హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 370వ అధ్యాయం: ప్రళయ చిహ్నాల ప్రకరణం. ఈ అధ్యాయంలో 61 హదీసులు (హదీసు 1810 – 1870) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
370. ప్రళయ చిహ్నాల ప్రకరణం
بابُ المنثورات والملح
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 1810
عَن النَّواس بنِ سَمْعانَ رضي اللَّه عَنْهُ قالَ: ذَكَرَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم الدَّجَّالَ ذَاتَ غَدَاةٍ، فَخَفَّض فِيهِ، وَرَفَع حَتَّى ظَنَناه في طَائِفَةِ النَّخْلِ، فَلَمَّا رُحْنَا إلَيْهِ، عَرَفَ ذلكَ فِينَا فقالَ:"مَا شَأنُكُمْ؟ "قُلْنَا: يَارَسُولَ اللَّهِ ذَكَرْتَ الدَّجَّال الْغَدَاةَ، فَخَفَّضْتَ فِيهِ وَرَفَعْتَ، حَتَّى ظَنَنَّاه فِي طَائِفةِ النَّخْلِ فقالَ:"غَيْرُ الدَّجَالِ أخْوفَني عَلَيْكُمْ، إنْ يخْرجْ وَأنَا فِيكُمْ، فَأنَا حَجِيجُه دونَكُمْ، وَإنْ يَخْرجْ وَلَسْتُ فِيكُمْ، فكلُّ امريءٍ حَجيجُ نَفْسِهِ، واللَّه خَليفَتي عَلى كُلِّ مُسْلِمٍ. إنَّه شَابٌ قَطَطٌ عَيْنُهُ طَافِيَةٌ، كأَنَّي أشَبِّهُه بعَبْدِ الْعُزَّى بنِ قَطَنٍ، فَمَنْ أدْرَكَه مِنْكُمْ، فَلْيَقْرَأْ عَلَيْهِ فَوَاتِحَ سُورةِ الْكَهْفِ، إنَّه خَارِجٌ خَلَّةً بَينَ الشَّامِ وَالْعِرَاقِ، فَعَاثَ يمِيناً وَعاثَ شِمالاً، يَا عبَادَ اللَّه فَاثْبُتُوا". قُلْنَا يَا رسول اللَّه ومَالُبْثُه في الأرْضِ؟ قالَ:"أرْبَعُون يَوْماً: يَوْمٌ كَسَنَةٍ، وَيَوْمٌ كَشَهْرٍ، وَيوْمٌ كجُمُعَةٍ، وَسَائِرُ أيَّامِهِ كأَيَّامِكُم". قُلْنَا: يَا رَسُول اللَّه، فَذلكَ الْيَوْمُ الَّذِي كَسَنَةٍ أتكْفِينَا فِيهِ صلاةُ يَوْمٍ؟ قَال:"لا، اقْدُرُوا لَهُ قَدْرَهُ". قُلْنَا: يَارَسُولَ اللَّهِ وَمَا إسْراعُهُ في الأرْضِ؟ قالَ:"كَالْغَيْث استَدبَرَتْه الرِّيحُ، فَيَأْتي عَلَى الْقَوْم، فَيَدْعُوهم، فَيؤْمنُونَ بِهِ، ويَسْتجيبون لَهُ فَيَأمُرُ السَّماءَ فَتُمْطِرُ، والأرْضَ فَتُنْبِتُ، فَتَرُوحُ عَلَيْهمْ سارِحتُهُم أطْوَلَ مَا كَانَتْ ذُرى، وَأسْبَغَه ضُرُوعاً، وأمَدَّهُ خَواصِرَ، ثُمَّ يَأْتي الْقَوْمَ فَيَدْعُوهم، فَيَرُدُّون عَلَيهِ قَوْلهُ، فَيَنْصَرف عَنْهُمْ، فَيُصْبحُون مُمْحِلينَ لَيْسَ بأيْدِيهم شَيءٌ منْ أمْوالِهم، وَيَمُرُّ بِالخَربَةِ فَيقول لَهَا: أخْرجِي كُنُوزَكِ، فَتَتْبَعُه، كُنُوزُهَا كَيَعَاسِيب النَّحْلِ، ثُّمَّ يدْعُو رَجُلاً مُمْتَلِئاً شَباباً فَيضْربُهُ بالسَّيْفِ، فَيَقْطَعهُ، جِزْلَتَيْن رَمْيَةَ الْغَرَضِ، ثُمَّ يَدْعُوهُ، فَيُقْبِلُ، وَيَتَهلَّلُ وجْهُهُ يَضْحَكُ. فَبَينَما هُو كَذلكَ إذْ بَعَثَ اللَّه تَعَالى المسِيحَ ابْنَ مَرْيم صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَيَنْزِلُ عِنْد المَنَارَةِ الْبَيْضآءِ شَرْقيَّ دِمَشْقَ بَيْنَ مَهْرُودتَيْنِ، وَاضعاً كَفَّيْهِ عَلى أجْنِحةِ مَلَكَيْنِ، إذا طَأْطَأَ رَأسهُ، قَطَرَ وَإِذَا رَفَعَهُ تَحدَّر مِنْهُ جُمَانٌ كَاللُّؤلُؤ، فَلا يَحِلُّ لِكَافِر يَجِدُّ ريحَ نَفَسِه إلاَّ مَاتَ، ونَفَسُهُ يَنْتَهِي إلى حَيْثُ يَنْتَهِي طَرْفُهُ، فَيَطْلُبُه حَتَّى يُدْرِكَهُ بَباب لُدٍّ فَيَقْتُلُه. ثُمَّ يَأتِي عِيسَى صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَوْماً قَدْ عَصَمَهُمُ اللَّه مِنْهُ، فَيَمْسَحُ عنْ وُجوهِهِمْ، ويحَدِّثُهُم بِدرَجاتِهم فِي الجنَّةِ. فَبَينَما هُوَ كَذلِكَ إذْ أوْحَى اللَّه تَعَالى إلى عِيسى صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أنِّي قَدْ أَخرَجتُ عِبَاداً لي لا يدانِ لأحَدٍ بقِتَالهمْ، فَحَرِّزْ عِبادي إلى الطُّورِ، وَيَبْعَثُ اللَّه يَأْجُوجَ ومَأجوجَ وَهُمْ مِنْ كُلِّ حَدِبٍ يَنْسلُون، فيَمُرُّ أوَائلُهُم عَلى بُحَيْرةِ طَبرِيَّةَ فَيَشْرَبون مَا فيهَا، وَيمُرُّ آخِرُهُمْ فيقولُونَ: لَقَدْ كَانَ بهَذِهِ مرَّةً ماءٌ. وَيُحْصَرُ نَبيُّ اللَّهِ عِيسَى صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وَأصْحَابُهُ حَتَّى يكُونَ رأْسُ الثَّوْرِ لأحدِهمْ خيْراً منْ مائَةِ دِينَارٍ لأحَدِكُمُ الْيَوْمَ، فَيرْغَبُ نَبِيُّ اللَّه عِيسَى صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وأَصْحَابُه، رضي اللَّه عَنْهُمْ، إلى اللَّهِ تَعَالى، فَيُرْسِلُ اللَّه تَعَالى عَلَيْهِمْ النَّغَفَ في رِقَابِهِم، فَيُصبحُون فَرْسى كَموْتِ نَفْسٍ وَاحِدَةٍ، ثُمَّ يهْبِطُ نَبِيُّ اللَّه عِيسَى صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وَأصْحابهُ رضي اللَّه عَنْهُمْ، إلى الأرْضِ، فَلاَ يَجِدُون في الأرْضِ مَوْضِعَ شِبْرٍ إلاَّ مَلأهُ زَهَمُهُمْ وَنَتَنُهُمْ، فَيَرْغَبُ نَبيُّ اللَّه عِيسَى, صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم, وَأصْحابُهُ, رضي اللَّه عَنْهُمْ إلى اللَّه تَعَالَى, فَيُرْسِلُ اللهُ تَعَالَى طيْراً كَأعْنَاقِ الْبُخْتِ، فَتحْمِلُهُمْ، فَتَطرَحُهم حَيْتُ شَآءَ اللَّه، ثُمَّ يُرْسِلُ اللَّه عَزَّ وجَلَّ مطَراً لاَ يَكِنُّ مِنْهُ بَيْتُ مَدَرٍ وَلاَ وَبَرٍ، فَيَغْسِلُ الأرْضَ حَتَّى يَتْرُكَهَا كالزَّلَقَةِ. ثُمَّ يُقَالُ لِلأرْضِ: أنْبِتي ثَمرَتَكِ، ورُدِّي برَكَتَكِ، فَيَوْمئِذٍ تأكُلُ الْعِصَابَة مِن الرُّمَّانَةِ، وَيسْتظِلون بِقِحْفِهَا، وَيُبارَكُ فِي الرِّسْلِ حَتَّى إنَّ اللّقْحَةَ مِنَ الإبِلِ لَتَكْفي الفئَامَ مِنَ النَّاس، وَاللّقْحَةَ مِنَ الْبَقَرِ لَتَكْفي الْقَبِيلَةَ مِنَ النَّاس، وَاللّقْحَةَ مِنَ الْغَنمِ لَتَكْفي الفَخِذَ مِنَ النَّاس. فَبَيْنَمَا هُمْ كَذَلِكَ إذْ بَعَثَ اللَّه تَعالَى رِيحاً طَيِّبَةً، فَتأْخُذُهم تَحْتَ آبَاطِهِمْ، فَتَقْبِضُ رُوحَ كُلِّ مُؤمِن وكُلِّ مُسْلِمٍ، وَيبْقَى شِرَارُ النَّاسِ يَتهَارجُون فِيهَا تَهَارُج الْحُمُرِ فَعَلَيْهِم تَقُومُ السَّاعَةُ" رواهُ مسلم. قَوله:"خَلَّةً بيْنَ الشَّام وَالْعِرَاقِ"أيْ: طَريقاً بَيْنَهُما. وقَوْلُهُ:"عاثَ"بالْعْينِ المهملة والثاءِ المثلَّثةِ، وَالْعَيْثُ: أشًَدُّ الْفَسَادِ."وَالذُّرَى": بِضًمِّ الذَّالِ المُعْجَمَةَ وَهوَ أعالي الأسْنِمَةِ. وهُو جَمْعُ ذِرْوَةٍ بِضَم الذَّالِ وَكَسْرِهَا"واليَعاسِيبُ": ذُكُورُ النَّحْلِ."وجزْلتَين"أيْ: قِطْعتينِ،"وَالْغَرَضُ": الهَدَفُ الَّذِي يُرْمَى إليْهِ بِالنَّشَّابِ، أيْ: يَرْمِيهِ رَمْيَةً كَرمْي النَّشَّابِ إلى الْهَدَفِ."وَالمهْرودة"بِالدَّال المُهْمَلَة المعجمة، وَهِي: الثَّوْبُ المَصْبُوغُ. قَوْلُهُ:"لاَ يَدَانِ"أيْ: لاَ طَاقَةَ."وَالنَّغَفُ": دٌودٌ."وفَرْسَى": جَمْعُ فَرِيسٍ، وَهُو الْقَتِيلُ: وَ"الزَّلَقَةُ"بفتحِ الزَّاي واللاَّمِ وبالْقافِ، ورُوِيَ"الزُّلْفَةُ"بضمِّ الزَّاي وإسْكَانِ اللاَّمِ وبالْفاءِ، وهي المِرْآةُ."وَالعِصَابَة": الجماعةُ،"وَالرِّسْلُ"بكسرِ الراءِ: اللَّبنُ،"وَاللّقْحَة": اللَّبُونُ،"وَالْفئَام"بكسر الفاءِ وبعدها همزة ممدودة: الجمَاعَةٌ."وَالْفَخِذُ"مِنَ النَّاسِ: دُونَ الْقَبِيلَةِ.
హజ్రత్ నవ్వాస్ బిన్ సమ్ఆన్ (రదియల్లాహు అన్హు) కథనం: ఒక రోజు ఉదయం దైవప్రవక్త ﷺ దజ్జాల్ ఉపద్రవం ఎంత నీచంగా, ఎంత ప్రమాదకరంగా ఉంటుందో వివరించారు. అది విని మేము ఆ దజ్జాల్ అనేవాడు ఇక్కడే ఈ ఖర్జూర పొదల్లోనే ఉన్నాడేమో అనుకున్నాం.
ఆ తర్వాత మేము దైవప్రవక్త ﷺ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మాలో ఉన్న ఆందోళనను గమనించి, "ఏమయింది మీకు?" అని అడిగారు. అందుకు మేము సమాధానమిస్తూ, "దైవప్రవక్తా! మీరు ప్రొద్దున దజ్జాల్ ఉపద్రవం ఎంత నీచంగా, మరెంత ప్రమాదకరంగా ఉంటుందో వివరించారు. అది విన్న తర్వాత మాకు ఆ దజ్జాల్ అనేవాడు ఇక్కడే, ఈ ఖర్జూర పొదల్లోనే ఉన్నాడేమోననిపించింది" అని అన్నాం. అప్పుడు దైవప్రవక్త ﷺ ఇలా చెప్పారు:
"మీ విషయంలో దజ్జాల్ కన్నా ఇతర విషయాల గురించి నాకు ఎక్కువ భయం వేస్తోంది. దజ్జాల్ గనక నా సమక్షంలో బయటికి వస్తే మీ అవసరం లేకుండా నేనొక్కణ్ణే అతన్ని ప్రతిఘటించగలను. ఒకవేళ అతను నా మరణానంతరం బయటికి వస్తే అప్పుడు ప్రతి ఒక్కడూ తన్నుతాను కాపాడుకోవాలి. అప్పుడు ప్రతి ముస్లిం కొరకు దేవుడు నా స్థానంలో ఉంటాడు (అంటే ఆయనే వారిని పర్యవేక్షిస్తాడు). ఆ దజ్జాల్ యువకుడై ఉంటాడు. అతనికి ఉంగరాల జుట్టు ఉంటుంది. అతని ఒక కన్ను (ద్రాక్ష పండులాగా) పైకి ఉబికి ఉంటుంది. నేనతన్ని అబ్దుల్ ఉజ్జా బిన్ ఖతన్తో పోలుస్తున్నాను. మీలో ఎవరికైనా అతను ఎదురుపడితే మీరు అతని మీద కహఫ్ సూరా ప్రారంభ సూక్తులు పఠించండి. అతను సిరియా-ఇరాక్‌ల మధ్యనున్న మార్గంలో ప్రత్యక్షమవు తాడు. కుడివైపు, ఎడమవైపు కల్లోలం రేకెత్తిస్తాడు. ఓ దైవదాసులారా! (ఆ సమయంలో) మీరు (ధర్మం మీద) స్థిరంగా నిలబడండి."
"అతను ఎంతకాలం ఈ భూమ్మీద ఉంటాడు?" అని మేము అడిగాం. అందుకాయన, "నలభై రోజులుంటాడు. వాటిలో ఒక రోజు ఒక సంవత్సరమంత ఉంటుంది. మరో రోజు ఒక నెలంత ఉంటుంది. ఇంకో రోజు వారమంత ఉంటుంది. మిగతా రోజులు మాత్రం మన వారాల్లాగానే ఉంటాయి" అని చెప్పారు. మళ్ళీ మేము, "దైవప్రవక్తా! ఒకరోజే ఒక సంవత్సరమంత ఉంటుంది కదా! మరి ఆ రోజు మేము ఒక దినపు (ఐదు) నమాజులు చేసుకుంటే సరిపోతుందా?" అని అడిగాం. అందుకాయన 'లేదు. మీరు అంచనా ద్వారా (సంవత్సరం పొడుగునా) నమాజులు చేయాలి' అని చెప్పారు. "దైవప్రవక్తా! భూమి మీద ఆ ఉపద్రవ వేగం ఎలా ఉంటుంది?" అని మేము మళ్ళీ అడిగాం. అందుకాయన, "గాలివానలా ఉంటుంది. అతను (దజ్జాల్) ప్రజల దగ్గరికెళ్ళి (తనను అనుసరించమని) పిలుపునిస్తాడు. ప్రజలు అతన్ని విశ్వసించి అతను చేయమన్న పనులు చేస్తారు. తర్వాత అతను ఆకాశాన్ని ఆదేశిస్తే అది వర్షం కురిపిస్తుంది. భూమిని ఆదేశిస్తే అది చెట్లు మొలిపిస్తుంది. ప్రజల దగ్గరుండే మేతమేసే జంతువులు (ఆ పచ్చిక మేసి) సాయంత్రం ఇండ్లకు తిరిగి వచ్చేటప్పటికి వాటి మూపురాలు మునుపటి కంటే ఎత్తుగా ఉంటాయి. వాటి పొదుగులు బాగా నిండుగా ఉంటాయి. మరింత విశాలమవుతాయి. తర్వాత అతను మరొకళ్ళ దగ్గరికి వెళ్లి తనను విశ్వసించమని వారిని పిలుస్తాడు. కాని వారు అతన్ని విశ్వసించటానికి నిరాకరిస్తారు. అతను తిరిగి వెళ్లిపోగానే వారికి కరువుకాటకాలొస్తాయి. వారి సంపద మొత్తం అయిపోతుంది. అతను ఏదయినా పాడుబడిన చోటు గుండా వెళ్తూ, "నీలో ఉన్న నిధుల్ని బయటికి తీయి" అంటే, తెనెటీగలు తమ రాణి ఈగ వెంటబడినట్లు భూగర్భ నిధులన్నీ అతని వెంటపడతాయి. తర్వాత అతను నిండు యవ్వనంలో ఉన్న మనిషిని పిలిచి అతనిమీద కత్తితో దాడిచేసి విలుకాడి గురిలాగా అతన్ని రెండు ముక్కలుగా నరికేస్తాడు. తర్వాత అతన్ని పిలవగానే అతను కాంతిలీనుతున్న ముఖంతో నవ్వుతూ తిరిగొస్తాడు.
(దజ్జాల్ ఇలాంటి మాయపనులు చేస్తున్నప్పుడే) దేవుడు మర్యమ్ కుమారుడైన మసీహ్‌ను భూమి మీదకు పంపిస్తాడు. ఆయన ఆకాశం నుండి డెమాస్కస్ తూరుపు దిక్కున తెల్లటి మినారు మీద దిగుతారు. పసుపు రంగు బట్టలు ధరించి ఇద్దరు దైవదూతల రెక్కల మీద (అంటే భుజాల మీద) అరచేతులు ఉంచి దిగుతారు. ఆయన తల వంచగానే నీటి బిందువులు రాలిపడతాయి. తల పైకెత్తినప్పుడు కూడా ముత్యాల్లాంటి వెండి బిందువులు రాలిపడతాయి. ఆయన శ్వాస సెగ తగిలిన ప్రతి కాఫిర్ చనిపోతాడు. ఆయన శ్వాస తన చూపు మేరకు చేరుకుంటుంది. ఆయన దజ్జాల్ కోసం వెతుకుతారు. చివరికి లుద్ ద్వారం వద్ద అతన్ని పట్టుకొని చంపేస్తారు. ఆ తర్వాత ఈసా (అలైహి) దేవుడు దజ్జాల్ ఉపద్రవం నుంచి సురక్షితంగా ఉంచిన వారి దగ్గరికి వెళ్తారు. వారి ముఖాలను తన చేత్తో స్పృశిస్తారు. స్వర్గంలో వారికి లభించబోయే అంతస్తుల గురించి శుభవార్తనందజేస్తారు. ఆ కాలంలోనే దేవుడు "నేను పుట్టించిన కొందరు దాసులతో పోరాడే శక్తి ఎవరికీ లేదు, కనుక నువ్వు నా ఈ దాసులను తూర్ కొండపైకి తీసుకెళ్ళి వారిని రక్షించు" అని వహీ ద్వారా ఆదేశిస్తాడు. అప్పుడు దేవుడు యాజూజ్ మాజూజ్లను పంపిస్తాడు. వారు ప్రతి ఎత్తయిన ప్రదేశం నుంచి క్రిందికి వేగంగా పరుగెత్తుకుంటూ వస్తారు. వారి మొదటి గుంపు తబ్రియా నది గుండా పోతుంది. పోతూపోతూ చుక్క మిగల్చకుండా అక్కడి నీళ్ళన్నీ నాకి వెళ్ళిపోతుంది. ఆ దారిగుండా చివరి గుంపు పోతూ ఇక్కడ ఇంతకు ముందెన్నడయినా నీళ్లు ఉండేవా? అంటుంది.
(ఈ కాలంలో) దైవప్రవక్త ఈసా మరియు ఆయన సహచరులు ముట్టడించబడి ఉంటారు. వారి పరిస్థితి ఎంత దయనీయంగా తయారవుతుందంటే ఒక ఎద్దు తల, వారికి నేటి మన వంద దీనార్లకంటే విలువైనదిగా అనిపిస్తుంది. దైవప్రవక్త ఈసా (అలైహి) మరియు ఆయన సహచరులు (దేవుడు వారి పట్ల ప్రసన్నుడు అవుగాక) దేవుని వైపు మరలగానే దేవుడు యాజూజ్ మాజూజ్ల మెడల్లో ఒక పురుగు పుట్టిస్తాడు. దాంతో వారు హఠాత్తుగా ఒకే ప్రాణంలాగా మరణిస్తారు. ఆ తర్వాత దైవప్రవక్త ఈసా మరియు ఆయన సహచరులు నేలమీదికి దిగివస్తారు. నేల మొత్తం ఒక జానెడు స్థలం కూడా ఖాళీ లేకుండా వారి (శవాల) మాలిన్యంతో దుర్గంధ భరితంగా ఉంటుంది. అప్పుడు దైవప్రవక్త ఈసా (అలైహి) మరియు ఆయన సహచరులు మళ్ళీ (ప్రార్థన కోసం) మరలుతారు. దేవుడు (వారి ప్రార్థన విని) బుఖ్తీ ఒంటె మెడల వంటి పెద్ద పెద్ద పక్షుల్ని పంపిస్తాడు. ఆ పక్షులు వారి శవాలను ఎత్తుకెళ్ళి అల్లాహ్ కోరిన చోట పారేస్తాయి. ఆ తర్వాత దేవుడు వర్షం కురిపిస్తాడు. ఆ వర్షం ప్రతి ఇల్లు, ప్రతి గుడారం మీద కురిసి నేల మొత్తాన్ని నున్నటి రాయిలాగా లేక అద్దంలాగా శుభ్రం చేసేస్తుంది. తర్వాత భూమిని "నీ పండ్లను మొలకెత్తించు. నీ శుభాలను వ్యాపింపజేయి" అని పురమాయించటం జరుగుతుంది. అప్పుడు ఒక దానిమ్మ పండుని అనేక మంది తిని దాని తోలుతో నీడపట్టుకోగల్గుతారు. పాలలో ఎంత శుభం అవతరిస్తుందంటే పాలిచ్చే ఒక ఒంటె ఒక సంఘానికి సరిపోతుంది. ఒక ఆవు ఒక తెగకు సరిపోతుంది. ఒక మేక ఒక కుటుంబానికి సరిపోతుంది. అదే సమయంలో దేవుడు ఒక పవిత్రమైన గాలిని పంపిస్తాడు. అది ఆ ముస్లింలను వారి చంకల క్రిందుగా తాకుతుంది. ఆ గాలే ప్రతి విశ్వాసి మరియు ప్రతి ముస్లిం ప్రాణం తీస్తుంది. (ఆ తర్వాత) కేవలం చెడ్డవారు మాత్రమే మిగిలిపోతారు. వారు భూమ్మీద గాడిదల్లాగా జనం అందరి ముందు స్త్రీలతో సంభోగిస్తుంటారు. వీరి మీదే ప్రళయం విరుచుకుపడుతుంది.
(ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని ఫితన్ ప్రకరణం)
English
An-Nawwas bin Sam`an (radiyallahu anhu) reported: One morning the Messenger of Allah (sallallaahu alayhi wa sallam) made a mention of Dajjal, and he described him to be insignificant and at the same time described him so significant that we thought he was on the date-palm trees (i.e., nearby). When we went to him (the Prophet (sallallaahu alayhi wa sallam)) in the evening, he perceived the sign of fear on our faces. He said, “What is the matter with you?” We said: “O Messenger of Allah, you talked about Dajjal this morning raising your voice and lowering it until we thought he was hiding in the palm-trees grove: He said: “Something other than Dajjal make worry about you. If he appears while I am with you, I will defend you against him. But if he appears after I die, then everyone of you is his own defender. Allah is the One Who remains after me to guide every Muslim. Dajjal will be a young man with very curly hair with one eye protruding (with which he cannot see). I compare (his appearance) to that of Al-`Uzza bin Qatan. He who amongst you survives to see him, should recite over him the opening Ayat of Surat Al-Kahf (i.e., Surat 18: Verses 1-8). He will appear on the way between Syria and Iraq and will spread mischief right and left. O slaves of Allah! Remain adhered to the truth.” We asked: “O Messenger of Allah! How long will he stay on the earth?” He said, “For forty days. One day will be like a year, one day like a month, one day like a week and the rest of the days will be like your days.” We said: “O Messenger of Allah! Will one day’s Salat (prayer) suffice for the Salat of that day which will be equal to one year?” Thereupon he said, “No, but you must make an estimate of time and then offer Salat.” We said: “O Messenger of Allah! How quickly will he walk upon the earth?” Thereupon he said, “Like cloud driven by the wind (i.e., very quickly). He will come to the people and call them to his obedience and they will affirm their faith in him and respond to him. He will then give command to the sky and it will send its rain upon the earth and he will then send his command to the earth and it will grow vegetation. Then in the evening their pasturing animals will come to them with their humps very high and their udders full of milk and their flanks stretched. He will then come to another people and invite them, but they will reject him and he will leave them, in barren lands and without any goods and chattels! He would then walk through the waste land and say to it: `Bring forth your treasures’, and the treasures will come out and follow him like swarms of bees. He will then call a person brimming with youth and strike him with the sword and cut him into two pieces and make these pieces lie at a distance, which is generally between the archer and his target. He will then call that young man and he will come forward, laughing, with his face gleaming out of joy; and it will be at this very time that Allah will send `Isa (Jesus), son of Maryam (Mary) who will descend at the white minaret in the eastern side of Damascus, wearing two garments lightly dyed and placing his hands on the wings of two angels. When he will lower his head, there would fall drops of water from his head, and when he will raise it up, drops like pearls would scatter from it. Every disbeliever who will find his (i.e., `Isa’s) smell will die and his smell will reach as far as he will be able to see. He will then search for Dajjal until he will catch hold of him at the gate of Ludd (village near Jerusalem), and will kill him. Then the people, whom Allah will have protected, will come to `Isa son of Maryam, and he will wipe their faces and will inform them of their ranks in Jannah, and it will be under such conditions that Allah will reveal to `Isa these words: `I have brought forth from amongst my slaves such people against whom none will be able to fight, so take these people safely to the mountain.’ And then Allah will send Ya’juj and Ma’juj (Gog and Magog people) and they will sworn down from every slope. The first of them will pass the Lake Tabariyah (near the Dead Sea in Palestine) and drink all its water. And when the last of them will pass, he will say: `There was once water there.’ Prophet `Isa (sallallaahu alayhi wa sallam) and his companions will then be so much hard-pressed that the head of an ox will be dearer to them than one hundred dinar, and `Isa along with his companions, will make supplication to Allah, Who will send insects which will attack their (Ya’juj and Ma’juj people) neck until they all will perish like a single person. Prophet, `¦sa and his companions will then come down and they will not find in the earth as much space as a single span which would not be filled with their corpses and their stench. Prophet `Isa and his companions will then again beseech Allah, Who will send birds whose necks will be like those of Bactrian camels, and they will carry them and throw them where Allah will desire. Then Allah will send down rain which will spare no house in the city or in the countryside. It would wash away the earth until it appears like a mirror. Then the earth will be told to bring forth its fruit and restore its blessings; and as a result of this, there will grow such a big pomegranate that a group of people will eat from it and seek shelter under its skin. Milk will be so blessed that the milk of one she-camel will suffice for a large company and the cow will give so much milk, that it will suffice for a whole tribe. The sheep will give so much milk that the whole family will be able to drink out of that, and at that time Allah will send a pleasant wind which will soothe people even under their armpits, and will take the life of every Muslim and true believer, and only the wicked will survive. They will commit adultery in public like asses and the Resurrection Day will be held.”[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1810
హదీసు 1811
وَعَنْ رِبْعيِّ بْنِ حِرَاشٍ قَال: انْطَلَقْتُ مَعَ أبي مسْعُودٍ الأنْصارِيِّ إلى حُذَيْفَةَ بْنِ الْيَمَانِ رضي اللَّه عنهم فَقَالَ لَهُ أبُو مسعودٍ، حَدِّثْني مَا سمِعْت مِنْ رَسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، في الدَّجَّال قالَ:" إنَّ الدَّجَّالَ يَخْرُجُ وَإنَّ مَعَهُ مَاءً وَنَاراً، فَأَمَّا الَّذِي يَرَاهُ النَّاسُ مَاءً فَنَارٌ تُحْرِقُ، وَأمَّا الَّذِي يَرَاهُ النَّاسُ نَاراً، فَمَاءٌ بَاردٌ عذْبٌ، فَمَنْ أدْرَكَهُ مِنْكُمْ، فَلْيَقَعْ فِي الَّذي يَراهُ نَاراً، فَإنَّهُ ماءٌ عَذْبٌ طَيِّبُ" فَقَالَ أبُو مَسْعُودٍ: وَأنَا قَدْ سَمِعْتُهُ. متَّفَقٌ عَلَيْهِ.
హజ్రత్ రిబయీ బిన్ హిరాష్ కథనం: నేను అబూ మస్‌వూద్ అన్సారీ (రదియల్లాహు అన్హు) వెంట హుజైఫా బిన్ యమాన్ (రదియల్లాహు అన్హు) దగ్గరికి వెళ్ళాను. అప్పుడు అబూ మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) ఆయన్ని, "మీరు దజ్జాల్ గురించి దైవప్రవక్త ﷺ నోట ఏం విన్నారో చెప్పండి" అని అడిగారు. అందుకాయన ఇలా చెప్పారు: నిశ్చయంగా దజ్జాల్ బయటికి వస్తాడు. అతని వెంట నీరు మరియు అగ్ని ఉంటాయి. ప్రజలు నీరు అని అనుకున్నది కాల్చేది అవుతుంది. వారు అగ్ని అని అనుకున్నది తియ్యటి చల్లని నీరు అవుతుంది. కనుక మీలో ఎవరికయినా దజ్జాల్ ఎదురైతే అతను తాను అగ్ని అనుకున్న దాంట్లో పడిపోవాలి. అది తియ్యటి మంచి నీరు అవుతుంది.
అది విని అబూ మస్‌వూద్ (రదియల్లాహు అన్హు), "దైవప్రవక్త ﷺ నోట నేను కూడా ఈ మాట విన్నాను" అని అన్నారు.
(బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని అంబియా ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఫితన్ ప్రకరణం)
English
Rib`i bin Hirash (radiyallahu anhu) said: I accompanied Abu Mas`ud Al-Ansari to Hudaifah bin Al-Yaman (radiyallahu anhuma). Abu Mas`ud said to him: “Tell us what you heard from the Messenger of Allah (sallallaahu alayhi wa sallam) about Dajjal (the Antichrist).” Hudaifah said: He (sallallaahu alayhi wa sallam) said, “Dajjal will appear, and with him will be water and fire. That which people consider to be water will in fact be a burning fire, and that which people will consider to be fire will in fact be cool and sweet water. He who from amongst you happens to face him, should jump into that which he sees as fire for that will be nice and sweet water.” Abu Mas`ud said: “I have also heard this from the Messenger of Allah (sallallaahu alayhi wa sallam).”[Al-Bukhari and Muslim]
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1811
హదీసు 1812
وعَنْ عَبْدِ اللَّهِ بن عَمْرو بن العاصِ رَضي اللَّه عَنْهُما قالَ: قَالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"يخْرُجُ الدَّجَّالُ في أمَّتي فَيَمْكُثُ أربَعِينَ، لاَ أدْري أرْبَعِينَ يَوْماً، أو أرْبَعِينَ شَهْراً، أوْ أرْبَعِينَ عَاماً، فَيبْعثُ اللَّه تَعالى عِيسَى ابْنَ مَرْيمَ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَيَطْلُبُهُ فَيُهْلِكُه، ثُّمَّ يَمْكُثُ النَّاسُ سبْعَ سِنِينَ لَيْسَ بَيْنَ اثْنْينِ عدَاوَةٌ. ثُّمَّ يُرْسِلُ اللَّه، عزَّ وجَلَّ، ريحاً بارِدَةً مِنْ قِبلِ الشَّامِ، فَلا يبْقَى عَلَى وَجْهِ الأرْضِ أحَدٌ فِي قَلْبِهِ مِثْقَالُ ذَرَّةٍ مِنْ خَيْرٍ أوْ إيمَانٍ إلاَّ قَبَضَتْهُ، حتَّى لَوْ أنَّ أحَدَكُمْ دخَلَ فِي كَبِدِ جَبلٍ، لَدَخَلَتْهُ عَلَيْهِ حَتَّى تَقْبِضَهُ. فَيَبْقَى شِرَارُ النَّاسِ في خِفَّةِ الطَّيْرِ، وأحْلامِ السِّباعِ لاَ يَعْرِفُون مَعْرُوفاً، وَلا يُنْكِرُونَ مُنْكَراً، فَيَتَمَثَّلَ لهُمُ الشَّيْطَانُ، فَيقُولُ: ألاَ تسْتَجِيبُون؟ فَيَقُولُونَ: فَما تأمُرُنَا؟ فَيَأمرُهُم بِعِبَادةِ الأوْثَانِ، وهُمْ في ذلكَ دارٌّ رِزْقُهُمْ، حسنٌ عَيْشُهُمْ. ثُمَّ يُنْفَخُ في الصَّور، فَلا يَسْمعُهُ أحَدٌ إلاَّ أصْغى لِيتاً وَرَفَعَ لِيتاً، وَأوَّلُ منْ يسْمعُهُ رَجُلٌ يلُوطُ حَوْضَ إبِله، فَيُصْعقُ ويُصْعَقُ النَّاسُ حولهُ، ثُمَّ يُرْسِلُ اللَّه أوْ قالَ: يُنْزِلُ اللَّه مَطَراً كأَنَّهُ الطَّلُّ أو الظِّلُّ، فَتَنْبُتُ مِنْهُ أجْسَادُ النَّاس ثُمَّ يُنْفَخُ فِيهِ أخْرَى فَإِذَا هُمْ قِيامٌ يَنْظُرُون. ثمَّ يُقَالُ يا أيهَا النَّاسُ هَلُمَّ إلَى رَبِّكُم، وَقِفُوهُمْ إنَّهُمْ مَسْؤولونَ، ثُمَّ يُقَالُ: أخْرجُوا بَعْثَ النَّارِ فَيُقَالُ: مِنْ كَمْ؟ فَيُقَالُ: مِنْ كُلِّ ألْفٍ تِسْعَمِائة وتِسْعةَ وتِسْعينَ، فذلكَ يْوم يجْعَلُ الْوِلْدانَ شِيباً، وذَلكَ يَوْمَ يُكْشَفُ عنْ ساقٍ "رواه مسلم. "اللِّيتُ"صَفْحَةُ العُنُقِ، وَمَعْنَاهُ: يضَعُ صفْحَةَ عُنُقِهِ ويَرْفَعُ صَفْحتهُ الأخْرَى.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: నా అనుచర సమాజంలో దజ్జాల్ పుడ్తాడు. అతను నలభై వరకు ఉంటాడు. అవి నలభై రోజులో లేక నెలలో లేక సంవత్సరాలో తెలియదు. తర్వాత దేవుడు మర్యమ్ కుమారుడైన ఈసాను పంపుతాడు. ఆయన అతన్ని వెతికిపట్టుకొని చంపుతారు. ఆ తర్వాత ప్రజలు ఏడేండ్ల దాకా తమ మధ్య ఎలాంటి విరోధం లేకుండా బతుకుతారు. తర్వాత దేవుడు సిరియా వైపు నుంచి చల్లటిగాలిని పంపుతాడు. ఈ భూమ్మీద తమ హృదయంలో రవ్వంత మేలు లేక విశ్వాసం ఉన్న వారందరినీ ఆ గాలి చంపుతుంది. చివరికి ఎవరైనా కొండ గుహలో దాక్కున్నా, ఆ గాలి అక్కడికి కూడా వెళ్ళి అతని ప్రాణం తీస్తుంది. ఆ తర్వాత (ప్రపంచంలో) అత్యంత చెడ్డవారు మాత్రమే మిగిలుంటారు. వారి అరాచకత్వం పక్షుల చురుకుదనంలాగా, వారు సృష్టించే రక్తపాతం కౄరమృగాల మాదిరిగా ఉంటుంది. వారు సత్కార్యాన్ని సత్కార్యంగా భావించరు. చెడుని చెడుగా భావించరు. షైతాన్ వారిదగ్గరికి మానవ రూపంలో వచ్చి, "మీరు నా మాట వినరా?" అని అంటాడు. అందుకు వారు "ఏమిటి నీ మాట?" అని అడుగుతారు. వాడు వారికి విగ్రహాలను ఆరాధించమని ఆదేశిస్తాడు. (దాన్ని వారు పాటిస్తారు) అయినప్పటికీ వారికి వారి ఆహారంలో సమృద్ధి లభిస్తుంది. వారి జీవితం సుఖసౌఖ్యాలతో గడుస్తుంది. తర్వాత శంఖం పూరించబడుతుంది. దాని శబ్దం విన్న ప్రతి ఒక్కడూ తన మెడను దానివైపుకు వంచి పైకిలేపుతాడు. అందరికంటే ముందు దాని శబ్దం వినేవాడు తన ఒంటెల హౌజుకు మరమ్మత్తు చేస్తూ ఉంటాడు. అతను ఆ శబ్దం వినగానే స్పృహతప్పి పడిపోతాడు. అతని చుట్టు ప్రక్కల ఉన్నవారు కూడా స్పృహ తప్పి పడిపోతారు. ఆ తర్వాత దేవుడు వర్షాన్ని పంపిస్తాడు (లేక) కురిపిస్తాడు (అని చెప్పారు). ఆ వర్షం మంచులా ఉంటుంది. (అంటే చిమ్ముతున్న నీళ్ళలా ఉంటుందన్నమాట.) దాంతో మనుషుల శరీరాలు (మొక్కల్లాగా) మొలకెత్తుతాయి. తర్వాత మళ్ళీ శంఖం పూరించబడుతుంది. వారు లేచి నిలబడి చూస్తుంటారు. తర్వాత వారితో, "ప్రజలారా! మీ ప్రభువు వైపుకు పదండి" అని చెప్పటం జరుగుతుంది. "వారిని ఆపండి. వారిని నిలదీయాలి" (అని దైవదూతల్ని ఆజ్ఞాపించటం జరుగుతుంది). తర్వాత "వారిలోనుంచి నరకవాసుల్ని బయటికి తీయండి" అనటం జరుగుతుంది. "వారు ఎంతమంది ఉన్నారు?" అని అడిగితే "ప్రతి వెయ్యిమందిలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది" అని చెప్పటం జరుగుతుంది. అది పిల్లల్ని సయితం ముసలివారుగా చేసేరోజు. పిక్కలు తెరువబడేది ఆ రోజే. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని ఫితన్ ప్రకరణం)
English
`Abdullah bin `Amr bin Al-`As (radiyallahu anhuma) said: The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) said, “Dajjal (the Antichrist) will appear in my Ummah and he will stay in the world for forty. I do not know whether this will be forty days or forty months or forty years. Allah will then send (Prophet) `Isa (Jesus), son of Maryam (Mary). `Isa will pursue him and slaughter him. Then people will survive for seven years (i.e., after the demise of `Isa) in the state that there will be no rancour between two persons. Then Allah will send a cool breeze from the side of Ash-Sham. None will remain upon the face of the earth having the smallest particle of good or Faith in him but he will die, so much so that even if someone amongst you will enter the innermost part of a mountain, this breeze will reach that place also and will cause him to die. Only the wicked people will survive and they will be as fast as birds (i.e., to commit evil) and as ferocious towards one another as wild beasts. They will never appreciate the good, nor condemn evil. Then Shaitan (Satan) will come to them in the garb of a man and will say: `Will you not obey me?’ They will say: `What do you order us to do?’ He will command them to worship idols. They will have abundance of sustenance and will lead comfortable lives. Then the Trumpet will be blown. Every one hearing it, will turn his neck towards it and will raise it. The first one to hear that Trumpet will be a man who will be busy repairing the basin for his camels. He will become unconscious. Allah will send, or will cause to send, rain which will be like dew and there will grow out of it (like wild growth) the bodies of the people. Then the second Trumpet will be blown and they will stand up and begin to look around. Then it will be said: `O people! Go to your Rubb.’ Then there will be a command: `Make them stand there.’ After it they will be called to account. Then it will be said: `Separate from them the share of the Fire.’ It will be asked: `How much?’ It will be said: `Nine hundred and ninety-nine out of every thousand.’ That will be the Day which will make children hoary-headed men because of its terror and that will be the Day when the Shin will be uncovered.”[Muslim].
