హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 39. ఇరుగుపొరుగువారి హక్కుల్ని నెరవేర్చాలి

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 39వ అధ్యాయం: ఇరుగుపొరుగువారి హక్కుల్ని నెరవేర్చాలి, వారిపట్ల సద్భావంతో మెలగాలి. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 9 హదీసులు (హదీసు 305 – 313) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

39. ఇరుగుపొరుగువారి హక్కుల్ని నెరవేర్చాలి, వారిపట్ల సద్భావంతో మెలగాలి

↑ విషయ సూచిక

باب حق الجار والوصية بِهِ

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు:

{وَاعْبُدُوا اللَّهَ وَلا تُشْرِكُوا بِهِ شَيْئاً وَبِالْوَالِدَيْنِ إِحْسَاناً وَبِذِي الْقُرْبَى وَالْيَتَامَى وَالْمَسَاكِينِ وَالْجَارِذِي الْقُرْبَى وَالْجَارِ الْجُنُبِ وَالصَّاحِبِ بِالْجَنْبِ وَابْنِ السَّبِيلِ وَمَا مَلَكَتْ أَيْمَانُكُمْ} [النساء:٣٦]

"మీరంతా అల్లాహ్‌కు దాస్యం చేయండి. ఎవరినీ ఆయనకు భాగస్వాములుగా చేయకండి. తల్లిదండ్రుల ఎడల సద్భావంతో మెలగండి. బంధువులూ, అనాధలూ, నిరుపేదల పట్ల మంచిగా వ్యవహరించండి. పొరుగున ఉన్న బంధువులు, అపరిచితులైన పొరుగువారు, ప్రక్కనున్న మిత్రులు, బాటసారులు, మీ అధీనంలో ఉన్న దాసదాసీ జనం పట్ల ఉదార బుద్ధితో వ్యవహరించండి." (అన్ నిసా : 36)

English

“Worship Allah and join none with Him (in worship); and do good to parents, kinsfolk, orphans, Al-Masakin (the poor), the neighbour who is near of kin, the neighbour who is a stranger, the companion by your side, the wayfarer (you meet), and those (slaves) whom your right hands possess.” [An-Nisā’ 4:36]

305

హదీసు 305

وعن ابنِ عمرَ وعائشةَ رضي اللَّه عنهما قَالا: قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَا زَالَ جِبْرِيلُ يُوصِينِي بِالجارِ حتَّى ظَنَنتُ أَنَّهُ سيُوَرِّثُهُ" متفقٌ عَلَيهِ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) మరియు హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా)ల కథనాల ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు: జిబ్రయీల్ నాకు మాటిమాటికీ పొరుగువాని (హక్కుల) గురించి ఎంతగా తాకీదు చేశారంటే, అది చూసి నాకు ఆస్తిలో (కూడా) ఆయన పొరుగువాణ్ణి వాటాదారుడిగా ఖరారు చేస్తారేమోననిపించింది. (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని సంస్కార ప్రకరణం, సహీహ్ ముస్లింలోని సత్కార్యాలు – సత్సంబంధాల ప్రకరణం)

English

Ibn `Umar and `Aishah (radiyallahu anhuma) reported: Messenger of Allah ﷺ said, “Jibril kept recommending treating neighbours with kindness until I thought he would assign a share of inheritance”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసు ద్వారా ఇస్లాంలో ఇరుగుపొరుగువారి హక్కులకు ఎంతటి ప్రాముఖ్యం ఉందో తెలుస్తోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|39. ఇరుగుపొరుగువారి హక్కుల్ని నెరవేర్చాలి, వారిపట్ల సద్భావంతో మెలగాలి|హదీసు 305

306

హదీసు 306

وعن أَبي ذرٍّ رضي اللَّه عنه قَالَ: قَالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "يَا أَبَا ذَرٍّ إِذا طَبَخْتَ مَرَقَةً، فَأَكْثِرْ مَاءَها، وَتَعَاهَدْ جِيرَانَكَ" رواه مسلم. وفي رواية لَهُ عن أَبي ذر قَالَ: إنّ خليلي صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أَوْصَانِي: "إِذا طبخْتَ مَرَقاً فَأَكْثِرْ مَاءَهُ ثُمَّ انْظُرْ أَهْلَ بَيْتٍ مِنْ جِيرانِكَ، فَأَصِبْهُمْ مِنْهَا بِمعْرُوفٍ".

