హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 40. తల్లిదండ్రుల యెడల గౌరవం, బంధువుల హక్కులు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 40వ అధ్యాయం: తల్లిదండ్రుల యెడల గౌరవాన్ని కలిగి ఉండాలి. బంధువుల హక్కులను నెరవేర్చాలి. ఈ అధ్యాయంలో 6 ఖుర్ఆన్ ఆయతులు, 24 హదీసులు (హదీసు 314 – 337) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

40. తల్లిదండ్రుల యెడల గౌరవాన్ని కలిగి ఉండాలి. బంధువుల హక్కులను నెరవేర్చాలి.

↑ విషయ సూచిక

باب بر الوالدين وصلة الأرحام

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు:

{وَاعْبُدُوا اللَّهَ وَلا تُشْرِكُوا بِهِ شَيْئاً وَبِالْوَالِدَيْنِ إِحْسَاناً وَبِذِي الْقُرْبَى وَالْيَتَامَى وَالْمَسَاكِينِ وَالْجَارِذِي الْقُرْبَى وَالْجَارِ الْجُنُبِ وَالصَّاحِبِ بِالْجَنْبِ وَابْنِ السَّبِيلِ وَمَا مَلَكَتْ أَيْمَانُكُمْ} [النساء:٣٦]

"మీరంతా అల్లాహ్‌కు దాస్యం చెయ్యండి. ఎవరినీ ఆయనకు భాగస్వాములుగా నిలబెట్టకండి. తల్లిదండ్రుల యెడల సద్భావంతో మెలగండి. బంధువులూ, అనాధలూ, నిరుపేదల వట్ల మంచిగా వ్యవహరించండి. పొరుగున ఉన్న బంధువులు, అపరిచితులైన పొరుగువారు, ప్రక్కనున్న మిత్రులు, బాటసారులు, మీ ఆధీనంలో ఉన్న దాసదాసీజనం పట్ల ఉదార బుద్ధితో వ్యవహరించండి." (అన్ నిసా : 36)

వేరొకచోట ఇలా సెలవిస్తున్నాడు :

{وَاتَّقُوا اللَّهَ الَّذِي تَسَاءَلُونَ بِهِ وَالأَرْحَامَ} [النساء:١]

"ఏ దేవుని పేరు చెప్పుకొని మీరు పరస్పరం మీ మీ హక్కులను కోరుకుంటారో, ఆ దేవునికి భయపడండి." (అన్ నిసా : 1)

ఇంకొకచోట ఇలా అంటున్నాడు :

{وَالَّذِينَ يَصِلُونَ مَا أَمَرَ اللَّهُ بِهِ أَنْ يُوصَلَ} [الرعد:٢١]

"వారి (విశ్వాసుల) వైఖరి ఎలా ఉంటుందంటే, స్థిరవరచండి అని అల్లాహ్ ఆదేశించిన సంబంధాలను స్థిరపరుస్తారు." (అర్రాద్ : 21)

మరొకచోట ఆయన ఇలా అన్నాడు :

{وَوَصَّيْنَا الأِنْسَانَ بِوَالِدَيْهِ حُسْناً} [العنكبوت:٨]

"తన తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మెలగమని మేము మానవునికి ఉపదేశించాము." (అల్ అన్‌కబూత్ : 8)

ఆయన ఇంకా ఇలా అన్నాడు :

{وَقَضَى رَبُّكَ أَلاَّ تَعْبُدُوا إِلاَّ إِيَّاهُ وَبِالْوَالِدَيْنِ إِحْسَاناً إِمَّا يَبْلُغَنَّ عِنْدَكَ الْكِبَرَ أَحَدُهُمَا أَوْ كِلاهُمَا فَلا تَقُلْ لَهُمَا أُفٍّ وَلا تَنْهَرْهُمَا وَقُلْ لَهُمَا قَوْلاً كَرِيما. وَاخْفِضْ لَهُمَا جَنَاحَ الذُّلِّ مِنَ الرَّحْمَةِ وَقُلْ رَبِّ ارْحَمْهُمَا كَمَا رَبَّيَانِي صَغِيراً} [الإسراء:٢٣، ٢٤]

"నీ ప్రభువు ఇలా నిర్ణయం చేశాడు: మీరు కేవలం ఆయనను తప్ప మరెవరినీ ఆరాధించకండి. తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించండి. ఒకవేళ మీ వద్ద వారిలో ఒకరుగాని ఇద్దరుగాని ముసలివారై ఉంటే, వారి ముందు విసుగ్గా 'ఛీ' అని కూడా అనకండి. వారిని కసురుకుంటూ సమాధానం ఇవ్వకండి. వారితో మర్యాదగా మాట్లాడండి. మృదుత్వమూ, దయాభావమూ కలిగి వారిముందు వినమ్రులై ఉండండి. ఇంకా, "ప్రభూ! బాల్యంలో వారు నన్ను కారుణ్యంతో, వాత్సల్యంతో పోషించినట్లు, నీవు వారిపై కరుణ జూపు" అంటూ ప్రార్థిస్తూ ఉండండి." (అల్ ఇస్రా : 33, 34)

ఇంకొకచోట ఇలా అన్నాడు :

{وَوَصَّيْنَا الأِنْسَانَ بِوَالِدَيْهِ حَمَلَتْهُ أُمُّهُ وَهْناً عَلَى وَهْنٍ وَفِصَالُهُ فِي عَامَيْنِ أَنِ اشْكُرْ لِي وَلِوَالِدَيْكَ} [لقمان:١٤]

"మానవుడు తన తల్లిదండ్రుల హక్కును గుర్తించాలని స్వయంగా మేమే అతనికి నిర్దేశించాము. అతని తల్లి బలహీనతపై బలహీనతను సహించి అతనిని తన కడుపున మోసింది. అతను పాలు విడిచిపెట్టటానికి రెండు సంవత్సరాలు పట్టింది. (ఇందుకే మేము అతనికి) "నాకు కృతజ్ఞుడవై ఉండు, నీ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపు (అని ఉపదేశించాము.)" (లుఖ్మాన్ : 14)

English

“Worship Allah and join none with Him (in worship); and do good to parents, kinsfolk, orphans, Al-Masakin (the poor), the neighbour who is near of kin, the neighbour who is a stranger, the companion by your side, the wayfarer (you meet), and those (slaves) whom your right hands possess”. [An-Nisā’ 4:36]

“And fear Allah through Whom you demand (your mutual rights), and (do not cut the relations of) the wombs (kinship)”. [An-Nisā’ 4:1]

“And those who join that which Allah has commanded to be joined (i.e., they are good to their relatives and do not sever the bond of kinship)”. [Ar-Ra‘d 13:21]

“And we have enjoined on man to be good and dutiful to his parents”. [Al-‘Ankabūt 29:8]

“And your Rubb has decreed that you worship none but Him. And that you be dutiful to your parents. If one of them or both of them attain old age in your life, say not to them a word of disrespect, nor shout at them but address them in terms of honour. And lower unto them the wing of submission and humility through mercy, and say: `My Rubb! Bestow on them Your Mercy as they did bring me up when I was young”. [Al-Isrā’ 17:23–24]

“And We have enjoined on man (to be dutiful and good) to his parents. His mother bore him in weakness and hardship upon weakness and hardship, and his weaning is in two years- give thanks to Me and to your parents”. [Luqmān 31:14]

314

హదీసు 314

عن أبي عبد الرحمن عبد اللَّه بن مسعود رضي اللَّه عنه قَالَ: سأَلتُ النبي صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: أَيُّ الْعملِ أَحبُّ إِلَى اللَّهِ تَعالى؟ قَالَ: "الصَّلاةُ عَلَى وقْتِهَا"قُلْتُ: ثُمَّ أَيُّ؟ قَالَ:"بِرُّ الْوَالِديْنِ"قلتُ: ثُمَّ أَيُّ؟ قَالَ:"الجِهَادُ في سبِيِل اللَّهِ" متفقٌ عَلَيهِ.

హజ్రత్ అబూ అబ్దుర్రహ్మాన్ అబ్దుల్లాహ్ బిన్ మసూద్ (రదియల్లాహు అన్హు) కథనం: నేను దైవప్రవక్త ﷺను "దైవానికి ప్రీతికరమైన ఆచరణ ఏది?" అనడిగాను. దానికి ఆయన "వేళకు నమాజు చేయడం" అని సమాధానమిచ్చారు. నేను "ఆ తరువాత ఏది?" అని అడిగాను. ఆయన ﷺ "తల్లిదండ్రుల పట్ల మంచిగా మెలగటం" అని అన్నారు. "ఆ తరువాత ఏది?" అని అడిగాను. అందుకాయన "దైవ మార్గంలో పోరాడటం" అని చెప్పారు.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని నమాజు వ్యవధుల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణం)

English

`Abdullah bin Mas`ud (radiyallahu anhu) reported: I asked the Prophet ﷺ , “Which of the deeds is loved most by Allah?” Messenger of Allah ﷺ said, “Salat at its proper time.” I asked, “What next?” He ﷺ replied, “Kindness to parents.” I asked, “What next?” He replied, “Jihad in the way of Allah.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

వేళకు నమాజు పాటించటమంటే నమాజుకు సమయం కాగానే తొందరగా నమాజు చేసుకోవటం లేదా క్రమం తప్పకుండా పాటించటమని భావం. ప్రాపంచిక కార్యకలాపాల్లో నిమగ్నులై నమాజును నిర్లక్ష్యం చేయటం తగదు. నమాజు మరియు దైవమార్గంలో పోరాటం-ఈ రెండూ ధర్మంలో అత్యంత శ్రేష్ఠమైన ఆచరణలు. వీటితోపాటు తల్లిదండ్రుల పట్ల మంచిగా మెలగటాన్ని ప్రస్తావించటం వల్ల దాని ప్రాముఖ్యత వెల్లడౌతోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|40. తల్లిదండ్రుల యెడల గౌరవాన్ని కలిగి ఉండాలి. బంధువుల హక్కులను నెరవేర్చాలి.|హదీసు 314

315

హదీసు 315

وعن أبي هريرةَ رضي اللَّه عنه قَالَ: قالَ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لا يَجْزِي ولَدٌ والِداً إِلاَّ أَنْ يَجِدَهُ مملُوكاً، فَيَشْتَرِيَهُ، فَيَعْتِقَهُ" رواه مسلم.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : బానిసత్వంలో మగ్గుతున్న తండ్రిని కొని ఆయనకు విముక్తి ప్రసాదిస్తేనే తప్ప సంతానం ఆయన రుణం తీర్చుకోలేదు. (ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని బానిస విముక్తి ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “No son can repay (the kindness shown by his father) unless he finds him a slave and buys him and emancipates him”.[Muslim].

ముఖ్యాంశాలు

ఒక బానిసకు స్వేచ్ఛ ఇవ్వడమంటే అతనికి ఓ కొత్త జీవితాన్ని ప్రసాదించటంతో సమానం. అదేవిధంగా సంతానం ఇహలోకంలోకి అడుగుపెట్టడానికి తండ్రే మూలకారకుడు గనక ఆయనకు ఎన్ని సేవలు చేసినప్పటికీ సంతానం ఆయన రుణాన్ని తీర్చుకోలేదు. తల్లిదండ్రుల స్థానం అంత గొప్పది మరి!