ముఖ్యాంశాలు
'పిక్కలు తెరువబడటం' అంటే ఏమిటి? కొంతమంది దీని గురించి వ్యాఖ్యానిస్తూ 'పిక్కలు తెరువబడటం' అంటే ప్రళయదినాన అత్యంత భయంకరమైన, భీతావహ పరిస్థితులు ఆసన్నమవటం అని చెప్పారు. అయితే ఒక ప్రామాణికమైన హదీసులో దీని వివరణ ఇలా వచ్చింది: ప్రళయదినాన విశ్వప్రభువైన అల్లాహ్ తన కాలి పిక్కను (తన ఔన్నత్యానికి తగిన విధంగా) బయటికి తీసి చూపిస్తాడు. దాన్ని చూడగానే విశ్వాసులైన పురుషులు, స్త్రీలందరూ కూడా ఆయన ముందు మోకరిల్లుతారు. అయితే ప్రపంచంలో ప్రజల మెప్పుకోసమో లేక పేరు ప్రతిష్ఠల కోసమో సజ్దాలు చేసేవారు మాత్రం సజ్దా చేయకుండా ఆగిపోతారు. వారు కూడా దైవం ముందు మోకరిల్లాలనే అనుకుంటారు. కాని వారి వెన్నుపూసలు కదలవు. వారి వీపు పలకలాగా మారిపోతుంది. దాని మూలంగా వారికి దైవం ముందు మోకరిల్లే వీలు లేకుండా పోతుంది. (సహీహ్ బుఖారీ, నూన్ సూరా వ్యాఖ్యానం.)
అసలు దేవుని పిక్క ఎలా ఉంటుంది? దాన్ని ఆయన ఎలా చూపిస్తాడు? అనే విషయాలను మనం అర్థం చేసుకోలేము. వాటిని వివరించలేము కూడా. అందుకని దేవుని కండ్లు, చెవులు, చేతులు మొదలగు వాటిని ఏ విధమైన వక్రభాష్యాలు చెప్పకుండా, ఎలాంటి పోలికలు కల్పించకుండా మనం ఏ విధంగా విశ్వసిస్తామో అదే విధంగా దీనిని కూడా విశ్వసించాలి. సలఫ్ మరియు హదీసు వేత్తల దృక్పథం కూడా ఇదే! (అహ్సనుల్ బయాన్ వ్యాఖ్యాన గ్రంథం నుంచి).
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1812
హదీసు 1813
وَعَنْ أنَسٍ رضي اللَّه عَنْهُ قَالَ: قَال رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لَيْسَ مِنْ بَلَدٍ إلاَّ سَيَطَؤُهُ الدَّجَّالُ إلاَّ مَكَّةَ والمَدينة، ولَيْسَ نَقْبٌ مِنْ أنْقَابِهما إلاَّ عَلَيْهِ المَلائِكَةُ صَافِّينَ تحْرُسُهُما، فَيَنْزِلُ بالسَّبَخَةِ، فَتَرْجُفُ المدينةُ ثلاثَ رَجَفَاتٍ، يُخْرِجُ اللَّه مِنْهَا كُلَّ كَافِرٍ وَمُنَافِقٍ "رواه مسلم.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: దజ్జాల్ మక్కా మదీనాలు మినహా ఇతర నగరాలన్నిటినీ త్రొక్కుతాడు. అంటే వాటిలోకి ప్రవేశిస్తాడు. మక్కా మదీనాలకు వెళ్ళే కొండ దారులన్నిటి మీద దేవుడు తన దూతల్ని నియమిస్తాడు. వారు ఒకరి రెక్క మరొకరు పట్టుకొని వాటికి రక్షణ కల్పిస్తూ ఉంటారు. దజ్జాల్ (మదీనాకు దగ్గర్లో ఉన్న) ఉప్పు నేల మీద దిగగానే మదీనా నగరం మూడుసార్లు కంపిస్తుంది. దేవుడు మదీనాలో ఉండే కాఫిర్లు, మునాఫిక్లందరినీ బయటికి తీస్తాడు. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని ఫితన్ ప్రకరణం)
English
Anas bin Malik (radiyallahu anhu) said: The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) said, “There will be no land which will not be trampled by Dajjal (the Antichrist) but Makkah and Al-Madinah; and there will be no passage leading to them which will not be guarded by the angels, arranged in rows. Dajjal will appear in a barren place adjacent to Al-Madinah and the city will be shaken three times. Allah will expel from it every disbeliever and hypocrite.”[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1813
హదీసు 1814
وعَنْهُ رضي اللَّه عنْهُ أنَّ رسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ:"يَتْبعُ الدَّجَّال مِنْ يهُودِ أصْبهَانَ سَبْعُونَ ألْفاً علَيْهم الطَّيَالِسة" رواهُ مسِلمٌ.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) గారే చేసిన మరొక కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: అస్ఫహాన్కు చెందిన డెబ్బైవేల యూదులు దజ్జాల్ వెంటపడతారు. (అంటే అతన్ని అనుసరిస్తారు). వారి ఒంటిమీద పచ్చని దుప్పట్లు ఉంటాయి. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని ఫితన్ ప్రకరణం)
English
Anas (radiyallahu anhu) said: The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) said, “Dajjal (the Antichrist) will be followed by seventy thousand Jews of Isfahan and will be dressed in robes of green coloured satin.”[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1814
హదీసు 1815
وعَنْ أمِّ شَريكٍ رضي اللَّه عَنْهَا أنَّها سمِعتِ النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَقُولُ:"ليَنْفِرَن النَّاسُ مِنَ الدَّجَّالِ فِي الجِبَالِ" رَوَاهُ مُسْلِمٌ.
దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ ఉమ్మె షరీక్ (రదియల్లాహు అన్హా) తెలియజేశారు: ప్రజలు దజ్జాల్‌కు భయపడి పారిపోయి కొండల్లో దాక్కుంటారు.
(ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని ఫితన్ ప్రకరణం)
English
Umm Sharik (radiyallahu anha) reported: I heard the Prophet (sallallaahu alayhi wa sallam) saying, “People will run away from Dajjal (the Antichrist) seeking shelter in the mountains.”[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1815
హదీసు 1816
وعَن عِمْرَانَ بنِ حُصَيْنٍ رضي اللَّه عنْهُما قالَ: سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَقُولُ: " مَا بَيْنَ خَلْقِ آدَم إلى قِيامِ السَّاعةِ أمْرٌ أكْبرُ مِنَ الدَّجَّالِ" رواه مسلم.
దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ (రదియల్లాహు అన్హుమా) తెలియజేశారు: ఆదం పుట్టినప్పటి నుంచి ప్రళయం సంభవించేవరకు దజ్జాల్ కంటే భయంకరమైన విషయం మరొకటి లేదు. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని ఫితన్ ప్రకరణం)
English
`Imran bin Hussain (radiyallahu anhuma) reported: I heard the Messenger of Allah (sallallaahu alayhi wa sallam) saying, “Between time of the creation of Adam and the Resurrection Day, there is nothing greater than the mischief of Dajjal (the Antichrist).”[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1816
హదీసు 1817
وعنْ أَبي سَعِيدٍ الخُدْرِيِّ رضي اللَّه عَنْهُ عَنِ النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قال: " يخْرُجُ الدَّجَّالُ فَيتَوَجَّه قِبَلَه رَجُلٌ منَ المُؤمِنين فَيَتَلَقَّاهُ المَسالح: مسالحُ الدَّجَّالِ، فَيقُولُونَ لَهُ: إلى أيْنَ تَعمِدُ؟ فيَقُول: أعْمِدُ إلى هذا الَّذي خَرَجَ، فيقولُون له: أو ما تُؤْمِن بِرَبِّنَا؟ فَيقُولُ: مَا بِرَبنَا خَفَاء، فيقولُون: اقْتُلُوه، فيقُول بعْضهُمْ لبعضٍ: ألَيْس قَدْ نَهاكُمْ رَبُّكُمْ أنْ تَقْتُلُوا أحَداً دونَه، فَينْطَلِقُونَ بِهِ إلى الدَّجَّالِ، فَإذا رَآهُ المُؤْمِنُ قالَ: يَا أيُّهَا النَّاسُ إنَّ هذَا الدَّجَّالُ الَّذي ذَكَر رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَيأمُرُ الدَّجَّالُ بِهِ فَيُشبحُ، فَيَقولُ: خُذُوهُ وَشُجُّوهُ، فَيُوسَعُ ظَهْرُهُ وبَطْنُهُ ضَرْباً، فيقولُ: أَوَمَا تُؤمِنُ بِي؟ فَيَقُولُ: أنْتَ المَسِيحُ الْكَذَّابُ، فَيُؤمرُ بهِ، فَيؤْشَرُ بالمِنْشَارِ مِنْ مَفْرقِهِ حتَّى يُفْرقَ بَيْنَ رِجْلَيْهِ، ثُمَّ يَمْشِي الدَّجَّالُ بَيْنَ الْقِطْعتَيْنِ، ثُمَّ يقولُ لَهُ: قُمْ، فَيَسْتَوي قَائماً. ثُمَّ يقولُ لَهُ: أتُؤمِنُ بِي؟ فيقولُ: مَا ازْددتُ فِيكَ إلاَّ بصِيرةً، ثُمًَّ يَقُولُ: يَا أَيُّهَا النَّاسُ إِنَّهُ لاَ يفْعَلُ بعْدِي بأَحَدٍ مِنَ النَّاسِ، فَيأخُذُهُ الدَّجَّالُ لِيَذْبَحَهُ، فَيَجْعَلُ اللَّه مَا بيْنَ رقَبَتِهِ إلَى تَرْقُوَتِهِ نُحَاساً، فَلا يَسْتَطِيعُ إلَيْهِ سَبيلاً، فَيَأْخُذُ بيَدَيْهِ ورجْلَيْهِ فَيَقْذِفُ بِهِ، فَيحْسَبُ الناسُ أنَّما قَذَفَهُ إلَى النَّار، وإنَّما ألْقِيَ فِي الجنَّةِ"فقالَ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"هذا أعْظَمُ النَّاسِ شَهَادَةً عِنْد رَبِّ الْعالَمِينَ" رواه مسلم. وروى البخاريُّ بَعْضَهُ بمعْنَاهُ."المَسَالح": هُمْ الخُفَرَاءُ وَالطَّلائعُ.
హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: దజ్జాల్ వెడలినప్పుడు విశ్వాసుల్లో ఒకతను అతని దగ్గరికి వెళ్తాడు. అక్కడ అతనికి ఆయుధాలు ధరించివున్న దజ్జాల్ భటులు తారసపడతారు. "ఎక్కడికి?" అని అడుగుతారు వారు. "(కొత్తగా) వచ్చిన అతని దగ్గరికి" అని చెబుతాడు ఆ విశ్వాసి. అందుకు వారు "నీవు మా ప్రభువుని నమ్మవా?" అని అడుగుతారు. దానికతను "వేరొకర్ని ప్రభువుగా నమ్మటానికి నమ్మక పోవటానికి మన ప్రభువు విషయంలో దాపరికాలు ఉంటే కదా!" అని సమాధానం చెబుతాడు. ఆ సమాధానం విని వారు (ఆగ్రహంతో) "అతన్ని చంపండి" అంటారు. తర్వాత తమలో తాము మాట్లాడుకుంటూ, "నా అనుమతి లేకుండా ఎవరినీ చంపవద్దని మన ప్రభువు మనల్ని ఆదేశించలేదా?" అని అనుకొని ఆ విశ్వాసిని దజ్జాల్ దగ్గరికి తీసుకు వెళ్తారు. విశ్వాసి దజ్జాల్ని చూడగానే, "ప్రజలారా! దైవప్రవక్త ﷺ చెప్పింది ఈ దజ్జాల్ గురించే" అని (ఎలుగెత్తి) చెబుతాడు. దజ్జాల్ అతన్ని బోర్లా పడేయమని ఆదేశిస్తాడు. తర్వాత అతన్ని పట్టుకొని తలను, మొహాన్ని బాదమని చెబుతాడు. అతని ఆజ్ఞమేరకు ఆ విశ్వాసిని పొట్ట, వీపు సాగిపోయేలా చితకబాదటం జరుగుతుంది.
తర్వాత దజ్జాల్ "నువ్వు నన్ను నమ్ముతావా?" అని అడుగుతాడు. అందుకతను (నిరాకరిస్తూ), "నువ్వు మసీహ్వి, అబద్ధాగ్రేసరుడివి" అని అంటాడు. ఆ తర్వాత అతని తలను రంపంతో కోసి రెండు కాళ్ళూ వేరయ్యేలా అతన్ని రెండు ముక్కలుగా నరికేయమని ఆజ్ఞాపించటం జరుగుతుంది. దజ్జాల్ ఆ రెండు ముక్కల మధ్య తిరుగుతాడు. తర్వాత వాటిని ఉద్దేశ్యించి, "లే, లేచి నిలబడు" అని అంటాడు. వెంటనే ఆ విశ్వాసి లేచి నిలబడతాడు. దజ్జాల్ మళ్ళీ అతన్ని "నన్ను నమ్ముతావా? లేదా?" అని అడుగుతాడు. అందుకతను (నిరాకరిస్తూ) "నీ గురించి నా నమ్మకం ఇప్పుడు మరింత బలపడింది. ప్రజలారా! వీడు నా తర్వాత ఎవరి పట్లనూ ఈ విధంగా ప్రవర్తించలేడు" అని అంటాడు. అప్పుడు దజ్జాల్ అతన్ని పట్టుకొని కోసేయాలనుకుంటాడు. కాని దేవుడు అతని మెడ – రక్తనాళం మధ్య భాగాన్ని ఇత్తడిగా మారుస్తాడు. తర్వాత దజ్జాల్‌కు అతన్ని చంపటానికి మార్గమేదీ కనిపించదు. దాంతో దజ్జాల్ అతని కాళ్ళూ చేతులు పట్టుకొని విసిరేస్తాడు. చూసిన జనం వాడు అతన్ని అగ్నిలో విసిరేశాడని అనుకుంటారు. కాని వాస్తవానికి (పరిణామ పరంగా) అతన్ని స్వర్గంలో విసిరివేయటం జరిగి ఉంటుంది.
ఆ తర్వాత దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు: ఆ వ్యక్తి దేవుని దృష్టిలో అందరి కంటే గొప్ప వీరమరణం పొందినవాడుగా పరిగణించబడతాడు. (ముస్లిం, బుఖారీ (రహిమహుల్లాహ్) ఈ అర్ధాన్నిచ్చే ఉల్లేఖనాలు కొన్ని వివరించారు)
(సహీహ్ బుఖారీలోని ఫితన్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఫితన్ ప్రకరణం)
English
Abu Sa`id Al-Khudri (radiyallahu anhu) reported: I heard the Prophet (sallallaahu alayhi wa sallam) saying, “Dajjal (the Antichrist) will come forth and a person from amongst the believers will go towards him and the armed watchmen of Dajjal will meet him and they will say to him: `Where do you intend to go?’ He will say: `I intend to go to this one who has appeared.’ They will say to him: `Don’t you believe in our lord (meaning Dajjal)?’ He will say: `There (i.e., we know Him to be Allah, Alone, without any partners) is nothing hidden about our Rubb.’ Some of them will say: `Let us kill him’, but some others will say: `Has your lord (Dajjal) not forbidden you to kill anyone without his consent?’ So they will take him to Dajjal. When the believer will see him, he will say: `O people! This is Dajjal about whom the Messenger of Allah (sallallaahu alayhi wa sallam) has informed us.’ Dajjal will have him laid on his stomach and have his head. He will be struck on his back and on his stomach. Dajjal will ask him: `Don’t you believe in me?’ He will say: `You are the false Messiah.’ He will then give his order to have him sawn with a saw into two from the parting of his hair up to his legs. After that Dajjal will walk between the two halves and will say to him: `Stand up’, and he will stand on his feet. He will then say to him: `Don’t you believe in me?’ The person will say: `It has added to my insight that you are Dajjal’. He will add: `O people! He will not be able to behave with anyone amongst people in such a manner after me.’ Dajjal will try to kill him. The space between his neck and collarbone will turn into copper and he will find no way to kill him. So he will catch hold of him by his hand and feet and throw him into (what appears to be the fire). The people will think that he has been thrown into the fire whereas he will be thrown into Jannah.” The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) added, “He will be the most eminent amongst the people with regard to martyrdom near the Rubb of the worlds.”[Muslim]
ముఖ్యాంశాలు
ప్రళయానికి ముందు దజ్జాల్ ఉపద్రవ కాలంలో ఒక విశ్వాసి దజ్జాల్‌ను ఎదిరిస్తాడు. ధైర్యసాహసాలతో వాణ్ణి ఎదుర్కొంటాడు. దజ్జాల్ అతన్ని మెడ నరికి చంపాలనుకున్న ప్పుడు అతని మెడలోని ఒక భాగాన్ని అల్లాహ్ ఇత్తడిదిగా మారుస్తాడు. దాని మూలంగా దజ్జాల్ అతన్ని చంపలేకపోతాడు.
చివర్లో దజ్జాల్ చూపించే అగ్నిని స్వర్గంగా పేర్కొనటం జరిగింది. పరిణామం రీత్యా అలా చెప్పబడి ఉంటుంది. అంటే ఆ అగ్ని పరీక్షకు అంతిమ ప్రతిఫలం స్వర్గం అవుతుంది. లేక స్వర్గం అంటే ఇక్కడ మనశ్శాంతి, మనోనిబ్బరం కావచ్చు. విశ్వాసికి తన విశ్వాస పరిపక్వత మూలంగా అగ్నిలో సైతం మనశ్శాంతి లభిస్తుంది. లేక ఇక్కడ స్వర్గం అంటే ఇబ్రాహీమ్ ప్రవక్త విషయంలో జరిగినట్లు దజ్జాల్ చూపే అగ్ని ఆ విశ్వాసి కొరకు నిజంగానే ఓ వందనవనంలా మారిపోవచ్చు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1817
హదీసు 1818
وعَنِ المُغِيرَةِ بنِ شُعْبةَ رضي اللَّه عَنْهُ قَالَ: ما سَألَ أحَدٌ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم عَنِ الدَّجَّالِ أكْثَرَ ممَّا سألْتُهُ، وإنَّهُ قالَ لِي: "مَا يَضُرُّكَ؟ "قلتُ: إنَّهُمْ يقُولُونَ: إنَّ معَهُ جَبَلَ خُبْزٍ وَنَهْرَ مَاءٍ، قالَ:"هُوَ أهْوَنُ عَلى اللَّهِ مِنْ ذلِكَ" متفقٌ عليه.
హజ్రత్ ముగీరా బిన్ షోబా (రదియల్లాహు అన్హు) కథనం: దజ్జాల్ గురించి దైవప్రవక్త ﷺను నేను అడిగినన్ని ప్రశ్నలు మరెవరూ అడిగి ఉండరు. ఆయన (నాకు ధైర్యం చెబుతూ), "వాడు నిన్నేమీ చేయలేడులే" అన్నారు. అందుకు నేను, "ప్రజలు చెబుతుంటే విన్నాను. వాడి దగ్గర పర్వతమంత ఎత్తు రొట్టెలూను, ఒక నీటి సెలయేరు ఉంటుందట" అని అన్నాను. అందుకాయన "విశ్వాసుల్ని కాపాడుకోవటం అల్లాహ్‌కు అంతకంటే చాలా తేలిక" అని చెప్పారు.
(బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని ఫితన్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోనూ ఫితన్ ప్రకరణం)
English
Al-Mughirah bin Shu`bah (radiyallahu anhu) said: No one asked the Messenger of Allah (sallallaahu alayhi wa sallam) more about Dajjal than I asked him. He said to me, “He will not harm you.” I said: “O Messenger of Allah, it is reported that he will have with him a mountain of bread and a river full of water.” Thereupon he said, “He (Dajjal) is far too worthless and insignificant near Allah (to let him deceive the believers).”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
పై హదీసుకు భావం ఏమిటంటే ప్రజల్ని మార్గభ్రష్టులు చేయటానికి దజ్జాల్ దగ్గర కావలసిన వనరులయితే అన్నీ ఉంటాయి. కాని విశ్వసించినవారిని వాడి బారి నుండి కాపాడటం అల్లాహ్‌కు కష్టం కాదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1818
హదీసు 1819
وعَنْ أنَسٍ رضي اللَّه عنْهُ قالَ: قالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَا مِنْ نَبِيٍ إلاَّ وَقَدْ أنْذَرَ أمَّتَهُ الأعْوَرَ الْكَذَّاب، ألاَ إنَّهُ أعْوَرُ، وإنَّ ربَّكُمْ عَزَّ وجلَّ لَيْسَ بأعْورَ، مكْتُوبٌ بَيْنَ عَيْنَيْهِ ك ف ر" مُتَّفَقٌ عليه.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ప్రతి దైవప్రవక్త తన అనుచర సమాజాన్ని ఒంటికన్నువాడు అబద్ధాల రాయుడు గురించి హెచ్చరించారు. జాగ్రత్త! ఆ దజ్జాల్ ఒంటికన్నువాడై ఉంటాడు. మీ ప్రభువు ఒంటికన్నువాడు కాదు. ఇంకో విషయం ఏమిటంటే దజ్జాల్ కళ్ళ మధ్య క-ఫ-ర (ఇతను అల్లాహ్‌ను తిరస్కరించాడు) అని రాసి ఉంటుంది.
(బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని ఫితన్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోనూ ఫితన్ ప్రకరణమే)
English
Anas (radiyallahu anhu) said: The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) said, “There has not been a Prophet who has not warned his Ummah of that one-eyed liar (Dajjal). Behold, he is blind in one eye and your Rubb (Allah) is not blind. On his forehead are the letters: (K.F.R.) (meaning Kafir- disbeliever).”[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1819
హదీసు 1820
وَعَنْ أبي هُرَيْرَة رضي اللَّه عَنْهُ قالَ: قالَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "ألا أُحَدِّثُكُمْ حَدِيثاً عنِ الدَّجَّالِ مَا حَدَّثَ بِهِ نَبيٌّ قَوْمَهُ، إنَّهُ أعْوَرُ وَإنَّهُ يجئُ مَعَهُ بِمثَالِ الجَنَّةِ والنَّارِ، فالتي يَقُولُ إنَّهَا الجنَّةُ هِيَ النَّارُ. متفقٌ عليهِ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: దజ్జాల్ గురించి ఏ దైవప్రవక్తా తమ అనుచర సమాజాలకు చెప్పని ఒక విషయం నేను మీకు చెప్పనా? వాడు ఒంటికన్నువాడు. తన వెంట వాడు స్వర్గం నరకం లాంటి రెండు వస్తువులు తీసుకొని వస్తాడు. వాడు దేన్నయితే స్వర్గం అంటాడో అది నరకం అయి ఉంటుంది.
(బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని దైవప్రవక్తల ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఫితన్ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) said: The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) said, “Let me tell you something about Dajjal (the Antichrist) which no Prophet had told his people. He is blind (in one eye) and will bring with him something like Jannah and Hell; but what he calls Jannah will be in fact Hell.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
వాడు చూపించే తళుకు బెళుకులకు ప్రభావితుడై వాడికి తొత్తుగా మారినవాడు నరకాగ్నిలో పడవేయబడటానికి అర్హుడౌతాడని పై హదీసు భావం.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1820
హదీసు 1821
وعَنْ ابنِ عُمَرَ رضي اللَّهُ عَنْهُما أنَّ رَسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم ذَكَرَ الدَّجَّالَ بَيْنَ ظَهْرَاني النَّاس فَقَالَ: "إنَّ اللَّه لَيْسَ بأَعْوَرَ، ألاَ إنَّ المَسِيحَ الدَّجَّالَ أعْوَرُ الْعيْنِ الْيُمْنى، كَأَنَّ عَيْنَهُ عِنَبةٌ طَافِيَةٌ "متفقٌ عليه.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ ప్రజల ముందు దజ్జాల్ గురించి వివరిస్తూ ఇలా అన్నారు: అల్లాహ్ ఒంటికన్నువాడు కాదు. కాని జాగ్రత్త! మసీహ్ దజ్జాల్ ఒంటికన్నువాడు. వాడికి ఒక్క కుడికన్ను మాత్రమే ఉంటుంది. అది కూడా ఉబ్బిన నేరేడు పండులా ఉంటుంది. (బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని ఫితన్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఈమాన్ ప్రకరణం)
English
`Abdullah bin `Umar (radiyallahu anhuma) said: One day the Messenger of Allah (sallallaahu alayhi wa sallam) mentioned Al-Masih Dajjal (the Antichrist) in the presence of the people and said, “Verily, Allah is not one-eyed but Al-Masih Ad-Dajjal is blind in the right eye which looks like a swollen grape.”[Al-Bukhari and Muslim]
ముఖ్యాంశాలు
దజ్జాల్ మరియు వాడి ఉపద్రవాల గురించి ఏవయితే హదీసులు వివరించబడ్డాయో అవి ప్రామాణికత పరంగా, సాక్ష్యాధారాల పరంగా ఎంతో ఉన్నతమైనవి. అనగా సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం గ్రంథాలకు చెందినవన్న మాట. ఆ గ్రంథాల ప్రామాణికత మీద, వాటి నిర్ద్వంద్వత మీద పండితుల మధ్య ఏకాభిప్రాయం ఉంది. కనుక వాటి గురించి సందేహానికి లోనవటం ఏ విధంగానూ సరికాదు. అదే విధంగా ఈసా అలైహిస్సలాం ఆకాశం నుండి దిగివస్తారన్న విషయం కూడా హదీసుల ద్వారా రుజువవుతోంది. దాన్ని తిరస్కరించటానికి వీలులేదు. ప్రళయానికి సమీపంలో ఈ గొప్ప చిహ్నాలు తప్పకుండా ఉనికిలోకి వస్తాయి. వాటిని విశ్వసించటం విధి.
దజ్జాల్ యూదుడై ఉంటాడు. ఉపద్రవాలు రేపటంలో చెయ్యి తిరిగినవాడవడం చేత వాడికి దజ్జాల్ (ఉపద్రవాగ్రేసరుడు) అనే పేరు పడిపోతుంది. విశ్వాసుల్ని పరీక్షించటం కోసం అల్లాహ్ స్వయంగా వాడికి కొన్ని సృష్టినైజానికి విరుద్ధమైన శక్తులు ప్రసాదిస్తాడు. దాంతో వాడు తాను ఆరాధ్య దేవుణ్ణని ప్రకటించుకుంటాడు. యూదుల్లోని ఒక పెద్ద వర్గం వాణ్ణి అనుసరిస్తుంది. హదీసుల్లో వాడిని మసీహుద్దజ్జాల్ అని కూడా చెప్పబడింది. అయితే ఈసా ప్రవక్తకు కూడా మసీహ్ అనే పేరు ఉంది. వీరిద్దరిలో తేడా ఏమిటంటే ఈసా ప్రవక్త మసీహుల్ హుదా (సన్మార్గ మసీహ్) కాగా, వీడు మసీహుజ్జలాలహ్ (దుర్మార్గ మసీహ్). అసలు మసీహ్ అంటే ఏమిటి? వాడికి ఆ పేరు ఎందుకుంది? అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాడి ఒక కన్ను తుడిచి వేయబడటం మూలంగా వాడిని మసీహ్ అంటారని కొందరు అంటారు. మరికొందరు వాడు మక్కా మదీనాలు తప్ప ప్రపంచం మొత్తం తిరుగుతాడు కాబట్టి వాణ్ణి మసీహ్ అంటారని చెబుతారు. ఈసా ప్రవక్త పేరు కూడా మసీహే. తల్లి గర్భం నుంచి బయటపడినప్పుడు ఈసా ప్రవక్త శరీరానికి నూనె పూసివుంది, అందుకని ఆయన్ని మసీహ్ అంటారని చెప్పగా, ఆయన ఏ రోగి మీద చేయి తిప్పినా ఆ రోగి రోగం నయమయిపోయేది. కనుక ఆయన్ని మసీహ్ అని పిలవటం జరిగిందని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. ఇలాంటి అభిప్రాయాలు అనేకం వ్యక్తమయ్యాయి. (ఫత్హుల్ బారీ, కితాబుస్సలాత్ బాబుద్దుఆయి ఖబ్లస్సలామి)
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1821
హదీసు 1822
وعَنْ أبي هُريْرَةَ رضي اللَّه عنْهُ أنَّ رَسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ: "لاَ تَقُومُ الساعَةُ حَتَّى يُقَاتِلَ المُسْلِمُونَ الْيَهُودَ حتَّى يَخْتَبِيءَ الْيَهُوديُّ مِنْ وَراءِ الحَجَر والشَّجَرِ، فَيَقُولُ الحَجَرُ والشَّجَرُ: يَا مُسْلِمُ هذَا يَهُودِيٌّ خَلْفي تَعَالَ فَاقْتُلْهُ، إلاَّ الْغَرْقَدَ فَإنَّهُ منْ شَجَرِ الْيَهُودِ" متفقٌ عليه.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: యూదులతో ముస్లింల యుద్ధం జరగనంతవరకూ ప్రళయం రాదు. చివరికి (ఆ యుద్ధంలో) యూదులు రాళ్ళు లేక చెట్ల వెనుక కూడా దాక్కుంటారు. అప్పుడు ఆ రాళ్ళు మరియు చెట్లు, "ఓ ముస్లిం! నా వెనక ఒక యూదుడు దాక్కున్నాడు. రా…..వచ్చి ఇతన్ని చంపెయ్యి" అని చెబుతాయి. కాని గర్ఖద్ చెట్టు మాత్రం చెప్పదు. ఎందుకంటే అది యూదుల చెట్టు.
(బుఖారీ, ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని జిహాద్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఫితన్ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) said: The Messenger of Allah(sallallaahu alayhi wa sallam) said, “The Last Hour will not come until the Muslims fight against the Jews, until a Jew will hide himself behind a stone or a tree, and the stone or the tree will say: `O Muslim, there is a Jew behind me. Come and kill him,’ but Al-Gharqad tree will not say so, for it is the tree of the Jews.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
గర్ఖద్ అనేది ఒక రకమైన ముళ్ళచెట్టు. బైతుల్ ముఖద్దస్ ప్రాంతంలో ఇది విరివిగా కనిపిస్తుంది. అల్లాహ్ తాను కోరిన వస్తువులో మాట్లాడే శక్తిని పుట్టించగలడు. ముస్లింలకు ఈ భూమ్మీద ఆధిపత్యం ఇవ్వాలని తలచినప్పుడు ఆయన చెట్లూపుట్టలు, రాళ్ళు రప్పలను కూడా ముస్లింల సానుభూతిపరులుగా మార్చివేస్తాడు. అవి యూదులకు వ్యతిరేకంగా ముస్లింల తరపున మాట్లాడి వారికి సహాయం చేస్తాయి. అయితే ముస్లింలకు విజయం తెచ్చిపెట్టనున్న ఆ యుద్ధం ఎప్పుడు జరుగుతుందన్న విషయం గురించి ఏమీ చెప్పలేము. ఇవి అగోచర వార్తలు. వీటిని విశ్వసించటం అవసరం. ప్రస్తుత కాలంలో అలాంటి సూచనలేవీ లేవు. ముస్లింలు జనాభా పరంగా ఎక్కువమంది ఉన్నప్పటికీ మరొకరి ఆధిపత్యం క్రింద బతుకుతున్నారు. యూదులు అల్ప సంఖ్యలో ఉన్నప్పటికినీ విజయహస్తులై ఉన్నారు. కాని ఈ పరిస్థితి తాత్కాలికమైనది. యూదుల సంరక్షకులు అమెరికా మొదలగువారు ఏర్పరిచినది. వారు ఇస్లాం పట్ల శత్రుత్వంలో యూదులకు వెన్నుదన్నుగా, సహాయకారులుగా ఉంటున్నారు. సదరు ప్రామాణిక హదీసు ప్రకారం ప్రళయానికి పూర్వం ఈ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ముస్లింలు యూదుల మీద, వారి పాశ్చాత్య సంరక్షకుల మీద కూడా విజయం సాధించి తీరుతారు. 'ఇన్నల్లాహ అలాకుల్లి షైయిన్ ఖదీర్' (అల్లాహ్ ప్రతి వస్తువు మీద అధికారం కలవాడు).
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1822
హదీసు 1823
وعَنْهُ رضي اللَّه عَنْهُ قالَ: قالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "والذِي نَفْسِي بِيَدِه لاَ تَذْهَبُ الدُّنْيَا حَتَّى يَمُرَّ الرَّجُلُ بالْقَبْرِ، فيتمَرَّغَ عَلَيْهِ، ويقولُ: يَالَيْتَني مَكَانَ صَاحِبِ هذَا الْقَبْرِ، وَلَيْس بِهِ الدَّين وما بِهِ إلاَّ الْبَلاَءُ". متفقٌ عليه.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఎవరి చేతిలోనయితే నా ప్రాణముందో ఆయన సాక్షి! మనిషి సమాధి దగ్గరి నుంచి వెళ్ళినప్పుడు, "అయ్యో! ఈ గోరీలో ఉన్నవాడి స్థానంలో నేనుంటే ఎంత బాగుండేది" అని విలవిల్లాడిపోనంత వరకూ ఈ ప్రపంచం అంతమవదు. అతను తన ధర్మం కోసం కాదు, ప్రాపంచిక పరీక్షలకు భయపడి అలా అంటాడు.
(బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని ఫితన్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఫితన్ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) said, “By Him in Whose Hand my soul is, the world will not come to an end until a man passes by a grave and will lie over it saying, `Would that I were in this grave (i.e., dead)!’ Not he will say so because of religious reasons but because of widespread mischief and severe trials of this world.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ప్రపంచంలో అల్లకల్లోలం, కష్టాలు కడగండ్లు ఎంతగా పెరిగిపోతాయంటే వాటిని భరించలేక మనిషి చావటానికి సిద్ధపడతాడు. జీవితం కంటే మరణానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు. సర్వత్రా వ్యాపించే ఈ కల్లోలం కూడా ప్రళయానికి ముందు సంభవిస్తుంది. తర్వాత ప్రపంచంలో కల్లోలం రేకెత్తించేవారు మాత్రమే మిగిలిపోతారు. ఇంతకు ముందు కొన్ని హదీసుల్లో చెప్పబడినట్లు అలాంటి నీచుల మీదే ప్రళయం విరుచుకుపడుతుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1823
హదీసు 1824
وعَنْهُ رضي اللَّه عَنْهُ قالَ: قالَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لاَ تَقُومُ السَّاعَةُ حَتَّى يَحْسِرَ الْفُرَاتُ عَنْ جبَلٍ منْ ذَهَبٍ يُقْتَتَلُ علَيْهِ، فيُقْتَلُ مِنْ كُلِّ مِائةٍ تِسْعَةٌ وتِسْعُونَ، فَيَقُولُ كُلُّ رَجُلٍ مِنْهُمْ: لَعَلِّي أنْ أكُونَ أنَا أنْجُو ". وَفي روايةٍ " يوُشِكُ أنْ يَحْسِرَ الْفُرَاتُ عَن كَنْزٍ مِنْ ذَهَبٍ، فَمَنّْ حَضَرَهُ فَلا يأخُذْ منْهُ شَيْئاً "متفقٌ عَلَيْهِ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఫురాత్ నది ఎండిపోయి అందులోనుంచి బంగారపు పర్వతం బయటపడనంతవరకు ప్రళయం సంభవించదు. ఆ పర్వతం కోసం యుద్ధాలు జరుగుతాయి. ప్రతి వందమందిలో తొంభై తొమ్మిది మంది చంపబడతారు. వారిలోని ప్రతి ఒక్కడూ బహుశా తాను బతికిపోగల్గుతానేమో అనుకుంటాడు.
వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: ఫురాత్ నది ఎండిపోయి, అందులోనుంచి బంగారు నిధులు బయటపడే కాలం దగ్గర్లోనే ఉంది. అప్పుడు బతికివున్నవారు అందులోనుంచి ఏమీ తీసుకోరాదు సుమా!"
(బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలోని 'ఫితన్' ప్రకరణాలు)
English
Abu Hurairah (radiyallahu anhu) said: The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) said, “The Hour will not come to pass before the River Euphrates dries up to unveil the mountain of gold, for which people will fight. Ninety-nine out of one hundred will die (in the fighting) and every man amongst them will say: `Perhaps I may be the only one to remain alive.”’
