హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 41. తల్లిదండ్రులను ఎదిరించటం, బంధుత్వాలను త్రెంచటం నిషిద్ధం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 41వ అధ్యాయం: తల్లిదండ్రులను ఎదిరించటం, బంధుత్వాలను త్రెంచటం నిషిద్ధం. ఈ అధ్యాయంలో 3 ఖుర్ఆన్ ఆయతులు, 5 హదీసులు (హదీసు 338 – 342) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

41. తల్లిదండ్రులను ఎదిరించటం, బంధుత్వాలను త్రెంచటం నిషిద్ధం

↑ విషయ సూచిక

باب تحريم العقوق وقطيعة الرحم

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు:

{فَهَلْ عَسَيْتُمْ إِنْ تَوَلَّيْتُمْ أَنْ تُفْسِدُوا فِي الأَرْضِ وَتُقَطِّعُوا أَرْحَامَكُمْ أُولَئِكَ الَّذِينَ لَعَنَهُمُ اللَّهُ فَأَصَمَّهُمْ وَأَعْمَى أَبْصَارَهُمْ} [محمد:٢٣،٢٤]

"ఒకవేళ మీరు విముఖులైపోతే, భూమిపై మళ్ళీ కల్లోలాన్ని రేకెత్తిస్తారు, పరస్పరం బంధుత్వాల తెగత్రెంపులకు ఒడిగడతారు. ఇక మీ నుండి ఇంతకంటే ఏమి ఆశించవచ్చు? అల్లాహ్ శపించింది, అంధులుగానూ, బధిరులుగానూ చేసింది ఇలాంటి వారినే!" (ముహమ్మద్ : 22,23)

మరోచోట ఆయన ఇలా సెలవిస్తున్నాడు :

{وَالَّذِينَ يَنْقُضُونَ عَهْدَ اللَّهِ مِنْ بَعْدِ مِيثَاقِهِ وَيَقْطَعُونَ مَا أَمَرَ اللَّهُ بِهِ أَنْ يُوصَلَ وَيُفْسِدُونَ فِي الأَرْضِ أُولَئِكَ لَهُمُ اللَّعْنَةُ وَلَهُمْ سُوءُ الدَّارِ} [الرعد:٢٥]

"అల్లాహ్‌తో చేనుకున్న ఒడంబడికను దృఢపరచిన తరువాత భంగపరిచేవారు, అల్లాహ్ కలపండి అని ఆదేశించిన సంబంధాలను త్రెంచేవారూ, ధరణిపై కల్లోలాన్ని వ్యాపింపజేసేవారూ, శాపానికి అర్హులు. వారి కొరకు పరలోకంలో బహుచెడ్డ నివాసం ఉన్నది." (అర్రాద్: 25)

ఇంకొకచోట ఆయన ఇలా సెలవిస్తున్నాడు :

{وَقَضَى رَبُّكَ أَلاَّ تَعْبُدُوا إِلاَّ إِيَّاهُ وَبِالْوَالِدَيْنِ إِحْسَاناً إِمَّا يَبْلُغَنَّ عِنْدَكَ الْكِبَرَ أَحَدُهُمَا أَوْ كِلاهُمَا فَلا تَقُلْ لَهُمَا أُفٍّ وَلا تَنْهَرْهُمَا وَقُلْ لَهُمَا قَوْلاً كَرِيماًوَاخْفِضْ لَهُمَا جَنَاحَ الذُّلِّ مِنَ الرَّحْمَةِ وَقُلْ رَبِّ ارْحَمْهُمَا كَمَا رَبَّيَانِي صَغِيراً} [الإسراء:٢٣،٢٤]

"నీ ప్రభువు ఇలా నిర్ణయం చేశాడు : మీరు కేవలం ఆయనను తప్ప మరెవరినీ ఆరాధించకండి. తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించండి. ఒకవేళ మీ వద్ద వారిలో ఒకరుగాని, ఇద్దరుగాని ముసలివారై ఉంటే, వారి ముందు విసుగ్గా "ఛీ" అని కూడా అనకండి. వారిని కసరుకుంటూ సమాధానం ఇవ్వకండి. వారితో మర్యాదగా మాట్లాడండి. మృదుత్వమూ, దయాభావమూ కలిగి వారి ముందు వినమ్రులై ఉండండి. "ప్రభూ! బాల్యంలో వారు నన్ను కారుణ్యంతో, వాత్సల్యంతో పోషించినట్లు వారిపై (కూడా) కరుణ జూపు" అని ప్రార్థిస్తూ ఉండండి. (అల్ ఇస్రా : 23, 24)

