హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 38. ఇంటివారిని దైవానికి విధేయత చూపమని ఆజ్ఞాపించటం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 38వ అధ్యాయం: తన ఇంటివారిని, ప్రాజ్ఞులైన సంతానాన్ని ఇంకా తన అధీనంలో ఉన్నవారందరినీ దైవానికి విధేయత చూపమని ఆజ్ఞాపించటం, వైముఖ్యం నుండి వారిని నిరోధించటం, అవసరమైతే శిక్షించటం, నిషిద్ధ విషయాల జోలికి పోకుండా వారిని ఆపటం విధి. ఈ అధ్యాయంలో 2 ఖుర్ఆన్ ఆయతులు, 5 హదీసులు (హదీసు 300 – 304) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

38. తన ఇంటివారిని, ప్రాజ్ఞులైన సంతానాన్ని ఇంకా తన అధీనంలో ఉన్నవారందరినీ దైవానికి విధేయత చూపమని ఆజ్ఞాపించటం, వైముఖ్యం నుండి వారిని నిరోధించటం, అవసరమైతే శిక్షించటం, నిషిద్ధ విషయాల జోలికి పోకుండా వారిని ఆపటం విధి.

↑ విషయ సూచిక

بيان وجوب أمره أهله وأولاده المميزين وسائر من في رعيته بطاعة الله تعالى، ونهيهم عن المخالفة، وتأديبهم، ومنعهم من ارتكاب مَنْهِيٍّ عَنْهُ

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు:

{وَأْمُرْ أَهْلَكَ بِالصَّلاةِ وَاصْطَبِرْ عَلَيْهَا} [طه:١٣٢]

"నీ కుటుంబ సభ్యులను నమాజు చెయ్యమని ఆజ్ఞాపించు. స్వయంగా నీవు కూడా దానిని పాటించు." (తాహా : 132)

మరోచోట ఇలా అంటున్నాడు :

{يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا قُوا أَنْفُسَكُمْ وَأَهْلِيكُمْ نَاراً} [التحريم:٦]

"విశ్వాసులారా! మిమ్మల్నీ, మీ పరివారాన్నీ నరకాగ్ని నుండి కాపాడుకోండి." (అత్ తహ్రీమ్ : 6)

English

“And enjoin Salat (the prayer) on your family, and be patient in offering them (i.e., the Salat).” [Ṭā Hā 20:132]

“O you who believe! Ward off yourselves and your families against a Fire (Hell), whose fuel is men and stones.” [At-Taḥrīm 66:6]

300

హదీసు 300

وعن أبي هريرةَ رضي اللَّه عنه قَالَ: أَخذ الحسنُ بنُ عليٍّ رضي اللَّه عنْهُما تَمْرةً مِنْ تَمرِ الصَّدقَةِ فَجعلهَا في فِيهِ فَقَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "كِخْ كِخْ، إِرْمِ بِهَا، أَما علِمْتَ أَنَّا لا نأْكُلُ الصَّدقةَ!؟ " مُتَّفَقٌ عَلَيهِ. وفي روايةٍ: "أنَّا لا تَحِلُّ لنَا الصَّدقةُ" وقوله:"كِخْ كِخْ"يُقالُ بِاسْكَانِ الخَاءِ، ويُقَالُ بكَسرِهَا مَعَ التَّنْوِينِ وهيَ كلمةُ زَجْر للصَّبِيِّ عن المُسْتَقذَرَاتِ، وكَانَ الحسنُ رضي اللَّه عنه صبِياً.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం : ఒకసారి (దైవప్రవక్త ముద్దుల మనవడు) హజ్రత్ హసన్ (రదియల్లాహు అన్హుమా) సదఖా చేయబడిన ఖర్జూరాన్ని తీసుకొని (అడుకుంటూ దాన్ని) నోట్లో వేసుకున్నాడు. అది చూసి వెంటనే దైవప్రవక్త ﷺ "అయ్యో! దాన్ని ఊసెయ్యి, మనం సదఖా చేయబడింది తినమని నీకు తెలియదా!" అని అన్నారు. (బుఖారీ – ముస్లిం)

వేరొక ఉల్లేఖనంలో "మనకు సదఖా (వస్తువుని అనుభవించటం) ధర్మసమ్మతం కాదు" అని ఉంది.