Another narration is: “The time is near when the River Euphrates will dry up to unveil a treasure of gold. Whosoever may be alive at that time, should not take anything of it.”[Al-Bukhari and Muslim]
ముఖ్యాంశాలు
'యహ్సిరు' అంటే బయటపెట్టటం అని అర్థం. అనగా నీళ్లు ఎండిపోయినప్పుడు అల్లాహ్ బయటపెట్టాలని తలచుకున్న బంగారు నిధులు ఒక్కసారిగా బయల్పడతాయి. ప్రళయానికి ముందు ఇది కూడా తప్పకుండా జరుగుతుంది. ఈ సంఘటన సంభవించినప్పుడు ప్రాపంచిక దురాశలకు లోనుకాకుండా, బయటపడిన నిధుల్లో నుంచి ఏమీ తీసుకోకుండా ఉండేవారు మాత్రమే దైవశిక్షలకు గురికాకుండా సురక్షితంగా ఉంటారు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1824
హదీసు 1825
وعَنْهُ قَالَ: سَمِعْتُ رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَقُولُ:"يَتْرُكُونَ المَدينَةَ عَلى خَيْرٍ مَا كَانَتْ، لاَ يَغْشَاهَا إلاَّ الْعوَافي يُرِيدُ: عَوَافي السِّباعِ وَالطَّيْرِ وَآخِر مَنْ يُحْشَرُ رَاعِيانِ مِنْ مُزَيْنَةَ يُريدَانِ المَدينَةَ ينْعِقَانِ بِغَنَمها فَيَجدَانها وُحُوشاً. حتَّى إذَا بَلَغَا ثنِيَّةَ الْودَاعِ خَرَّا عَلَى وَجوهِهمَا"متفقٌ عليه.
దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారే తెలియజేశారు: మదీనా నగరం మునుపటి కన్నా మంచి స్థితిలో ఉన్నప్పటికీ ప్రజలు దాన్ని వదలిపెట్టి (వేరేచోటికి) వెళ్ళిపోతారు. (అప్పుడు) అడవి మృగాలు, పక్షులు తప్ప ఎవరూ అటు (అనగా మదీనా) వైపు వెళ్ళరు. ఆఖరికి ముజైనా తెగకు చెందిన ఇద్దరు పశువులకాపరుల మీద ప్రళయం సంభవిస్తుంది. వారిద్దరు తమ మేకల మందలను తోలుకుంటూ మదీనాకు వెళ్తుంటారు. అక్కడికెళ్ళి చూస్తే వారికి మదీనా నగరం అడవి జంతువుల నివాస స్థలంగా మారిపోయి ఉన్నట్లు కనిపిస్తుంది. చివరికి వారు 'సనియ్యతుల్ వదా' చేరుకోగానే బోర్లాగా క్రింద పడిపోతారు. (బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని మదీనా ప్రాశస్త్య ప్రకరణం – సహీహ్ ముస్లింలోని హజ్ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) said: The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) said, “People will desert Al-Madinah in spite of it being in better condition except for wild beasts and birds. The Last Hour will happen upon two shepherds of the tribe of Muzainah. They will enter Al-Madinah driving their sheep but will find it full of wild beasts and would turn away. When they will arrive at the hill named Thaniyyat-ul-Wada` they will fall on their faces.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ఖిలాఫత్ వ్యవస్థ మదీనా నుంచి సిరియా మరియు ఇరాక్ దేశాలకు బదిలీ అయినప్పుడే పైహదీసులో పేర్కొనబడిన భవిష్యద్వాణి నెరవేరిందని కొంతమంది అభిప్రాయపడ్డారు. ఎందుకంటే, ఆ కాలంలో మదీనా నగరం భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో మంచి స్థితిలో ఉండేది. ఆ రోజుల్లో మదీనా నగరం పండితుల నిలయంగా, సిరిసంపదల నికేతనంగా అలరారింది. అయినప్పటికీ ఖిలాఫత్ మదీనా నుంచి సిరియా, ఇరాక్‌లకు బదిలీ కావటం హదీసులోని భవిష్యద్వాణినే సూచిస్తుందని వారంటారు. అయితే హదీసులో పేర్కొనబడిన పరిస్థితులు ఇంకా నెలకొనలేదు, కనుక ఆ భవిష్యద్వాణి ఇంకా నెరవేరలేదనీ, ప్రళయానికి దగ్గర్లో నెరవేరుతుందని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. రెండో మాటే సరైనదనిపిస్తోంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1825
హదీసు 1826
وعَنْ أبي سَعيدٍ الخُدْرِيِّ رضي اللَّه عَنْهُ أنَّ النَّبي صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "يَكُونُ خَلِيفَةٌ مِنْ خُلَفَائِكُمْ فِي آخِرِ الزًَّمَان يَحْثُو المَالَ وَلا يَعُدُّهُ" رواه مسلم.
హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఆఖరి కాలంలో మీ ఖలీఫాల్లో ఒకడు తన దోసిలి నిండా ప్రజలకు సొమ్ము ఇస్తాడు. దాన్ని లెక్క కూడా పెట్టడు.
(ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని ఫితన్ ప్రకరణం)
English
Abu Sa`id Al-Khudri (radiyallahu anhu) said: The Prophet (sallallaahu alayhi wa sallam) said, “From your caliphs there will be one in the Last Days who will distribute wealth without counting it.”[Muslim].
ముఖ్యాంశాలు
ఒక ఖలీఫా కాలంలో సిరిసంపదలు విరివిగా ఉంటాయని ఈ హదీసులో కూడా భవిష్యత్తు గురించి వక్కాణించటం జరిగింది. ఇది కూడా ప్రళయానికి ముందు జరుగుతుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1826
హదీసు 1827
وعَنْ أَبي مُوسى الأشْعَرِيِّ رضي اللَّه عنْهُ أنَّ النَّبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قال: "ليأتيَنَّ عَلى النَّاسِ زَمَانٌ يَطُوفُ الرَّجُلُ فِيهِ بِالصَّدَقَة مِنَ الذَّهَبِ، فَلا يَجِدُ أحَداً يَأْخُذُهَا مِنْهُ، وَيُرَى الرَّجُلُ الْوَاحِدُ يَتْبَعُهُ أرْبَعُونَ امْرأةً يَلُذْنَ بِهِ مِنْ قِلَّةِ الرِّجالِ وَكَثْرَةِ النِّسَاءِ" رواه مسلم.
హజ్రత్ అబూమూసా అష్అరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ప్రజలకు ఒక కాలం ఇలాంటిది కూడా వస్తుంది. అప్పుడు మనిషి బంగారం దానం చేసేందుకు (భిక్షగాళ్ళను) గాలిస్తాడు. కాని అతని దానం పుచ్చుకునేవాడు ఒక్కడు కూడా దొరకడు. అంతేకాదు, ఇలా కూడా జరుగుతుంది- ఒక్కో పురుషుని పర్యవేక్షణలో నలభై నలభై మంది స్త్రీలు ఉంటారు. పురుషులు తక్కువగా, స్త్రీలు ఎక్కువగా ఉండటం మూలంగా అలా జరుగుతుంది. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణం)
English
Abu Musa Al-Ash`ari (radiyallahu anhu) said: The Prophet (sallallaahu alayhi wa sallam) said, “A time will come when a man will go about with alms from his gold and will not find anyone to receive it. One man will be seen being followed by forty women dependant upon him on account of the scarcity of men and excess of women.”[Muslim].
ముఖ్యాంశాలు
ఈ హదీసులో కూడా ప్రాపంచిక సుఖసంతోషాలు, సిరిసంపదల విస్తృతితోపాటు స్త్రీల అధిక జనాభా గురించి కూడా జోస్యం చెప్పబడింది. స్త్రీల సంఖ్య పెరగటానికి కారణం యుద్ధాలు కావచ్చు. యుద్ధాల మూలంగా చాలామంది పురుషులు మృత్యువాతన పడతారు. లేక సహజంగానే పురుష జననాల రేటుకన్నా స్త్రీ జననాల రేటు అధికంగా ఉండి దానిమూలంగా స్త్రీల జనాభా పెరగవచ్చు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1827
హదీసు 1828
وعَنْ أبي هُرَيْرَةَ رضي اللَّه عَنْهُ عَن النَّبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "اشْتَرَى رَجُلٌ مِنْ رَجُلٍ عقَاراً، فَوَجَد الَّذِي اشْتَرَى الْعَقَارَ فِي عَقَارِه جَرَّةً فِيهَا ذَهَبٌ، فقالَ لهُ الَّذِي اشْتَرَى الْعَقَارُ: خُذْ ذَهَبَكَ، إنَّمَا اشْتَرَيْتُ مِنْكَ الأرْضَ، وَلَمْ أشْتَرِ الذَّهَبَ، وقالَ الَّذي لَهُ الأرْضُ: إنَّمَا بعْتُكَ الأرضَ وَمَا فِيهَا، فَتَحاكَما إلَى رَجُلٍ، فقالَ الَّذي تَحَاكَمَا إلَيْهِ: أَلَكُمَا وَلَدٌ؟ قَالَ أحدُهُمَا: لِي غُلامٌ. وقالَ الآخرُ: لِي جَارِيةٌ، قالَ أنْكحَا الْغُلامَ الجَاريَةَ، وَأنْفِقَا عَلى أنْفُسهمَا مِنْهُ وتصَدَّقَا "متفقٌ عليه.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఒకతను మరొకతని దగ్గర స్థలం కొన్నాడు. స్థలం కొన్న అతనికి ఆ స్థలంలో ఒక కుండ దొరికింది. అందులో బంగారం ఉంది. అతను స్థలం అమ్మిన అతనితో, "నీ బంగారం నీవు తీసుకో, నేను కొన్నది కేవలం స్థలం మాత్రమే, బంగారం కాదు" అన్నాడు. అందుకు స్థలం యజమాని "నేను నీకు ఈ స్థలంతో సహా అందులోవున్న వస్తువులన్నీ అమ్మేశాను. (ఇక నాకు దాంతో ఎలాంటి సంబంధంలేదు. కనుక ఆ బంగారం నువ్వే ఉంచుకో" అన్నాడు స్థలం యజమాని.) తర్వాత వారిద్దరూ తీర్పు కోసం ఒకాయన దగ్గరికి వెళ్ళారు. ఆ మధ్యవర్తి వారిద్దరిని "మీకు పిల్లలు ఉన్నారా?" అని అడిగాడు. వారిలో ఒకడు, "నాకు ఓ కొడుకు ఉన్నాడు" అని అన్నాడు. రెండొవతను తనకో కూతురు ఉందని చెప్పాడు. ఇద్దరి సమాధానాలు విన్న తర్వాత ఆ మూడోవ్యక్తి, "మీరు వారిద్దరికీ వివాహం చేసి ఈ బంగారం వారిద్దరి అవసరాలకు ఖర్చుపెట్టండి. (మిగిలింది) దానం చేయండి" అని తీర్పు చెప్పాడు. (బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని అంబియా ప్రకరణం – సహీహ్ ముస్లింలోని అఖ్జియా ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet (sallallaahu alayhi wa sallam) said, “A man bought a piece of land from another man, and the buyer found a jar filled with gold in the land. The buyer said to the seller: `Take your gold, as I bought only the land from you and not the gold.’ The owner of the land said: `I sold you the land with everything in it.’ So both of them took their case before a third man who asked: `Have you any children?’ One of them said: `I have a boy.’ The other said, `I have a girl.’ The man said: `Marry the girl to the boy and spend the money on them; and whatever remains give it in charity.”’[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ఒకరి యాజమాన్యం క్రింద ఉండే ఆస్తిని 'అఖార్' అని అంటారు. అది ఇల్లు, తోట, ఖాళీస్థలం ఏదయినా కావచ్చు. ఈ సంఘటన గత సమాజాల్లో ఎవరిదో అయి ఉంటుంది. ఇందులో వారి ఐహిక అనాసక్తత, భక్తీ పరాయణతలు, సందేహాస్పద చెడులకు కూడా దూరంగా ఉండే స్వభావానికి సంబంధించి ఆదర్శనీయమైన ఉపమానం పేర్కొనబడింది. ఇకపోతే షరీఅత్ ద్వారా బోధపడేదేమిటంటే స్థలానికి సంబంధించిన లావాదేవీలు ఆ స్థలంలో ఉండే నిధులకు వర్తించవు. దాని వ్యవహారం వేరుగా ఉంటుంది. స్థలం మాజీ యజమాని గనక ఆ నిధి నాదే. నేను దాన్ని తీసుకోవటం మర్చిపోయాను అంటే ఆ నిధి అతనిదే అవుతుంది. స్థలం కొన్న మనిషికి దానిమీద హక్కు ఉండదు. స్థలం మాజీ యజమాని గనక నిధి సంగతి తనకు తెలియదని ప్రకటిస్తే అప్పుడు అది 'రికాజ్' క్రిందికి వస్తుంది. అందులోని ఐదోవంతు 'బైతుల్ మాల్'కు, మిగతాది స్థలం ప్రస్తుత యజమానికి చెందుతుంది. రికాజ్ అంటే భూమిలోపలి నుంచి బయల్పడిన నిధులు లేక వస్తువులు అని భావం.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1828
హదీసు 1829
وعنْهُ رضي اللَّه عنْهُ أنَّهُ سَمِعَ رَسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَقُولُ: "كانَتْ امْرَأتَان مَعهُمَا ابْناهُما، جَاءَ الذِّئْبُ فَذَهَبَ بابنِ إحْداهُما، فَقَالَتْ لصاحِبتهَا: إنَّمَا ذهَبَ بابنِكِ، وقالتِ الأخْرى: إنَّمَا ذَهَبَ بابنِك، فَتَحَاكما إلى داوُودَ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَقَضِي بِهِ للْكُبْرَى، فَخَرَجتَا عَلَى سُلَيْمانَ بنِ داودَ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فأخبرتَاه، فقالَ: ائْتُوني بِالسِّكينَ أشَقُّهُ بَيْنَهُمَا. فَقَالَتِ الصُّغْرى: لاَ تَفْعَلْ، رَحِمكَ اللَّه، هُو ابْنُهَا فَقَضَى بِهِ للصُّغْرَى" متفقٌ عليه.
దైవప్రవక్త ﷺ ఈ విధంగా వివరిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు)గారే తెలియజేశారు: ఇద్దరు స్త్రీలు ఉండేవారు. వారిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకసారి వారిద్దరి పిల్లలు వారివెంట ఉన్న సమయంలో తోడేలు వచ్చి వారిలో ఒకరి పిల్లవాణ్ణి ఎత్తుకుపోయింది. అప్పుడు వారిలో ఒకామె మరో ఆమెతో, "తోడేలు ఎత్తుకెళ్ళింది నీ కొడుకునే" అని అన్నది. "కాదు, అతను నీ పిల్లవాడు" అని అన్నది రెండో ఆమె. తీర్పు కోసం వాళ్ళిద్దరు దావూద్ ప్రవక్త దగ్గరికి వెళ్ళారు. ఆయన పెద్దామెకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. వారిద్దరు బయటికి వచ్చి తిరిగి దావూదు కుమారుడైన సులైమాన్ దగ్గరికి వెళ్ళి ఆయనకు తమ వాద ప్రతివాదాలు వినిపించారు. అంతా విన్న తర్వాత ఆయన ఒక కత్తి తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. నేను ఈ పిల్లవాడిని రెండు ముక్కలు చేసి ఇద్దరికీ చెరో సగం ఇస్తాను అన్నారు. ఆ మాట వినగానే చిన్నామె, "వద్దండీ, అంతపని చేయకండి. దేవుడు మిమ్మల్ని చల్లగా ఉంచాలి (పిల్లవాణ్ణి ఆమెకే ఇచ్చేయండి.) ఇతను ఆవిడ బిడ్డే" అని అన్నది. అది విన్న తర్వాత ఆయన చిన్నామెకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. (బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని ఫరాయెజ్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని అఖ్జియా ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) said: The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) said, “There were two women, each had her child with her. A wolf came and took away the child of one of them. One woman said to her companion: `The wolf has taken your son.’ The other said: `It has taken your son.’ So both of them took the dispute to Prophet Dawud (David) (sallallaahu alayhi wa sallam) who judged that the boy should be given to the older lady. Then they went to Prophet Sulaiman (Solomon) (sallallaahu alayhi wa sallam) son of Dawud and put the case before him. Prophet Sulaiman said: `Give me a knife so that I may cut the child into two and give one half to each of you.’ The younger woman said: `Do not do so; may Allah bless you! He is her child.’ On that Prophet Sulaiman decided the case in favour of the younger woman.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
హజ్రత్ సులైమాన్ (అలైహిస్సలాం) తన అవగాహనా శక్తిని, మేధస్సును, తీర్పరితనాన్ని ఉపయోగించి యుక్తితో వ్యవహారం లోతులకు చేరుకున్నారు. అది దేవుడు ఆయనకిచ్చిన ఒక వరం. అయితే ఆయన ఈ యుక్తిని సత్యశోధన కోసం ఉపయోగించారే కాని, నిజాన్ని కలగాపులగం చేయటం కోసం ఉపయోగించలేదు. ఇలాంటి యుక్తులు పన్నటం షరీఅత్లో ధర్మ సమ్మతమేనన్న విషయంలో భేదాభిప్రాయానికి తావులేదు. కాని ఇందుకు భిన్నంగా షరీఅత్ను ఉల్లంఘించే ఉద్దేశ్యంతో పన్నే కుయుక్తులు ధర్మసమ్మతం కావు. పైగా అలాచేయటం మహాపాపం. అది యూదుల విధానం. అల్లాహ్ మనల్ని వాటి నుంచి రక్షించుగాక!
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1829
హదీసు 1830
وعَنْ مِرْداسٍ الأسْلَمِيِّ رضي اللَّه عَنْهُ قالَ قالَ النَّبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "يَذْهَبُ الصَّالحُونَ الأوَّلُ فالأولُ، وتَبْقَى حُثَالَةٌ كحُثَالَةِ الشِّعِيرِ أوْ التَّمْرِ، لاَ يُبالِيهمُ اللَّه بالَةً"، رواه البخاري.
హజ్రత్ మిర్దాస్ అస్లమీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: మంచి మనుషులు ఒక్కొక్కరి చొప్పున వెళ్ళిపోతారు. చివరికి బార్లి లేక ఖర్జూర చెత్తలాంటి మనుషులు మాత్రమే మిగిలిపోతారు. అల్లాహ్ దృష్టిలో వారికి ఎలాంటి విలువా ఉండదు. (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని మగాజీ ప్రకరణం)
English
Mirdas Al-Aslami (radiyallahu anhu) said: The Prophet (sallallaahu alayhi wa sallam) said, “The pious men will depart one after another, the dregs of people, like the sediment of barley or dates will remain; Allah will not raise them in value and esteem.”[Al-Bukhari].
ముఖ్యాంశాలు
ప్రళయానికి పూర్వం మంచి మనుషులందరూ లేపుకోబడతారనీ, ఎందుకూ పనికిరాని వారు మాత్రమే మిగిలిపోతారని, అలాంటివారి మీదనే ప్రళయం సంభవిస్తుందని ఈ హదీసులో జోస్యం చెప్పబడింది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1830
హదీసు 1831
وعنْ رِفَاعَةَ بنِ رافعٍ الزُرقيِّ رضي اللَّه عنْهُ قالَ: جاء جِبْريلُ إلى النبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ: مَا تَعُدُّونَ أهْلَ بَدْرٍ فيكُمْ؟ قالَ:"مِنْ أفْضَلِ المُسْلِمِين"أوْ كَلِمَةً نَحْوَهَا قالَ:"وَكَذَلكَ مَنْ شَهِدَ بَدْراً مِنَ المَلائِكَةِ". رواه البخاري.
హజ్రత్ రిఫాఆ బిన్ రాఫే జురఖీ (రదియల్లాహు అన్హు) కథనం: జిబ్రయీల్ దూత దైవప్రవక్త ﷺ దగ్గరికి వచ్చి, "బద్ర్ యోధులను మీరు ఏమనుకుంటున్నారు?" అని అడిగారు. "వారు ముస్లింలలో అందరికంటే శ్రేష్ఠులు" అని బదులిచ్చారు దైవప్రవక్త ﷺ. (లేక అలాంటి మాటే ఏదో అని ఉంటారు.) అందుకు జిబ్రయీల్ దూత, 'అలాగే బద్ర్ యుద్ధంలో పాల్గొన్న దూతలు ఇతర దూతలకంటే శ్రేష్ఠులు' అని చెప్పారు. (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని కితాబు ఫజాయిలి అస్హాబిన్నబియ్యి)
English
Rifa`ah bin Rafi` Az-Zuraqi (radiyallahu anhu) said: Jibril (Gabriel) came to the Prophet (sallallaahu alayhi wa sallam) and asked him: “How do you estimate among you those who participated in the battle of Badr?” He replied, “They were the best of Muslims” (or he may have said something similar to that). Jibril said: “The same is the case with the angels who were at Badr.”[Al-Bukhari].
ముఖ్యాంశాలు
బద్ర్ యుద్ధం హి.శ. రెండవ యేట జరిగింది. ఇది అవిశ్వాసులకు – ముస్లింలకు మధ్య జరిగిన మొట్టమొదటి యుద్ధం. అంతేకాదు, ఈ యుద్ధంలో సంఖ్యాపరంగానూ, ఆయుధపరంగానూ ముస్లింలు అవిశ్వాసులకంటే చాలా తక్కువ స్థితిలో ఉన్నారు. అల్లాహ్ విశ్వాసులకు సహాయం చేశాడు. వారి సహాయం కోసం దైవదూతలను అవతరింపజేశాడు. ముస్లింలతోపాటు వారు కూడా యుద్ధంలో పాల్గొన్నారు – కనుక ఈ యుద్ధానికి ఇస్లామీయ చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఉంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1831
హదీసు 1832
وعن ابنِ عُمَر رضي اللَّه عنْهُما قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إذَا أنْزل اللَّه تَعالى بِقَوْمٍ عَذَاباً أَصَابَ الْعَذَابُ مَنْ كَانَ فِيهمْ. ثُمَّ بُعِثُوا على أعمَالِهمْ" متفقٌ عليه.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: అల్లాహ్ ఏదయినా జాతి మీద శిక్షను అవతరింపజేస్తే ఆ శిక్ష ఆ జాతి వారందరి మీద పడుతుంది. తర్వాత (ప్రళయదినాన) వారందరూ తమ తమ ఆచరణలకు అనుగుణంగా బ్రతికించబడతారు. (బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని కితాబుల్ ఫితన్ – సహీహ్ ముస్లింలోని కితాబుల్ జన్నహ్)
English
Ibn `Umar (radiyallahu anhuma) said: The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) said, “If Allah afflicts punishment upon a nation, it befalls the whole population indiscriminately and then they will be resurrected and judged according to their deeds.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ఏ జాతిలోనయినా చెడులు విపరీతంగా పెరిగిపోయి మంచివారు అతికొద్దిమంది మాత్రమే ఉన్నప్పుడు ఇలాంటి సార్వత్రిక శిక్షలు అవతరిస్తాయి. అప్పుడు మంచివారు- చెడ్డవారు అన్న తేడా లేకుండా అందరూ ఆ శిక్షకు గురౌతారు. తర్వాత ప్రళయదినాన మంచివారు తమ విశ్వాసం, దైవభీతి చలువతో పరలోక శిక్ష నుంచి బతికి బయటపడతారు. ఇకపోతే ఇతరులకు మాత్రం అక్కడి ఘోరశిక్ష కాచుకొని ఉంటుంది. అల్లాహ్ మనల్ని రక్షించుగాక!
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1832
హదీసు 1833
وعَنْ جابرٍ رضي اللَّه عنْهُ قال: كانَ جِذْعٌ يقُومُ إلَيْهِ النَّبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، يعْني فِي الخُطْبَةِ، فَلَما وُضِعَ المِنْبرُ، سَمِعْنَا لِلْجذْعِ مثْل صوْتِ العِشَارِ حَتَّى نَزَلَ النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَوضَع يدَه عليْهٍ فسَكَنَ. وَفِي روايةٍ: فَلَمَّا كَانَ يَومُ الجمُعة قَعَدَ النَّبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم عَلَى المِنْبَرِ، فصاحتِ النَّخْلَةُ الَّتِي كَانَ يخْطُبُ عِنْدَهَا حَتَّى كَادَتْ أنْ تَنْشَقَّ. وفي روايةٍ: فَصَاحَتْ صِيَاحَ الصَّبيِّ. فَنَزَلَ النَّبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، حتَّى أخذَهَا فَضَمَّهَا إلَيْهِ، فَجَعلَتْ تَئِنُّ أنِينَ الصَّبيِّ الَّذي يُسكَّتُ حَتَّى اسْتَقرَّتْ، قال:"بَكَتْ عَلى مَا كَانَتْ تسمعُ مِنَ الذِّكْرِ"رواه البخاريُّ.
హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం: ఒక ఖర్జూర చెట్టు కొమ్మ ఉండేది. దైవప్రవక్త ﷺ ఖుత్బా ఇచ్చేటప్పుడు దాని ఆధారంగా నిలబడి ప్రసంగించేవారు. తర్వాత ఆయన కొరకు ఒక (కొయ్య) వేదిక సిద్ధపరచబడింది. అప్పుడు ఆ చెట్టు కొమ్మ పదినెలల సూడి ఒంటె ఏడ్చినట్టు ఏడ్వటం మేము విన్నాము. ఆఖరికి దైవప్రవక్త ﷺ వేదిక మీద నుంచి క్రిందికి దిగి దానిమీద తన శుభహస్తం ఉంచినప్పటికిగాని అది ఏడ్పు మానలేదు.
వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: జుమా రోజు వచ్చింది. ఆ రోజు దైవప్రవక్త ﷺ ఖుత్బా ఇవ్వటానికి వేదిక్పైకి ఎక్కారు. అప్పుడు ఆయన అంతకు ముందు పట్టుకొని నిలబడి ఖుత్బా ఇస్తూ వచ్చిన ఖర్జూర చెట్టు కొమ్మ ఇంకాస్తయితే పగిలిపోతుందేమో అన్నంత బిగ్గరగా రోదించసాగింది.
ఇంకొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: ఆ చెట్టు మొదలు చిన్నపిల్లవాడిలాగా అరచి గీ పెడ్తూ ఏడుస్తుంటే దైవప్రవక్త ﷺ వేదిక నుంచి క్రిందికి దిగి దాన్ని పట్టుకొని కౌగిలించుకున్నారు. అప్పుడు అది చిన్నపిల్లవాడిని ఏడ్పు మానమంటే ఎలా వెక్కిళ్లు పెడతాడో అలా వెక్కిళ్లు పెట్టసాగింది. కాసేపటికి ఏడ్పు మానేసింది. అప్పుడు దైవప్రవక్త ﷺ (అక్కడున్న వారితో) "ఇంతకు ముందు ఇది నా హితబోధ వినేది. (ఇప్పుడు ఆ అవకాశం వెళ్ళిపోయినందుకు) ఏడుస్తోంది" అని చెప్పారు.
(బుఖారీ)
(సహీహ్ బుఖరీ కితాబుల్ మనాఖిబ్)
English
Jabir (radiyallahu anhu) said: There was a trunk of a date-palm tree upon which the Prophet (sallallaahu alayhi wa sallam) used to recline while delivering Khutbah (sermon). When a pulpit was placed in the mosque, we heard the trunk crying out like a pregnant she-camel. the Prophet (sallallaahu alayhi wa sallam) came down from the pulpit and put his hand on the trunk and it became quiet.
Another narration is: The Prophet (sallallaahu alayhi wa sallam) used to stand by a tree or a date-palm on Friday (to give the Khutbah). Then an Ansari woman or man said, “O Messenger of Allah! Shall we make a pulpit for you?” He replied, “If you wish.” So they made a pulpit for him and when it was Friday, the Prophet (sallallaahu alayhi wa sallam) sat on the pulpit [to deliver the Khutbah (sermon)] and the trunk of the date-palm on which he used to recline cried out as if it would split asunder.
Another narration is: It cried like a child and the Prophet (sallallaahu alayhi wa sallam) descended (from the pulpit) and embraced it while it continued moaning like a child being quietened. The Prophet (sallallaahu alayhi wa sallam) said, “It was crying for (missing) what it used to hear of Dhikr near it.”[Al-Bukhari].
ముఖ్యాంశాలు
ఈ హదీసు ద్వారా బోధపడే విషయం ఏమిటంటే, ప్రతి వస్తువులోనూ దేవుడు ఓ ప్రత్యేక గ్రహణశక్తిని పొందుపరచాడు. దాని స్వరూప స్వభావాలు మనకు తెలియవు. చెట్టు మొదలు హితబోధ వినడం కోసం వెక్కివెక్కి ఏడ్వటం దైవప్రవక్త ﷺ మహిమ.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1833
హదీసు 1834
وعنْ أبي ثَعْلَبَةَ الخُشَنيِّ جَرْثُومِ بنِ نَاشِرٍ رضي اللَّه عَنْهُ عنْ رَسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إنَّ اللَّه تَعَالَى فَرَضَ فَرائِضَ فَلاَ تُضَيِّعُوهَا، وحدَّ حُدُوداً فَلا تَعْتَدُوهَا، وحَرَّم أشْياءَ فَلا تَنْتَهِكُوها، وَسكَتَ عَنْ أشْياءَ رَحْمةً لَكُمْ غَيْرَ نِسْيانٍ فَلا تَبْحثُوا عَنْهَا "حديثٌ حسن، رواه الدَّارقُطْني وَغَيْرهُ.
హజ్రత్ అబూ సాలబా ఖుషనీ జుర్సూమ్ బిన్ నాషిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: అల్లాహ్ కొన్నిటిని విధులుగా చేశాడు. వాటిని వృధా చేయకండి. మరికొన్ని హద్దులు నిర్ణయించాడు. వాటిని ఉల్లంఘించకండి. ఇంకొన్నిటిని నిషిద్ధం చేశాడు. మీరు వాటికి పాల్పడకండి. మీ మీద దయతలచి ఆయన కొన్ని విషయాలు వివరించలేదు. ఆయన వాటిని మర్చిపోయాడనుకొని మీరు వాటిని త్రవ్వి తీయటానికి ప్రయత్నించకండి. (ఈ హదీసు హసన్. దారె ఖుత్నీ మొదలగువారు దీనిని వెలికితీశారు.)
(సుననె దారెఖుత్నీ, ఆఖిరు కితాబిస్సైది)
English
Abu Tha`labah Al-Khushani (radiyallahu anhu) said: The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) said, “Allah, the Exalted, has laid down certain duties which you should not neglect, and has put certain limits which you should not transgress, and has kept silent about other matters out of mercy for you and not out of forgetfulness, so do not seek to investigate them.” [Ad-Daraqutni and others]
ముఖ్యాంశాలు
షేఖ్ అల్బానీ ఈ హదీసు పరంపరలో అంతరాయం ఉందని చెప్పారు. దీని గురించి ఆయన "గాయతుల్ మరామ్ ఫీ తఖ్రీజి అహాదీసిల్ హలాలి వల్ హరామ్" అనే పుస్తకంలో వివరంగా రాశారు. అయితే మరి కొంతమంది పండితులు ఇతర సాక్షి హదీసుల ఆధారంగా దీనిని హసన్‌గా పేర్కొన్నారు. ఉదాహరణకు స్వయంగా గ్రంథకర్త ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్)గారే ఈ హదీసుని హసన్‌గా ఖరారు చేశారు. సాక్షి హదీసుల కోసం హాకిమ్ గారి ముస్తద్రక్ గ్రంథం నాల్గవ సంపుటి 115వ పుట, మజ్మవుజ్జవాయిద్ గ్రంథం 7వ సంపుటి 75వ పుట, తిర్మిజీలో లిబాస్ ప్రకరణంలోని మాజాఅ ఫీ లుబ్సిల్ ఫరా అధ్యాయం 1726వ హదీసు. ఇబ్నెమాజాలో అత్యిమా ప్రకరణంలోని అక్లుల్ జుబ్ని వ స్సమన్ అధ్యాయం 3367వ హదీసు, బైహఖీగారి సుననె కుబ్రాలో జహాయా ప్రకరణంలోని మాజాఅ ఫిజ్జబ్యి వస్సాలబ్ మరియు మాలమ్ యుజ్కరు తహ్రీముహూ వలాకాన ఫీ మానా మాజుకిర తహ్రీముహూ మిమ్మా యూకలు అవ్ యుష్రబు అధ్యాయాల్లో 9వ సంపుటి 537వ పుట. 10వ సంపుటి 21వ పుట. కొత్త ప్రచురణ.
ఇమామ్ సుమ్ఆనీ ఇలా అంటున్నారు: ఈ హదీసుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుచేతనంటే- ఇందులో అవసరమైన విషయాల గురించి వివరించబడింది. ఎవరైతే వాటికి అనుగుణంగా జీవితం గడుపుతారో వారు తప్పకుండా కృతకృత్యులౌతారు. ఎందుకంటే విధులను ఆచరించటం, నిషేధాలకు దూరంగా ఉండటం దేవుడు నిర్ణయించిన హద్దుల్ని గౌరవించటం, అల్లాహ్ వివరించని విషయాలను త్రవ్వకుండా ఉండటంలో ధర్మానికి సంబంధించిన ముఖ్య విషయాలన్నీ వచ్చేస్తాయి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1834
హదీసు 1835
وعنْ عَبدِ اللَّهِ بنِ أبي أوْفي رضي اللَّه، عَنْهُمَا قالَ: غَزَوْنَا مَعَ رَسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم سَبْعَ غَزَوَاتٍ نَأكُلُ الجرادَ. وَفِي روايةٍ: نَأْكُلُ معهُ الجَراد، متفقٌ عليه.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబూ ఔఫా (రదియల్లాహు అన్హు) కథనం: మేము దైవప్రవక్త ﷺ వెంట ఏడు యుద్ధాలు చేశాం. ఆ యుద్ధాల్లో మేము మిడతలు తినేవాళ్ళం. వేరొక ఉల్లేఖనంలో, "మేము దైవప్రవక్త ﷺ వెంట మిడతలు తినేవాళ్ళం" అని ఉంది.
(బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని జబాయెహ్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని సైద్ ప్రకరణం)
English
`Abdullah bin Abu `Aufa (radiyallahu anhuma) said: We accompanied the Messenger of Allah (sallallaahu alayhi wa sallam) in seven expeditions, and we ate locusts.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
మిడతలు ఎలాంటి ప్రాణులంటే అల్లాహ్ గనక తలచుకుంటే అవి ఒక్కసారిగా లక్షల సంఖ్యలో తుఫానులా వచ్చి పంట చేలను తిని నాశనం చేసేయగలవు. మిడతల్ని తినవచ్చు. వీటిని జిబహ్ చేయవలసిన అవసరం లేదు. చేప మరియు మిడత ఈ రెండిటిని చనిపోయిననూ తినవచ్చు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1835
హదీసు 1836
وعَنْ أبي هُريْرةَ رضي اللَّه عنْهُ أنَّ النَّبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَال: "لا يُلْدغُ المُؤمِنُ مِنْ جُحْرٍ مرَّتَيْنِ" متفقٌ عليه.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: విశ్వాసి ఒకే రంధ్రం గుండా రెండుసార్లు కాటు వేయించుకోడు. (బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని అదబ్ ప్రకరణం -సహీహ్ ముస్లింలోని జుహ్ద్ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) said: The Prophet (sallallaahu alayhi wa sallam) said, “A believer should not be stung twice from the same hole.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
విశ్వాసి తనకు ఒక చోట నష్టం కలిగితే అక్కడ మాటిమాటికీ మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని పై హదీసు భావం.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1836
హదీసు 1837
وَعنْهُ قَال: قَال رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "ثَلاثَةٌ لاَ يُكَلِّمُهُمُ اللَّه يَوْمَ الْقِيَامةِ وَلاَ ينْظُرُ إلَيْهِمْ وَلا يُزَكِّيهِمْ ولَهُمْ عذابٌ ألِيمٌ: رجُلٌ علَى فَضْلِ ماءٍ بِالْفَلاةِ يمْنَعُهُ مِن ابْنِ السَّبِيلِ، ورَجُلٌ بَايَع رجُلاً سِلْعَةً بعْد الْعَصْرِ، فَحَلَفَ بِاللَّهِ لأخَذَهَا بكَذَا وَكَذا، فَصَدَّقَهُ وَهُوَ عَلى غيْرِ ذَلِكَ، ورَجُلٌ بَايع إمَاماً لاَ يُبايِعُهُ إلاَّ لِدُنيَا، فَإنْ أعْطَاهُ مِنْهَا وَفَى، وإنْ لَم يُعْطِهِ مِنْهَا لَمْ يَفِ" متفقٌ عليه.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు)గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ముగ్గురున్నారు, ప్రళయదినాన అల్లాహ్ వారి వంక చూడడు. వారిని పరిశుద్ధపరచడు. పైగా వారి కొరకు బాధాకరమైన శిక్ష ఉంటుంది. ఒకడు, ఎక్కడో అడవుల్లో, తన అవసరానికి మించివున్న నీళ్ళను ఆక్రమించుకొని బాటసారులకు కూడా ఆ నీరు ఉపయోగించకుండా అడ్డుకునేవాడు. రెండోవాడు, అస్ర్ (నమాజ్) తర్వాత తన సామాను ఎవరికైనా అమ్ముతూ తనే ఆ సామాను ఇంతకు కొన్నానని ప్రమాణం చేసి మరీ చెప్పేవాడు. ఎదుటి వ్యక్తి అతను చెప్పేది నిజమేననుకొని ఆ సామాను కొంటాడు. నిజానికి అతని వ్యవహారం అందుకు భిన్నంగా ఉంటుంది (అంటే అతను అబద్ధపు ప్రమాణం చేస్తాడు). మూడోవాడు, కేవలం ప్రాపంచిక సంపదల కోసం తనకాలపు ఖలీఫా చేతి మీద బైత్ (ప్రమాణం) చేసి ఖలీఫా ప్రాపంచిక సంపదలేమయినా ఇస్తే ప్రమాణాన్ని నెరవేరుస్తూ, ఇవ్వకపోతే ప్రమాణం నెరవేర్చకుండా ఉండేవాడు.
(బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని షహాదత్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఈమాన్ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) said: The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) said, “There are three (types of) people with whom Allah will neither speak on the Day of Resurrection nor purify them (from sins) and there will be a painful chastisement for them: A person who has spare water in a desert and he refuses to give it to the traveller; a person who sells a commodity to another person after the afternoon prayer and swears by Allah that he has bought it at such and such price, and the buyer pays him accordingly though in reality it was not true; and a person who pledges allegiance to an Imam (leader) just for some worldly benefit, and then if the Imam bestows on him (something out of that) he fulfills his allegiance, and if does not give him, he does not fulfill it.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
పైన పేర్కొనబడిన మూడు పనులూ ఘోరపాపాలే. ఎందుకంటే వాటిలో మొదటి దాంట్లో ప్రజలమీద దౌర్జన్యం జరుగుతోంది. రెండవ దాంట్లో దేవుని పేరుమీద మోసం జరుగుతోంది. హరామ్ తిండికి పాల్పడినట్లవుతోంది. మూడవ దాంట్లో ఖలీఫాకు విధేయత చూపి దానికి ప్రతిఫలంగా అన్యాయంగా ప్రాపంచిక సంపదలు అనుభవించటం జరుగుతోంది. ఈ మూడు పనులూ అల్లాహ్‌కు చాలా అసహ్యకరమైనవి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1837
హదీసు 1838
وَعَنْهُ عن النَّبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "بَيْنَ النَّفْخَتَيْنِ أرْبعُونَ"قَ الُوا يَا أبَا هُريْرةَ، أرْبَعُونَ يَوْماً؟ قَالَ: أبَيْتُ، قالُوا: أرْبعُونَ سَنَةً؟ قَال: أبَيْتُ. قَالُوا: أرْبَعُونَ شَهْراً؟ قَال: أبَيْتُ" وَيَبْلَى كُلُّ شَيءٍ مِنَ الإنْسَانِ إلاَّ عَجْبَ الذَّنَبِ، فِيهِ يُرَكَّبُ الْخَلْقُ، ثُمَّ يُنَزِّلُ اللَّه مِنَ السَّمَآءِ مَاءً، فَيَنْبُتُونَ كَمَا يَنْبُتُ الْبَقْلُ "متفقٌ عليه.
