హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 45వ అధ్యాయం: మహాత్ముల దగ్గరికి వెళ్ళాలి, వారి సమావేశాల్లో కూర్చోవాలి, వారి సాహచర్యాన్ని పొందాలి. వారిని అభిమానించాలి, తమ కోసం దేవుణ్ణి ప్రార్థించమని వారిని కోరాలి, పుణ్యక్షేత్రాలను సందర్శించాలి. ఈ అధ్యాయంలో 2 ఖుర్ఆన్ ఆయతులు, 15 హదీసులు (హదీసు 361 – 375) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
45. మహాత్ముల దగ్గరికి వెళ్ళాలి, వారి సమావేశాల్లో కూర్చోవాలి, వారి సాహచర్యాన్ని పొందాలి. వారిని అభిమానించాలి, తమ కోసం దేవుణ్ణి ప్రార్థించమని వారిని కోరాలి, పుణ్యక్షేత్రాలను సందర్శించాలి
باب زيارة أهل الخيرومجالستهم وصحبتهم ومحبتهم وطلب زيارتهم والدعاء منهم وزيارة المواضع الفاضلة
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ సెలవిచ్చాడు :
(మూసాకు సంబంధించిన గాథను వారికి వినిపించండి) అప్పుడు మూసా తన సేవకునితో "రెండు నదుల సంగమ స్థలానికి చేరనంత వరకు, నేను నా ప్రయాణాన్ని ఆపను. లేకపోతే నేను సుదీర్ఘ కాలం నడుస్తూనే ఉంటా" అని అన్నాడు. తరువాత వారు వాటి సంగమ ప్రదేశానికి చేరినప్పుడు, తమ దగ్గరున్న చేప విషయంలో అశ్రద్ధ వహించారు. అది నదిలోకి, సొరంగం గుండా పోయినట్లు దూసుకుపోయింది. ముందుకుపోయిన తరువాత మూసా తన సేవకునితో, "మా ఉదయపు ఆహారం తీసుకురా. ఈనాటి ప్రయాణంలో మేము బాగా అలసిపోయాము" అని అన్నాడు. దానికి సేవకుడు "చూశారా ఏమయిందో! మనం ఆ రాయి దగ్గర విశ్రాంతి కోసం ఆగినప్పుడు నాకు చేప విషయమే జ్ఞాపకం లేకుండా పోయింది. షైతాన్ నన్ను ఏమరుపాటుకు గురిచేశాడు. నేను దాని గురించి మీకు చెప్పటం మరిచిపోయాను. చేప విచిత్రమైన రీతిలో బయటపడి నదిలోకి వెళ్ళిపోయింది" అని అన్నాడు. అది విని మూసా "మనం అన్వేషిస్తూ వచ్చినది ఆ ప్రాంతం కొరకే కదా!" అని అన్నాడు. కనుక వారిద్దరూ తమ అడుగు జాడలలో వెనక్కి తిరిగి వెళ్ళారు. అక్కడ వారు మా దాసులలోని ఒక దాసుణ్ణి కనుగొన్నారు. మేము అతనికి మా కారుణ్యాన్ని ప్రసాదించాము. మా తరపునుండి ఒక ప్రత్యేక జ్ఞానాన్ని ప్రసాదించాము.
{قَالَ لَهُ مُوسَى هَلْ أَتَّبِعُكَ عَلَى أَنْ تُعَلِّمَنِ مِمَّا عُلِّمْتَ رُشْداً} [الكهف:٦٠-٦٦]
మూసా అతనితో "మీరు నేర్చుకున్న వివేకాన్ని మీరు నాకు కూడా బోధించేందుకు నేను మీ వెంట ఉండవచ్చా?" అని అడిగాడు. (అల్ కహఫ్ : 60 – 66)
ఇంకొకచోట అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు,
{وَاصْبِرْ نَفْسَكَ مَعَ الَّذِينَ يَدْعُونَ رَبَّهُمْ بِالْغَدَاةِ وَالْعَشِيِّ يُرِيدُونَ وَجْهَهُ} [الكهف:٢٨]
"తమ ప్రభువు ప్రసన్నతను అర్థిస్తూ ఉదయం సాయంత్రం ఆయన్ను వేడుకుంటూ ఉండేవారి సాహచర్యం పట్ల నీ హృదయాన్ని సంతృప్తపరచుకో." (అల్ కహఫ్ : 28)
English
“And (remember) when Musa (Moses) said to his boy-servant: `I will not give up (travelling) until I reach the junction of the two seas or (until) I spend years and years in travelling”’ (up to) “… Musa (Moses) said to him (Khidr): `May I follow you so that you teach me something of that knowledge (guidance and true path) which you have been taught (by Allah)?”. [Al-Kahf 18:60–66]
“And keep yourself (O Muhammad ﷺ) patiently with those who call on their Rubb (i.e., your companions who remember their Rubb with glorification, praising in prayers, and other righteous deeds) morning and afternoon, seeking His Pleasure.” [Al-Kahf 18:28]
హదీసు 361
وعن أَنسٍ رضي اللَّهُ عنه قَالَ: قَالَ أَبُو بكر لِعمرَ رضي اللَّهُ عنهما بَعْدَ وَفَاةِ رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: انْطَلِقْ بِنَا إِلى أُمِّ أَيْمنَ رضي اللَّه عنها نَزُورُهَا كَما كانَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يزُورُهَا، فلَمَّا انْتَهَيا إِلَيْهَا، بَكَتْ، فَقَالاَ لَهَا: مَا يُبْكِيكِ أَما تَعْلَمِينَ أَنَّ مَا عِنْدَ اللَّهِ خيرٌ لرسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم؟ فقالت: إِنِّي لا أَبْكِي أَنِّي لأعْلمُ أَنَّ مَا عِندَ اللَّهِ تعالَى خَيرٌ لرسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، ولَكنْ أبْكي أَنْ الوَحْيَ قَدِ انْقَطَعَ مِنَ السَّمَاءِ. فَهَيَّجَتْهُما عَلَى البُكَاءِ، فَجعلا يَبْكِيانِ معهَا. رواه مسلم.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త తదనంతరం ఒకసారి హజ్రత్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) ఉమర్ (రదియల్లాహు అన్హు)తో, "ఉమ్మె ఐమన్ (రదియల్లాహు అన్హా) దగ్గరికి పోదాం పదండి. దైవప్రవక్త ﷺ ఆమెను పరామర్శించటానికి వెళ్ళినట్లు మనం కూడా వెళదాం" అని అన్నారు. ఆ తరువాత వాళ్ళిద్దరూ కలిసి ఆమె దగ్గరికి వెళ్ళగానే ఆమె బావురుమన్నది. "ఏడ్వడమెందుకు? దైవప్రవక్తకు దేవుని దగ్గర (ఇహలోకంలో కంటే) ఎంతో శ్రేష్ఠమైన స్థానం లభిస్తుందని నీకు తెలియదా?" అంటూ వాళ్ళిద్దరూ ఆమెను ఓదార్చారు. అప్పుడు ఆమె, "దైవప్రవక్తకు దేవుని దగ్గర గొప్ప స్థానముందని తెలియక నేను ఏడ్వటం లేదు. ఆకాశం నుండి వహీ (దైవవాణి) అవతరణ ఆగిపోయినందుకు ఏడుస్తున్నాను" అని అన్నారు. ఆమె మాటలు వాళ్ళిద్దరిని కూడా ఏడ్చేలా చేశాయి. ఆమెతోపాటు వాళ్ళూ ఏడ్వటం మొదలుపెట్టారు. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని ప్రవక్త సహచరుల మహిమోన్నతుల ప్రకరణం)
English
Anas bin Malik (radiyallahu anhu) reported: After the death of Messenger of Allah ﷺ, Abu Bakr (radiyallahu anhu) said to `Umar (radiyallahu anhu) : “Let us visit Umm Aiman (radiyallahu anha) as Messenger of Allah ﷺ used to visit her”. As we came to her, she wept. They (Abu Bakr and `Umar (radiyallahu anhu) said to her, “What makes you weep? Do you not know that what Allah has in store for His Messenger ﷺ is better than (this worldly life)?” She said, “I weep not because I am ignorant of the fact that what is in store for Messenger of Allah ﷺ (in the Hereafter) is better than this world, but I weep because the Revelation has ceased to come”. This moved both of them to tears and they began to weep along with her.[Muslim].
ముఖ్యాంశాలు
హజ్రత్ ఉమ్మె ఐమన్ (రదియల్లాహు అన్హా) అబిసీనియా దేశానికి చెందిన బానిస స్త్రీ. దైవప్రవక్త తండ్రి అబ్దుల్లాహ్ గారి దగ్గర సేవకురాలిగా పనిచేసేది. అబ్దుల్లాహ్ మరణించిన తరువాత దైవప్రవక్త పుట్టారు. ఆయనను పెంచటంలో ఆయన తల్లి ఆమినాకు ఉమ్మె ఐమన్ ఎంతగానో తోడ్పడ్డారు. ఆ తరువాత కాలంలో దైవప్రవక్త ﷺ ఆమెకు బానిసత్వం నుండి స్వేచ్ఛను ప్రసాదించి జైద్ బిన్ హారిసాకిచ్చి వివాహం చేశారు.
