హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 367. వంశాన్ని, యజమాని సంబంధాన్ని మార్చి చెప్పుకోవటం నిషిద్ధం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 367వ అధ్యాయం: తన రక్త సంబంధాన్ని, తన బానిసత్వ సంబంధాన్ని వక్రీకరించుకోవటం నిషిద్ధం. ఈ అధ్యాయంలో 4 హదీసులు (హదీసు 1804 – 1807) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

367. తన రక్త సంబంధాన్ని, తన బానిసత్వ సంబంధాన్ని వక్రీకరించుకోవటం నిషిద్ధం

↑ విషయ సూచిక

باب تحريم انتساب الإِنسان إِلَى غير أَبيه وَتَولِّيه إِلَى غير مَواليه

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

1804

హదీసు 1804

عَنْ سَعْدِ بن أَبي وقَّاصٍ رضي اللَّه عَنْهُ أنَّ النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ: مَن ادَّعَى إِلَى غَيْرِ أبِيهِ وَهُوَ يَعْلَمُ أنَّهُ غَيْرُ أبِيهِ فَالجَنَّةُ عَلَيهِ حَرامٌ". متفقٌ عليهِ.

హజ్రత్ సాద్ బిన్ అబూ వఖ్ఖాస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఒక వ్యక్తి తన తండ్రి కాని వాణ్ణి – అతను తన తండ్రి కాడని తెలిసి ఉన్నప్పటికీ- తన కన్నతండ్రిగా సూచించుకుంటే అతనికి స్వర్గం నిషిద్ధం అవుతుంది.

(బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని ఫరాయెజ్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఈమాన్ ప్రకరణం)

English

Sa`d bin Abu Waqqas (radiyallahu anhu) said: The Prophet ﷺ said, “He who (falsely) attributes his fatherhood to anyone besides his real father, knowing that he is not his father, will be forbidden to enter Jannah.”[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|367. తన రక్త సంబంధాన్ని, తన బానిసత్వ సంబంధాన్ని వక్రీకరించుకోవటం నిషిద్ధం|హదీసు 1804

1805

హదీసు 1805

وعن أبي هُريْرَة رضي اللَّه عنْهُ عَن النَّبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "لاَ تَرْغَبُوا عَنْ آبَائِكُمْ، فَمَنْ رَغِبَ عَنْ أبيهِ فَهُوَ كُفْرٌ" متفقٌ عليه.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: కన్న తండ్రిని తండ్రిగా అంగీకరించకపోవటం కుఫ్ర్ (సత్యతిరస్కారం) అవుతుంది. కనుక మీరు మీ తాతముత్తాతలకు విముఖులయిపోకండి.

(బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని ఫరాయెజ్ ప్రకరణం -సహీహ్ ముస్లింలోని ఈమాన్ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) said: The Prophet ﷺ said, “Do not turn away from your fathers, for he who turns away from his father, will be guilty of committing an act of disbelief.”[Al-Bukhari and Muslim]

ముఖ్యాంశాలు

పై రెండు హదీసుల భావం ఒక్కటే. ఉద్దేశ్యపూర్వకంగా తన తండ్రి గురించి చెప్పకుండా వేరొకర్ని తన కన్నవారుగా చెప్పుకోవటం. ఇలా చేయటం అక్రమం అని తెలిసి కూడా ఎవడైనా ఈ దైవాజ్ఞను అబద్ధంగా కొట్టిపారేస్తే అతను కాఫిర్ (దైవతిరస్కారి) అవుతాడు. మరెవడైనా అలా చేయటం హరామ్ అని భావిస్తూనే ప్రాపంచికపరమైన లాభాల కోసమో, ఇతరుల సిరిసంపదల మీద ఆశతోనో అలా చెబుతున్నట్లయితే అప్పుడు కూడా అది ఘోరపాపం (గునాహె కబీరా) గానే భావించబడుతుంది. దీనికి ఒడిగట్టినవాడు తన పాపానికి నరకంలో శిక్ష అనుభవించిన తర్వాతగాని స్వర్గభాగ్యాలకు నోచుకోడు. రక్తసంబంధాల పరిరక్షణ నిమిత్తం ఇటువంటి అక్రమ పద్ధతులను ఘోరమైన పాపాలుగా పేర్కొనటం జరిగింది. రక్త సంబంధ హక్కులకు ఇస్లాంలో ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఆ సంబంధాలను గనక పరిరక్షించకపోతే హక్కుల అపహరణ మొదలవుతుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|367. తన రక్త సంబంధాన్ని, తన బానిసత్వ సంబంధాన్ని వక్రీకరించుకోవటం నిషిద్ధం|హదీసు 1805