రెండు శంఖాల మధ్య నలభై అంత వ్యవధి ఉంటుందని దైవప్రవక్త ﷺ చెప్పినట్టు హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) ప్రజలకు తెలియజేశారు. అది విని జనం, "అబూహురైరా! నలభై రోజులా?" అని అడిగారు. "నాకు తెలియదు" అని బదులిచ్చారాయన. జనం మళ్ళీ, "నలభై సంవత్సరాలా?" అని అడిగారు. ఆయన "నాకు తెలియదు" అని చెప్పారు. "లేక నలభై నెలలా?" అని మళ్ళీ అడిగారు జనం. (మూడోసారి కూడా) ఆయన "నాకు తెలియదు" అనే సమాధాన మిచ్చారు. తర్వాత ఇలా చెప్పారు: మనిషి శరీరంలోని ప్రతి వస్తువు మట్టిలో కలిసిపోతుంది. ఒక్క వెన్నెముక తప్ప. ఆ ఎముకతోనే మనిషిని సమీకరించి తిరిగి బ్రతికిం చటం జరుగుతుంది. తర్వాత అల్లాహ్ ఆకాశం నుంచి వర్షం కురిపిస్తాడు. దాంతో మనుషులు (భూమి నుంచి) కూరగాయలు మొలకెత్తినట్టు మొలకెత్తుతారు.
(బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని తఫ్సీర్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఫితన్ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) said: The Prophet (sallallaahu alayhi wa sallam) said, “Between the two Blowing of the Trumpet there will be an interval of forty.” The people said, “O Abu Hurairah! Do you mean forty days?” He said, “I cannot say anything.” They said, “Do you mean forty years?” He said, “I cannot say anything.” They said, “Do you mean forty months?” He said, “I cannot say anything. The Prophet added: `Everything of the human body will perish except the last coccyx bone (end part of the spinal cord), and from that bone Allah will reconstruct the whole body. Then Allah will send down water from the sky and people will grow like green vegetables‘.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
1) ప్రళయం సంభవించినప్పుడు ఇస్రాఫీల్ దూత శంఖం పూరిస్తారు. ఆ శబ్దానికి మానవులంతా స్పృహను కోల్పోతారు. ఇది మొదటి శంఖం. తర్వాత మళ్ళీ శంఖం పూరించబడుతుంది. అప్పుడు మానవులంతా బతికి సమాధుల నుంచి లేచి వస్తారు. ఇది రెండో శంఖం. వీటిని నఫ్ఖతుస్సయిఖ్ మరియు నఫ్ఖతుల్ బఅస్ అని అంటారు. ఈ రెండు శంఖాల మధ్య ఎన్ని రోజుల లేక ఎన్ని నెలల లేక ఎన్ని సంవత్సరాల వ్యవధి ఉంటుంది? అన్న విషయం గురించి ఈ హదీసు ఉల్లేఖకులు హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారిని అడగ్గా, ఆయన తనకు ఆ విషయం తెలీదని చెప్పారు. అయితే మరికొన్ని ఉల్లేఖనాల్లో మాత్రం వాటి మధ్య నలభై ఏళ్ల వ్యవధి ఉంటుందని స్పష్టంగా చెప్పబడింది.
2) దైవప్రవక్తలు తప్ప మిగతా మానవులందరి శరీరాలనూ మట్టి తినేస్తుంది. కాని ఒక వెన్నముక మాత్రం మిగిలి ఉంటుంది. అయితే దాని మిగిలుండే స్వరూపం అల్లాహ్‌కు మాత్రమే తెలుసు. ఏమయినప్పటికీ ఆ ఎముకతో మానవశరీరం మళ్ళీ ఉనికిలోకి తీసుకురాబడుతుంది.
3) ప్రళయ దినాన ఆకాశం నుంచి వర్షం కురిసినప్పుడు మొక్కల్లాగా మానవ శరీరాలు కూడా మొలకెత్తుతాయి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1838
హదీసు 1839
وَعَنْهُ قَالَ بيْنَمَا النَّبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم في مَجْلِسٍ يُحَدِّثُ الْقَوْمَ، جاءَهُ أعْرابِيُّ فَقَالَ: مَتَى السَّاعَةُ؟ فَمَضَى رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يُحَدِّثُ، فقَال بَعْضُ الْقَوْمِ: سَمِعَ مَا قَالَ، فَكَرِه مَا قَالَ، وقَالَ بَعْضُهمْ: بَلْ لَمْ يَسْمَعْ، حَتَّى إذَا قَضَى حَدِيثَهُ قَالَ:"أيْنَ السَّائِلُ عَنِ السَّاعَةِ؟ "قَال: هَا أنَا يَا رسُولَ اللَّه، قَالَ:"إذَا ضُيِّعَتِ الأَمَانةُ فانْتَظِرِ السَّاعةَ"قَالَ: كَيْفَ إضَاعَتُهَا؟ قَالَ: إذَا وُسِّد الأمْرُ إلى غَيْرِ أهْلِهِ فَانْتَظِرِ السَّاعة "رواهُ البُخاري.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన వేరొక కథనం: ఒకసారి దైవప్రవక్త ﷺ ఒకానొక సమావేశంలో కూర్చొని ప్రజలతో మాట్లాడుతుండగా పల్లెటూరి వ్యక్తి ఒకడు వచ్చి "ప్రళయం ఎప్పుడు వస్తుంది?" అని అడిగాడు. దైవప్రవక్త ﷺ (అతని మాటలు పట్టించుకోకుండా) మాట్లాడుతూ పోతున్నారు. అది చూసి జనంలో కొంతమంది దైవప్రవక్త ﷺ ఆ పల్లెటూరి వ్యక్తి అన్నమాట విని ఉంటారు. కాని మధ్యలో అలా అడగటాన్ని అసహ్యించుకొని ఉంటారు (అందుకే సమాధానం ఇవ్వలేదు) అన్నారు. మరికొంతమంది దైవప్రవక్త ﷺ అసలు అతని మాట విననే లేదని అభిప్రాయపడ్డారు.
ప్రజలతో మాట్లాడటం అయిపోయిన తర్వాత దైవప్రవక్త ﷺ "ప్రళయం గురించి అడిగిన అతనేడి?" అన్నారు. "ఇదిగో నేనే దైవప్రవక్తా!" అని (ముందుకు వచ్చాడతను.) "అమానతులు (అప్పగింతలు) వృధా చేయబడుతున్న వేళ ప్రళయం కోసం నిరీక్షించు" అని చెప్పారు. "అమానతులు ఎలా వృధా చేయబడతాయి?" అని అడిగాడతను. అప్పుడు దైవప్రవక్త ﷺ (ఇంకా వివరంగా చెబుతూ), "ధార్మిక, ప్రాపంచిక వ్యవహారం అర్హత లేనివారికి అప్పగించబడినప్పుడు ప్రళయం కోసం నిరీక్షించు" అని అన్నారు. (బుఖారీ)
(సహీహ్ బుఖారీ: కితాబుల్ ఇల్మ్)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Once the Prophet (sallallaahu alayhi wa sallam) was speaking to us when, a bedouin came and asked him: “When will the Last Day be?” The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) continued his talk. Some of those present thought that he had heard him but disliked the interruption and the other said that he had not hear him. When the Messenger of Allah (sallallaahu alayhi wa sallam) concluded his speech he asked, “Where is the one who inquired about the Last Day?” The man replied: “Here I am.” The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) replied, “When the practice of honouring a trust is lost, expect the Last Day.” He asked: “How could it be lost?” He replied, “When the government is entrusted to the undeserving people, then wait for the Last Day.”[Al-Bukhari].
ముఖ్యాంశాలు
ప్రళయ సమీపంలో సంభవించే ఒక ముఖ్యమైన సూచన ఈ హదీసులో వివరించబడింది. అదేమిటంటే ధర్మానికి, ప్రాపంచిక జీవనానికి సంబంధించిన అధికారిక వ్యవహారాలు సత్పురుషులు, అర్హతగలవారికి బదులు అవినీతిపరులు, అయోగ్యుల చేతుల్లోకి వెళ్ళిపోతాయి. ప్రపంచ ఆధిపత్యం కూడా పాపాలు, నేరాలు చేయటంలో ఆరితేరినవారి కీర్తికిరీటంగా మారుతుంది. విద్యలేనివారు, ధనాశాపరులు, దైవం పట్ల భయభక్తులు లేనివారు ధర్మాసనాల మీద కూర్చొని న్యాయ సంబంధ తీర్పులు ఇవ్వటం మొదలుపెడతారు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1839
హదీసు 1840
وعنْهُ أنَّ رسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ:"يُصَلُّونَ لَكُمْ، فَإنْ أصَابُوا فَلَكُمْ، وإنْ أخْطئُوا فَلَكُمْ وَعَلَيْهِمْ" رواهُ البُخاريُّ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: మీ అధికారులు మీకు నమాజ్ చేయిస్తారు. వారు సరిగ్గా నమాజ్ చేయిస్తే మీకూ పుణ్యం ప్రాప్తిస్తుంది. ఒకవేళ తప్పుగా చేయిస్తే మీకు మాత్రం పుణ్యం ప్రాప్తిస్తుంది. పాపం వారినెత్తి మీద పడుతుంది. (బుఖారీ)
(సహీహ్ బుఖారీ అజాన్ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) said, “Your leaders will lead you in Salat (prayer). If they conduct it properly, you and they will be rewarded; but if they make mistakes you will earn the reward and they will be held responsible (for the mistakes).”[Al-Bukhari].
ముఖ్యాంశాలు
ఈ హదీసులో కూడా అనర్హులైన పాలకులకు సంబంధించి ముస్లిం జనసామాన్యానికి ఒక హితవు చెప్పటం జరిగింది. అదేమిటంటే నమాజులో వారు తప్పు చేసినా, అనగా సమయానికి నమాజ్ చేయించకపోయినా, సున్నత్ పట్ల వైముఖ్య ధోరణి ప్రదర్శించినా మీరు మాత్రం వేరు కుంపటి పెట్టుకోరాదు. అనగా వారి నుంచి వేరుపడి మస్జిద్ నిర్మించుకోరాదు. పైగా వారివెంటే ఉంటూ వారి సారధ్యంలోనే నమాజ్ చేస్తూ ఉండాలి. వారు గనక సున్నత్‌కు అనుగుణంగా నమాజ్ చేయిస్తే వారికి, మీకు – ఇరువురికీ పుణ్యం ప్రాప్తిస్తుంది. లేనిపక్షంలో మీకు ఎలాగూ పుణ్యం లభిస్తుంది. తప్పు చేసింది వారు కనుక ఆ పాపం వారి మీదే పడుతుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1840
హదీసు 1841
وَعَنْهُ رضي اللَّه عنْهُ: {كُنْتُمْ خَيْرَ أُمَّةٍ أخْرِجَتْ لِلنَّاسِ} قَالَ: خَيْرُ النَّاسِ لِلنَّاسِ يَأْتُونَ بِهِمْ في السَّلاسِل فِي أعْنَاقِهمْ حَتَّى يَدْخُلُوا فِي الإسْلامِ.
"కుంతుమ్ ఖైర ఉమ్మతిన్ ఉఖ్‌రిజత్ లిన్నాసి" అన్న దైవసూక్తిని వ్యాఖ్యానిస్తూ హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారు ఇలా అన్నారు: ప్రజల్లో ప్రజల కొరకు అందరికంటే శ్రేష్ఠులు ఎవరంటే – వారు ప్రజల్ని వారి మెడల్లో సంకెళ్లువేసి తీసుకువస్తారు. దాంతో వారు ఇస్లాంలోకి ప్రవేశిస్తారు. (బుఖారీ)
(సహీహ్ బుఖారీ: తఫ్సీర్ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) said in the interpretation of the Ayah reported: “You are the best of peoples ever raised up for (the benefit of) mankind…” (3:110): The best for mankind are those who bring them with chains round their necks till they embrace Islam (and thereby save them from the eternal punishment in the Hell-fire, and make them enter Jannah in the Hereafter).”[Al-Bukhari].
ముఖ్యాంశాలు
పై సూక్తికి హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) చెప్పిన భావం ఇది: దీని ప్రకారం పైసూక్తిలో ధర్మవిరోధులతో పోరాడే ముజాహిద్‌లు ముస్లిం సమాజంలో అందరికంటే శ్రేష్ఠులు. అవిశ్వాసుల్లో ఎవరైతే తమ చేతికి ఖైదీలుగా చిక్కుతారో వారు ముస్లింలుగా మారిపోతారు. ఈ విధంగా వారు అవిశ్వాసులకు సన్మార్గం లభించటంలో దోహదకారులు అవుతారన్నమాట. దాని మూలంగా వారు పుణ్యంలో ఇతరులకంటే ప్రత్యేకులుగా గుర్తించబడతారు. అయితే మరో అర్థంలో ఈ సూక్తి సార్వత్రికమైనది. అది అన్ని కాలాల ముస్లింలకూ వర్తిస్తుంది. అయితే వారు మంచిని ప్రబోధించు చెడుని నిరోధించు అన్న విధిని పాటించేవారై ఉండాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1841
హదీసు 1842
وَعَنْهُ عَن النَّبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَال: "عَجبَ اللَّه عَزَّ وَجَلَّ مِنْ قَوْمٍ يَدْخُلُونَ الْجَنَّةَ في السَّلاسِلِ" رواهُما البُخاري. معناها يُؤْسَرُونَ وَيُقَيَّدُونَ ثُمَّ يُسْلِمُونَ فَيَدْخُلُونَ الجَنَّةَ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన ఇంకొక కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: సంకెళ్ళలో బంధించబడి స్వర్గంలో ప్రవేశించేవారిని చూసి అల్లాహ్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు. (బుఖారీ)
వారిని ఖైదీలుగా సంకెళ్ళలో బంధించటం జరుగుతుంది. తర్వాత వారు ఇస్లాం స్వీకరించి స్వర్గానికి చేరుకుంటారని దీని భావం.
(సహీహ్ బుఖారీలోని కితాబుల్ జిహాద్)
English
Abu Hurairah (radiyallahu anhu) said: the Prophet (sallallaahu alayhi wa sallam) said, “Allah marvels at those people who enter Jannah in chains.”[Al-Bukhari].
ముఖ్యాంశాలు
ఈ హదీసు భావం కూడా ఇంతకుముందు హదీసులో అబూహురైరా (రదియల్లాహు అన్హు) వ్యాఖ్యానం క్రింద వివరించబడిన భావమే. దీనిద్వారా బోధపడేది ఏమిటంటే అవిశ్వాసుల్ని ఖైదీలుగా పట్టుకున్న తర్వాత వారికి ఇస్లామీయ బోధనలు, వాటి ప్రాముఖ్యతా ప్రయోజనాల గురించి వివరించాలి, దాంతో వారు ఇస్లాం స్వీకరించి స్వర్గప్రవేశానికి అర్హులు అవుతారు. అప్పుడు ఈ ఇనుప సంకెళ్ళే వారిపాలిట స్వర్ణ కంఠాభరణాలు అవుతాయి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1842
హదీసు 1843
وَعنْهُ عَنِ النَّبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "أَحَبُّ الْبِلاَدِ إلَى اللَّه مَساجِدُهَا، وأبَغضُ الْبِلاَدِ إلى اللَّه أسواقُهَا" روَاهُ مُسلم.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన వేరొక కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: స్థలాలన్నిటిలో అల్లాహ్‌కు అతి ప్రియమైన స్థలాలు ప్రార్థనాస్థలాలు. అలాగే ప్రదేశాలన్నిటిలో అత్యంత అయిష్టకరమైన ప్రదేశాలు బజారులు.
(ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని మసాజిద్ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) said: the Prophet (sallallaahu alayhi wa sallam) said, “The dearest parts on the face of the earth near Allah are its mosques, and the most hated parts near Allah are its markets.”[Muslim].
ముఖ్యాంశాలు
ప్రార్థనా స్థలాలు అన్నిటికంటే గొప్పవి అవటానికి కారణం ఏమిటో తెలుస్తూనే ఉంది. అక్కడ అల్లాహ్‌ను ఆరాధించటం జరుగుతుంది. ప్రజలు ఆయన్ని కీర్తిస్తుంటారు. దివ్యఖుర్ఆన్ పారాయణం చేస్తుంటారు. దీనికి భిన్నంగా అంగళ్లు దైవస్మరణను మరిపిస్తాయి. అంతేకాదు, అక్కడ దగా మోసాలు, అబద్ధం లాంటి చెడులు వ్యాపించి ఉంటాయి. కనుక అలాంటి ప్రదేశాలు అత్యంత అయిష్టకరమైనవి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1843
హదీసు 1844
وَعَنْ سَلْمَانَ الْفَارِسيِّ رضي اللَّه عَنْهُ منْ قَولِهِ قَال: لاَ تَكُونَنَّ إن اسْتَطعْتَ أوَّلَ مَنْ يَدْخُلُ السُّوقَ، وَلا آخِرَ مَنْ يَخْرُجُ مِنْهَا، فَإنَّهَا مَعْرَكَةُ الشَّيْطَانِ، وَبهَا ينْصُبُ رَايَتَهُ. رواهُ مسلم هكذا. ورَوَاهُ البرْقَانِي في صحيحهِ عَنْ سَلْمَانَ قَالَ: قَالَ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لاَ تَكُنْ أوَّلَ مَنْ يَدْخُلُ السُّوقَ، وَلا آخِرَ منْ يخْرُجُ مِنْهَا، فِيهَا بَاضَ الشَّيْطَانُ وَفَرَّخَ".
హజ్రత్ సల్మాన్ ఫార్సీ (రదియల్లాహు అన్హు)గారి స్వీయ (మౌఖూఫ్) హితోక్తి (ఆయన ఇలా అన్నారు): వీలైతే నువ్వు అందరికంటే ముందు అంగడికి వెళ్ళకుండా, అందరికంటే చివర్లో అక్కణ్ణుంచి బయటపడకుండా ఉండు. ఎందుకంటే అది షైతాన్ స్థావరం. షైతాన్ తన జెండా అక్కడే స్థాపిస్తాడు.
(ముస్లిం)
ఇమామ్ బర్ఖానీ తన సహీహ్ గ్రంథంలో హజ్రత్ సల్మాన్ ఫార్సీ (రదియల్లాహు అన్హు) ఆధారంగా (ఆయన స్వీయ హితోక్తిగా కాకుండా ప్రవక్త హితోక్తిగా) పొందుపరచారు. అందులో దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రబోధించారని ఉంది: నువ్వు అంగడికి అందరికంటే ముందు వెళ్ళేవాడివి, అందరికంటే చివర్లో అక్కణ్ణుంచి బయటికి వచ్చేవాడివి కాకూడదు. ఎందుకంటే షైతాన్ గుడ్లు పెట్టేది, పిల్లల్ని పొదిగేది ఇలాంటి ప్రదేశాల్లోనే.
(సహీహ్ ముస్లింలోని కితాబు ఫజాయిలిస్సహాబా)
English
Salman Al-Farisi (radiyallahu anhu) said: The Prophet (sallallaahu alayhi wa sallam) said, “Do not, if you can help, be the first to enter the market and the last to leave it because it is an arena of Satan and the standard of Satan is set there.”[Muslim].
There are other narrations with some variation in the wordings.
ముఖ్యాంశాలు
దీని ద్వారా బోధపడేదేమిటంటే బజారుల్లో అత్యధికంగా తిరగటం చాలా ప్రమాదకరమైన విషయం. అక్కడ పైశాచిక ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక మనిషి బజారుల్లో ఎంత ఎక్కువగా తిరుగుతాడో పైశాచిక దుష్ప్రభావాలకు అంతే ఎక్కువగా లోనవుతాడు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1844
హదీసు 1845
وعَنْ عاصِم الأحْوَلِ عَنْ عَبْدِ اللَّه بنِ سَرْجِسَ رضي اللَّه عَنْهُ قَالَ: قُلْتُ لِرَسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: يَا رَسُولَ اللَّه غَفَرَ اللَّه لكَ، قَالَ:"وَلَكَ"قَالَ عَاصِمٌ: فَقلْتُ لَهُ: اسْتَغْفَرَ لَكَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم؟ قَالَ: نَعَمْ وَلَكَ، ثُمَّ تَلاَ هَذه الآيةَ: {وَاسْتَغْفِرْ لِذَنْبِكَ وَلِلْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ} [محمد: ١٩] ، رَواهُ مُسلم.
హజ్రత్ ఆసిమ్ అహ్వల్ కథనం ప్రకారం అబ్దుల్లాహ్ బిన్ సర్జిస్ (రదియల్లాహు అన్హు) తనకు ఈ విధంగా తెలియజేశారు: నేను దైవప్రవక్త ﷺతో, "దైవప్రవక్తా! అల్లాహ్ మిమ్మల్ని క్షమించాలి" అని అన్నాను. అందుకాయన, "నిన్ను కూడా" అని అన్నారు.
ఆసిమ్ ఇలా తెలియజేస్తున్నారు: ఆ మాట విని నేను అబ్దుల్లాహ్ బిన్ సర్జిస్ను "దైవప్రవక్త ﷺ మీ క్షమాభిక్ష కోసం ప్రార్థన చేశారా?" అని అడిగాను. అందుకాయన, "అవును (ఆయన నిన్ను కూడా క్షమించుగాక (అని వేడుకున్నారు) తర్వాత ఆయన "మీరు మీ కోసం, విశ్వాసులైన స్త్రీ పురుషు లందరి క్షమాభిక్ష కోసం వేడుకోండి" అన్న ఖుర్ఆన్ సూక్తి (ముహమ్మద్ సూరా 19వ సూక్తి) పఠించి వినిపించారు" అని చెప్పారు.
(ముస్లిం)
(సహీహ్ ముస్లిం కితాబుల్ ఫజాయెల్)
English
`Asim Al-Ahwal said: `Abdullah bin Sarjis (radiyallahu anhu) said to the Messenger of Allah (sallallaahu alayhi wa sallam): “O Messenger of Allah! May Allah forgive all your sins!” The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) said, “And yours also.” `Asim reported: I asked `Abdullah: “Did the Messenger of Allah (sallallaahu alayhi wa sallam) seek forgiveness for you?” He replied: “Yes, and for you also.” Then he recited the Verse: “Seek forgiveness for your sins and for the believing men and the believing women.” (47:19)[Muslim].
ముఖ్యాంశాలు
దైవప్రవక్త ﷺ అల్లాహ్చే క్షమించబడినవారు. అయినప్పటికీ ఆయన గౌరవౌన్నత్యాలను పెంచే ఉద్దేశ్యంతో ఆయన మన్నింపుకోసం ప్రార్థన చేయవచ్చు. ఇది కూడా ఆయన్ని గౌరవించటంలో అంతర్భాగమే.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1845
హదీసు 1846
وَعَنْ أبي مسْعُودٍ الأنْصَارِيِّ رضي اللَّه عَنْهُ قَالَ: قَالَ النَّبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إنَّ مِمَّا أدْرَكَ النَّاسُ مِنْ كَلامِ النُّبُوَّةِ الأولَى: إذَا لَمْ تَسْتَحِ فَاصْنعْ مَا شِئْتَ" رواهُ البُخَاريُّ.
హజ్రత్ అబూ మస్‌వూద్ అన్సారీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: గత ప్రవక్తల నుంచి ప్రజలు నేర్చుకున్న పాఠాల్లో, "నువ్వు సిగ్గు విడిచినప్పుడు ఇష్టం వచ్చింది చేసుకో" అన్నమాట కూడా ఉంది. (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని అంబియా ప్రకరణం)
English
Abu Mas`ud Al-Ansari (radiyallahu anhu) said: The Prophet (sallallaahu alayhi wa sallam) said, “One of the admonitions of the previous Prophets which has been conveyed to people is that if you have no modesty, you can do whatever you like.”[Al-Bukhari].
ముఖ్యాంశాలు
'ఇష్టం వచ్చింది చేసుకో' అంటే నిజంగానే సిగ్గు విడిచినవాడు ఏమైనా చేసుకోవచ్చు అని దీని అర్థం ఎంతమాత్రం కాదు. వాస్తవానికి ఈ హదీసు అన్యాపదేశంగా ఒక నిజాన్ని తెలుపుతోంది. అదేమిటంటే, ఎప్పుడయితే మనిషిలో సిగ్గు, లజ్జ అనే భావం అంతరించిపోతుందో అప్పుడు అతను ఏ పని ఛేయటానికయినా వెనుకాడడు, అత్యంత నీచమైన పనులకు కూడా ఒడిగడతాడు. అందుకే పాశ్చాత్యులు ఇస్లామీయ సమాజపు అందం, ప్రాణం అయినటువంటి వ్రీడా భావాన్ని ముస్లిం యువత హృదయాల్లో నుంచి తుడిచిపెట్టేసి, ప్రతి నీతిబాహ్యమైన చేష్టనూ వారు సంతోషంగా స్వీకరించేలా చేయటానికి ప్రయత్నిస్తున్నారు. దురదృష్టం కొద్దీ పాశ్చాత్యులు ఈ నీచమైన కుట్రలో సఫలమవుతున్నారు. ముస్లిం పరిసరాలు కూడా పాశ్చాత్య సమాజాల్లాగా లజ్జా విహీనంగా తయారవుతున్నాయి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1846
హదీసు 1847
وَعَنْ ابْنِ مَسْعُودٍ رضي اللَّه عَنْهُ قَالَ: قَالَ النَّبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "أوَّلُ مَا يُقْضَى بَيْنَ النَّاسِ يوْمَ الْقِيَامةِ في الدِّمَاءِ" مُتَّفَقٌ علَيْهِ.
హజ్రత్ ఇబ్నె మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ప్రళయదినాన అన్నిటికంటే ముందు ప్రజల మధ్య హత్యానేరాల సమస్యలు పరిష్కరించబడతాయి. (బుఖారీ, ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని దియాత్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఖసామా ప్రకరణం)
English
Ibn Mas`ud (radiyallahu anhu) reported: The Prophet (sallallaahu alayhi wa sallam) said, “The first matter concerning which people will be judged on the Day of Resurrection will be the matter of blood.”[Al-Bukhari and Muslim]
ముఖ్యాంశాలు
వేరొక హదీసులో ప్రళయదినాన అన్నిటికంటే ముందు నమాజు గురించి లెక్క తీసుకోవటం జరుగుతుందని చెప్పబడింది. ఈ రెండు హదీసుల మధ్య ఎలాంటి వైరుధ్యమూ లేదు. ఎందుకంటే దేవుని హక్కుల్లో అన్నిటికంటే ముందు నమాజు గురించి, మానవుల పరస్పర హక్కుల్లో అన్నిటికంటే ముందు హత్యల గురించి లెక్క తీసుకోవటం జరుగుతుంది. దీనిద్వారా మనిషి ప్రాణానికి ఎంత గౌరవం ఉందో బోధపడుతోంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1847
హదీసు 1848
وَعَنْ عَائِشَةَ رضي اللَّه عَنْهَا قَالَتْ: قَالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "خُلِقَتِ المَلائِكَةُ مِنْ نُورٍ، وَخلِقَ الجَانُّ مِنْ مَارِجٍ منْ نَارً، وخُلِق آدمُ ممَّا وُصِفَ لَكُمْ" رواهُ مسلم.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: దూతలు కాంతితో పుట్టించబడ్డారు. జిన్నాతులు అగ్ని సెగతో పుట్టించబడ్డారు. ఆదం మీకు వివరించబడిన దానితో పుట్టించబడ్డారు. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని జుహ్ద్ ప్రకరణం)
English
`Aishah (radiyallahu anha) reported: The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) said, “Angels were created from light, jinns were created from a smokeless flame of fire, and `Adam was created from that which you have been told (i.e., sounding clay like the clay of pottery).”[Muslim].
ముఖ్యాంశాలు
దైవదూతలు దేవుని కాంతితో పుట్టించబడిన సృష్టిరాశులు. వారి శరీరాలు ఎంత సూక్ష్మంగా ఉంటాయంటే అవి ఏ ఆకారాన్నయినా ధరించగలవు. జిన్నాతులు కూడా మానవుల కంటికి కనిపించని దేవుని ఓ సృష్టి. వాటికి కూడా అల్లాహ్ మానవుల్లో లేని కొన్ని అద్భుత శక్తులు ప్రసాదించాడు. షైతాన్ కూడా ఆ జిన్నాతుల కోవకు చెందినవాడే. మనిషి పుట్టుక మట్టితో జరిగింది. అనగా మానవులందరి తండ్రి అయిన ఆదం రూపాన్ని అల్లాహ్ మట్టితో రూపొందించాడు. తర్వాత అందులో తన తరపు నుంచి ఆత్మను ఊదాడు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1848
హదీసు 1849
وَعنْهَا رضي اللَّه عَنْهَا قَالَتْ:"كَانَ خُلُقُ نَبِيِّ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم الْقُرْآنَ"رواهُ مُسْلِم في جُمْلَةِ حدِيثٍ طويلٍ.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) గారే చెప్పిన మరొక మాట: దైవప్రవక్త ﷺగారి నీతినడవడికలు స్వయానా దివ్యఖుర్ఆనే. (ముస్లిం ఒక సుదీర్ఘ హదీసు క్రింద ఈ విషయం వివరించారు.)
(సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజు ప్రకరణం)
English
`Aishah (radiyallahu anha) said: The conduct of the Prophet (sallallaahu alayhi wa sallam) was entirely according to the Qur’an.[Muslim in a long Hadith].
ముఖ్యాంశాలు
అంటే దైవప్రవక్త ﷺ గారి జీవితం, ఆయన దైనందిన వ్యవహారాలన్నీ దివ్యఖుర్ఆన్ ఆదేశాలకు అనుగుణంగా ఉండేవి. ఆయన అస్తిత్వం ఖుర్ఆన్ బోధనలకు నిలువెత్తు నిదర్శనంగా ఉండేది. ఆయన దివ్యఖుర్ఆన్ సమ్మతించిన విషయాలకు కట్టుబడి ఉండేవారు. ఖుర్ఆన్ నిషేధించిన విషయాలకు దూరంగా ఉండేవారు. దివ్యఖుర్ఆన్ బోధించే నియమ నిబంధనలను పూర్తిగా దృష్టిలో పెట్టుకొని ఆయన మసలుకునేవారు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1849
హదీసు 1850
وَعَنْهَا قَالَتْ: قَالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَنْ أحَبَّ لِقاءَ اللَّهِ أحبَّ اللَّه لِقَاءَهُ، وَمنْ كَرِهَ لِقاءَ اللَّه كَرِهَ اللَّه لِقَاءَهُ"فَقُلْتُ: يَا رسُولَ اللَّه، أكَرَاهِيَةُ الموْتِ؟ فَكُلُّنَا نَكْرَهُ الموْتَ، قَالَ:"لَيْس كَذَلِكَ، وَلَكِنَّ المُؤمِنَ إذَا بُشِّر بِرَحْمَةِ اللَّه وَرِضْوانِهِ وَجنَّتِهِ أحَبَّ لِقَاءَ اللَّه، فَأَحَبَّ اللَّه لِقَاءَهُ وإنَّ الْكَافِرَ إذَا بُشِّرَ بعَذابِ اللَّه وَسَخَطِهِ، كَرِهَ لِقَاءَ اللَّه، وَكَرِهَ اللَّه لِقَاءَهُ". رواه مسلم.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: ఎవరయితే అల్లాహ్‌ను కలుసు కోవాలని కోరుకుంటాడో అల్లాహ్ అతన్ని కలుసు కోవాలని కోరుకుంటాడు. ఎవడైతే అల్లాహ్‌ను కలుసుకోవటాన్ని ఇష్టపడడో అల్లాహ్ అతన్ని కలుసుకోవటాన్ని ఇష్టపడడు.
(హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) చెబుతున్నారు): ఆ మాట విని నేను, "దైవప్రవక్తా! ఇష్టపడకపోవటమంటే మరణాన్ని ఇష్టపడకపోవటమా? అలాగయితే మాలో అందరూ మరణాన్ని అసహ్యించుకునేవాళ్ళే" అని అన్నాను. అందుకాయన ఇలా చెప్పారు: "దానర్ధం అదికాదు. (మరణ సమయంలో) విశ్వాసికి దేవుని కారుణ్యం, ఆయన ప్రసన్నత మరియు స్వర్గ శుభవార్తలు అందజేసినప్పుడు అతను అల్లాహ్‌ను కలుసుకోవటానికి ఉవ్విళ్లూరతాడు. అల్లాహ్ కూడా అతన్ని కలుసుకోవటానికి ఇష్టపడ్తాడు. దీనికి భిన్నంగా అవిశ్వాసికి (మరణ సమయంలో) దైవశిక్ష, దైవ అప్రసన్నతల 'శుభవార్తలు' అంద జేసినప్పుడు అతను అల్లాహ్‌ను కలుసుకోవటానికి అయిష్టపడతాడు. అల్లాహ్ కూడా అతన్ని కలుసు కోవటాన్ని అసహ్యించుకుంటాడు." (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)
English
`Aishah (radiyallahu anha) reported: The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) said, “He who loves to meet Allah, Allah loves to meet him; and he who dislikes to meet Allah, Allah abhors to meet him.” I (`Aishah) said: “O Messenger of Allah! So far as the feelings of aversion against death is concerned, we all have this feeling.” Thereupon he said, “I do not mean that. What I meant is that when a (true) believer is given the glad tidings of the Mercy of Allah, His Pleasures and His Jannah (at the time of death), he loves to meet Allah, and Allah also loves to meet him. When a disbeliever is given the news of the Torment of Allah and His Wrath (at the time of death), he dislikes to meet Allah and Allah also abhors to meet him.”[Muslim].
ముఖ్యాంశాలు
మరణ సమయంలో విశ్వాసికి స్వర్గశుభవార్త ఇవ్వబడుతుంది. అవిశ్వాసికి దైవశిక్ష పడుతుందని హెచ్చరికలు అందుతాయి. ఆ సమయంలో విశ్వాసికి అల్లాహ్‌ను కలవాలని విపరీతమైన కోరిక కలుగుతుంది. అవిశ్వాసికి మరణం తర్వాత శాశ్వత వినాశనం కనిపిస్తుంది. కనుక అతని హృదయంలో పశ్చాత్తాపం మొదలవుతుంది. తనకు అసలు మరణమే రాకుండా ఉంటే బాగుండేదని అతను వాపోతాడు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1850
హదీసు 1851
وَعَنْ أُمِّ المُؤْمِنِينَ صَفِيَّةَ بنْتِ حُيَيٍّ رَضِيَ اللَّه عَنْهَا قَالَتْ: كَانَ النَّبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم مُعْتَكِفاً، فَأَتَيْتُهُ أزُورُهُ لَيْلاً. فَحَدَّثْتُهُ ثُمَّ قُمْتُ لأنْقَلِب، فَقَامَ مَعِي لِيَقْلِبَني، فَمَرَّ رَجُلانً مِنَ الأنْصارِ رضيَ اللَّه عَنْهُما، فَلمَّا رَأيَا النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أسْرعَا. فَقَالَ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "عَلَى رِسْلُكُمَا إنَّهَا صَفِيَّةُ بنتُ حُيَيٍّ"فَقالاَ: سُبْحَانَ اللَّه يَارسُولَ اللَّه، فَقَالَ:"إنَّ الشَّيْطَانَ يَجْرِي مِنْ ابْنِ آدَمَ مَجْرَى الدَّمِ، وَإنِّي خَشِيتُ أنْ يَقذِفَ فِي قُلُوبِكُمَا شَرا أوْ قَالَ: شَيْئاً" متفقٌ عليه.
విశ్వాసుల మాతృమూర్తి సఫియా బిన్తె హుయ్యి (రదియల్లాహు అన్హా) కథనం: (ఒకసారి) దైవప్రవక్త ﷺ మస్జిద్లో ఏతెకాఫ్ పాటిస్తున్నప్పుడు నేను ఒకరోజు రాత్రి ఆయన్ని కలవటానికి వెళ్ళాను. కాసేపు ఆయనతో మాట్లాడిన తర్వాత వెళ్ళిపోదామని లేచి నించున్నాను. నన్ను ఇంటిదాకా వదలిపెట్టి రావటానికి ఆయన కూడా లేచారు. అంతలో ఇద్దరు అన్సార్ వ్యక్తులు అటుగా వచ్చారు. వారు దైవప్రవక్త ﷺను చూసి త్వరత్వరగా వెళ్ళిపోసాగారు. దైవప్రవక్త ﷺ వారితో,"కాస్త ఆగండి, ఈమె (నా భార్య) సఫియా బిన్తె హుయ్యి" అని చెప్పారు. దానికి వారిద్దరూ (ఆశ్చర్యపోతూ) "సుబ్హానల్లాహ్! దైవప్రవక్తా! (మేము మిమ్మల్ని అనుమానించగలమా?)" అని అన్నారు. అందుకు దైవప్రవక్త ﷺ "మనిషి శరీరంలో రక్తం ఎలా ప్రవహిస్తూ ఉంటుందో షైతాన్ అలా తిరుగుతుంటాడు. వాడు మీ మనస్సుల్లో లేనిపోని అనుమానమేదైనా కలిగిస్తాడేమోనని భయపడ్డాను" అన్నారు. లేక "అలాంటి అనుమానాలు కలిగించకూడదని అలా అన్నాను" అని అనివుంటారు.
(బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని ఏతెకాఫ్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని సలాం ప్రకరణం)
English
Safiyyah bint Huyai (radiyallahu anhu), the Mother of the Believers, said: I came to visit the Prophet (sallallaahu alayhi wa sallam) while he was in the state of I`tikaf [(seclusion) in the mosque during the last ten days of Ramadan]. After having talked to him, I got up to return. The Prophet (sallallaahu alayhi wa sallam) also got up with me and accompanied me a part of the way. At that moment two Ansari man passed by. When they saw him they quickened their pace. The Prophet (sallallaahu alayhi wa sallam) said to them, “Do not hurry. She is Safiyyah, daughter of Huyai, my wife.” They said: “Subhan Allah (Allah is free from imperfection)! O Messenger of Allah! (You are far away from any suspicion).” The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) said, “Satan circulates in a person like blood (in the blood streams). I apprehended lest Satan should drop some evil thoughts in your minds.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
దైవప్రవక్త ﷺ వ్యక్తిత్వం గురించి కొంచెమైనా దురనుమానం కలిగివుండటం విశ్వాసానికే ముప్పు. కనుక దైవప్రవక్త ﷺ ముందుజాగ్రత్తగా ఆ ఇద్దరు సహచరుల్ని ఆపి, వారిలో షైతాన్ ఎలాంటి దురనుమానాలూ రేకెత్తించకుండా తన వెంటనున్నది తనభార్య సఫియా (రదియల్లాహు అన్హా)యేనని చెప్పారు. దీని ద్వారా బోధపడేదేమిటంటే ఎక్కడైనా అనవసరంగా దురనుమానాలు రేకెత్తే ప్రమాదముంటే వెంటనే అక్కడి పరిస్థితులను గురించి ప్రజలకు వివరించాలి. ముఖ్యంగా పండితులు (ఉలమాలు) ఇలాంటి దురనుమానాలకు తావిచ్చే ప్రదేశాలకు, పరిస్థితులకు దూరంగా ఉండాలి. లేకపోతే ప్రజల్లో వారి గురించి దురనుమానాలు చెలరేగవచ్చు. అలాగే ప్రజలు కూడా అనవసరంగా ఎవరి గురించీ దురనుమానాలు పెట్టుకోరాదు. ఎందుకంటే ఇలాంటి దురనుమానాలను హదీసులో అతిపెద్ద అబద్ధంగా పేర్కొనటం జరిగింది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1851
హదీసు 1852
وَعَنْ أَبي الفَضْل العبَّاسِ بنِ عَبْدِ المُطَّلِب رضي اللَّه عَنْهُ قَالَ: شَهِدْتُ مَعَ رسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَوْمَ حُنَين فَلَزمْتُ أنَا وَأبُو سُفْيَانَ بنُ الحارِثِ بنِ عَبْدِ المُطَّلِبِ رَسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فلَمْ نفَارِقْهُ، ورَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم علَى بغْلَةٍ لَهُ بَيْضَاءَ. فَلَمَّا الْتَقَى المُسْلِمُونَ وَالمُشْركُونَ وَلَّى المُسْلِمُونَ مُدْبِرِينَ، فَطَفِقَ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، يَرْكُضُ بَغْلَتَهُ قِبل الْكُفَّارِ، وأنَا آخِذٌ بِلِجَامِ بَغْلَةِ رَسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أَكُفُّهَا إرادَةَ أنْ لاَ تُسْرِعَ، وأبُو سُفْيانَ آخِذٌ بِركَابِ رَسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم. فَقَالَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "أيْ عبَّاسُ نادِ أصْحَابَ السَّمُرةِ" قَالَ العبَّاسُ، وَكَانَ رَجُلاً صَيِّتاً: فَقُلْتُ بِأعْلَى صَوْتِي: أيْن أصْحابُ السَّمُرَةِ، فَو اللَّه لَكَأنَّ عَطْفَتَهُمْ حِينَ سَمِعُوا صَوْتِي عَطْفَةَ الْبقَرِ عَلَى أوْلادِهَا، فَقَالُوا: يالَبَّيْكَ يَالَبَّيْكَ، فَاقْتَتَلُوا هُمْ والْكُفَارُ، والدَّعْوةُ في الأنْصَارِ يقُولُونَ: يَا مَعْشَرَ الأنْصارِ، يَا مَعْشَر الأنْصَار، ثُمَّ قَصُرَتِ الدَّعْوةُ عَلَى بنِي الْحَارِثِ بْنِ الْخزْرَج. فَنَظَرَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وَهُوَ علَى بَغْلَتِهِ كَالمُتَطَاوِل علَيْهَا إلَى قِتَالِهمْ فَقَال:"هَذَا حِينَ حَمِيَ الْوَطِيسُ"ثُمَّ أخَذَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم حصياتٍ، فَرَمَى بِهِنَّ وَجُوه الْكُفَّارِ، ثُمَّ قَال:"انْهَزَمُوا وَرَبِّ مُحَمَّدٍ" فَذَهَبْتُ أنْظُرُ فَإذَا الْقِتَالُ عَلَى هَيْئَتِهِ فِيما أرَى، فَواللَّه مَا هُو إلاَّ أنْ رمَاهُمْ بِحَصَيَاتِهِ، فَمَازِلْتُ أرَى حدَّهُمْ كَليلاً، وأمْرَهُمْ مُدْبِراً. رواه مسلم. "الوَطِيسُ"التَّنُّورُ. ومَعْنَاهُ: اشْتَدَّتِ الْحرْبُ. وَقَوْلُهُ:"حدَّهُمْ"هُوَ بِالحاءَِ المُهْمَلَةِ أيْ: بأسَهُمْ.
హజ్రత్ అబుల్ ఫజ్ల్ అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ (రదియల్లాహు అన్హు) కథనం: హునైన్ యుద్ధం జరిగిన రోజున నేను దైవప్రవక్త ﷺ వెంట ఉన్నాను. అబూసుఫ్యాన్ బిన్ హారిస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ మరియు నేను ఇద్దరం దైవప్రవక్త ﷺ వెంటే ఉన్నాం. ఆయన్ని విడిచిపెట్టి ఎక్కడికీ వెళ్ళలేదు. దైవప్రవక్త ﷺ తన తెల్లటి కంచరగాడిదపై ఎక్కి కూర్చున్నారు. ముస్లింలు మరియు బహు దైవారాధకులు పరస్పరం తలపడినప్పుడు (మొదట) ముస్లింలు వెన్నుచూపి వెళ్ళారు. అప్పుడు దైవప్రవక్త ﷺ స్వయంగా అవిశ్వాసుల వైపు వెళ్ళటానికి తన కంచరగాడిదను కాలితో ఇదిలించసాగారు. నేను దైవప్రవక్త ﷺ ఎక్కివున్న గాడిద కళ్ళెం పట్టుకొని అది వేగంగా వెళ్ళకుండా ఆపటానికి ప్రయత్నిస్తున్నాను. అబూ సుఫ్యాన్ దైవప్రవక్త రికాబు పట్టుకొని ఉన్నారు. అప్పుడు దైవప్రవక్త ﷺ నన్ను పిలిచి, "అబ్బాస్! చెట్టు క్రింద రిజ్వాన్ ప్రమాణంలో పాల్గొన్న వారిని కేక వేయండి" అన్నారు.
అబ్బాస్ (రదియల్లాహు అన్హు) గొంతు పెద్దగా ఉంటుంది. ఆయన ఇలా చెబుతున్నారు: నేను నా బిగ్గర కంఠంతో, "చెట్టు క్రింద (ప్రమాణం చేసిన)వారు ఎక్కడున్నారు?" అని అరిచాను. అల్లాహ్ సాక్షి! వారు నా గొంతు వినగానే ఆవు తన దూడల అరుపు విని వాటివైపు చూసినట్టు అత్యంత వేగంగా నావైపు దృష్టి సారించి, "ఇక్కడున్నాం, సెలవీయండి" అని అన్నారు. తర్వాత వారికి-అవిశ్వాసులకు మధ్య ఘోరంగా యుద్ధం జరిగింది. అప్పుడు అన్సార్లలో, "ఓ అన్సారుల్లారా! ఓ అన్సారుల్లారా!" అనే నినాదాలు (మిన్నుముట్టాయి.) తర్వాత ఆ అరుపులు కేవలం బనూ హారిస్ బిన్ ఖజ్రజ్ వరకే పరిమితమయ్యాయి.
అప్పటి వరకూ కంచెర గాడిదపైనే కూర్చొని వున్న ఆయన ﷺ, కదనరంగంవైపు తదేకంగా తిలకించారు. ఆయన ﷺకు ఆ సమయంలో తదేకంగా తిలకించటం తప్ప వేరొక ధ్యాస లేదన్నట్టు ఉంది. 'యుద్ధం తీవ్రరూపం దాల్చే తరుణం ఇదే' అని ఆయన ﷺ అన్నారు. తరువాత దైవప్రవక్త ﷺ కొన్ని కంకరరాళ్లను పట్టుకుని అవిశ్వాసుల ముఖాలపై విసిరేస్తూ, "ముహమ్మద్ ﷺ ప్రభువు సాక్షిగా! వారు (అంటే అవిశ్వాసులు) ఓడిపోయారు" అని అన్నారు. ఆ దృశ్యాన్ని నేను కూడా శ్రద్ధగా చూడసాగాను. యుద్ధం బాగా ఊపందుకుంది. దైవసాక్షి! ఆయన ﷺ కంకరరాళ్లను రువ్విన క్షణం నుంచీ వారి శక్తి క్షీణించసాగింది. వారు వెన్ను చూపి పారిపోయేదాకా వచ్చారు. (ముస్లిం)
'వతీసు' అంటే పొయ్యి అని అసలు అర్థం. 'హమియల్ వతీసు' అంటే యుద్ధం తీవ్ర రూపం దాల్చింది అని భావం. 'హద్దహుమ్' అంటే వారి శక్తి, యుద్ధ సామర్థ్యాలు.
(సహీహ్ ముస్లింలోని మగాజీ ప్రకరణం)
English
Al-`Abbas bin `Abdul-Muttalib (radiyallahu anhu) said: I was in the company of the Messenger of Allah (sallallaahu alayhi wa sallam) on the day of (the battle of) Hunain. Abu Sufyan bin Al-Harith and I did not leave the Messenger of Allah (sallallaahu alayhi wa sallam) throughout the battle. The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) was riding on his white mule. When the Muslims had an encounter with the pagans, Muslims took to their heels. The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) began to urge his mule towards the disbelievers, holding the bridle of his mule. I was trying to restrain it from going very fast, and Abu Sufyan was holding the stirrup of the mule of the Messenger of Allah (sallallaahu alayhi wa sallam). The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) said, “O Abbas! Call out the People of As-Samurah [i.e., those people who had made the covenant under the tree (i.e., Bai`ah Ridwan)].” `Abbas called out at the top of his voice: “Where are the People of As-Samurah.” `Abbas said: As soon as they heard my voice, they rushed towards the Prophet (sallallaahu alayhi wa sallam) like a cow turning towards her calf. They were shouting: “Here we are.” Soon they began to fight the infidels. Then there was a call for Ansar. Those who called out to them shouted: “O you the people of Ansar! O you the people of Ansar!” They ended their call at Banu Al-Harith bin Al-Khazraj. The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) who was riding on his mule looked at their fight with his neck stretched forward and he said, “This is the time when the fight is raging hot.” Then the Messenger of Allah (sallallaahu alayhi wa sallam) took pebbles and threw them in the face of the disbelievers. He said, “By the Rubb of Muhammad, the disbelievers will be defeated.” I continued to watch until I found that their force was subdued and they began to retreat.[Muslim].
ముఖ్యాంశాలు
1) ఇందులో దైవప్రవక్త ﷺ గారి నిరుపమాన ధైర్య సాహసాలు నిరూపించబడ్డాయి. ఆయన సహచరుల్లో చాలామంది శత్రువులతో పోరాడలేక ఛిన్నాభిన్నమై పోయినప్పుడు ఆయన స్వయంగా ఒంటరిగా శత్రుసైన్యాల వైపు ముందుకు సాగారు. ఆ సమయంలో ఆయనలో కించిత్తు భయాందోళనలైనా కనిపించలేదు. చివరికి దైవప్రవక్త ﷺ గారి గుండె ధైర్యమే ఆయన సహచరుల్ని యుద్ధరంగంలోకి తిరిగొచ్చేలా చేసింది.
2) అనుచరులు కూడా యుద్ధరంగం వదిలి చాలా దూరం వెళ్ళలేదు. ఊహించని రీతిలో ముస్లింల మీద అవిశ్వాసులు హఠాత్తుగా బాణాల వర్షం కురిపించటంతో తాత్కాలికంగా వారు ఛిన్నాభిన్నమైపోయారు. పిదప అబ్బాస్ (రదియల్లాహు అన్హు) పిలుపు విని వెంటనే తిరిగొచ్చేశారు. ఒకవేళ వారు యుద్ధమైదానాన్ని వదలి దూరంగా పారిపోయి ఉంటే అబ్బాస్ (రదియల్లాహు అన్హు) గారి ఒక్క పిలుపుకే హాజరుపలక గలిగేవారే కాదు.
3) ఈ హదీసులో దైవప్రవక్త ﷺగారి ఒక మహిమ కూడా నిరూపించబడింది. ఆయన కొన్ని కంకర్రాళ్లు అవిశ్వాసుల మీద విసరటమే వారి ఓటమికి కారణమయింది.
4) ఈ హదీసులో ముస్లింలకు బోధించ బడిందేమిటంటే- యుద్ధరంగంలో విశ్వాస పరిపక్వత, దైవసహాయాలే అసలు శక్తి. ఇవి తప్ప మిగతా వనరుల విస్తృతి, సంఖ్యాబలం అన్నీ కూడా ద్వితీయ శ్రేణిలోకి వస్తాయి. కనుక వీటినే నమ్ముకొని కూర్చోరాదు. లేకపోతే అత్యధిక సంఖ్యాబలం ఉన్నప్పటికీ ఓటమిని చవిచూడవలసి వస్తుంది. హునైన్ యుద్ధం ప్రారంభంలో అలాగే జరిగింది. కనుక అసలు నమ్మకం అల్లాహ్ మీద, ఆయన చేసే ప్రత్యేక సహాయం మీద ఉండాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1852
హదీసు 1853
وعَنْ أبي هُريْرَةَ رضي اللَّه عنْهُ قَالَ: قَالَ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:" أيُّهَا النَّاسُ إنَّ اللَّه طيِّبٌ لاَ يقْبلُ إلاَّ طيِّباً، وَإنَّ اللَّه أمَر المُؤمِنِينَ بِمَا أمَر بِهِ المُرْسلِينَ، فَقَال تَعَالى: {يَا أيُّها الرُّسْلُ كُلُوا مِنَ الطَّيِّباتِ وَاعْمَلُوا صَالحاً} [المؤمنون: ٥١] وَقَال تَعالَى: {يَا أَيُّهَا الَّذِينَ آمنُوا كُلُوا مِنَ طَيِّبَات مَا رزَقْنَاكُمْ} [البقرة: ١٧٢] ثُمَّ ذَكَرَ الرَّجُلَ يُطِيلُ السَّفَر أشْعَثَ أغْبر يمُدُّ يدَيْهِ إلَى السَّمَاءِ: يَاربِّ يَارَبِّ، وَمَطْعَمُهُ حَرامٌ، ومَشْرَبُه حرَامٌ، ومَلْبسُهُ حرامٌ، وغُذِيَ بِالْحَرامِ، فَأَنَّى يُسْتَجابُ لِذَلِكَ،؟ "رواه مسلم.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺఇలా ప్రబోధించారు: ప్రజలారా! అల్లాహ్ పవిత్రుడు. ఆయన పవిత్ర వస్తువులను మాత్రమే స్వీకరిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రవక్తలకు ఏదయితే ఆదేశించాడో విశ్వాసులకు కూడా అదే ఆదేశించాడు. ఆయన ఇలా సెలవిచ్చాడు: "ప్రవక్తలారా! పవిత్రమైన (అంటే ధర్మసమ్మతమైన) వస్తువులు తినండి. సదాచరణ చేయండి." మరోచోట ఆయన ఇలా సెలవిచ్చాడు: "విశ్వసించిన ఓ ప్రజలారా! మేము మీకు ప్రసాదించిన పవిత్రమైన వస్తువుల్లో నుంచి తినండి."
తర్వాత దైవప్రవక్త ﷺ మనిషి గురించి చెబుతూ ఇలా అన్నారు: అతను ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వస్తాడు. అతని దేహం మాసిపోయి ఉంటుంది. దుమ్ముధూళి పేరుకుపోయి ఉంటుంది. అతను ఆకాశం వైపు చేతులెత్తి, "ఓ ప్రభూ! ఓ ప్రభూ!" అని ప్రార్థిస్తాడు. మరి చూడబోతే అతని తిండి అధర్మమైనదై ఉంటుంది. అతను త్రాగేది అధర్మమైనదై ఉంటుంది. అతను తొడుక్కున్న బట్టలు అధర్మమైనవై ఉంటాయి. అతను హరామ్ తిండి తిని బ్రతుకుతున్నప్పుడు అతని ప్రార్థన ఎలా స్వీకరించబడుతుంది?"
(ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) said: The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) said, “O people! Allah is Pure and, therefore, accepts only that which is pure. Allah has commanded the believers as He has commanded His Messengers by saying: `O Messengers! Eat of the good things, and do good deeds.‘ (23:51) And He said: `O you who believe (in the Oneness of Allah – Islamic Monotheism)! Eat of the lawful things that We have provided you…”’ (2:172). Then he (sallallaahu alayhi wa sallam) made a mention of the person who travels for a long period of time, his hair are dishevelled and covered with dust. He lifts his hand towards the sky and thus makes the supplication: `My Rubb! My Rubb!’ But his food is unlawful, his drink is unlawful, his clothes are unlawful and his nourishment is unlawful, how can, then his supplication be accepted?”[Muslim].
ముఖ్యాంశాలు
ప్రార్థన స్వీకరించబడటానికి ధర్మసమ్మతమైన ఉపాధి చాలా అవసరం. అదే విధంగా ధర్మసమ్మతమైన మార్గాల గుండా ఆర్జించిన ధనం నుంచి చేసిన దానధర్మాలను మాత్రమే అల్లాహ్ స్వీకరిస్తాడు. అంతేకాదు, ప్రతి మంచిపని చేసేముందు ధర్మసమ్మతమైన ఉపాధిని దృష్టిలో పెట్టుకోవటం అవసరం. లేకపోతే ఆ సదాచరణ కూడా వృధా అయిపోతుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1853
హదీసు 1854
وَعنْهُ رضي اللَّه عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "ثَلاثَةٌ لاَ يُكَلِّمُهُمْ اللَّه يوْمَ الْقِيَامةِ، وَلاَ يُزَكِّيهِمْ، وَلا ينْظُرُ إلَيْهِمْ، ولَهُمْ عذَابٌ أليمٌ: شَيْخٌ زَانٍ، ومَلِكٌ كَذَّابٌ، وَعَائِل مُسْتَكْبِرٌ" رواهُ مسلم."الْعَائِلُ": الْفَقِيرُ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన వేరొక కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: ముగ్గురు వ్యక్తులున్నారు. ప్రళయ దినాన అల్లాహ్ వారిని పలకరించడు. వారిని (పాపాల నుంచి) పరిశుద్ధం చేయడు. ఆఖరికి వారివైపు (కారుణ్య దృష్టితో) కూడా చూడడు. పైగా వారికోసం అత్యంత బాధాకరమైన శిక్ష కాచుకొని ఉంటుంది. ఆ ముగ్గురిలో ఒకడు: ముసలి వ్యభిచారి; రెండోవాడు: అబద్ధాలు చెప్పే రాజు; మూడోవాడు: గర్విష్టి అయిన నిరుపేద.
(ముస్లిం)
'ఆయిలున్' అంటే నిరుపేద అని అర్థం.
(సహీహ్ ముస్లింలోని విశ్వాసాల ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) said: The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) said, “There are three (types of) people whom Allah will neither speak to on the Day of Resurrection nor will He purify them (i.e., from their sins), nor will look upon them; and they will have a painful chastisement. These are: An old man who commits fornication; a king who is a great liar and a poor man who is proud.”[Muslim]
ముఖ్యాంశాలు
ఒక పాపం నుంచి సులభంగా బయటపడే అవకాశాలు ఉన్నప్పటికీ ఎవడైనా ఆ పాపం నుంచి బయట పడలేకపోతున్నాడంటే అతను ఘోరాతిఘోర పాపాత్ముడై ఉండాలి!
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1854
హదీసు 1855
وَعَنْهُ رضي اللَّه عنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "سيْحَانُ وجَيْحَانُ وَالْفُراتُ والنِّيلُ كُلٌّ مِنْ أنْهَارِ الْجنَّةِ" رواهُ مسلم.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: సైహాన్, జైహాన్, ఫురాత్, నైలు ఇవన్నీ స్వర్గకాలువల్లోనివే. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని స్వర్గ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) said: The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) said, “Saihan (Oxus), Jaihan (Jaxartes), Al-Furat (Euphrates) and An-Nil (Nile) are all from the rivers of Jannah.”[Muslim].
ముఖ్యాంశాలు
కొందరి దృష్టిలో పై హదీసుకు భావం ఏమిటంటే-స్వర్గంలోని కాలువల మాదిరిగా ఈ నాలుగు నదులు కూడా ఎంతో శుభవంతమైనవి. అవి సస్యశ్యామలమైన పరిసరాలను అందిస్తున్నాయి. వాటి పరిసరాల్లోనే ఇస్లాం ధర్మం వ్యాపించింది. మరి కొందరి దృష్టిలో అది పోలిక కాదు. పై హదీసులో వాస్తవమే వివరించబడింది. అయితే ఆ వాస్తవమంతా మనకు బోధపడకపోవచ్చు. సైహాన్, జైహాన్ నదులు కురాసాన్ ప్రాంతంలో ఉన్నాయి. ఫురాత్ నది సిరియాకు-అరబ్బు ద్వీపానికి మధ్య సరిహద్దుగా ఉన్నది. ఇకపోతే నైలునది ఈజిప్ట్ దేశంలో ఉన్నది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1855
హదీసు 1856
وَعَنْهُ قَال: أخَذَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم بِيَدِي فَقَالَ: "خَلَقَ اللَّه التُّرْبَةَ يوْمَ السَّبْتِ، وخَلَقَ فِيهَا الْجِبَالَ يَوْمَ الأحَد، وخَلَقَ الشَّجَرَ يَوْمَ الإثْنَيْنِ، وَخَلَقَ المَكْرُوهَ يَوْمَ الثُّلاثَاءِ، وَخَلَقَ النُّورَ يَوْمَ الأرْبَعَاءِ، وَبَثَّ فِيهَا الدَّوَابَّ يَوْمَ الخَمِيسِ، وخَلَقَ آدَمَ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم بَعْدَ الْعَصْرِ مِنْ يَوم الجُمُعَةِ في آخِرِ الْخَلْقِ فِي آخِرِ سَاعَةٍ مِنَ النَّهَارِ فِيمَا بَيْنَ الْعَصْرِ إِلَى الَّليلِ". رواه مسلم.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు)గారే చేసిన వేరొక కథనం: దైవప్రవక్త ﷺ నా చెయ్యి పట్టుకొని ఇలా చెప్పారు: అల్లాహ్ భూమిని శనివారం రోజు పుట్టించాడు. అందులో పర్వతాలు ఆదివారం నాడు పుట్టించాడు. వృక్షాలు సోమవారం నాడు పుట్టించాడు. అయిష్టకరమైన వస్తువులు మంగళవారం రోజు పుట్టించాడు. కాంతిని బుధవారం రోజు పుట్టించాడు. అందులో జంతువులను గురువారం రోజు పుట్టించాడు. ఈ వస్తువులన్నీ పుట్టించిన తర్వాత చివర్లో శుక్రవారం రోజు అస్ర్ తర్వాత ఆదం (అలైహిస్సలామ్)ను పుట్టించాడు. అది అస్ర్కు-రాత్రికి మధ్య పగటి చివరి ఘడియ.
(ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని ప్రళయ వర్ణన, స్వర్గనరకాల ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) said: The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) took hold of my hand and said, “Allah, the Exalted and Glorious, created the earth on Saturday, the mountains on Sunday, the trees on Monday, the things entailing labour on Tuesday, light on Wednesday, He spread out animals of all kinds on Thursday, and created Adam in the afternoon on Friday, and it was the last hour of Friday between the afternoon and the night.”[Muslim].
ముఖ్యాంశాలు
రోజు అంటే ఏమిటి? అది ఎంత సుదీర్ఘంగా ఉంటుంది? ఈ విషయాల యొక్క వాస్తవికత కేవలం అల్లాహ్‌కు మాత్రమే తెలుసు. మన ప్రపంచపు రోజులోనయితే 24 గంటలు, (ఒక పగలు ఒక రేయి) ఉంటాయి. ఆకాశలోకపు రోజు ఎంతైనా దీనికి భిన్నంగానే ఉంటుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1856
హదీసు 1857
وعنْ أَبي سُلَيْمَانَ خَالِدِ بنِ الْولِيدِ رضي اللَّه عَنْهُ قالَ: "لَقَدِ انْقَطَعَتْ في يَدِي يوْمَ مُؤتَةَ تِسْعَةُ أسْيافٍِ، فَمَا بقِيَ فِي يدِي إِلاَّ صَفِيحةٌ يَمَانِيَّةٌ".رواهُ البُخاري.
హజ్రత్ అబూ సులైమాన్ ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు) కథనం: మౌతా యుద్ధం నాడు నా చేతిలో తొమ్మిది ఖడ్గాలు విరిగిపోయాయి. కేవలం ఓ చిన్న యమనీ ఖడ్గం మాత్రమే నా చేతిలో మిగిలింది.
(బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని మగాజీ ప్రకరణం)
English
Abu Sulaiman Khalid bin Al-Walid (radiyallahu anhu) said: In the battle of Mu’tah, seven swords were broken in my hand, and all that remained with me was a Yemeni sword.[Al-Bukhari].
ముఖ్యాంశాలు
'మౌతా' అనేది సిరియా సమీపంలోని ఓ ప్రాంతం పేరు. ఇక్కడ జరిగిన యుద్ధాన్ని మౌతా యుద్ధంగా పేర్కొంటారు. ఈ హదీసులో దైవప్రవక్త సహచరులైన హజ్రత్ ఖాలిద్(రదియల్లాహు అన్హు)గారి ధైర్యసాహసాల ప్రస్తావన ఉంది. దీనిద్వారా ఆయన గొప్పదనం కూడా నిరూపితమవుతోంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1857
హదీసు 1858
وعَنْ عمْرو بْنِ الْعَاص رضي اللَّه عنْهُ أنَّهُ سَمِع رسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَقُولُ:" إذَا حَكَمَ الْحَاكِمُ، فَاجْتَهَدَ، ثُمَّ أصاب، فَلَهُ أجْرانِ وإنْ حَكَم وَاجْتَهَدَ، فَأَخْطَأَ، فَلَهُ أجْرٌ "متفقٌ عَلَيْهِ.
దైవప్రవక్త ﷺ ఇలా చెబుతుండగా తాను విన్నానని హజ్రత్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు: పరిపాలకుడు బాగా కష్టపడి తీర్పుచేయగా అతని తీర్పు న్యాయంతో కూడుకొని ఉంటే అతనికి రెండింతల పుణ్యం లభిస్తుంది. ఒకవేళ అతను బాగా కష్టపడి తీర్పుచేయగా అతని తీర్పులో పొరపాటు జరిగినప్పటికీ అతనికి ఒకింత పుణ్యం లభిస్తుంది.
(బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని ఏతెసామ్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని అఖ్జియా ప్రకరణం)
English
`Amr bin `Al-`As (radiyallahu anhu) said: I heard the Messenger of Allah (sallallaahu alayhi wa sallam) saying, “When a judge utilizes his skill of judgement and comes to a right decision, he will have a double reward, but when he uses his judgement and commits a mistake, he will have a single reward.”[Al-Bukhari and Muslim]
ముఖ్యాంశాలు
ఏదేని వ్యవహారానికి సంబంధించి స్పష్టమైన షరీఅత్ ఆజ్ఞలు లేనప్పుడు వాటిని పోలిన ఇతర ఆజ్ఞల్ని దృష్టిలో పెట్టుకొని ఆ వ్యవహారపు ధర్మాధర్మాలను బేరీజు వేయటాన్ని 'ఇజ్తిహాద్' అంటారు. ఖుర్ఆన్ హదీసుల గురించి సరైన జ్ఞానం, అవగాహన కలవాడు మాత్రమే ఇజ్తిహాద్ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించగలడని ఆ నిర్వచనమే చెబుతోంది. దీని ద్వారా బోధపడుతున్న మరొక విషయం ఏమిటంటే ముస్లింల పరిపాలకుడు, న్యాయమూర్తి, అధికారి అవసరమైనప్పుడు ఇజ్తిహాద్ చేయగలగటానికి ఖుర్ఆన్ హదీసుల పండితుడై ఉంటే మంచిది. ఆ ఇజ్తిహాద్లో అతను చిత్తశుద్ధితో గనక నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయం తప్పైనా, ఒప్పైనా అతనికి మాత్రం పుణ్యం లభిస్తుంది. సరైన నిర్ణయం తీసుకున్న పక్షంలో రెండింతల పుణ్యం లభిస్తుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1858
హదీసు 1859
وَعَنْ عائِشَةَ رضي اللًَّه عَنْهَا أنَّ النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "الْحُمَّى مِنْ فيْحِ جَهَنَّم فأبْرِدُوهَا بِالماَءِ" متفقٌ عليه.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: "జ్వరం నరకతాపం తీవ్రత వల్ల వస్తుంది. కనుక దాన్ని నీళ్ళతో చల్లబరచండి."
(బుఖారీ, ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని సృష్టి ఆరంభ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని సలాం ప్రకరణం)
English
`Aishah (radiyallahu anha) said: The Prophet (sallallaahu alayhi wa sallam) said, “Fever comes from the vehement raging of Hell, so cool it with water.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
హదీసులో సూచించిన చికిత్సా విధానం సరైనది. చాలా రకాల జ్వరాలకు డాక్టర్లు ఇదే చికిత్సను సూచిస్తారు. రోగి శరీరాన్ని నీళ్ళతో బాగా కడగమని లేక శరీరాన్ని తడిగుడ్డతో తుడవమని చెబుతారు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1859
హదీసు 1860
وَعَنْهَا رَضِيَ اللَّه عَنْهَا عَنِ النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَنْ مَاتَ وَعَلَيْهِ صَوْمٌ، صَامَ عَنْهُ وَلِيُّهُ "متفقٌ عَلَيْهِ. وَالمُخْتَارُ جَوَازُ الصَّوْمِ عَمَّنْ مَاتَ وَعَلَيْهِ صَوْمٌ لِهَذَا الْحَدِيثِ، والمُرَادُ بالْوَليِّ: الْقَرِيبُ وَارِثاً كَانَ أوْ غَيْرِ وَارِثٍ.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) గారే చేసిన వేరొక కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: చనిపోయిన వ్యక్తి (మొక్కుబడి చేసుకున్న) ఉపవాసాలు పాటించవలసి ఉంటే అతని తరపున అతని సమీప బంధువు ఆ ఉపవాసాలు పాటించాలి.
(బుఖారీ-ముస్లిం)
ఈ హదీసు దృష్ట్యా చనిపోయిన వ్యక్తి ఉపవాసాలు పాటించవలసి ఉంటే అతని తరపున ఇతరులు పాటించవచ్చన్నది ఆమోదయోగ్యమైన విషయం. వలీ అంటే ఇక్కడ సమీప బంధువు అని అర్థం. అతను వారసుడైనా, కాకపోయినా;
(సహీహ్ బుఖారీలోని ఉపవాస ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం)
English
`Aishah (radiyallahu anha) said: The Prophet (sallallaahu alayhi wa sallam) said, “If a person dies without observing Saum (fasts), his Wali should make it up on his behalf.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ఈ హదీసులో ఉపవాసాలంటే మొక్కుబడి ఉపవాసాలు మాత్రమేనని, రమజాన్ ఉపవాసాలు కావని షేఖ్ అల్బాని (రహిమహుల్లాహ్) చెప్పారు. అంటే అల్బానీగారు ఆయిషా (రదియల్లాహు అన్హా) గారి హదీసులోని సార్వత్రిక ఆదేశాన్ని ఇబ్నె అబ్బాస్ గారి వేరొక హదీసుతో ప్రత్యేకిస్తున్నారన్న మాట! ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా)గారి హదీసులో మొక్కుబడి ఉపవాసాలు అని స్పష్టంగా ఉంది.
ఇలా చేయటానికి కారణమేమిటంటే శారీరక ఆరాధనల్లో ప్రాతినిధ్యం ధర్మసమ్మతం కాదు. బతికివున్నప్పుడు ఒకరి శారీరక ఆరాధనలు మరొకరు చేయటం ధర్మసమ్మతం కానట్లే మరణం తర్వాత కూడా అలా చేయటం ధర్మసమ్మతం కాదు. అయితే దేనిగురించయితే షరీఅత్లో స్పష్టమైన ఆదేశాలుంటాయో అంతవరకు మాత్రం అనుమతి ఉంటుంది. ఆ ఆదేశాలను కూడా షరీఅత్లో వివరించబడినంత వరకు మాత్రమే పరిమితంగా ఉంచాలి. ఉదా: ఉపవాసం అనేది శారీరక ఆరాధన. కనుక ఒకరి ఉపవాసాలు మరొకరు పాటించటానికి వీల్లేదు. అయితే మొక్కుబడికి సంబంధించిన ఉపవాసాల గురించి మాత్రం షరీఅత్లో స్పష్టమైన ఆదేశం ఉంది. మరణించిన వ్యక్తి మొక్కుబడి ఉపవాసాలు పాటించవలసి ఉంటే అతని తరపున అతని సమీప బంధువు పాటించవచ్చని చెప్పబడింది. అది తప్ప మరే శారీరక ఆరాధనకూ ఆ అనుమతి లేదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1860
హదీసు 1861
وَعَنْ عَوْفِ بنِ مَالِكِ بنِ الطُّفَيْلِ أنَّ عَائِشَةَ رَضِيَ اللَّه عَنْهَا حُدِّثَتْ أنَّ عَبْدَ اللَّه بنَ الزَّبَيْر رضي اللَّه عَنْهُمَا قَالَ في بيْعٍ أوْ عَطَاءٍ أعْطَتْهُ عَائِشَةُ رَضِيَ اللَّه تَعالَى عَنْها: وَاللَّه لَتَنْتَهِيَنَّ عَائِشَةُ، أوْ لأحْجُرَنَّ علَيْهَا، قَالتْ: أهُوَ قَالَ هَذَا؟ قَالُوا: نَعمْ، قَالَتْ: هُو، للَّهِ علَيَ نَذْرٌ أنْ لا أُكَلِّم ابْنَ الزُّبيْرِ أبَداً، فَاسْتَشْفَع ابْنُ الزُّبيْرِ إِلَيْهَا حِينَ طالَتِ الْهجْرَةُ. فَقَالَتْ: لاَ وَاللَّهِ لاَ أُشَفَّعُ فِيهِ أبَداً، وَلاَ أتَحَنَّثُ إلَى نَذْري. فلَمَّا طَال ذَلِكَ علَى ابْنِ الزُّبيْرِ كَلَّم المِسْورَ بنَ مخْرَمَةَ، وعبْدَ الرَّحْمنِ بْنَ الأسْوَدِ بنِ عبْدِ يغُوثَ وقَال لهُما: أنْشُدُكُما اللَّه لمَا أدْخَلْتُمَاني علَى عائِشَةَ رَضِيَ اللَّه عَنْهَا، فَإنَّهَا لاَ يَحِلُّ لَهَا أنْ تَنْذِر قَطِيعَتي، فَأَقْبَل بهِ المِسْورُ، وعَبْدُ الرًَّحْمن حَتَّى اسْتَأذَنَا علَى عائِشَةَ، فَقَالاَ: السَّلاَمُ علَيْكِ ورَحمةُ اللَّه وبرَكَاتُهُ، أَنَدْخُلُ؟ قَالَتْ عَائِشَةُ: ادْخُلُوا. قَالُوا: كُلُّنَا؟ قَالَتْ: نَعمْ ادْخُلُوا كُلُّكُمْ، ولاَ تَعْلَمُ أنَّ معَهُما ابْنَ الزُّبَيْرِ، فَلمَّا دخَلُوا، دخَلَ ابْنُ الزُّبيْرِ الْحِجَابَ، فَاعْتَنَقَ عائِشَةَ رَضِيَ اللَّه عنْهَا، وطَفِقَ يُنَاشِدُهَا ويبْكِي، وَطَفِقَ المِسْورُ، وعبْدُ الرَّحْمنِ يُنَاشِدَانِهَا إلاَّ كَلَّمَتْهُ وقبَلَتْ مِنْهُ، ويقُولانِ: إنَّ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم نَهَى عَمَّا قَدْ علِمْتِ مِنَ الْهِجْرةِ. وَلاَ يَحلُّ لمُسْلِمٍ أنْ يهْجُر أخَاهُ فَوْقًَ ثَلاثِ لَيَالٍ. فَلَمَّا أكْثَرُوا علَى عَائِشَةَ مِنَ التَّذْكِرةِ والتَّحْرِيجِ، طَفِقَتْ تُذَكِّرُهُما وتَبْكِي، وتَقُولُ: إنِّي نَذَرْتُ والنَّذْرُ شَدِيدٌ، فَلَمْ يَزَالا بَهَا حتَّى كَلَّمتِ ابْنِ الزُّبيْرِ، وَأعْتَقَتْ فِي نَذْرِهَا ذَلِكَ أرْبعِينَ رقَبةً، وَكَانَتْ تَذْكُرُ نَذْرَهَا بعْدَ ذَلِكَ فَتَبْكِي حتَّى تَبُلَّ دُمُوعُهَا خِمارَهَا. رواهُ البخاري.
హజ్రత్ ఔఫ్ బిన్ మాలిక్ బిన్ తుఫైల్ (రదియల్లాహు అన్హు) కథనం: హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) గారు చేసే ఏదో వ్యాపారం గురించో లేక ఆవిడ ఇచ్చే ఏదో కానుక గురించో అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ (రదియల్లాహు అన్హుమా)గారు "(నా పిన్నమ్మ) ఆయిషా ఈ విధంగా (చేతికొచ్చినట్టు) ఖర్చుచేయకుండా ఆగిపోవాలి. లేదా నేనైనా ఆమెపై ఆంక్ష విధిస్తాను" అని అన్నారు. ఈ మాట ఆయిషా (రదియల్లాహు అన్హా) వరకూ చేరింది. అది విని ఆవిడ, "అబ్దుల్లాహ్ నిజంగా ఆ మాట అన్నాడా?" అని అడిగారు. "ఔనండీ" అన్నారు (చుట్టుప్రక్కల)జనం. అప్పుడామె, "నేను అల్లాహ్ పేర మొక్కుబడి చేసుకుంటున్నారు. ఇక ఎన్నడూ నేను అబ్దుల్లాహ్ బిన్ జుబైర్‌తో మాట్లాడను" అని ఒట్టేసుకున్నారు. ఈ సంబంధ వియోగం సుదీర్ఘమవటంతో ఇబ్నె జుబైర్ (రదియల్లాహు అన్హుమా) ఆయిషా (రదియల్లాహు అన్హా) దగ్గర సిఫారసు చేయించారు. అందుకామె, "అల్లాహ్ సాక్షి! ఇబ్నె జుబైర్ గురించి నేనెన్నటికీ ఎవరి సిఫారసూ అమోదించను. అతనితో మాట్లాడి నా మొక్కుబడిని భంగంచేసే పాపానికి ఒడిగట్టలేను" అని అన్నారు.
