హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 37. ప్రీతికరమైన సంపదను ఖర్చు చేయటం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 37వ అధ్యాయం: ప్రీతికరమైన సంపదను ఖర్చు చేయటం. ఈ అధ్యాయంలో 2 ఖుర్ఆన్ ఆయతులు, 1 హదీసులు (హదీసు 299) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

37. ప్రీతికరమైన సంపదను ఖర్చు చేయటం

↑ విషయ సూచిక

باب الإِنفاق مِمَّا يحبُّ ومن الجيِّد

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు:

{لَنْ تَنَالُوا الْبِرَّ حَتَّى تُنْفِقُوا مِمَّا تُحِبُّونَ} [آل عمران:٩٢]

"అత్యంత ప్రీతికరమైన వస్తువులను (దైవమార్గంలో) ఖర్చుపెట్టనంతవరకు మీరు సత్కార్యస్థాయికి చేరుకోలేరు." (ఆలి ఇమ్రాన్ : 92)

ఇంకోచోట ఆయన ఇలా అంటున్నాడు:

{يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَنْفِقُوامِنْ طَيِّبَاتِ مَاكَسَبْتُمْ وَمِمَّا أَخْرَجْنَا لَكُمْ مِنَ الأَرْضِ وَلاتَيَمَّمُوا الْخَبِيثَ مِنْهُ تُنْفِقُونَ} [البقرة:٢٦٧]

"విశ్వసించిన ప్రజలారా! మీరు సంపాదించిన ధనంలోని, మేము మీ కొరకు నేల నుండి ఉత్పత్తి చేసిన దానిలోని మేలైన భాగాన్ని దైవమార్గంలో ఖర్చుపెట్టండి. ఆయన మార్గంలో ఇవ్వటానికి పనికిరాని వస్తువులను ఏరితీసే ప్రయత్నం చేయకండి." (అల్ బఖర : 267)

English

“By no means shall you attain Al-Birr (piety, righteousness – here it means Allah’s reward, i.e., Jannah), unless you spend (in Allah’s Cause) of that which you love.” [Āl ‘Imrān 3:92]

“O you who believe! Spend of the good things which you have (legally) earned, and of that which We have produced from the earth for you, and do not aim at that which is bad to spend from it.” [Al-Baqarah 2:267]

299

హదీసు 299

عن أَنس رضي اللَّه عنه قَالَ: كَانَ أَبُو طَلْحَةَ رضي اللَّه عنه أَكْثَر الأَنْصَارِ بِالمدِينَةِ مَالاً مِنْ نَخْلٍ، وَكَانَ أَحَبُّ أَمْوالِهِ إِلَيْهِ بَيْرَحاءَ، وَكانَتْ مُسْتَقْبِلَةَ المسْجِدِ وكانَ رسولُ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يدْخُلُهَا وَيشْربُ مِنْ ماءٍ فِيهَا طَيِّبٍ قَالَ أَنَسٌ: فلَمَّا نزَلَتْ هَذِهِ الآيةُ: {لَنْ تَنَالُوا الْبِرَّ حتَّى تُنْفِقُوا مِمَّا تُحِبُّونَ} قام أَبُو طَلْحَةَ إِلى رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فقال: يارسولَ اللَّه إِنَّ اللَّه تَعَالَى أَنْزَلَ عَلَيْكَ: {لَنْ تَنَالُوا الْبِرَّ حتَّى تُنْفِقُوا مِمَّا تُحِبُّونَ} وَإِنَّ أَحَبَّ مَالي إِلَيَّ بَيْرَحَاءَ، وإِنَّهَا صَدقَةٌ للَّهِ تَعَالَى أَرْجُو بِرَّهَا وذُخْرهَا عِنْد اللَّه تَعَالَى، فَضَعْها يَا رَسُول اللَّه حيْثُ أَرَاكَ اللَّهُ، فقال رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "بَخٍ، ذلِكَ مَالٌ رَابحٌ، ذلِكَ مَالٌ رَابِحٌ، وَقَدْ سمِعْتُ مَا قُلْتَ، وَإِنِّي أَرَى أَنْ تَجْعَلَهَا في الأَقْرَبِينَ" فَقَالَ أَبُو طَلْحَةَ: أَفْعَلُ يَا رسولَ اللَّه، فَقَسَّمَهَا أَبُو طَلْحَةَ في أَقَارِبِهِ، وَبَني عَمِّهِ. متفقٌ عَلَيهِ. وقولُهُ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مالٌ رَابحٌ" رُوي في الصحيحين"رَابحٌ"و"رَايحٌ"بالباءِ الموحدةِ وبالياءِ المثناةِ، أَيْ رَايحٌ عَلَيْكَ نَفْعُهُ، وَ"بَيرَحَاءُ"حَدِيِقَةُ نَخْلٍ، وروي بكسرِ الباءِ وَفتحِها.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : మదీనాలోని అన్సార్ ముస్లింలలో హజ్రత్ అబూ తల్హా (రదియల్లాహు అన్హు) గొప్ప ధనవంతులు. ఆయనకు ఎన్నో ఖర్జూరపు తోటలుండేవి. తన సంపదలో ఆయనకు 'బైరహా' అనే తోటంటే చాలా యిష్టం. అది మస్జిదె నబవీ ముందు భాగంలో ఉండేది. దైవప్రవక్త ﷺ (కూడా తరచూ) ఆ తోటలోకి వెళ్తుండేవారు. అక్కడ లభించే మంచినీళ్ళు త్రాగేవారు. (కొంత కాలానికి) "మీకు అత్యంత ప్రీతికరమైన దానిని (దైవమార్గంలో) ఖర్చు చేయనంతవరకు మీరు పుణ్యస్థాయికి చేరుకోలేరు" అనే దైవసూక్తి అవతరించినప్పుడు అబూ తల్హా లేచి, "దైవప్రవక్తా! మీకు అత్యంత ప్రీతికరమైన వస్తువుని ఖర్చుచేయనంతవరకూ మీరు పుణ్యస్థాయికి చేరుకోలేరని అంటున్నాడు దేవుడు. నా సంపద మొత్తంలో బైరహా తోట నాకు అత్యంత ప్రీతికరమైనది. అందుచేత నేను దానిని అల్లాహ్ కోసం దానం చేస్తూ దానిపై నాకు పుణ్యం లభిస్తుందని, ఇంకా (పరలోకంలో కూడా) దేవునివద్ద దాని పుణ్యం నిలువచేసి ఉంచబడుతుందని ఆశిస్తున్నాను. కనుక దైవప్రవక్తా! మీరు దీనిని దేవుడు ఎక్కడ వినియోగించమంటే అక్కడ వినియోగించండి" అని అన్నారు.