1806

హదీసు 1806

وَعَنْ يزيدَ شريكِ بن طارقٍ قالَ: رَأَيْتُ عَلِيًّا رضي اللَّه عَنْهُ عَلى المِنْبَرِ يَخْطُبُ، فَسَمِعْتهُ يَقُولُ: لاَ واللَّهِ مَا عِنْدَنَا مِنْ كِتَابٍ نَقْرؤهُ إلاَّ كِتَابَ اللَّه، وَمَا في هذِهِ الصَّحِيفَةِ، فَنَشَرَهَا فَإذا فِيهَا أسْنَانُ الإبلِ، وَأَشْيَاءُ مِنَ الجِرَاحاتِ، وَفيهَا: قَالَ رَسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: المدِينَةُ حَرَمٌ مَا بَيْنَ عَيْرٍ إِلَى ثَوْرٍ، فَمَنْ أحْدَثَ فيهَا حَدَثاً، أوْ آوَى مُحْدِثاً، فَعَلَيْهِ لَعْنَةُ اللَّهِ والمَلائِكَة وَالنَّاسِ أجْمَعِينَ، لا يَقْبَلُ اللَّه مِنْهُ يَوْمَ الْقِيَامَة صَرْفاً وَلا عَدْلاً، ذِمَّةُ المُسْلِمِينَ وَاحِدَةٌ، يَسْعَى بِهَا أدْنَاهُمْ، فَمَنْ أخْفَرَ مُسْلِماً، فَعلَيْهِ لَعْنَةُ اللَّه والمَلائِكَةِ وَالنَّاسِ أجْمَعِينَ، لا يَقْبَلُ اللَّه مِنْهُ يَوْم الْقِيامَةِ صَرفاً وَلاَ عدْلاً. وَمَنِ ادَّعَى إِلَى غَيْرِ أبيهِ، أَوْ انتَمَى إِلَى غَيْرِ مَوَاليهِ، فَعلَيْهِ لَعْنَةُ اللَّه وَالملائِكَةِ وًَالنَّاسِ أجْمَعِينَ، لا يقْبَلُ اللَّه مِنْهُ يَوْمَ الْقِيَامةِ صَرْفاً وَلا عَدْلاً". متفقٌ عليه. "ذِمَّةُ المُسْلِمِينَ"أيْ: عَهْدُهُمْ وأمانتُهُم."وَأخْفَرَهُ": نَقَضَ عَهْدَهُ."والصَّرفُ": التَّوْبَةُ، وَقِيلَ: الحِيلَةُ."وَالْعَدْلُ": الفِدَاءُ.

హజ్రత్ యజీద్ బిన్ షరీక్ బిన్ తారిఖ్ (రదియల్లాహు అన్హు) కథనం: హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) వేదికమీద నించొని ఉపన్యాసం ఇస్తూ ఇలా అంటుండగా నేను చూశాను: దైవం సాక్షి! ఈ గ్రంథం మరియు ఈ ప్రతిలో ఉన్న ఆదేశాలు తప్ప మా దగ్గర మరే పఠన గ్రంథమూ లేదు. ఆ మాట చెప్పి ఆయన ఆ ప్రతిని తెరిచి చూపించారు. అందులో (రక్తపరిహారానికి చెల్లించవలసిన) ఒంటెల వయస్సులు, గాయాలకు (చెల్లించవలసిన నష్టపరిహార) ఆదేశాలు కొన్ని రాయబడి ఉన్నాయి. అందులోనే దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారని ఉంది: మదీనా నగరం ఐర్ నుంచి సౌర్ వరకు పవిత్ర (నిషిద్ధ) ప్రాంతం. ఇక్కడ ఎవరైనా బిద్‌అత్‌లు సృష్టిస్తే లేక బిద్‌అత్‌లు సృష్టించేవాడికి ఆశ్రయం కల్పిస్తే అతనిమీద దేవుని శాపం, దైవదూతల మరియు ప్రజలందరి శాపం పడుతుంది. ప్రళయదినాన దేవుడు అతని ఏ ఫర్జ్ ఆరాధననూ, మరే నఫిల్ ఆరాధననూ అంగీకరించడు. ముస్లింలందరి ప్రమాణం ఒక్కటే. వారిలోని అత్యంత అల్పుడు సైతం దానికోసం కృషిచేయగలడు. ఎవరైనా ఒక ముస్లిం ప్రమాణాన్ని భగ్నం చేస్తే అతని మీద దేవుని, దైవదూతల మరియు ప్రజలందరి శాపం పడుతుంది. ప్రళయదినాన దేవుడు ఏ ఫర్జ్ ఆరాధననూ, మరే నఫిల్ ఆరాధననూ అంగీకరించడు. ఎవరైనా తన కన్న తండ్రిని కాదని వేరొకణ్ణి తన తండ్రిగా తలచుకుంటే లేక తన యజమానిని కాదని వేరొకర్ని తన యజమానిగా సూచించుకుంటే అతని మీద దేవుని, దైవదూతల మరియు ప్రజలందరి శాపం పడుతుంది. ప్రళయదినాన దేవుడు అతని ఏ ఫర్జ్ ఆరాధననూ, మరే నఫిల్ ఆరాధననూ ఆమోదించడు.