ఈ హదీసు ద్వారా మహాత్ములు దూరమైపోయినప్పుడు విలపించటంలో తప్పులేదని తెలుస్తోంది. అదేవిధంగా తమ బంధుమిత్రులు తరచూ సందర్శిస్తూ ఉండేవారిని తాము కూడా సందర్శించడానికి వెళ్ళడం పుణ్యప్రదమని కూడా బోధపడుతోంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|45. మహాత్ముల దగ్గరికి వెళ్ళాలి, వారి సమావేశాల్లో కూర్చోవాలి, వారి సాహచర్యాన్ని పొందాలి. వారిని అభిమానించాలి, తమ కోసం దేవుణ్ణి ప్రార్థించమని వారిని కోరాలి, పుణ్యక్షేత్రాలను సందర్శించాలి|హదీసు 361
హదీసు 362
وعن أَبي هريرة رضي اللَّه عنه عن النَّبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "أَنَّ رَجُلاً زَارَ أَخاً لَهُ في قَريَةٍ أُخْرَى، فَأَرْصد اللَّهُ تَعَالَى عَلَى مَدْرجَتِهِ ملَكاً، فَلَمَّا أَتَى عَلَيْهِ قَالَ: أَيْن تُريدُ؟ قَالَ: أُرِيدُ أَخاً لي في هذِهِ الْقَرْيةِ. قَالَ: هَلْ لَكَ علَيْهِ مِنْ نِعْمَةٍ تَرُبُّهَا عَلَيْهِ؟ قَالَ: لا، غَيْر أَنِّي أَحْببْتُهُ في اللَّهِ تَعَالَى، قَالَ: فَإِنِّي رَسُول اللَّهِ إِلَيْكَ بأَنَّ اللَّه قَدْ أَحبَّكَ كَما أَحْببْتَهُ فِيهِ" رواه مسلم. يقال:"أَرْصدَه"لِكَذا: إِذَا وكَّلَهُ بِحِفْظِهِ، وَ"المدْرَجَةُ"بفتحِ الميمِ والرَّاءِ: الطَّريقُ ومعنى"تَرُبُّهَا": تَقُومُ بهَا، وتَسْعَى في صَلاحِهَا.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: ఒకడు వేరొక ప్రాంతంలో ఉంటున్న తన సోదరుణ్ణి కలవటానికి బయలుదేరాడు. దేవుడు అతను వెళ్ళే దారిలో ఒక దూతను కూర్చోబెట్టాడు. ఆ వ్యక్తి అక్కడికి రాగానే దైవదూత అతన్ని "ఎక్కడికి వెళ్తున్నావ్?" అని అడిగాడు. "ఈ ఊర్లో నా సోదరుడున్నాడు. అతన్ని కలవటానికి వెళ్తున్నాను" అని ఆ వ్యక్తి సమాధానమిచ్చాడు. "అతను నీకేదైనా ఉపకారం చేసి ఉంటాడు. నువ్విప్పుడు అతని ఉపకారాన్ని తీర్చడానికి వెళ్తున్నావు, అవునా?" అని అడిగాడు దూత. "అలాంటిదేం లేదు. నేను దైవం కోసం అతన్ని ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమతోనే నేను అతని దగ్గరికి వెళ్తున్నాను" అని చెప్పాడా వ్యక్తి. అప్పుడు దైవదూత, "నేను దేవుని తరపునుండి నీ వద్దకు పంపబడిన దూతను. నీవు నీ సోదరుణ్ణి దైవం కోసం ప్రేమించినట్లే దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడని (తెలియపరచటానికి వచ్చాను)" అని చెప్పాడు.
(ముస్లిం)
అతణ్ణి రక్షించటం కోసం ఎవరినన్నా నియమించాడని చెప్పటానికి 'అర్సదహూ లికజా' అని వ్యవహరిస్తారు. 'మద్రజతు' అంటే 'దారి'. 'తరుబ్బుహా' అంటే నీవు దాన్ని కాపాడుతున్నావు, దాన్ని చక్కదిద్దటం కోసం కృషి చేస్తున్నావని భావం.
(సహీహ్ ముస్లింలోని సత్కార్యాలు – సత్సంబంధాల ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “A man set out to visit a brother (in Faith) in another town and Allah sent an angel on his way. When the man met the angel, the latter asked him, “Where do you intend to go?” He said, “I intend to visit my brother in this town.” The angel said, “Have you done any favour to him?” He said, “No, I have no desire except to visit him because I love him for the sake of Allah, the Exalted, and Glorious.” Thereupon the angel said, “I am a messenger to you from Allah (to inform you) that Allah loves you as you love him (for His sake)”[Muslim].
ముఖ్యాంశాలు
ఎవర్ని ప్రేమించినా దైవం కోసమే ప్రేమించాలి. ఎవరిని కలవటానికి వెళ్ళినా దైవప్రసన్నతను బడసే ఉద్దేశ్యంతోనే వెళ్ళాలి. కాని సాధారణంగా ప్రజలు ప్రాపంచిక ప్రయోజనాల కోసమే పరస్పరం కలుస్తూ ఉంటారు. ప్రాపంచిక ఉద్దేశ్యంతో కలవటంలోనూ తప్పులేదు గాని హదీసులో ప్రస్తావించబడిన విశిష్ఠత మాత్రం దైవం కోసం కలిసేవారికే దక్కుతుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|45. మహాత్ముల దగ్గరికి వెళ్ళాలి, వారి సమావేశాల్లో కూర్చోవాలి, వారి సాహచర్యాన్ని పొందాలి. వారిని అభిమానించాలి, తమ కోసం దేవుణ్ణి ప్రార్థించమని వారిని కోరాలి, పుణ్యక్షేత్రాలను సందర్శించాలి|హదీసు 362
హదీసు 363
وعنه قَالَ: قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَنْ عَادَ مَريضاً أَوْ زَار أَخاً لَهُ في اللَّه، نَادَاهُ مُنَادٍ: بِأَنْ طِبْتَ، وطَابَ ممْشَاكَ، وَتَبَوَّأْتَ مِنَ الجنَّةِ منْزِلاً "رواه الترمذي وَقالَ: حديثٌ حسنٌ. وفي بعض النسخ غريبٌ.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : ఎవడైనా రోగగ్రస్తుణ్ణి పరామర్శించటంగాని లేదా దైవం కోసం తన సోదరుణ్ణి కలవటంగాని చేసినప్పుడు (దేవుని తరపు నుండి) ఒక ప్రకటన చేసేవాడు, "నీకు అభినందనలు. నీ నడక సార్థకమవుగాక! నీకు స్వర్గంలో స్థానం లభించుగాక!" అని ఎలుగెత్తి ప్రార్థిస్తాడు.
తిర్మిజీ దీనిని వెలికితీసి 'హసన్'గా పేర్కొన్నారు. కాని మరికొన్ని ప్రతుల్లో ఈ హదీసు 'గరీబ్' (అంటే అరుదైనది) అని ఉంది.
(జామె తిర్మిజీలోని సత్కార్యాలు – సత్సంబంధాల ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: I heard Messenger of Allah ﷺ saying, “Whosoever visits an ailing person or a brother of his to seek the Pleasure of Allah, an announcer (angel) calls out: `May you be happy, may your walking be blessed, and may you be awarded a dignified position in Jannah”.[At-Tirmidhi].
ముఖ్యాంశాలు
వ్యాధిగ్రస్తుల్ని పరామర్శించటం, కేవలం దైవప్రసన్నతను బడసే ఉద్దేశ్యంతో తోటి ముస్లిం సోదరుల్ని కలవటం అత్యంత శ్రేష్ఠమైన ఆచరణలు. సత్పురుషులను కలవటానికి వెళ్ళటం కూడా సదాచరణే. మనిషి మంచివారిని కలవటానికి వెళ్ళినప్పుడు అతను వేసే ప్రతి అడుగుకు బదులుగా అతని కర్మల జాబితాలో పుణ్యకార్యాలు లిఖించబడతాయి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|45. మహాత్ముల దగ్గరికి వెళ్ళాలి, వారి సమావేశాల్లో కూర్చోవాలి, వారి సాహచర్యాన్ని పొందాలి. వారిని అభిమానించాలి, తమ కోసం దేవుణ్ణి ప్రార్థించమని వారిని కోరాలి, పుణ్యక్షేత్రాలను సందర్శించాలి|హదీసు 363
హదీసు 364
وعن أَبي موسى الأَشعَرِيِّ رضيَ اللَّهُ عنه أَن النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إِنَّما مثَلُ الجلِيس الصَّالِحِ وَجَلِيسِ السُّوءِ. كَحَامِلِ المِسْكِ، وَنَافِخِ الْكِيرِ، فَحامِلُ المِسْكِ، إِمَّا أَنْ يُحْذِيَكَ، وَإِمَّا أَنْ تَبْتَاعَ مِنْهُ وَإِمَّا أَنْ تَجِدَ مِنْهُ ريحاً طيِّبةً. ونَافخُ الكيرِ إِمَّا أَن يحْرِقَ ثيابَكَ وإمَّا أنْ تجِدَ مِنْهُ رِيحاً مُنْتِنَةً" متفقٌ عَلَيهِ. "يُحْذِيكَ": يُعْطِيكَ.