ఈ వ్యవహారం ఇంకా సుదీర్ఘమయిపోతుండటం చూసి ఇబ్నె జుబైర్ (రదియల్లాహు అన్హుమా) ఒకరోజు హజ్రత్ మిస్‌వర్ బిన్ మఖ్రమ మరియు అబ్దుర్రహ్మాన్ బిన్ అస్వద్ బిన్ అబ్దె యగూస్తో మాట్లాడారు. వారితో ఇలా అన్నారు: "నేను మీ ఇద్దరికి దేవుని ప్రమాణం ఇచ్చి మరీ చెబుతున్నాను. మీరిద్దరూ నన్ను (మా చిన్నమ్మ) ఆయిషా దగ్గరికి తీసుకెళ్ళండి. ఆమె నాతో సంబంధాలు తెగత్రెంపులు చేసుకోవటం నాకు ధర్మసమ్మతం కాదు" అన్నారు. మిస్‌వర్ మరియు అబ్దుర్రహ్మాన్ ఇద్దరూ ఇబ్నె జుబైర్‌ను తీసుకొని ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇంటికి వెళ్ళి లోనికి వచ్చేందుకు అనుమతి కోరుతూ, "అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహూ, మేము లోనికి రావచ్చా?" అని అడిగారు. "వచ్చేయండి" అన్నారు ఆయిషా (రదియల్లాహు అన్హా) అనుమతి ఇస్తూ. "మేమందరం రావచ్చా?" అని అడిగారు వారు. "ఆఁ అందరూ రావచ్చు" అన్నారు ఆయిషా (రదియల్లాహు అన్హా). వారిద్దరితో పాటు అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ కూడా ఉన్నారని ఆమెకు తెలియదు. వారు ముగ్గురూ లోనికి వెళ్ళారు. అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ పరదాలోకి వెళ్ళి, తన (పిన్నమ్మ) ఆయిషాను చుట్టేసుకొని (తనతో మాట్లాడమని) ఆమెకు దేవుని మీద ప్రమాణాలు చేసి మరీ చెబుతూ ఏడ్వసాగారు. (పరదా బయట) మిస్‌వర్ మరియు అబ్దుర్రహ్మాన్లు కూడా, ఇబ్నె జుబైర్‌తో మాట్లాడమని, ఆయన సంజాయిషీని ఆమోదించమని ఆమెకు దేవునిమీద ప్రమాణం చేసి మరీ చెప్పసాగారు. ఆమెతో ఇలా అన్నారు: దైవప్రవక్త ﷺ ఇటువంటి సంబంధ తెగత్రెంపుల్ని వారించారు. అది మీకూ తెలుసు. ఒక ముస్లిం తోటి ముస్లిం సోదరునితో మూడురాత్రుల కంటే ఎక్కువకాలం మాట్లాడకుండా సంబంధాలు తెగత్రెంపులు చేసుకొని ఉండటం ధర్మసమ్మతం కాదు.
వారు ఆ విధంగా ఆయిషా (రదియల్లాహు అన్హా) ముందు హితోపదేశం, సంబంధ తెగత్రెంపులు పాపం అనే మాటలు పెంచినప్పుడు ఆమె కూడా హితోపదేశం మొదలుపెట్టారు, ఏడ్వసాగారు: "ఇబ్నె జుబైర్‌తో మాట్లాడనని నేను మొక్కుబడి చేసుకున్నాను. మొక్కుబడి వ్యవహారం చాలా కఠినంగా ఉంటుంది" అని అన్నారు. కాని వారిద్దరు ఆమెను అదేపనిగా బతిమాలసాగారు. చివరికి ఆమె ఇబ్నె జుబైర్ (రదియల్లాహు అన్హుమా)తో మాట్లాడారు. తన మొక్కుబడి భంగం చేసినందుకు ఆమె నలభై (బానిస) మెడలు విడిపించారు. ఆ తర్వాత ఆమె ఎప్పుడు తన మొక్కుబడిని గుర్తు చేసుకున్నా విపరీతంగా ఏడ్చేవారు. కన్నీళ్లతో ఆమె వోణీ తడిసిపోయేది. (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని సంస్కార ప్రకరణం)
English
`Auf bin Malik (radiyallahu anhu) said: `Aishah (radiyallahu anha) as told that `Abdullah bin Az-Zubair (radiyallahu anhuma) had said in respect of selling of a gift which was presented to her: “By Allah! If `Aishah does not stop this kind of thing, I will declare her incompetent to administer her property.” `Aishah (radiyallahu anha) asked: “Did He (`Abdullah bin Az-Zubair) say so?” The people said: “Yes.” `Aishah (radiyallahu anha) said: “I vow it before Allah that I will never speak to Ibn Az-Zubair.” When this desertion lasted long, `Abdullah bin Az-Zubair sought intercession with her, but she said: “By Allah I will not accept the intercession of anyone for him, and I will not commit a sin of breaking my vow.” When this state of affairs was prolonged, Ibn Az-Zubair felt it hard on him. He said to Al-Miswar bin Makhramah and `Abdur-Rahman bin Al-Aswad bin Yaghut: “I beseech you in the Name of Allah that you should take me to `Aishah because it is unlawful for her to vow to sever relations with me.” So Al-Miswar and `Abdur-Rahman took him with them. They sought her permission, saying: “As-salamu `alaika wa rahmatullahi wa barakatuhu! Shall we come in?” `Aishah (radiyallahu anha) said: “Come in,” They asked: “All of us?” She said: “All of you,” not knowing that Ibn Az-Zubair was also with them. So, when they entered, Ibn Az-Zubair entered the screened place and got hold of `Aishah (radiyallahu anha), his aunt. He was requesting her to forgive him and wept. Al-Miswar and `Abdur-Rahman also pleaded on his behalf and requested her to speak to him and to accept his repentance. They said to her: “The Prophet (sallallaahu alayhi wa sallam) forbade to cut off relationship because it is unlawful for any Muslim not to talk to his (Muslim) brother (or sister, for that matter) for more than three (days).” So when they persisted in urging and reminding her of the superiority of having good relation with kith and kin, she began to weep, saying: “I have made a vow which is a matter of very serious nature.” They persisted in their appeal till she spoke with `Abdullah bin Az-Zubair, and she freed forty slaves as an expiation for breaking her vow. Later on, whenever she remembered her vow, she would weep so much that her veil would become wet with tears.[Al-Bukhari].
ముఖ్యాంశాలు
1) హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ (రదియల్లాహు అన్హుమా) హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) గారి అక్క కొడుకు. ఆయిషా (రదియల్లాహు అన్హా) ఆయనతో మాట్లాడనని ఒట్టేసుకున్నారు. తను చేస్తున్న ధర్మసమ్మతమైన పనుల్ని ఇబ్నె జుబైర్ ఆపుతానని హెచ్చరించటంతో ఆయనతో మాట్లాడకుండా ఉండటం తనకు ధర్మసమ్మతమే అవుతుందని భావించారామె. కాని ఆ తర్వాత ఇబ్నె జుబైర్ (రదియల్లాహు అన్హుమా) తన తప్పు తెలుసుకొని తన పిన్నిని ఒప్పించటానికి ఇద్దరు సిఫారసుకర్తల్ని వెంటబెట్టుకొని ఆవిడ ఇంటికి వెళ్ళారు. చివరికి ఆయిషా (రదియల్లాహు అన్హా) తన ఒట్టుని భంగపరచి, ఇబ్నె జుబైర్‌తో మాట్లాడటమే సమంజసమని భావించారు- (రజియల్లాహు అన్హుమ్).
2) ప్రమాణ భంగానికి చెల్లించే కఫ్ఫారాయే మొక్కుబడి భంగానికి కూడా చెల్లించాలి. అంటే ఒక బానిసను విముక్తి చేయటం లేక పదిమంది నిరుపేదలకు అన్నం పెట్టటం లేక వారికి బట్టలు ఏర్పాటు చేయటం. అంత శక్తి, స్తోమత లేనప్పుడు మూడురోజులు ఉపవాసం పాటించినా సరిపోతుంది. కాని ఆయిషా (రదియల్లాహు అన్హా) మాత్రం ఒకటికి నలభైమంది బానిసల్ని విడుదల చేయించారు. (దైవం ఆమె పట్ల ప్రసన్నుడగుగాక)
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1861
హదీసు 1862
وعَنْ عُقْبَةَ بنِ عامِر رضي اللَّه عنْهُ أنَّ رسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم خَرجَ إلَى قَتْلَى أُحُدٍ. فَصلَّى علَيْهِمْ بعْد ثَمان سِنِين كالمودِّع للأحْياءِ والأمْواتِ، ثُمَّ طَلَعَ إِلَى المِنْبر، فَقَالَ: "إنِّي بيْنَ أيْدِيكُمْ فَرَطٌ وأنَا شَهِيدٌ علَيْكُمْ وإنَّ موْعِدَكُمُ الْحوْضُ، وَإنِّي لأنْظُرُ إليه مِنْ مَقامِي هَذَا، وإنِّي لَسْتُ أخْشَى عَلَيْكُمْ أنْ تُشْركُوا، ولَكِنْ أخْشَى عَلَيْكُمْ الدُّنيا أنْ تَنَافَسُوهَا" قَالَ: فَكَانَتْ آخِرَ نَظْرَةٍ نَظَرْتُهَا إلَى رَسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، متفقٌ عليه. وفي روايةٍ:"وَلَكِنِّي أخْشَى علَيْكُمْ الدُّنيَا أنْ تَنَافَسُوا فِيهَا، وتَقْتَتِلُوا فَتَهْلِكُوا كَما هَلَكًَ منْ كَان قَبْلكُمْ" قَالَ عُقبةُ: فَكانَ آخِر مَا رَأيْتُ رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم عَلَى المِنْبرِ. وفي روَايةٍ قَالَ:"إنِّي فَرطٌ لَكُمْ وأنَا شَهِيدٌ علَيْكُمْ، وَإنِّي واللَّه لأنْظُرُ إلَى حَوْضِي الآنَ، وإنِّي أُعْطِيتُ مَفَاتِيحَ خَزَائِن الأرضِ، أوْ مَفَاتِيحَ الأرْضِ، وَإنَّي واللَّهِ مَا أَخَافُ علَيْكُمْ أنْ تُشْرِكُوا بعْدِي ولَكِنْ أخَافُ علَيْكُمْ أنْ تَنَافَسُوا فِيهَا ". وَالمُرادُ بِالصَّلاةِ عَلَى قَتْلَى أُحُدٍ: الدُّعَاءُ لَهُمْ، لاَ الصَّلاةُ المعْرُوفَةُ.
హజ్రత్ ఉఖ్బా బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ ఉహుద్ యుద్ధంలో అమరవీరులైన వారి (సమాధుల) దగ్గరికి వెళ్ళారు. ఎనిమిది యేండ్ల తరువాత వారికోసం దుఆ చేశారు. చనిపోయినవారికి, బ్రతికున్నవారికి అందరికీ వీడ్కోలు చెబుతున్న విధంగా ఆయన ఈ దుఆ చేశారు. తర్వాత వేదికపైకెక్కి ఇలా ప్రబోధించారు: "నేను మీకు ముందుగా వెళ్తున్నవాణ్ణి. నేను మీకు సాక్షిగా ఉంటాను. మీకు వాగ్దానం చేయబడిన చోటు కౌసర్ సరస్సు. నేనిక్కడ నిలబడి కూడా దాన్ని చూడగలుగుతున్నాను. నేను వెళ్ళిన తర్వాత మీరు మళ్ళీ బహు దైవారాధకులు అయిపోతారేమోనన్న భయం ఇప్పుడు నాకు ఏమాత్రం లేదు సుమా! అయితే మీరు ప్రాపంచిక వ్యామోహంలో చిక్కుకుపోతారని మాత్రం నాకు భయముంది."
హదీసు ఉల్లేఖకులు ఇలా అంటున్నారు: నేను దైవప్రవక్త ﷺను చివరిసారిగా అక్కడే చూశాను (అంటే ఆ తర్వాత ఆయన త్వరలోనే ఇహలోకం వీడి వెళ్ళిపోయారు).
(బుఖారీ-ముస్లిం)
వేరొక ఉల్లేఖనంలో దైవప్రవక్త ﷺ ఇలా అన్నారని ఉంది: నేను మీ గురించి ప్రపంచం విషయంలో భయపడుతున్నాను. మీరు దాని వ్యామోహంలో చిక్కుకుంటారేమోనని. (దాని మూలంగా) మీరు పరస్పరం యుద్ధాలు చేసుకొని మీకు పూర్వం నాశనమయిపోయిన వారిలాగే నాశనమయిపోతారు.
ఉఖ్బా (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు: ఇది నేను దైవప్రవక్త ﷺను చూసిన చివరి సందర్భం. అప్పుడాయన వేదిక మీద (నించొని) ఉన్నారు.
ఇంకొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: నేను మీ ముందు నడిచేవాణ్ణి. నేను మీకు సాక్షిగా ఉంటాను. దైవం సాక్షి! నేనిప్పుడు కూడా నా సరస్సును చూస్తున్నాను. భూలోకపు నిధులు (లేక) భూలోకపు తాళం చెవులు నాకు ఇవ్వబడ్డాయి. మీరు నా తదనంతరం మళ్ళీ బహుదైవారాధన చేయటం మొదలెడతారేమోనని నేను భయపడటం లేదు. అయితే మీరు ప్రాపంచిక వ్యామోహంలో దారుణంగా చిక్కుకుపోతారని మాత్రం భయపడుతున్నాను.
'ఉహుద్ అమరవీరుల కోసం సలాత్' అంటే వారికోసం దుఆ చేయటం అని అర్థం. అంతేకాని సామాన్యంగా చేసే (జనాజా) నమాజు అని అర్థం కాదు.
(సహీహ్ బుఖారీలోని జనాయెజ్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఫజాయెల్ ప్రకరణం)
English
`Uqbah bin `Amir (radiyallahu anhu) said: One day the Messenger of Allah (sallallaahu alayhi wa sallam) went out and asked Allah’s forgiveness for the martyrs of the battle of Uhud after eight years. It seemed that by so doing, he bid farewell to the living and the dead. He then came back, rose to the pulpit and said, “I shall be your precursor; I am a witness for you (before Allah), and I will be present before you at the River (Haud Al-Kauthar). By Allah I can see with my own eyes the Haud from this place. I am not afraid that you will associate anything with Allah in worship after (my demise), but I apprehend that you will vie with one another for the life of the world.” The narrator said: It was the last time that I saw the Messenger of Allah (sallallaahu alayhi wa sallam).[Al-Bukhari and Muslim].
There are some more narrations with very minor changes in its wording.
ముఖ్యాంశాలు
1) గ్రంథకర్త ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) 'సలాత్' అనే పదానికి 'ప్రార్థన' అనే అర్థం తీసుకున్నారు. ఇది సరైనది కాదు. ఇతర ఉల్లేఖనాల్లో 'సలాతున్ అలల్ మయ్యితి" అని స్పష్టంగా ఉంది. వాటి ద్వారా దైవప్రవక్త ﷺ చేసింది కేవలం ప్రార్థన కాదు, నమాజ్ చేశారని స్పష్టంగా బోధపడుతోంది.
2) చనిపోయిన, అమరగతులయిన వారి మన్నింపు కోసం, వారి స్థానాలు ఉన్నతం కావటం కోసం ఎల్లప్పుడూ దుఆ చేస్తూ ఉండాలి. అయితే ఆ చనిపోయినవారు విశ్వాసస్థితిలో చనిపోయినవారై ఉండాలి.
3) దైవప్రవక్త ﷺకు ప్రపంచంలోనే మగత స్థితిలో పరలోకానికి సంబంధించిన వాస్తవాలెన్నో తెలుస్తూ ఉండేవి.
4) ఇందులో కౌసర్ సరస్సు ఉనికి కూడా నిరూపించబడింది.
5) దైవప్రవక్త ﷺ తన అనుచర సమాజానికి సారధి లాంటివారు. ఫర్త్ అంటే ఒక జట్టుకు, బృందానికి ముందు నడిచేవాడు. దైవప్రవక్త ﷺ పరలోక సమూహానికి సారధి అన్నమాట.
6) ఈ హదీసులో దైవప్రవక్త ﷺ తన అనుచరులను సంబోధిస్తూ, "మీరు బహుదైవారాధన మొదలెడతారేమోనని నేను భయపడటం లేదు" అని అన్నారు. ఈ మాట ఆయన తొలి కాలానికి చెందిన మనుషులను దృష్టిలో పెట్టుకొని చెప్పారు. లేకపోతే ఇతర హదీసుల్లో చివరికాలంలో ప్రజలు మళ్ళీ విగ్రహాలను పూజించటం మొదలుపెడతారని చెప్పబడింది. కనుక ఈ హదీసును ఆధారంగా చేసుకొని ముహమ్మదీయ అనుచర సమాజం వారు ఎన్నటికీ షిర్కు చేయరని నిర్ణయించటం సరైనది కాదు. లేదా సమాజం మొత్తం షిర్క్ ప్రవాహంలో కొట్టుకుపోదని దీని భావం కావచ్చు.
7) భూలోక నిధుల తాళం చెవులంటే అవిశ్వాసుల రాజ్యాల మీద విజయం సాధించిన తర్వాత ముస్లింలకు లభించిన విజయసొత్తుకు సంబంధించిన శుభవార్తలు. తర్వాతి కాలంలో అలాగే జరిగింది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1862
హదీసు 1863
وعَنْ أَبي زَيْدٍ عمْرُو بنِ أخْطَبَ الأنْصَارِيِّ رضي اللَّه عَنْهُ قَال: صلَّى بِنَا رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم الْفَجْر، وَصعِدَ المِنْبَرَ، فَخَطَبنَا حَتَّى حَضَرَتِ الظُّهْرُ، فَنَزَل فَصَلَّى. ثُمَّ صَعِدَ المِنْبَر حَتَّى حَضَرتِ العصْرُ، ثُمَّ نَزَل فَصَلَّى، ثُمًَّ صعِد المنْبر حتى غَرَبتِ الشَّمْسُ، فَأخْبرنا مَا كان ومَا هُوَ كِائِنٌ، فَأَعْلَمُنَا أحْفَظُنَا. رواهُ مُسْلِمٌ.
హజ్రత్ అబూ జైద్ అమ్ర్ బిన్ అఖ్తబ్ అన్సారీ (రదియల్లాహు అన్హు) కథనం: (ఒకరోజు) దైవప్రవక్త ﷺ మాకు ఫజ్ర్ నమాజు చేయించారు. తర్వాత వేదికపైకెక్కి మా ముందు ప్రసంగించటం మొదలుపెట్టారు. జుహ్ర్ నమాజు వేళ అయ్యేవరకూ ఆయన ప్రసంగం నడుస్తూనే ఉంది. అప్పుడాయన వేదిక దిగి (జుహ్ర్) నమాజు చేయించారు. తర్వాత మళ్ళీ వేదిక నలంకరించి అస్ర్ వేళ అయ్యేవరకూ ప్రసంగించారు. అప్పుడాయన క్రిందికి దిగి (అస్ర్) నమాజు చేయించి మళ్ళీ వేదికపైకెక్కారు. తర్వాత సూర్యుడు అస్తమించేదాకా (ఉపన్యసించారు). ఆ సందర్భంగా ఆయన మాకు గతంలో జరిగిన, భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి వివరించారు. ఆయన మాటలు అతి ఎక్కువగా తెలిసినవాడే మాలో అందరికంటే బాగా తెలిసినవాడు. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని ఫితన్ ప్రకరణం)
English
Abu Zaid `Amr bin Akhtab Al-Ansari (radiyallahu anhu) said: The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) led us in the morning (Fajr) prayer and he ascended the pulpit and addressed us until it was the time for the Zuhr prayer. He then came down the pulpit and led us in Salat (prayer). Again he ascended the pulpit and addressed until it was the time for the `Asr prayer. He then again came down, led us in Salat and again ascended the pulpit and addressed us until sunset. He informed us of everything that lay hidden in the past and what will happen in the future; and the most learned amongst us is the one who has preserved it in his memory.[Muslim].
ముఖ్యాంశాలు
భవిష్యత్తులో జరగబోయే సంఘటనలంటే ప్రళయానికి ముందు జరగబోయే ముఖ్య సంఘటనలన్నమాట. వీటినే "అలామాతె ఖియామత్" (ప్రళయ చిహ్నాలు) అంటారు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1863
హదీసు 1864
وعنْ عائِشَةَ رضيَ اللَّه عَنْهَا قَالَتْ: قَالَ النبي صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: " مَنْ نَذَرَ أنْ يُطِيع اللَّه فَلْيُطِعْهُ، ومَنْ نَذَرَ أنْ يعْصِيَ اللَّه، فَلاَ يعْصِهِ "رواهُ البُخاري.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: ఎవడయితే తాను అల్లాహ్‌కు విధేయత చూపుతానని మొక్కుబడి చేసుకుంటాడో అతను (ఆ మొక్కుబడిని నెరవేర్చాలి) అల్లాహ్‌కు విధేయత చూపాలి. మరెవడైతే తాను అల్లాహ్ పట్ల అవిధేయతకు పాల్పడతానని మొక్కుబడి చేసుకుంటాడో అతను అల్లాహ్ పట్ల అవిధేయతకు పాల్పడరాదు. (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని విశ్వాసాల ప్రకరణం)
English
`Aishah (radiyallahu anha) said: The Prophet (sallallaahu alayhi wa sallam) said, “He who vows to obey Allah, should obey Him. But he who vows to disobey Allah, should not disobey Him.”[Al-Bukhari].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1864
హదీసు 1865
وَعنْ أُمٍِّ شَرِيكٍ رَضِيَ اللَّه عنْهَا أنَّ رسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أمرَهَا بِقَتْلِ الأوزَاغِ، وقَال:"كَانَ ينْفُخُ علَى إبْراهيمَ "متفقٌ عَلَيْهِ.
దైవప్రవక్త ﷺ తనను బల్లులను చంపమని ఆదేశించారనీ, ఇవి హజ్రత్ ఇబ్రాహీమ్ (అలైహిస్సలామ్) విసరివేయబడిన మంటలను ఊదాయని ఆయన తనకు చెప్పారని హజ్రత్ ఉమ్మె షరీక్ (రదియల్లాహు అన్హా) తెలియజేశారు. (బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని సృష్టి ఆరంభ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని సలాం ప్రకరణం)
English
Umm Sharik (radiyallahu anha) said: The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) ordered me to kill chameleon. He also said, “It blew (fire) on Prophet Ibrahim.[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1865
హదీసు 1866
وَعنْ أبي هُريرةَ رضي اللَّهُ عنْهُ قَال: قَالَ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "منْ قَتَلَ وزَغَةً فِي أوَّلِ ضَرْبةٍ، فَلَهُ كَذَا وَكَذَا حسنَةً، وَمَنْ قَتَلَهَا في الضَّرْبَةِ الثَّانِية، فَلَهُ كَذَا وكَذَا حَسنَةً دُونَ الأولَى، وإنَّ قَتَلَهَا فِي الضَّرْبةِ الثَّالِثَةِ، فَلَهُ كَذاَ وَكَذَا حَسَنَةً". وفي رِوَايةٍ: "مَنْ قَتَلَ وزَغاً في أوَّلِ ضَرْبةِ، كُتِبَ لَهُ مائةُ حسَنَةٍ، وَفي الثَّانِيَةِ دُونَ ذَلِكَ، وفي الثَّالِثَةِ دُونَ ذَلِكَ". رواه مسلم. قَالَ أهْلُ اللُّغَةِ: الْوَزَغُ: الْعِظَامُ مِنْ سامَّ أبْرصَ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం: ఎవడైతే బల్లిని ఒకే ఒక దెబ్బతో చంపేస్తాడో అతనికి ఇన్ని పుణ్యాలు లభిస్తాయనీ, మరెవడయితే దాన్ని రెండు దెబ్బల్లో చంపుతాడో అతనికి మొదటి వ్యక్తి కన్నా తక్కువగా ఇన్ని పుణ్యాలు లభిస్తాయనీ, మరెవడయితే దాన్ని మూడవ దెబ్బతో చంపేస్తాడో అతనికి ఇన్ని పుణ్యాలు లభిస్తాయని దైవప్రవక్త ﷺ చెప్పారు.
వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: బల్లిని ఒకే ఒక దెబ్బలో చంపేసిన వ్యక్తి (కర్మల జాబితాలో) వంద పుణ్యాలు రాయబడతాయి. రెండు దెబ్బల్లో చంపేవాడి జాబితాలో వాటికంటే తక్కువ పుణ్యాలు, మూడు దెబ్బల్లో చంపేవారికి అంతకంటే తక్కువ పుణ్యాలు రాయబడతాయి. (ముస్లిం)
భాషావేత్తలు 'వజ్వున్' అనేది హానికర జంతువుల్లో ఒక పెద్ద జంతువని చెప్పారు. (సామ్ అబ్రస్ కూడా ఒక రకమైన హానికర జంతువే)
(సహీహ్ ముస్లింలోని సలాం ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) said: The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) said, “He who kills a chameleon at the first blow, such and such number of good deeds will be awarded to him; whoever kills it at the second blow, such and such number of merits will be recorded for him. And if he kills it at the third blow, he will get such and such merits.”
Another narration is: The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) said, “If anyone kills a chameleon with the first blow, a hundred good deeds will be recorded for him; less than that will be recorded for him if he kills it at the second blow, and still less rewards will be recorded for him if he kills it at the third blow.”[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1866
హదీసు 1867
وَعَنْ أبي هُريْرَةَ رضي اللَّه عَنْهُ أنَّ رسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَال: "قَال رَجُلٌ لأتَصدقَنَّ بِصَدقَةِ، فَخَرجَ بِصَدقَته، فَوَضَعَهَا في يَدِ سَارِقٍ، فَأصْبحُوا يتَحدَّثُونَ: تَصَدِّقَ الليلة علَى سارِقٍ، فَقَالَ: اللَّهُمَّ لَكَ الْحَمْدُ لأتَصَدَّقَنَّ بِصَدَقَةٍ، فَخَرَجَ بِصَدقَتِهِ، فَوَضَعَهَا في يدِ زانيةٍ، فَأصْبَحُوا يتَحدَّثُونَ تُصُدِّق اللَّيْلَةَ عَلَى زَانِيَةٍ، فَقَالَ: اللَّهُمَّ لَكَ الْحَمْدُ عَلَى زانِيَةٍ؟، لأتَصَدَّقَنَّ بِصدقة، فَخَرَجَ بِصَدقَتِهٍِ، فَوَضَعهَا في يَدِ غَنِي، فأصْبَحُوا يتَحدَّثونَ: تُصٌُدِّقَ علَى غَنِيٍّ، فَقَالَ اللَّهُمَّ لَكَ الْحَمْدُ علَى سارِقٍ، وعَلَى زَانِيةٍ، وعلَى غَنِي، فَأتِي فَقِيل لَهُ: أمَّا صدَقَتُكَ علَى سَارِقٍ فَلَعَلَّهُ أنْ يَسْتِعفَّ عنْ سرِقَتِهِ، وأمَّا الزَّانِيةُ فَلَعلَّهَا تَسْتَعِفَّ عَنْ زِنَاهَا، وأمَّا الْغنِيُّ فَلَعلَّهُ أنْ يعْتَبِر، فَيُنْفِقَ مِمَّا آتَاهُ اللَّهُ" رَواهُ البخاري بلفظِهِ، وَمُسْلِمٌ بمعنَاهُ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలిపారు: ఒకతను తానీరోజు రాత్రి దానం చేస్తానని నిశ్చయించుకొని ఇంటినుంచి బయలుదేరాడు. అయితే అతను (తెలియక) ఆ సొమ్ము ఒక దొంగకు ఇచ్చాడు. మరునాడు ఉదయం జనం రాత్రి ఒక వ్యక్తి ఒక దొంగకు దానం చేశాడని చెప్పుకోసాగారు. ఆ విషయం తెలుసుకొని అతను, "అల్లాహ్! నీకు కృతజ్ఞతలు" అన్నాడు. తర్వాత అతను తాను ఈ రోజు (రాత్రి) మళ్ళీ దానం చేస్తానని నిశ్చయించుకొని ఇంటి నుంచి బయలుదేరాడు. కాని (ఆ రోజు రాత్రి కూడా) అతను ఆ దానం ఒక వ్యభిచారిణి చేతికిచ్చాడు. మరునాడు ఉదయం జనంలో మళ్ళీ – రాత్రి ఒకతను వ్యభిచారిణికి దానం చేశాడని గుసగుసలు మొదలయ్యాయి. అది తెలుసుకొని ఆ వ్యక్తి, "అల్లాహ్! నీకు కృతజ్ఞతలు. నా దానం వ్యభిచారిణి చేతికి చిక్కింది. నేను ఈ రోజు రాత్రి మళ్ళీ దానం చేస్తాను" అని అనుకొని ఇంటినుంచి బయలుదేరాడు. అయితే (ఆ రోజు కూడా) అతను ఆ దానం ఒక ధనికుడి చేతిలో పెట్టాడు.
మర్నాడు ఉదయం జనం గతరాత్రి ఒక ధనికుడికి దానం ఇవ్వబడిందని మళ్ళీ గుసగుసలాడుకున్నారు. ఆ విషయం తెలుసుకొని అతను "అల్లాహ్ నీకు కృతజ్ఞతలు. (ఏమిటీ ఇలా జరిగింది!) నేను ఒకసారి దొంగకు, మరొకసారి వ్యభిచారిణికి దానం చేశాను. ఇప్పుడేమో నా దానం ఒక ధనికుని చేతికందింది" అని అనుకొని (నిద్రపోయాడు). ఆ రాత్రి అతనికి కలలో ఒక వ్యక్తి కనిపించి ఇలా చెప్పాడు:
"(నీ దానం వృధా కాలేదు), నువ్వు దొంగకు చేసిన దానం వల్ల ఆ దొంగ దొంగతనం చేయటం మానేయవచ్చు. వ్యభిచారిణికి చేసిన దానంవల్ల ఆమె తౌబా చేసుకొని (మంచి మనిషిగా) మారవచ్చు. అలాగే ధనికుడికి లభించిన దానంవల్ల, ఆ ధనికుడు కూడా బుద్ధితెచ్చుకొని దేవుడు తనకు ప్రసాదించిన ధనంలో కొంతభాగం దైవమార్గంలో ఖర్చుపెట్టవచ్చు."
బుఖారీలో ఈఉల్లేఖనం పై వాక్యాలతో ఉల్లేఖించబడింది. ముస్లింలో ఇలాంటి అర్ధమే కలిగిన ఒక ఉల్లేఖనం ఉంది.
(సహీహ్ బుఖారీలోని జకాత్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) said: The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) said: “A man (from amongst the people before you) said: `Indeed! I will give in charity.’ So he took his Sadaqah out and placed it in a thief’s hand. In the morning the people were talking (about this incident) and saying: `Sadaqah was given to a thief last night.’ The man said: `O Allah! Praise be to You. I have given Sadaqah to a thief. Indeed, I will give in charity!’ So he took his Sadaqah out and he placed it in a prostitute’s hand. In the morning the people were talking (about this incident) and saying: `Sadaqah was given to a prostitute last night.’ On hearing this, the man said: `Praise be to You, O Allah! I gave Sadaqah to a prostitute. Indeed, I will give in charity!’ So he took his Sadaqah out and placed it in a rich man’s hand. In the morning the people were talking (about this incident) and saying: `Sadaqah was given to a rich man last night.’ The man said: `O Allah! Praise be to You (for helping me) give charity to a thief, a prostitute and a rich man.’ Then he had a dream in which he was told that his Sadaqah to the thief might result in his refraining from his theft, his Sadaqah to the prostitute might help her abstain from her immorality, and his Sadaqah to the rich man might help him pay heed and spend from what Allah had bestowed upon him.”[Al-Bukhari].
ముఖ్యాంశాలు
దానధర్మాలు చేసేవాడి ఉద్దేశ్యం, సంకల్పం బాగుంటే పొరపాటు వల్ల ఆ దానాలు అనర్హులకు లభించినప్పటికీ దైవసమక్షంలో అవి స్వీకృతికి నోచుకుంటాయి. దైవం తలిస్తే ఆ దానాలతోనే ఆ అనర్హుల్లో మంచిని పుట్టించగలడు. ఈ సంఘటన పూర్వపు సమాజాల్లో ఎవరిదైనా అయి ఉంటుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1867
హదీసు 1868
وعنه قَالَ كُنَّا مَعَ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم في دَعْوَةٍ فَرُفِعَ إِلَيْهِ الذِّرَاعُ وَكَانَتْ تُّعجبه فَنَهسَ مِنْهَا نَهَسةَ وقال: أنا سَيِّدُ النَّاسِ يَوْمَ الْقِيَامَةِ، هَلْ تَدْرُونَ مِمَّ ذَاكَ؟ يَجْمعُ اللَّه الأوَّلِينَ والآخِرِينَ في صعِيدٍ وَاحِد، فَيُبْصِرُهُمُ النَّاظِرُ، وَيُسمِعُهُمُ الدَّاعِي، وتَدْنُو مِنْهُمُ الشَّمْسُ، فَيَبْلُغُ النَّاسُ مِنَ الْغَمِّ والْكَرْبِ مَالاَ يُطيقُونَ وَلاَ يحْتَمِلُونَ، فَيَقُولُ النَّاسُ: أَلاَ تَروْنَ إِلى مَا أَنْتُمْ فِيهِ، إِلَى مَا بَلَغَكُمْ؟ أَلاَ تَنْظُرُونَ مَنْ يشْفَعُ لَكُمْ إِلى رَبَّكُمْ؟ فيَقُولُ بعْضُ النَّاسِ لِبَعْضٍ: أبُوكُمْ آدَمُ، ويأتُونَهُ فَيَقُولُونَ: يَا أَدمُ أَنْتَ أَبُو الْبَشرِ، خَلَقَك اللَّه بيِدِهِ، ونَفخَ فِيكَ مِنْ رُوحِهِ، وأَمَرَ المَلائِكَةَ فَسَجَدُوا لَكَ وَأَسْكَنَكَ الْجَنَّةَ، أَلا تَشْفعُ لَنَا إِلَى ربِّكَ؟ أَلاَ تَرى مَا نَحْنُ فِيهِ، ومَا بَلَغَنَا؟ فَقَالَ: إِنَّ رَبِّي غَضِبَ غضَباً لَمْ يغْضَبْ قَبْلَهُ مِثْلَهُ. وَلاَ يَغْضَبُ بَعْدَهُ مِثْلَهُ، وَإِنَّهُ نَهَاني عنِ الشَّجَرةِ، فَعَصَيْتُ. نَفْسِي نَفْسِي نَفْسي. اذهَبُوا إِلَى غَيْرِي، اذْهَبُوا إِلَى نُوحٍ. فَيَأْتُونَ نُوحاً فَيقُولُونَ: يَا نُوحُ، أَنْتَ أَوَّلُ الرُّسُل إِلى أَهْلِ الأرْضِ، وَقَدْ سَمَّاك اللَّه عَبْداً شَكُوراً، أَلا تَرَى إِلَى مَا نَحْنُ فِيهِ، أَلاَ تَرَى إِلَى مَا بَلَغَنَا، أَلاَ تَشْفَعُ لَنَا إِلَى رَبِّكَ؟ فَيَقُولُ: إِنَّ ربِّي غَضِبَ الْيوْمَ غَضَباً لمْ يَغْضَبْ قَبْلَهُ مِثْلَهُ، وَلَنْ يَغْضَبَ بَعْدَهُ مِثْلَهُ، وَأَنَّهُ قدْ كانَتْ لِي دَعْوةٌ دَعَوْتُ بِهَا عَلَى قَوْمِي، نَفْسِي نَفْسِي نَفْسِي، اذْهَبُوا إِلَى غَيْرِي اذْهَبُوا إِلَى إِبْرَاهِيمَ. فَيْأْتُونَ إِبْرَاهِيمَ فَيَقُولُونَ: يَا إِبْرَاهِيمُ أَنْتَ نَبِيُّ اللَّهِ وَخَلِيلُهُ مِنْ أَهْلِ الأرْضِ، اشْفَعْ لَنَا إِلَى رَبِّكَ، أَلاَ تَرَى إِلَى مَا نَحْنُ فِيهِ؟ فَيَقُولُ لَهُمْ: إِنَّ ربِّي قَدْ غَضِبَ الْيَوْمَ غَضَباً لَمْ يَغْضَبْ قَبْلَهُ مِثْلَهُ، وَلَنْ يَغْضَبَ بَعْدَهُ مِثْلَهُ وَإِنِّي كُنْتُ كَذَبْتُ ثَلاَثَ كَذْبَاتٍ نَفْسِي نَفْسِي نَفْسِي، اذْهَبُوا إِلَى غَيْرِي، اذْهَبُوا إِلَى مُوسَى. فَيأْتُونَ مُوسَى، فَيقُولُون: يَا مُوسَى أَنْت رسُولُ اللَّه، فَضَّلَكَ اللَّه بِرِسالاَتِهِ وبكَلاَمِهِ عَلَى النَّاسِ، اشْفعْ لَنَا إِلَى رَبِّكَ، أَلاَ تَرَى إِلى مَا نَحْنُ فِيهِ؟ فَيَقول إِنَّ ربِّي قَدْ غَضِبَ الْيَوْمَ غَضَباً لَمْ يَغْضَبْ قَبْلَهُ مِثْلَهُ، وَلَنْ يَغْضَبَ بَعْدَهُ مِثْلَهُ وَإِنِّي قَدْ قتَلْتُ نَفْساً لَمْ أُومرْ بِقْتلِهَا. نَفْسِي نَفْسِي نَفْسِي، اذْهَبُوا إِلَى غَيْرِي، اذْهَبُوا إِلَى عِيسى. فَيَأْتُونَ عِيسَى. فَيقُولُونَ: يَا عِيسى أَنْتَ رَسُولُ اللَّهِ وَكلمتُهُ أَلْقَاهَا إِلَى مَريم ورُوحٌ مِنْهُ وَكَلَّمْتَ النَّاسَ في المَهْدِ. اشْفَعْ لَنَا إِلَى رَبِّكَ. أَلاَ تَرَى مَا نَحْنُ فِيهِ، فيَقولُ:: إِنَّ ربِّي قَدْ غَضِبَ الْيَوْمَ غَضَباً لَمْ يَغْضَبْ قَبْلَهُ مِثْلَهُ، وَلَنْ يَغْضَبَ بَعْدَهُ مِثْلَهُ، وَلمْ يَذْكُرْ ذنْباً، نَفْسِي نَفْسِي نَفْسِي، اذْهَبُوا إِلَى غَيْرِي، اذْهَبُوا إِلَى مُحمَّد صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم. وفي روايةٍ:" فَيَأْتُوني فيَقُولُونَ: يَا مُحَمَّدُ أَنْتَ رسُولُ اللَّهِ، وَخاتَمُ الأَنْبِياءَ، وقَدْ غَفَرَ اللَّه لَكَ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِكَ وَما تَأخَّر، اشْفَعْ لَنَا إِلَى ربِّكَ، أَلاَ تَرَى إِلَى مَا نَحْنُ فِيهِ؟ فَأَنْطَلِقُ، فَآتي تَحْتَ الْعَرْشِ، فأَقَعُ سَاجِداً لِربِّي"ثُمَّ يَفْتَحُ اللَّه عَلَيَّ مِنْ مَحَامِدِهِ، وحُسْن الثَّنَاءِ عَلَيْهِ شَيْئاً لِمْ يَفْتَحْهُ عَلَى أَحَدٍ قَبْلِي ثُمَّ يُقَالُ: يَا مُحَمَّدُ ارفَع رأْسكَ، سَلْ تُعْطَهُ، وَاشْفَعْ تُشَفَّعْ، فَأَرفَعُ رَأْسِي، فَأَقُولُ أُمَّتِي يَارَبِّ، أُمَّتِي يَارَبِّ، فَيُقَالُ: يامُحمَّدُ أَدْخِلْ مِنْ أُمَّتك مَنْ لاَ حِسَابَ عَلَيْهِمْ مِنَ الْباب الأَيْمَنِ مِنْ أَبْوَابِ الْجَنَّةِ وهُمْ شُركَاءُ النَّاسِ فِيمَا سِويَ ذَلِكَ مِنَ الأَبْوَابِ"ثُمَّ قَالَ:"وَالَّذِي نَفْسِي بِيدِهِ إِنَّ مَا بَيْنَ المصراعَيْنِ مِنْ مَصَارِيعِ الْجَنَّةِ كَمَا بَيْن مَكَّةَ وَهَجَر، أَوْ كَمَا بَيْنَ مَكَّةَ وَبُصْرَى" متفقٌ عليه.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన మరొక కథనం: ఒక విందు భోజనంలో మేము దైవప్రవక్త ﷺ వెంట ఉన్నాం. ఒక (మేక) ముందరికాళ్ళ మాంసం ఆయనకు సమర్పించబడింది. ఆయనకు ముందరికాళ్ళ మాంసం అంటే ఎంతో ఇష్టం. అందులో నుంచి ఆయన తన పళ్ళతో కొద్దిగా కొరుక్కొని ఇలా చెప్పటం ప్రారంభించారు:
ప్రళయదినాన నేను మానవులందరికీ నాయకునిగా ఉంటాను. అలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా? భూత భవిష్యత్ వర్తమాన కాలాల మానవులందర్నీ అల్లాహ్ ఒకే మైదానంలో సమీకరిస్తాడు. అక్కడ చూసేవాడు అందరినీ చూడగల్గుతాడు. పిలిచేవాని పిలుపుని అందరూ వినగల్గుతారు. సూర్యుడు వారికి అతి సమీపానికి వస్తాడు. దానివల్ల మానవుల పరిస్థితి అత్యంత దుర్భరంగా, తీవ్రమైన ఆందోళనకరంగా తయారవుతుంది.