(బుఖారీ-ముస్లిం)

"జిమ్మతుల్ ముస్లిమీన్" అంటే ముస్లింల ప్రమాణం, ముస్లింలు ఎవరికైనా రక్షణ కల్పించటం అని అర్థం. అఖ్ ఫరహూ అంటే, "అతను ఆ ప్రమా ణాన్ని భగ్నం చేస్తే" అని అర్థం. 'సర్‌ఫున్' అంటే పశ్చాత్తాపం, 'అద్‌లున్' అంటే పరిహారం అని భావం.

(సహీహ్ బుఖారీలోని ఫరాయెజ్ ప్రకరణం -సహీహ్ ముస్లింలోని ఇత్‌ఖ్ ప్రకరణం)

English

Yazid bin Sharik bin Tariq (radiyallahu anhu) said: I saw `Ali (radiyallahu anhu) giving a Khutbah (sermon) from the pulpit and I heard him saying: “By Allah, we have no book to read except Allah’s Book and what is written in this scroll. He unrolled the scroll which showed a list of what sort of camels to be given as blood-money, and other legal matters relating to killing game in the sanctuary of Makkah and the expiation thereof. In it was also written: The Messenger of Allah ﷺ said: `Al-Madinah is a sanctuary from `Air to Thaur (mountains). He who innovates in this territory new ideas in Islam, commits a sin therein, or shelters the innovators, will incur the Curse of Allah, the angels, and all the people, and Allah will accept from him neither repentance nor a ransom on the Day of Resurrection. The asylum (pledge of protection) granted by any Muslim (even of the) lowest status is to be honoured and respected by all other Muslims, and whoever betrays a Muslim in this respect (by violating the pledge) will incur the Curse of Allah, the angels, and all the people; and Allah will accept from him neither repentance nor a ransom on the Day of Resurrection. Whoever attributes his fatherhood to someone other than his (real) father, and takes someone else as his master other than his (real) master without his permission, will incur the Curse of Allah, the angels and all the people, and Allah will accept from him neither repentance nor a ransom on the Day of Resurrection.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

పై హదీసు మూలంలో 'ఐర్' మరియు 'సౌర్' అనే రెండు పదాలు ఉపయోగించబడ్డాయి. ఇవి మదీనా నగరంలోని రెండు కొండల పేర్లు. ఈ రెండు కొండల మధ్యగల ప్రాంతం 'హరమ్' (నిషిద్ధ) ప్రాంతంగా ఖరారు చేయబడింది. కనుక మక్కా హరమ్ ప్రాంతంలో మాదిరిగానే ఇక్కడ కూడా జంతువులను వేటాడటం, చెట్లు నరకటం ధర్మసమ్మతం కాదు. అలాగే అవిశ్వాసులు, ముష్రిక్కులు ఈ ప్రాంతంలో అడుగుపెట్టటానికి కూడా అనుమతి ఉండదు.

హదీసు మూలంలో 'సర్‌ఫున్', 'అద్‌లున్' అనే మరో రెండు పదాలు వాడబడ్డాయి. పండితులు ఈ పదాలకు ఎన్నో అర్థాలు చెప్పారు. వాటిలో అన్నిటికంటే బాగా ప్రచారం పొందిన అర్థాలనే మేము తర్జుమాలో తీసుకున్నాం. అవి: సర్‌ఫున్, అంటే విధిగా నిర్ణయించబడిన ఆరాధనలు. అద్‌లున్ అంటే నఫిల్ ఆరాధనలు. ఆ తర్వాత బాగా ప్రచారంలో ఉన్న అర్థాలు గ్రంథకర్త ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) హదీసు చివర్లో పేర్కొన్నవి. 'సర్‌ఫున్' అంటే పశ్చాత్తాపం, 'అద్‌లున్' అంటే పరిహారం. ప్రళయదినాన అలాంటి పాపాత్ముల పశ్చాత్తాపమూ ఆమోదించబడదు. వారి నుండి ఎలాంటి పరిహారమూ స్వీకరించబడదన్న మాట!