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|40. తల్లిదండ్రుల యెడల గౌరవాన్ని కలిగి ఉండాలి. బంధువుల హక్కులను నెరవేర్చాలి.|హదీసు 315

316

హదీసు 316

وعنه أيضاً رضي اللَّه عنه أَن رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَنْ كَانَ يُؤْمِنُ بِاللَّهِ والْيوْمِ الآخِرِ، فَلْيُكْرِمْ ضَيْفَهُ، وَمَنْ كانَ يُؤْمِنُ بِاللَّهِ والْيوم الآخِر، فَلْيصلْ رَحِمَهُ، وَمَنْ كَانَ يُؤْمِنُ بِاللَّه وَالْيوْمِ الآخِرِ، فلْيقُلْ خَيْراً أَوْ لِيَصمُتْ" متفقٌ عليه.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : అల్లాహ్‌ను, అంతిమదినాన్ని విశ్వసించే వ్యక్తి తన (ఇంటికొచ్చిన) అతిథిని గౌరవించాలి. అల్లాహ్‌ను, అంతిమ దినాన్ని విశ్వసించే వ్యక్తి తన బంధువులతో సత్సంబంధాలు పెట్టుకోవాలి. అల్లాహ్‌ను అంతిమ దినాన్ని విశ్వసించే వ్యక్తి పలికితే మంచి మాటే పలకాలి లేదా మౌనం వహించాలి." (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని సంస్కార ప్రకరణం, సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “He who believes in Allah and the Last Day, let him be hospitable to his guest; and he who believes in Allah and the Last Day, let him maintain good the ties of blood relationship; and he who believes in Allah and the Last Day, must speak good or remain silent”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

'సిలారహ్మీ' (బంధుప్రేమ) అంటే బంధువులతో ఉత్తమంగా వ్యవహరించటం, ఎల్లప్పుడూ వారితో సత్సంబంధాలను కొనసాగించటం. కనుక బంధువులెవరయినా అనుచితంగా ప్రవర్తిస్తూ బంధుత్వాల తెగత్రెంపులకు పాల్పడినప్పటికీ బంధుత్వ హక్కులను నిర్వర్తించటంలోగాని, వారితో సత్సంబంధాలు పెట్టుకోవటంలోగాని తమ తరపునుంచి ఎలాంటి లోటూ రానివ్వకూడదు. 'బంధుప్రేమ' అంటే ఇదే. ఇస్లామీయ షరీఅత్‌లో బంధుప్రేమకు ఎంతో ప్రాముఖ్యముంది. బంధువుల పట్ల మంచిగా మెలగాలని ఇస్లాం తాకీదు చేస్తోంది. తండ్రి తరపు బంధువులు, తల్లి తరపు బంధువులు ఇరువర్గాలవారూ బంధువుల క్రిందికే వస్తారు. వారందరితోనూ సద్భావంతో మెలగటం చాలా అవసరం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|40. తల్లిదండ్రుల యెడల గౌరవాన్ని కలిగి ఉండాలి. బంధువుల హక్కులను నెరవేర్చాలి.|హదీసు 316

317

హదీసు 317

وعنه قال: قال رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِنَّ اللَّه تَعَالى خَلَقَ الخَلْقَ حَتَّى إِذَا فَرَغَ مِنْهُمْ قَامَتِ الرَّحِمُ، فَقَالَتْ: هَذَا مُقَامُ الْعَائِذِ بِكَ مِنَ الْقَطِيعةِ، قَالَ: نَعَمْ أَمَا تَرْضينَ أَنْ أَصِلَ مَنْ وَصَلَكِ، وَأَقْطَعَ مَنْ قَطَعَكِ؟ قَالَتْ: بَلَى، قال فذلِكَ، ثُمَّ قَالَ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: اقرءوا إِنْ شِئتُمْ: {فهَلِ عَسَيْتمْ إِن تَولَّيتُم أَنْ تُفسِدُوا فِي الأَرْضِ وتُقطِّعُوا أَرْحامكُمْ أُولَئِكَ الَّذِينَ لَعنَهُم اللَّهُ فأَصَمَّهُمْ وَأَعْمَى أَبْصَارَهُمْ} [محمد:٢٢،٢٣] متفقٌ عَلَيهِ. وفي رواية للبخاري: فَقَالَ اللَّه تَعَالَى: "منْ وَصلَكِ، وَصلْتُهُ، ومنْ قَطَعكِ قطعتُهُ"

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు : దేవుడు సమస్త సృష్టిరాసుల్ని సృష్టించిన తరువాత 'బంధుత్వం' లేచి నిలబడి "(దేవా!) నేను బంధుత్వాల తెగత్రెంపుల బారినుండి నీ శరణు కోరుకుంటున్నాను" అని అంది. దానికి "అయితే నీతో సత్సంబంధాలు పెట్టుకున్న వాడితో నేనూ సత్సంబంధాలు పెట్టుకుంటాను. నీతో తెగత్రెంపులు చేసుకున్నవాడితో నేనూ తెగత్రెంపులు చేసుకుంటాను, ఇది నీకిష్టమే కదా!" అని అడిగాడు దేవుడు. దానికి బంధుత్వం "ఇష్టమే ప్రభూ!" అని అంది. అప్పుడు దేవుడు "సరే ఆ భాగ్యం నీకు దక్కుతుంది" అని అన్నాడు.

ఈ విషయం గురించి మీకు ప్రమాణం కావాలనుకుంటే దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ వాక్యాలు చదువుకోండి.

"ఒకవేళ మీరు విముఖులైపోతే భూమిపై మళ్ళీ కల్లోలాన్ని రేకెత్తిస్తారు. పరస్పరం బంధుత్వాల తెగత్రెంపులు చేసుకుంటారు. అల్లాహ్ శపించింది, అంధులుగానూ, బధిరులుగానూ చేసింది ఇలాంటి వారినే." (ముహ మ్మద్ : 22, 23) (బుఖారీ – ముస్లిం)

బుఖారీలోని వేరొక ఉల్లేఖనంలో "దేవుడు ఇలా అన్నాడు : నీతో సత్సంబంధాలు పెట్టుకున్నవాడితో నేనూ సత్సంబంధాలు పెట్టుకున్నాను. నీతో తెగత్రెంపులు చేసుకున్నవాడితో నేనూ తెగత్రెంపులు చేసుకున్నాను" అని ఉంది.

(సహీహ్ బుఖారీలోని సంస్కార ప్రకరణం, సహీహ్ ముస్లింలోని సత్కార్యాలు – సత్సంబంధాల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Allah created all the creatures and when He finished the task of His creation, Ar-Rahm (ties of relationship) said: `(O Allah) at this place I seek refuge with You against severing my ties.’ Allah said: `That I treat with kindness those who treat you with kindness and sever ties with those who sever ties with you.’ It said: `I am satisfied.’ Allah said: `Then this is yours”. Then Messenger of Allah ﷺ said, “Recite this Ayah if you like: `Would you then, if you were given the authority, do mischief in the land, and sever your ties of kinship? Such are they whom Allah has cursed, so that He has made them deaf and blinded their sight”. (47:22,23).[Al-Bukhari and Muslim].

The words in Al-Bukhari are: Messenger of Allah ﷺ said, “Allah (SWT) says: `He who maintains good ties with you, I maintain good ties with him; and he who severs your ties, I sever ties with him”.

ముఖ్యాంశాలు

బంధువుల పట్ల మంచిగా మెలిగితే దేవుడు కూడా సంతోషిస్తాడు. దీనికి భిన్నంగా బంధువుల హక్కుల్ని నెరవేర్చకుండా వారితో సత్సంబంధాలు కొనసాగించటానికి నిరాకరించటం దైవాగ్రహానికి కారణభూతమవుతుంది. ఈ హదీసు కూడా బంధుప్రేమను గురించి తాకీదు చేస్తోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|40. తల్లిదండ్రుల యెడల గౌరవాన్ని కలిగి ఉండాలి. బంధువుల హక్కులను నెరవేర్చాలి.|హదీసు 317

318

హదీసు 318

وعنه رضي اللَّه عنه قَالَ: جَاءَ رَجُلٌ إِلى رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فقال: يارسول اللَّه مَنْ أَحَقُّ النَّاسِ بحُسنِ صَحَابَتي؟ قَالَ: "أُمُّك"قَالَ: ثُمَّ منْ؟ قَالَ:"أُمُّكَ"قَالَ: ثُمَّ مَنْ؟ قَالَ:"أُمُّكَ"قَالَ: ثُمَّ مَنْ؟ قَالَ:"أَبُوكَ" متفقٌ عَلَيهِ. وفي رواية: يَا رسول اللَّه مَنْ أَحَقُّ الناس بِحُسْن الصُّحْبةِ؟ قَالَ:"أُمُّكَ ثُمَّ أُمُّكَ، ثُمَّ أُمُّكَ، ثمَّ أَباكَ، ثُمَّ أَدْنَاكَ أَدْنَاكَ". "والصَّحابة"بمعنى: الصُّحبةِ. وقوله:"ثُمَّ أباك"هَكَذا هُوَ منصوب بفعلٍ محذوفٍ، أي ثُمَّ برَّ أَباك وفي رواية:"ثُمَّ أَبُوكَ"وهذا واضِح.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺ దగ్గరికి వచ్చి, "దైవప్రవక్తా! నా సత్ప్రవర్తనకు అందరికన్నా ఎక్కువ హక్కుదారులెవరు?" అని అడిగాడు. దానికి ఆయన "నీ తల్లి" అని చెప్పారు. "ఆ తరువాత ఎవరు?" అని అడిగాడా వ్యక్తి. దానికి ఆయన 'నీ తల్లి' అనే చెప్పారు. ఆ వ్యక్తి మళ్ళీ, "ఆ తరువాత ఎవరు?" అని అడిగాడు. అప్పుడు కూడా "నీ తల్లి" అనే చెప్పారు దైవప్రవక్త ﷺ. ఆ వ్యక్తి మళ్ళీ అడిగాడు "ఆ తరువాత ఎవరు?" అని. అప్పుడు ఆయన 'నీ తండ్రి' అని చెప్పారు.

(బుఖారీ – ముస్లిం)

వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: "దైవప్రవక్తా! నా సత్ప్రవర్తనకు ఎవరెక్కువ హక్కుదారులు?" అని ఆ వ్యక్తి అడగ్గా "నీ తల్లి. ఆ తరువాత నీ తల్లే. ఆ తరువాత కూడా నీ తల్లే. ఆ తరువాత నీ తండ్రి. తరువాత నీకు ఎవరెంత దగ్గరి వారయితే వారు" అని ఆయన చెప్పారు.

'సహాబా' అంటే సహచర్యం, సత్ప్రవర్తన అన్న అర్థంలో వాడబడింది. 'సుమ్మ అబాక' అంటే ఆ తరువాత నీవు నీ తండ్రిపట్ల మెలగు అని అర్థం. 'అబాక' అనుకుంటే వాక్యంలో ఓ క్రియ అంతర్ధానంగా ఉందని భావించాల్సి వస్తుంది. కాని వేరొక ఉల్లేఖనంలో స్పష్టంగా 'సుమ్మ అబూక' అని ఉంది. (ఈ సందర్భంలో క్రియ అంతర్ధానంగా ఉందని భావించాల్సిన అవసరం ఉండదు.)

(సహీహ్ బుఖారీలోని సంస్కార ప్రకరణం, సహీహ్ ముస్లింలోని సత్కార్యాలు సత్సంబంధాల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: A person came to Messenger of Allah ﷺ and asked, “Who among people is most deserving of my fine treatment?” He ﷺ said, “Your mother”. He again asked, “Who next?” “Your mother”, the Prophet ﷺ replied again. He asked, “Who next?” He (the Prophet ﷺ) said again, “Your mother.” He again asked, “Then who?” Thereupon he ﷺ said,” Then your father.”

In another narration: “O Messenger of Allah! Who is most deserving of my fine treatment?” He ﷺ said, “Your mother, then your mother, then your mother, then your father, then your nearest, then nearest”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసు ద్వారా కుమారులు లేక కుమార్తెలు చూపే సత్ప్రవర్తనకు తండ్రికన్నా తల్లి మూడు రెట్లు ఎక్కువ హక్కుదారు అవుతుందని తెలుస్తోంది. దీనికి స్త్రీ శారీరక బలహీనత ఒక కారణం కావచ్చు. ఈ శారీరక బలహీనత కారణంగా తల్లి తన సంతానంపై ఎక్కువగా ఆధారపడవలసి వస్తుంది. రెండో విషయం ఏమిటంటే తల్లి తన సంతానం కోసం మూడు దుర్భరమైన కష్టాలను భరిస్తుంది. ఈ కష్టాల్లో తండ్రి ఏ విధంగానూ పాలుపంచుకోడు. 1. తొమ్మిది మాసాలపాటు తల్లి బిడ్డను తన కడుపున మోస్తుంది. 2. జీవన్మరణాల సమస్య వంటి ప్రసవవేదనను భరిస్తుంది. 3. ప్రసవించిన తరువాత రెండు సంవత్సరాల పాటు బిడ్డకు పాలిస్తుంది. ఈ కష్టాలవల్ల రాత్రిళ్ళు ఆమె నిద్రపాడవుతుంది. ఆమె సౌందర్యం కళావిహీనమైపోయి ఆరోగ్యం దెబ్బతింటుంది. బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ఒక్కోసారి ఆమెకు ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఎడతెరిపి లేకుండా ఇన్ని కష్టాలు, బాధలు భరించాల్సి వస్తుంది. కనుకనే ఇస్లాం ధర్మం తల్లికి ఎంతో ఉన్నత స్థానాన్ని ప్రసాదించింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|40. తల్లిదండ్రుల యెడల గౌరవాన్ని కలిగి ఉండాలి. బంధువుల హక్కులను నెరవేర్చాలి.|హదీసు 318

319

హదీసు 319

وعنه عن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "رغِم أَنْفُ، ثُم رغِم أَنْفُ، ثُمَّ رَغِم أَنف مَنْ أَدرْكَ أَبَويْهِ عِنْدَ الْكِبرِ، أَحدُهُمَا أَوْ كِلاهُما، فَلمْ يدْخلِ الجَنَّةَ" رواه مسلم.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ: "ముసలి వారై పోయిన తల్లిదండ్రులు – వారిరువురిలో ఒక్కరుగాని లేక ఇద్దరుగాని బ్రతికుండగా (వారికి సేవ చేసుకొని) స్వర్గంలోకి ప్రవేశించలేకపోయినవాడి ముక్కుకి మన్ను తగల! వాడి ముక్కుకి మన్ను తగల! వాడి ముక్కుకి మన్ను తగల!" అని మూడు సార్లు శపించారు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని సత్కార్యాలు – సత్సంబంధాల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “May he be disgraced! May he be disgraced! May he be disgraced, whose parents, one or both, attain old age during his life time, and he does not enter Jannah (by rendering being dutiful to them)”.[Muslim].

