్కస్లోని మస్జిద్కు వెళ్ళాను. అక్కడ నాకు ఓ యువకుడు కనిపించాడు. అతని ముందరి రెండు పళ్ళు మిలమిల మెరిసిపోతున్నాయి. ప్రజలు అతని దగ్గర కూర్చొని తమ మధ్య ఏర్పడే విభేదాలను అతనికి నివేదించుకుంటున్నారు. వాటి విషయంలో ఆయన అభిప్రాయాలను అంగీకరిస్తున్నారు. ఈయన ఎవరని నేను అక్కడున్న వారిని అడిగాను. వారు "ఈయన (దైవప్రవక్త అనుచరులు) ముఆజ్ బిన్ జబల్" అని చెప్పారు.
మరుసటి రోజు నేను పెందలాడే మస్జిద్కు చేరుకున్నాను. కాని ఆయన నాకంటే ముందుగానే వచ్చి నమాజ్ చేసుకుంటున్నారు. నేను ఆయన నమాజు ముగించుకునేవరకు ఆగి, తరువాత ఆయనకు ఎదురుగా వెళ్ళి సలాం చేసి, "దైవసాక్షి! దైవం కోసం నేను మిమ్మల్ని అభిమానిస్తున్నాను" అని అన్నాను. దానికి ఆయన "నిజంగా దైవం కోసమే అభిమానిస్తున్నారా?" అని అడిగారు. "దైవసాక్షి! నిజంగా దైవం కోసమే అభిమానిస్తున్నాను" అని అన్నాను నేను. ఆయన మళ్ళీ "నిజంగా నేనా?" అని అడిగారు. నేను "నిజం. దైవసాక్షి!" అని విన్నవించుకున్నాను. అప్పుడు ఆయన నా దుప్పటి కొన పట్టుకొని నన్ను తన వైపుకు లాక్కుని "మరయితే ఈ శుభవార్త విని సంతోషించు. దైవప్రవక్త ﷺ ఇలా చెబుతుండగా నేను విన్నాను –
"దేవుడు – తన కోసం పరస్పరం అభిమానించుకునేవారిని, తనకోసం ఒకచోట సమావేశమయ్యేవారిని, తన కోసం ఒండొకరిని సందర్శించు కునేవారిని, తన కోసం ఒండొకరిపై ఖర్చుచేసేవారిని తాను తప్పకుండా ప్రేమిస్తానని అంటున్నాడు."
(ఈ హదీసు దృఢమైనది. దీనిని ఇమామ్ మాలిక్ తన గ్రంథం 'మువత్తా'లో పేర్కొన్నారు.)
'హజ్జర్తు' అంటే పెందలాడే వెళ్ళటం. 'ఆల్లాహి ఫ ఖుల్తు అల్లాహి" ఇందులో మొదటి అల్లాహ్ పదాన్ని దీర్ఘంగా, రెండవ పదాన్ని హ్రస్వంగా పలకాలి. దీర్ఘంగా 'ఆల్లాహి' అని పలికితే అది ప్రశ్నార్థకాన్ని సూచిస్తుంది.
(ముఅత్తా ఇమామ్ మాలిక్లోని కవితా ప్రకరణం)
English
Abu Idris Al-Khaulani (May Allah had mercy upon him) reported: I once entered the mosque in Damascus. I happened to catch sight of a young man who had bright teeth (i.e., he was always seen smiling). A number of people had gathered around him. When they differed over anything they would refer it to him and act upon his advice. I asked who he was and I was told that he was Mu`adh bin Jabal (radiyallahu anhu) The next day I hastened to the mosque, but found that he had arrived before me and was busy in performing Salat. I waited until he finished, and then went to him from the front, greeted him with Salam and said to him, “By Allah I love you.” He asked, “For the sake of Allah?” I replied, “Yes, for the sake of Allah”. He again asked me, “Is it for Allah’s sake?” I replied, “Yes, it is for Allah’s sake.” Then he took hold of my cloak, drew me to himself and said, “Rejoice,! I heard Messenger of Allah ﷺ saying, `Allah, the Exalted says: My love is due to those who love one another for My sake, meet one another for My sake, visit one another for My sake and spend in charity for My sake”.[Malik].
ముఖ్యాంశాలు
- ఏ పనిచేసినా దైవప్రసన్నతను దృష్టిలో పెట్టుకొని చేసేవారు దేవుని అభిమానానికి పాత్రులవుతారు.
- మనిషికి ఎవరిపట్లనయినా ప్రేమాభిమానాలుంటే ఆ విషయం అతనికి తెలియజేయాలి.