హజ్రత్ అబూ మూసా అష్అరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : మంచి స్నేహితుడు కస్తూరి అమ్మేవాడితో సమానం. చెడ్డ స్నేహితుడు కొలిమి ఊదేవాడితో సమానం. కస్తూరి అమ్మేవాడి దగ్గర కూర్చుంటే అతను నీకు కానుకగా కస్తూరి ఇస్తాడు లేదా దాన్ని నువ్వు కొననయినా కొంటావు. ఈ రెండూ కాకపోయినా కనీసం నీకు అతని దగ్గర్నుంచి సువాసనయినా వస్తుంది. అదే నువ్వు కొలిమి ఊదే వాడి దగ్గర కూర్చుంటే (అతను నీ మీదకు నిప్పురవ్వలు ఎగరేసి) నీ బట్టల్ని కాలుస్తాడు లేదా అతని దగ్గర్నుంచి నీకు దుర్వాసనయినా అంటుతుంది.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని జనాయెజ్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని సత్కార్యాలు – సత్సంబంధాల ప్రకరణం)
English
Abu Musa Al-Ash`ari (radiyallahu anhu) reported: I heard the Prophet ﷺ saying, “The similitude of good company and that of bad company is that of the owner of musk and of the one blowing the bellows. The owner of musk would either offer you some free of charge, or you would buy it from him, or you smell its pleasant fragrance; and as for the one who blows the bellows (i.e., the blacksmith), he either burns your clothes or you smell a repugnant smell”.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ఎల్లప్పుడూ సజ్జనుల సాహచర్యాన్ని మాత్రమే ఎంచుకోవాలి. దుర్జనుల సాహచర్యాన్ని, స్నేహాన్ని విసర్జించాలి. ఎందుకంటే కస్తూరి అమ్మేవాడి దగ్గర కూర్చుంటే ఎన్నో విధాలుగా ఉపయోగమున్నట్లే సజ్జనులతో సావాసం చేస్తే అన్నీ ప్రయోజనాలే కలుగుతాయి. వారితో కలిసి ఉండటం వల్ల మనిషి వారిలోని సద్గుణాలను గ్రహించి క్రమక్రమంగా తను కూడా వారిలాగే మంచి మనిషిగా మారతాడు. దీనికి భిన్నంగా చెడు సావాసాల వల్ల చెడులకు అలవాటు పడి ఆఖరికి తను కూడా చెడుల చెట్టుగా మారిపోతాడు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|45. మహాత్ముల దగ్గరికి వెళ్ళాలి, వారి సమావేశాల్లో కూర్చోవాలి, వారి సాహచర్యాన్ని పొందాలి. వారిని అభిమానించాలి, తమ కోసం దేవుణ్ణి ప్రార్థించమని వారిని కోరాలి, పుణ్యక్షేత్రాలను సందర్శించాలి|హదీసు 364
హదీసు 365
وعن أَبي هريرة رضي اللَّه عنه، عن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "تُنْكَحُ المَرْأَةُ لأَرْبعٍ: لِمالِهَا، وَلِحَسَبِهَا، وَلِجَمَالِهَا، ولِدِينِهَا، فَاظْفَرْ بِذَاتِ الدِّينِ تَرِبَتْ يَدَاك" متفقٌ عَلَيهِ. ومعناه: أَنَّ النَّاس يَقْصِدُونَ في الْعَادَةِ مِنَ المَرْأَةِ هَذِهِ الخِصَالَ الأَرْبعَ، فَاحِرصْ أَنْتَ عَلى ذَاتِ الدِّينِ. وَاظْفَرْ بِهَا، واحْرِص عَلى صُحْبَتِهَا.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : సాధారణంగా నాలుగు విషయాలను చూసి స్త్రీని వివాహం చేసుకుంటారు. ఆమె సిరిసంపదలను చూసి, ఆమె కుటుంబం, వంశాలను చూసి, ఆమె అందాన్ని చూసి, (మరికొంతమంది) ఆమె ధర్మపరాయణ తను చూసి వివాహమాడతారు. కాని నీవు మాత్రం ధర్మపరాయణురాలైన స్త్రీని వివాహమాడి సాఫల్యం పొందు. నీ చేతులకు మన్ను తగల!
(బుఖారీ – ముస్లిం)
ఈ హదీసు భావం ఏమిటంటే, సాధారణంగా ప్రజలు వివాహ సందర్భంలో ఈ నాలుగు విషయాలను దృష్టిలో పెట్టుకొని వివాహమాడతారు. నువ్వు మాత్రం ధర్మపరాయణురాలైన స్త్రీనే కోరుకోవాలి. అలాంటి స్త్రీని వివాహమాడటానికే కృషిచేయాలి. ఆమె సాహచర్యాన్నే అభిలషించాలి.
(సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లింలలోని నికాహ్ ప్రకరణాలు)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “A woman is married for four things: for her wealth, for her lineage, for her beauty or for her piety. Select the pious, may you be blessed!”.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ధర్మపరాయణురాలైన స్త్రీని వివాహమాడితేనే మనిషి వైవాహిక జీవితం సార్థకమవుతుంది. ధర్మపరాయణురాలైన స్త్రీకి భర్త స్థానం ఏమిటో తెలిసి ఉంటుంది కనుక ఆమె తన భర్త పట్ల విధేయతా భావంతో మసలుకుంటుంది. దాంతో జీవితంలో ఎన్ని కష్టాలెదురైనప్పటికీ మనిషి దాంపత్య జీవితంలో సుఖాన్ని అనుభవిస్తాడు. అదీగాక ఆమె అతని సంతానాన్ని సదాచార సంపన్నులుగా తీర్చిదిద్దుతుంది.
ఇకపోతే పై హదీసులో పేర్కొనబడిన మిగతా మూడు రకాల స్త్రీల వల్ల కుటుంబజీవనం ఎన్నో ఒడిదుడుకులకు లోనవుతుంది. మనిషికి బయటి కష్టాలతో పాటు ఇంట్లో ఆలుబిడ్డల వల్ల కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురౌతాయి. దాని దుష్ప్రభావం వల్ల సంతానం తల్లిదండ్రులకు అవిధేయులుగా మారే అవకాశమూ ఉంది. కనుక వైవాహిక జీవితం కోసం స్త్రీని ఎన్నుకున్నప్పుడు ధర్మపరాయణతకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|45. మహాత్ముల దగ్గరికి వెళ్ళాలి, వారి సమావేశాల్లో కూర్చోవాలి, వారి సాహచర్యాన్ని పొందాలి. వారిని అభిమానించాలి, తమ కోసం దేవుణ్ణి ప్రార్థించమని వారిని కోరాలి, పుణ్యక్షేత్రాలను సందర్శించాలి|హదీసు 365
హదీసు 366
وعنْ ابن عباسٍ رضي اللَّه عنهما قال: قَالَ النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم لِجِبْرِيلَ: "مَا يمْنَعُكَ أَنْ تَزُورَنَا أَكْثَرَ مِمَّا تَزُورنَا؟ " فَنَزَلَتْ: {ومَا نَتَنَزَّلُ إِلاَّ بِأَمْرِ رَبِّكَ لَهُ مَا بَيْنَ أَيْدِينَا وَما خَلْفَنَا وَمَا بَيْنَ ذلِكَ} رواه البخاري.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ జిబ్రయీల్ (అలైహి)తో మాట్లాడుతూ, "ఇప్పుడు మీరు మమ్మల్ని కలవటానికి ఇన్నిసార్లు వస్తున్నారు కదా! ఇంతకన్నా ఎక్కువ సార్లు మమ్మల్ని కలవటానికి రాకూడదా?!" అని అడిగారు. అప్పుడు దివ్య ఖుర్ఆన్లోని ఈ సూక్తులు అవతరించాయి. "ప్రవక్తా! మేము నీ ప్రభువు ఆజ్ఞ లేకుండా క్రిందికి దిగిరాము. మా ముందు ఉన్నదీ, మా వెనుక ఉన్నది, ఆ రెండింటి మధ్య ఉన్నది, ప్రతిదీ ఆయనదే." (మర్యమ్ : 64)
(బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని వ్యాఖ్యానాల ప్రకరణం)
English
Ibn `Abbas (radiyallahu anhuma) reported: The Prophet ﷺ said to Jibril (Gabriel), “What prevents you from visiting us more frequently?” Thereupon was revealed the Ayah: “(The angels say:) `And we (angels) descend not except by the Command of your Rubb. To Him belongs what is before us and what is behind us, and what is between those two”. (19:64)[Al-Bukhari].
ముఖ్యాంశాలు
హజ్రత్ జిబ్రయీల్ (అలైహి) 'వహీ' (దైవవాణి)ని తీసుకొని దైవప్రవక్త ﷺ దగ్గరికి వచ్చేవారు. దైవప్రవక్తకు జిబ్రయీల్ ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్న ఆతురత ఉండేది. అందుకే జిబ్రయీల్ను ఇంకా ఎక్కువగా తన దగ్గరికి వస్తూ ఉండమని ఆహ్వానించారు. కాని ఆయన మాత్రం దైవప్రవక్త ఆహ్వానాన్ని మర్యాదపూర్వకంగా తిరస్కరించారు. తనలాంటి దైవదూతలందరూ భూమిపైకి రావాలన్నా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా అందుకు దేవుని అనుమతి అవసరమని, ఈ విషయంలో తమకెలాంటి నిర్ణయాధికారం లేదని చెప్పారు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|45. మహాత్ముల దగ్గరికి వెళ్ళాలి, వారి సమావేశాల్లో కూర్చోవాలి, వారి సాహచర్యాన్ని పొందాలి. వారిని అభిమానించాలి, తమ కోసం దేవుణ్ణి ప్రార్థించమని వారిని కోరాలి, పుణ్యక్షేత్రాలను సందర్శించాలి|హదీసు 366
హదీసు 367
وعنْ أَبي سعيدٍ الخُدْرِيِّ رضي اللَّه عنه، عن النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "لا تُصَاحبْ إِلاَّ مُؤْمِناً، وَلاَ يَأْكُلْ طعَامَكَ إِلاَّ تَقِيٌّ". رواه أَبُو داود، والترمذي بإِسْنَادٍ لا بأْس بِهِ.
హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ "విశ్వాసి అయిన వ్యక్తిని మాత్రమే మీ స్నేహితుడిగా చేసుకోండి. ఇంకా మీ అన్నం దైవభక్తిగలవారే తినాలి సుమా!" అని ఉపదేశించారు.
(అబూదావూద్, తిర్మిజీ – తిర్మిజీ దీనిని అంగీకరించదగిన ఆధారాలతో వెలికితీశారు.)
(సుననె అబూదావూద్లోని సంస్కార ప్రకరణం, సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత ప్రకరణం)
English
Abu Sa`id Al-Khudri (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “Keep only a believer for a companion and let only a pious eat your food”.[At-Tirmidhi and Abu Dawud].
