హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 35వ అధ్యాయం: భర్త హక్కులు. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 8 హదీసులు (హదీసు 283 – 290) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
35. భర్త హక్కులు
باب حق الزوج عَلَى المرأة
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ సెలవిచ్చాడు :
{الرِّجَالُ قَوَّامُونَ عَلَى النِّسَاءِ بِمَا فَضَّلَ اللَّهُ بَعْضَهُمْ عَلَى بَعْضٍ وَبِمَا أَنْفَقُوا مِنْ أَمْوَالِهِمْ فَالصَّالِحَاتُ قَانِتَاتٌ حَافِظَاتٌ لِلْغَيْبِ بِمَا حَفِظَ اللَّهُ} [النساء:٣٤]
"అల్లాహ్ స్త్రీ పురుషుల్లో ఒకరికి మరొకరిపై ఆధిక్యతను ప్రసాదించినందువల్ల, ఇంకా పురుషులు తమ సంపదను స్త్రీల కొరకు ఖర్చు చేస్తున్నందువల్ల పురుషులు స్త్రీలకు అధికారులు. కనుక సుగుణవతులైన స్త్రీలు విధేయత కలిగి ఉంటారు. పురుషులు లేనప్పుడు అల్లాహ్ రక్షణలో ఉంటూ వారి (భర్తల) హక్కులను కాపాడతారు. (అన్ నిసా : 35)
ఇంతకు ముందు అధ్యాయంలో వచ్చిన అమ్ర్ బిన్ అహ్వస్ (రదియల్లాహు అన్హు) హదీసు ఈ అధ్యాయానికి కూడా వర్తిస్తుంది.
English
“Men are the protectors and maintainers of women, because Allah has made one of them to excel the other, and because they spend (to support them) from their means. Therefore, the righteous women are devoutly obedient (to Allah and to their husbands), and guard in the husband’s absence what Allah orders them to guard (e.g., their chastity and their husband’s property).” [An-Nisā’ 4:34]
హదీసు 283
وعن أبي هريرةَ رضي اللَّه عنه قَالَ: قالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِذَا دعَا الرَّجُلُ امْرأَتَهُ إِلَى فِرَاشِهِ فلَمْ تَأْتِهِ فَبَات غَضْبانَ عَلَيْهَا لَعَنتهَا الملائكَةُ حَتَّى تُصْبحَ" متفقٌ عَلَيهِ. وفي رواية لهما: "إِذَا بَاتَتْ المَرْأَةُ هَاجِرَةً فِرَاشَ زَوْجهَا لَعنتْهَا المَلائِكَةُ حَتَّى تُصْبِحَ ". وفي روايةٍ قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "والَّذِي نَفْسِي بِيَدِهِ مَا مِن رَجُلٍ يَدْعُو امْرَأَتَهُ إِلَى فِرَاشِهِ فَتَأْبَى عَلَيْهِ إِلاَّ كَانَ الَّذي في السَّماءِ سَاخِطاً عَلَيْهَا حَتَّى يَرْضَى عَنْها".
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : భర్త తన భార్యను పడకమీదికి పిలిచినప్పుడు ఆమె (అకారణంగా) రాకపోతే, దానికిగాను భర్త ఆమెమీద అసంతృప్తితో ఉంటే తెల్లారే దాకా దైవదూతలు ఆమెను శపిస్తూ ఉంటారు. (బుఖారీ – ముస్లిం)
ఉభయులూ (బుఖారీ, ముస్లింలు) చేసిన వేరొక ఉల్లేఖనంలో "స్త్రీ తన భర్త (మీద కోపంతో) పడకనుంచి వేరయి రాత్రి గడిపితే, తెల్లారేవరకూ (అంటే ఆమె తిరిగి అతని దగ్గరికి రానంతవరకు) దైవదూతలు ఆమెను శపిస్తూ ఉంటారు" అని ఉంది.
