హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 44. పండితులను, పెద్దలను గౌరవించాలి

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 44వ అధ్యాయం: పండితులను, పెద్దలను, పలుకుబడిగల వారిని గౌరవించాలి, వారికి ఇతరులపై ప్రాధాన్యతనివ్వాలి, సమున్నత స్థానాన్ని ప్రసాదించాలి. వారి స్థాయిని ఇనుమడింపజేయాలి. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 12 హదీసులు (హదీసు 349 – 360) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

44. పండితులను, పెద్దలను, పలుకుబడిగల వారిని గౌరవించాలి, వారికి ఇతరులపై ప్రాధాన్యతనివ్వాలి, సమున్నత స్థానాన్ని ప్రసాదించాలి. వారి స్థాయిని ఇనుమడింపజేయాలి

↑ విషయ సూచిక

باب توقير العلماء والكبار وأهل الفضل وتقديمهم عَلَى غيرهم، ورفع مجالسهم، وإظهار مرتبتهم

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

{قُلْ هَلْ يَسْتَوِي الَّذِينَ يَعْلَمُونَ وَالَّذِينَ لا يَعْلَمُونَ إِنَّمَا يَتَذَكَّرُ أُولُوالأَلْبَابِ} [الزمر: ٩]

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు : "ప్రవక్తా! వారిని అడుగు, తెలిసినవారూ, తెలియనివారూ ఇద్దరూ సమానులు కాగలరా? బుద్ధిమంతులు మాత్రమే హితబోధను స్వీకరిస్తారు." (అజ్ జుమర్ : 9)

English

“Say: `Are those who know equal to those who know not?’ It is only men of understanding who will remember (i.e., get a lesson from Allah’s Signs and Verses).” [Az-Zumar 39:9]

349

హదీసు 349

وعن أَبي مسعودٍ عُقبةَ بنِ عمرٍو البدريِّ الأنصاريِّ رضي اللَّهُ عنه قَالَ: قَالَ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "يَؤُمُّ الْقَوْمَ أَقْرَؤهُمْ لِكتَابِ اللَّهِ، فَإِنْ كَانُوا في الْقِراءَةِ سَواءً، فَأَعْلَمُهُمْ بِالسُّنَّةِ، فَإِنْ كَانُوا في السُّنَّةِ سَوَاءً، فَأَقْدمُهُمْ هِجْرَةً، فَإِنْ كانُوا في الهِجْرَةِ سَوَاءً، فَأَقْدَمُهُمْ سِنّاً وَلا يُؤمَّنَّ الرَّجُلُ الرَّجُلَ في سُلْطَانِهِ، وَلا يَقْعُد في بيْتِهِ عَلَى تَكْرِمتِهِ إِلاَّ بِإِذْنِهِ" رواه مسلم. وفي روايةٍ لَهُ: "فَأَقْدمهُمْ سِلْماً" بَدل"سِنًّا": أَيْ إِسْلاماً. وفي رواية: يَؤُمُّ الْقَوْمَ أَقْرَؤهُمْ لِكتَابِ اللَّهِ، وأَقْدمُهُمْ قِراءَةً، فَإِنْ كَانَتْ قِراءَتُهمْ سَواءً فَيَؤُمُّهم أَقْدمُهُمْ هِجْرةً، فَإِنْ كَانوا في الهِجْرَةِ سوَاء، فَلْيُؤمَّهُمْ أَكْبرُهُمْ سِناً". والمُرادُ"بِسُلْطَانِهِ"محلُّ ولايتِهِ، أَوْ الموْضعُ الَّذِي يخْتَصُّ به."وَتَكْرِمتُهُ"بفتحِ التاءِ وكسر والراءِ: وهِي مَا يَنْفَرِدُ بِهِ مِنْ فِراشٍ وسرِيرٍ ونحْوِهِمَا.

హజ్రత్ అబూ మస్‌వూద్ ఉఖబా బిన్ అమ్ర్ బద్రీ అన్సారీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : దైవగ్రంథాన్ని బాగా పారాయణం చేసేవ్యక్తి (నమాజులో) ప్రజలకు సారథ్యం వహించాలి. ఒకవేళ ప్రజలందరూ గ్రంథపారాయణం బాగా చేసేవారే అయినప్పుడు వారిలో దైవప్రవక్త విధానం (సున్నత్) గురించి అందరికన్నా బాగా తెలిసిన వ్యక్తి సారథ్యం వహించాలి. ఒకవేళ సున్నత్ జ్ఞానంలో కూడా ప్రజలందరూ సమానులే అయినప్పుడు వారిలో ప్రప్రథమంగా దైవమార్గంలో హిజ్రత్ (ప్రస్థానం) చేసినవారు సారథ్యం వహించాలి. ఒకవేళ హిజ్రత్‌లో కూడా అందరూ సమానులుగా ఉంటే అప్పుడు వయసులో అందరికన్నా పెద్దవాడు వారికి సారథ్యం వహించాలి. మనిషి ఇంకొకరి ఆధిక్యతగల ప్రాంతంలో ఉంటూ వారికి సారథ్యం వహించకూడదు. అతని ఇంట్లో అతని అనుమతి లేనిదే అతని గౌరవాసనంపై కూర్చోకూడదు. (ముస్లిం)

ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో వయసులో అందరికన్నా పెద్దవాడు అనేచోట 'అందరికన్నా ముందు ఇస్లాం స్వీకరించినవాడు' అని ఉంది.

ఇంకొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : దైవగ్రంథాన్ని చాలా బాగా పారాయణం చేసేవాడు, దాని పారాయణంలో ప్రావీణ్యత గల వ్యక్తి ప్రజలకు సారథ్యం వహించాలి. ఒకవేళ అందరి పారాయణం ఒకేలాగుంటే అప్పుడు అందరి కన్నా ముందు దైవమార్గంలో హిజ్రత్ (ప్రస్థానం) చేసిన వ్యక్తి సారథ్యం వహించాలి. ఒకవేళ హిజ్రత్‌లో కూడా అందరూ సమానులుగా ఉంటే అప్పుడు వయసులో అందరికన్నా పెద్దవాడు సారథ్యం వహించాలి.

'సుల్తానుహూ' అంటే తన అధీనంలో ఉన్న ప్రాంతం లేదా తనకు ప్రత్యేకించబడిన ప్రాంతం. 'తక్రిమతుహూ' అంటే ఒక వ్యక్తికి ప్రత్యేకించబడిన పడక, మంచం మొదలగునవి.

(సహీహ్ ముస్లింలోని నమాజు ప్రకరణం)

English

Abu Mas`ud `Uqbah bin `Amr Al-Badri Al-Ansari (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “The person who is best versed in the recitation of the Book of Allah, should lead the prayer; but if all those present are equally versed in it, then the one who has most knowledge of the Sunnah; if they are equal in that respect too, then the one who has emigrated (to Al-Madinah) first, if they are equal in this respect also, then the oldest of them. No man should lead another in prayer where the latter has authority, or sit in his house, without his permission”.[Muslim].