ముఖ్యాంశాలు

ముక్కుకి మన్ను తగలడమంటే పరాభవం పాలవటమని అర్థం. తల్లిదండ్రుల యెడల మంచిగా మెలిగి, వారికి సేవ చేసి దైవప్రసన్నతను పొందనివాడు నిజంగా దురదృష్టవంతుడే. దీనికి భిన్నంగా తల్లిదండ్రులకు సేవచేసినవాడికి పరలోకంలో స్వర్గసుఖాలు లభిస్తాయి. తల్లిదండ్రులు ముసలివారయినా, కాకపోయినా ఎల్లప్పుడూ వారికి సేవ చేస్తుండాలి. సాధారణంగా వృద్ధాప్యంలో తల్లిదండ్రులు తమ సంతానంపై ఎక్కువగా ఆధారపడవలసి వస్తుంది. అందుకే హదీసులో ప్రత్యేకంగా వృద్ధాప్య ప్రస్తావన తేబడింది. ఇలాంటి దైన్యస్థితిలో తల్లిదండ్రుల్ని నిస్సహాయులుగా వదలిపెట్టడం మనిషి కసాయితనాన్ని సూచిస్తుంది. తాము చేసిన ఈ పాపానికి శిక్షగా సంతానం పరలోకంలో స్వర్గభాగ్యాన్ని కోల్పోతుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|40. తల్లిదండ్రుల యెడల గౌరవాన్ని కలిగి ఉండాలి. బంధువుల హక్కులను నెరవేర్చాలి.|హదీసు 319

320

హదీసు 320

وعنه رضي اللَّه عنه أَن رجلاً قَالَ: يَا رَسُول اللَّه إِنَّ لِي قَرابَةً أَصِلُهُمْ وَيَقْطَعُوني، وَأُحسِنُ إِلَيْهِمِ وَيُسيئُونَ إِليَّ، وأَحْلُمُ عنهُمْ وَيجْهلُونَ علَيَّ، فَقَالَ: "لَئِنْ كُنْت كَمَا قُلْتَ، فَكَأَنَّمَا تُسِفُّهُمُ المَلَّ، وَلاَ يَزَالُ معكَ مِنَ اللَّهِ ظهِيرٌ عَلَيْهِمْ مَا دمْتَ عَلَى ذَلكَ" رواه مسلم. "وتسِفُّهُمْ"بضم التاءِ وكسرِ السين المهملةِ وتشديد الفاءِ."والمَلُّ"بفتحِ الميم، وتشديد اللام وَهُوَ الرَّماد الحارُّ: أَيْ كأَنَّمَا تُطْعِمُهُمْ الرَّماد الحارَّ وهُو تَشبِيهٌ لِما يلْحَقُهمْ مِنَ الإِثم بِما يَلْحقُ آكِلَ الرَّمادِ مِنَ الألم، ولا شئَ على المُحْسِنِ إِلَيْهِمْ، لَكِنْ يَنَالهُمْ إِثْمٌ عَظَيمٌ بَتَقْصيِرهِم في حَقِه، وإِدخَالِهِمُ الأَذَى عَلَيْهِ، واللَّه أعلم.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు)గారే చేసిన కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺ వద్దకు వచ్చి, "దైవప్రవక్తా! నా బంధువులు కొందరున్నారు. నేను వారితో సత్సంబంధాలు కొనసాగించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ వారు మాత్రం నాతో తెగత్రెంపులు చేసుకోవాలని చూస్తున్నారు. నేను వారిపట్ల మంచిగా మెలగుతుంటే వారేమో నాకు కీడు తలపెడుతున్నారు. నేను వారిపట్ల ఉదారవైఖరిని అనుసరిస్తుంటే వారు మాత్రం నాపట్ల మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు" అని దైవప్రవక్తకు తన గోడు వినిపించుకున్నాడు. అతని మాటలు విని ఆయన, 'నువ్వు చెప్పింది నిజమే అయితే నువ్వు వారి నోళ్ళల్లో వేడిబూడిదను పోస్తున్నావనుకో. నువ్వు మాత్రం వారిపట్ల ఇలాగే సత్ప్రవర్తనతో మెలగుతున్నంతకాలం దేవుని తరఫు నుండి వారికి వ్యతిరేకంగా ఒక సహాయకుడు నీ వెంట ఉంటాడు" అని అన్నారు. (ముస్లిం)

'తుసిప్ఫుహుముల్ మల్ల' అంటే నువ్వు వారికి వేడిబూడిద తినిపిస్తున్నావని అర్థం. దైవప్రవక్త ﷺ ఇచ్చిన ఈ ఉదాహరణలోని ఆంతర్యం ఏమిటంటే, కాలుతున్న బూడిద తింటున్నవాడికి నోరు కాలినట్లే బంధుత్వాల తెగత్రెంపులకు పాల్పడుతున్నవాడి పాపం కూడా పండుతూ ఉంటుంది. అయితే వారిపట్ల మంచిగా మెలగుతున్న వ్యక్తి మాత్రం నిందార్హుడు కాడు. అతని హక్కుల్ని కాలరాసి, అతణ్ణి బాధపెడుతున్నందుకు బంధువిచ్ఛిత్తికి పాల్పడిన వారే మహాపరాధులుగా పరిగణించబడతారు. (వల్లాహు ఆలము)

(సహీహ్ ముస్లింలోని సత్కార్యాలు – సత్సంబంధాల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: A man said to Messenger of Allah ﷺ: “I have relatives with whom I try to keep the ties of relationship but they sever relations with me; and whom I treat kindly but they treat me badly, I am gentle with them but they are rough to me.” He ﷺ replied, “If you are as you say, it is as if you are feeding them hot ashes, and you will be with a supporter against them from Allah as long as you continue to do so”.[Muslim].

ముఖ్యాంశాలు

ఇతర బంధువులు తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారన్న నెపంతో తాము కూడా వారితో బంధుత్వాన్ని త్రెంచుకోవటం భావ్యం కాదు. ఎందుకంటే ఇస్లాంలో ఇతర బంధువులు తమకు అపకారం తలపెట్టినప్పటికీ తాము మాత్రం వారితో ఉపకార భావంతోనే మెలగాలని తాకీదు చేయబడింది. బంధువులతో ఎల్లప్పుడూ మంచిగా మెలిగేవాడు దేవుని దృష్టిలో అత్యంత గౌరవనీయుడిగా, ఆదరణీయుడిగా పరిగణించబడతాడు. అలాంటి వ్యక్తి కోసం దైవం ఆకాశాల నుండి ప్రత్యేక సహాయకులను పంపుతాడు. దీనికి భిన్నంగా బంధుత్వ తెగత్రెంపులకు పాల్పడేవాడు దేవుని దృష్టిలో అత్యంత నీచుడిగా పరిగణించబడతాడు. అతని పర్యవసానం కూడా కాలుతున్న బూడిద తింటున్న వాడి మాదిరిగా అత్యంత హీనంగా ఉంటుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|40. తల్లిదండ్రుల యెడల గౌరవాన్ని కలిగి ఉండాలి. బంధువుల హక్కులను నెరవేర్చాలి.|హదీసు 320

321

హదీసు 321

وعن أَنسٍ رضي اللَّه عنه أَن رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَنْ أَحبَّ أَنْ يُبْسَطَ لَهُ في رِزقِهِ، ويُنْسأَ لَهُ في أَثرِهِ، فَلْيصِلْ رحِمهُ" متفقٌ عَلَيهِ. ومعْنى"ينسأَ لَهُ في أَثَرِه": أَيْ: يؤخر له في أَجلهِ وعُمُرِهِ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : తన ఉపాధిలో సమృద్ధిని, ఆయుష్షులో పెరుగుదలను కోరుకుంటున్నవాడు తన బంధువులతో సత్సంబంధాలు పెట్టుకోవాలి.

(బుఖారీ – ముస్లిం)

'యున్‌సఅ లహూ ఫీ అసరిహీ' అంటే 'తనకు దీర్ఘాయుష్షువు వొసగబడాలని' అని అర్థం.

(సహీహ్ బుఖారీలోని సంస్కార ప్రకరణం, సహీహ్ ముస్లింలోని సత్కార్యాలు – సత్సంబంధాల ప్రకరణం)

English

Anas (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “He who desires ample provisions and his life be prolonged, should maintain good ties with his blood relations”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

బంధువులతో మంచిగా మెలిగే వ్యక్తికి పరలోకంలో ఎలాగూ పుణ్యం లభిస్తుంది. దాంతోపాటు ఇహలోకంలోనూ అతనికి పై హదీసులో పేర్కొనబడిన రెండు రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఉపాధిలో వృద్ధినొసగబడటమంటే దైవం తరపునుండి నిజంగానే అతని ఉపాధిలో అభివృద్ధి కనిపించవచ్చు లేదా అతని ఉపాధిలో శుభం కలుగుతుందన్న అర్థమైనా కావచ్చు. అదేవిధంగా ఆయుష్షులో పెరుగుదల అంటే నిజంగానే అల్లాహ్ అతని ఆయుష్షుని పొడిగించవచ్చు లేదా అతని ఆయుష్షులో శుభాన్ని ప్రసాదించవచ్చు. ఆయుష్షులో శుభం కలిగితే జీవితంలో మనిషి సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తాడు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|40. తల్లిదండ్రుల యెడల గౌరవాన్ని కలిగి ఉండాలి. బంధువుల హక్కులను నెరవేర్చాలి.|హదీసు 321

322

హదీసు 322

وعنه قَالَ: كَانَ أَبُو طَلْحَة أَكْثَر الأَنصار بِالمَدينَةِ مَالاً مِنْ نَخْلٍ، وَكَانَ أَحبُّ ّأَمْوَالِهِ بِيرْحَاءَ، وكَانتْ مُسْتقْبِلَة المَسْجِدِ، وكَان رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يدْخُلُهَا، وَيَشْرَب مِنْ ماءٍ فِيهَا طَيِّبٍ، فَلمَّا نَزَلتْ هذِهِ الآيةُ: {لَنْ تَنَالُوا الْبِرَّ حَتَّى تُنْفِقُوا مِمَّا تُحِبُّونَ} [آل عمران: ٩٢] قَامَ أَبُو طَلْحة إِلَى رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَقَالَ: يَا رسولَ اللَّه إِنَّ اللَّه تَبَارَك وتَعَالَى يقول: {لَنْ تَنَالُوا الْبِرَّ حَتَّى تُنْفِقُوا مِمَّا تُحِبُّونَ} وَإِنَّ أَحب مَالِي إِليَّ بِيَرْحَاءَ، وإِنَّهَا صَدقَةٌ للَّهِ تَعَالَى، أَرجُو بِرَّهَا وذُخْرهَا عِنْد اللَّه تَعَالَى، فَضَعْهَا يَا رَسُول اللَّه حيثُ أَراكَ اللَّه. فقال رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "بَخٍ، ذلِكَ مالٌ رابحٌ، ذلِكَ مالٌ رابحٌ، وقَدْ سَمِعْتُ مَا قُلتَ، وإِنَّي أَرى أَنْ تَجْعَلَهَا في الأَقْربِين" فَقَالَ أَبُو طَلْحة: أَفعلُ يَا رَسُول اللَّه، فَقَسَمهَا أَبُو طَلْحة في أَقارِبِهِ وبَنِي عمِّهِ. متفقٌ عَلَيهِ. وَسبق بَيَانُ أَلْفَاظِهِ في بابِ الإِنْفَاقِ مِمَّا يُحِب.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం : మదీనా నగరంలోని అన్సార్ ముస్లింలందరిలో హజ్రత్ అబూ తల్హా (రదియల్లాహు అన్హు) గొప్ప ధనికులు. ఆయనకు అనేక ఖర్జూర తోటలుండేవి. ఆ తోటల్లో ఆయనకు 'బైరహా' తోట అంటే ఎంతో యిష్టం. అది మస్జిదె నబవీకి ముందు భాగంలో ఉండేది. దైవప్రవక్త ﷺ తరచూ ఆ తోటలోకి వెళుతుండేవారు. అక్కడ దొరికే మంచినీళ్ళు త్రాగేవారు. ఆ కాలంలోనే "మీరు అమితంగా ప్రేమించే వస్తువులను (అల్లాహ్ మార్గంలో) ఖర్చుపెట్టనంతవరకు మీరు సత్కార్యస్థాయికి చేరుకోలేరు" అనే దైవసూక్తి (ఆలి ఇమ్రాన్ : 92) అవతరించింది. ఈ సూక్తి అవతరించినప్పుడు హజ్రత్ అబూ తల్హా (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త ముందు ఇలా ప్రకటించారు:

"దైవప్రవక్తా! 'మీరు అమితంగా ప్రేమించే వస్తువులను (తన మార్గంలో) ఖర్చుపెట్టనంతవరకు మీరు సత్కార్యస్థాయికి చేరుకోలేరని దేవుడంటున్నాడు. అలాగైతే నాకున్న సంపద మొత్తంలో బైరహా తోట నాకు అత్యంత ప్రీతికరమైనది. దాన్ని నేను దైవమార్గంలో దానం చేస్తున్నాను. దానివల్ల నాకు పుణ్యం లభిస్తుందని, ఇంకా పరలోకంలోనూ దాని పుణ్యం నాకోసం నిల్వచేసి ఉంచబడుతుందని ఆశిస్తున్నాను. దేవుడు ఎలా ఆజ్ఞాపిస్తే అలా మీరు దీనిని వినియోగించండి."