ఆ స్థితిలో వారు పరస్పరం మాట్లాడుకుంటూ, 'మనం ఎలాంటి ఆపదలో చిక్కుకున్నామో గమనించారా? మనల్ని గురించి మన ప్రభువు దగ్గర సిఫారసు చేసే వారెవరైనా దొరుకుతారేమో వెతుకుదాం పదండి' అంటారు. ఆ తర్వాత వారు పరస్పరం సంప్రదించుకొని ఆదం ప్రవక్తను అందుకు అర్హులుగా భావించి ఆయన దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకుంటారు.
అందరూ ఆదం ప్రవక్త దగ్గరికి వెళ్ళి, "ఆదం! మీరు మానవులందరికీ తండ్రి. అల్లాహ్ మిమ్మల్ని తన స్వహస్తాలతో తయారుచేసి, మీ దేహంలో తన ఆత్మను ఊదాడు. అంతేగాక తన దూతలందర్నీ మీ ముందు మోకరిల్లమని ఆదేశించాడు. వారందరూ మీకు సజ్దా చేశారు. ఆయన మిమ్మల్ని స్వర్గంలో వసింపజేశాడు. అలాంటి మీరు మా గురించి మన ప్రభువుకు సిఫారసు చేయరా? మా పరిస్థితి చూడండి, మేమెలాంటి ఆపదలో చిక్కుకున్నామో" అని అంటారు.
దానికి ఆదం అలైహిస్సలామ్, "నిజం చెబుతున్నాను. ఈ రోజు నా ప్రభువు ఇది వరకు ఎన్నడూ లేనంత కోపంలో ఉన్నాడు. ఇకముందు కూడా ఇంత కోపంగా ఉండడు. ఆయన నన్ను ఒక ప్రత్యేక చెట్టు దగ్గరికి వెళ్ళకూడదని ఆజ్ఞాపించాడు. కాని నా వల్ల ఆజ్ఞోల్లంఘన జరిగిపోయింది. నేనిప్పుడు స్వయంగా నా పరిస్థితి పట్ల ఆందోళన పడుతున్నాను. అందువల్ల మీరు మరొకరి దగ్గరకు వెళ్ళండి. హజ్రత్ నూహ్ దగ్గరకు వెళ్ళండి" అని అంటారు.
అప్పుడు మానవులంతా హజ్రత్ నూహ్ దగ్గరకు వెళ్ళి, "నూహ్! ప్రపంచ మానవుల దగ్గరికి పంపబడిన మొట్టమొదటి దైవసందేశహరులు మీరు. దేవుడు మీకు కృతజ్ఞుడైన దాసుడని బిరుదు ఇచ్చాడు. మేమెలా ఆపదలో పడిపోయామో చూస్తున్నారు కదా మీరు? అందువల్ల మీరు (దయచేసి) దేవుని సన్నిధిలో మా గురించి కాస్త సిఫారసు చేయరూ?" అని అడుగుతారు.
దానికి హజ్రత్ నూహ్, "ఈ రోజు నా ప్రభువు ఇది వరకెన్నడూ లేనంత కోపంలో ఉన్నాడు. ఇకముందు కూడా ఇంత కోపంగా ఉండడు. నాకు ఒక దుఆ చేసుకునే హక్కు ఉండగా నేను దాన్ని నా జాతి ప్రజల్ని శపించటానికి ఉపయోగించాను. దానిమూలంగా నేను ఇప్పుడు స్వయంగా నా పరిస్థితి ఏమవుతుందోనని తల్లడిల్లుతున్నాను. అందుకని మీరు మరొకరి దగ్గరకు వెళ్ళండి. ఇబ్రాహీమ్ ప్రవక్త దగ్గరకు వెళ్ళండి" అని సలహా ఇస్తారు.
జనం ఇబ్రాహీమ్ (అలైహి) దగ్గరకు వెళ్తారు. ఆయనతో, "ఇబ్రాహీమ్! మీరు దేవుని ప్రవక్త. ప్రపంచ మానవులందరిలో (ప్రత్యేకంగా) ఎన్నుకోబడ్డవారు. అల్లాహ్‌కు స్నేహితులు. కనుక మీరు దయచేసి మా గురించి అల్లాహ్‌కు సిఫారసు చేయండి. మా పరిస్థితి చూడండి. మేమెలా ఆపదలో చిక్కుకొని ఉన్నామో?" అని అంటారు.
అందుకు ఇబ్రాహీమ్ ప్రవక్త "ఈ రోజు నా ప్రభువు క్రితం ఎన్నడూ లేనంత కోపంగా ఉన్నాడు. ఇకముందు కూడా ఇంత కోపంగా ఉండడు. నేను మూడు సందర్భాలలో అబద్ధమాడాను. (అవి ధర్మావసరం నిమిత్తం చెప్పిన అబద్ధాలేగాని) వాటి మూలంగా నన్ను నిలదీయటం జరుగుతుందేమోనని నేను భయపడుతున్నాను. ఏమైనా నేనిప్పుడు స్వయంగా నా పరిస్థితి ఏమవుతుందోనని ఆందోళన పడుతున్నాను. అందుచేత మీరు మరొకరి దగ్గరకు వెళ్ళండి. మూసా దగ్గరకు వెళ్ళండి" అని అంటారు.
అప్పుడు జనం మూసా ప్రవక్త దగ్గరికి వెళ్తారు. ఆయనతో, "మూసా! మీరు అల్లాహ్ సందేశహరులు. అల్లాహ్ మీతో ప్రత్యక్షంగా సంభాషించి, మిమ్మల్ని ప్రత్యేక ప్రవక్తగా నియమించాడు. పైగా మీకు మానవుల్లోకెల్లా అత్యధిక గౌరవోన్నతులను ప్రసాదించాడు. అందువల్ల మీరు (దయచేసి) మా గురించి అల్లాహ్ దగ్గర సిఫారసు చేయండి. మా పరిస్థితి చూడండి. మేమెలా ఆపదలో పడి సతమతమవుతున్నామో!" అని అంటారు.
అందుకు మూసా ఇలా సమాధానమిస్తారు: "ఈ రోజు నా ప్రభువు ఇదివరకెన్నడూ లేనంత ఆగ్రహోదగ్రుడై ఉన్నాడు, ఇకముందు కూడా ఎన్నడూ ఇంత ఉగ్రుడైపోడు. అల్లాహ్ తరపు నుంచి నాకెలాంటి ఆజ్ఞ లేకపోయినా నావల్ల ఒక ప్రాణిహత్య జరిగింది. దాని కారణంగా నేను ఇప్పుడు స్వయంగా నా పరిస్థితి ఏమవుతుందోనని ఆందోళన పడుతున్నాను. అందువల్ల మీరు మరొకరి దగ్గరకు వెళ్ళండి. ఈసా ప్రవక్త దగ్గరకు వెళ్ళండి.
జనం ఈసా అలైహిస్సలామ్ దగ్గరికి వెళ్తారు. ఆయనతో, "ఈసా! మీరు దైవప్రవక్త. దైవవచనం కూడా. దేవుడు దాన్ని మర్యమ్ వైపు వదిలాడు. మీరు దేవుని ఆత్మ కూడా. మీరు శైశవదశలోనే జనంతో మాట్లాడారు. కనుక మీరు మా గురించి కాస్త దేవునికి సిఫారసు చేయండి. చూస్తున్నారు కదా మా పరిస్థితి, మేమెలా ఆపదలో పడి సతమతమవుతున్నామో?" అని అంటారు.
దానికి ఈసా అలైహిస్సలామ్, "ఈ రోజు నా ప్రభువు ఇదివరకెన్నడూ లేనంత ఆగ్రహోదగ్రుడై ఉన్నాడు. ఇకముందు కూడా ఇంత ఉగ్రుడైపోడు అని అంటారు. (హజ్రత్ ఈసా తానేదయినా తప్పు చేసినట్లు ఇక్కడ ఎలాంటి ప్రస్తావన చేయరు.) ఇప్పుడు నా పరిస్థితి ఏమవుతుందోనని నేను భయపడిపోతున్నాను. మీరు మరొకరి దగ్గరకు వెళ్ళండి. ముహమ్మద్ ﷺ దగ్గరికి వెళ్ళండి" అని చెబుతారు.
మరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు: అప్పుడు జనం నా దగ్గరికి వస్తారు. నాతో ఇలా అంటారు: "ముహమ్మద్ ﷺ! మీరు అల్లాహ్ సందేశహరులు. అంతిమ దైవప్రవక్త. అల్లాహ్ మీ వెనుకటి, ముందటి- తప్పులన్నీ క్షమించేశాడు. కనుక (దయచేసి) మీరు మా గురించి అల్లాహ్‌కు సిఫారసు చేయండి. చూస్తున్నారు కదా మా పరిస్థితి, మేమెలా ఆపదలో చిక్కుకొని సతమతమవుతున్నామో?"
అప్పుడు నేను దైవసింహాసనం దగ్గరకు చేరుకుంటాను. అక్కడ నా ప్రభువు ముందు సాష్టాంగపడతాను. దేవుడు తన స్తోత్రం కోసం కొన్ని విశేష వచనాలు నా మనసులో నాటుతాడు. ఇలాంటి విశేష వచనాలు అదివరకెన్నడూ ఎవరికీ నేర్పి ఉండడు. ఆ తర్వాత అల్లాహ్ నన్ను సంబోధిస్తూ, "ముహ మ్మద్! తలపైకెత్తండి. మీరు అడగ దలచుకున్నదేమిటో అడగండి. మీ కోరిక తీరుస్తాను. ఏదైనా సిఫారసు చెయ్యాలనుకుంటే చెయ్యండి, నేను మీ సిఫారసును ఆమోదిస్తాను" అని అంటాడు.
అప్పుడు నేను తలపైకెత్తి, "ప్రభూ! నా అనుచర సమాజం మీద దయజూపు. ప్రభూ! నా అనుచర సమాజం మీద దయజూపు. ప్రభూ! నా అనుచర సమాజం మీద దయజూపు" అని అంటాను. దానికి అల్లాహ్, "ముహమ్మద్! వెళ్ళండి. వెళ్ళి మీ అనుచర సమాజంలోని న్యాయ విచారణ పరిధి నుంచి మినహాయించ బడిన వారినందరినీ కుడివైపు ద్వారం గుండా స్వర్గంలోనికి తీసుకెళ్ళండి. వారు ఇతర ద్వారాల గుండా కూడా వెళ్ళవచ్చు" అని అంటాడు.
ఆ తర్వాత దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు: "నా ప్రాణం ఎవరి ఆధీనంలో ఉందో ఆ మహోన్నత శక్తి సాక్షి! మక్కా హజర్ల మధ్య లేక మక్కా-బస్రాల మధ్య ఎంత దూరం ఉంటుందో స్వర్గంలోని ఒక ద్వారం వెడల్పు అంత దూరం ఉంటుంది."
(బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని వ్యాఖ్యానాల ప్రకరణం – సహీహ్ ముస్లింలోని విశ్వాసాల ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: We accompanied the Messenger of Allah (sallallaahu alayhi wa sallam) to a banquet. The meat of the forearm was presented to him as he was very fond of it. The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) ate a morsel of it and said, “I will be the master of all the people on the Day of Resurrection. Do you know why? Allah will gather all human beings, past and present generations on the same ground so that the announcer may be able to make them all hear his voice and the onlookers may be able to see all of them. The sun will come very close to the people, they will suffer such distress and trouble as they will not be able to bear. Then the people will say: `Do you see our (miserable) condition? You should look for someone who can intercede for you with your Rubb.’ Some people will say to the others: `Go to your father, Adam.’ So they will go to Adam and say to him: `You are the father of mankind; Allah created you with His Own Hand, and breathed into you of His spirit, ordered the angels to prostrate before you and He made you dwell in Jannah. So (please) intercede for us with your Rubb. Do you not see our (miserable) condition?’ Adam will say: `Today my Rubb has become so angry as He has never been before, nor will He ever become angry after this. He forbade me to approach the tree, but I disobeyed Him. I am worried about myself. Go to someone else. Go to (Prophet) Nuh (Noah).’ They will come to Nuh and will say to him: `O Nuh! You are the first of Messenger of Allah to the people on the earth, and Allah has named you a grateful slave. Please intercede for us with your Rubb. Do you not see our (miserable) condition?’ He will say: `Today my Rubb his become so angry as He has never been before, nor will He become angry hereafter. I was granted the right to make one definitely accepted invocation. I availed of this opportunity and made it against my nation. I am worried about myself. Go to someone else. Go to (Prophet) Ibrahim (Abraham).’ They will go to Ibrahim and say to him: `O Ibrahim, you are Messenger of Allah and His Khalil (the intimate friend of Allah) from among the people of the earth; so please intercede for us with your Rubb. Don’t you see our (miserable) condition?’ He will say to them: `Today my Rubb has become so angry as He has never been before; nor will he ever be so hereafter. I had told three lies. I am worried about myself. Go to someone else. Go to (Prophet) Musa (Moses).’ The people will then go to Musa and say to him: `O Musa! You are Messenger of Allah and Allah gave you superiority above the others with His Message and with His direct Talk to you, so intercede for us with your Rubb. Do you not see our (miserable) condition?’ Musa will say: `Today my Rubb has become so angry as he has never been before, nor will He ever be hereafter. I killed a man whom I had not been ordered to kill. I am worried about myself. Go to someone else. Go to (Prophet) `Isa (Jesus).’ So they will go to `¦sa and say to him: `O `Isa! You are Messenger of Allah and His Word (i.e., “Be”-and he was) which he bestowed on Maryam (Mary) and a spirit created by Him; and you talked to the people while you were in the cradle. Please intercede for us with your Rubb. Do you not see our (miserable) condition?’ `¦sa will say: `Today my Rubb has become so angry as He has never been before, nor will He ever be like this hereafter.’ `Isa will not mention any sin, but will say: `I am worried about myself. Go to someone else. Go to Muhammad (sallallaahu alayhi wa sallam).”’
Another narration is: The Messenger of Allah said, “They will come to me and say: `O Muhammad! You are the Messenger of Allah and the Last of Prophets, and Allah has forgiven your past and future sins. Please intercede for us with your Rubb. Do you not see our (miserable) condition?”’ The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) added, “Then I will proceed under Allah’s Throne and fall down in prostration before my Rubb. Then, He will bestow upon me knowledge of such praises and glorification to Him as He has never bestowed upon anybody else before me. Then I will be addressed: `O Muhammad! Raise your head. Ask, and your request will be granted. Intercede, and your intercession will be accepted.’ So I will raise my head and say: `My followers, O my Rubb! My followers, O my Rubb! My followers, O my Rubb!’ It will be said: `O Muhammad! Admit into Jannah such people as are not subjected to reckoning through the right gate of Jannah.’ The rest of them will be admitted along with the rest of mankind through the various gates of Jannah.” The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) further said, “By Him in Whose Hand my soul is! The distance between every two sides of the gates of Jannah is like the distance between Makkah and Hajar, or that between Makkah and Busra (Syria).”[Al-Bukhari and Muslim]
ముఖ్యాంశాలు
1) 'హజర్' అనేది బహ్రైన్లోని ఒక పట్టణం పేరు. బస్రా, డెమాస్కస్‌లో దక్షిణ దిశలో ఉన్న ఒక బస్తీ. మొత్తానికి చెప్పొచ్చేదేమిటంటే స్వర్గానికి ఉండే ద్వారం – ఒక చివర నుంచి మరొక చివరి వరకు వేలాది మైళ్ళ దూరమంత విశాలంగా ఉంటుంది. ఈ హదీసులో దైవప్రవక్త ﷺ గారి ఘనతా విశిష్టతలు వివరించబడ్డాయి. ప్రళయ దినాన గొప్పగొప్ప ప్రవక్తలకు కూడా దైవసమక్షంలో సిఫారసు చేయటానికి ధైర్యం చాలదు. అలాంటి పరిస్థితుల్లో ముహమ్మద్ ﷺ దైవాజ్ఞ మేరకు సిఫారసు చేస్తారు. మొదటగా మానవులను హష్ర్ మైదానపు కష్టాల నుంచి కాపాడటానికి కర్మల విచారణ ప్రారంభించమని సిఫారసు చేస్తారు. ఉల్లేఖనంలోని ఈ భాగం సదరు హదీసులో పేర్కొనబడలేదు. ఇతర హదీసుల్లో దీని ప్రస్తావన ఉంది. రెండో సిఫారసు తన అనుచర సమాజం కోసం చేస్తారు. ఈ సిఫారసు వివిధ దశల్లో సాగుతుంది. సదరు హదీసులో మొదటి దశ గురించి చెప్పబడింది. ఈ దశలో ఆయన సిఫారసు మేరకు అల్లాహ్ విచారణ ఉండనివారిని స్వర్గంలోకి తీసుకువెళ్ళటానికి అనుమతిని ప్రసాదిస్తాడు. ఆ తర్వాత పాపాత్ములైన విశ్వాసులు నరకంలో తమ పాపాలకు తగిన శిక్ష అనుభవించటం పూర్తయినప్పుడు ఆయనగారి రెండవ దశ సిఫారసు జరుగుతుంది. ఆయన సిఫారసుతో వారిని నరకం నుంచి తీసి స్వర్గంలోకి ప్రవేశింపజేయటం జరుగుతుంది.
2) ఇందులో దైవప్రవక్తలు తమ వల్ల జరిగిన కొన్ని పొరపాట్లను ప్రస్తావించి దైవసమక్షంలో సిఫారసు చేయటానికి వెనుకాడతారని చెప్పబడింది. వారు ఆ విధంగా వెనుకాడటానికి కారణమేమిటంటే- దైవప్రవక్తలు విశ్వాసం, దైవభీతి పరంగా అత్యున్నత స్థానంలో ఉంటారు. ఆ స్థాయిలో వారికి చిన్నచిన్న పొరపాట్లే పెద్దపెద్ద తప్పులుగా గోచరిస్తాయి. నిజానికి ఆ పనుల్లో పాపపు ఛాయలు కూడా ఉండవు. తెల్లని బట్ట మీద ఓ చిన్న మరక కూడా కొట్టొచ్చినట్లు కానవస్తూ ఉంటుంది. దైవప్రవక్తల పరిస్థితి కూడా అలాంటిదే. వారు తాము చేసిన చిన్న చిన్న పొరపాట్లను తలచుకొని దైవసమక్షంలో సిఫారసు చేయటానికి తమల్ని తాము అనర్హులుగా భావిస్తారు.
3) ముఖ్యంగా ఇబ్రాహీమ్ అలైహిస్సలామ్ మూడు సందర్భాల్లో అసత్యం పలికారని చెప్పబడింది. నిజానికి అవి అసత్యాలు కావు. మహా అయితే వాటిని వాస్తవ విరుద్ధ పలుకులని చెప్పవచ్చు. పైకి అవి అబద్ధాలుగా కనబడతాయి. కాని నిజానికి వాటిలో ఎలాంటి అబద్ధమూ ఉండదు. ఆయన చెప్పిన అబద్ధాలలో ఒకటి తాను అనారోగ్యంతో ఉన్నానని చెప్పటం. రెండోది: విగ్రహాల గురించి- "అవే ఈ పని చేశాయి, కావాలంటే వాటినే అడగండి" అని అనటం. మూడోది: భార్యను చెల్లిగా పరిచయం చేయటం. మొదటి మాటను ఏ విధంగానూ అబద్ధంగా లెక్క గట్టలేము. ఎందుకంటే ఆయన తాను అనారోగ్యంతో ఉన్నానని చెప్పారంటే నిజంగానే ఆయన ఆ సమయంలో అనారోగ్యంతో ఉండవచ్చు లేక జాతరకు రమ్మని తన జాతిప్రజలు ఇచ్చిన ఆహ్వానం తన మనసును బాధపెట్టి ఉండవచ్చు. రెండోది: పెద్ద విగ్రహం చిన్న విగ్రహాలను ధ్వంసం చేసిందని చెప్పటంలో ఆయన ఉద్దేశ్యం, వారిముందు విగ్రహాల అశక్తత, నిస్సహాయతను వ్యక్తం చేయటం, ఇంకా వారికి దేవుడు ఒక్కడేనన్న సత్యం బోధించటమేగాని కావాలని అబద్ధం చెప్పటం కాదు. అలాగే గత్యంతరం లేని పరిస్థితుల్లో భార్యను చెల్లిగా చెప్పుకోవటం కూడా అబద్ధం కాదు. ఎందుకంటే ప్రతి ముస్లిం పురుషుడు తోటి ముస్లిం పురుషునికి సోదరుని లాంటివాడు. ముస్లిం స్త్రీ తోటి ముస్లిం పురుషునికి సోదరితో సమానం. పైకి ఈ సంఘటనలు వాస్తవ విరుద్ధంగా కనిపిస్తున్నాయి. కనుక వీటిని అబద్ధాలు అని చెప్పటం జరిగింది. నిజానికి వాస్తవ దృష్టితో చూస్తే అవి అబద్ధాలేకావు. 'తౌరియా'లో ఒక రూపం. అవసర పరిస్థితుల్లో తౌరియా చేయటం ధర్మసమ్మతమే. (మరిన్ని వివరాలకు చూడండి 'అహ్సనుల్ బయాన్" వ్యాఖ్యానం, అంబియా సూరా, 63వ సూక్తికి పాదసూచిక).
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1868
హదీసు 1869
وَعَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللَّه عَنْهُمَا قَالَ: جاءَ إِبْرَاهِيمُ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم بِأُمِّ إِسْمَاعِيل وَبابنِهَا إِسْمَاعِيلَ وَهِي تُرْضِعُهُ حَتَّى وَضَعَهَا عِنْدَ الْبَيْتِ عِنْدَ دَوْحَةٍ فوْقَ زَمْزَمَ في أَعْلَى المسْجِدِ، وَلَيْسَ بمكَّةَ يَؤْمئذٍ أَحَدٌ وَلَيْسَ بِهَا مَاءٌ، فَوضَعَهَمَا هُنَاكَ، وَوضَع عِنْدَهُمَا جِرَاباً فِيه تَمرٌ، وسِقَاء فِيهِ مَاءٌ. ثُمَّ قَفى إِبْرَاهِيمُ مُنْطَلِقاً، فتَبِعتْهُ أُمُّ إِسْماعِيل فَقَالَتْ: يَا إِبْراهِيمُ أَيْنَ تَذْهَبُ وتَتْرُكُنَا بهَذا الْوادِي الَّذِي ليْسَ فِيهِ أَنيسٌ ولاَ شَيءٌ؟ فَقَالَتْ لَهُ ذَلكَ مِراراً، وَجَعَلَ لاَ يلْتَفِتُ إِلَيْهَا، قَالَتْ لَه: آللَّهُ أَمركَ بِهذَا؟ قَالَ: نَعَمْ. قَالَت: إِذًا لاَ يُضَيِّعُنا، ثُمَّ رجعتْ. فَانْطَلقَ إِبْراهِيمُ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، حَتَّى إِذا كَانَ عِنْدَ الثَّنِيَّةِ حيْثُ لاَ يَروْنَهُ. اسْتَقْبل بِوجْههِ الْبيْتَ، ثُمَّ دَعَا بهَؤُلاءِ الدَّعواتِ، فَرفَعَ يدَيْه فقَالَ: {رَّبَّنَا إِنِّي أَسْكَنْتُ مِنْ ذُرِّيَّتي بِوادٍ غَيْرِ ذِي زَرْعٍ} حتَّى بلَغَ {يشْكُرُونَ} . وجعلَتْ أُمُّ إِسْمَاعِيل تُرْضِعُ إِسْماعِيل، وتَشْربُ مِنْ ذَلِكَ المَاءِ، حتَّى إِذَا نَفِدَ مَا فِي السِّقَاءِ عَطِشَتْ وعَطِش ابْنُهَا، وجعلَتْ تَنْظُرُ إِلَيْهِ يتَلوَّى أَوْ قَالَ: يتَلَبَّطُ فَانْطَلَقَتْ كَراهِيةَ أَنْ تَنْظُر إِلَيْهِ، فَوجدتِ الصَّفَا أَقْرَبَ جبَلٍ في الأرْضِ يلِيهَا، فَقَامتْ علَيْهِ، ثُمَّ استَقبَلَتِ الْوادِيَ تَنْظُرُ هَلْ تَرى أَحداً؟ فَلَمْ تَر أَحداً. فهَبطَتْ مِنَ الصَّفَا حتَّى إِذَا بلَغَتِ الْوادِيَ، رفَعتْ طَرفَ دِرْعِهِا، ثُمَّ سَعتْ سعْي الإِنْسانِ المجْهُودِ حتَّى جاوزَتِ الْوَادِيَ، ثُمَّ أَتَتِ المرْوةَ، فقامتْ علَيْهَا، فنَظَرتْ هَلْ تَرى أَحَداً؟ فَلَمْ تَر أَحَداً، فَفَعَلَتْ ذَلِكَ سَبْع مرَّاتٍ. قَال ابْنُ عبَّاسٍ رَضِي اللَّه عنْهُمَا: قَال النَّبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"فَذَلِكَ سعْيُ النَّاسِ بيْنَهُما". فلَمَّا أَشْرفَتْ علَى المرْوةِ سَمِعتْ صَوْتاً، فَقَالَتْ: صهْ تُرِيدُ نَفْسهَا ثُمَّ تَسمعَتْ، فَسمِعتْ أَيْضاً فَقَالتْ: قَدْ أَسْمعْتَ إِنْ كَانَ عِنْدكَ غَواثٌ. فأَغِث. فَإِذَا هِي بِالملَكِ عِنْد موْضِعِ زمزَم، فَبحثَ بِعقِبِهِ أَوْ قَال بِجنَاحِهِ حَتَّى ظَهَرَ الماءُ، فَجعلَتْ تُحوِّضُهُ وَتَقُولُ بِيدِهَا هَكَذَا، وجعَلَتْ تَغْرُفُ المَاءَ في سِقَائِهَا وهُو يفُورُ بَعْدَ مَا تَغْرفُ وفي روايةٍ: بِقَدرِ مَا تَغْرِفُ. قَال ابْنُ عبَّاسٍ رضِيَ اللَّه عَنْهُمَا: قالَ النَّبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"رحِم اللَّه أُمَّ إِسماعِيل لَوْ تَركْت زَمزَم أَوْ قَالَ: لوْ لَمْ تَغْرِفْ مِنَ المَاءِ، لَكَانَتْ زَمْزَمُ عيْناً معِيناً" قَال فَشَرِبتْ، وَأَرْضَعَتْ وَلَدهَا. فَقَال لَهَا الملَكُ: لاَ تَخَافُوا الضَّيْعَة فَإِنَّ هَهُنَا بَيْتاً للَّهِ يَبْنِيهِ هَذَا الْغُلاَمُ وأَبُوهُ، وإِنَّ اللَّه لاَ يُضيِّعُ أَهْلَهُ، وَكَانَ الْبيْتُ مُرْتَفِعاً مِنَ الأَرْضِ كَالرَّابِيةِ تأْتِيهِ السُّيُولُ، فتَأْخُذُ عنْ يمِينِهِ وَعَنْ شِمالِهِ. فَكَانَتْ كَذَلِكَ حتَّى مرَّتْ بِهِمْ رُفْقَةٌ مِنْ جُرْهُمْ، أَوْ أَهْلُ بيْتٍ مِنْ جُرْهُمٍ مُقْبِلين مِنْ طَريقِ كَدَاءَ، فَنَزَلُوا في أَسْفَلِ مَكَةَ، فَرَأَوْا طَائراً عائِفاً فَقَالُوا: إِنَّ هَذا الطَّائِر ليَدُورُ عَلى مَاءٍ لَعهْدُنَا بِهذا الوَادِي وَمَا فِيهِ ماءَ فَأرسَلُوا جِريّاً أَوْ جَرِيَّيْنِ، فَإِذَا هُمْ بِالماءِ، فَرَجَعُوا فَأَخْبَرُوهم فَأقْبلُوا، وَأُمُّ إِسْماعِيلَ عِنْدَ الماءَ، فَقَالُوا: أَتَأْذَنِينَ لَنَا أَنْ ننزِلَ عِنْدكَ؟ قَالتْ: نَعَمْ، ولكِنْ لاَ حَقَّ لَكُم في الماءِ، قَالُوا: نَعَمْ. قَال ابْنُ عبَّاسٍ: قَالَ النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:" فَأَلفى ذلكَ أُمَّ إِسماعِيلَ، وَهِي تُحِبُّ الأُنْسَ". فَنزَلُوا، فَأَرْسلُوا إِلى أَهْلِيهِم فنَزَلُوا معهُم، حتَّى إِذا كَانُوا بِهَا أَهْل أَبياتٍ، وشبَّ الغُلامُ وتَعلَّم العربِيَّةَ مِنهُمْ وأَنْفَسَهُم وأَعجَبهُمْ حِينَ شَبَّ، فَلَمَّا أَدْركَ، زَوَّجُوهُ امرأَةً منهُمْ، ومَاتَتْ أُمُّ إِسمَاعِيل. فَجَاءَ إبراهِيمُ بعْد ما تَزَوَّجَ إسماعِيلُ يُطالِعُ تَرِكَتَهُ فَلم يجِدْ إِسْماعِيل، فَسأَل امرأَتَهُ عنه فَقَالت ْ: خَرَجَ يبْتَغِي لَنَا وفي رِوايةٍ: يصِيدُ لَنَا ثُمَّ سأَلهَا عنْ عيْشِهِمْ وهَيْئَتِهِم فَقَالَتْ: نَحْنُ بَشَرٍّ، نَحْنُ فِي ضِيقٍ وشِدَّةٍ، وشَكَتْ إِليْهِ، قَال: فَإذَا جاءَ زَوْجُكِ، اقْرئى عَلَيْهِ السَّلام، وقُولي لَهُ يُغَيِّرْ عَتبةَ بابهِ. فَلَمَّا جاءَ إسْماعيلُ كَأَنَّهُ آنَسَ شَيْئاً فَقَال: هَلْ جاءَكُمْ منْ أَحَدٍ؟ قَالَتْ: نَعَمْ، جاءَنَا شَيْخٌ كَذا وكَذا، فَسأَلَنَا عنْكَ، فَأخْبَرْتُهُ، فَسألني كَيْف عيْشُنا، فَأخْبرْتُهُ أَنَّا في جَهْدٍ وشِدَّةٍ. قَالَ: فَهَلْ أَوْصاكِ بشَيْءِ؟ قَالَتْ: نَعمْ أَمَرني أَقْرَأ علَيْكَ السَّلامَ ويَقُولُ: غَيِّرْ عَتبة بابكَ. قَالَ: ذَاكِ أَبي وقَدْ أَمرني أَنْ أُفَارِقَكِ، الْحَقِي بأَهْلِكِ. فَطَلَّقَهَا، وتَزَوَّج مِنْهُمْ أُخْرى. فلَبِث عَنْهُمْ إِبْراهيم مَا شَاءَ اللَّه ثُمَّ أَتَاهُم بَعْدُ، فَلَمْ يجدْهُ، فَدَخَل عَلَى امْرَأتِهِ، فَسَأَل عنْهُ. قَالَتْ: خَرَج يبْتَغِي لَنَا. قَال: كَيْفَ أَنْتُمْ، وسألهَا عنْ عيْشِهِمْ وهَيْئَتِهِمْ فَقَالَتْ: نَحْنُ بِخَيْرٍ وَسعةٍ وأَثْنتْ على اللَّهِ تَعالى، فَقَال: مَا طَعامُكُمْ؟ قَالَتْ: اللَّحْمُ. قَال: فَما شَرابُكُمْ؟ قَالَتِ: الماءُ. قَال: اللَّهُمَّ بَارِكْ لهُمْ فِي اللَّحْم والماءِ، قَال النَّبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:" وَلَمْ يكنْ لهُمْ يوْمَئِذٍ حُبٌّ وَلَوْ كَانَ لهُمْ دَعَا لَهُمْ فيهِ" قَال: فَهُما لاَ يخْلُو علَيْهِما أَحدٌ بغَيْرِ مكَّةَ إِلاَّ لَمْ يُوافِقاهُ. وَفِي روايةٍ فَجاءَ فَقَالَ: أَيْنَ إِسْماعِيلُ؟ فَقَالَتِ امْرأتُهُ: ذَهبَ يَصِيدُ، فَقَالَتِ امْرأَتُهُ: أَلا تَنْزِلُ، فتَطْعَم وتَشْربَ؟ قَالَ: وَمَا طعامُكمْ وَمَا شَرابُكُمْ؟ قَالَتْ: طَعَامُنا اللَّحْمُ، وشَرابُنَا الماءُ. قَال: اللَّهُمَّ بَارِكْ لَهُمْ فِي طَعامِهمْ وشَرَابِهِمْ قَالَ: فَقَالَ أَبُو القَاسِم صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:" بركَةُ دعْوةِ إِبراهِيم صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم "قَالَ: فَإِذا جاءَ زَوْجُكِ، فاقْرئي علَيْهِ السَّلامَ وَمُريهِ يُثَبِّتْ عتَبَةَ بابهِ. فَلَمَّا جاءَ إِسْماعِيلُ، قَال: هَلْ أَتَاكُمْ منْ أَحد؟ قَالتْ: نَعَمْ، أَتَانَا شيْخٌ حَسَن الهَيئَةِ وَأَثْنَتْ عَلَيْهِ، فَسَأَلَني عنْكَ، فَأَخْبرتُهُ، فَسأَلَني كيفَ عَيْشُنَا فَأَخبَرْتُهُ أَنَّا بخَيرٍ. قَالَ: فأَوْصَاكِ بِشَيْءٍ؟ قَالَتْ: نَعَمْ، يَقْرَأُ عَلَيْكَ السَّلامَ، ويأْمُرُكَ أَنْ تُثَبِّتَ عَتَبَة بابكَ. قَالَ: ذَاكِ أَبي وأنتِ الْعَتَبةُ أَمرني أَنْ أُمْسِكَكِ. ثُمَّ لَبِثَ عنْهُمْ مَا شَاءَ اللَّه، ثُمَّ جَاءَ بعْد ذلكَ وإِسْماعِيلُ يبْرِي نَبْلاً لَهُ تَحْتَ دَوْحةٍ قَريباً مِنْ زَمْزَمَ، فَلَمَّا رآهُ، قَامَ إِلَيْهِ، فَصنعَ كَمَا يصْنَعُ الْوَالِد بِالْولَدُ وَالوَلَدُ بالْوالدِ، قَالِ: يَا إِسْماعِيلُ إِنَّ اللَّه أَمرني بِأَمْرٍ، قَال: فَاصْنِعْ مَا أَمركَ ربُّكَ؟ قَال: وتُعِينُني، قَال: وأُعِينُكَ، قَالَ: فَإِنَّ اللَّه أَمرنِي أَنْ أَبْني بيْتاً ههُنَا، وأَشَار إِلى أَكَمَةٍ مُرْتَفِعةٍ عَلَى مَا حَوْلهَا فَعِنْد ذَلِكَ رَفَعَ الْقَوَاعِدَ مِنَ الْبيْتِ، فَجَعَلَ إِسْماعِيل يَأتِي بِالحِجارَةِ، وَإبْراهِيمُ يبْني حتَّى إِذا ارْتَفَعَ الْبِنَاءُ جَاءَ بِهَذا الحجرِ فَوضَعَهُ لَهُ فقامَ عَلَيْهِ، وَهُو يبْني وإسْمَاعِيلُ يُنَاوِلُهُ الحِجَارَة وَهُما يقُولاَنِ:"ربَّنَا تَقَبَّلْ مِنَّا إِنَّكَ أَنْتَ السَّمِيعُ الْعَلِيمُ". وفي روايةٍ: إِنَّ إبْراهِيم خَرَج بِإِسْماعِيل وأُمِّ إسْمَاعِيل، معَهُم شَنَّةٌ فِيهَا ماءٌ فَجَعلَتْ أُم إِسْماعِيلَ تَشْربُ مِنَ الشَّنَّةِ، فَيَدِرُّ لَبنُهَا عَلَى صبِيِّهَا حَتَّى قَدِم مكَّةَ. فَوَضَعهَا تَحْتَ دَوْحةٍ، ثُمَّ رَجَع إِبْراهيمُ إِلى أَهْلِهِ، فاتَّبعَتْهُ أُمُّ إِسْمَاعِيلَ حَتَّى لمَّا بلغُوا كَداءَ نادَتْه مِنْ ورائِه: يَا إِبْرَاهيمُ إِلى منْ تَتْرُكُنَا؟ قَالَ: إِلى اللَّهِ، قَالَتْ: رضِيتُ بِاللَّهِ. فَرَجعتْ، وَجعلَتْ تَشْرَبُ مِنَ الشَّنَّةِ، وَيَدرُّ لَبَنُهَا عَلى صَبِيِّهَا حَتَّى لمَّا فَنى الماءُ قَالَتْ: لَوْ ذَهبْتُ، فَنَظَرْتُ لعَلِّي أحِسُّ أَحَداً، قَالَ: فَذَهَبَتْ فصعِدت الصَّفا. فَنَظَرتْ وَنَظَرَتْ هَلْ تُحِسُّ أَحداً، فَلَمْ تُحِسَّ أَحَداً، فَلَمَّا بلَغَتِ الْوادي، سعتْ، وأَتتِ المرْوةَ، وفَعلَتْ ذلكَ أَشْواطاً، ثُمَّ قَالَتْ: لَوْ ذهَبْتُ فنَظرْتُ ما فَعلَ الصَّبيُّ، فَذَهَبتْ ونَظَرَتْ، فإِذَا هُوَ عَلَى حَالهِ كأَنَّهُ يَنْشَغُ للمَوْتِ، فَلَمْ تُقِرَّهَا نفْسُهَا. فَقَالَت: لَوْ ذَهَبْتُ، فَنَظَرْتُ لَعَلِّي أَحِسُّ أَحداً، فَذَهَبَتْ فصَعِدتِ الصَّفَا، فَنَظَرتْ ونَظَرتْ، فَلَمْ تُحِسُّ أَحَداً حتَّى أَتمَّتْ سَبْعاً، ثُمَّ قَالَتْ: لَوْ ذَهَبْتُ، فَنَظَرْتُ مَا فَعل. فَإِذا هِيَ بِصوْتٍ. فَقَالَتْ: أَغِثْ إِنْ كَانَ عِنْدَكَ خيْرٌ فإِذا جِبْرِيلُ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فقَال بِعَقِبهِ هَكَذَا، وغمزَ بِعقِبه عَلى الأرْض، فَانْبثَقَ الماءُ فَدَهِشَتْ أُمُّ إسْماعِيلَ فَجعلَتْ تَحْفِنُ وذكَرَ الحَدِيثَ بِطُولِهِ. رواه البخاري بهذِهِ الرواياتِ كلها. "الدَّوْحةُ": الشَّجرةُ الْكَبِيرةُ. قولهُ:"قَفى"أَيْ: ولَّى."وَالجَرِيُّ": الرَّسُولُ."وَأَلَفى"معناه: وجَد. قَوْلُهُ:"يَنْشَغُ"أَيْ: يَشْهقُ.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: ఇబ్రాహీమ్ అలైహిస్సలామ్ ఇస్మాయిల్ తల్లిని, ఆమె కుమారుడు ఇస్మాయిల్‌ను ఇద్దరిని తీసుకొచ్చి దైవగృహం సమీపాన మస్జిదె హరామ్ ఎగువ భాగంలో జమ్జమ్ (బావి) దగ్గర ఉన్న ఒక చెట్టు దగ్గర దింపారు. అప్పుడు ఇస్మాయిల్ ఇంకా పాలుతాగే పసిపిల్లవాడు. ఆ కాలంలో మక్కాలో మనుషులెవరూ నివసించేవారుకారు. అక్కడ నీళ్లు కూడా దొరికేవి కావు. ఆయన తల్లీకొడుకులిద్దరినీ అక్కడ వదలిపెట్టారు. వారిదగ్గర ఒక ఖర్జూర పండ్ల సంచి, ఒక నీళ్ల తిత్తి ఉంచి ఆయన తిరుగు ప్రయాణమవుతుండగా ఇస్మాయిల్ తల్లి ఆయన వెనకాలే వెళ్ళి, "ఇబ్రాహీమ్! ఈ లోయలో మమ్మల్ని అడిగి చూసేవాడెవ్వడూ లేడు. కనీసం అవసరానికి కావలసిన వస్తువులు కూడా లేవు. ఇలాంటి చోట మమ్మల్ని (ఒంటరిగా) వదలిపెట్టి మీరు ఎక్కడికి వెళ్తున్నారు?" అని అడిగారు. ఈ ప్రశ్న ఆమె ఆయన్ని అనేకసార్లు అడిగారు. కాని ఇబ్రాహీమ్ అలైహిస్సలామ్ ఆమె వంక చూడనయినా చూడలేదు. చివరికి హాజిరా స్వయంగా, "దేవుడు మిమ్మల్ని ఇలా చేయమని ఆదేశించాడా?" అని అడిగారు. ఆ మాటకు ఆయన 'అవును' అని (ముక్తసరిగా) సమాధానమిచ్చారు. అందుకామె "అలాగయితే, ఆయన మమ్మల్ని నష్టపరచడు" అని చెప్పి తిరిగి తన స్థానానికి వెళ్ళిపోయారు.