ముఖ్యాంశాలు
దైవ తిరస్కారులతో సావాసం చేయటం వల్ల విశ్వాసులు కూడా వారికి ప్రభావితులయ్యే అవకాశం ఉంది. అందుకే అలాంటి వారితో స్నేహం, సాహచర్యం మంచిది కాదని చెప్పబడింది. దీనికి భిన్నంగా విశ్వాసులతో స్నేహం చేస్తే వారు ఒండొకరికి ఆలంబనగా ఉంటారు. వారి విశ్వాసం మరింత తేజోమయమవుతుంది. ఈ హదీసు ద్వారా బోధపడే రెండో విషయం ఏమిటంటే విందు భోజనాలకు ఆహ్వానించేటప్పుడు సజ్జనుల్ని, దైవభక్తిగలవారినే ఆహ్వానించాలి. అదేవిధంగా దానధర్మాలు చేసినప్పుడు కూడా ధర్మచింతన గల ముస్లింలను వెతికి వారికే దానాలు చెయ్యాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|45. మహాత్ముల దగ్గరికి వెళ్ళాలి, వారి సమావేశాల్లో కూర్చోవాలి, వారి సాహచర్యాన్ని పొందాలి. వారిని అభిమానించాలి, తమ కోసం దేవుణ్ణి ప్రార్థించమని వారిని కోరాలి, పుణ్యక్షేత్రాలను సందర్శించాలి|హదీసు 367
హదీసు 368
وعن أَبي هريرة رضي اللَّه عنه أَن النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "الرَّجُلُ عَلَى دِينِ خَلِيلِهِ، فَلْيَنْظُرْ أَحَدُكمْ مَنْ يُخَالِلُ ". رواه أَبُو داود. والترمذي بإِسنادٍ صحيح، وَقالَ الترمذي: حديثٌ حسنٌ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు : మనిషి తన స్నేహితుడి ధర్మానికి (అతి ఎక్కువగా) ప్రభావితుడవుతాడు. కాబట్టి మీలో ప్రతి ఒక్కడూ తాను ఎవరితో స్నేహం చేస్తున్నాడో చూసుకోవాలి.
(అబూ దావూద్ మరియు తిర్మిజీలు దీన్ని దృఢమైన ఆధారాలతో వెలికితీశారు. ఇంకా తిర్మిజీ దీని ఆధారాన్ని ప్రామాణికమైనదిగా పేర్కొన్నారు.)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: I heard the Prophet ﷺ saying, “Man follows his friend’s religion, you should be careful who you take for friends”.[At-Tirmidhi and Abu Dawud].
ముఖ్యాంశాలు
ఈ హదీసులో కూడా ధర్మపరాయణులైన వ్యక్తులతోనే స్నేహం చెయ్యాలని, దైవతిరస్కారులతో స్నేహానికి దూరంగా ఉండాలని తాకీదు చేయబడింది. ధర్మానికి ఏమాత్రం ప్రాముఖ్యం ఇవ్వకుండా ప్రపంచాన్నే సర్వస్వంగా భావించేవారితో స్నేహం చేస్తే క్రమంగా విశ్వాసులు కూడా వారికి ప్రభావితులై ప్రాపంచిక వ్యామోహంలో చిక్కుకునే ప్రమాదముంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తాము ఎవరితో ఎలాంటి స్నేహసంబంధాలను కలిగి ఉన్నారో ఆత్మపరిశీలన చేసుకుంటూ ఉండాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|45. మహాత్ముల దగ్గరికి వెళ్ళాలి, వారి సమావేశాల్లో కూర్చోవాలి, వారి సాహచర్యాన్ని పొందాలి. వారిని అభిమానించాలి, తమ కోసం దేవుణ్ణి ప్రార్థించమని వారిని కోరాలి, పుణ్యక్షేత్రాలను సందర్శించాలి|హదీసు 368
హదీసు 369
وعن أَبي موسى الأَشْعَرِيِّ رضي اللَّهُ عنه أَن النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "المَرْءُ مَعَ مَنْ أَحَبَّ". مُتَّفَقٌ عَلَيهِ. وفي رواية قال: قيل للنبي صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: الرَّجُلُ يُحبُّ القَومَ وَلَمْا يَلْحَقْ بِهِمْ؟ قَالَ:"المَرْءُ مع من أحب".
హజ్రత్ అబూ మూసా అష్అరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు : మనిషి తాను అభిమానించిన వారితో పాటే ఉంటాడు.
(బుఖారీ – ముస్లిం)
వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : ఒక వ్యక్తి కొంతమందిని అభిమానించినప్పటికీ వారి స్థాయికి చేరుకోలేకపోతేనో?!" అని ఎవరో సందేహపడగా, "మనిషి తాను అభిమానించినవారి వెంటే ఉంటాడు" అని అన్నారు దైవప్రవక్త ﷺ.
(సహీహ్ బుఖారీలోని సంస్కార ప్రకరణం, సహీహ్ ముస్లింలోని సత్కార్యాలు – సత్సంబంధాల ప్రకరణం)
English
Abu Musa Al-Ash`ari (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “A person will be summoned with the one whom he loves”.[Al-Bukhari and Muslim].
Another narration is: The Prophet ﷺ was asked; “What about a person who loves a people but cannot be with them?” (i.e., either he cannot attain their lofty position of righteousness or that he has not met with them in this life). He ﷺ replied, “A person will be in the company of those whom he loves”.
ముఖ్యాంశాలు
ధర్మపరాయణులు, సదాచార సంపన్నులను అభిమానిస్తే పరంలోకంలో కూడా వారి సాహచర్య భాగ్యం లభిస్తుంది. ప్రజలు తాము అభిమానించేవారంతటి గొప్పవారు కాలేకపోయినప్పటికీ దేవుడు తన కరుణా కటాక్షాలతో సామాన్య ప్రజానీకానికి కూడా అంతటి గౌరవాన్ని కల్పిస్తాడు. దీనికి విరుద్ధంగా చెడ్డవారిని, అవినీతిపరుల్ని అభిమానిస్తే పరలోకంలో భయంకరమైన పరిణామాల్ని ఎదుర్కోవలసి వస్తుంది. దేవుడు ఆ నీచులతో పాటు వారిని అభిమానించిన వారిని కూడా నేరస్తులుగా నిలబెడతాడు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|45. మహాత్ముల దగ్గరికి వెళ్ళాలి, వారి సమావేశాల్లో కూర్చోవాలి, వారి సాహచర్యాన్ని పొందాలి. వారిని అభిమానించాలి, తమ కోసం దేవుణ్ణి ప్రార్థించమని వారిని కోరాలి, పుణ్యక్షేత్రాలను సందర్శించాలి|హదీసు 369
హదీసు 370
وعن أَنس رضي اللَّه عنه أَن أَعرابياً قَالَ لرسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: مَتَى السَّاعَةُ؟ قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"مَا أَعْدَدْتَ لَهَا؟ "قَالَ: حُب اللَّهِ ورسولِهِ قَالَ:"أَنْتَ مَعَ مَنْ أَحْبَبْتَ". متفقٌ عَلَيهِ، وهذا لفظ مسلمٍ. وفي روايةٍ لهما: مَا أَعْدَدْتُ لَهَا مِنْ كَثِيرِ صَوْمٍ، وَلا صَلاةٍ، وَلا صَدَقَةٍ، وَلَكِنِّي أُحِبُّ اللَّه وَرَسُولَهُ.
హజ్రత్ అనస్ కథనం ప్రకారం ఒక పల్లెటూరి వ్యక్తి దైవప్రవక్తను, "ప్రళయం ఎప్పుడొస్తుంద"ని అడిగాడు. "దానికోసం నువ్వేం ఏర్పాట్లు చేసుకున్నావు?" అని అడిగారు దైవప్రవక్త ﷺ. దానికావ్యక్తి, "దైవాన్ని, దైవప్రవక్తను ప్రేమించటం" అని అన్నాడు. అతని సమాధానం విని దైవ ప్రవక్త "మరయితే నీవు ఎవరిని ప్రేమిస్తున్నావో వారితోనే ఉంటావు" అని అన్నారు.
(బుఖారీ, ముస్లిం వాక్యాలు మాత్రం ముస్లింవి)
బుఖారీ – ముస్లింలలోని వేరొక ఉల్లేఖనం ప్రకారం ఆ వ్యక్తి ఇలా అన్నాడు: "నేను దానికోసం ఎక్కువగా ఉపవాసాలేమీ పాటించలేదు. అధికంగా నమాజులుగాని, దానధర్మాలుగాని చెయ్యలేదు. అయితే నేను దేవుణ్ణి, దైవప్రవక్తను మాత్రం ప్రేమిస్తున్నాను."
(సహీహ్ బుఖారీలోని సంస్కార ప్రకరణం, సహీహ్ ముస్లింలోని సత్కార్యాలు – సత్సంబంధాల ప్రకరణం)
English
Anas bin Malik (radiyallahu anhu) reported: A bedouin came to Messenger of Allah ﷺ and said to him, “When will be the Hour (i.e., the Day of Resurrection)?” He (the Prophet ﷺ) said, “What preparation have you made for it?” He said, “Only the love of Allah and His Messenger.” Then Messenger of Allah ﷺ said, “You will be with those whom you love.”[Al-Bukhari and Muslim].
The narration in Muslim is: The man replied: “I have made no significant preparation with regard to Salat (prayer), Saum (fasting) and Sadaqah (charity) but I love Allah and His Messenger”.