వేరొక ఉల్లేఖనంలో దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు : నా ప్రాణాన్ని తన గుప్పెట్లో వుంచుకున్న వాని (ప్రభువు) సాక్షిగా చెబుతున్నాను! ఏ మగాడైనా తన భార్యను పడకమీదికి పిలిచినప్పుడు ఆమె నిరాకరిస్తే, తిరిగి భర్త ఆమె పట్ల ప్రసన్నుడు కానంతవరకూ నింగినున్నవాడు (అల్లాహ్) ఆ స్త్రీ పట్ల అప్రసన్నుడై ఉంటాడు.
(బుఖారీ – ముస్లింలలోని నికాహ్ ప్రకరణాలు)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “When a man calls his wife to his bed, and she does not respond and he (the husband) spends the night angry with her, the angels curse her until morning”.[Al-Bukhari and Muslim].
In another narration: The Messenger of Allah ﷺ said, “When a woman spends the night away from the bed of her husband, the angels curse her until morning”. [Al-Bukhari and Muslim].
In another narration: Messenger of Allah ﷺ said, “By Him in Whose Hand is my life, when a man calls his wife to his bed, and she does not respond, the One Who is above the heaven becomes displeased with her until he (her husband) becomes pleased with her”. [Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
స్త్రీకి తన భర్త ఆజ్ఞల్ని శిరసావహించటం విధి. కనుక తగిన కారణమేదీ లేకుండా భర్త ఆజ్ఞల్ని పాలించకపోతే ఆమె దైవాగ్రహానికి పాత్రురాలవుతుంది. భర్త తిరిగి ఆమె పట్ల ప్రసన్నుడు కానంతవరకూ దేవుడు కూడా ఆమె పట్ల ప్రసన్నుడు కాడు. తిరిగి తన భర్త దగ్గరికి వెళ్ళి క్షమాపణలు చెప్పుకోనంతవరకూ దైవదూతలు ఆమెను శపిస్తూ ఉంటారు. తమ మంకుతనం, మొండివైఖరితో భర్తల్ని సతాయించే స్త్రీలకు ఈ హదీసు కనువిప్పు కావాలి.
ఈ హదీసు ద్వారా దేవుడు ఆకాశాల్లో ఉన్నాడని తెలుస్తోంది. కాని కొందరు దేవుడు సర్వాంతర్యామి, ప్రతిచోటా ఉన్నాడు అని అంటుంటారు. నిజమే! విశ్వంలో దేవుడు లేని చోటంటూ లేదు. అయితే ఆయన తన అస్తిత్వపరంగా అన్నిచోట్లా ఉన్నాడా? అంటే కాదు, అస్తిత్వపరంగా ఆయన సప్తాకాశాలపైనే ఉన్నాడు. జ్ఞానపరంగా, అధికారపరంగా మాత్రం ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. సృష్టిలోని ప్రతి వస్తువుపై ఆయనకు తిరుగులేని అధికారముంది. విశ్వంలోని అణువణువునూ ఆయన జ్ఞానం పెనవేసుకుని ఉంది. సర్వాంతర్యామి అంటే అసలు అర్థం ఇది!