ఆయన మాటలు విని దైవప్రవక్త ﷺ "ఓహో! ఇదెంతో లాభదాయకమైన సంపదే. నిజంగా ఇదెంతో లాభదాయకమైన సంపద. నువ్వు చెప్పిన మాటలన్నీ నేను విన్నాను. అయితే నువ్వు ఈ సంపదను (అభాగ్యులైన) నీ బంధువులకు పంచిపెడితే సముచితంగా ఉంటుందని నేను భావిస్తున్నాను" అని అన్నారు.

దానికి హజ్రత్ అబూ తల్హా (రదియల్లాహు అన్హు) "మీరు చెప్పినట్లే చేస్తాను దైవప్రవక్తా!" అని అన్నారు. (ఆ తరువాత దైవప్రవక్త సలహాననుసరించి) ఆయన ఆ తోటను తన బంధువులకు, చిన్నాన్న, పెద్దనాన్న కుమారులకు పంచివేశారు."

(బుఖారీ – ముస్లిం)

English

Anas (radiyallahu anhu) reported: Abu Talhah (radiyallahu anhu) was the richest among the Ansar of Al-Madinah and possessed the largest property; and among his possessions what he loved most was his garden known as Bairuha’ which was opposite the mosque, and Messenger of Allah ﷺ often visited it and drank from its fresh water. When this ayah was revealed: “By no means shall you attain Al-Birr (piety, righteousness – here it means Allah’s reward, i.e., Jannah), unless you spend (in Allah’s Cause) of that which you love,” (3:92). Abu Talhah came to Messenger of Allah ﷺ, and said: “Allah says in His Book: `By no means shall you attain Al-Birr, unless you spend (in Allah’s Cause) of that which you love,‘ and the dearest of my property is Bairuha’ so I have given it as Sadaqah (charity) for Allah’s sake, and I anticipate its reward with Him; so spend it, O Messenger of Allah, as Allah guides you”. Messenger of Allah ﷺ said, “Well-done! That is profitable property. I have heard what you have said, but I think you should spend it on your nearest relatives.” So Abu Talhah distributed it among his nearest relatives and cousins.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసు ఇంతకు ముందు ప్రీతికరమైన వస్తువుల త్యాగానికి సంబంధించిన అధ్యాయంలో కూడా వచ్చింది. ఈ హదీసు చివరి భాగంలో బంధుప్రేమ గురించి చెప్పబడింది కాబట్టి సదరు అధ్యాయం క్రింద కూడా దీనిని ప్రస్తావించటం జరిగింది. దీని ద్వారా బోధపడే విషయమేమిటంటే, దానధర్మాలు చేసినప్పుడు ముందుగా తమ సన్నిహిత బంధువులను దృష్టిలో పెట్టుకోవాలి. వారు అవసరాల్లో ఉన్నారనుకుంటే వారికే ఇవ్వాలి. ఆ తరువాత కూడా సదఖా సొమ్ము మిగిలి ఉంటే దానిని ఇతరులకు కూడా దానం చేయవచ్చు. దీనికి భిన్నంగా ఇతరులను సుఖపెట్టి సొంత బంధువులనే విస్మరించటం ఎంతమాత్రం వాంఛనీయం కాదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|40. తల్లిదండ్రుల యెడల గౌరవాన్ని కలిగి ఉండాలి. బంధువుల హక్కులను నెరవేర్చాలి.|హదీసు 322

323

హదీసు 323

وعن عبد اللَّه بن عمرو بن العاص رضي اللَّه عنهما قَالَ: أَقْبلَ رجُلٌ إِلى نَبِيِّ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَقَالَ: أُبايِعُكَ عَلَى الهِجرةِ وَالجِهَادِ أَبتَغِي الأَجرَ مِنَ اللَّه تعالى. قال: "فهَلْ مِنْ والدِيْكَ أَحدٌ حَيٌّ؟ "قَالَ: نعمْ بَلْ كِلاهُما قَالَ:"فَتَبْتَغِي الأَجْرَ مِنَ اللَّه تَعَالَى؟ "قَالَ: نعمْ قَالَ:"فَارْجعْ إِلى والدِيْكَ، فَأَحْسِنْ صُحْبتَهُما. متفقٌ عَلَيهِ. وهذا لَفْظُ مسلمٍ. وفي روايةٍ لهُما: جاءَ رجلٌ فاسْتَأْذَنُه في الجِهَادِ فقَالَ: "أَحيٌّ والِداكَ؟ قَالَ: نَعَمْ، قَالَ:"ففِيهِما فَجاهِدْ".

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺ వద్దకు వచ్చి, "నేను (ధర్మం కోసం) ప్రస్థానం (హిజ్రత్) చేస్తాననీ, జిహాద్ (ధర్మయుద్ధం)లో పాల్గొంటానని మీతో ప్రమాణం చేసి చెబుతున్నాను. (దీనివల్ల) నాకు దైవం తరపునుండి పుణ్యం లభించాలని కోరుకుంటున్నాను" అని అన్నాడు. అది విని దైవప్రవక్త, ఆ వ్యక్తితో 'నీ తల్లిదండ్రుల్లో ఒకరైనా బ్రతికి ఉన్నారా?' అనడిగారు. దానికావ్యక్తి, 'అవును, ఇద్దరూ బ్రతికి ఉన్నారు' అని సమాధానమిచ్చాడు. అందుకాయన 'నువ్వు నిజంగానే దేవుడు నీకు పుణ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నావా?' అని అడిగారు. అతను 'అవును' అన్నాడు. అప్పుడాయన 'అలాగయితే నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి వెళ్ళిపో. వారిద్దరికీ బాగా సేవ చెయ్యి (అందులోనే నీకు ఆ పుణ్యం లభిస్తుంది)' అని చెప్పి పంపించారు. (బుఖారీ – ముస్లిం) వాక్యాలు మాత్రం ముస్లింవి.

బుఖారీ – ముస్లింలలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺ దగ్గరికి వచ్చి తనను ధర్మయుద్ధంలో పాల్గొనడానికి అనుమతించమని కోరాడు. దానికి ఆయన "నీ తల్లిదండ్రులు బ్రతికి ఉన్నారా?" అని అడిగారు. ఆ వ్యక్తి 'ఉన్నార'న్నాడు. అతని జవాబు విని ఆయన "అయితే వారిద్దరి సేవలోనే పోరాడుతూ ఉండు" అని చెప్పి పంపించారు.

(సహీహ్ బుఖారీలోని జిహాద్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని సత్కార్యాలు – సత్సంబంధాల ప్రకరణం)

English

`Abdullah bin `Amr bin Al-`as (radiyallahu anhuma) reported: A man came to the Prophet ﷺ of Allah and said, “I swear allegiance to you for emigration and Jihad, seeking reward from Allah.” He ﷺ said, “Is any of your parents alive?” He said, “Yes, both of them are alive.” He ﷺ then asked, “Do you want to seek reward from Allah?” He replied in the affirmative. Thereupon Messenger of Allah ﷺ said, “Go back to your parents and keep good company with them”.[Al-Bukhari and Muslim].

In another narration it is reported that a person came to Messenger of Allah ﷺ and sought his permission to participate in Jihad. The Prophet ﷺ asked, “Are your parents alive?” He replied in the affirmative. The Prophet a ﷺ said, “(You should) consider their service as Jihad.”

ముఖ్యాంశాలు

సాధారణ పరిస్థితుల్లో జిహాద్ సామాజిక బాధ్యత(ఫర్జె కిఫాయా)గా పరిగణించబడుతుంది. అలాంటప్పుడు ముస్లింలందరూ కాకుండా పరిస్థితుల స్వరూపానికి అనుగుణంగా కొంతమంది సైన్యంలో చేరితే అందరి తరపున ఆ బాధ్యత నెరవేరుతుంది. ఇలాంటి సాధారణ పరిస్థితుల్లో సైన్యంలో చేరాలన్నా లేక యుద్ధంలో పాల్గొనాలన్నా తల్లిదండ్రుల అనుమతిని పొందటం అవసరం. ఎందుకంటే తల్లిదండ్రుల సేవ వైయక్తిక విధి (ఫర్జె ఐన్). అంటే ప్రతి ఒక్కరూ దాన్ని నిర్వర్తించి తీరాలి. 'ఫర్జె కిఫాయా' కోసం 'ఫర్జె ఐన్'ను వదలిపెట్టడం ధర్మసమ్మతం కాదు. పై హదీసులో చెప్పబడిన విషయం ఈ సందర్భానికి సంబంధించినదే. అయితే కొన్ని పరిస్థితుల్లో జిహాద్ కూడా వైయక్తిక విధి (ఫర్జె ఐన్)గా మారిపోతుంది. అలాంటి సందర్భాల్లో జిహాద్‌లో పాల్గొనటానికి తల్లిదండ్రుల అనుమతి అవసరం లేదు. ఎందుకంటే ఆ పరిస్థితిలో ప్రతి ఒక్కరూ వైయక్తికంగా జిహాద్‌లో పాల్గొనటం అనివార్యమయిపోతుంది. ముఖ్యంగా శత్రుసైన్యాలు ఇస్లామీయ రాజ్యంపైకి దండెత్తివచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితి ఆసన్నమవుతుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|40. తల్లిదండ్రుల యెడల గౌరవాన్ని కలిగి ఉండాలి. బంధువుల హక్కులను నెరవేర్చాలి.|హదీసు 323

324

హదీసు 324

وعنه عن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قال: لَيْسَ الْواصِلُ بِالمُكافئ وَلكِنَّ الواصِلَ الَّذي إِذا قَطَعتْ رَحِمُهُ وصلَهَا" رواه البخاري. وَ"قَطعتْ"بِفَتْح القافِ وَالطَّاءِ. وَ"رَحِمُهُ"مَرْفُوعٌ.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హుమా) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: ఒక బంధువు ఉపకారం చేస్తే దానికి బదులుగా ఉపకారం చేసేవాడు (నిజమైన) బంధుప్రియుడు కాడు. తన బంధువులు తనతో తెగత్రెంపులు చేసుకున్నప్పటికీ వారితో సత్సంబంధాలు కొనసాగించేవాడే (సిసలైన) బంధుప్రియుడు. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని సంస్కార ప్రకరణం)

English

`Abdullah bin `Amr Al-`as (radiyallahu anhuma) reported: The Prophet ﷺ said, “The person who perfectly maintains the ties of kinship is not the one who does it because he gets recompensed by his relatives (for being kind and good to them), but the one who truly maintains the bonds of kinship is the one who persists in doing so even though the latter has severed the ties of kinship with him”.[Al-Bukhari].

ముఖ్యాంశాలు

బంధుప్రేమ (సిలారహ్మీ) బంధువుల మధ్య ఎలాంటి సద్భావనను, సదభిప్రాయాన్ని కోరుకుంటుందో ఈ హదీసు వివరిస్తోంది. తమకు ఉపకారం చేసే బంధువులకు ఉపకారం చేయడంలో గొప్పేముంది? అది బంధుప్రేమ కాదు. ఒక ఉపకారికి ఉపకారం చేసినట్లవుతుంది అంతే! తోటి బంధువులెవరైనా తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ, తమతో బంధుత్వాన్ని త్రెంచుకోవటానికి ప్రయత్నిస్తున్నప్పటికీ తాము మాత్రం విశాల హృదయంతో వారిని మన్నిస్తూ, వారి కీడుకు బదులుగా మేలు చేసి తమ ఉదారత్వాన్ని ప్రదర్శించాలి. వారితో బంధుత్వ సంబంధాలను కొనసాగించడానికి ముందుకు రావాలి. అసలు సిసలైన బంధుప్రేమ అంటే ఇది! ఇస్లాం కోరేది కూడా ఇలాంటి బంధుప్రేమనే! ఇతరులు మనల్ని నీచంగా చూసినప్పుడు మనం వారిపట్ల సద్భావంతో మెలగటానికి అహం అడ్డొస్తుంది. కాని ఆ అహంభావాన్ని అణచుకొని షరీఅత్ ఆదేశాల్ని పాటించాలి. అయితే అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. మరోవైపు పరిపూర్ణ విశ్వాసాన్ని పొందాలంటే మనసులోని అహంభావాన్ని అణచుకోక తప్పదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|40. తల్లిదండ్రుల యెడల గౌరవాన్ని కలిగి ఉండాలి. బంధువుల హక్కులను నెరవేర్చాలి.|హదీసు 324

325

హదీసు 325

وعن عائشة قَالَتْ: قَالَ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "الرَّحمُ مَعَلَّقَةٌ بِالعَرْشِ تَقُولُ: مَنْ وَصَلَنِي وَصَلَهُ اللَّه، وَمَن قَطَعَني، قَطَعَهُ اللَّه" متفقٌ عليه.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు : "బంధుత్వం దైవ పీఠానికి వ్రేలాడబడి "నాతో సత్సంబంధాలు పెట్టుకున్నవాడితో దేవుడు కూడా సత్సంబంధాలు పెట్టుకొనుగాక! నన్ను విచ్ఛిన్నం చేసినవాడిని దేవుడు కూడా విచ్ఛిన్నం చేయుగాక!' అని ప్రార్థిస్తూ ఉంటుంది." (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని సంస్కార ప్రకరణం, సహీహ్ ముస్లింలోని సత్కార్యాలు – సత్సంబంధాల ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha) reported: Messenger of Allah ﷺ said, “The bond of relationship is suspending from the Throne, and says: `He who keeps good relations with me, Allah will keep connection with him, but whosoever severs relations with me, Allah will sever connection with him”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

బంధుత్వం మాట్లాడటం, దేవునితో సంభాషించటం అసంభవమేమీ కాదు. దేవుడు తలచుకుంటే ఏమైనా చేయగలడు. సృష్టిలోని ప్రతి వస్తువుకీ గ్రహణ శక్తినీ, మాట్లాడే సామర్థ్యాన్నీ ప్రసాదించగలడు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|40. తల్లిదండ్రుల యెడల గౌరవాన్ని కలిగి ఉండాలి. బంధువుల హక్కులను నెరవేర్చాలి.|హదీసు 325

326

హదీసు 326

وعن أُمِّ المُؤْمِنِينَ ميمُونَةَ بنْتِ الحارِثِ رضي اللَّه عنها أَنَّهَا أَعتَقَتْ وَليدَةً وَلَم تَستَأْذِنِ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فلَمَّا كانَ يومَها الَّذي يدورُ عَلَيْهَا فِيه، قَالَتْ: أشَعَرْتَ يَا رَسُول اللَّه إِنِّي أَعْتَقْتُ ولِيدتي؟ قَالَ: "أَوَ فَعلْتِ؟ " قَالَتْ: نَعمْ قَالَ:"أَما إِنَّكِ لَوْ أَعْطَيتِهَا أَخوالَكِ كَانَ أَعظَمَ لأجرِكِ" متفقٌ عَلَيهِ.

విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ మైమూనా బిన్తె హారిస్ (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం ఆమె ఒకసారి ఒక దాసికి బానిసత్వం నుంచి స్వేచ్ఛను ప్రసాదించారు. ఈ విషయంలో ఆమె దైవప్రవక్త ﷺ నుండి అనుమతి తీసుకోలేదు. ఆమె దాంపత్య వంతు వచ్చిన రోజు దైవప్రవక్త ﷺ ఆమె వద్దకు వెళ్ళారు. అప్పుడు ఆమె "దైవప్రవక్తా! మీరీ విషయం గమనించారా? నేను నా దాసికి విముక్తి ప్రసాదించాను" అని అన్నారు. దానికి ఆయన "నిజంగా అలా చేశావా?" అని అడిగారు. అందుకామె 'అవున'ని సమాధానమిచ్చారు. అప్పుడు, "నీవా దాసిని నీ మేనమామలలో ఎవరికైనా ఇచ్చివుంటే (దాంతోపాటు బంధుప్రేమ కనబరచినందుకు) నీకు మరింత పుణ్యం లభించి ఉండేది కదా!' అని అన్నారు దైవప్రవక్త ﷺ

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని కానుకల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణం)

English

It has been narrated that Maimuna bint Al-Harith (radiyallahu anha) had set free a slave-girl without the Prophet’s permission. When her turn came (the Prophet ﷺ used to visit his wives in turns), she made mention of that to him saying, “Did you know I have set slave-girl free?” He said, “Have you, indeed?” She replied, “Yes”. He ﷺ then remarked, “Had you given her to your maternal uncles, you would have your reward increased”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఒక స్త్రీ తన సొంత సొమ్మును తనకు యిష్టమైన రీతిలో వినియోగించుకోగలదు. దానికోసం భర్తనుండి అనుమతి పొందాల్సిన అవసరం లేదు. అయితే భర్త సొమ్మును ఆ విధంగా వినియోగించే హక్కు ఆమెకు లేదు.

ఈ హదీసు ద్వారా బోధపడే రెండో విషయం ఏమిటంటే, అభాగ్యులైన బంధువులకు దానం ఇవ్వడం ఒక బానిసకు స్వేచ్ఛ కల్పించటం కన్నా ఎక్కువ శ్రేష్ఠమైన పుణ్యకార్యం అనిపించుకుంటుంది. ఎందుకంటే బానిసకు విముక్తి కలిగించడమంటే ఒక విధంగా దానం చేయటంతో సమానం. కాని అభాగ్యులైన బంధువులకు దానం చేయటం వల్ల ఒక వైపు దానం చేసినందుకు పుణ్యం లభించటంతోపాటు మరోవైపు బంధుప్రేమ వెల్లడించినందుకు కూడా పుణ్యం లభిస్తుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|40. తల్లిదండ్రుల యెడల గౌరవాన్ని కలిగి ఉండాలి. బంధువుల హక్కులను నెరవేర్చాలి.|హదీసు 326

327

హదీసు 327

وعن أَسْمَاءَ بنْتِ أَبي بكْرٍ الصِّدِّيقِ رضي اللَّه عنهما قَالَتْ: قَدِمتْ عليَّ أُمِّي وهِي مُشركة في عهْدِ رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَاسْتَفتَيْتُ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قلتُ: قَدِمتْ عَليَّ أُمِّى وَهِى راغبةٌ، أَفأَصِلُ أُمِّي؟ قَالَ:"نَعمْ صِلي أُمَّكِ" مُتَّفَقٌ عَلَيهِ. وَقَولُهَا:"راغِبةٌ"أَي: طَامِعةٌ عِندِي تَسْأَلُني شَيئاً، قِيلَ: كَانَت أُمُّهَا مِنْ النَّسبِ، وقِيل: مِن الرَّضاعةِ والصحيحُ الأَول.

హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) కుమార్తె అస్మా (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త(కు మరియు మక్కా బహుదైవారాధకులకు మధ్య జరిగిన హుదైబియా ఒప్పంద) కాలంలో ఒకసారి మా అమ్మ నా దగ్గరికి వచ్చింది. అప్పటికి ఆమె ఇంకా బహుదైవారాధకురాలిగానే ఉంది. నేను ఆమె వచ్చిన సంగతి దైవప్రవక్త ﷺ ముందు ప్రస్తావిస్తూ "దైవప్రవక్తా! మా అమ్మ నా దగ్గరికి వచ్చి ఉంది. ఆమె నా నుండి సద్వర్తనను ఆశిస్తోంది. మరి నేను (బహుదైవారాధకురాలైన) మా అమ్మ పట్ల మంచిగా మెలగవచ్చా?" అని అడిగాను. అందుకాయన "అవును, నువ్వు మీ అమ్మ పట్ల (తప్పకుండా) సత్ప్రవర్తనతో మెలగాలి" అని అన్నారు.

(బుఖారీ – ముస్లిం)

'రాఘిబా' అంటే నా నుంచి ఏదో ఆశిస్తుందని అర్థం. కొంతమంది 'ఆ వచ్చినావిడ ఆమె సొంత తల్లేన'ని అన్నారు. మరికొంతమంది ఆమెకు పాలుపట్టిన తల్లి అని అన్నారు. ఈ రెండింటిలో మొదటి అభిప్రాయమే సరైనది.

(సహీహ్ బుఖారీలోని కానుకల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణం)

English

Asma’ bint Abu Bakr As-Siddiq (radiyallahu anha) said: My mother came to me while she was still a polytheist, so I asked Messenger of Allah ﷺ, “My mother, who is ill-disposed to Islam, has come to visit me. Shall I maintain relations with her?” He ﷺ replied, “Yes, maintain relations with your mother”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

పై హదీసులో పేర్కొనబడిన స్త్రీ మక్కా నుండి మదీనాకు వచ్చింది. ఈవిడపేరు ఖుతైలా బిన్తె అబ్దుల్ ఉజ్జా అని కొంతమంది అంటే 'ఖీలా' అని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. ఏదిఏమైనా ఈ హదీసు ద్వారా బోధపడేదేమిటంటే, తల్లిదండ్రులు బహుదైవారాధకులైనా లేక దైవ తిరస్కారులైనా వారికి తప్పకుండా సేవ చేయాలి. వారిపట్ల ఉత్తమంగా మెలగాలి. ఇహలోకంలో వారిపట్ల మంచిగా మెలగాలని దివ్య ఖుర్‌ఆన్ ఆదేశిస్తోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|40. తల్లిదండ్రుల యెడల గౌరవాన్ని కలిగి ఉండాలి. బంధువుల హక్కులను నెరవేర్చాలి.|హదీసు 327

328

హదీసు 328

وعن زينب الثقفِيَّةِ امْرأَةِ عبدِ اللَّهِ بن مسعودٍ رضي اللَّه عَنْهُ وعنها قَالَتْ: قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "تَصدَّقنَ يَا مَعْشَرَ النِّسَاءِ ولَو مِن حُلِيِّكُنَّ" قَالَتْ: فَرجعتُ إِلى عبدِ اللَّه ابنِ مسعودٍ فقلتُ لَهُ: إِنَّك رجُلٌ خَفِيفُ ذَات اليَدِ وإِنَّ رسولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قدْ أمَرَنَا بالصدقةِ، فأْتِه فاسأَلْهُ، فإنْ كان ذلك يُجْزِئُ عنِّي وَإِلاَّ صَرَفُتَهَا إِلى غَيركُمْ. فَقَالَ عبدُ اللَّهِ: بَلِ ائتِيهِ أَنتِ، فانطَلَقْتُ، فَإِذا امْرأَةٌ مِن الأَنَصارِ بِبابِ رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم حاجَتي حاجتُهَا، وَكَانَ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَدْ أُلقِيتْ علَيهِ المهابةُ. فَخَرج عَلَيْنَا بلالٌ، فقُلنَا لَهُ: ائْتِ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَأَخْبِرْهُ أَنَّ امْرأَتَيْنِ بِالبَابَ تَسأَلانِكَ: أَتُجزِئُ الصَّدَقَةُ عنْهُمَا عَلَى أزواجِهِما وَعلى أَيتَامٍ في حُجُورِهِمَا؟ وَلا تُخْبِرهُ منْ نَحنُ، فَدَخل بِلالٌ علَى رَسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَسأَلَهُ، فَقَالَ لهُ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم "مَنْ هُمَا؟ " قَالَ: امْرأَةٌ مِنَ الأَنصارِ وَزَيْنبُ. فقالَ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم "أَيُّ الزَّيانِبِ هِي؟ " قَالَ: امرأَةُ عبدِ اللَّهِ، فقال رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لَهُمَا أَجْرانِ: أَجْرُ القرابةِ وَأَجْرُ الصَّدقَةِ" متفقٌ عليه.

అబ్దుల్లాహ్ బిన్ మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) భార్య హజ్రత్ జైనబ్ సఖఫియ్యా (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త ﷺ (స్త్రీలకు) ఇలా ఉపదేశించారు : "మహిళల్లారా! దానం చేయండి. మీ నగల్లో నుంచైనా సరే; (తప్పకుండా) దానం చేయండి."

జైనబ్ (రదియల్లాహు అన్హా) ఇలా తెలియజేస్తున్నారు: (దైవప్రవక్త ఉపదేశం విన్న తరువాత) నేను (నా భర్త) అబ్దుల్లాహ్ బిన్ మస్‌వూద్ దగ్గరికి తిరిగి వచ్చిన తరువాత ఆయనతో మాట్లాడుతూ, "మీ ఆదాయం కూడా చాలా తక్కువే కదండి! దైవప్రవక్త ﷺ మమ్మల్ని దానాలు చేయాలని బోధించారు. అందుకే నేను నా సదఖా (దానం) మీకిస్తే అది దానంగా పరిగణించబడుతుందో లేదో కాస్త మీరు దైవప్రవక్త ﷺ దగ్గరికెళ్ళి అడిగి తెలుసుకోండి! ఆయన కాదంటే ఆ దానాన్ని ఇంకెవరికైనా ఇచ్చేస్తాను" అని అన్నాను. దానికి అబ్దుల్లా "లేదు, నువ్వే వెళ్ళి అడిగి తెలుసుకొని రా" అని అన్నారు.

అప్పుడు నేను స్వయంగా దైవప్రవక్తను అడిగి తెలుసుకుందామని వెళ్ళాను. నేను వెళ్ళేసరికి దైవప్రవక్త గుమ్మం దగ్గర ఒక అన్సారీ మహిళ కలిసింది. నేను అడగదలచుకున్న విషయమే ఆవిడ కూడా అడగాలని వచ్చింది. దైవప్రవక్తది మహా గంభీర వ్యక్తిత్వం (ఆయనకు భయపడి మేము లోనికి ప్రవేశించే ధైర్యం చేయలేకపోయాము).

అదే సమయంలో హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) బయటికి వచ్చారు. మేమాయన్ని ఆపి "మీరు దైవప్రవక్త దగ్గరికి వెళ్ళి గుమ్మం దగ్గర ఇద్దరు స్త్రీలున్నారని చెప్పండి. వాళ్ళు తమ భర్తలకు, తమ పోషణలో పెరుగుతున్న అనాధపిల్లలకు దానం చేస్తే అది (షరీఅత్ దృష్టిలో) దానంగా పరిగణించబడుతుందో లేదో అడుగుతున్నారని చెప్పండి. అయితే (దయచేసి) మేమెవరమో ఆయన ﷺకు తెలియజేయకండి" అని కోరాము.