ఆయన మాటలు విని దైవప్రవక్త ﷺ "ఓహో! ఇదెంతో లాభదాయకమైన సంపద. నిజంగా ఇది ఎంతో లాభదాయకమైన సంపద. ఇప్పుడు నువ్వన్న మాటలన్నీ నేను విన్నాను. అయితే నువ్వు ఈ తోటను నీ బంధువుల్లో పంచిపెడితే సముచితంగా ఉంటుందని నేను భావిస్తున్నాను" అని అన్నారు.

దానికి అబూ తల్హా (రదియల్లాహు అన్హు) "(అలాగే) చేస్తాను దైవప్రవక్తా!" అని అన్నారు. అన్న ప్రకారమే ఆ తోటను ఆయన తన బంధువులకు, పెద్దనాన్న, చిన్నాన్న పిల్లలకు పంచిపెట్టారు."

(బుఖారీ – ముస్లిం)

'మాలున్ రాబిహున్'. ఈ పదం సహీహ్‌లో 'రాబిహున్' మరియు 'రాయివున్' రెండు విధాలా ఉల్లేఖించబడింది. 'రాయివున్' అంటే దీని లాభం తిరిగి నీకే చేరుతుంది అని అర్థం. 'బైరహా' ఒకానొక ఖర్జూరపు తోట. ఈ పదం బీరహా అని కూడా ఉచ్చరించబడింది.

(సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణం)

English

Anas (radiyallahu anhu) reported: Abu Talhah (radiyallahu anhu) was the richest among the Ansar of Al-Madinah and possessed the largest property from palm-trees, and among his possessions what he loved most, was his garden known as Bairuha’ which was opposite the mosque, and Messenger of Allah ﷺ often visited it and drank from its fresh water. When this Ayah was revealed: “By no means shall you attain Al-Birr (piety, righteousness – here it means Allah’s reward, i.e., Jannah), unless you spend (in Allah’s Cause) of that which you love,” (3:92), Abu Talhah came to Messenger of Allah ﷺ and said, “Allah says in His Book: `By no means shall you attain Al-Birr, unless you spend (in Allah’s Cause) of that which you love,‘ and the dearest of my property is Bairuha’ so I have given it as Sadaqah (charity) for Allah’s sake, and I anticipate its reward with Him; so spend it, O Messenger of Allah, as Allah guides you.” Messenger of Allah ﷺ said, “Well-done! That is profit earning property. I have heard what you have said, but I think you should spend it on your nearest relatives.” So Abu Talhah (radiyallahu anhu) distributed it among nearest relatives and cousins.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

  1. ఈ హదీసులో దైవప్రవక్త సహచరులు ప్రదర్శించిన నిరుపమాన త్యాగభావం ప్రకటితమవుతోంది. ఆయన సహచరులు దైవ సంకేతంపై ప్రాణాలర్పించటానికైనా సిద్ధంగా ఉండేవారు.
  2. 'మీరు పుణ్యస్థాయికి చేరుకోలేరంటే' పరిపూర్ణ విశ్వాస స్థాయికి చేరుకోలేరని అర్థం. అత్యంత ప్రీతికరమైన వస్తువుని త్యాగం చేయటం పరిపూర్ణ విశ్వాసానికి తార్కాణం.
  3. బంధువులు నిరుపేదలు, అభాగ్యులై ఉంటే దానధర్మాలు చేసేటప్పుడు వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. లేని పరిస్థితుల్లో ఎవరికయినా ఇవ్వొచ్చు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|37. ప్రీతికరమైన సంపదను ఖర్చు చేయటం|హదీసు 299