In another narration in Muslim: Messenger of Allah ﷺ said, “One who is senior most in accepting Islam, should lead the Salat (prayer)”.

Yet another narration is: Messenger of Allah ﷺ said, “A man who is well versed in the Book of Allah and can recite it better, should lead the Salat (prayer); if (all those present) are equal in this respect, then the man who is senior most in respect of emigration, if they are equal in that respect too, then the oldest of them should lead the prayer”. [Muslim].

ముఖ్యాంశాలు

  1. నమాజు సారథ్యానికి (ఇమామత్‌కు) ఎవరు ఎక్కువ అర్హులో ఈ హదీసులో ఒక క్రమం ప్రకారం వివరించటం జరిగింది. ఖుర్‌ఆన్‌ను మధురాతి మధురంగా పారాయణం చేసేవారు నమాజులో ప్రజలకు సారథ్యం వహించటానికి అందరికన్నా ఎక్కువ అర్హులుగా పరిగణించబడతారు. ఖుర్‌ఆన్ పారాయణం చేసేవారిలో (ఖారీల్లో) కూడా దైవభీతిగల ఖారీలను ఎంచుకోవటం మంచిది. మరికొన్ని హదీసుల్లో తమలో అందరికన్నా మంచివాణ్ణి ఇమామ్‌గా ఎన్నుకోవాలని ఆదేశించటం జరిగింది. ఇంకో విషయం ఏమిటంటే ఖుర్‌ఆన్ పారాయణంలో సహజత్వం ఉండాలి. అందులో కృత్రిమత తొంగిచూడకూడదు. దివ్య ఖుర్‌ఆన్‌ను ఇంపైన స్వరంతో లయబద్ధంగా మెల్లగా ఆగి ఆగి పఠించాలి.
  2. ఒక నిర్ణీత ప్రాంతానికి చెందిన రాజులు, అధినేతలు, ఉన్నతాధికారులు తమ తమ ప్రాంతాలలో నమాజుకు సారథ్యం వహించటానికి అందరికన్నా ఎక్కువ హక్కుదారులుగా పరిగణించబడతారు. దైవప్రవక్త ﷺ మరియు ఆయన సహచరుల కాలంలో ఆనాటి గవర్నర్లు, ఉన్నతాధికారులే మస్జిదుల్లో ప్రజలకు ఇమామత్ చేసేవారు. కాని శోచనీయమైన విషయం ఏమిటంటే, నేడు ముస్లిం దేశాల ఏలికల్లోనే దురాచరణ సర్వసామాన్యమైపోతోంది. ఉన్నతాధికారులు, వారి క్రింద పనిచేసేవారందరూ నమాజులాంటి బృహత్తర విధి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు.
  3. ఇతరుల ఇళ్ళకు, కార్యాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ వారి కోసం ప్రత్యేకించబడిన కుర్చీలపై కూర్చోకూడదు. ఒకవేళ వారు అందుకు అనుమతి ఇస్తే అప్పుడు కూర్చోవటంలో తప్పులేదు. అదేవిధంగా ఇతర పండితుల మింబర్ల (వేదికల)పై, ఇమాముల ముసల్లాలపై తాము ముందుగా వెళ్ళి నించోటం కూడా మంచిది కాదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|44. పండితులను, పెద్దలను, పలుకుబడిగల వారిని గౌరవించాలి, వారికి ఇతరులపై ప్రాధాన్యతనివ్వాలి, సమున్నత స్థానాన్ని ప్రసాదించాలి. వారి స్థాయిని ఇనుమడింపజేయాలి|హదీసు 349

350

హదీసు 350

وعنه قَالَ: كَانَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يمْسحُ منَاكِبَنَا في الصَّلاةِ وَيَقُولُ: "اسْتَوُوا وَلا تخْتلِفُوا، فَتَخْتَلِفَ قُلُوبُكُمْ، لِيَلِني مِنكُمْ أُولوا الأَحْلامِ والنُّهَى، ثُمَّ الَّذِينَ يَلُونَهم، ثُمَّ الَّذِينَ يلونَهم" رواه مسلم. وقوله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لِيَلِني"هُوَ بتخفيف النُّون وَلَيْسَ قَبْلَهَا يَاءٌ، ورُوِي بتشديد النُّون مَعَ ياءٍ قَبْلَهَا."والنُّهَى": الْعُقُول:"وأُولُوا الأَحْلام"هُمْ الْبَالِغُونَ، وَقيل: أَهْلُ الحِلْمِ وَالْفَضْلِ.

హజ్రత్ ఉఖబా బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం : (మేము నమాజు కోసం నించున్నప్పుడు) దైవప్రవక్త ﷺ మా భుజాలను తాకుతూ "తిన్నగా నిలబడండి, మీరు విభేదించుకోకండి, లేదా మీ హృదయాలు కూడా పరస్పరం విభేదించుకుంటాయి (నేను నమాజు చేయిస్తున్నప్పుడు) మీలోని బుద్ధిమంతులు, తెలివిగలవారు నాకు దగ్గరగా నిలబడాలి. వారి వెనుక వారికన్నా తక్కువ ప్రతిభావంతులు నిలబడాలి. ఆ తరువాత వారికన్నా తక్కువ ప్రతిభావంతులు నిలబడాలి" అని చెప్పేవారు. (ముస్లిం)

'లియలినీ' అనే పదం 'లియలీన్నీ' అని కూడా ఉల్లేఖించబడింది. (రెండింటికీ ఒకే అర్థం). 'నుహా' అంటే తెలివిగలవారు. 'ఉలుల్ అహ్‌లామ్' అంటే ప్రాజ్ఞులు. మరికొంతమంది అభిప్రాయంలో ఉలుల్ అహ్‌లామ్ అంటే నెమ్మదస్తులు, గొప్పవారని అర్థం.

(సహీహ్ ముస్లింలోని నమాజ్ ప్రకరణం)

English

Abu Mas`ud Al-Ansari (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ would place his hands upon our shoulders when we would form rows for As-Salat (the prayer) and say, “Stand in straight rows and do not differ among yourselves, or else your hearts will differ due to disaccord. Let those be nearest to me who are mature and endowed with understanding (of the religion), then those who are nearest to them in these respects and then those who are nearest to them”.[Muslim].