'కఖ్, కఖ్' – దీన్ని 'కఖిన్, కఖిన్' అని కూడా చదవవచ్చు. చిన్నపిల్లల్ని చెడుల జోలికి పోకుండా మందలించటానికి ఈ పదాన్ని వాడుతారు. హజ్రత్ హసన్ (రదియల్లాహు అన్హు) ఆ సమయంలో పసిపిల్లవాడు.

(సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లింలలోని జకాత్ ప్రకరణాలు)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Al-Hasan bin `Ali (radiyallahu anhuma) took one of the dates of the Sadaqah (charity) and put it in his mouth, whereupon Messenger of Allah ﷺ said, “Leave it, leave it, throw it away. Do you not know that we do not eat the Sadaqah (charity)?”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

  1. ఈ హదీసు ద్వారా దైవప్రవక్త కుటుంబీకులకు, ఆయన వంశస్థులకు దానధర్మాలు పుచ్చుకోవటం ధర్మసమ్మతం కాదని తెలుస్తోంది. ఆయన వంశస్థులంటే హాషిమ్ మరియు ముత్తలిబ్ సంతతి.
  2. పిల్లలకు పసితనం నుంచే సరైన శిక్షణను ఇవ్వాలి. తల్లిదండ్రులు తమ పిల్లలు చేసే పనుల్ని ఓ కంట గమనిస్తూ ఉండాలి. వారివల్ల ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే వారిని సరిదిద్దాలి. వారికి చిన్నప్పటినుంచే ధర్మాధర్మాలను గురించి బోధిస్తూ ఉండాలి.
  3. దానధర్మాల వల్ల వచ్చే ధనం ప్రజాధనం అవుతుంది. ఏ ఇంట్లోనయినా లేక సంస్థలోనయినా సొమ్ము సమీకరించబడితే దాని భద్రతకు బాధ్యులైన యజమానులు దానిని అన్ని విధాలా కాపాడుతూ నిజమైన హక్కుదారులకు చేరేటట్లు చూడాలి. తమ బంధుమిత్రులెవరూ దానిని ఉపయోగించుకోకుండా కాపాడాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|38. తన ఇంటివారిని, ప్రాజ్ఞులైన సంతానాన్ని ఇంకా తన అధీనంలో ఉన్నవారందరినీ దైవానికి విధేయత చూపమని ఆజ్ఞాపించటం, వైముఖ్యం నుండి వారిని నిరోధించటం, అవసరమైతే శిక్షించటం, నిషిద్ధ విషయాల జోలికి పోకుండా వారిని ఆపటం విధి.|హదీసు 300

301

హదీసు 301

وعن أَبي حفْصٍ عُمَر بن أَبي سلَمةَ عبدِ اللَّه بنِ عبدِ الأَسد: ربيبِ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: كُنْتُ غُلاماً في حجْرِرسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، وكَانَتْ يَدِي تَطِيشُ في الصَّحْفَةِ، فَقَالَ لي رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "يَا غُلامُ سمِّ اللَّهَ تَعَالَى، وَكُلْ بِيمِينِكَ، وكُل ممَّا يليكَ" فَما زَالَتْ تِلْكَ طِعْمتي بعْدُ. متفقٌ عَلَيهِ. "وتَطِيش": تَدُورُفي نَواحِي الصَّفحَةِ.