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|35. భర్త హక్కులు|హదీసు 283
హదీసు 284
وعن أَبي هريرة رضي اللَّه عنه أَيضاً أَن رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "لاَ يَحلُّ لامْرَأَةٍ أَنْ تَصُومَ وَزَوْجُهَا شَاهِدٌ إِلا بِإِذْنِهِ، وَلا تَأْذَنْ في بَيْتِهِ إِلاَّ بِإِذنِهِ" متفقٌ عَلَيهِ، وهذا لفظ البخاري.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : భర్త (ఇంట్లో) ఉన్నప్పుడు అతని అనుమతి లేనిదే భార్య (నఫిల్) ఉపవాసాలు పాటించ రాదు. అలాగే, భర్త అంగీకారం లేకుండా ఆమె ఇతరులెవరినీ ఇంట్లో రావటానికి అనుమతించరాదు. (బుఖారీ- ముస్లిం, వాక్యాలు మాత్రం బుఖారీవి)
(సహీహ్ బుఖారీలోని నికాహ్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “It is not lawful for a woman to observe (voluntary) fasting without the permission of her husband when he is at home; and she should not allow anyone to enter his house without his permission.”.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ఈ హదీసు ద్వారా బోధపడుతున్న ఒక ముఖ్య విషయం ఏమిటంటే, నఫిల్ (స్వచ్ఛంద) ఆరాధనవల్ల తోటి మనిషి హక్కుకు భంగం వాటిల్లే ప్రమాదముంటే అప్పుడు నఫిల్ ఆరాధనకన్నా మనిషి హక్కుకే ఎక్కువ ప్రాధాన్యత నివ్వాలి. అంటే నఫిల్ ఆరాధనను వదలిపెట్టి తోటి మానవుని హక్కుని రక్షించాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|35. భర్త హక్కులు|హదీసు 284
హదీసు 285
وعن ابن عمرَ رضي اللَّهُ عنهما عن النَّبي صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قال: "كُلُّكُمْ راعٍ، وكُلُّكُمْ مسئولٌ عنْ رعِيَّتِهِ، والأَمِيرُ رَاعٍ، والرَّجُلُ راعٍ علَى أَهْلِ بَيْتِهِ، والمرْأَةُ راعِيةٌ عَلَى بيْتِ زَوْجِها وولَدِهِ، فَكُلُّكُمْ راعٍ، وكُلُّكُمْ مسئولٌ عنْ رعِيَّتِهِ" متفقٌ عليه.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : మీలో ప్రతివాడూ బాధ్యతగల వ్యక్తే. మిమ్మల్నందరినీ తమ తమ బాధ్యతల నిర్వహణ గురించి (దేవుని సన్నిధిలో) ప్రశ్నించటం జరుగుతుంది. పాలకుడు (ప్రజా సంక్షేమానికి) బాధ్యుడు. మనిషి తన ఇంటివారి (సంరక్షణకు) బాధ్యుడు. అలాగే స్త్రీ (కూడా) తన భర్త ఇంటికి, అతని పిల్లల (ఆలనాపాలన)కు బాధ్యురాలు. కనుక మీలో ప్రతి ఒక్కరూ బాధ్యతల గల మనిషే. మిమ్మల్నందరినీ తమ తమ బాధ్యతల గురించి ప్రశ్నించటం జరుగుతుంది. (బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని నికాహ్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని నాయకత్వ ప్రకరణం)
English
Ibn `Umar (radiyallahu anhuma) reported: The Prophet ﷺ said, “All of you are guardians and are responsible for your subjects. The ruler is a guardian of his subjects, the man is a guardian of his family, the woman is a guardian and is responsible for her husband’s house and his offspring; and so all of you are guardians and are responsible for your subjects.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ప్రజలయినా, పాలకులయినా భర్త అయినా, భార్యఅయినా – సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ తమ కార్యరంగాలకు బాధ్యులని ఈ హదీసు చెబుతోంది. కనుక ప్రతివ్యక్తీ తన విధుల్ని, బాధ్యతల్ని సజావుగా నిర్వర్తించాలి. తన అధీనంలో ఉన్న వారి హక్కుల్ని నెరవేర్చాలి. ఈ బాధ్యతా నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యానికి పాల్పడినా పరలోకంలో దేవునికి జవాబు చెప్పుకోవలసి ఉంటుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|35. భర్త హక్కులు|హదీసు 285
హదీసు 286
وعن أَبي عليٍّ طَلْق بن عليٍّ رضي اللَّه عنه أَن رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إِذَا دَعَا الرَّجُلُ زَوْجتَهُ لِحَاجتِهِ فَلْتَأْتِهِ وإِنْ كَانَتْ عَلَى التَّنُّور". رواه الترمذي والنسائي، وَقالَ الترمذي: حديث حسن صحيح.