ముఖ్యాంశాలు

  1. నమాజులో పంక్తులు తిన్నగా ఉండటానికి దైవప్రవక్త ﷺ ఎంత ప్రాముఖ్యం ఇచ్చేవారంటే, తన సహచరుల భుజాలు పట్టుకొని మరీ వారి పంక్తులను తిన్నగా చేసేవారు. అంతేకాదు నమాజులో పంక్తుల వక్రత్వం మనసుల వక్రతకు దారితీస్తుందని ఆయన హెచ్చరించేవారు.
  2. నమాజులో ఇమామ్‌కు వెనుక మొదటి పంక్తిలో ప్రాజ్ఞులు, సమయస్ఫూర్తి గలవారు నించోవాలి. దీనివల్ల నమాజులో ఇమామ్ వల్ల ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఇమామ్‌కు సూచించటానికి, అవసరమైతే మరో వ్యక్తి ఇమామ్ స్థానంలో నిలబడి నమాజు కొనసాగించటానికి ఈ పద్ధతి చాలా ఉపయోగపడుతుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|44. పండితులను, పెద్దలను, పలుకుబడిగల వారిని గౌరవించాలి, వారికి ఇతరులపై ప్రాధాన్యతనివ్వాలి, సమున్నత స్థానాన్ని ప్రసాదించాలి. వారి స్థాయిని ఇనుమడింపజేయాలి|హదీసు 350

351

హదీసు 351

وعن عبد اللَّه بنِ مسعودٍ رضي اللَّه عنه قَالَ: قالَ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لِيَلِني مِنْكُمْ أُولُوا الأَحْلامِ والنُّهَى، ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ"ثَلاثاً"وإِيَّاكُم وهَيْشَاتِ الأَسْواقِ" رواه مسلم.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : (నమాజులో) నెమ్మదస్తులు, తెలివిగలవారు నాకు దగ్గరగా నిలబడాలి. వారి వెనుక వారికన్నా తక్కువ సమయస్ఫూర్తి గలవారు నిలబడాలి – ఇలా క్రమంగా నిలబడాలని దైవప్రవక్త ﷺ మూడుసార్లు అన్నారు. ఆ తరువాత బజారుల్లోలాగా (మస్జిదుల్లో) గోల చేయకండి" అని అన్నారు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని నమాజ్ ప్రకరణం)

English

`Abdullah bin Mas`ud (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Let those be nearest to me in Salat (prayer) who are mature and possess (religious) knowledge, then those who are nearest to them in these respects”. He repeated this three times and then added, “Beware of indulging in the loose talks of the markets (when you are in the mosque)”.[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|44. పండితులను, పెద్దలను, పలుకుబడిగల వారిని గౌరవించాలి, వారికి ఇతరులపై ప్రాధాన్యతనివ్వాలి, సమున్నత స్థానాన్ని ప్రసాదించాలి. వారి స్థాయిని ఇనుమడింపజేయాలి|హదీసు 351

352

హదీసు 352

وعن أَبي يحْيى وَقيل: أَبي مُحمَّد سَهْلِ بن أَبي حثْمة بفتح الحاءِ المهملة وإِسكان الثاءِ المثلثةِ الأَنصاري رضي اللَّه عنه قَالَ: انْطَلَقَ عبْدُ اللَّهِ بنُ سهْلٍ وَمُحيِّصَةُ ابْنُ مَسْعُودٍ إِلى خَيْبَرَ وَهِيَ يَوْمَئِذ صُلْحٌ، فَتَفَرَّقَا. فَأَتَى مُحَيِّصةُ إِلى عبدِ اللَّهِ بنِ سَهلٍ وَهُوَ يَتَشَحَّطُ في دمهِ قَتيلاً، فدفَنَهُ، ثمَّ قَدِمَ المدِينَةَ فَانْطَلَقَ عَبْدُ الرحْمنِ بْنُ سَهْلٍ وَمُحَيِّصَةُ وَحُوِّيصةُ ابْنَا مسْعُودٍ إِلى النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَذَهَب عَبْدُ الرَّحْمنِ يَتَكَلَّمُ فَقَالَ: " كَبِّرْ كَبِّرْ" وَهُوَ أَحْدَثُ القَوْمِ، فَسَكَت، فَتَكَلَّمَا فَقَالَ: "أَتَحْلِفُونَ وَتسْتَحِقُّونَ قَاتِلكُمْ؟ " وَذَكَرَ تَمامَ الحدِيث. متفقٌ عَلَيهِ. وقوله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"كَبِّرْ كَبِّرْ"معنَاهُ: يَتَكلَّمُ الأَكْبَرُ.

హజ్రత్ అబూ యహ్‌యా – కొంతమంది అభిప్రాయం ప్రకారం అబూ ముహమ్మద్ సహ్ల్ బిన్ అబూ హస్మా అన్సారీ (రదియల్లాహు అన్హు) కథనం : అబ్దుల్లాహ్ బిన్ సహ్ల్ (రదియల్లాహు అన్హు) మరియు ముహయ్యిసా బిన్ మసూద్ (రదియల్లాహు అన్హు) ఒకసారి ఖైబర్ ప్రాంతానికి వెళ్ళారు. అప్పుడు ఖైబర్ యూదులకు మరియు ముస్లింలకు మధ్య ఒప్పందం జరిగివుంది. అక్కడికి వెళ్ళిన తరువాత వారిద్దరూ తమ తమ పనుల నిమిత్తం వేరయిపోయారు. (పని ముగిసిన తరువాత) ముహయ్యిసా (రదియల్లాహు అన్హు) అబ్దుల్లాహ్ బిన్ సహ్ల్ దగ్గరికి వచ్చి చూస్తే ఆయన హత్యచేయబడి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్నారు. (ప్రాణం పోయిన తరువాత) ముహయ్యిసా ఆయనకు ఖనన సంస్కారాలు చేసి తిరిగి మదీనాకు వచ్చారు. (బంధుమిత్రులందరికీ ఈ విషయం తెలిసింది). అప్పుడు అబ్దుర్రహ్మాన్ బిన్ సహ్ల్ ఇంకా మసూద్ (రదియల్లాహు అన్హు) గారి ఇద్దరు కుమారులు ముహయ్యిసా మరియు హువయ్యిసా అంతా కలిసి (ఈ విషయం గురించి ఫిర్యాదు చేయటానికి) దైవప్రవక్త దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తరువాత అబ్దుర్రహ్మాన్ ఈ విషయం గురించి మాట్లాడబోయారు. కాని దైవప్రవక్త ﷺ ఆయన్ని ఆపి, "పెద్దవారు, పెద్దవారు మాట్లాడాలి" అని అన్నారు. అబ్దుర్రహ్మాన్ ఆ ముగ్గురిలో అందరికంటే చిన్నవారు. అందుకని ఆయన మౌనం వహించారు. అప్పుడు మస్‌వూద్ గారి ఇద్దరు కొడుకులు మాట్లాడారు. (వీళ్ళు హతుని బాబాయి కుమారులు). వాళ్ళు చెప్పిందంతా విని దైవప్రవక్త ﷺ "మీరు (ఈ విషయమై) ప్రమాణం చేయటానికి సిద్ధంగా ఉన్నారా? మీ సోదరుని హంతకుడి నుండి పరిహారాన్ని కోరుకుంటున్నారా?" అని వారిని అడిగారు.