దైవప్రవక్త సంరక్షణలో పెరిగిన హజ్రత్ అబూ హఫ్స్ ఉమర్ బిన్ అబూ సలమా అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్దుల్ అసద్ (రదియల్లాహు అన్హు) కథనం : నేను దైవప్రవక్త ﷺ సంరక్షణలో పెరుగుతుండేవాడ్ని. నేను అన్నం తినేటప్పుడు కంచంలో (ని ఆహారాన్ని అన్ని వైపుల నుంచి తీసుకొని తింటూ) చెయ్యిని అటూ ఇటూ కదిలిస్తూ ఉండేవాడ్ని. దైవప్రవక్త ﷺ అది చూసి, "అబ్బాయీ! (అన్నం తినేముందు) 'బిస్మిల్లా' పఠించు. కుడిచేత్తో తిను. (కంచంలో) నీ ముందు భాగంలో ఉన్నది తీసుకొని తిను" అని ఉపదేశించారు. ఆ రోజు నుండి నేను దైవప్రవక్త చెప్పిన ప్రకారమే తింటూ వస్తున్నాను. (బుఖారీ – ముస్లిం)

'తతీషు' అంటే చెయ్యి కంచం అంచుల దగ్గర కదలాడుతూ ఉండేదని అర్థం.

(సహీహ్ బుఖారీలోని అన్నపానీయాల ప్రకరణం – సహీహ్ ముస్లింలోని పానీయాల ప్రకరణం)

English

`Umar bin Abu Salamah (radiyallahu anhu) reported: I was a boy under the care of Messenger of Allah ﷺ, and my hand would wander about in the dish. Messenger of Allah ﷺ said to me “Mention Allah’s Name (i.e., say Bismillah before you start eating), eat with your right hand and eat from what is near to you”. I always followed this way of eating after this incident.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

  1. ఈ హదీసు కూడా పిల్లలకు సభ్యతా సంస్కారాలు నేర్పాలని ప్రబోధిస్తోంది.
  2. అన్నం తినేముందు 'బిస్మిల్లాహ్' పఠించి మరీ తినటం ప్రారంభించాలి. పలువురు ఒకే పళ్ళెంలో తింటున్నప్పుడు ప్రతి ఒక్కరూ తమ ముందు భాగంలో ఉన్న ఆహారాన్నే తీసుకుని తినాలి. అయితే పళ్ళెంలో రకరకాల పండ్లు, ఫలాలు ఉన్నప్పుడు మాత్రం ఎటువైపు నుంచైనా తీసుకొని తినవచ్చు.
  3. పిల్లలు తప్పుచేస్తే -అప్పటికప్పుడే- వారిని సరిదిద్దాలి. సరైన విధానం గురించి బోధించాలి. అలా చేస్తే పిల్లలు తమ తప్పుని తెలుసుకొని ఇంకెప్పుడూ అలాంటి తప్పు చేయకుండా ఉంటారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|38. తన ఇంటివారిని, ప్రాజ్ఞులైన సంతానాన్ని ఇంకా తన అధీనంలో ఉన్నవారందరినీ దైవానికి విధేయత చూపమని ఆజ్ఞాపించటం, వైముఖ్యం నుండి వారిని నిరోధించటం, అవసరమైతే శిక్షించటం, నిషిద్ధ విషయాల జోలికి పోకుండా వారిని ఆపటం విధి.|హదీసు 301