ముఖ్యాంశాలు
దైవప్రవక్త సహచరుల్లో ఎవరైనా తాను దేవుణ్ణి, దైవప్రవక్తను ప్రేమిస్తున్నానని అంటే అవి ఒట్టి నోటిమాటలే కావు. వారి దృష్టిలో దేవుణ్ణి, దైవప్రవక్తను ప్రేమించడమంటే జీవితంలోని అన్ని విషయాల్లోనూ వారికి విధేయత చూపటం, వారి ఆజ్ఞల్ని శిరసావహించడమన్నమాట. పై హదీసులో ఆ పల్లెటూరి వ్యక్తి తాను ప్రళయానంతరం పరలోక జీవితం కోసం అంత ఎక్కువగా నమాజులు, ఉపవాసాలు, దానధర్మాలు చేయలేదనీ, అయితే దేవుణ్ణి, దైవప్రవక్తను మాత్రం మనస్ఫూర్తిగా అభిమానిస్తున్నానని చెప్పాడు. ఇక్కడ నమాజులు, ఉపవాసాలంటే స్వచ్ఛంద (నఫిల్) ఆరాధనలన్నమాట. ఫర్జ్ ఆరాధనలు (విధులు) మాత్రం ఎవరైనాసరే తప్పకుండా నిర్వర్తించాల్సిందే. ఫర్జ్ ఆరాధనలు పాటించకుండా ఎవరైనా తాను దేవుణ్ణి, దైవప్రవక్తను ప్రేమిస్తున్నానని అంటే అవి ఒట్టి బూటకపు మాటలే. మనిషి నిజంగా దేవుణ్ణి, దైవప్రవక్తను అభిమానించేవాడైతే అతని అభిమానం ఫర్జ్ ఆరాధనలు పాటించడంలోనే కనపడుతుంది. అలాంటి వ్యక్తి అతి ఎక్కువగా స్వచ్ఛంద (నఫిల్) ఆరాధనలు చేసి ఉండకపోయినప్పటికీ తన నిష్కల్మషమైన అభిమానం వల్ల దేవుని సన్నిధిలో కృతార్థుడవుతాడు. ఫర్జ్లను విస్మరించి నఫిల్ ఆరాధనల్ని పట్టుకొని వ్రేలాడితే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. దేవుని సన్నిధిలో అలాంటి నఫిల్ ఆరాధనలకు ఎలాంటి విలువా ఉండదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|45. మహాత్ముల దగ్గరికి వెళ్ళాలి, వారి సమావేశాల్లో కూర్చోవాలి, వారి సాహచర్యాన్ని పొందాలి. వారిని అభిమానించాలి, తమ కోసం దేవుణ్ణి ప్రార్థించమని వారిని కోరాలి, పుణ్యక్షేత్రాలను సందర్శించాలి|హదీసు 370
హదీసు 371
وعن ابنِ مسعودٍ رضي اللَّه عنه قَالَ: جاءَ رَجُلٌ إِلى رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَقَالَ: يَا رَسُول اللَّه كَيْفَ تَقُولُ في رَجُلٍ أَحبَّ قَوْماً وَلَمْ يلْحَقْ بِهِمْ؟ فَقَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "المَرْءُ مَعَ مَنْ أَحَبَّ" متفقٌ عَلَيهِ.
హజ్రత్ ఇబ్నె మస్వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺ దగ్గరికి వచ్చి, "దైవప్రవక్తా! ఒక మనిషి కొందరిని అభిమానిస్తున్నాడు గాని తాను మాత్రం వారి స్థాయికి చేరుకోలేకపోతున్నాడు. అలాంటి వ్యక్తి గురించి మీ అభిప్రాయం ఏమిటి?" అని అడిగాడు. దానికి ఆయన "మనిషి తాను అభిమానించినవారితో పాటే ఉంటాడు" అని చెప్పారు. (బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని సంస్కార ప్రకరణం, సహీహ్ ముస్లింలోని సత్కార్యాలు – సత్సంబంధాల ప్రకరణం)
English
Ibn Mas`ud (radiyallahu anhu) reported: A man came to Messenger of Allah ﷺ and said, “O Messenger of Allah! What do you think of a man who loves some people but does not go any nearer to their position?” He ﷺ replied, “A man will be with those whom he loves”.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
వారి స్థాయికి చేరుకోలేకపోతున్నారంటే ఇహలోకంలో సత్కార్యాలు చేయటంలో తమ అభిమాన పాత్రుల స్థాయికి చేరుకోలేక పోతున్నారని అర్థం. కాని పరలోకంలో మాత్రం వారు దైవభక్తి గలవారిని అభిమానించినందుకు దేవుడు తన కరుణాకటాక్షాలతో వారిని కూడా వారి అభిమానపాత్రుల స్థాయికి చేర్చి వారితోపాటు ఉంచుతాడు. పై హదీసులో ఈ విషయం గురించి దైవప్రవక్తను అడుగుతున్నది ఆయన ﷺ సహచరుడే. ఎవరి గురించి అడుగుతున్నాడో వారూ సహచరులే – అయినప్పటికీ భావం రీత్యా ఈ హదీసు అందరికీ వర్తిస్తుంది. ప్రళయం వచ్చేవరకు పుణ్యాత్ముల్ని అభిమానించేవారందరికీ పరలోకంలో పుణ్యగతులే ప్రాప్తమవుతాయి. అయితే దానికోసం దైవగ్రంథానికి, దైవప్రవక్త సంప్రదాయానికి కట్టుబడి ఆచరిస్తూ, వీలైనంతవరకు ధర్మాదేశాల్ని పాటిస్తూ ఉండాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|45. మహాత్ముల దగ్గరికి వెళ్ళాలి, వారి సమావేశాల్లో కూర్చోవాలి, వారి సాహచర్యాన్ని పొందాలి. వారిని అభిమానించాలి, తమ కోసం దేవుణ్ణి ప్రార్థించమని వారిని కోరాలి, పుణ్యక్షేత్రాలను సందర్శించాలి|హదీసు 371
హదీసు 372
وعن أَبي هُريرة رضي اللَّه عنه عن النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "النَّاسُ معَادِنُ كَمَعَادِنِ الذَّهَبِ وَالْفِضَّةِ، خِيَارُهُمْ في الجَاهِلِيَّةِ خِيارُهُمْ في الإِسْلامِ إِذَا فَقهُوا. وَالأَرْوَاحُ جُنُودٌ مُجنَّدَةٌ، فَمَا تَعَارَفَ مِنْهَا ائْتَلَفَ، وَمَا تَنَاكَرَ مِنْهَا، اخْتَلَفَ" رواه مسلم. وروى البخاري قوله:"الأَرْوَاحُ"إِلخ، من رواية عائشة رضي اللَّه عنها.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : బంగారం, వెండి గనుల్లాగా ప్రజలు (కూడా వేర్వేరు) గనుల్లాంటి వారు. అజ్ఞాన కాలంలో మంచివాళ్ళుగా ఉండినవారు ఇస్లాం స్వీకరించిన తరువాత కూడా మంచివాళ్ళుగానే ఉంటారు. అయితే వారు ధర్మం పట్ల సరయిన అవగాహన కలిగి ఉండాలి.
అదేవిధంగా ఆత్మలు కూడా అనేక సైన్యాల మాదిరిగా ఉంటాయి. (ఆత్మావస్థలో) ఒక ఆత్మకు మరో ఆత్మతో పరిచయముంటే (ప్రపంచంలోనూ) వారి మధ్య మైత్రి ఏర్పడుతుంది. అదేవిధంగా (ఆత్మావస్థలో) పరిచయంలేని ఆత్మలు (ప్రపంచంలోనూ) అపరిచితులుగానే ఉండిపోతాయి. (ముస్లిం)
ఇమామ్ బుఖారీ ఈ హదీసులో వచ్చిన ఆత్మల ప్రస్తావనను మాత్రం హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఆధారంగా ఉల్లేఖించారు.
(సహీహ్ బుఖారీలోని ప్రవక్తల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని ప్రవక్త సహచరుల మహిమోన్నతుల ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: I heard Messenger of Allah ﷺ saying, “People are like gold and silver; those who were best in Jahiliyyah (Pre-Islamic Period of Ignorance) are best in Islam, if they have religious understanding; and the souls are like recruited soldiers, they get mixed up with those similar with them in qualities and oppose and drift away from those who do not share their qualities”.[Muslim].
ముఖ్యాంశాలు
గనుల్లో అనేక రకాలుంటాయి. కొన్ని గనుల నుంచి స్వచ్ఛమైన ఖనిజాలు వెలువడితే మరికొన్ని గనుల నుంచి నాసిరకపు ఖనిజాలు వెలువడతాయి. అదేవిధంగా మనుషుల్లో కూడా మంచి, చెడు – రెండు రకాల వారుంటారు. సమాజంలో గౌరవోన్నతులు, పేరు ప్రతిష్ఠలు గలవారెవరైనా ఇస్లాం స్వీకరిస్తే వారి గౌరవానికి, పేరు ప్రతిష్ఠలకు ఎలాంటి భంగం వాటిల్లదు. ఆ తరువాత కూడా వారు గౌరవంగా ప్రతిష్ఠాత్మక జీవితాన్ని గడపవచ్చు. అయితే వారు ధార్మిక స్పృహ, ధర్మం గురించి సరయిన అవగాహన కలిగి ఉండాలి. ధర్మాదేశాల్ని పాటించేవారయి ఉండాలి.