హజ్రత్ బిలాల్ దైవప్రవక్త ﷺ దగ్గరికి వెళ్ళి ఈ విషయం గురించి ఆయనకు చెప్పారు. విషయం తెలుసుకొని ఆయన "ఎవరా ఇద్దరు స్త్రీలు?" అని అడిగారు. "ఒకామె అన్సార్‌కు చెందిన స్త్రీ. మరో ఆమె జైనబ్" అని బిలాల్ సమాధానమిచ్చారు. దైవప్రవక్త "ఏ జైనబ్?" అని మళ్ళీ అడిగారు. అందుకు బిలాల్ (రదియల్లాహు అన్హు) "అబ్దుల్లాహ్ బిన్ మస్‌వూద్ భార్య" అని చెప్పారు. అప్పుడాయన, "వాళ్ళకు రెట్టింపు పుణ్యం లభిస్తుందని చెప్పు. ఒకటి : బంధుప్రేమతో మసలుకున్నందుకు లభించే పుణ్యం. రెండు : దానం చేసినందుకు లభించే పుణ్యం" అని అన్నారు. (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లింలలోని జకాత్ ప్రకరణాలు)

English

Zainab Ath-Thaqafiyah (radiyallahu anha) the wife of `Abdullah bin Mas`ud (radiyallahu anhu) reported: When Messenger of Allah ﷺ told the women that they should give Sadaqah (charity), even if it should be some of their jewellery, I returned to `Abdullah bin Mas`ud and said, “You are a man who does not possess much, and Messenger of Allah ﷺ has commanded us to give Sadaqah. So go and ask him if giving to you will serve the purpose; otherwise, I shall give it to someone else.” He asked me that I should better go myself. I went and found a woman of the Ansar at the door of Messenger of Allah ﷺ, waiting to ask a similar question as mine. The Prophet ﷺ was endowed with dignity, and so we could not go in. When Bilal (radiyallahu anhu) came out to us, we said to him: “Go to Messenger of Allah ﷺ and tell him that there are two women at the door who have come to ask him whether it will serve them to give Sadaqah to their husbands and to orphans who are in their charge, but do not tell him who we are. Bilal (radiyallahu anhu) went in and asked him, and Messenger of Allah ﷺ asked him who the women were. When he told him that they were a woman of the Ansar and Zainab, he asked him which Zainab it was, and when he was told it was the wife of `Abdullah bin Mas`ud, he ﷺ said, “They will have a double reward, one for maintaining the ties of kinship and another for Sadaqah”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

  1. దీని ప్రకారం ఒక స్త్రీ నిరుపేద అయిన తన భర్తకు సదఖా సొమ్ము ఇవ్వగలదు. కాని భర్త మాత్రం తన భార్యకు దానం చేయటానికి వీల్లేదు. ఎందుకంటే ఖర్చులరీత్యా తమపై ఆధారపడివున్న వారికి దానం చేస్తే అది షరీఅత్ దృష్టిలో దానం క్రిందికి రాదు. భార్య ఖర్చుల్ని భరించటం భర్త బాధ్యత కాబట్టి అతను ఆమెకు దానంగా ఏదైనా ఇచ్చినా వాస్తవానికి అది దానంగా పరిగణించబడదు. అదేవిధంగా తన సంతానంపై, తల్లిదండ్రులపై సదఖా మరియు జకాత్ సొమ్మును ఖర్చుచేయటం తగదు.
  2. అవసరమొచ్చినప్పుడు స్త్రీ పరదా పాటిస్తూ ఇంటినుండి బయటికి రావచ్చు.
  3. పురుషుల మాదిరిగానే స్త్రీలు కూడా ధర్మ సందేహాలను నివృత్తి చేసుకోవటంలో, కొత్త విషయాలు తెలుసుకోవటంలో ఆసక్తి కనబరచాలి. ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు. విద్య నేర్చుకోవటానికి పరదా అడ్డురాదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|40. తల్లిదండ్రుల యెడల గౌరవాన్ని కలిగి ఉండాలి. బంధువుల హక్కులను నెరవేర్చాలి.|హదీసు 328

329

హదీసు 329

وعن أَبي سُفْيان صخْر بنِ حربٍ رضي اللَّه عنه في حدِيثِهِ الطَّويل في قصَّةِ هِرقل أَنَّ هِرقْلَ قَالَ لأَبي سفْيان: فَماذَا يأْمُرُكُمْ بِهِ؟ يَعْني النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: قُلْتُ: يقولُ:"اعْبُدُوا اللَّهَ وَحدَهُ، وَلاَ تُشْرِكُوا بِهِ شَيْئاً، واتْرُكُوا مَا يقُولُ آباؤُكمْ، ويأْمُرُنَا بالصَّلاةِ، والصِّدْقِ، والعفَافِ، والصِّلَةِ"متفقٌ عَلَيهِ.

(రోము చక్రవర్తి అగు) హెరక్లియస్ కథకు సంబంధించి తాను వివరించిన సుదీర్ఘ హదీసులో హజ్రత్ అబూ సుఫ్యాన్ సఖ్ర్ బిన్ హర్బ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం హెరక్లియస్ అబూ సుఫ్యాన్‌ను "ఆయన (అంటే దైవప్రవక్త) మిమ్మల్ని ఏ విషయాల గురించి ఆదేశిస్తున్నాడు?" అని అడిగాడు.

దానికి అబూ సుఫ్యాన్, "మీరంతా ఒకే దేవుణ్ణి ఆరాధించండి. ఆ దేవునికి ఎవరినీ భాగస్వాములుగా నిలబెట్టకండి. మీ పూర్వీకుల మాటల్ని వదలిపెట్టండి" అని ఆయన అంటున్నాడు. ఇంకా మమ్మల్ని నమాజు చెయ్యమనీ, సత్యం పలకమనీ, సౌశీల్యవంతమైన జీవితాన్ని గడపమనీ, బంధువులను ప్రేమించమని ఆదేశిస్తున్నాడు" అతని సమాధానమిచ్చారు. (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని వహీ ప్రారంభ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని జిహాద్ ప్రకరణం)

English

Abu Sufyan Sakhr bin Harb (radiyallahu anhu) mentioned Heraclius in a long Hadith and said: Heraclius asked me, “What does this Prophet ﷺ teach you?” I said, “He orders us to worship Allah Alone and not to associate a thing with Him in worship, to discard what our ancestors said, to perform the Salat (prayer), speak the truth, and maintain the ties of kinship”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో ఏకదైవారాధనా ప్రస్తావనతోపాటు ఉత్తమ గుణగణాలు కూడా పొందుపరచపడ్డాయి. ఆరాధనలన్నిటిలో సామూహికంగా నమాజు చేయటమనేది చాలా ముఖ్యమైన ఆరాధన. అదేవిధంగా సత్యం పలకటమనేది మనిషి నైతికతకు, ఉత్తమ నడవడికకు నిదర్శనం. ఒక ముస్లిం దేవునిపై, దైవప్రవక్తలపై విశ్వాసం ప్రకటించిన తరువాత ఆరాధనలన్నిటినీ తు.చ. తప్పకుండా పాటిస్తూ తన్ను తాను ఉత్తమ నడవడికకు నిదర్శనంగా మలచుకోవాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|40. తల్లిదండ్రుల యెడల గౌరవాన్ని కలిగి ఉండాలి. బంధువుల హక్కులను నెరవేర్చాలి.|హదీసు 329

330

హదీసు 330

وعن أَبي ذر رضي اللَّه عنه قَالَ: قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِنَّكُم ستفْتَحُونَ أَرْضاً يُذْكَرُ فِيهَا القِيرَاطُ". وفي روايةٍ: "ستفْتحُونَ مصْر وهِي أَرْضٌ يُسَمَّى فِيها القِيراطُ، فَاستَوْصُوا بِأَهْلِها خيْراً، فَإِنَّ لَهُمْ ذِمة ورحِماً". وفي روايةٍ: "فإِذا افْتتَحتُموها، فَأَحْسِنُوا إِلى أَهْلِهَا، فَإِنَّ لهُم ذِمَّةً ورحِماً "أَو قَالَ "ذِمَّةً وصِهراً" رواه مسلم. قَالَ العُلَماءُ: الرَّحِمُ الَّتي لهُمْ كَوْنُ هَاجَر أُمُّ إِسْماعِيلَ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم مِنْهمْ."والصِّهْرُ": كونُ مارِية أُمِّ إِبراهِيمَ ابنِ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم منهم.

హజ్రత్ అబూజర్ర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉద్బోధించారు: "త్వరలోనే మీరు ఒక ప్రాంతాన్ని జయించనున్నారు. అక్కడ ఖీరాత్ (అనే పదం) వాడబడుతుంది. వేరొక ఉల్లేఖనం ప్రకారం, "త్వరలోనే మీరు ఈజిప్ట్‌ను జయిస్తారు. అది ఖీరాత్ (అనే పదం) వ్యవహరించబడే ప్రాంతం. మీరు (ఆ ప్రాంతాన్ని స్వాధీనపరచుకున్న తరువాత) అక్కడి ప్రజలపట్ల మంచిగా వ్యవహరించండి. ఎందుకంటే వారికి మనపై హక్కు ఉంది. (ఇంకా) వారికి మనకూ బంధుత్వమూ ఉంది." వేరొక ఉల్లేఖనం ప్రకారం, "మీరు ఆ ప్రాంతాన్ని జయించినప్పుడు అక్కడి ప్రజల పట్ల ఉత్తమంగా వ్యవహరించండి. ఎందుకంటే వారికి మనపై హక్కు ఉంది. (ఇంకా) వారికీ – మనకూ బంధుత్వం ఉంది లేదా ఆయన "వారికి మనపై హక్కు ఉంది. (అలాగే) అత్తవారి బంధుత్వమూ ఉంది" అని అన్నారు.

(ముస్లిం)

దైవప్రవక్త హజ్రత్ ఇస్మాయీల్ (అలైహి) తల్లి హాజిరా (అలైహి) ఆ ప్రాంతానికి చెందినవారు కావటం చేత వారితో బంధుత్వమేర్పడింది, అదేవిధంగా దైవప్రవక్త కుమారులు ఇబ్రాహీంకు తల్లి అయిన మారియా (రదియల్లాహు అన్హా) కూడా ఆ ప్రాంతానికే చెందినవారు కావటం చేత వారితో అత్తవారి బంధుత్వమూ ఉందని విద్వాంసులు అభిప్రాయపడ్డారు.

(సహీహ్ ముస్లింలోని ప్రవక్త సహచరుల మహిమోన్నతుల ప్రకరణం)

English

Abu Dharr (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “You will soon conquer a land where people deal with Qirat.”

And according to another version: Messenger of Allah ﷺ said, “You will soon conquer Egypt where Al-Qirat is frequently mentioned. So when you conquer it, treat its inhabitants well. For there lies upon you the responsibility because of blood ties or relationship (with them)”.[Muslim].