ఇబ్రాహీమ్ అలైహిస్సలామ్ తిరుగు ప్రయాణమయ్యారు. సనియ్యా అనే చోటికి చేరుకున్న తర్వాత ఆయన తల్లీబిడ్డలకు కనిపించకుండా పోయారు. అక్కడ ఆయన దైవగృహం వైపు తిరిగి రెండు చేతులూ పైకెత్తి ఇలా ప్రార్థించటం ప్రారంభించారు: "ప్రభూ! తృణకాష్ట జలరహితమైన లోయలో నా సంతానంలో కొందరిని తెచ్చి నీ పవిత్ర గృహం వద్ద నివసింపజేశాను….. బహుశా వారు కృతజ్ఞులవుతారేమో." (వరకు). (ఇబ్రాహీమ్ సూరా: 37)
(అటు) ఇస్మాయిల్ తల్లి ఇస్మాయిల్‌కు పాలు త్రాపిస్తూ, నీళ్ళతిత్తిలో ఉన్న నీళ్లు త్రాపిస్తూ (ఆ ఎడారిలోనే ఒంటరిగా) ఉంటోంది. చివరికి నీళ్ళతిత్తిలోని నీరు కూడా అయిపోయింది. దాంతో ఆమె ఎలాగో దాహానికి తట్టుకొని ఉండగల్గుతోంది. కాని పిల్లవాడు కూడా దప్పికతో విలవిల్లాడిపోసాగాడు. నేల మీద అటూఇటూ పొర్లసాగాడు. మాతృహృదయం పిల్లవాడి బాధను చూసి తట్టుకోలేకపోయింది. ఆమె నీళ్లు వెతకటం ప్రారంభించారు. ఆ సమయంలో సఫా కొండ తనకు అతి సమీపంలో ఉన్నట్లు కనిపించింది. ఆమె ఆ కొండపైకెక్కి నిలబడ్డారు. లోయ వైపు తిరిగి ఎక్కడైనా మను షులు కానవస్తారేమోనని కలియ జూశారు. కాని ఎవరూ కనిపించక పోవటంతో సఫా కొండ నుంచి క్రిందికి దిగారు. నేలమీదికి దిగివచ్చిన తర్వాత చొక్కాకొన పైకెత్తి బాధకు గురైన మనిషి పరుగెత్తినట్లు పరుగెత్తారు. లోయను దాటి తిరిగి మర్వా కొండ పైకెక్కి నిలబడ్డారు. ఎవరైనా మనుషులు కనిపిస్తారేమోనని చుట్టూ కలియ జూశారు కాని ఎవరూ కాన రాలేదు.
ఆ కారణంగానే ప్రజలు (హాజిరాను అనుకరిస్తూ హజ్, ఉమ్రా సమయాల్లో) 'సయీ' చేస్తారు.
చివర్లో మర్వా కొండపైకి ఎక్కినప్పుడు ఆమెకు ఒక శబ్దం వినిపించింది. "ఏమిటి ఆ శబ్దం, మెదలకుండా ఉండు" అని అనుకున్నారు ఆమె మనసులో. (ఆ ప్రదేశంలో మనిషి మాట్లాడుతున్నట్లు శబ్దం వినపడటాన్ని ఆమె నమ్మలేకపోయారు). చెవులు రిక్కించి వింటే మళ్ళీ అవే మాటలు వినిపించాయి. అప్పుడామె, "నీ మాటలు నాకు వినిపించాయి. నీ దగ్గర మాకు పనికివచ్చే సామగ్రి ఏమైనా ఉంటే వెంటనే సహాయం కోసం ఇక్కడికి చేరుకో" అన్నారు. తర్వాత చూస్తే (నేడు)జమ్జమ్ (బావి) ఉన్నచోట ఒక దైవదూత కనిపించాడు. అతను తన కాలితో (లేక) తన రెక్కతో నీటి ఊట చిమ్మేదాకా నేలను త్రవ్వాడు. హాజిరా ఆ నీటికోసం హౌజ్ నిర్మించసాగారు. దోసలితో నీరు తీసుకొని తన దగ్గరున్న నీళ్ళతిత్తిలో పోసుకోసాగారు. ఆమె దోసిలితో ఎంత నీరైతే తీసుకుంటారో అంతే నీరు భూమిలో నుంచి ఉబికివచ్చేది. ఒక ఉల్లేఖనం ప్రకారం దోసిలి అంత నీరు భూమిలో నుంచి ఉబికివచ్చేది.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు: అల్లాహ్ ఇస్మాయిల్ తల్లిమీద దయచూపుగాక! ఆమె గనక జమ్జమ్ నీటిని అలాగే వదిలేసి ఉన్నట్లయితే (లేక) దోసిలితో నీళ్ళను సమీకరించి ఉండకపోతే జమ్జమ్ ఊటబావి భూలోకమంతటికీ నీరు అందించగలిగి ఉండేది.
ఉల్లేఖకులు తెలియజేస్తున్నారు: హాజిరా స్వయంగా ఆ నీరు త్రాగారు. తన పిల్లవాడికి కూడా త్రాగించారు. దైవదూత హాజిరాకు ధైర్యం చెబుతూ, "మీరు ప్రాణభయం పెట్టుకోకండి. ఎందుకంటే ఇక్కడ దైవగృహ స్థలం ఉంది. ఆ స్థలంలో ఈ పిల్లవాడు మరియు ఇతని తండ్రి ఇద్దరూ కలిసి దైవగృహాన్ని నిర్మిస్తారు. తన గృహానికి పర్యవేక్షకులుగా ఉండేవారిని అల్లాహ్ ఎన్నటికీ నాశనం చేయడు" అని అన్నాడు. ఆ కాలంలో దైవగృహం (చోటు) మట్టి దిబ్బలాగా ఎత్తుగా ఉండేది. అక్కడికి వరదలు వచ్చినా (ఆ ఎత్తయిన ప్రదేశాన్ని నష్టపరచకుండా) కుడి ఎడమల నుంచి వెళ్ళిపోయేవి. చాలా కాలం వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. చివరికి జుర్హుమ్ బృందం లేక జుర్హుమ్ తెగకు చెందిన ఒక వంశం వారు 'కదా' మార్గం గుండా వెళ్తూ మక్కా దిగువ ప్రాంతంలో మజిలీ చేయటానికి దిగారు. అక్కడ ఆకాశంలో ఒక పక్షి వారికి చుట్టూ తిరుగాడుతున్నట్లు కనిపించింది. దాన్ని చూసి వారు "బహుశా ఆ పక్షి నీళ్ళకోసమే తిరుగాడుతుంటుంది. మనం ఎంతో కాలం నుంచి ఈ లోయ గుండా వెళ్ళివస్తున్నాం. కాని ఇక్కడ నీళ్లు ఉన్నట్లు మనకు తెలి యదే" అని అనుకొని ఆచూకీ తెలుసుకొని రమ్మని ఒకరినో లేక ఇద్దరినో పంపారు. వారు అక్కడికి వెళ్ళి నీళ్లు తాగారు. తిరిగొచ్చి తెగవారికి వార్తనందజేశారు. వారంతా అక్కడికి వెళ్ళారు. అప్పుడు ఇస్మాయిల్ తల్లి నీళ్ళ దగ్గరే కూర్చొని ఉన్నారు. వారు ఆమెను, "మేము మీ దగ్గర మజిలీ చేయటానికి అనుమతించగలరా?" అని అడిగారు. అందుకామె, "సరేగాని నీళ్ళ యాజమాన్యంలో మీకు హక్కు ఉండబోదు" అన్నారు. అందుకు వారు "సరే" అన్నారు.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా చెప్పారు: ఈ విషయం ఇస్మాయిల్ తల్లి ఇష్టప్రకారమే జరిగింది. స్వయంగా ఆమె ఆప్యాయతానురాగాలను ఇష్టపడేవారు. వారు అక్కడ దిగారు. తమ ఇంటివారికి కబురు చేశారు. దాంతో వారు కూడా వచ్చి అక్కడే స్థిరపడ్డారు. ఆ విధంగా ఆ ప్రాంతంలో స్థిరపడిన ఇండ్లు అనేకమయ్యాయి. ఇటు ఇస్మాయిల్ (అలైహిస్సలామ్) కూడా యువకులయ్యారు. వారితో పాటు ఉంటూ అరబీ భాష కూడా నేర్చుకున్నారు. పెద్దయిన తర్వాత ఆయన వారిలో అందరికంటే ఎక్కువ నీటుగా, మనసైనవాడుగా ఉండేవారు. అప్పుడు వారు తమ తెగకు చెందిన ఒక స్త్రీని ఆయనకిచ్చి వివాహం చేశారు. ఇస్మాయిల్ తల్లి చని పోయింది. ఇస్మాయిల్ వివాహం తర్వాత ఇబ్రాహీమ్ (అలైహిస్సలామ్) తను విడిచిపెట్టిన వారిని (భార్యాబిడ్డల్ని) చూడటానికి వచ్చారు. ఆయన ఇస్మాయిల్‌ను కలవలేక పోయారు. ఇస్మాయిల్ ఎక్కడికి వెళ్ళాడని అతని భార్యను అడిగారు. ఆయన మా కోసం ఆహారం తీసుకురావటానికి, (ఒక ఉల్లేఖనం ప్రకారం) మా కోసం వేటకు వెళ్ళారని ఆమె చెప్పింది. తర్వాత ఇబ్రాహీమ్ అలైహిస్సలామ్ ఆమెను తమ సంసార జీవితం, బాగోగుల గురించి అడిగారు. అందుకామె, "మేము చాలా హీనస్థితిలో ఉన్నాం. చాలా ఇబ్బందుల్లో జీవితం గడుపుతున్నాం" అంటూ ఇస్మాయిల్ గురించి ఫిర్యాదు చేసింది. దానికి ఇబ్రాహీమ్ (సరే, అయితే) మీ ఆయన వచ్చిన తర్వాత ఆయనకు నా సలాం చెప్పు. మీ ఇంటి తలుపుల గుమ్మం మార్చమని కూడా చెప్పమ్మా' అని చెప్పి వెళ్ళిపోయారు.
ఇస్మాయిల్ ఇంటికి చేరుకున్నారు. తన ఇంటికి ఎవరో వచ్చి వెళ్ళినట్లు అనిపించింది ఆయనకు. మనింటికి ఎవరైనా వచ్చి వెళ్ళారా? అని భార్యను అడిగారు. అందుకామె, ఇలా చెప్పుకుంటూ పోయింది: "అవునండీ! ఒక పెద్దాయన వచ్చాడు. ఆయన ఫలానా విధంగా ఉంటారు. ఆయ నొచ్చి మిమ్మల్ని గురించి అడిగితే (మీరు బయటికి వెళ్ళారని) చెప్పాను. తర్వాత ఆయన మన సంసారం ఎలా నడుస్తుందని అడిగారు. దానికి నేను మనం చాలా హీనస్థితిలో ఉన్నామనీ, ఇబ్బందులతో జీవితం గడుపుతున్నా మని చెప్పాను."
"మరి దానికి ఆయన ఏమని చెప్పి వెళ్ళారు?" అని అడిగారు ఇస్మాయిల్. "అవునండీ ఆయన మీకు సలాం చెప్పమని ఆదేశించారు. అంతేకాదు, మీకొక సందేశం ఇచ్చి వెళ్ళారు. మీ ఇంటి గుమ్మం మార్చాలట" అని చెప్పిందామె. అప్పుడు ఇస్మాయిల్ ఇలా తెలిపారు: "ఆ పెద్దాయన మా నాన్నగారే. ఆయన నన్ను నీ నుంచి వేరుపడమని ఆదేశించి వెళ్ళారు. ఇక నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు." ఇస్మాయిల్ ఆమెకు విడాకులిచ్చేసి ఆ తెగకే చెందిన వేరొక స్త్రీని వివాహమాడారు.
దేవుడు తలచినంతకాలం తర్వాత ఇబ్రాహీమ్ అలైహిస్సలామ్ మళ్ళీ వారి దగ్గరకు వచ్చారు. అప్పుడు కూడా ఇస్మాయిల్ ఇంట్లో లేరు. ఆయన భార్య దగ్గరకు వెళ్ళి ఆయన గురించి అడిగారు. ఆయన మా కోసం ఆహారం తీసుకురావటానికి బయటికి వెళ్ళి ఉన్నారు అని చెప్పిందామె. ఇబ్రాహీమ్ ఆమెను "మీరు ఎలా ఉన్నారు?" అంటూ వారి సంసారం గురించి, వారి బాగోగుల గురించి అడిగారు. అందుకామె, "అల్లాహ్ దయవల్ల మేము బాగానే ఉన్నామండీ. ప్రభువు చలువతో మేము సుఖంగానే ఉన్నాం" అని చెప్పింది"మీరు ఏం తింటారు?" అని అడిగారు ఇబ్రాహీమ్. "మాంసం తింటాం" అని చెప్పిందామె. "ఏం తాగుతారు?" అని అడిగితే, 'నీళ్లు' అని చెప్పింది. "ఓ అల్లాహ్! వీళ్ళ కొరకు మాంసంలో, నీళ్ళలో వృద్ధిని ప్రసాదించు" అని ఇబ్రాహీమ్ ప్రార్థించారు.
దైవప్రవక్త ﷺ తెలియజేస్తున్నారు: ఆ కాలంలో వారి దగ్గర ధాన్యాలేవీ ఉండేవి కావు. ఒకవేళ ఉండి ఉంటే ఇబ్రాహీమ్ వాటిలో కూడా (శుభం ప్రాప్తించాలని) ప్రార్థించి ఉండేవారు. ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఉవాచ: ఒక్క మక్కా నగరం తప్ప ఇతర ఏ ప్రాంతంలోనైనా ఎవడైనా కేవలం ఆ రెండు వస్తువులతోనే గడపదలిస్తే అవి అతనికి పడవు.
వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: ఇబ్రాహీమ్ (రెండోసారి) వచ్చి, "ఇస్మాయిల్ ఏడి?" అని అడిగారు. ఇస్మాయిల్ భార్య, "ఆయన వేటకు వెళ్ళారు. మీరు అలాగే నిలబడ్డారేం? కూర్చొండి. ఏమైనా తిని వెళ్దురుగాని" అని అన్నది. ఇబ్రాహీమ్ ఆమెను "మీరు ఏం తింటున్నారు? ఏం తాగుతున్నారు?" అని అడిగారు. "మాకిక్కడ తినడానికి మాంసం, త్రాగడానికి నీళ్లు దొరుకుతాయండీ" అని చెప్పిందామె. అప్పుడాయన "ఓ అల్లాహ్! వీళ్ళ అన్నపానీయాల్లో శుభాన్ని ప్రసాదించు" అని ప్రార్థించారు.
ఉల్లేఖకులు ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం అబుల్ ఖాసిమ్ ﷺ ఇలా తెలియజేశారు: (మక్కాలో ఈ రెండు వస్తువులు విస్తృతంగా లభించటానికి కారణం) ఇబ్రాహీమ్ అలైహిస్సలామ్ దీవెనలే. ఇబ్రాహీమ్ ఆమెకు, "మీ ఆయనొస్తే ఆయనకు నా సలాం తెలియజేయి. ఆయనింటి ఈ గుమ్మాన్ని అలాగే ఉంచమని చెప్పు" అని హితోపదేశం చేసి వెళ్ళారు. ఇస్మాయిల్ వచ్చి, "మనింటికి ఎవరైనా వచ్చారా?" అని అడిగారు. అందుకామె ఇబ్రాహీమ్ అలైహిస్సలామ్ను పొగుడుతూ ఇలా చెప్పింది: అవునండి, రూపవంతుడైన ఒక పెద్దాయన వచ్చారు. ఆయన నన్ను మీ గురించి అడిగితే (మీరు వేటకు వెళ్ళారని) చెప్పాను. ఆయన మన జీవితం ఎలా నడుస్తుందని అడిగారు. అందుకు నేను మనం చాలా మంచి స్థితిలో ఉన్నామని చెప్పాను. "మరి ఆయన (చివర్లో) ఏమైనా ఉపదేశం చేసి వెళ్ళారా?" అని అడిగారు ఇస్మాయిల్. దానికి ఆయన భార్య, "అవునండీ! ఆయన మీకు సలాం చెప్పారు. అంతేకాదు మీ ఇంటి గుమ్మం మార్చవద్దని కూడా చెప్పి వెళ్ళారు" అని చెప్పింది. అప్పుడు ఇస్మాయిల్ ఇలా తెలియజేశారు: "ఆయన మా నాన్నగారు. గుమ్మం అంటే నువ్వు. నిన్ను నా దగ్గరే ఉంచుకోవాలని ఆయన నాకు హితోపదేశం చేసి వెళ్ళారు."
తర్వాత అల్లాహ్ తలచినంత కాలానికి ఇబ్రాహీమ్ మళ్ళీ (మక్కాకు) వచ్చారు. అప్పుడు ఇస్మాయిల్ జమ్జమ్ సమీపంలో ఒక చెట్టు క్రింద బాణం సరిచేసుకుంటున్నారు. ఇస్మాయిల్ ఆయన్ని చూడగానే లేచినిలబడ్డారు. ఆయన ముందుకు వెళ్ళారు. తర్వాత, ఒక తండ్రి తన సంతానం పట్ల చూపే వాత్సల్యం, సంతానం తండ్రి పట్ల కనబరచే గౌరవం- అక్కడ అవే జరిగాయి. తర్వాత ఇబ్రాహీమ్ తన కుమారునితో, "ఇస్మాయిల్! అల్లాహ్ నన్ను ఒక పని చేయమని ఆదేశించాడు" అని అన్నారు. దానికి ఇస్మాయిల్, "మీ ప్రభువు మీకు ఆదేశించిన పనిని మీరు తప్పకుండా చేయండి" అని అన్నారు. "నువ్వు నాకు సహాయం చేస్తావా?" అని ఇబ్రాహీమ్ అడిగారు. "నేను మీకు తప్పకుండా సహాయం చేస్తాను" అన్నారు ఇస్మాయిల్. అప్పుడు ఇబ్రాహీమ్ ఎత్తుగా ఉన్న ఒక ప్రదేశాన్ని చూపిస్తూ, "అల్లాహ్ నన్ను ఇక్కడ ఒక ఇల్లు నిర్మించమని ఆదేశించాడు" అన్నారు. అప్పుడే ఆ ప్రత్యేక గృహం యొక్క గోడల నిర్మాణం మొదలయ్యింది. ఇస్మాయిల్ రాళ్ళు ఎత్తుకొని తీసుకువచ్చేవారు. ఇబ్రాహీమ్ వాటితో గోడలు నిర్మించేవారు. గోడలు ఇంకా ఎత్తుగా నిర్మించవలసి వచ్చినప్పుడు (మఖామె ఇబ్రాహీమ్) రాయి తీసుకువచ్చి పెట్టారు. ఇబ్రాహీమ్ దాని మీద నించొని గోడలు నిర్మించసాగారు. ఇస్మాయిల్ ఆయనకు రాళ్లు అందజేసేవారు. ఆ సమయంలో వారిద్దరి నోళ్ళలోనూ ఇదే ప్రార్థన నానుతూ ఉంది: "ఓ మా ప్రభూ! మా ఈ కృషిని ఆమోదించు. నిశ్చయంగా నీవు అన్నీ వినేవాడవు. సర్వం తెలిసినవాడవు."
వేరొక ఉల్లేఖనంలో (ఈ సంఘటనలోని మొదటి భాగం) ఈ విధంగా ఉంది: ఇబ్రాహీమ్ ఇస్మాయిల్‌ను, ఆయన తల్లిని వెంట తీసుకొని బయలుదేరారు. వారి దగ్గర ఒక నీళ్ళతిత్తి ఉంది. ఇస్మాయిల్ తల్లి ఆ నీళ్లు త్రాగగానే ఆమె పాలిండ్లలో బాగా పాలు నిండేవి. ఆ విధంగా వారు మక్కా చేరుకున్నారు. ఇబ్రాహీమ్ వారిని ఒక పెద్ద చెట్టు క్రింద కూర్చోబెట్టి ఇంటికి తిరిగి వెళ్ళసాగారు. ఇస్మాయిల్ తల్లి కూడా ఆయన వెంట నడిచిరాసాగింది. 'కదా' ప్రాంతానికి చేరుకున్న తర్వాత హాజిరా ఆయన్ని పిలిచి, "ఇబ్రాహీమ్! మమ్మల్ని ఎవరికి అప్పగించి వెళ్తున్నారు మీరు?" అని అడిగారు. "అల్లాహ్‌కు"- ముక్తసరిగా సమాధానమిచ్చారు ఇబ్రాహీమ్. ఆ మాట వినగానే ఇస్మాయిల్ తల్లి, "మీరు నన్ను అల్లాహ్‌కు అప్పగించటం నాకిష్టమే" అని చెప్పి తిరిగి వెళ్ళిపోయింది. నీళ్లతిత్తిలోని నీళ్లు త్రాగుతూ గడపసాగింది. దాంతో పిల్లవాడి కోసం ఆమె పాలిండ్లలో పాలు తయారయ్యేవి. చివరికి ఆ నీరంతా అయిపోయింది. అప్పుడామె (మనసులో) "(అటు ఇటూ) వెళ్ళి ఎవరైనా మనుషులు కనిపిస్తారేమో చూస్తాను" అని అనుకుంది. అలా అనుకొని ఆమె సఫా కొండపైకెక్కి బాగా పరికించి చూసింది. కాని ఎవరూ కనిపించలేదు. (తర్వాత క్రిందికి దిగి) మళ్ళీ పరుగెత్తుకుంటూ వెళ్ళి మర్వా కొండపైకెక్కింది. ఈ విధంగా (రెండు కొండల మధ్య) అనేకసార్లు తిరిగింది. తర్వాత (మనసులో) "వెళ్ళి పిల్లవాడు ఎలా ఉన్నాడో చూసి వస్తాను" అని అనుకొని పిల్లవాడి దగ్గరికి వెళ్ళి చూస్తే పిల్లవాడు అలాగే జీవితపు చివరి శ్వాసలు తీసుకుంటున్నాడు. అది చూసి ఆమె మనసు మరింత కకావికలమైంది. ఇంకోసారి వెళ్ళి చూస్తే ఎవరైనా కనిపిస్తారేమో అని అనుకుంది. తిరిగివెళ్ళి సఫా కొండపైకెక్కి బాగా కలియ జూసింది. కాని ఎవరూ కాన రాలేదు. ఆ విధంగా పూర్తిగా ఏడుసార్లు (సఫా – మర్వా కొండల మధ్య) తిరిగింది. తర్వాత పిల్లవాడు ఎలా ఉన్నాడో చూసి వద్దామని వెళ్ళింది. అక్కడికి వెళ్ళగానే ఆమెకు ఏవో మాటలు వినిపించాయి. అందుకామె, "నీలో మంచితనం ఉంటే మాకు సహాయపడు" అని అన్నారు. అంతలోనే అక్కడ జిబ్రయీల్ అలైహిస్సలామ్ ప్రత్యక్ష మయ్యారు. ఆయన తన కాలు నేలమీద కొట్టారు. దాంతో నేల నుంచి నీటి ఊట చిమ్మింది. అది చూసి ఇస్మాయిల్ తల్లి ఆశ్చర్యపోయింది. దోసిళ్లతో నీళ్లు సమీకరించుకొని నీళ్లతిత్తిలో పోసుకోసాగింది. (తర్వాత ఉల్లేఖకుడు హదీసు మొత్తం వివరంగా చెప్పారు. ఈ ఉల్లేఖనాలన్నీ కూడా ఇమామ్ బుఖారీ వివరించారు.)
'దౌహ్' అంటే పెద్ద చెట్టు అని అర్థం. 'ఖఫియ' అంటే వెనక్కి తిరిగి వెళ్ళటం. 'జరీ' అంటే రాయబారి. 'అల్ఫా' అంటే పొందటం. 'యన్షగు' అంటే శ్వాస కొట్టుమిట్టాడటం. జీవితపు అంతిమ దశలో జరిగినట్టు, (అయితే కొందరు దీనిని సొమ్మసిల్లిపోవటమని కూడా అనువదించారు.)
(సహీహ్ బుఖారీలోని దైవప్రవక్తల ప్రకరణం)
English
Ibn `Abbas (radiyallahu anhuma) reported: Ibrahim (sallallaahu alayhi wa sallam) brought his wife and her son Isma`il (sallallaahu alayhi wa sallam), while she was suckling him, to a place near the Ka`bah under a tree on the spot of Zamzam, at the highest place in the mosque. In those days, there was no human being in Makkah, nor was there any water. So he made them sit over there and placed near them a leather bag containing some dates, and a small water-skin containing some water, and set out homeward. Isma`il’s mother followed him saying: “O Ibrahim! Where are you going, leaving us in this valley where there is no person whose company we may enjoy, nor is there anything (to enjoy)?” She repeated that to him many times, but he did not look back at her. Then she asked him: “Has Allah commanded you to do so?” He said: “Yes.” She said: “Then He will not neglect us.” She returned while Ibrahim proceeded onwards. Having reached the Thaniya, where they could not see him, he faced Ka`bah, raised his both hands and supplicated: “O our Rubb! I have made some of my offspring to dwell in an uncultivable valley by Your Sacred House (the Ka`bah at Makkah) in order, O our Rubb, that they may perform As-Salat (Iqamat-as-Salat). So fill some hearts among men with love towards them, and (O Allah) provide them with fruits so that they may give thanks.” (14:37).
Isma`il’s mother went on suckling Isma`il and drinking from the water which she had. When the water in the water-skin had all been used up, she became thirsty and her child also became thirsty. She started looking at Isma`il, tossing in agony. She left him, for she could not endure looking at him, and found that the mountain of As-Safa was the nearest mountain to her on that land. She stood on it and started looking at the valley keenly so that she might see somebody, but she could not see anybody. Then she descended from As-Safa, and when she reached the valley, she tucked up her robe and ran in the valley like a person in distress and trouble till she crossed the valley and reached Al-Marwah mountain where she stood and started looking, expecting to see somebody, but she could not see anybody. She repeated that (running between As-Safa and Al-Marwah) seven times.” Ibn `Abbas further related: The Prophet (sallallaahu alayhi wa sallam) said, “This is the source of the tradition of the Sa`y – i.e., the going of people between the two mountains. When she reached Al-Marwah (for the last time), she heard a voice and she exclaimed: `Shshs!’ (Silencing herself) and listened attentively. She heard the voice again and said: `O (whoever you may be) You have made me hear your voice; have you any succour for me?’ And behold! She saw an angel at the place of Zamzam, digging the earth with his heel (or with his wing), till water flowed out from that place. She started to make something like of a basin around it, using her hands in this way and began to fill her water-skin with water with her hands, and the water was flowing out until she had scooped some of it.” The Prophet (sallallaahu alayhi wa sallam) further said, “May Allah bestow mercy on Isma’il’s mother! Had she let the Zamzam flow without trying to control it (or had she not scooped in that water) while filling her water-skin, Zamzam would have been a stream flowing on the surface of the earth.” The Prophet (sallallaahu alayhi wa sallam) further added, “Then she drank (water) and suckled her child. The angel said to her: `Do not be afraid of being neglected, for this is the site on which the House of Allah will be built by this boy and his father, and Allah will never let neglected His people.’ The House of Allah (the Ka`bah) at that time was on a high place resembling a hillock, and when torrents came, they flowed to its right and left. She continued living in that way till some people from the tribe of Jurhum passed by her and her child. As they were coming from through the way of Kada`, in the lower part of Makkah where they saw a bird that had a habit of flying around water and not leaving it. They said: `This bird must be flying over water, though we know that there is no water in this valley.’ They sent one or two messengers who discovered the source of water, and returned to inform them of the water. So, they all came towards the water.” The Prophet (sallallaahu alayhi wa sallam) added, “Isma`il’s mother was sitting near the water. They asked her: `Do you allow us to stay with you?’ She replied: `Yes, but you will have no right to possess the water.’ They agreed to that.” The Prophet (sallallaahu alayhi wa sallam) further said, “Isma`il’s mother was pleased with the whole situation as she used to love the company of the people. So, they settled there, and later on they sent for their families who came and settled with them. The child (i.e., Isma`il) grew up and learnt Arabic from them (his virtues) caused them to love and admire him as he grew up, and when he reached the age of puberty, they gave him one of their daughters in marriage. After Isma`il’s mother had died, Ibrahim came after Isma`il’s marriage in order to see his family that he had left before, but he did not find Isma`il there. When he asked Isma`il’s wife about him, she replied: `He has gone in search of our livelihood.’ Then he asked her about their way of living and their condition, and she replied complaining to him: `We are living in hardship, misery and destitution.’ He said: `When your husband returns, convey my salutations to him and tell him to change the threshold of the door of his house.’ When Isma`il came, he seemed to have perceived something unusual. He asked his wife: `Did anyone visit you?’ She replied: `Yes, an old man of such and such description came and asked me about you and I informed him, and he asked about our state of living, and, I told him that we were living in hardship and poverty.’ Thereupon Isma`il said: `Did he advise you anything?’ She replied: `Yes, he told me to convey his salutations to you and to change the threshold of your door.’ Isma`il said: `That was my father, and he has ordered me to divorce you. Go back to your family.’ So Isma`il divorced her and married another woman from amongst them (Jurhum). Then Ibrahim stayed away from them for a period as long as Allah wished, and called on them again but did not find Isma`il. So he came to Isma`il’s wife and asked her about him. She said: `He has gone in search of our livelihood.’ Ibrahim asked her about their sustenance and living: `How are you getting on?’ She replied: `We are prosperous and well off.’ Then she praised Allah, the Exalted. Ibrahim asked: `What kind of food do you eat?’ She said: `Meat.’ He said: `What do you drink?’ She said: `Water.’ He said, `O Allah! Bless their meat and water!”’ The Prophet (sallallaahu alayhi wa sallam) added, “At that time they did not have grain, and if they had grain, he would have also invoked Allah to bless it.” The Prophet (sallallaahu alayhi wa sallam) further said, “If somebody has only these two things as his sustenance, his health and disposition will be badly affected because these things do not suit him unless he lives in Makkah.” The Prophet (sallallaahu alayhi wa sallam) added, “Then Ibrahim said to Isma`il’s wife, `When your husband comes, give my regards to him and tell him that he should keep firm the threshold of his door.’ When Isma`il came back, he asked his wife: `Did anyone call on you?’ She replied: `Yes, a good looking old man came to me.’ She praised him and added: `He asked about you, and I informed him, and he asked about our livelihood and I told him that we were in good condition.’ Isma`il asked her: `Did he give you a piece of advice?’ She said: `Yes, he told me to convey his regards to you and ordered that you should keep firm the threshold of your door.’ On that Isma`il said: `He was my father and you are the threshold of the door. He has ordered me to keep you with me.’ Then Ibrahim stayed away from them for a period as long as Allah wished and called on them afterwards. He saw Isma`il under a tree near Zamzam, sharpening his arrows. When he saw Ibrahim, he rose up to welcome him, and they greeted each other as a father does with his son or a son does with his father. Ibrahim said: `O Isma`il! Allah has given me an order.’ Isma`il said: `Do what your Rubb has commanded you to do.’ Ibrahim asked: `Will you help me?’ Isma`il said: `I will help you.’ Ibrahim said: `Allah has ordered me to build a house here, pointing to a hillock higher than the land surrounding it.”’ The Messenger of Allah (sallallaahu alayhi wa sallam) added, “Then they raised the foundations of the House (i.e., Ka`bah). Isma`il brought the stones and Ibrahim was building (the house). When the walls became high, Isma`il brought stone and placed it for Ibrahim who stood over it and carried on building the House, while Isma`il was handing over the stones to him, both of them prayed: `O our Rubb! Accept this service from us! Verily, You are the All-Hearer and the All-Knower.”’[Al-Bukhari].
There are some more narrations about this incident, some adding details and some with minor variations in the wordings.
ముఖ్యాంశాలు
1) ఈ హదీసులో సఫా-మర్వా కొండల మధ్య పరుగెత్తటానికి గల చారిత్రక నేపథ్యం వివరించబడింది. అల్లాహ్ హాజిరా గారి జ్ఞాపకార్ధం హజ్, ఉమ్రాల్లో ఈ 'సయీ' (పరుగెత్తటా)న్ని ప్రధానాంశంగా నిర్ణయించాడు. ఆ విషయమే ఈ హదీసులో వివరించబడింది. ఆమె కేవలం దైవప్రసన్నత కోసం తన భర్త ఆజ్ఞ మేరకు తన పసిపిల్లవాడితోపాటు తృణకాష్ట జలరహితమైన ప్రదేశంలో ఉండటానికి సిద్ధమయింది. దానికి అల్లాహ్ ఆమెకు గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదించాడు. ఆమె కోసం జమ్జమ్ ఊటను ఉబికించాడు. ఆ సమయంలో ఆ నీరే ఆమెకు జీవజలంగా పనికొచ్చింది. ఆ నీటి ద్వారా నేటికీ విశ్వజనావళి ప్రయోజనం పొందుతున్నది. అంతేకాదు, సఫా-మర్వాల మధ్య ప్రాణభయంతో పరుగెత్తిన ఆమె పరుగును అల్లాహ్ హజ్, ఉమ్రా యాత్రల్లో ఒక ప్రధానాంశంగా నిర్ణయించాడు. ప్రళయం వరకూ ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుంది.
2) కాబా గృహం ఇబ్రాహీమ్, ఇస్మాయిల్‌ల చేత నిర్మించబడింది.
3) సర్వకాల సర్వావస్థల్లో అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండటం చాలా మంచి విషయం. దీనికి విరుద్ధమైన ఆచరణ అత్యంత గర్హనీయం.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1869
హదీసు 1870
وعنْ سعِيدِ بْنِ زيْدٍ رضِي اللَّه عنْهُ قَال: سمِعتُ رَسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقُولُ:"الْكَمأَةُ مِنَ المنِّ، وماؤُهَا شِفَاءٌ للْعَينِ" متفقٌ عليه.
దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ సయీద్ బిన్ జైద్ (రదియల్లాహు అన్హు) తెలిపారు: పుట్టగొడుగులు మన్న్ కోవకు చెందినవి. దాని రసం కళ్ళకు చికిత్సగా ఉపయోగపడుతుంది. (బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని వైద్య ప్రకరణం – సహీహ్ ముస్లింలోని పానీయాల ప్రకరణం)
English
Sa`id bin Zaid (radiyallahu anhu) reported: I heard the Messenger of Allah (sallallaahu alayhi wa sallam) saying, “Truffle (edible fungus) is a species of Al-Manna and their water cures eye diseases.”[Al-Bukhari and Muslim]
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|పలు విషయాల ప్రకరణం|370. ప్రళయ చిహ్నాల ప్రకరణం|హదీసు 1870
You must be logged in to post a comment.