ఆత్మలు అనేక సైన్యాల మాదిరిగా ఉంటాయంటే, వాటి మనస్తత్వాలకనుగుణంగా వేర్వేలు సమూహాలుగా ఉంటాయని అర్థం. మంచిని కోరే ఆత్మలకు ఆ ఆత్మావస్థలోనే ఇతర మంచి ఆత్మలతో పరిచయమేర్పడుతుంది. అదేవిధంగా చెడుని ప్రేమించే మనస్తత్వం గల ఆత్మలకు ఇతర చెడ్డ ఆత్మలతో పరిచయమేర్పడుతుంది. ప్రపంచంలోకి వచ్చిన తరువాత ఆ పరిచయాలే స్నేహ సంబంధాలుగా మార్పు చెందుతాయి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|45. మహాత్ముల దగ్గరికి వెళ్ళాలి, వారి సమావేశాల్లో కూర్చోవాలి, వారి సాహచర్యాన్ని పొందాలి. వారిని అభిమానించాలి, తమ కోసం దేవుణ్ణి ప్రార్థించమని వారిని కోరాలి, పుణ్యక్షేత్రాలను సందర్శించాలి|హదీసు 372
హదీసు 373
وعن أُسيْرِ بْنِ عَمْرٍو ويُقَالُ: ابْنُ جابِر وَهُوَ"بضم الهمزةِ وفتح السين المهملة"قَالَ: كَانَ عُمَرُ بْنُ الخَطَّابِ رضي اللَّه عنه إِذا أَتَى عَلَيْهِ أَمْدادُ أَهْلِ الْيمنِ سأَلَهُمْ: أَّفيُكُمْ أُوَيْسُ بْنُ عَامِرٍ؟ حتَّى أَتَى عَلَى أُوَيْسٍ رضي اللَّه عنه، فَقَالَ لَهُ: أَنْتَ أُويْس بْنُ عامِرٍ؟ قَالَ: نَعَمْ، قَالَ: مِنْ مُرَادٍ ثُمَّ مِنْ قَرَنٍ؟ قَالَ: نعَمْ، قَالَ: فكَانَ بِكَ بَرَصٌ، فَبَرَأْتَ مِنْهُ إِلاَّ مَوْضعَ دِرْهَمٍ؟ قَالَ: نَعَمْ. قَالَ: لَكَ والِدَةٌ؟ قَالَ: نَعَمْ. قَالَ سَمِعْتُ رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقول: "يَأْتِي علَيْكُمْ أُوَيْسُ بْنُ عَامِرٍ مَعَ أَمْدَادِ أَهْلِ الْيَمَنِ مِنْ مُرَادٍ، ثُمَّ مِنْ قَرَنٍ كَانَ بِهِ برصٌ، فَبَرَأَ مِنْهُ إِلاَّ مَوْضعَ دِرْهَمٍ، لَهُ وَالِدَةٌ هُو بِها برٌّ لَوْ أَقْسمَ عَلَى اللَّه لأَبَرَّهُ، فَإِن اسْتَطَعْتَ أَنْ يَسْتَغْفِرَ لَكَ فَافْعَلْ "فَاسْتَغْفِرْ لي فَاسْتَغْفَرَ لَهُ. فَقَالَ لَهُ عُمَرُ: أَيْنَ تُرِيدُ؟ قَالَ: الْكُوفَةَ، قَالَ: أَلا أَكْتُبُ لَكَ إِلى عَامِلهَا؟ قَالَ: أَكُونُ في غَبْراءِ النَّاسِ أَحبُّ إِلَيَّ, فَلَمَّا كَانَ مِنَ العَامِ المقبل حج رجل من أشرافهم فوافى عُمَرَ, فَسَألَهُ عَنْ أُوَيْسٍ, فَقَالَ: تَرَكْتُهُ رَثَّ البيت قليل المتاع, قالَ: سَمِعتُ رَسُولَ اللهِ صلى الله عليه وسلم يقول: "يَأتِي عَلَيْكُمْ أُويْسُ بْنُ عَامِرٍ مَعَ أمْدَادٍ مِنْ أهْلِ اليَمَنِ مِنْ مُرَادٍ, ثُمَّ مِنْ قَرَنٍ, كَانَ بِهِ بَرَصٌ فَبَرَأَ مِنْهُ إلاَّ موْضِعَ دِرْهَمٍ, لَهُ وَالدةٌ هُوَ بِهَا بَرٌّ لَوْ أقْسَمَ عَلَى الله لأَبَرَّهُ, فَإنِ اسْتَطْعتَ أنْ يَسْتَغْفِرَ لَكَ فَافْعَلْ" فَأتَى أُوَيْساً, فَقَالَ: اسْتَغْفِرْ لِي, قَالَ: أنْتَ أحْدَثُ عَهْداً بسَفَرٍ صَالِحٍ, فَاسْتَغْفِرْ لي, قَالَ: لَقِيتَ عُمَرَ؟ قَالَ: نَعَمْ. فاسْتَغْفَرَ لَهُ, فَفَطِنَ لَهُ النَّاسُ, فَانْطَلَقَ عَلَى وَجْهِهِ. رواه مسلم. وفي رواية لمسلم أيضاً عن أسير بن جابررضي الله عنه: أنَّ أهْلَ الكُوفَةِ وَفَدُوا عَلَى عُمَرَ رضي الله عنه, وَفِيهمْ رَجُلٌ مِمَّنْ كَانَ يَسْخَرُ بِأُوَيْسٍ, فَقَالَ عُمَرُ: هَلْ هاهُنَا أَحَدٌ مِنَ القَرَنِيِّينَ؟ فَجَاءَ ذلِكَ الرَّجُلُ, فَقَالَ عمرُ: إنَّ رَسُول الله صلى الله عليه وسلم قَدْ قَالَ:" إنَّ رَجُلاً يَأتِيكُمْ مِنَ اليَمَنِ يُقَالُ لَهُ: أُوَيْسٌ, لاَ يَدَعُ باليَمَنِ غَيْرَ أُمٍّ لَهُ, قَدْ كَانَ بِهِ بَيَاضٌ فَدَعَا الله تَعَالَى, فَأذْهَبَهُ إلاَّ مَوضِعَ الدِّينَارِ أَو الدِّرْهَمِ, فَمَنْ لَقِيَهُ مِنْكُمْ, فَلْيَسْتَغْفِرْ لَكُمْ". وفي رواية لَهُ عن عمر, رضي الله عنه, قَالَ: إنِّي سَمِعْتُ رَسُول الله صلى الله عليه وسلم يقول: "إنَّ خَيْرَ التَّابِعِينَ رَجُلٌ يُقَالُ لَهُ: أُوَيْسٌ, وَلَهُ وَالِدَةٌ وَكَانَ بِهِ بَيَاضٌ, فَمُرُوهُ, فَلْيَسْتَغْفِرْ لَكُمْ". قوله:"غَبْرَاءِ الناس"بفتح الغين المعجمة وإسكان الباء بالمد وهم فقراؤهم وصعاليكم وَمَنْ لا يُعْرَفُ عَيْنُهُ مِنْ أخلاطِهِمْ"وَالأَمْدَادُ"جَمْعُ مَدَدٍ وَهُمُ الأَعْوَانُ, وَالنَّاصِرُونَ الَّذِينَ كَانُوا يُمدُّونَ المُسْلِمِينَ في الجهَاد.
హజ్రత్ ఉసైర్ బిన్ అమ్ర్ – మరికొంతమంది అభిప్రాయం ప్రకారం ఉసైర్ బిన్ జాబిర్ కథనం :
"యమన్ దేశం నుండి ముస్లిం యుద్ధవీరులకు సహాయపడేవారెవరైనా వస్తే హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వారిని "మీలో ఉవైస్ బిన్ ఆమిర్ అనే పేరుగల వ్యక్తి ఎవరైనా ఉన్నారా?" అని అడుగుతుండేవారు. ఒకనాడు ఓ బృందంతోపాటు నిజంగానే ఉవైస్ వచ్చారు. మీరు 'ఉవైస్ బిన్ ఆమిర్ గారేనా?' అని ఉమర్ అడిగారు. ఆయన అవునన్నారు. "మీకు మురాద్ కుటుంబంతోనూ, ఖర్న్ తెగతోనూ సంబంధముందా?" అని అడిగారు. ఆయన 'ఉంద'ని చెప్పారు. ఆ తరువాత ఉమర్ (రదియల్లాహు అన్హు) "మీ శరీరంపై తెల్లమచ్చలుండేవి. ఇప్పుడు అవన్నీ నయమయిపోయి దిర్హం నాణెమంత మచ్చమాత్రమే మిగిలి ఉంది కదూ!?" అని అడిగారు. ఆయన అవునన్నారు. ఆ తరువాత "మీ తల్లి బ్రతికి ఉందా?" అని అడిగారు. "అవును, బ్రతికే ఉంది" అని ఆయన సమాధానమిచ్చారు. (ఆయన తాననుకుంటున్న ఉవైసే అన్న నమ్మకం కుదిరాక) హజ్రత్ ఉమర్ దైవప్రవక్త ﷺ ఇలా చెబుతుండగా తాను విన్నానని తెలియజేశారు:
యమన్ దేశం నుండి ముస్లిం సైన్యాలకు జిహాద్లో సహకరించేవారితో పాటు మురాద్ కుటుంబానికి, ఖర్న్ తెగకు చెందిన ఉవైస్ బిన్ ఆమిర్ అనే అతను మీ దగ్గరికి వస్తాడు. ఒకప్పుడు అతని శరీరంపై ఉండిన తెల్లమచ్చలన్నీ నయమయిపోయి కేవలం ఒక దిర్హం నాణెమంత మచ్చ మాత్రమే మిగిలి ఉంటుంది. అతను తన తల్లి పట్ల చాలా ఉత్తమంగా ప్రవర్తిస్తాడు. అతను గనక దేవునిపై ఏదైనా ప్రమాణం చేస్తే దేవుడు తప్పకుండా అతని ప్రమాణాన్ని పూర్తిచేస్తాడు. కాబట్టి (ఓ ఉమర్!) నీకు నీ పాపాల మన్నింపు కోసం అతని చేత ప్రార్థన చేయించుకునే అవకాశం లభిస్తే తప్పకుండా చేయించుకో."
