హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 368వ అధ్యాయం: దేవుడు, దైవ ప్రవక్త ﷺ వారించిన విషయాల జోలికి పోరాదని హెచ్చరిక. ఈ అధ్యాయంలో 4 ఖుర్ఆన్ ఆయతులు, 1 హదీసులు (హదీసు 1808) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
368. దేవుడు, దైవ ప్రవక్త ﷺ వారించిన విషయాల జోలికి పోరాదని హెచ్చరిక
باب التحذير من ارتكاب ما نهى الله عزَّ وجلَّ أَو رسوله صلى الله عليه وسلم عنه
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్యఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{فَلْيَحْذَرِ الَّذِينَ يُخَالِفُونَ عَنْ أَمْرِهِ أَنْ تُصِيبَهُمْ فِتْنَةٌ أَوْ يُصِيبَهُمْ عَذَابٌ أَلِيمٌ} [النور: ٦٣]
"దైవప్రవక్త ﷺ ఆజ్ఞను ఉల్లంఘించేవారు తాము ఏదైనా ఉపద్రవంలో చిక్కుకుపోతామేమో అనీ, తమపై బాధాకరమైన శిక్ష ఏదైనా అవతరిస్తుందేమో అని భయపడాలి." (నూర్: 63)
{وَيُحَذِّرُكُمُ اللَّهُ نَفْسَهُ} [آل عمران:٢٨]
"అల్లాహ్ తనకు భయపడండి అని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు." (ఆలి ఇమ్రాన్:30)
{إِنَّ بَطْشَ رَبِّكَ لَشَدِيدٌ} [البروج: ١٢]
"నిశ్చయంగా నీ ప్రభువు పట్టు బహు గట్టిది." (బురూజ్: 12)
{وَكَذَلِكَ أَخْذُ رَبِّكَ إِذَا أَخَذَ الْقُرَى وَهِيَ ظَالِمَةٌ إِنَّ أَخْذَهُ أَلِيمٌ شَدِيدٌ} [هود: ١٠٢]
"నీ ప్రభువు ఒక దుర్మార్గపు నగరాన్ని శిక్షించదలిస్తే ఆయన శిక్ష ఇలాగే ఉంటుంది. నిజంగానే ఆయన శిక్ష బహుకఠినమైనది, బహు బాధాకరమైనది." (హూద్: 102)
English
“And let those who oppose the Messenger’s commandment (i.e., his Sunnah legal ways, orders, acts of worship, statements) (among the sects) beware, lest some Fitnah (disbelief, trials, afflictions, earthquakes, killing, overpowered by a tyrant) should befall them or a painful torment be inflicted on them.” [An-Nūr 24:63]
“And Allah warns you against Himself (His punishment).” [Āl ‘Imrān 3:30]
“Verily, (O Muhammad ﷺ) the Grip (punishment) of your Rubb is severe.” [Al-Burūj 85:12]
“Such is the Seizure of your Rubb when He seizes the (population of) towns while they are doing wrong. Verily, His Seizure is painful and severe.” [Hūd 11:102]
హదీసు 1808
وَعَنْ أبي هُرَيْرَةَ رضي اللَّه عَنْهُ أنَّ النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إنَّ اللَّه تَعَالى يَغَارُ، وَغَيْرَةُ اللَّهِ أنْ يَأْتيَ المَرْءُ مَا حَرَّمَ اللَّه عَليهِ" متفقٌ عليه.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: దేవునికి (కూడా) రోషం వస్తుంది. మనిషి దేవుడు నిషేధించిన కార్యాలకు పాల్పడినప్పుడు ఆయనకు రోషం వస్తుంది. (బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని నికాహ్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని తౌబా ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) said: The Prophet ﷺ said, “Allah, the Exalted, becomes angry, and His Anger is provoked when a person does what Allah has declared unlawful.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
దేవునికి రోషం రావటమంటే ఆగ్రహం రావటం అని భావం. చెడులు, అశ్లీల పనులు మొదలగు వాటిని దేవుడు నిషేధించాడు. దాసులు వాటికి పాల్పడితే ఆయనకు ఆగ్రహం వస్తుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|368. దేవుడు, దైవ ప్రవక్త ﷺ వారించిన విషయాల జోలికి పోరాదని హెచ్చరిక|హదీసు 1808
You must be logged in to post a comment.