302

హదీసు 302

وعن ابن عمَر رضي اللَّه عنهما قال: سَمِعتُ رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقول: "كُلُّكُمْ راعٍ، وكُلُّكُمْ مسئولٌ عنْ رعِيَّتِهِ، والأِمَامُ رَاعٍ، ومسئولٌ عَنْ رَعِيَّتِهِ، والرَّجُلُ رَاعٍ في أَهْلِهِ ومسئولٌ عَنْ رَعِيَّتِهِ، والمرْأَةُ راعِيةٌ في بيْتِ زَوْجِهَا ومسئولة عنْ رعِيَّتِهَا، والخَادِمُ رَاعٍ في مالِ سيِّدِهِ ومسئولٌ عَنْ رَعِيَّتِهِ، فكُلُّكُمْ راعٍ ومسئولٌ عنْ رعِيتِهِ" متفقٌ عَلَيهِ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : మీలో ప్రతి మనిషీ ఓ బాధ్యత గల వ్యక్తి. మిమ్మల్నందరినీ తమ తమ బాధ్యతల గురించి (దేవుని సన్నిధిలో) ప్రశ్నించటం జరుగుతుంది. పాలకుడు (ప్రజా సంక్షేమానికి) బాధ్యుడు. అతన్ని తన బాధ్యత విషయమై ప్రశ్నించటం జరుగుతుంది. (సాధారణ) మనిషి తన పరివారానికి బాధ్యుడు. అతన్ని తన బాధ్యత (పరివారాన్ని) గురించి ప్రశ్నించటం జరుగుతుంది. అలాగే స్త్రీ కూడా తన భర్త ఇంటికి బాధ్యత వహిస్తుంది. ఆమె (కూడా) తన బాధ్యత విషయమై ప్రశ్నించబడుతుంది. సేవకుడు తన యజమాని సొమ్ముకు బాధ్యుడు. అతడు తన బాధ్యత గురించి ప్రశ్నించబడతాడు. కనుక మీలో ప్రతి ఒక్కడూ (తమ కార్యక్షేత్రంలో) బాధ్యతగల వ్యక్తే. మీలో ప్రతి ఒక్కడూ తన బాధ్యత విషయమై ప్రశ్నించబడతాడు.

(బుఖారీ – ముస్లిం)

English

Ibn `Umar (radiyallahu anhuma) reported: Messenger of Allah ﷺ said, “All of you are guardians and are responsible for your subjects. The ruler is a guardian and responsible for his subjects; the man is a guardian of his family; the woman is guardian in her husband’s house and responsible for her wards; a servant is guardian of his master’s property and responsible for his ward. So all of you are guardians and are responsible for your subjects”.[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|38. తన ఇంటివారిని, ప్రాజ్ఞులైన సంతానాన్ని ఇంకా తన అధీనంలో ఉన్నవారందరినీ దైవానికి విధేయత చూపమని ఆజ్ఞాపించటం, వైముఖ్యం నుండి వారిని నిరోధించటం, అవసరమైతే శిక్షించటం, నిషిద్ధ విషయాల జోలికి పోకుండా వారిని ఆపటం విధి.|హదీసు 302

303

హదీసు 303

وعن عمرو بن شُعْيب، عن أَبيه، عن جَدِّهِ رضي اللَّه عنه قَالَ: قَالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مُرُوا أَوْلادكُمْ بِالصَّلاةِ وهُمْ أَبْنَاءُ سَبْعِ سِنِينَ، واضْرِبُوهمْ علَيْهَا وَهُمْ أَبْنَاءُ عَشْرِ، وفرَّقُوا بيْنَهُمْ في المضَاجعِ "حديثٌ حسن. رواه أَبُو داود بإِسنادٍ حسنٍ.

హజ్రత్ అమ్ర్ బిన్ షుఐబ్ తన తండ్రి నుండి, ఆయన తన తాత నుండి చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉద్బోధించారు : మీ పిల్లల్ని ఏడు సంవత్సరాల ప్రాయం నుండే నమాజు చెయ్యండని ప్రోత్సహిస్తూ ఉండండి. పది సంవత్సరాల తరువాత (కూడా వారు నమాజు పట్ల నిర్లక్ష్యం వహిస్తే) వారిని కొట్టండి. వారి పడకల్ని వేరుపరచండి. (ఈ హదీసు 'హసన్' కోవకు చెందినది. అబూదావూద్ దీనిని ప్రామాణికమైన ఆధారంతో వెలికితీశారు.)

(సుననె అబూదావూద్‌లోని నమాజ్ ప్రకరణం)

English

`Amr bin Shu`aib reported on his father’s authority that his grandfather (radiyallahu anhu) said: Messenger of Allah ﷺ said, “Command your children to perform Salat (prayer) when they are seven years old, and beat them for (not offering) it when they are ten, and do not let (boys and girls) sleep together”.[Abu Dawud].