దీని ద్వారా పై హదీసులో పేర్కొనబడిన మూడు కార్యాలూ ఎంతటి ఘోరమైన పాపాలో బోధపడుతోంది. దైవప్రవక్త ﷺ హజ్రత్ అలీగారికి ఏవో కొన్ని ప్రత్యేక ఆదేశాలిచ్చారనీ, ఆ ఆదేశాలు ఆయనకు తప్ప మరెవ్వరికీ ఇవ్వలేదని నేడు కొంతమంది చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం సత్యం లేదన్న విషయం కూడా ఈ హదీసు ద్వారా మనకు బోధపడుతోంది. సూఫీ, షియా వర్గాల్లో మనకు ఇటువంటి వాదనలు వినపడ్తుంటాయి. ఇవన్నీ ప్రజలు కల్పించుకున్న మాటలే గాని వీటిలో రవ్వంత కూడా సత్యం లేదు. దైవప్రవక్త బోధనలు సార్వజనీనమై ఉంటాయి. తన ఆదేశాలను, బోధనలను కొందరికి మాత్రమే పరిమితం చేయటం దైవప్రవక్త ఔన్నత్యానికే విరుద్ధం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|367. తన రక్త సంబంధాన్ని, తన బానిసత్వ సంబంధాన్ని వక్రీకరించుకోవటం నిషిద్ధం|హదీసు 1806

1807

హదీసు 1807

وَعَنْ أَبي ذَرٍّ رضي اللَّه عَنْهُ أنَّهُ سَمِعَ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَقُولُ: "لَيْسَ منْ رَجُلٍ ادَّعَى لِغَيْر أبيهِ وَهُوًَ يَعْلَمُهُ إلاَّ كَفَرَ، وَمَنِ ادَّعَى مَا لَيْسَ لهُ، فَلَيْسَ مِنَّا، وَليَتَبوَّأُ مَقْعَدَهُ مِنًَ النَّار، وَمَنْ دَعَا رَجُلاً بِالْكُفْرِ، أوْ قالَ: عدُوَّ اللَّه، وَلَيْسَ كَذلكَ إلاَّ حَارَ عَلَيْهِ" متفقٌ عليهِ، وَهَذَا لفْظُ روايةِ مُسْلِمِ.

దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నట్లు హజ్రత్ అబూ జర్ర్ (రదియల్లాహు అన్హు) వివరించారు: ఉద్దేశ్యపూర్వకంగా తన తండ్రిని కాదని వేరొకర్ని తన తండ్రిగా సూచించుకున్నవాడు కుఫ్ర్‌కు (సత్య తిరస్కారానికి) ఒడిగట్టినట్లే. తనది కాని వస్తువుని తనదని దావా వేసేవాడు మాలోని వాడుకాడు. అతను నరకంలో తన నివాసం ఏర్పాటు చేసుకోవాలి. ఎవరైనా మరో వ్యక్తిని దైవతిరస్కారి (కాఫిర్) అనో లేక 'ఓ దైవవిరోధి!' అనో పిలిస్తే ఎదుటి వ్యక్తి అలాంటివాడు కాని పక్షంలో ఆ నింద అతని మీదే పడుతుంది. (బుఖారీ-ముస్లిం)

ఈ వ్యాక్యాలు ముస్లింలోనివి.

(సహీహ్ బుఖారీలోని మనాఖిబ్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఈమాన్ ప్రకరణం)

English

Abu Dharr (radiyallahu anhu) reported: I heard the Messenger of Allah ﷺ saying: “A person who attributes his fatherhood to anyone other than his real father, knowing that he is not his father, commits an act of disbelief. And he who makes a claim of anything which in fact does not belong to him, is none of us. He should make his abode in Hell, and he who labels anyone as disbeliever or calls him the enemy of Allah and he is in fact not so, his charge will revert to him.”[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|367. తన రక్త సంబంధాన్ని, తన బానిసత్వ సంబంధాన్ని వక్రీకరించుకోవటం నిషిద్ధం|హదీసు 1807