ముఖ్యాంశాలు

దీనారు, దిర్హముల మాదిరిగానే 'ఖీరాత్' కూడా ఒక రకమైన నాణెం. ఇది దీనారు, దిర్హములలో ఒక భాగం. దిర్హంలో, ఓ చిన్న భాగాన్ని 'దానిఖ్' అంటారు. దానిఖ్‌లో సగమే ఈ ఖీరాత్. ఆ కాలంలో ఈజిప్టులో ఇది చాలా వాడుకలో ఉండేది. ఈ హదీసులో ముస్లింలకు ఈజిప్ట్ ప్రజలతో రెండు విధాలుగానూ బంధుత్వం ఉన్నందువల్ల వారిపట్ల ఉత్తమంగా వ్యవహరించాలని తాకీదు చేయబడింది. అందుకే ఈ హదీసును ఈ అధ్యాయం క్రింద ప్రస్తావించటం జరిగింది. దైవప్రవక్త ﷺ చెప్పినట్లుగా ఆయన తదనంతరం అనతికాలంలోనే ముస్లింలు ఈజిప్ట్‌ను జయించారు. ఇది ఆయన భవిష్యత్ ప్రకటనల్లోని సత్యసంధతకు ప్రబల నిదర్శనం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|40. తల్లిదండ్రుల యెడల గౌరవాన్ని కలిగి ఉండాలి. బంధువుల హక్కులను నెరవేర్చాలి.|హదీసు 330

331

హదీసు 331

وعن أبي هريرةَ رضي اللَّه عنه قَالَ: لما نزلَتْ هذِهِ الآيَةُ: {وَأَنْذِرعشِيرتكَ الأَقربِينَ} [الشعراء: ٢١٤] دعارسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قُرَيْشَا فاجْتَمعُوا فَعَمَّ، وخَصَّ وَقالَ: "يَا بَني عبدِ شَمسٍ، يا بَنِي كَعْب بنِ لُؤَي، أَنقِذُوا أَنْفُسَكُمْ مِنَ النَّارِ، يَا بَنِي مُرَّةَ بنِ كْعبٍ، أَنْقِذُوا أَنفُسَكُمْ مِن النَّار، يَا بَنِي عبْدِ مَنَافٍ، أَنْقِذُوا أَنْفُسَكُمْ مِنَ النَّارِ، يَا بَني هاشِمٍ أَنقِذُوا أَنْفُسكُمْ مِنَ النَّارِ، يَا بني عبْدِ المطَّلِبِ أَنْقِذُوا أَنْفُسكُمْ مِن النَّارِ، يَا فاطِمَة أَنْقِذي نفْسَكَ منَ النَّار، فَإِني لا أَمْلِكُ لَكُمْ منَ اللَّه شيْئاً، غَيْر أَنَّ لَكُمْ رحِماً سأَبلُّهَا بِبِلالِها" رواه مسلم. قوله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"بِبِلالِهَا"هُوَ بفتحِ الباءِ الثَّانِيةِ وكَسرهَا"والبِلالُ"الماءُ. ومعنى الحديث: سأَصِلُهَا، شبَّهَ قَطِيعَتَهَا بالحرارةِ تُطْفَأُ بالماءِ وهذِهِ تُبَرَّدُ بالصِّلةِ.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం : "(ప్రవక్తా!) నీ దగ్గరి బంధువులను భయపెట్టు" అన్న దివ్య ఖుర్‌ఆన్ సూక్తి (అష్ షూరా : 214) అవతరించినప్పుడు దైవప్రవక్త ﷺ ఖురైషులందరినీ పిలిచారు. దాంతో (ఖురైష్ తెగకు చెందిన) సామాన్యులు, ప్రముఖులందరూ ఒకచోట సమావేశమయ్యారు. అప్పుడు ఆయన తన తెగవారికి దైవసందేశాన్ని అందజేస్తూ ఇలా అన్నారు :

"ఓ అబ్దె షమ్స్ వంశీయులారా! ఓ కాబ్ బిన్ లుఅయ్యి వంశీయులారా! మిమ్మల్ని మీరు నరకాగ్ని బారినుండి కాపాడుకోండి. హాషిం వంశీయులారా! మిమ్మల్ని మీరు నరకాగ్ని బారినుండి కాపాడుకోండి. అబ్దుల్ ముత్తలిబ్ వంశీయులారా! మిమ్మల్ని మీరు నరకాగ్ని బారినుండి రక్షించుకోండి. ఓ ఫాతిమా! నిన్ను నీవు నరకజ్వాలల నుంచి కాపాడుకో. ఎందుకంటే దైవశిక్ష నుండి మిమ్మల్ని కాపాడటానికి నాకు ఎలాంటి అధికారం లేదు. అయితే మీకు నాతో బంధుత్వం ఉంది కనుక (ఇహలోకంలో ఉన్నంతకాలం) బంధుత్వ సంబంధాలను మాత్రం కొనసాగిస్తాను." (ముస్లిం)

'బిలాల్' అంటే 'నీళ్ళు'అని అర్థం. 'సఅబుల్లుహా బిబిలాలిహా' అంటే నేను బంధుత్వ సత్సంబంధాలను కొనసాగిస్తానని అర్థం. ఈ హదీసులో దైవప్రవక్త ﷺ బంధుత్వ తెగత్రెంపుల్ని మంటతో పోల్చారు. మంటల్ని నీటితో చల్లారుస్తారు. అదేవిధంగా బంధుత్వ తెగత్రెంపుల మంటల్ని బంధుప్రేమతో చల్లార్చవచ్చు.

(సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: When this Verse was revealed: “And warn your tribe (O Muhammad ﷺ) of near kindred”. (26:214) Messenger of Allah ﷺ called the Quraish; when they gathered, he said to them: “O sons of `Abd Shams; O sons of Ka`b bin Lu’ai, rescue yourselves from the Fire! O sons of Murrah bin Ka`b, rescue yourselves from the Fire! O sons of `Abd Manaf, rescue yourselves from the Fire! O sons of `Abdul-Muttalib, rescue yourselves from the Fire! O Fatimah, rescue yourself from the Fire, for I have no power (to protect you) from Allah in anything except that I would sustain relationship with you”.[Muslim].

ముఖ్యాంశాలు

  1. పరలోకంలో దేవుని సన్నిధిలో వంశగౌరవాలకు, పరువుప్రతిష్ఠలకు ఎలాంటి విలువా ఉండదు. ఆఖరికి మహాప్రవక్త ముహమ్మద్ ﷺ బంధువులకు కూడా దీని నుండి మినహాయింపు లేదు. అక్కడ కేవలం విశ్వాసం మరియు సదాచరణల ప్రాతిపదికపైనే ఎవరికైనా విముక్తి లభిస్తుంది. దైవప్రవక్త మరియు ఇతర పుణ్యాత్ములు సిఫారసు చేస్తారు. కాని వారు ఎవరికోసం సిఫారసు చేస్తారు? దేవుడు ఎవరి కోసం అనుమతిస్తే వారికోసం మాత్రమే చేస్తారు. ఈ అనుమతి కూడా విశ్వాసులైన పాపాత్ములకే లభిస్తుందని గ్రహించాలి. బహుదైవారాధకులకు, దైవతిరస్కారులకు విముక్తి లభించదు. వారు పుణ్యాత్ములు చేసే సిఫారసు భాగ్యానికీ నోచుకోలేరు.
  2. సత్య సందేశ ప్రచార కార్యక్రమాన్ని సన్నిహిత బంధువులతోనే మొదలుపెట్టాలి. వారికి ధర్మ సందేశాన్ని, దేవుని ఆదేశాలను గురించి బోధించాలి.
  3. బంధువులు బహుదైవారాధకులైనా, దైవతిరస్కారులైనా సరే వారితో సత్సంబంధాలు కొనసాగించటంలో మాత్రం ఎలాంటి లోటు రానీయకూడదు.. వారి హక్కుల్ని నిర్వర్తిస్తూ ఉండాలి. వారికున్న ప్రప్రథమ హక్కు ఏమిటంటే వారికి విశ్వాసాన్ని, సదాచరణను బోధించి పరలోకంలో వారిని నరకాగ్ని బారినుంచి కాపాడాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|40. తల్లిదండ్రుల యెడల గౌరవాన్ని కలిగి ఉండాలి. బంధువుల హక్కులను నెరవేర్చాలి.|హదీసు 331

332

హదీసు 332

وعن أَبي عبد اللَّه عمرو بن العاص رضي اللَّه عنهما قَالَ: سمعتُ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم جِهاراً غيْرَ سِرٍّ يَقُولُ: "إِنَّ آلَ بَني فُلانٍ لَيُسُوا بأَوْلِيائي إِنَّما وَلِيِّي اللَّهُ وصالحُ المؤْمِنِين، ولَكِنْ لَهُمْ رحِمٌ أَبُلُّها بِبِلالِها" مُتَّفَقٌ عَلَيهِ. واللَّفظُ للبخاري.

దైవప్రవక్త ﷺ మెల్లిగా కాకుండా బిగ్గరగా, "ఫలానా తెగవారు నా మిత్రులు కాజాలరు. దేవుడు మరియు సదాచార సంపన్నులైన విశ్వాసులే నా మిత్రులు. అయితే ఆ తెగవారితో నాకు బంధుత్వముంది. కనుక నేను బంధుత్వ సత్సంబంధాలను మాత్రం తప్పకుండా కొనసాగిస్తాను" అని ప్రకటిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూ అబ్దుల్లాహ్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) తెలియజేశారు. (బుఖారీ – ముస్లిం, వాక్యాలు మాత్రం బుఖారీలోనివి)

(సహీహ్ బుఖారీలోని సంస్కార ప్రకరణం, సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణం)

English

Abu Abdullah `Amr bin Al-`as (radiyallahu anhuma) said: I heard Messenger of Allah ﷺ saying openly not secretly, “The family of so-and-so (i.e., Abu Talib) are not my supporters. My supporter is Allah and the righteous believing people. But they (that family) have kinship (Rahm) with whom I will maintain good the ties of kinship”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

హదీసులో ఫలానా తెగవారంటే దైవప్రవక్త గారి అవిశ్వాసులైన సన్నిహిత బంధువులని అర్థం. తనకు వారితో బంధుత్వమున్నప్పటికీ తాను వారిని మనస్ఫూర్తిగా ప్రేమించటం లేదని, అలాంటి దైవతిరస్కారులు తనకు మిత్రులు కాజాలరని ఆయన స్పష్టంగా చెప్పేశారు. విశ్వాసికి – దైవతిరస్కారికి మధ్య మైత్రి అసంభవం. నిజమైన విశ్వాసి అయిన వ్యక్తి అల్లాహ్‌ను, ఆ తరువాత అల్లాహ్‌ను విశ్వసించిన సదాచార సంపన్నులనే ప్రేమిస్తాడు. వారినే తన మిత్రులుగా చేసుకుంటాడు. అయితే బంధువులెవరయినా అవిశ్వాసులుగా, దైవతిరస్కారులుగా ఉన్నట్లయితే వారితో బంధుత్వ సంబంధాలను కొనసాగిస్తూ వారిపట్ల ఉత్తమంగా వ్యవహరించటం మాత్రం తప్పదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|40. తల్లిదండ్రుల యెడల గౌరవాన్ని కలిగి ఉండాలి. బంధువుల హక్కులను నెరవేర్చాలి.|హదీసు 332

333

హదీసు 333

وعن أَبي أَيُّوب خالدِ بن زيدٍ الأنصاري رضي اللَّه عنه أَن رجلاً قَالَ: يَا رسولَ اللَّه أَخْبِرْني بِعملٍ يُدْخِلُني الجنَّةَ، وَيُبَاعِدني مِنَ النَّارِفقال النبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"تعبُدُ اللَّه، وَلاَ تُشْرِكُ بِهِ شَيْئاً، وَتُقِيمُ الصَّلاَةَ، وتُؤتي الزَّكاةَ، وتَصِلُ الرَّحِم" متفقٌ عَلَيهِ.

హజ్రత్ అబూ అయ్యూబ్ ఖాలిద్ బిన్ జైద్ అన్సారీ (రదియల్లాహు అన్హు) కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్తను, "నాకు నరకం నుండి దూరం చేసి స్వర్గానికి గొనిపోయే ఆచరణ గురించి తెలియజెయ్యండ'ని అడిగాడు. దానికాయన, "అల్లాహ్‌ను (మాత్రమే) ఆరాధించు. ఆయనకు సహవర్తులుగా ఎవరినీ నిలబెట్టకు. నమాజును స్థాపించు. జకాత్ (విధి దానం) చెల్లించు. బంధువులతో సత్సంబంధాలు పెట్టుకో" అని ఆ వ్యక్తికి ఉపదేశించారు. (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని జకాత్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణం)

English

Abu Ayyub Khalid bin Zaid Al-Ansari (radiyallahu anhu) reported: A man came to Messenger of Allah ﷺ and said, “Direct me to a deed which will admit me to Jannah and take me away from the Fire”. The Messenger of Allah ﷺ said, “Worship Allah and associate no partner with Him, perform As-Salat, pay Zakat, and maintain the ties of kinship”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ప్రజలు పరలోకంలో తమల్ని తాము నరకాగ్ని బారినుంచి రక్షించుకొని స్వర్గంలోకి ప్రవేశించే అర్హత పొందటానికి చేయవలసిన పనులేమిటో ఈ హదీసు ప్రబోధిస్తోంది. స్వర్గంలోకి ప్రవేశించటానికి ఈ పనులు చేయటం చాలా అవసరం. అందువల్ల విశ్వసించకుండా, సత్కార్యాలు చేయకుండా ఒకరి సిఫారసుతో స్వర్గం లభిస్తుందని కనే కలలు పరలోకంలో కల్లలౌతాయని ప్రతి ఒక్కరూ గ్రహించాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|40. తల్లిదండ్రుల యెడల గౌరవాన్ని కలిగి ఉండాలి. బంధువుల హక్కులను నెరవేర్చాలి.|హదీసు 333

334

హదీసు 334

وعن سلْمان بن عامرٍ رضي اللَّه عنه، عن النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إِذا أَفْطَرَ أَحَدُكُمْ فَلْيُفْطِرْ عَلَى تَمرٍ، فَإِنَّهُ بركَةٌ، فَإِنْ لَمْ يجِد تَمْراً، فَالماءُ، فَإِنَّهُ طُهُورٌ" وَقالَ:" الصَّدقَةُ عَلَى المِسكِينِ صدقَةٌ، وعَلَى ذِي الرَّحِمِ ثِنْتَانِ: صَدَقَةٌ وصِلَةٌ". رواه الترمذي وَقالَ: حديث حسن.

హజ్రత్ సల్మాన్ బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : మీలో ఎవరైనా (ఇఫ్తార్ సమయంలో) ఉపవాసాన్ని విరమిస్తున్నప్పుడు ఖర్జూర పండుతో విరమించాలి. ఎందుకంటే ఖర్జూర పండులో శుభం ఉంది. ఖర్జూర పండు దొరక్కపోతే నీళ్ళతో ఉపవాసాన్ని విరమించుకోవాలి. ఎందుకంటే నీరు పరిశుభ్రం చేసే వస్తువు.