హజ్రత్ అబూ అలీ తలఖ్ బిన్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ, "భర్త తన అవసరం నిమిత్తం భార్యను పిలిస్తే ఆ సమయంలో ఆమె పొయ్యి దగ్గర వంట చేసుకుంటున్నా కూడా వెంటనే అతని దగ్గరికి వచ్చేయాలి" అని చెప్పారు. దీనిని తిర్మిజీ మరియు నసాయి వెలికితీశారు. ఇంకా తిర్మిజీ దీనిని 'హసన్' మరియు 'సహీహ్' గా పేర్కొన్నారు.
(సుననె తిర్మిజీలోని స్తన్య సంబంధ అధ్యాయం)
English
Abu `Ali Talq bin `Ali (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “When a man calls his wife to satisfy his desire, she must go to him even if she is occupied with the oven”.[At-Tirmidhi and An-Nasa’i].
ముఖ్యాంశాలు
ఇందులో భార్య తన భర్త ఆజ్ఞల్ని శిరసావహించాలని నొక్కి వక్కాణించటం జరిగింది. షరీఅత్లో భర్తలకు గొప్ప స్థానమున్న సంగతి నిజమే కాని స్త్రీలు తమ భర్తలను గౌరవించినట్లుగానే భర్తలు కూడా తమ భార్యల హక్కుల్ని తప్పకుండా గుర్తించాలి. షరీఅత్ స్త్రీలకు కూడా హక్కుల్ని ప్రసాదించిందన్న విషయాన్ని మరువరాదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|35. భర్త హక్కులు|హదీసు 286
హదీసు 287
وعن أَبي هريرة رضي اللَّهُ عنه عن النبي صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قال: "لَوْكُنْتُ آمِراً أحَداً أَنْ يسْجُدَ لأَحدٍ لأَمَرْتُ المرْأَة أَنْ تَسْجُدَ لِزَوْجِهَا". رواه الترمذي وَقالَ: حديث حسن صحيح.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ "నేనెవరికైనా ఇతరులకు సజ్దా (పాదాభివందనం) చేయుమని ఆజ్ఞాపించేటట్లయితే తన భర్త ముందు సజ్దా చేయమని స్త్రీకి ఆదేశించి ఉండేవాణ్ణి" అని అన్నారు. తిర్మిజీ దీనిని వెలికితీసి హసన్ మరియు సహీహ్గా పేర్కొన్నారు.
(సుననె తిర్మిజీలోని స్తన్య సంబంధ అధ్యాయం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “If I were to order anyone to prostrate himself before another, I would have ordered a woman to prostrate herself before her husband”.[At-Tirmidhi]
ముఖ్యాంశాలు
'సజ్దా' 'చేయమని ఆదేశించి ఉండేవాణ్ణి' అంటే ఎవరికీ ఆ అనుమతి ఇవ్వలేదనే కదా అర్థం. ఎందుకు ఇవ్వలేదంటే కారణం అందరికీ తెలిసిందే. మానవుడు ఒక్క దేవుడి ముందు తప్ప మరెవరి ముందూ సాష్టాంగపడకూడదు. సజ్దా (సాష్టాంగపడటం) అనేది దాస్యానికి ప్రతీక. మనిషి దైవానికి తప్ప మరెవరికీ దాసుడు కాజాలడు. అలాంటప్పుడు సామాన్య మానవుల ముందు, చెట్టు పుట్టలు, రాళ్ళు రప్పల ముందు సృష్టిశ్రేష్ఠుడైన మనిషి తలవంచటం ఎంతవరకు సమంజసం!
ఏది ఏమైనా ఈ హదీసు ద్వారా దాంపత్య జీవితంలో భర్తకు ఎంతటి గౌరవప్రదమైన స్థానముందో తెలుస్తోంది. అయితే భర్తలు భార్యల హక్కుల్ని గుర్తించినప్పుడే తమకా గౌరవం లభిస్తుందన్న సంగతిని గ్రహించాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|35. భర్త హక్కులు|హదీసు 287
హదీసు 288
وعن أُمِّ سلمةَ رضي اللَّهُ عنها قالت: قالَ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "أَيُّما امرأَةٍ ماتَتْ وزوْجُهَا عَنْهَا راضٍ دخَلَتِ الجَنَّةَ" رواه الترمذي وَقالَ حديث حسن.