English

“Would you then, if you were given the authority, do mischief in the land, and sever your ties of kinship? Such are they whom Allah has cursed, so that He has made them deaf and blinded their sight.” [Muḥammad 47:22–23]

“And those who break the Covenant of Allah, after its ratification, and sever that which Allah has commanded to be joined (i.e., they sever the bond of kinship and are not good to their relatives), and work mischief in the land, on them is the curse (i.e., they will be far away from Allah’s Mercy), and for them is the unhappy (evil) home (i.e., Hell).” [Ar-Ra‘d 13:25]

“And your Rubb has decreed that you worship none but Him. And that you be dutiful to your parents. If one of them or both of them attain old age in your life, say not to them a word of disrespect, nor shout at them but address them in terms of honour. And lower unto them the wing of submission and humility through mercy, and say: `My Rubb! Bestow on them Your Mercy as they did bring me up when I was young.”’ [Al-Isrā’ 17:23–24]

338

హదీసు 338

وعن أَبي بكرةَ نُفيْع بنِ الحارثِ رضي اللَّه عنه قَالَ: قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "أَلا أُنَبِّئُكمْ بِأكْبَرِ الْكَبائِرِ؟ "ثلاثاً قُلنا: بلَى يَا رسولَ اللَّه: قَالَ:"الإِشْراكُ بِاللَّهِ، وعُقُوقُ الْوالِديْن"وكان مُتَّكِئاً فَجلَسَ، فَقَالَ:"أَلا وقوْلُ الزُّورِ وشهادُة الزُّورِ" فَما زَال يكَرِّرُهَا حتَّى قُلنَا: ليْتهُ سكتْ. مُتَّفَقٌ عَلَيهِ.

హజ్రత్ అబూ బక్రా నుఫై బిన్ హారిస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ "ఘోరాతిఘోర పాపాలు ఏవో నేను మీకు తెలుపనా?" అని మమ్మల్ని అడిగారు. ఆయన ఇదే ప్రశ్న మూడు సార్లు అడిగారు. దానికి మేము "తప్పకుండా తెలుపండి దైవప్రవక్తా!" అని అన్నాం. అప్పుడాయన "ఇతరుల్ని దైవానికి సమానంగా నిలబెట్టడం, తల్లిదండ్రుల పట్ల అవిధేయతకు పాల్పడటం" అని తెలిపారు. ఆ సమయంలో ఆనుకొని కూర్చొనివున్న ఆయన ఒక్కసారిగా సరిగ్గా కూర్చొని "జాగ్రత్తగా వినండి! అబద్ధమాడటం, అబద్ధపు సాక్ష్యాలు చెప్పడం కూడా (ఘోరాతిఘోరమైన పాపాలే)" అని అన్నారు. ఇలా మాటిమాటికీ అదే మాట చెబుతూ పోతుంటే, చివరికి మాకు ఈయన ఇక ఈ మాటలు ఆపి మౌనం వహిస్తే బాగుండుననిపించింది.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని సాక్ష్యాల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణం)

English

Abu Bakrah Nufai` bin Al-Harith (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Shall I not inform you of the biggest of the major sins?” Messenger of Allah ﷺ asked this question thrice. We said, “Yes, O Messenger of Allah. (Please inform us.)”. He said, “Ascribing partners to Allah, and to be undutiful to your parents”. Messenger of Allah ﷺ sat up from his reclining position and said, “And I warn you against giving forged statement and a false testimony; I warn you against giving forged statement and a false testimony”. Messenger of Allah ﷺ kept on repeating that warning till we wished he would stop.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో కొన్ని ముఖ్యమైన ఘోరాతిఘోర పాపాలను గురించి చెప్పటం జరిగింది. ఖుర్‌ఆన్ హదీసుల్లో కఠినంగా హెచ్చరించబడిన పాపాలే ఘోర పాపాలనబడతాయి. తల్లిదండ్రుల మాట వినకపోవటాన్ని బహుదైవారాధనతోపాటు ప్రస్తావించటం ద్వారా బహుదైవారాధనలాగే తల్లిదండ్రుల అవిధేయత కూడా మహాపరాధమని తెలుస్తోంది. అదేవిధంగా అబద్ధమాడటం గురించి చెప్పినప్పుడు దైవప్రవక్త ﷺ ఆనుకొని కూర్చున్నవారల్లా ఒక్కసారిగా లేచి కూర్చున్నారు. దీనిద్వారా ఆయన దృష్టిలో అబద్ధమాడటం, అబద్ధపు సాక్ష్యాలు చెప్పటం ఎంతటి ఘోరపాతకాలో అవగతమవుతోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|41. తల్లిదండ్రులను ఎదిరించటం, బంధుత్వాలను త్రెంచటం నిషిద్ధం|హదీసు 338