(హదీసు ఉల్లేఖకులు మిగిలిన సంఘటన అంతా వివరించారు.)

(బుఖారీ – ముస్లిం)

"కబ్బిర్, కబ్బిర్" అంటే పెద్దాయన మాట్లాడాలని అర్థం.

(సహీహ్ బుఖారీలోని రక్తశుల్కాల ప్రకరణం, సహీహ్ ముస్లింలో – హతుని వారసులనుండి తీసుకునే ప్రమాణ ప్రకరణం)

English

Sahl bin Abu Hathmah Al-Ansari (radiyallahu anhu) reported: `Abdullah bin Sahl and Muhaiyisah bin Mas`ud ¨(radiyallahu anhuma) went to Khaibar during the period of the truce (after its conquest) and they separated to perform their duties. When Muhaiyisah returned to `Abdullah bin Sahl, he found him murdered, drenched in his blood. So he buried him and returned to Al-Madinah. Then `Abdur-Rahman bin Sahl, Huwaiyisah and Muhaiyisah, the two sons of Mas`ud went to Messenger of Allah ﷺ and spoke about the case of their (murdered) friend. `Abdur-Rahman, who was the youngest of them all, started talking. Messenger of Allah ﷺ said, “Let those older than you speak first.” So he stopped talking and the (other two) spoke about the case of their (murdered) friend. Messenger of Allah ﷺ said, “Will you take an oath whereby you will have the right to receive the blood money of your murdered man?” And mentioned the rest of the Hadith.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

(1). గ్రంథకర్త ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) ఈ అధ్యాయానికి సంబంధించిన హదీసు భాగాన్నే ఇక్కడ ప్రస్తావించారు. హదీసు మూలగ్రంథాల్లో ఈ హదీసు పూర్తిగా వివరించబడి ఉంది. ఇక్కడ ఈ హదీసును ప్రస్తావించడంలోని ఔచిత్యం ఏమిటంటే, ఒక సమావేశంలో మాట్లాడటానికి అక్కడున్న వారిలో వయసురీత్యా అందరికన్నా పెద్దవారికి హక్కు ఉంటుంది. అయితే సమావేశంలో ఉన్న వారందరూ ప్రాజ్ఞులు, ప్రతిభావంతులైనప్పుడు మాత్రమే వయస్సు రీత్యా పెద్దవారికి ఆ హక్కు ఉంటుంది. ఒకవేళ విజ్ఞతలో అందరూ సమానులు కాకపోతే అలాంటి పరిస్థితుల్లో అందరికన్నా విజ్ఞుడే ఆ సమావేశంలో మాట్లాడటానికి ఎక్కువ హక్కుదారుగా పరిగణించబడతాడు.

2. ఈ హదీసులో 'ఖసామత్' ప్రస్తావన కూడా వచ్చింది. ఏ ప్రాంతంలోనైనా ఒక వ్యక్తి హత్యచేయబడి హంతకుడెవరో తెలియనప్పుడు హతుని వారసుల్లోని యాభైమంది లేదా అంతకన్నా తక్కువ మంది యాభైసార్లు ప్రమాణం చేసి ఈ ప్రాంతానికి చెందినవాడే ఇతణ్ణి హత్యచేసి ఉంటాడని చెప్పాలి. వారు గనక ఆ విధంగా యాభైసార్లు ప్రమాణం చేసి చెబితే ఆ ప్రాంతంలోని వారంతా కలిసి హతుని వారసులకు రక్తపరిహారం చెల్లించవలసి ఉంటుంది. అయితే ప్రత్యర్థులు కూడా తమ ప్రాంతం వారెవరూ ఈ హత్య చేయలేదని ప్రమాణం చేసి చెబితే వారికి రక్త పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉండదు. అప్పుడు హతుని వారసులకు ముస్లింల సంఘటిత నిధి (బైతుల్ మాల్) నుండి రక్తపరిహారం ఇవ్వబడుతుంది. ఈ పద్ధతిలో హతుని వారసులు మరియు ప్రత్యర్థుల నుండి ప్రమాణం తీసుకోవటాన్నే 'ఖసామా' అంటారు. ఇస్లాంకు పూర్వం అజ్ఞానకాలంలో ఈ పద్ధతి అమల్లో ఉండేది. ఇస్లాం దీని ప్రాముఖ్యతను గుర్తించి ఆ తరువాత కూడా దీనిని కొనసాగించింది.

హదీసులోని సంఘటనలో దైవప్రవక్త ﷺ హతుని వారసులను ఖసామా చేయటానికి సిద్ధంగా ఉన్నారా? అని అడిగారు. కాని అబ్దుల్లాహ్ బిన్ సహ్లను ఆ ప్రాంతం వారే హత్యచేశారన్న సంగతి తమకు ఇతమిత్థంగా తెలియనందుకు వారు ఖసామా చేయటానికి యిష్టపడలేదు. అందుకని దైవప్రవక్త ﷺ యూదుల చేత కూడా ప్రమాణం చేయించలేదు. అయితే దైవప్రవక్త ﷺ హతుని వారసులకు 'బైతుల్ మాల్' నుండి పరిహారం చెల్లించారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|44. పండితులను, పెద్దలను, పలుకుబడిగల వారిని గౌరవించాలి, వారికి ఇతరులపై ప్రాధాన్యతనివ్వాలి, సమున్నత స్థానాన్ని ప్రసాదించాలి. వారి స్థాయిని ఇనుమడింపజేయాలి|హదీసు 352

353

హదీసు 353

وعن جابرٍ رضي اللَّهُ عنه أَنَّ النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كَانَ يَجْمَعُ بيْنَ الرَّجُلَيْنِ مِنْ قَتْلَى أُحُدٍ يَعْني في القَبْرِ، ثُمَّ يَقُولُ: "أَيُّهُما أَكْثَرُ أَخْذاً لِلْقُرْآنِ؟ "فَإِذَا أُشِيرَ لَهُ إِلَى أَحَدِهِمَا قَدَّمَهُ في اللَّحْدِ. رواه البخاريُّ.