హజ్రత్ అబూజర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ తనకు ఇలా ఉపదేశించారు : "అబూజర్! నువ్వు చారు వండితే అందులో నీళ్ళు (కొంచెం) ఎక్కువ పోయి. ఇరుగు పొరుగు వారిని గుర్తుంచుకో. (ముస్లిం)

ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో హజ్రత్ అబూజర్ (రదియల్లాహు అన్హు) కథనం ఇలా ఉంది : "నీవు చారు వండితే అందులో నీళ్ళు ఎక్కువగా పొయ్యి. తరువాత ఇరుగు పొరుగువారి ఇండ్లలో ఎంతమంది సభ్యులున్నారో అంచనా వేసుకొని తగురీతిలో వారికి కూడా దాంట్లో నుండి కొంత (కానుకగా) ఇవ్వు" అని నా మిత్రులు (దైవప్రవక్త -స) నాకు తాకీదు చేశారు.

(సహీహ్ ముస్లింలోని సత్కార్యాలు – సత్సంబంధాల ప్రకరణం)

English

Abu Dharr (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ commanded me thus, “O Abu Dharr! Whenever you prepare a broth, put plenty of water in it, and and give some of it to your neighbours”.[Muslim].

In another narration of Muslim, narrated Abu Dharr (radiyallahu anhu): My friend, (Messenger of Allah ﷺ) advised me saying, “Whenever you prepare a broth, put plenty of water in it, and give some to your neighbours and then give them out of this with courtesy.”

ముఖ్యాంశాలు

ఇరుగుపొరుగు వారు ఆకలితో అలమటిస్తుంటే తాను మాత్రం రుచికరమైన వంటకాలతో సుష్టుగా భోంచేయటం ఎంతో అవాంఛనీయమైన చేష్ట అనిపించుకుంటుంది. మనిషి తన ఇంటి సుఖంతోపాటు నిరుపేదలు, అభాగ్యులైన తన ఇరుగుపొరుగువారి కష్టసుఖాలను గురించి కూడా ఆలోచించాలి. స్థోమత ఉన్నవారు తమ ఇరుగుపొరుగువారికి చేతనయినంత సహాయం చెయ్యాలి. ఏమీ లేనివారైతే కనీసం కూరలు లాంటివి వండుకున్నప్పుడు నీళ్ళు ఎక్కువ పోసి వండవలసి వచ్చినాసరే అందులో కొంత ఇరుగుపొరుగువారికి కూడా పంపాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|39. ఇరుగుపొరుగువారి హక్కుల్ని నెరవేర్చాలి, వారిపట్ల సద్భావంతో మెలగాలి|హదీసు 306

307

హదీసు 307

وعن أَبي هريرة رضي اللَّه عنه أَن النَّبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "واللَّهِ لاَ يُؤْمِنُ، واللَّهِ لاَ يُؤْمِنُ،"قِيلَ: منْ يارسولَ اللَّهِ؟ قَالَ:"الَّذي: لاَ يأْمنُ جارُهُ بَوَائِقَهُ،" مُتَّفَقٌ عَلَيهِ. وفي رواية لمسلمٍ:"لا يَدْخُلُ الجنَّة مَنْ لاَ يأْمنُ جارُهُ بوَائِقهُ ". "الْبَوائِقُ"الْغَوَائِل وَالشُّرُّورُ.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ ఒకసారి, "దైవసాక్షి! అతను విశ్వాసి కాజాలడు, దైవసాక్షి! అతను విశ్వాసి కాడు. దైవసాక్షి అతను విశ్వాసి కానేకాడు" అని అన్నారు. "ఎవరు దైవప్రవక్తా!?" అని అడగ్గా, "తన తుంటరి చేష్టలతో ఇరుగుపొరుగు వారికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నవాడు" అని ఆయన సమాధానమిచ్చారు. (బుఖారీ – ముస్లిం)

ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో తన తుంటరి చేష్టలతో ఇరుగుపొరుగు వారికి మనశ్శాంతి లేకుండా చేసేవాడు స్వర్గంలోకి ప్రవేశించలేడు" అని ఉంది.