339

హదీసు 339

وعن عبد اللَّهِ بنِ عمرو بن العاص رضي اللَّه عنهما عن النَّبي صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "الْكبائرُ: الإِشْراكُ بِاللَّه، وعقُوق الْوالِديْنِ، وقَتْلُ النَّفْسِ، والْيمِينُ الْغَموس" رواه البخاري. "اليمِين الْغَمُوسُ"التي يَحْلِفُهَا كَاذِباً عامِداً، سُمِّيت غَمُوساً، لأَنَّهَا تَغْمِسُ الحالِفَ في الإِثم.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలిపారు : ఇతరుల్ని దైవానికి సాటి కల్పించటం, తల్లిదండ్రుల మాట వినకపోవటం, (అన్యాయంగా) ఒకర్ని హత్య చేయటం (లేదా ఆత్మహత్య చేసుకోవటం) అసత్య ప్రమాణం చేయటం (మొదలగునవి) ఘోర పాపాలు. (బుఖారీ)

'యమీనె గుమూస్' అంటే బుద్ధిపూర్వకంగా అబద్ధపు ఒట్లు వేయటం. గుమూస్ అంటే ముంచటం అని అర్థం. ఈ ప్రమాణం మనిషిని పాపంలో ముంచుతుంది కనుక దీనిని యమీనె గుమూస్ (ముంచే ప్రమాణం) అని అంటారు.

(సహీహ్ బుఖారీలోని ప్రమాణాలు, మొక్కుబడుల ప్రకరణం)

English

Abdullah bin `Amr bin Al-`as (radiyallahu anhuma) reported: The Prophet ﷺ said, “(Of the) major sins are: to ascribe partners to Allah, disobey parents, murder someone, and to take a false oath (intentionally)”.[Al-Bukhari].

ముఖ్యాంశాలు

ఘోరపాపాలు ఇవేగాకుండా ఇంకా చాలా ఉన్నాయి. సందర్భానుసారం దైవప్రవక్త ﷺ ఇక్కడ కొన్నింటిని మాత్రమే పేర్కొన్నారు. లేక ఇవి పాపాలన్నిటిలో ఘోరాతిఘోరమైన పాపాలని చెప్పటం ఆయన ఉద్దేశ్యం అయి ఉండవచ్చు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|41. తల్లిదండ్రులను ఎదిరించటం, బంధుత్వాలను త్రెంచటం నిషిద్ధం|హదీసు 339

340

హదీసు 340

وعنه أَن رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مِنَ الْكبائِرِ شتْمُ الرَّجلِ والِدَيْهِ،"قالوا: يَا رسولَ اللَّه وهَلْ يشْتُمُ الرَّجُلُ والِديْهِ؟، قَالَ:"نَعمْ، يَسُبُّ أَبا الرَّجُلِ، فيسُبُّ أَباه، ويسُبُّ أُمَّهُ، فَيسُبُّ أُمَّهُ" متفقٌ عَلَيهِ. وفي روايةٍ: "إِنَّ مِنْ أَكْبرِ الكبائِرِ أَنْ يلْعنَ الرَّجُلُ والِدَيْهِ،"قِيلَ: يَا رَسُول اللَّهِ كيْفَ يلْعنُ الرجُلُ والِديْهِ؟، قَالَ:"يسُبُّ أَبا الرَّجُل، فَيسُبُّ أَبَاهُ، وَيَسبُّ أُمَّه، فيسُبُّ أُمَّهُ".

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ తన సహచరులతో, "ఘోర పాపాల్లో ఒకటి మనిషి తన తల్లిదండ్రులను దూషించటం" అని చెప్పారు. అది విని సహచరులు "దైవప్రవక్తా! ఎవడైనా తన కన్న తల్లిదండ్రుల్ని దూషిస్తాడా?" అని ఆశ్చర్యంగా అడిగారు. దానికి ఆయన "అవును, ఇతను ఇంకొకడి తండ్రిని దూషిస్తే ఆ వ్యక్తి ఇతని తండ్రిని దూషి స్తాడు. ఇతను ఇంకొకడి తల్లిని దూషిస్తే ఆ వ్యక్తి ఇతని తల్లిని దూషిస్తాడు. (అప్పుడు ఇతను తన సొంత తల్లిదండ్రుల్ని దూషించినట్లు కాదా?!)" అని అన్నారు.