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం : ఉహుద్ యుద్ధంలో అమరగతినొందిన వారిని దైవప్రవక్త ﷺ ఒక్కో సమాధిలో ఇద్దరేసి చొప్పున ఖననం చేశారు. ఆ సమయంలో ఆయన "వీరిద్దరిలో ఎవరికి ఎక్కువ ఖుర్‌ఆన్ గుర్తుంది" అని అడిగేవారు. అక్కడున్నవారు వారిద్దరిలో ఎవరివైపు చూపెడితే వారిని ముందుగా సమాధిలోకిదించేవారు (అంటే అతన్ని ఖిబ్లావైపు ఉంచేవారు). (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని 'జనాయెజ్' ప్రకరణం)

English

Jabir (radiyallahu anhu) reported: After the battle of Uhud, the Prophet ﷺ arranged the burial of two of the martyrs in one grave. In each case he would ask, “Which one of them had learnt more Qur’an by heart?” Whichever was thus pointed out to him, was placed by him first in the Lahd.[Al-Bukhari].

ముఖ్యాంశాలు

  1. సమాధుల్లో రెండు రకాలున్నాయి. సాధారణంగా నలువైపుల నుంచి నిలువుగా త్రవ్వబడే సమాధిని 'షఖ్' అని అంటారు. మరికొన్ని సమాధుల్ని ఒక ప్రక్కకు తవ్వి లోపల డొల్లగా చేస్తారు. ఇలాంటి సమాధిని 'లిహ్ద్' అని అంటారు.
  2. ఈ హదీసు ద్వారా ఖుర్‌ఆన్ సంస్మర్త (హాఫిజ్)ల మహత్యం వెల్లడౌతోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|44. పండితులను, పెద్దలను, పలుకుబడిగల వారిని గౌరవించాలి, వారికి ఇతరులపై ప్రాధాన్యతనివ్వాలి, సమున్నత స్థానాన్ని ప్రసాదించాలి. వారి స్థాయిని ఇనుమడింపజేయాలి|హదీసు 353

354

హదీసు 354

وعن ابن عُمرَ رضي اللَّهُ عنهما أَنَّ النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "أَرَاني فِي المَنَامِ أَتَسَوَّكُ بِسِوَاكٍ، فَجَاءَنِي رَجُلانِ، أَحدُهُمَا أَكْبَرُ مِنَ الآخَرِ، فَنَاوَلْتُ السِّوَاكَ الأَصْغَرَ، فقيلَ لِي: كَبِّرْ، فَدَفَعْتُهُ إِلى الأَكْبَرِ مِنْهُمَا" رواه مسلم مُسْنَداً والبخاريُّ تعلِيقاً.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు: కలలో నేను మిస్వాక్ చేస్తుండగా నా దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిలో ఒకడు రెండవవానికన్నా (కాస్త) పెద్దవాడు. నేను నా మిస్వాక్ (పనుదోము పుల్ల)ను వారిద్దరిలో చిన్నవాడికిచ్చాను. అంతలో ఎవరో నాతో, 'పెద్దాయనకివ్వు' అని అన్నారు. అప్పుడు నేను ఆ మిస్వాక్‌ను పెద్దవాని (చేతి)కిచ్చాను."

ఈ హదీసును ముస్లిం (రహిమహుల్లాహ్) ముస్నద్‌గా, మరియు బుఖారీ (రహిమహుల్లాహ్) ముఅల్లఖ్‌గా ఉల్లేఖించారు.

(సహీహ్ బుఖారీలోని వుజూ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని స్వప్నాల ప్రకరణం)

English

`Abdullah bin `Umar (May Allah be pleased with tehm) reported: The Prophet ﷺ said, “It was shown to me in my dream that I was cleaning my teeth with a Miswak and two men came to me, one being older than the other. I gave the Miswak to the younger one, but I was asked to give it to the older, which I did”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఒక హదీసు పరంపరలోని ఉల్లేఖకులందరినీ పేర్కొంటే ఆ హదీసు 'ముస్నద్' అనబడుతుంది. ఒకవేళ పరంపరలో మొదటినుంచి ఒకర్ని గాని, ఇద్దర్నిగాని లేదా అసలు ఉల్లేఖకులందరినీ పేర్కొనకుండా ఒట్టి హదీసును మాత్రమే ప్రస్తావిస్తే అలాంటి హదీసును 'ముఅల్లఖ్' అని అంటారు. ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) తన గ్రంథంలో పై హదీసును పరంపర లేకుండా ప్రస్తావించారు.

ఈ హదీసు ద్వారా ఒకరి మిస్వాక్‌ను అతని అనుమతితో ఇంకొకరు ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఇంకో విషయం ఏమిటంటే, వ్యవహారాలన్నిటిలోనూ పెద్దవారికే ప్రాముఖ్యతనివ్వాలి. ఒకవేళ చిన్నవారిలో అలాంటి నేర్పు, నైపుణ్యాలు కనిపిస్తే వారిని ప్రోత్సహించడంలోనూ తప్పు లేదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|44. పండితులను, పెద్దలను, పలుకుబడిగల వారిని గౌరవించాలి, వారికి ఇతరులపై ప్రాధాన్యతనివ్వాలి, సమున్నత స్థానాన్ని ప్రసాదించాలి. వారి స్థాయిని ఇనుమడింపజేయాలి|హదీసు 354

355

హదీసు 355

وعن أَبي موسى رضي اللَّه عنه قَالَ: قالَ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِنَّ مِنْ إِجْلالِ اللَّهِ تَعَالَى إِكْرَامَ ذِي الشَّيْبةِ المُسْلِمِ، وَحَامِلِ الْقُرآنِ غَيْرِ الْغَالي فِيهِ، والجَافي عَنْهُ وإِكْرَامَ ذِي السُّلْطَانِ المُقْسِطِ "حديثٌ حسنٌ رواه أَبُو داود.

హజ్రత్ అబూ మూసా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : జుత్తు నెరసి (ముసలివాడయిపోయి)న ముస్లింని గౌరవించటం, ఖుర్‌ఆన్‌కు బాధ్యత వహించిన (హాఫిజ్, ఖారీ, ఆలిం మొదలగు) వారిని గౌరవించటం – అయితే వారు ఖుర్‌ఆన్ విషయంలో హద్దుమీరి ప్రవర్తించేవారు, దానిపట్ల వైముఖ్యం చూపేవారు అయి ఉండకూడదు – అదేవిధంగా న్యాయంగా పరిపాలించే రాజుని గౌరవించటం – దేవుణ్ణి గౌరవించటంతో సమానం.

ఈ హదీసు హసన్ కోవకు చెందినది. దీనిని అబూదావూద్ ఉల్లేఖించారు.