తరువాత హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు), "అందుకే అడుగుతున్నాను. మీరు నా పాపాల మన్నింపు కోసం దేవుణ్ణి ప్రార్థించండి" అని కోరారు. ఉమర్ (రదియల్లాహు అన్హు) కోరినట్లుగానే ఉవైస్ ఖర్ని ఆయన మన్నింపు కోసం దేవుణ్ణి ప్రార్థించారు. ఆ తరువాత హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) "ఇప్పుడు మీరెక్కడికి వెళ్ళాలనుకుంటు న్నారు?" అని అడిగారు. కూఫాకు వెళ్ళాలనుకుంటున్నానని చెప్పారాయన. "అలాగయితే నేను కూఫా గవర్నర్కు మీ గురించి లేఖ రాసివ్వమంటారా?" అని అడిగారు. దానికాయన, "(అవసరం లేదు). నేను ఎవరికీ తెలియకుండా ఎవరూ పట్టించుకోకుండా ఉండే నిరుపేదలు, అభాగ్యులతో పాటు ఉండాలనుకుంటు న్నాను" అని అన్నారు.
మరు సంవత్సరం యమన్ దేశానికి చెందిన గొప్ప మనుషుల్లో ఒకాయన కాబా యాత్ర (హజ్) కోసం వచ్చాడు. (ఆ యాత్రలోనే) అతను హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)ని కలవటం జరిగింది. ఆయన ఆ వ్యక్తిని ఉవైస్ (రహిమహుల్లాహ్) గురించి అడిగారు. దానికావ్యక్తి, "నేను వచ్చినప్పుడు ఆయన ఎంతో నిరాడంబర జీవితం గడుపుతున్నారు. ఆయన దగ్గర జీవన సామగ్రి చాలా తక్కువగా ఉంది" అని అన్నాడు. అప్పుడు హజ్రత్ ఉమర్ తాను దైవప్రవక్త ﷺ ద్వారా విన్న విషయం అతనికి ఈ విధంగా చెప్పారు:
"యమన్ దేశం నుండి ముస్లిం యోధులకు సహాయం చేసేవారితో పాటు మురాద్ కుటుంబానికి, ఖర్న్ తెగకు చెందిన ఉవైస్ బిన్ ఆమిర్ అనే ఆయన మీ దగ్గరికి వస్తాడు. ఒకప్పుడు ఆయనకు తెల్లమచ్చల రోగం ఉండి ఉంటుంది. ఆ రోగమంతా నయమయిపోయి దిర్హము నాణెమంత మచ్చ మాత్రమే మిగిలి పోతుంది. ఆయన తల్లి (బ్రతికి) ఉంటుంది. ఆయన తన తల్లి పట్ల ఎంతో ఉత్తమంగా మెలగుతాడు. ఆయన గనక దేవునిపై ప్రమాణం చేస్తే దేవుడు (తప్పకుండా) ఆయన ప్రమాణాన్ని పూర్తిచేస్తాడు. కనుక నీకు ఆయన చేత నీ పాపాల మన్నింపుకోసం ప్రార్థన చేయించుకునే అవకాశం లభిస్తే తప్పకుండా చేయించుకో!"
హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) చెప్పింది విని ఆ యమన్ దేశస్థుడు హజ్ పూర్తి చేసుకున్న తరువాత ఉవైస్ (రహిమహుల్లాహ్) దగ్గరికి వెళ్ళి తన కోసం మన్నింపు ప్రార్థన చేయమని కోరాడు. దానికి ఉవైస్ (రహిమహుల్లాహ్) "మీరు ఇప్పుడే ఓ పుణ్యప్రదమైన ప్రయాణాన్ని ముగించుకొని వచ్చారు. కాబట్టి మీరే నా మన్నింపు కోసం ప్రార్థించాల"న్నారు. తరువాత "మీరు ఉమర్ గారిని కలిశారా?" అని అడిగారు. దానికావ్యక్తి కలిశానన్నాడు. ఉవైస్ హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) మన్నింపు కోసం ప్రార్థించారు. అప్పుడు ప్రజలు ఆయన గొప్పదనాన్ని గుర్తించారు. ఉవైస్ (రహిమహుల్లాహ్) ముందుకు నడిచారు. (ముస్లిం)
ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో హజ్రత్ ఉసైర్ బిన్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ఇలా ఉంది : కూఫా ప్రాంతానికి చెందిన కొందరు హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) దగ్గరికి వచ్చారు. వారిలో ఒకడు ఉవైస్ (రహిమహుల్లాహ్)ని ఎగతాళి చేసేవాడు. (అతనికి ఉవైస్ (రహిమహుల్లాహ్) గొప్పదనం ఏమిటో తెలియదు) ఇక్కడ ఖర్న్ తెగకు చెందినవారు ఎవరైనా ఉన్నారా?" అని ఉమర్ (రదియల్లాహు అన్హు) అడిగారు. అప్పుడు ఆ వ్యక్తి ముందుకు వచ్చాడు. ఉమర్ (రదియల్లాహు అన్హు) అతనికి, దైవప్రవక్త ﷺ ఇలా అన్నారని తెలియజేశారు:
"మీ దగ్గరికి యమన్ నుండి ఉవైస్ అనే ఆయన వస్తాడు. ఆయన మీ దగ్గరికి వచ్చినప్పుడు యమన్లో తన తల్లి ఒక్కతినే వదలివస్తాడు. ఒకప్పుడు అతనికి బొల్లి రోగం ఉంటుంది. అతను దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడు అతని రోగాన్ని నయంచేస్తాడు. అతని శరీరంపై దీనారు లేక దిర్హం నాణెమంత మచ్చ మాత్రమే మిగిలిపోతుంది. కనుక మీలో ఎవరైనా అతన్ని కలిస్తే (తప్పకుండా) అతని చేత మన్నింపుకోసం ప్రార్థన చేయించుకోండి."
ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త ﷺ ఇలా అంటుండగా తాను విన్నానని తెలియజేశారు : తాబయీన్లలో (అంటే ప్రవక్త సహచరుల అనుచరుల్లో) ఉవైస్ అనే ఆయన అందరికన్నా గొప్పవాడు. ఆయన తల్లి బ్రతికి ఉంటుంది. ఆయన శరీరంపై తెల్లమచ్చలుంటాయి. మీరు ఆయన్ని మీ మన్నింపు కోసం ప్రార్థించమని కోరండి."
'గబ్రావున్నాస్' అంటే గుట్టుగా ఉండే ఆ ప్రాంతపు నిరుపేదలు, అగత్యపరులు. 'అమ్దాద్' మదద్కు బహువచనం. వారు యుద్ధంలో ముస్లిం యోధులకు సహకరించేవారని అర్థం.
(సహీహ్ ముస్లింలోని ప్రవక్త సహచరుల మహిమోన్నతుల ప్రకరణం)
English
Usair bin `Amr (Ibn Jabir) reported: When delegations from Yemen came to the help of (the Muslim army at the time of Jihad) `Umar (radiyallahu anhu) would ask them, “Is there Owais bin `Amir amongst you?” (He continued searching him) until he met Owais (radiyallahu anhu). He said, “Are you Owais bin `Amir?” He said, “Yes”. `Umar asked, “Are you from the Qaran branch of the tribe of Murad?” He said, “Yes”. He `Umar (radiyallahu anhu) again said, “Did you suffer from leucoderma and then you were cured from it but for the space of a dirham?” He said, “Yes”. He `Umar (radiyallahu anhu) said, “Is your mother still alive?” He said, “Yes”. He `Umar (radiyallahu anhu) said, “I heard Messenger of Allah ﷺ saying, `There would come to you Owais bin `Amir with the reinforcement from the people of Yemen. He would be from Qaran (the branch) of Murad. He had been suffering from leucoderma from which he was cured but for a spot of a dirham. He has a mother to whom he is very dutiful. If he were to take an oath in the Name of Allah, Allah would fulfill his oath. And if it is possible for you, ask him to ask forgiveness for you.’ So, ask forgiveness for me”. He Owais (radiyallahu anhu) did so. `Umar (radiyallahu anhu) then said, “Where do you intend to go?” He said, “To Kufah.” He `Umar (radiyallahu anhu) said, “Let me write a letter for you to its governor,” whereupon he Owais (radiyallahu anhu) said, “I love to live amongst the poor people”. The following year, a person from among the elite (of Kufah) performed Hajj and he met `Umar (radiyallahu anhu). `Umar (radiyallahu anhu) asked him about Owais (radiyallahu anhu). He said, “I left him in a state with meagre means of sustenance in a decayed house.” (Thereupon) `Umar (radiyallahu anhu) said, “I heard Messenger of Allah ﷺ saying, `There would come to you Owais bin `Amir of Qaran, a branch (of the tribe) of Murad, along with the reinforcement of the people of Yemen. He had been suffering from leucoderma which would have been cured but for the space of a dirham. He has a mother to whom he is very dutiful. Were he to swear, trusting Allah, for something, Allah would fulfill his oath. If you can ask him to pray for forgiveness for you, do so”. This man went to Owais (radiyallahu anhu) and asked him to pray for forgiveness for him. Owais (radiyallahu anhu) said to him, “You have just returned from a blessed journey, it is you who should pray for forgiveness for me; and did you meet `Umar?” The man said, “Yes”. `Owais (radiyallahu anhu) then prayed for forgiveness for him. People became aware of the high status of Owais (radiyallahu anhu) and he set out following his course.[Muslim].
Another narration is: A delegation from Kufah came to `Umar (radiyallahu anhu). Among them was one who used to make fun of Owais (radiyallahu anhu). `Umar (radiyallahu anhu) enquired, “Is there anyone among you who is from Qaran?” So this man stepped forward. Then `Umar (radiyallahu anhu) said, “I heard Messenger of Allah ﷺ saying, `A man will come to you from Yemen named Owais. He will have left in the Yemen only his mother. He was suffering from leucoderma and prayed to Allah to be cured of it. So he was cured except for a space of the size of a dinar or a dirham. Whoever of you should meet him should ask him to pray for forgiveness for him.”’
Another narration is: `Umar (radiyallahu anhu) said: “I heard Messenger of Allah ﷺ saying, `The best one of the next generation (At-Tabi`un) is a man called Owais, he will have a mother and he will be suffering from leucoderma. Go to him and ask him to pray for forgiveness for you”. [Muslim].