(బుఖారీ – ముస్లిం)

వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : "ఘోర పాపాల్లో ఒకటి మనిషి తన తల్లిదండ్రుల్ని శపించటం" అని దైవప్రవక్త ﷺ అన్నారు. దానికి "దైవ ప్రవక్తా! ఎవడైనా తన కన్న తల్లిదండ్రుల్ని ఎలా శపిస్తాడు?" అని ఎవరో సందేహం వెలిబుచ్చగా, "ఇతను ఇంకొకడి తండ్రిని దూషిస్తే అతను ఇతని తండ్రిని దూషిస్తాడు. ఇతను ఇంకొకని తల్లిని దూషిస్తే అతను ఇతని తల్లిని దూషిస్తాడు" అని ఆయన అన్నారు.

(సహీహ్ బుఖారీలోని సంస్కార ప్రకరణం, సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణం)

English

`Abdullah bin `Amr bin Al-`as (radiyallahu anhuma) reported: Messenger of Allah ﷺ said, “It is one of the gravest sins to abuse one’s parents.” It was asked (by the people): “O Messenger of Allah, can a man abuse his own parents?” Messenger of Allah ﷺ said, “He abuses the father of somebody who, in return, abuses the former’s father; he then abuses the mother of somebody who, in return, abuses his mother”.[Al-Bukhari and Muslim].

Another narration is: Messenger of Allah ﷺ said, “One of the major sins is to curse one’s parents”. It was submitted: “O Messenger of Allah! How can a man curse his own parents?” He ﷺ said, “When someone curses the parents of another man who in return abuses the former’s father; and when someone abuses the mother of another man who in return abuses his mother.”

ముఖ్యాంశాలు

ఏ మనిషీ ఇతరుల తల్లిదండ్రుల్ని దూషించటంగాని, వారిని కించపరుస్తూ మాట్లాడటం గాని చేయరాదు. అలా చేయటం వల్ల సమాధానంగా ఇతరులు కూడా తన తల్లిదండ్రుల్ని దూషించే అవకాశం ఉంది. ఆ విధంగా మనిషి తన తల్లిదండ్రుల్ని తానే స్వయంగా పరాభవించినవాడవుతాడు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|41. తల్లిదండ్రులను ఎదిరించటం, బంధుత్వాలను త్రెంచటం నిషిద్ధం|హదీసు 340

341

హదీసు 341

وعن أَبي محمد جُبيْرِ بنِ مُطعِمٍ رضي اللَّه عنه أَن رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "لاَ يَدْخُلُ الجَنَّةَ قَاطِعٌ" قَالَ سفيان في روايته: يعْني: قاطِع رحِم. متفقٌ عَلَيهِ.

హజ్రత్ అబూ ముహమ్మద్ జుబైర్ బిన్ ముత్‌యిమ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: "తెగత్రెంపులు చేసేవాడు స్వర్గంలోకి ప్రవేశించడు."

వేరొక ఉల్లేఖనంలో "బంధుత్వాలను త్రెంచేవాడు" అని ఉందని సుఫ్యాన్ (రహిమహుల్లాహ్) తెలియజేశారు.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని సంస్కార ప్రకరణం, సహీహ్ ముస్లింలోని సత్కార్యాలు – సత్సంబంధాల ప్రకరణం)

English

Abu Muhammad Jubair bin Mut`im (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “The person who severs the bond of kinship will not enter Jannah”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

బంధువులతో తెగత్రెంపులు చేసుకోవటం లేదా బంధువులను విడదీయటం ఎంతటి ఘోరమైన పాపమో ఈ హదీసు చూస్తే తెలుస్తుంది. బంధువిచ్ఛిత్తికి పాల్పడిన పాపి స్వర్గసుఖాలను అనుభవించటానికి అనర్హుడిని ఈ హదీసు హెచ్చరిస్తోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|41. తల్లిదండ్రులను ఎదిరించటం, బంధుత్వాలను త్రెంచటం నిషిద్ధం|హదీసు 341