(సుననె అబూదావూద్‌లోని సంస్కార ప్రకరణం)

English

Abu Musa (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “It is out of reverence to Allah in respecting an aged Muslim, and the one who commits the Qur’an to memory and does not exaggerate pronouncing its letters nor forgets it after memorizing, and to respect the just ruler”.[Abu Dawud]

ముఖ్యాంశాలు

సదాచార సంపన్నులయిన పెద్దల్ని, పండితుల్ని, పరిపాలకుల్ని గౌరవించాలని ఈ హదీసు ప్రబోధిస్తోంది. పవిత్రమైన జీవితం గడుపుతూ వృద్ధాప్య దశకు చేరుకున్న ముసలివారినీ, దివ్య ఖుర్‌ఆన్ సేవను తమ నిత్యకృత్యంగా చేసుకున్న పండితుల్నీ, ప్రజలకు న్యాయవంతమైన పరిపాలనను అందజేసే పాలకుల్నీ గౌరవించటం దైవాన్ని గౌరవించటంతో సమానమని చెబుతోంది. దివ్య ఖుర్‌ఆన్‌ను ఆసాంతం కంఠస్థం చేసుకున్న హాఫిజ్‌లనూ, దానిని మధురాతి మధురంగా పారాయణం చేసే ఖారీలనూ, ఖుర్‌ఆన్ పండితులందరినీ గౌరవించాలి. అయితే ఖుర్‌ఆన్ విషయంలో హద్దు మీరి ప్రవర్తించే వారు, దేవుడు అందులో అస్పష్టంగా ఉంచిన వాక్యాలకు వక్ర భాష్యం చెప్పే కుహనా పండితులు మాత్రం ఖుర్‌ఆన్‌కు బాధ్యత వహించేవారి క్రిందికి రారు. కనుక అలాంటి వారిని గౌరవించాల్సిన అవసరం లేదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|44. పండితులను, పెద్దలను, పలుకుబడిగల వారిని గౌరవించాలి, వారికి ఇతరులపై ప్రాధాన్యతనివ్వాలి, సమున్నత స్థానాన్ని ప్రసాదించాలి. వారి స్థాయిని ఇనుమడింపజేయాలి|హదీసు 355

356

హదీసు 356

وعن عَمْرو بنِ شُعَيْبٍ، عن أَبيِهِ، عن جَدِّه رضي اللَّهُ عنهم قَالَ: قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لَيْسَ مِنَّا مَنْ لَمْ يَرْحَمْ صَغِيرَنَا، وَيَعْرِفْ شَرفَ كَبِيرِنَا" حديثٌ صحيحٌ رواه أَبُو داود والترمذي، وَقالَ الترمذي: حديثٌ حسنٌ صحيح. وفي رواية أبي داود"حَقَّ كَبِيرِنَا".

హజ్రత్ అమ్ర్ బిన్ షుఐబ్ తన తండ్రి నుండి ఆయన తన తాత నుండి గ్రహించిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు : మన చిన్నవారిపై దయజూపనివాడితో, మన పెద్దల గౌరవోన్నతుల్ని లెక్కచేయని వాడితో మనకెలాంటి సంబంధం లేదు.

(అబూదావూద్ మరియు తిర్మిజీలు దీనిని వెలికితీశారు. ఈ హదీసు దృఢమైనది. తిర్మిజీ దీనిని ప్రామాణికమైనదిగా పేర్కొన్నారు.)

అబూదావూద్‌లోని వేరొక ఉల్లేఖనంలో "మన పెద్దల హక్కుని" అని ఉంది.

(సుననె అబూదావూద్‌లోని సంస్కార ప్రకరణం, సుననె తిర్మిజీలోని సత్కార్యాలు – సత్సంబంధాల ప్రకరణం)

English

`Amr bin Shu`aib (radiyallahu anhu) on the authority of his father who heard it from his father reported: Messenger of Allah ﷺ said: “He is not one of us who shows no mercy to younger ones and does not acknowledge the honour due to our elders”.[At-Tirmidhi and Abu Dawud].

ముఖ్యాంశాలు

'మనకెలాంటి సంబంధం లేదు' లేదా 'మనలోని వాడు కాడు' అంటే అతను ముస్లింల విధానాన్ని అనుసరించటం లేదని భావం. పెద్దలు తమ పిన్నలపట్ల వాత్సల్యం కనబరచాలి. వారిపట్ల దయాదాక్షిణ్యాలతో మెలగాలి. అదేవిధంగా చిన్నవారు కూడా తమకంటే వయసులో పెద్దవారిని, పండితులను గౌరవించాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|44. పండితులను, పెద్దలను, పలుకుబడిగల వారిని గౌరవించాలి, వారికి ఇతరులపై ప్రాధాన్యతనివ్వాలి, సమున్నత స్థానాన్ని ప్రసాదించాలి. వారి స్థాయిని ఇనుమడింపజేయాలి|హదీసు 356

357

హదీసు 357

وعن مَيْمُونَ بنِ أَبي شَبِيبٍ رحمه اللَّهُ أَن عَائشَةَ رَضي اللَّه عنها مَرَّ بِها سَائِلٌ، فَأَعْطَتْهُ كِسْرَةً، وَمرّ بِهَا رَجُلٌ عَلَيْهِ ثِيَابٌ وهَيْئَةٌ، فَأَقْعَدتْهُ، فَأَكَلَ فَقِيلَ لَهَا في ذلكَ؟ فقَالتْ: قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "أَنْزِلُوا النَّاسَ مَنَازِلَهُمْ "رواه أبو داود. لكِنْ قال: مَيْمُونُ لَمْ يُدْرِك عائِشَةَ. وَقَدْ ذَكَرَهُ مُسْلمٌ في أَوَّلِ صَحِيحهِ تَعْلِيقاً فقال: وَذُكَرَ عَنْ عائِشَةَ رضي اللَّه عنها قالت: أَمرنا رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أَنْ نُنْزِل النَّاسَ مَنَازِلَهُمْ، وَذَكَرَهُ الحاكِمُ أَبُو عبدِ اللَّهِ في كِتابِهِ"مَعْرفَة عُلُومِ الحَديث"وقال: هو حديثٌ صحيح.

హజ్రత్ మైమూన్ బిన్ అబీ షబీబ్ (రహిమహుల్లాహ్) కథనం : హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) సమీపం నుండి ఒక అడుక్కునేవాడు వెళ్ళాడు. ఆమె అతనికి ఓ రొట్టెముక్క ఇచ్చారు. ఇంకొక వ్యక్తి వచ్చాడు. అతని ఒంటిపై మంచి దుస్తులున్నాయి. ఆ వ్యక్తి స్థితిమంతుడిలా కనిపిస్తున్నాడు. ఆమె అతణ్ణి కూర్చోబెట్టి (అన్నం తినిపించారు). అతను అన్నం తిని వెళ్ళిపోయాడు. మీరు ఎందుకిలా చేశారని ఆమెను ఎవరో అడిగితే ఆమె దైవప్రవక్త ﷺ "ప్రజల స్థాయిని బట్టి వారితో వ్యవహరించమని చెప్పారు (అందుకే నేనలా చేశాను)" అని అన్నారు.

