హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 369వ అధ్యాయం: నిషిద్ధ విషయాలకు పాల్పడినవాడు పాప నిష్కృతి కోసం ఏం చేయాలి? ఏం పఠించాలి. ఈ అధ్యాయంలో 4 ఖుర్ఆన్ ఆయతులు, 1 హదీసులు (హదీసు 1809) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
369. నిషిద్ధ విషయాలకు పాల్పడినవాడు పాప నిష్కృతి కోసం ఏం చేయాలి? ఏం పఠించాలి
باب ما يقوله ويفعله من ارتكب منهياً عنه
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్యఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{وَإِمَّا يَنْزَغَنَّكَ مِنَ الشَّيْطَانِ نَزْغٌ فَاسْتَعِذْ بِاللَّهِ} [فصلت: ٣٦]
"ఒకవేళ నీకు షైతాన్ నుండి ఏదయినా దుష్ ప్రేరణ కలిగితే అప్పుడు అల్లాహ్ శరణు వేడుకో. ఆయన అన్నీ వినే వాడూ, అన్నీ ఎరిగినవాడూను." (హామీమ్ అస్సజ్దా లేక ఫుస్సిలత్: 36)
{إِنَّ الَّذِينَ اتَّقَوْا إِذَا مَسَّهُمْ طَائِفٌ مِنَ الشَّيْطَانِ تَذَكَّرُوا فَإِذَا هُمْ مُبْصِرُونَ} [الأعراف: ٢٠١]
"వాస్తవానికి భయభక్తులు కలవారి స్థితి ఇలా ఉంటుంది. ఎప్పుడైనా షైతాను ప్రభావం వల్ల వారికి ఏదైనా చెడు ఆలోచన తట్టినప్పటికీ, వారు తక్షణం అప్రమత్తులవుతారు. తరువాత వారు అవలంబించవలసిన సరైన మార్గం ఏమిటో వారికి స్పష్టంగా కనిపిస్తుంది." (ఆరాఫ్: 201)
{وَالَّذِينَ إِذَا فَعَلُوا فَاحِشَةً أَوْ ظَلَمُوا أَنْفُسَهُمْ ذَكَرُوا اللَّهَ فَاسْتَغْفَرُوا لِذُنُوبِهِمْ وَمَنْ يَغْفِرُ الذُّنُوبَ إِلَّا اللَّهُ وَلَمْ يُصِرُّوا عَلَى مَا فَعَلُوا وَهُمْ يَعْلَمُونَ أُولَئِكَ جَزَاؤُهُمْ مَغْفِرَةٌ مِنْ رَبِّهِمْ وَجَنَّاتٌ تَجْرِي مِنْ تَحْتِهَا الأَنْهَارُ خَالِدِينَ فِيهَا وَنِعْمَ أَجْرُ الْعَامِلِينَ} [آل عمران: ١٣٥-١٣٦]
"సజ్జనుల స్థితి ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా ఏదయినా అశ్లీల కార్యం వారివల్ల జరిగిపోతే లేదా ఏదైనా పాపం చేసి, వారు తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్నట్లయితే, వెంటనే వారికి అల్లాహ్ జ్ఞాపకం వస్తాడు. అప్పుడు వారు ఆయనను తమ తప్పులు క్షమించు అని వేడుకుంటారు- ఎందుకంటే అల్లాహ్ తప్ప పాపాలను క్షమించగలిగేవాడు ఎవడున్నాడని- వారు తాము చేసిన తప్పులను గురించి మొండివాదం చెయ్యరు. అలాంటి వారికి తమ ప్రభువు వద్ద లభించే ప్రతిఫలం ఏమిటంటే, ఆయన వారిని క్షమిస్తాడు. క్రింద సెలయేళ్లు ప్రవహించే ఉద్యానవనాలలోకి వారిని ప్రవేశింపజేస్తాడు. వారు అక్కడ శాశ్వతంగా ఉంటారు. మంచిపనులు చేసే వారికి ఎంత చక్కని ప్రతిఫలం!" (ఆలి ఇమ్రాన్: 135,136)
{وَتُوبُوا إِلَى اللَّهِ جَمِيعاً أَيُّهَا الْمُؤْمِنُونَ لَعَلَّكُمْ تُفْلِحُونَ} [النور: ٣١]
"విశ్వసించిన ప్రజలారా! మీరంతా కలిసి అల్లాహ్ వైపునకు మరలి క్షమాభిక్షను వేడుకోండి. మీకు సాఫల్యం కలగవచ్చు." (నూర్: 31)
ముఖ్యాంశాలు
మనిషన్న తర్వాత అతని వల్ల తప్పులు జరగకుండా ఉండవు. అది మానవ సహజం. అయితే తప్పు చేసిన తర్వాత మొండివాదనలు చేయడం, చేసిన తప్పుని ఉద్దేశ్యపూర్వకంగా మళ్ళీమళ్ళీ చేయటం మాత్రం సమంజసం కాదు. దేవుని మీద విశ్వాసం కలిగివున్న మనుషులు తమవల్ల తప్పు జరిగిపోతే వెంటనే అందుకు పశ్చాత్తాపం చెంది దైవసన్నిధిలో క్షమాభిక్ష వేడుకుంటారు.