'బవాయిఖ్' అంటే మోసాలు, తుంటరి చేష్టలు అని అర్థం.

(సహీహ్ బుఖారీలోని సంస్కార ప్రకరణం, సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “By Allah, he is not a believer! By Allah, he is not a believer! By Allah, he is not a believer.” It was asked, “Who is that, O Messenger of Allah?” He said, “One whose neighbour does not feel safe from his evil”.[Al-Bukhari and Muslim].

Another narration of Muslim is: Messenger of Allah ﷺ said, “He will not enter Jannah whose neighbour is not secure from his wrongful conduct”.

ముఖ్యాంశాలు

ఇరుగుపొరుగు వారిని కష్టపెట్టడం ఎంతటి ఘోరమైన పాపమంటే దానివల్ల మనిషి పరలోకంలో స్వర్గానికి నోచుకోలేకపోతాడు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|39. ఇరుగుపొరుగువారి హక్కుల్ని నెరవేర్చాలి, వారిపట్ల సద్భావంతో మెలగాలి|హదీసు 307

308

హదీసు 308

وعنه قَالَ: قَالَ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "يَا نِسَاءَ المُسلِمَاتِ لاَ تَحْقِرَنَّ جارَةٌ لجارتِهَا وَلَوْ فِرْسَنَ شَاةٍ" متفقٌ عَلَيْهِ.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ మహిళలతో ఇలా అన్నారు : ముస్లిం మహిళల్లారా! ఏ ఇరుగింటి స్త్రీ తన పొరుగింటావిడ (ఇచ్చిన కానుక)ను అల్పమైనదిగా భావించకూడదు సుమా! అది మేక కాలి గిట్ట అయినా సరే!

(బుఖారీ – ముస్లిం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “O Muslim women! No one of you should consider insignificant (a gift) to give to her neighbour even if it is (a gift of) the trotters of a sheep”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఒకేచోట నివసించేవారు ఒండొకరికి కానుకలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి. దీనివల్ల పరస్పరం ప్రేమాభిమానాలు పెంపొందుతాయి. ధనికులు తమ స్థోమతకు తగ్గట్టుగా, అదేవిధంగా పేదవారు తమకు ఉన్నంతలోనే ఇరుగుపొరుగువారికి కానుకలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి. పేదవారు "ఇంత మామూలు వస్తువు కానుకగా ఎలా ఇవ్వాలా?" అని ఎప్పుడూ అనుకోకూడదు. చిత్తశుద్ధితో ఇస్తే అది ఎంత మామూలు వస్తువైనప్పటికీ దేవుని సన్నిధిలో స్వీకృతిని పొందుతుంది.

అలాగే ధనవంతులు కూడా పేదవారిచ్చే కానుకలను స్వీకరించి వారిని ఆదరించాలి. అయితే ధనికులు మాత్రం పేదవారికయినా తమ స్థోమతకు తగిన కానుకలే ఇవ్వాలి. తమకిష్టం లేని వస్తువుల్ని, పాడయిపోయిన ఆహారపదార్థాల్ని తమ ఇరుగుపొరుగున ఉంటున్న పేదవారికి ఇవ్వటం భావ్యం కాదు. ఇలా చేయటం వల్ల ఇరుగుపొరుగు పేదవారిని అధములుగా భావించినట్లవుతుంది. కానుకలు ఇచ్చేది ఎదుటివారి పట్ల తమకున్న గౌరవాన్ని, ప్రేమను తెలియజేయటం కోసమే. అలాంటప్పుడు పొరుగున ఉంటున్న పేదవారిని అల్పులుగా భావిస్తూ వారికేదైనా ఇస్తే అది కానుక ఎలా అవుతుంది? దానికి దేవుని దృష్టిలో ఎలాంటి విలువా లేదు. ఒకవేళ ఎదుటివ్యక్తిని అల్పునిగా భావించకుండా తన దగ్గరున్న మామూలు వస్తువేదైనా వినియోగంలో లేకపోతే దాన్ని ఏ పేదవాడికైనా ఇచ్చివేయడంలో తప్పులేదు. అయితే ఇచ్చే వస్తువు ఉపయోగకరమైనదయి ఉండాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|39. ఇరుగుపొరుగువారి హక్కుల్ని నెరవేర్చాలి, వారిపట్ల సద్భావంతో మెలగాలి|హదీసు 308