- ఇతరులు ప్రార్థనలో నిమగ్నులై ఉన్నప్పుడు వారిని కలుసుకోవాలనుకునేవారు, వారు ప్రార్థన ముగించుకునేంతవరకు వేచి ఉండాలి. ప్రార్థన సమయంలో వారికి ఎదురుగా కూర్చోకూడదు. దీనివల్ల వారి ఏకాగ్రతకు భంగం కలిగే అవకాశం ఉంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|46. దైవం కోసం ప్రేమించమని ప్రోత్సహించటం గురించి, తోటి మనిషిని ప్రేమిస్తే అతని ముందు తన ప్రేమను ప్రకటించటం గురించి, దానికి ఎదుటి వ్యక్తి ఇచ్చే సమాధానం గురించి…..|హదీసు 383
హదీసు 384
عن أَبي كَريمةَ المِقْدَادِ بن مَعْدِ يكَرب رضي اللَّه عنه عن النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ"إِذَا أَحَبَّ الرَّجُلُ أَخَاهُ، فَلْيُخْبِرْه أَنَّهُ يُحِبُّهُ"رواه أَبُو داود، والترمذي وَقالَ: حديثٌ حسنٌ.
హజ్రత్ అబూ కరీమా మిఖ్దాద్ బిన్ మాదీకరిబ్ (రదియల్లాహు అన్హు)కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: మనిషికి తన (తోటి) సోదరుని పట్ల అభిమానముంటే, తాను అతన్ని అభిమానిస్తున్నట్లు అతనికి తెలియజెయ్యాలి.
(దీనిని అబూదావూద్ మరియు తిర్మిజీలు ఉల్లేఖించారు. తిర్మిజీ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు.)
(సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత ప్రకరణం, సుననె అబూదావూద్లోని సంస్కార ప్రకరణం)
English
Abu Karimah Al-Miqdad bin Ma`dikarib (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “When a man loves his brother (for Allah sake) let him tell him that he loves him”.[At-Tirmidhi and Abu Dawud].
ముఖ్యాంశాలు
ఎదుటివ్యక్తికి తాను అతన్ని అభిమానిస్తున్నట్లు తెలియజేయటంలోని మర్మం ఏమిటంటే, ఈ సంగతి ఎదుటి వ్యక్తికి కూడా తెలిసిపోతుంది. అప్పుడు అతను కూడా మొదటి వ్యక్తిని అభిమానించటం మొదలుపెడతాడు. ఫలితంగా వారి మధ్య స్నేహం ఏర్పడుతుంది. దైవం కోసం చేసే ఈ స్నేహం ధర్మానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|46. దైవం కోసం ప్రేమించమని ప్రోత్సహించటం గురించి, తోటి మనిషిని ప్రేమిస్తే అతని ముందు తన ప్రేమను ప్రకటించటం గురించి, దానికి ఎదుటి వ్యక్తి ఇచ్చే సమాధానం గురించి…..|హదీసు 384
హదీసు 385
وعن مُعَاذٍ رضي اللَّه عنه، أَنَّ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، أَخَذَ بِيَدِهِ وَقالَ: "يَا مُعَاذُ واللَّهِ، إِنِّي لأُحِبُّكَ، ثُمَّ أُوصِيكَ يَا مُعاذُ لاَ تَدَعنَّ في دُبُرِ كُلِّ صلاةٍ تَقُولُ: اللَّهُم أَعِنِّي عَلَى ذِكْرِكَ وَشُكْرِكَ، وحُسنِ عِبَادتِك ". حديث صحيحٌ، رواه أَبُو داود والنسائي بإسناد صحيح.
హజ్రత్ ముఆజ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఒకసారి తన చెయ్యి పట్టుకొని ఇలా అన్నారు : ఓ ముఆజ్! దైవసాక్షిగా చెబుతున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇంకా ఓ ముఆజ్! ప్రతి నమాజు తరువాత "అల్లాహుమ్మ అయిన్నీ అలా జిక్రిక, వ షుక్రిక, వ హుస్ని ఇబాదతిక్" (దేవా! నేను నీ ధ్యానం చేయటానికి, నీకు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి, తగు రీతిలో నిన్ను ఆరాధించటానికి నాకు సహాయం చెయ్యి) అని చెప్పటం మాత్రం వదలిపెట్టవద్దని నేను నీకు ఉపదేశిస్తున్నాను.) (ఈ హదీసు దృఢమైనది. దృఢమైన ఆధారాలతో అబూదావూద్ మరియు నసాయీలు దీనిని ఉల్లేఖించారు.)