ముఖ్యాంశాలు

  1. ఈ హదీసు ద్వారా నమాజుకు ఉన్న ప్రాముఖ్యత వెల్లడౌతోంది. శిక్షణ నిమిత్తం పిల్లల్ని స్వల్పంగా దండించవచ్చని కూడా తెలుస్తోంది. దండించడమంటే పశువుని బాదినట్లు చితక బాదమని కాదు. పిల్లవాడి తప్పుని సరిదిద్దటం కోసం మరీ చిత్రహింసలు పెట్టకుండా మెల్లగా కొట్టాలి. అంతేగాని పిల్లల్ని కొట్టడం ఉద్దేశ్యం కాకూడదు. మరోవైపు కొంతమంది అసలు పిల్లల్ని కొట్టడం కాదు కదా, వారిని మందలించటం కూడా తగదని అంటారు. కాని ఈ భావన సరైనది కాదు. పిల్లలకు సభ్యతా సంస్కారాలు నేర్పటం కోసం అప్పుడప్పుడూ స్వల్పంగా దండించటం కూడా అవసరమే. పసిపిల్లల్ని ఎంతగానో ప్రేమించిన దైవప్రవక్త ﷺ స్వయంగా కొట్టమని ఆదేశిస్తున్నారంటే – ఇన్షాఅల్లాహ్ – దానివల్ల మంచిఫలితాలే ముందుకు వస్తాయి.
  2. పిల్లలకు నమాజు మాదిరిగానే ఇతర షరీఅత్ ఆజ్ఞలు కూడా బోధిస్తూ ఉండాలని పండితులు అంటున్నారు. వీలైతే వారిచేత ఆచరణాత్మకంగా కూడా అభ్యాసం చేయించాలి. ఉదాహరణకు రమజాన్ మాసంలో పిల్లల్ని వారి శక్తి సామర్థ్యాలకనుగుణంగా కొన్ని రోజులు ఉపవాసాలు పాటించమని ప్రోత్సహిస్తూ ఉండాలి. దీనివల్ల పసితనంలోనే వారికి ఉపవాసాల ప్రాముఖ్యత బోధపడుతుంది. ఆ విధంగా రోజుకి ఐదుపూటల నమాజుతోపాటు రమజాన్ నెలలో ఉపవాసాలు పాటించటం కూడా ఒక ముస్లింకు తప్పనిసరి అన్న సంగతి పెద్దవారయిన తరువాత వారికి తెలిసివస్తుంది. అదేవిధంగా పిల్లలకు వారి అవగాహనాశక్తిని బట్టి ఇతర ధర్మ నియమాలను కూడా బోధించవచ్చు.
  3. పదేళ్ళ ప్రాయంలో పిల్లలు లైంగికంగా ప్రాజ్ఞులవ్వక పోయినప్పటికీ ఆ వయసులోనే వారిలో లైంగిక స్పందనలు మొదలౌతాయి. కనుక ఆ వయస్సులో ఉన్న పిల్లల్ని వేర్వేరుగా పడుకోబెట్టడం ఎందుకైనా మంచిది. ముఖ్యంగా ఆడ, మగ పిల్లల మధ్య ఈ జాగ్రత్త తప్పనిసరి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|38. తన ఇంటివారిని, ప్రాజ్ఞులైన సంతానాన్ని ఇంకా తన అధీనంలో ఉన్నవారందరినీ దైవానికి విధేయత చూపమని ఆజ్ఞాపించటం, వైముఖ్యం నుండి వారిని నిరోధించటం, అవసరమైతే శిక్షించటం, నిషిద్ధ విషయాల జోలికి పోకుండా వారిని ఆపటం విధి.|హదీసు 303

304

హదీసు 304

وعن أَبي ثُريَّةَ سَبْرَةَ بنِ مَعْبدٍ الجهَنِيِّ رضي اللَّه عنه قَالَ: قَالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "عَلِّمُوا الصَّبِيَّ الصَّلاةَ لِسَبْعِ سِنِينَ، وَاضْرِبُوهُ علَيْهَا ابْنَ عشْرِ سِنِينَ" حديث حسنٌ رواه أَبو داود، والترمِذي وَقالَ: حديث حسن. ولَفْظُ أَبي داوُد: "مرُوا الصَّبِيَّ بِالصَّلاَةِ إِذَا بَلَغَ سَبْعَ سِنِينَ".