English
“And if an evil whisper from Shaitan (Satan) tries to turn you away (O Muhammad ﷺ) (from doing good), then seek refuge in Allah.” [Fuṣṣilat 41:36]
“Verily, those who are Al-Muttaqun (the pious), when an evil thought comes to them from Shaitan (Satan), they remember (Allah), and (indeed) they then see (aright).” [Al-A‘rāf 7:201]
“And those who, when they have committed Fahishah or wronged themselves with evil, remember Allah and ask forgiveness for their sins; – and none can forgive sins but Allah – and do not persist in what (wrong) they have done, while they know. For such, the reward is forgiveness from their Rubb, and Gardens with rivers flowing underneath (Jannah), wherein they shall abide forever. How excellent is this reward for the doers (who do righteous deeds according to Allah’s Orders)!” [Āl ‘Imrān 3:135–136]
“And all of you beg Allah to forgive you all, O believers, that you may be successful.” [An-Nūr 24:31]
హదీసు 1809
وعَنْ أبي هُرَيْرَةَ رضي اللَّه عَنْهُ عَن النَّبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قال: "مَنْ حَلَف فَقَالَ في حلفِهِ: بِالَّلاتِ والْعُزَّى، فَلْيقُلْ: لاَ إلَهَ إلاَّ اللَّه ومَنْ قَالَ لِصَاحِبِهِ، تَعَالَ أقَامِرْكَ فَليتَصَدَّق". متفقٌ عليه. [كتاب المنثورات والملح]
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: 'లాత్, ఉజ్జా (దేవుళ్ళ) మీద ఒట్టు' అని ప్రమాణం చేసినవాడు వెంటనే 'లా ఇలాహ ఇల్లల్లాహ్' పఠించాలి. అలాగే తన మిత్రునితో, "జూదం ఆడుకుందాం…రా" అన్నవాడు దానధర్మాలు చేయాలి.
(బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని తఫ్సీర్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఐమాన్ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) said: The Prophet ﷺ said, “He who takes an oath and involuntarily says: `By Al-Lat and Al-`Uzza’ should at once affirm: `La ilaha illallah (there is no true god except Allah)’, and he who says to his companion: `Come let’s gamble’ should make expiation by giving something in charity.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
లాత్, ఉజ్జాలనేవి అరబ్బుల దేవతా విగ్రహాలు. వీటి మీదగాని మరే ఇతర విగ్రహం మీదగాని లేక దైవేతరుల్లో ఎవరిమీదనయినా గాని ప్రమాణం చేస్తే అది షిర్క్ (బహుదైవారాధన) అవుతుంది. ఒకవేళ ఎవరైనా ఆ విధంగా దేవేతరుల మీద ప్రమాణం చేస్తే వారు వెంటనే 'లా ఇలాహ ఇల్లల్లాహ్' కలిమా పఠించి సరిక్రొత్తగా విశ్వాసం స్వీకరించాలి. మరో విషయం ఏమిటంటే సత్కార్యాల వల్ల పాపకార్యాలు తొలగిపోతాయి. కనుక మనిషి తెలిసో తెలియకో పాపం చేస్తే దాని నిష్కృతి కోసం అతను దైవసన్నిధిలో పశ్చాత్తాప హృదయంతో క్షమాపణలు వేడుకొని స్తోమత మేరకు దానధర్మాలు చేయాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|369. నిషిద్ధ విషయాలకు పాల్పడినవాడు పాప నిష్కృతి కోసం ఏం చేయాలి? ఏం పఠించాలి|హదీసు 1809
You must be logged in to post a comment.