309

హదీసు 309

وعنه أَن رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "لاَ يَمْنَعْ جارٌ جارَهُ أَنْ يغْرِزَ خَشَبَةً في جِدارِهِ "ثُمَّ يَقُولُ أَبو هريرة: مَالي أَرَاكُمْ عنْهَا معْرِضِينَ، واللَّهِ لأرمينَّ بِهَا بيْنَ أَكْتَافِكُمْ. متفقٌ عَلَيهِ. رُوى"خَشَبهُ"بالإِضَافَةِ والجمْعِ، ورُوِي"خَشبَةً"بالتَّنْوِينَ عَلَى الإِفْرَادِ. وقوله: مالي أَرَاكُمْ عنْهَا مُعْرِضِينَ: يَعْني عنْ هذِهِ السُّنَّةِ.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : తన గోడకు తన పొరుగు వాడు గూటం కొట్టుకుంటానంటే దానికి ఎవడూ అభ్యంతరం పెట్టకూడదు.

ఈ హదీసు వినిపించిన తరువాత అబూ హురైరా, (ప్రజలతో) "మరి మీరు ఈ హదీసును నిర్లక్ష్యం చేస్తున్నారెందుకు? దైవసాక్షి! (మీరు ఎంత వినిపించుకోకపోయినా) నేనీ హదీసును మీ మధ్య ప్రవేశపెట్టితీరుతాను" అని అనేవారు.

'ఖషబహు' మరియు 'ఖషబతన్'. ఈ పదం రెండు విధాలుగానూ ఉల్లేఖించబడింది. 'ఖషబహు' అన్నది సంయోగపదం. ఇందులో 'ఖషబ' బహువచనం. 'మీరు వైముఖ్యం చూపటం నేను గమనిస్తున్నాను. అంటే దైవప్రవక్త వారి ఈ ఆదేశం పట్ల వైముఖ్యం చూపుతున్నారని అర్థం.

(సహీహ్ బుఖారీలోని అత్యాచారాల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని వాణిజ్య ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “No one should prohibit his neighbour from placing a peg in his wall”. Abu Hurairah (radiyallahu anhu) added: Now I see you turning away from this (Sunnah), but by Allah, I shall go on proclaiming it.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

రెండు ఇరుగుపొరుగు ఇండ్లకు ఒకే గోడ ఉన్నప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది. ఇద్దరికీ ఒకే గోడ ఉన్నప్పుడు దానికి మేకులుగాని, గూటం గాని కొట్టే అవసరం వారిలో ఎవరికైనా ఏర్పడవచ్చు. ఉమ్మడి గోడను ఉపయోగించుకోవటంలో ఆ ఇద్దరికీ సమాన హక్కు ఉంటుంది. అలాంటప్పుడు పొరుగువాని హక్కును కాదనటం సమంజసం కాదు. పొరుగువాడు తన గోడలో మేకు కొట్టుకోవటానికి కూడా అనుమతించకపోవటం మనిషి సంకుచిత స్వభావాన్ని సూచిస్తుంది. కొన్ని సందర్భాలలో ప్రజలు పొరుగింటి నుంచి ఏ కాస్త శబ్దం వచ్చినా ఏదో కొంప మునిగిపోయినట్లు అతిగా ఆవేశపడిపోతుంటారు. ప్రతి చిన్న ఇబ్బందికీ పోట్లాటకు దిగుతుంటారు. ఇవి నైతికంగా ఎంతో దిగజారిన చేష్టలు. ఒక విశ్వాసికి ఇవి ఎంతమాత్రం శోభించవు. పైగా ఇరుగుపొరుగువారి పట్ల ఉత్తమంగా వ్యవహరించాలి. సానుభూతి, సహకార భావాలతో కలిసిమెలసి ఉండాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|39. ఇరుగుపొరుగువారి హక్కుల్ని నెరవేర్చాలి, వారిపట్ల సద్భావంతో మెలగాలి|హదీసు 309