342

హదీసు 342

وعن أَبي عِيسى المُغِيرةِ بنِ شُعْبةَ رضي اللَّه عنه عن النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إِنَّ اللَّهُ تَعَالَى حَرَّمَ عَلَيْكُمْ عُقُوقَ الأُمهَاتِ، ومنْعاً وهاتِ، ووأْدَ البنَاتِ، وكَرَهَ لكُمْ قِيل وقالَ، وَكَثْرَةَ السَؤالِ، وإِضَاعة المالِ "متفقٌ عليه. قولُهُ:"مَنْعاً"معنَاهُ: منعُ مَا وجَبَ عَلَيْهِ وَ"هَاتِ": طَلَبُ مَا لَيسَ لَهُ وَ"وَأْدَ البنَاتِ"معْنَاه: دَفْنُهُنَّ في الحَياةِ، وَ"قِيلَ وقَالَ"مَعْنَاهُ: الحدِيثُ بِكُلِّ مَا يَسمعُهُ، فيقُولُ: قيلَ كَذَا، وقَالَ فُلانٌ كَذَا مِمَّا لا يَعلَمُ صِحَّتَهُ، وَلا يَظُنُّهَا، وكَفى بالمرْءِ كذِباً أَنْ يُحَدِّث بِكُلِّ مَا سَمِعَ. وَ"إِضَاعَةُ المَال": تَبذِيرُهُ وصرفُهُ في غَيْرِ الوُجُوهِ المأْذُون فِيهَا مِنْ مَقَاصِدِ الآخِرِةِ والدُّنيا، وتَرْكُ حِفْظِهِ مَعَ إِمْكَانِ الحفْظِ. وَ"كثرةُ السُّؤَالِ"الإِلحاحُ فِيمَا لا حاجةَ إِلَيْهِ. وفي الباب أَحادِيثُ سبقَتْ في البابِ قبله كَحَدِيثَ"وأَقْطعُ مَنْ قَطَعكِ"وحديث"مَن قطَعني قَطَعهُ اللَّه".

హజ్రత్ అబూ ఈసా ముగీరా బిన్ షోబా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : మాతృమూర్తులకు అవిధేయత చూపటాన్ని, తనపై ఉన్న బాధ్యతలను నెరవేర్చకుండా తనకు లేని హక్కుల కోసం ఇతరులపై ఒత్తిడి తేవటాన్ని, ఆడపిల్లల్ని సజీవ సమాధి చేయటాన్ని దేవుడు నిషేధించాడు. అలాగే వ్యర్థప్రేలాపనల్ని, అనవసరమైన ప్రశ్నలు వేయటాన్ని, ధనాన్ని నాశనం చేసుకోవ టాన్ని ఆయన అసహ్యించుకున్నాడు.

(బుఖారీ – ముస్లిం)

'మన్‌అన్' అంటే తనపై ఉన్న బాధ్యతల్ని నిర్వర్తించకుండా ఉండటం, 'హాతి' అంటే తనకు లేని హక్కుని గురించి అడగటం. 'వాదుల్ బనాత్' అంటే ఆడపిల్లల్ని సజీవంగా సమాధి చేయటం. 'ఖీల వ ఖాల' అంటే ఒకరి నోటిమాటల్ని నిజానిజాలు తెలుసుకోకుండానే ఇతరుల ముందు ప్రస్తావించటం. అలా ప్రస్తావించేవాడికి కనీసం అలా జరిగి ఉంటుందన్న అనుమానం కూడా ఉండదు. ఒక వ్యక్తి తాను విన్న మాటల్ని (నిజానిజాలు తెలుసుకోకుండా) ఈ విధంగా ఇతరుల ముందు చెప్పుకుంటూ తిరగటం చాలు- అతను అబద్ధాల రాయుడని చెప్పటానికి!

'ఇజాఅతుల్ మాల్' అంటే డబ్బు దుబారాగా ఖర్చు చేయటం, షరీఅత్ దృష్ట్యా ఇహపరాల ప్రయోజనమేదీ లేని చోట్ల ధనాన్ని వినియోగించటం,ధనాన్ని కాపాడుకునే అవకాశాలున్నప్పటికీ దానికోసం ప్రయత్నించకపోవటం. 'కస్రతుస్సువాల్' అంటే అనవసరంగా అధిక ప్రశ్నలు వేయటం.

ఈ అధ్యాయానికి సంబంధించిన హదీసులు ఇంకా ఉన్నాయి. అవి ఇంతకుముందు అధ్యాయంలో కూడా వచ్చాయి.

English

Abu ‘Isa Al-Mughirah bin Shu`bah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “Allah has forbidden you: disobedience to your mothers, to withhold (what you should give), or demand (what you do not deserve), and to bury your daughters alive. And Allah dislikes idle talk, to ask too many questions (for things which will be of no benefit to one), and to waste your wealth”.[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|41. తల్లిదండ్రులను ఎదిరించటం, బంధుత్వాలను త్రెంచటం నిషిద్ధం|హదీసు 342