ముఖ్యాంశాలు
- ఈ హదీసు దైవప్రవక్త ﷺ గారి స్పష్టమైన మహిమను గురించి తెలియజేస్తోంది. ఉవైస్ ఖర్నీ వస్తారని ఆయన తన జీవిత కాలంలోనే చెప్పారు. ఉవైస్ ఖర్నీ (రహిమహుల్లాహ్) వచ్చిన తరువాత చూస్తే ఆయన గురించి దైవప్రవక్త ﷺ ఇచ్చిన సూచనలన్నీ నిజమని తేలాయి.
- ప్రాపంచిక పటాటోపాలకు దూరంగా, నిరాడంబరంగా, గుట్టుగా జీవనం సాగించటం ఉత్తమం.
- తల్లిదండ్రుల పట్ల మంచిగా మెలగాలి.
- ఈ హదీసు ద్వారా ఉవైస్ ఖర్నీ (రహిమహుల్లాహ్) తాబయీన్లందరిలోకెల్లా గొప్పవారని తెలుస్తోంది. కొంతమంది హజ్రత్ సయీద్ బిన్ ముసయ్యిబ్ (రహిమహుల్లాహ్) తాబయీన్లలో గొప్పవారని అన్నారంటే వారు వేరే ఉద్దేశ్యంతో అని ఉంటారు. ఎందుకంటే, ఖుర్ఆన్ హదీసుల జ్ఞానంలో, ధర్మావగాహనలో ఇతర తాబయీన్లందరికన్నా సయీద్ బిన్ ముసయ్యిబ్ (రహిమహుల్లాహ్) ప్రవీణులన్న విషయంలో ఏకాభిప్రాయముంది. కాని హదీసుపరంగా చూస్తే దేవుని దృష్టిలో ఉవైస్ (రహిమహుల్లాహ్) అందరికన్నా గొప్పవారని తెలుస్తోంది. (నవవీ)
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|45. మహాత్ముల దగ్గరికి వెళ్ళాలి, వారి సమావేశాల్లో కూర్చోవాలి, వారి సాహచర్యాన్ని పొందాలి. వారిని అభిమానించాలి, తమ కోసం దేవుణ్ణి ప్రార్థించమని వారిని కోరాలి, పుణ్యక్షేత్రాలను సందర్శించాలి|హదీసు 373
హదీసు 374
وعن عمرَ بنِ الخطاب رضي اللَّه عنه قَالَ: اسْتَأْذَنْتُ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم في العُمْرَةِ، فَأَذِنَ لِي، وَقالَ:"لاَ تَنْسَنَا يَا أَخَيَّ مِنْ دُعَائِكَ"فَقَالَ كَلِمَةً مَا يسُرُّني أَنَّ لِي بِهَا الدُّنْيَا. وفي روايةٍ قَالَ: "أَشْرِكْنَا يَا أخَيَّ في دُعَائِكَ ". حديثٌ صحيحٌ رواه أَبو داود، والترمذي وَقالَ: حديثٌ حسنٌ صحيحٌ.
హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) కథనం: నేను ఉమ్రాకు వెళ్ళటానికి దైవప్రవక్త ﷺ అనుమతి కోరాను. అప్పుడు ఆయన అనుమతి ఇస్తూ, "సోదరా! (ఉమ్రాలో) నువ్వు దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు మమ్మల్ని మరచిపోకు సుమా!" అని అన్నారు. ఆయన అన్న ఆ మాటకు నేనెంతగా పొంగిపోయానంటే, మొత్తం ప్రపంచం నా సొంతమయినా నాకు అంత ఆనందం కలిగేది కాదు.
వేరొక ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు : "సోదరా! నీ ప్రార్థనలో మమ్మల్ని కూడా చేర్చుకో." (ఈ హదీసు ప్రామాణికమైనది. దీనిని అబూదావూద్ మరియు తిర్మిజీలు వెలికితీశారు. తిర్మిజీ దీనిని 'హసన్' మరియు 'సహీహ్'గా పేర్కొన్నారు.)
(సుననె అబూదావూద్లోని నమాజ్ ప్రకరణం, సుననె తిర్మిజీలోని ప్రార్థనల ప్రకరణం)
English
`Umar bin Al-Khattab (radiyallahu anhu) reported: I sought permission of the Prophet ﷺ to perform `Umrah. He granted me leave and said, “Dear brother! Do not forget us in your supplications”. (`Umar added): This is something I would not exchange for the whole world.
Another narration is: He ﷺ said, “Include us, my dear brother, in your supplications.” [Abu Dawud and At-Tirmidhi, who categorized the Hadith as Hasan Sahih. Sheikh Salim Al-Hilali in his book “Bahjatun-Nazireen, Sharh Riyad-us-Saliheen” classifies it as “Da`if”, the reason being that `Asim bin `Abdullah is “weak” in narration].
ముఖ్యాంశాలు
ప్రయాణానికి బయలుదేరుతున్న వారిని తమ కోసం ప్రార్థించమని కోరటం ఉత్తమం, ముఖ్యంగా హజ్ (కాబాయాత్ర) కోసం వెళుతున్నవారిని; కాబా గృహాన్ని సందర్శించినప్పుడు తమకోసం కూడా ప్రార్థించమని కోరాలి. దీనివల్ల రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి: ఒక ముస్లిం పరోక్షంగా ఉన్న తన సోదరుని కోసం ప్రార్థిస్తే దేవుడు అతని ప్రార్థనను తప్పకుండా ఆమోదిస్తాడు. ఎందుకంటే పరోక్షంగా చేసే ప్రార్థనలో చిత్తశుద్ధి ఉంటుంది. ఇక రెండో ప్రయోజనం ఏమిటంటే, పుణ్యక్షేత్రంలో చేసే ప్రార్థనలకు త్వరగా స్వీకృతి లభిస్తుంది. అదేవిధంగా హజ్, ఉమ్రాల కోసం వెళ్ళేవారు అక్కడికి వెళ్ళిన తరువాత కేవలం తమ కోసమే ప్రార్థించుకోకుండా బంధుమిత్రుల కోసం కూడా ప్రార్థించాలి.
దైవప్రవక్త ﷺ తన అనుచర సమాజానికి తండ్రి లాంటివారని అందరికీ తెలుసు. గౌరవోన్నతుల రీత్యా సృష్టిలో ఆయన అందరికన్నా శ్రేష్ఠులు. అందులో సందేహానికి ఏమాత్రం తావులేదు. అదేవిధంగా ఆయన ధార్మికంగా ప్రతి వ్యక్తికీ ఒక సోదరుని లాంటివారని కూడా ఈ హదీసు ద్వారా బోధపడుతోంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|45. మహాత్ముల దగ్గరికి వెళ్ళాలి, వారి సమావేశాల్లో కూర్చోవాలి, వారి సాహచర్యాన్ని పొందాలి. వారిని అభిమానించాలి, తమ కోసం దేవుణ్ణి ప్రార్థించమని వారిని కోరాలి, పుణ్యక్షేత్రాలను సందర్శించాలి|హదీసు 374
హదీసు 375
وعن ابن عُمرَ رضي اللَّه عنهما قَالَ: كَانَ النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَزُورُ قُبَاءَ رَاكِباً وَماشِياً، فَيُصلِّي فِيهِ رَكْعتَيْنِ متفقٌ عَلَيهِ. وفي روايةٍ: كَانَ النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَأْتي مَسْجِدَ قُبَاءَ كُلَّ سبْتٍ رَاكِبًا وَمَاشِياً وكَانَ ابْنُ عُمَرَ يَفْعَلُهُ.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ వాహనంపైగాని లేదా నడిచిగాని 'ఖుబా'కు వెళ్ళి అక్కడ రెండు రకాతుల నమాజు చేసి వచ్చేవారు. (బుఖారీ – ముస్లిం)
వేరొక ఉల్లేఖనంలో దైవప్రవక్త ﷺ ప్రతి శనివారం వాహనంపైగాని నడిచిగాని ఖుబా మస్జిద్కు వెళ్ళేవారనీ, ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కూడా (దైవప్రవక్తను అనుసరిస్తూ) అలాగే చేసేవారని ఉంది.
(సహీహ్ బుఖారీలోని వ్యాఖ్యానాల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని హజ్ ప్రకరణం)
English
Ibn `Umar (radiyallahu anhuma) reported: The Prophet ﷺ used to visit Quba’, either mounted or on foot and would offer two Rak`ah prayer in the mosque there.[Al-Bukhari and Muslim].
Another narration is: The Prophet ﷺ used to visit the mosque at Quba’ every Saturday (i.e., every week) either mounted or on foot, and Ibn `Umar (radiyallahu anhum) used to do the same thing.
ముఖ్యాంశాలు
- మదీనా నగరానికి రెండు మైళ్ళ దూరంలో 'ఖుబా' అనే చిన్న ఊరు ఉండేది. ప్రస్తుతం అది మదీనాలో ఒక పేటగా మారిపోయింది. ఒక హదీసులో దైవప్రవక్త ﷺ ఖుబా మస్జిద్లో నమాజ్ చేస్తే ఉమ్రా చేసినంత పుణ్యం లభిస్తుందని చెప్పారు. (తిర్మిజీ)
- దైవప్రవక్త ఆచరణల్ని అనుసరించటంలో హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కు మంచి పేరుంది. ఇది ఆయన ప్రత్యేకతగా చెప్పబడుతుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|45. మహాత్ముల దగ్గరికి వెళ్ళాలి, వారి సమావేశాల్లో కూర్చోవాలి, వారి సాహచర్యాన్ని పొందాలి. వారిని అభిమానించాలి, తమ కోసం దేవుణ్ణి ప్రార్థించమని వారిని కోరాలి, పుణ్యక్షేత్రాలను సందర్శించాలి|హదీసు 375
You must be logged in to post a comment.