310

హదీసు 310

وعنه أَن رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَنْ كَانَ يُؤْمِنُ باللَّهِ وَالْيَوْمِ الآخِرِ، فَلا يُؤْذِ جَارَهُ، وَمَنْ كَان يُؤْمِنُ بِاللَّهِ والْيَوْمِ الآخرِ، فَلْيكرِمْ ضَيْفهُ، وَمَنْ كَانَ يُؤْمنُ بِاللَّهِ وَالْيومِ الآخِرِ، فَلْيَقُلْ خَيْراً أَوْ لِيَسْكُتْ" متفقٌ عَلَيهِ.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : అల్లాహ్‌ను, అంతిమదినాన్ని విశ్వసించే వ్యక్తి తన పొరుగువాడిని కష్టపెట్టకూడదు. అల్లాహ్‌ను, అంతిమదినాన్ని విశ్వసించేవాడు అతిథికి మర్యాద చెయ్యాలి. అల్లాహ్‌ను, అంతిమదినాన్ని విశ్వసించేవాడు పలికితే మంచిమాట పలకాలి లేదా ఊరుకోవాలి. (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని సంస్కార ప్రకరణం, సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “He who believes in Allah and the Last Day let him not harm his neighbour; and he who believes in Allah and the Last Day let him show hospitality to his guest; and he who believes in Allah and the Last Day let him speak good or remain silent”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో ఈమాన్ (విశ్వాస) శుభాలను గురించి వివరించటం జరిగింది. పై హదీసులో పేర్కొనబడిన సద్గుణాలు ఒక విశ్వాసిలో గనక లేకపోతే అతని విశ్వాసం శుభరహితమని గ్రహించాలి. ఆచరణలేని విశ్వాసం నిష్ఫల వృక్షంతో సమానం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|39. ఇరుగుపొరుగువారి హక్కుల్ని నెరవేర్చాలి, వారిపట్ల సద్భావంతో మెలగాలి|హదీసు 310

311

హదీసు 311

وعن أَبي شُريْح الخُزاعيِّ رضي اللَّه عنه أَن النَّبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَنْ كَانَ يُؤمِنُ بِاللَّهِ والْيوْمِ الآخِرِ، فَلْيُحسِنْ إلِى جارِهِ، ومنْ كَانَ يُؤْمِنُ بِاللَّهِ واليومِ الآخِرِ فَلْيُكْرِمْ ضَيْفهُ، ومنْ كانَ يؤمنُ باللَّهِ واليومِ الآخرِ فَلْيَقُلْ خَيْراً أَوْ لِيسْكُتْ" رواه مسلم بهذا اللفظ، وروى البخاري بعضه.

హజ్రత్ అబూ షురైహ్ ఖుజాయీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : అల్లాహ్‌ను, అంతిమదినాన్ని విశ్వసించేవాడు తన ఇరుగుపొరుగువారి పట్ల ఉత్తమంగా వ్యవహరించాలి. అల్లాహ్‌ను అంతిమదినాన్ని విశ్వసించేవాడు తన (ఇంటికి వచ్చిన) అతిథికి గౌరవం ఇవ్వాలి. అల్లాహ్‌ను, అంతిమదినాన్ని విశ్వసించేవాడు పలికితే మంచిమాట పలకాలి లేదా మౌనంగా ఉండాలి. (ఈ హదీసును ఈ వాక్యాలతో ఇమామ్ ముస్లిం ఉల్లేఖించారు. ఇమామ్ బుఖారీ ఇందులోని కొంతభాగాన్ని మాత్రమే ఉల్లేఖించారు.)