ఈ హదీసును అబూదావూద్ వెలికితీసి మైమూన్ (రహిమహుల్లాహ్) హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) నుండి హదీసులు వినలేదని విమర్శించారు. ఇదే హదీసును ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) తన గ్రంథపీఠికలో పరంపర లేకుండా ప్రస్తావించారు. "ప్రజలతో వారి స్థాయిని బట్టి వ్యవహరించాలని దైవప్రవక్త ﷺ తమల్ని ఆదేశించారని" హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయనే కాదు ఇమాం హాకిమ్ అబూ అబ్దుల్లాహ్ (రహిమహుల్లాహ్) కూడా ఈ హదీసుని తన గ్రంథం "మారిఫతు ఉలూమిల్ హదీస్"లో ప్రస్తావించి 'ఇది దృఢమైన హదీసు' అని చెప్పారు.

English

Maimun bin Abu Shabib (May Allah had mercy upon him) reported: A begger asked `Aishah (radiyallahu anha) for charity and she gave him a piece of bread. Thereafter, one well-dressed person asked her for charity and she invited him to sit down and served him food. When she was asked about the reason for the difference in treatment, she said: “Messenger of Allah ﷺ instructed us: `Treat people according to their status”.[Abu Dawud].

ముఖ్యాంశాలు

వ్యక్తుల పరువు ప్రతిష్ఠలు, సమాజంలో వారికున్న గౌరవోన్నతులను బట్టి వారితో వ్యవహరించాలి. ఉత్తముల పట్ల ఉత్తమంగానే ప్రవర్తించాలి. ఒక గౌరవనీయుణ్ణి అతని స్థాయికంటె దిగజార్చటంగాని, ఒక అల్పుణ్ణి గౌరవస్థానాలపై ఎక్కించటం గాని చేయకూడదు. ప్రతి వ్యక్తికీ సముచితమైన స్థానం ఇవ్వాలి. లేకపోతే సమాజంలో అపసవ్యత చోటుచేసుకుంటుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|44. పండితులను, పెద్దలను, పలుకుబడిగల వారిని గౌరవించాలి, వారికి ఇతరులపై ప్రాధాన్యతనివ్వాలి, సమున్నత స్థానాన్ని ప్రసాదించాలి. వారి స్థాయిని ఇనుమడింపజేయాలి|హదీసు 357

358

హదీసు 358

وعن ابن عباسٍ رضي اللَّه عنهما قال: قَدِمَ عُيَيْنَةُ بْنُ حِصْنٍ، فَنَزَلَ عَلَى ابنِ أَخِيهِ الحُرِّ بْنِ قَيْسٍ، وَكَانَ مِنَ النَّفَرِ الَّذِينَ يُدْنيهِمْ عُمَرُ رضي اللَّه عنه، وَكَانَ القُرَّاءُ أَصْحَابَ مَجْلِسِ عُمَرَ وَمُشَاوَرَتِهِ، كُهُولاً كَانُوا أَوْ شُبَّاناً، فَقَالَ عُيَيْنَةُ لابْنَ أَخِيهِ: يَا ابْنَ أَخي لَكَ وجْهٌ عِنْدَ هذَا الأَمِيرِ، فَاسْتَأْذِنْ لِي عَلَيْهِ، فَاسْتَأَذَنَ لَهُ، فَأَذِنَ لَهُ عُمَرُ رضي اللَّه عنه، فَلَمَّا دَخَل: قَالَ هِي يَا ابْنَ الخَطَّابِ: فَوَاللَّه مَا تُعْطِينَا الجَزْلَ، وَلا تَحْكُمُ فِينا بِالعَدْلِ، فَغَضِبَ عُمَرُ رضي اللَّه عنه حَتَّى هَمَّ أَنْ يُوقِعَ بِهِ، فَقَالَ لَهُ الحُرُّ: يَا أَمِيرَ المُؤْمِنِينَ إِنَّ اللَّه تَعَالَى قَالَ لِنَبِيِّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: {خُذِ العَفْوَ وَأْمُرْ بِالعُرْفِ وَأَعْرِضْ عَنِ الجَاهِلينَ} وَإنَّ هَذَا مِنَ الجَاهِلِينَ. واللَّهِ مَا جاوزَهَا عُمرُ حِينَ تَلاهَا عَلَيْهِ، وَكَانَ وَقَّافاً عِنْدَ كِتَابِ اللَّه تَعَالَى. رواه البخاري.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: ఉయైనా బిన్ హిస్న్ (మదీనాకు) వచ్చి తన భాతృజుడైన హుర్ర్ బిన్ ఖైస్ దగ్గర బస చేశారు. ఈ హుర్ర్ బిన్ ఖైస్ హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) (ఖలీఫాగా ఉన్నప్పుడు ఆయన) సన్నిహితుల్లో ఒకరు. ఆ కాలంలో హజ్రత్ ఉమర్ సభికులు, సలహాదారులందరూ విద్యావంతులై (ఖుర్రాలై) ఉండేవారు – వారిలో నడివయస్కులూ ఉండే వారు, అలాగే నవయువకులూ ఉండేవారు. అప్పుడు ఉయైనా తన సోదర కుమారునితో "భాతృజా! ఈ ఖలీఫా దర్బారులో నీకు పలుకుబడి ఉంది. కనుక నేనాయన్ని కలుసుకునేందుకు నీవు ఆయన దగ్గర అనుమతి తీసుకో' అని కోరారు. హుర్ర్ బిన్ ఖైస్ ఆయన కోసం ఉమర్‌ని సంప్రతించి అనుమతి కోరగా ఆయన అనుమతి ఇచ్చారు. లోనికి వెళ్ళిన తర్వాత ఉయైనా ఖలీఫాను పట్టుకొని, "ఓ ఇబ్నె ఖత్తాబ్! దైవసాక్షి! నీవు మాకు తగినంతగా (సొమ్ము) ఇవ్వడంగానీ, మాకు న్యాయంగా తీర్పు ఇవ్వటం గానీ చేయటం లేదు" అని నిందించారు. ఆయన మాటలు విని హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఆగ్రహోదగ్రులయ్యారు. ఆయన్ని శిక్షించాలని నిశ్చయించుకున్నారు. అంతలోనే హుర్ర్ బిన్ ఖైస్ కల్పించుకొని, "ఓ విశ్వాసుల నాయకా! అల్లాహ్ తన ప్రవక్త నుద్దేశ్యించి 'ప్రవక్తా! మృదుత్వం, మన్నింపుల వైఖరిని అవలంబించు. మంచిని ప్రబోధించు. మూర్ఖులతో వాదానికి దిగకు' అని ఆదేశించాడు. ఇతను (నా బాబాయి) కూడా మూర్ఖుడే. (కాబట్టి ఇతన్ని క్షమించి వదలిపెట్టండి)" అని విన్నవించుకున్నారు. దైవసాక్షి! హుర్ర్ ఈ సూక్తి పఠించగానే ఉమర్ (రదియల్లాహు అన్హు) ఆ సూక్తిని ఉల్లంఘించలేకపోయారు. ఆయన దివ్య ఖుర్‌ఆన్ ముందు (అంటే దాని ఆదేశాల ముందు) కడు వినయంగా లొంగిపోయేవారు. (బుఖారీ)