హజ్రత్ అబూ సురయ్యా సబ్రా బిన్ మాబద్ జుహనీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉద్బోధించారు : ఏడేళ్ళప్రాయంలో పిల్లవాడికి నమాజు నేర్పించండి. పదేళ్ళ ప్రాయంలో (అతను నమాజు పట్ల అశ్రద్ధ వహిస్తే) అతన్ని కొట్టండి." (ఈ హదీసు హసన్ కోవకు చెందినది. దీనిని అబూ దావూద్ మరియు తిర్మిజీలు వెలికితీశారు.)

అబూ దావూద్ వాక్యాలు ఇలా ఉన్నాయి : "పిల్లవాడు ఏడేళ్ళ ప్రాయానికి చేరుకోగానే అతన్ని నమాజు చేయమని ఆదేశించండి."

(సుననె అబూదావూద్ మరియు సుననె తిర్మిజీలోని నమాజ్ ప్రకరణాలు)

English

Sabrah bin Ma`bad Al-Juhani (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Teach a boy Salat (the prayer) when he attains the age of seven years, and punish him (if he does not offer it) at ten”.[Abu Dawud and Tirmidhi].

The narration in Abu Dawud is: Messenger of Allah ﷺ said, “Order a boy to perform Salat (the prayer) when he is seven years old”.

ముఖ్యాంశాలు

తల్లిదండ్రుల్లో, గురువుల్లో ఎవరయితే నమాజ్ చేస్తారో వారు మాత్రమే పిల్లలకు నమాజ్ చేయమని బోధించగలరు. పెద్దలే నమాజ్ చేయకుండా పిల్లల్ని చేయమంటే చేస్తారా? పెద్దలు చిన్నపిల్లలకు ఆదర్శం కావాలి. అప్పుడే పిల్లలు వారి మాట వింటారు. ప్రవక్త సహచరుల కాలంలో ఒక వ్యక్తి ముస్లిం అయి కూడా నమాజును వదలిపెట్టే ప్రసక్తే ఉండేది కాదు. కాని శోచనీయమైన విషయం ఏమిటంటే, నేడు ముస్లిం సమాజాల్లోనే ఎంతోమంది పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నమాజును నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాంటప్పుడు వారి సంరక్షణలో పెరుగుతున్న పిల్లలకు నమాజును గురించి, ఇతర ధర్మ విషయాల గురించి బోధించేదెవరు? నేటి స్కూళ్ళలో కూడా పిల్లలకు నమాజ్ చేసుకునే సౌకర్యం, అవకాశం లేకపోవటం ఇంకా ఆందోళనకరమైన విషయం. ప్రతి వ్యక్తీ తన అధీనంలో ఉన్న వారికి బాధ్యుడు. పరలోకంలో దేవుని సన్నిధిలో తన బాధ్యత విషయమై అతణ్ణి నిలదీయటం జరుగుతుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|38. తన ఇంటివారిని, ప్రాజ్ఞులైన సంతానాన్ని ఇంకా తన అధీనంలో ఉన్నవారందరినీ దైవానికి విధేయత చూపమని ఆజ్ఞాపించటం, వైముఖ్యం నుండి వారిని నిరోధించటం, అవసరమైతే శిక్షించటం, నిషిద్ధ విషయాల జోలికి పోకుండా వారిని ఆపటం విధి.|హదీసు 304