(సహీహ్ బుఖారీలోని సంస్కార ప్రకరణం, సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణం)

English

Abu Shuraih Al-Khuza`i (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “He who believes in Allah and the Last Day, let him be kind to his neighbour; and he who believes in Allah and the Last Day, let him show hospitality to his guest; and he who believes in Allah and the Last Day, let him either speak good or remain silent”.[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|39. ఇరుగుపొరుగువారి హక్కుల్ని నెరవేర్చాలి, వారిపట్ల సద్భావంతో మెలగాలి|హదీసు 311

312

హదీసు 312

وعن عائشة رضي اللَّه عنها قَالَت: قُلْتُ: يَا رَسُول اللَّه إِنَّ لِي جَارَيْنِ، فَإِلى أَيِّهما أُهْدِى؟ قَالَ: "إِلَى أَقْربهمِا مِنْك بَاباً" رواه البخاري.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : నేను దైవప్రవక్తతో (మాట్లాడుతూ) "దైవప్రవక్తా! నాకు ఇద్దరు పొరుగువాళ్ళున్నారు. నేను వారిలో కానుకను ఎవరికి ఇవ్వాలి?" అని అడిగాను. దానికి ఆయన "వారిలో ఎవరి గడప నీకు దగ్గరగా ఉంటే వారికి ఇవ్వు" అని చెప్పారు. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని కానుకల ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha) reported: I said, “O Messenger of Allah ﷺ, I have two neighbours, to which of them should I send a present?” He ﷺ replied, “To the one whose door is nearer to you”.[Al-Bukhari]

ముఖ్యాంశాలు

ఇరుగుపొరుగు వారందరికీ కానుకలు పంపే తాహతు లేని పరిస్థితిలో వారిలో ఏ ఒక్కరికో కానుక ఇవ్వదలచుకుంటే తమకు అత్యంత సమీపంలో ఉన్న పొరుగువారికి ఆ కానుక ఇవ్వాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|39. ఇరుగుపొరుగువారి హక్కుల్ని నెరవేర్చాలి, వారిపట్ల సద్భావంతో మెలగాలి|హదీసు 312

313

హదీసు 313

وعن عبدِ اللَّه بن عمر رضي اللَّه عنهما قَالَ: قَالَ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "خَيْرُ الأَصحاب عِنْدَ اللَّهِ تَعَالَى خَيْرُهُمْ لصاحِبِهِ، وخَيْرُ الجِيرَانِ عِنْدَ اللَّه تَعَالَى خيْرُهُمْ لجارِهِ "رواه الترمذي وقال: حديث حسن.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు : తన సహచరుల పట్ల ఉత్తమంగా మెలిగేవాడే దేవుని దృష్టిలో అత్యుత్తమ సహచరుడు. తమ ఇరుగుపొరుగువారి పట్ల ఉత్తమంగా మెలగేవాడే దేవుని దృష్టిలోనూ అత్యుత్తమ పొరుగువాడు. (దీనిని తిర్మిజీ ఉల్లేఖించి 'హసన్'గా పేర్కొన్నారు.)

(జామె తిర్మిజీలోని సత్కార్యాలు – సత్సంబంధాల అధ్యాయం)

English

`Abdullah bin `Umar (radiyallahu anhuma) reported: Messenger of Allah ﷺ said, “The best of companions with Allah is the one who is best to his companions, and the best of neighbours to Allah is the one who is the best of them to his neighbour”.[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

'సహచరుడు' అన్న పదం విస్తృతార్థంలో వాడబడింది. తమ నివాస ప్రాంతంలోని సహచరులు, ప్రయాణంలో పరిచితులైన సహచరులందరూ దీని క్రిందికి వస్తారు. జీవితంలో తారసపడే ప్రతి వ్యక్తి పట్లా మంచిగా మెలగాలి. అలాగే ఇరుగుపొరుగువారితో కూడా సత్సంబంధాలు కలిగి ఉండాలి. దైవసామీప్యాన్ని, ఆయన ప్రసన్నతను పొందటానికి ఇదెంతో మేలైన మార్గం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|39. ఇరుగుపొరుగువారి హక్కుల్ని నెరవేర్చాలి, వారిపట్ల సద్భావంతో మెలగాలి|హదీసు 313