(సుననె అబూదావూద్లోని విత్ర్ ప్రకరణం, సుననె నసాయీలోని నమాజ్ ప్రకరణం)
English
Mu`adh (bin Jabal) (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ held my hand and said, “O Mu`adh, By Allah, I love you and advise you not to miss supplicating after every Salat (prayer) saying: `Allahumma a`inni `ala dhikrika wa shukrika, wa husni `ibadatika,’ (O Allah, help me remember You, expressing gratitude to You and worship You in the best manner)”.[Abu Dawud and An-Nasa’i].
ముఖ్యాంశాలు
ఈ హదీసులో దైవప్రవక్త ﷺ తాను ముఆజ్ (రదియల్లాహు అన్హు)ని అభిమానిస్తున్నానన్న సంగతి ఆయనకు తెలియజేసిన తరువాత ఆయనకు ఓ ధర్మాదేశాన్ని బోధించారు. దీనిద్వారా తెలిసేదేమిటంటే దైవం కోసం పరస్పరం అభిమానించుకునేవారు, స్నేహం చేసేవారు ధార్మిక విషయాల్లో ఒండొకరికి సహాయపడుతూ ఉండాలి. పరస్పరం ధర్మాదేశాలను గురించి బోధించుకుంటూ ఉండాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|46. దైవం కోసం ప్రేమించమని ప్రోత్సహించటం గురించి, తోటి మనిషిని ప్రేమిస్తే అతని ముందు తన ప్రేమను ప్రకటించటం గురించి, దానికి ఎదుటి వ్యక్తి ఇచ్చే సమాధానం గురించి…..|హదీసు 385
హదీసు 386
وعن أَنسٍ، رضي اللَّه عنه، أَنَّ رَجُلاً كَانَ عِنْدَ النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَمَرَّ بِهِ رجل، فَقال: يارسول اللَّهِ إِنِّي لأُحِبُّ هَذا، فَقَالَ لَهُ النبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "أَأَعْلمتَهُ؟ "قَالَ: لا قَالَ:"أَعْلِمْهُ" فَلَحِقَهُ، فَقَالَ: إِنِّي أُحِبُّكَ في اللَّه، فقالَ: أَحَبَّكَ الَّذِي أَحْببْتَنِي لَهُ. رواه أبو داود بإِسنادٍ صحيح.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺ దగ్గర కూర్చొని ఉండగా ఇంకో వ్యక్తి అతని సమీపం నుండి వెళ్ళాడు. అప్పుడు దైవప్రవక్త దగ్గర కూర్చున్న వ్యక్తి, వెళుతున్న వ్యక్తి వైపు చూపిస్తూ) "దైవప్రవక్తా! నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను" అని అన్నాడు. "మరి ఈ విషయం అతనితో చెప్పావా?" అని అడిగారు దైవప్రవక్త ﷺ. అందుకా వ్యక్తి 'చెప్పలేద'న్నాడు. అప్పుడు ఆయన "నువ్వీ సంగతి అతనికి తెలియజెయ్యి" అని ఆదేశించారు. దైవప్రవక్త ﷺ ఆదేశం విని (తక్షణమే) ఆ వ్యక్తి అతన్ని కలుసుకొని "దైవం కోసం నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని చెప్పాడు. అందుకతను "ఎవరికోసం నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో ఆయన కూడా నిన్ను ప్రేమించుగాక!" అని దీవించాడు. (అబూదావూద్ దీనిని దృఢమైన ఆధారాలతో వెలికితీశారు.)
(సుననె అబూదావూద్లోని సంస్కార ప్రకరణం)
English
Anas bin Malik (radiyallahu anhu) reported: A man was with the Prophet ﷺ when another man passed by and the former said: “O Messenger of Allah! I love this man (for Allah’s sake)”. Messenger of Allah ﷺ asked, “Have you informed him?” He said, “No”. Messenger of Allah ﷺ then said, “Tell him (that you love him)”. So he went up to the man and said to him, “I love you for the sake of Allah;” and the other replied, “May Allah, for Whose sake you love me, love you.”[Abu Dawud].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|46. దైవం కోసం ప్రేమించమని ప్రోత్సహించటం గురించి, తోటి మనిషిని ప్రేమిస్తే అతని ముందు తన ప్రేమను ప్రకటించటం గురించి, దానికి ఎదుటి వ్యక్తి ఇచ్చే సమాధానం గురించి…..|హదీసు 386
You must be logged in to post a comment.