English

Ibn Abbas (radiyallahu anhuma) reported: `Uyainah bin Hisn came to Al-Madinah and stayed with his nephew Al-Hurr bin Qais who was among those who were close to `Umar (radiyallahu anhu) and had access to his council. The scholarly persons, whether they were old or young, had the privilege of joining his council and he used to consult them. `Uyainah said to Al-Hurr: “My dear nephew, you have an access to the Leader of the Believers. Will you obtain permission for me to sit with him?” Al-Hurr asked `Umar and he accorded permission. When `Uyainah came into the presence of `Umar, he addressed him thus: “O son of Al-Khattab, you neither bestow much on us nor deal with us justly.” `Umar (radiyallahu anhu) got angry and was about to beat him when Al-Hurr said: “O Leader of the Believers, Allah has said to his Prophet ﷺ: `Show forgiveness, enjoin what is good, and turn away from the foolish (i.e., don’t punish them), [i.e., `Uyainah] (7:199). This is one of the ignorant ones.” By Allah! When al-Hurr recited this, `Umar became quite motionless in his seat. He always adhered strictly to the Book of Allah.[Al-Bukhari]

ముఖ్యాంశాలు

ఈ హదీసును ఈ అధ్యాయం క్రింద ప్రస్తావించడంలోని ఉద్దేశ్యం పండితుల, దైవగ్రంథ విద్వాంసుల విశిష్ఠతను విశదపరచటమే. అలాంటి మేధావుల్నే హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) తన సలహా మండలిలో సభ్యులుగా నియమించుకునేవారు. సమాజంలోని విద్యావంతులకు తగిన గౌరవోన్నతులను ప్రసాదించి పరిపాలనలో వారి సేవలు పొందేవారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|44. పండితులను, పెద్దలను, పలుకుబడిగల వారిని గౌరవించాలి, వారికి ఇతరులపై ప్రాధాన్యతనివ్వాలి, సమున్నత స్థానాన్ని ప్రసాదించాలి. వారి స్థాయిని ఇనుమడింపజేయాలి|హదీసు 358

359

హదీసు 359

وعن أَبي سعيدٍ سَمُرةَ بنِ جُنْدبٍ رضي اللَّه عنه قَالَ: لَقَدْ كنْتُ عَلَى عهْدِ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم غُلاماً، فَكُنْتُ أَحفَظُ عنْهُ، فَمَا يَمْنَعُني مِنَ القَوْلِ إِلاَّ أَنَّ هَهُنَا رِجالاً هُمْ أَسنُّ مِنِّي مُتَّفَقٌ عَلَيهِ.

హజ్రత్ అబూ సయీద్ సమురా బిన్ జుందుబ్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ కాలంలో నేను చాలా చిన్న పిల్లాడిని. దైవప్రవక్త ﷺ చెప్పే మాటలు, చేసే పనులు నేను గుర్తుపెట్టుకునేవాణ్ణి. కాని నా కంటే వయసులో పెద్దవారు ఉండగా వారి సమక్షంలో నేనావిషయాలు చెప్పలేకపోయేవాణ్ణి." (సహీహ్ బుఖారీలోని మహిమోన్నతుల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని జనాయెజ్ ప్రకరణం)

English

Abu Sa`id Samurah bin Jundub (radiyallahu anhu) reported: I was a boy during the lifetime of Messenger of Allah ﷺ, and used to commit to my memory what he said, but I do not narrate what I preserved because there were among us people who were older than me.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఒక నగరంలోగాని లేదా ఒక ప్రాంతంలోగాని ఒక గొప్ప హదీసు పండితుడు ఉండగా సామాన్యులు హదీసు బోధన చేయటం వాంఛనీయం కాదని హదీసువేత్తలు అంటున్నారు. అయితే ఆ గొప్ప పండితుని అనుమతితో సామాన్య పండితుడుగాని అదేవిధంగా గురువు అనుమతితో శిష్యుడుగాని హదీసు బోధించటంలో తప్పు లేదు. ముఖ్యంగా ఒక సభలో హదీసు జ్ఞానం గురించి అందరికన్నా బాగా తెలిసిన హదీసువేత్త ఉండగా ఇతరులెవరూ హదీసు బోధన చేయటానికి సాహసించకుండా ఉండటమే సంస్కారమనిపించుకుంటుంది. అయితే ఒక పట్టణంలో అనేకమంది హదీసువేత్తలు ఉన్నప్పుడు వారిలో ధర్మపరాయణుడయిన హదీసువేత్త ఎవరయినాసరే హదీసు బోధ చేయటంలో తప్పులేదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|44. పండితులను, పెద్దలను, పలుకుబడిగల వారిని గౌరవించాలి, వారికి ఇతరులపై ప్రాధాన్యతనివ్వాలి, సమున్నత స్థానాన్ని ప్రసాదించాలి. వారి స్థాయిని ఇనుమడింపజేయాలి|హదీసు 359

360

హదీసు 360

وعن أَنس رضي اللَّه عنه قَالَ: قَالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَا أَكْرَم شَابٌّ شَيْخاً لِسِنِّهِ إِلاَّ قَيَّضَ اللَّه لَهُ مَنْ يُكْرِمُهُ عِنْد سِنِّه" رواه الترمذي وقال حديث غريب. مَعْنى"ارْقُبُوا"رَاعُوهُ وَاحترِمُوه وأَكْرِمُوهُ، واللَّه أعلم.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : ఏ యువకుడైనా ఒక ముసలివాణ్ణి అతని ముసలితనం చూసి గౌరవిస్తే దేవుడు అతని ముసలితనంలో అతన్ని గౌరవించేవారిని పుట్టిస్తాడు."

(ఈ హదీసును ఇమామ్ తిర్మిజీ వెలికితీసి అరుదైనదిగా ఖరారు చేశారు).

English

Anas bin Malik (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “If a young man honours an older person on account of his age, Allah appoints someone to show reverence to him in his old age”[At-Tirmidhi].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|44. పండితులను, పెద్దలను, పలుకుబడిగల వారిని గౌరవించాలి, వారికి ఇతరులపై ప్రాధాన్యతనివ్వాలి, సమున్నత స్థానాన్ని ప్రసాదించాలి. వారి స్థాయిని ఇనుమడింపజేయాలి|హదీసు 360