ఆయన ఇంకా ఇలా అన్నారు : ఒక అభాగ్యుడికి చేసే దానం (సామాన్య) దానంగా పరిగణించబడుతుంది. కాని (అభాగ్యుడైన) బంధువుకు చేసే దానం రెండు విధాలుగా ప్రయోజనకరమైనది. ఒకటి : అది దానంగా పరిగణించబడుతుంది. రెండు : బంధుప్రేమతో ఇచ్చినట్లుగా కూడా ఉంటుంది. (దీనిని తిర్మిజీ ఉల్లేఖించి హసన్‌గా పేర్కొన్నారు)

(జామె తిర్మిజీలోని జకాత్ అధ్యాయం)

English

Salman bin `Amir (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “When you break fast, you should do it with a date-fruit for there is blessing in it, and if you do not find a date-fruit, break it with water for it is pure.” Messenger of Allah ﷺ added: “Charity towards a poor person is charity, and towards a relation is both charity and maintaining the ties (of kinship)”.[Tirmidhi].

ముఖ్యాంశాలు

  1. ఖర్జూర పండుతోగాని, నీళ్ళతోగాని ఉపవాస విరమణ (ఇఫ్తార్) చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది.
  2. నిరుపేదలు, అభాగ్యులైన బంధువులకు దానాలు చేయటం వల్ల రెట్టింపు పుణ్యం దొరుకుతుంది. సాధారణంగా ప్రజలు తమ సన్నిహిత బంధువుల్ని విస్మరించి ఇతరులకు దానధర్మాలు చేస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. దానధర్మాలు చేసినప్పుడు సన్నిహిత బంధువులకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|40. తల్లిదండ్రుల యెడల గౌరవాన్ని కలిగి ఉండాలి. బంధువుల హక్కులను నెరవేర్చాలి.|హదీసు 334

335

హదీసు 335

وعن ابن عمر رضي اللَّه عنهما قَالَ: كَانَتْ تَحتي امْرأَةٌ، وكُنْتُ أُحِبُّها، وَكَانَ عُمرُ يكْرهُهَا، فَقَالَ لي: طَلِّقْها فأبيْتُ، فَأَتَى عَمرُ رضي اللَّه عنه النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَذَكر ذلكَ لَهُ، فَقَالَ النبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"طَلِّقْهَا "رواه أَبو داود، والترمذي وقال: حديث حسن صحيح.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: ఒక స్త్రీ నా దాంపత్యంలో ఉండేది. ఆమె అంటే నాకు (చాలా) ఇష్టం. కాని ఆమె నా భార్యగా ఉండటం ఉమర్ (అంటే మా నాన్న)కు యిష్టముండేది కాదు. ఆయన నన్ను "ఆమెకు విడాకులివ్వు"అని ఆదేశించారు. కాని నేను ఆమెకు విడాకులివ్వటానికి నిరాకరించాను. అప్పుడు ఉమర్ దైవప్రవక్త ﷺ దగ్గరికి వెళ్ళి, ఆయనకు ఈ విషయం తెలియజేశారు. తరువాత దైవప్రవక్త నన్ను (పిలిచి) "ఆమెకు విడాకులిచ్చెయ్యి" అని ఆజ్ఞాపించారు. (దీనిని అబూదావూద్ మరియు తిర్మిజీలు ఉల్లేఖించారు. ఇంకా తిర్మిజీ దీనిని 'హసన్' మరియు 'సహీహ్'గా పేర్కొన్నారు).

(జామె తిర్మిజీలోని విడాకుల ప్రకరణం, సుననె అబూదావూద్‌లోని సంస్కార ప్రకరణం)

English

Ibn `Umar (radiyallahu anhuma) reported: I had a wife whom I loved but `Umar (radiyallahu anhu) disliked her. He asked me to divorce her and when I refused, `Umar (radiyallahu anhu) went to Messenger of Allah ﷺ and mentioned the matter to him. Messenger of Allah ﷺ asked me to divorce her.[At-Tirmidhi and Abu Dawud].

ముఖ్యాంశాలు

ధార్మిక, నైతిక ప్రయోజనాల దృష్ట్యా తల్లిదండ్రులు తమ కుమారుడ్ని భార్యకు విడాకులిచ్చెయ్యమని ఆదేశిస్తే వారి ఆదేశాన్ని పాటించటం తప్పనిసరి అవుతుంది. ఇతర ఉద్దేశ్యాలతో ఇలాంటి ఆదేశమిస్తే దాన్ని పాటించాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులకు నచ్చజెప్పి వారిని ఒప్పించాలి. ప్రతి చిన్న విషయానికీ భార్యకు విడాకులిచ్చి అన్యాయానికి పాల్పడటం ఎంతమాత్రం తగదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|40. తల్లిదండ్రుల యెడల గౌరవాన్ని కలిగి ఉండాలి. బంధువుల హక్కులను నెరవేర్చాలి.|హదీసు 335

336

హదీసు 336

وعن أبي الدَّرْادءِ رضي اللَّه عنه أَن رَجُلاً أَتَاهُ فقال: إِنَّ لي امْرَأَةً وإِن أُمِّي تَأْمُرُني بِطَلاَقِها؟ فَقَالَ سَمِعْتُ رَسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقولُ "الْوالِدُ أَوْسطُ أَبْوابِ الجَنَّةِ، فَإِنْ شِئْتَ فَأَضِعْ ذلِك الْبابَ، أَوِ احفظْهُ" رواه الترمذي وَقالَ: حديثٌ حسنٌ صحيح.

హజ్రత్ అబూ దర్దా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి, "నాకో భార్య ఉంది. నా తల్లి ఆమెకు విడాకులిచ్చెయ్యమని ఆదేశిస్తోంది (ఇప్పుడు నేనేం చేయాలి)?" అని అడిగాడు.

దానికి జవాబుగా అబూ దర్దా (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచిస్తుండగా తాను విన్నానని తెలియజేశారు : తండ్రి స్వర్గ ద్వారాలన్నింటిలో మధ్య ద్వారంలాంటివాడు. నీ కిష్టమయితే ఆ ద్వారాన్ని నాశనం చేసుకో లేదా కాపాడుకో." (దీనిని తిర్మిజీ ఉల్లేఖించి హసన్ మరియు సహీహ్‌గా పేర్కొన్నారు.)

(జామె తిర్మిజీలోని సత్కార్యాలు – సత్సంబంధాల అధ్యాయం)

English

Abud-Darda’ (radiyallahu anhu) reported: A man came to me and said, “I have a wife whom my mother commands me to divorce”. I replied him that I had heard Messenger of Allah ﷺ saying, “A parent is the best of the gates of Jannah; so if you wish, keep to the gate, or lose it.”[At-Tirmidhi and Ibn Majah].

ముఖ్యాంశాలు

పై హదీసులో వచ్చిన వ్యక్తి తల్లి గురించి అడిగితే హజ్రత్ అబూ దర్దా (రదియల్లాహు అన్హు) తండ్రి గురించి సమాధానమిచ్చినట్లు అనిపిస్తుంది. హదీసులో ఆయన 'వాలిద్' అన్న పదాన్ని వాడారు. వాలిద్ అంటే జన్మనిచ్చినవాడు, జన్మనిచ్చినవారంటే తల్లి అయినా కావచ్చు లేదా తండ్రి అయినా కావచ్చు. ఈ హదీసులో కూడా కన్నవారి విధేయతకు ప్రాధాన్యతనివ్వాలని చెప్పబడింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|40. తల్లిదండ్రుల యెడల గౌరవాన్ని కలిగి ఉండాలి. బంధువుల హక్కులను నెరవేర్చాలి.|హదీసు 336

337

హదీసు 337

وعن البراءِ بن عازبٍ رضي اللَّه عنهما، عن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "الخَالَةُ بِمَنْزِلَة الأُمِّ" رواه الترمذي: وَقالَ حديثٌ حسن صحيح. وفي الباب أَحاديث كِثيرة في الصحيح مشهورة، مِنْهَا حديث أَصحابِ الغارِ، وحديث جُرَيْجٍ وقَدْ سَبَقَا، وأَحاديث مشهورة في الصحيح حَذَفْتُهَا اخْتِصاراً، وَمِنْ أَهَمِّهَا حديثُ عمْرو بن عَبسَةَ رضي اللَّه عنه الطَّوِيلُ المُشْتَمِلُ عَلَى جُمَلٍ كَثيرةٍ مِنْ قَوَاعِدِ الإِسْلامِ وآدابِهِ وَسَأَذْكُرُهُ بِتَمَامِهِ إِن شَاءَ اللَّه تَعَالَى في بابِ الرَّجَاءِ، قَالَ فِيهِ. دَخَلْتُ عَلى النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم بِمَكَّةَ، يَعْني في أَوَّل النُبُوَّةِ، فقلتُ له: ما أَنتَ؟ قال: "نَبيٌّ"فقلتُ: ومانبيٌّ؟ قَالَ:"أَرسلَني اللَّهُ تَعَالَى، فقلتُ: بِأَيِّ شَيءٍ أَرْسلَك؟ قَالَ:"أَرْسلَني بِصِلةِ الأَرْحامِ، وكَسْرِ الأوثَانِ، وأَنْ يُوحَّدَ اللَّه لاَ يُشرَكُ بِهِ شَيءٌ" وذكر تَمامَ الحديث. واللَّه أعلم.

హజ్రత్ బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ "పినతల్లికి తల్లి స్థానముంది" అని ప్రవచించారు. దీనిని తిర్మిజీ ఉల్లేఖించి హసన్ మరియు సహీహ్‌గా పేర్కొన్నారు.

(ఇమామ్ నవవీ రహిమహుల్లాహ్ ఇలా అంటున్నారు) 'సహీహ్'లో ఈ అధ్యాయానికి సంబంధించిన సుప్రసిద్ధమైన హదీసులెన్నో ఉన్నాయి. వాటిలో ఇంతకు ముందు వచ్చిన గుహ వారి కథ, జురైజ్ కథలున్న హదీసులు కూడా పేర్కొనదగినవి.

ఇవేగాకుండా ప్రసిద్ధమైన హదీసులు ఇంకా చాలా ఉన్నాయి గాని (అధ్యాయాన్ని) సంక్షిప్తం చేసే ఉద్దేశ్యంతో నేను వాటిని ప్రస్తావించకుండా వదలివేస్తున్నాను. వాటిలో అత్యంత ముఖ్యమైనది హజ్రత్ అమ్ర్ బిన్ అబసా హదీసు. అది చాలా సుదీర్ఘమైన హదీసు. అందులో ఇస్లామీయ నియమావళి, సభ్యతా సంస్కారాల గురించిన అనేక వాక్యాలున్నాయి. ఇన్షా అల్లాహ్ ఆ హదీసు మొత్తం నేను 'బాబుర్రజా'లో ప్రస్తావిస్తాను. ఆ హదీసులో హజ్రత్ అమ్ర్ బిన్ అబసా (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేశారు :

దైవప్రవక్త ﷺకు ప్రవక్త పదవి లభించిన తొలినాళ్ళలో నేనొకసారి మక్కా వెళ్ళాను. అప్పుడు నేనాయనతో మాట్లాడుతూ, "మీరెవరు?" అని అడిగాను. ఆయన "దైవప్రవక్తను" అని అన్నారు. తిరిగి నేను "దైవప్రవక్త అంటే ఏమిటి?" అని అడిగాను. దానికాయన "(ప్రజలను సన్మార్గం చూపటం కోసం దైవం తరపునుండి పంపబడేవానిని దైవప్రవక్త అని అంటారు) దేవుడు నన్ను ప్రవక్తగా నియమించి పంపాడు" అని అన్నారు. "దేవుడు మిమ్మల్ని ఏ లక్ష్యం కోసం పంపించాడు" అని నేను మళ్ళీ అడిగాను. "బంధువుల మధ్య సత్సంబంధాలను నెలకొల్పటం కోసం, విగ్రహాలను పడగొట్టడం కోసం, ఇంకా ఒకే దేవుడు పూజింపబడటం కోసం, (ప్రజలు) ఆయనకు సహవర్తులుగా ఎవరినీ నిలబెట్టకుండా ఉండటం కోసం దేవుడు నన్ను పంపించాడు" అని అన్నారు దైవప్రవక్త ﷺ.

(సుననె తిర్మిజీలోని సత్కార్యాలు – సత్సంబంధాల ప్రకరణం)

English

Al-Bara’ bin `Azib (radiyallahu anhuma) reported: I heard the Prophet ﷺ saying: “A mother’s sister is equivalent to (real) mother (in status)”.[At-Tirmidhi]

ముఖ్యాంశాలు

పినతల్లికి తల్లి స్థానముందంటే అర్థం తల్లిని గౌరవించినట్లుగానే పినతల్లినీ గౌరవించాలి. ఆమె పట్ల కూడా ఉత్తమంగా వ్యవహరించాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|40. తల్లిదండ్రుల యెడల గౌరవాన్ని కలిగి ఉండాలి. బంధువుల హక్కులను నెరవేర్చాలి.|హదీసు 337