హజ్రత్ ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ, "భర్త తన పట్ల ప్రసన్నుడిగా ఉన్న స్థితిలో మరణించే స్త్రీ స్వర్గానికి వెళుతుంద"ని చెప్పారు.
(తిర్మిజీ దీనిని వెలికితీసి హసన్గా పేర్కొన్నారు)
(సుననె తిర్మిజీలోని స్తన్య సంబంధ అధ్యాయం)
English
Umm Salamah (radiyallahu anha) reported: Messenger of Allah ﷺ said, “Any woman dies while her husband is pleased with her, she will enter Jannah”.[At-Tirmidhi].
ముఖ్యాంశాలు
ధర్మాదేశాల్ని, ధర్మవిధుల్ని పాటిస్తూ మరోవైపు భర్తను కూడా సంతోషపెట్టే స్త్రీలకే ఆ భాగ్యం లభిస్తుంది. దేవుడు వారి చిన్న చిన్న పాపాలను మన్నించి ప్రారంభంలోనే వారిని స్వర్గానికి పంపుతాడు. సమాజంలో వక్రబుద్ధిగల గయ్యాళులు, ఘటికురాళ్ళతోపాటు సౌశీల్యవతులు, సదాచార సంపన్నులైన స్త్రీలూ ఉంటారు. అలాంటి సత్ప్రవర్తనగల మహిళలకే ఈ హదీసులోని శుభవార్త.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|35. భర్త హక్కులు|హదీసు 288
హదీసు 289
وعن معاذِ بنِ جبلٍ رضي اللَّهُ عنه عن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "لاَ تُؤْذِي امْرَأَةٌ زَوْجَهَا في الدُّنْيا إِلاَّ قالَتْ زَوْجَتُهُ مِنَ الحُورِ الْعِينِ لاَ تُؤْذِيه قَاتلَكِ اللَّه، فَإِنَّمَا هُو عِنْدَكِ دخِيلٌ يُؤشِكُ أَنْ يُفارِقَكِ إِلَينا" رواه الترمذي وَقالَ: حديث حسن.
హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు : స్త్రీ తన భర్తకు బాధ కలిగించినప్పుడు (స్వర్గంలోని) అప్సరసల్లో అతనికి కాబోయే భార్య (ఇహలోకపు సవతి మీద మండిపడుతూ) "ఆయన్ని బాధపెట్టకు. దేవుడు నిన్ను నాశనం చేస్తాడు. ఆయన నీ దగ్గర (కొన్నాళ్ళపాటు) అతిథిగా ఉన్నారంతే; త్వరలోనే ఆయన నిన్ను విడిచిపెట్టి నా దగ్గరికి రాబోతున్నారు" అని అంటుంది.
తిర్మిజీ దీనిని వెలికితీసి 'హసన్'గా పేర్కొన్నారు.
(సుననె తిర్మిజీలోని స్తన్యసంబంధ అధ్యాయం, ఇబ్నె మాజాలోని నికాహ్ ప్రకరణం)
English
Mu`adh bin Jabal (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “Whenever a woman harms her husband in this world (that is without any due right), his wife among the (Houris in Jannah) says: `You must not harm him. May Allah destroy you! He is only a passing guest with you and is about to leave you to come to us”.[At-Tirmidhi].
ముఖ్యాంశాలు
ఇస్లామీయ షరీఅత్ స్త్రీల పట్ల ఉత్తమంగా మెలగాలని పురుషులను ఆజ్ఞాపించినట్లుగానే తమ భర్తల పట్ల అనుచితంగా, అసభ్యకరంగా ప్రవర్తించరాదని స్త్రీలను కూడా ఆదేశిస్తోంది. భర్తలతో కరకుగా మాట్లాడటం, వారి పట్ల దురుసుగా ప్రవర్తించటం, వారి స్తోమతకు మించి కోరికలు కోరటం ఇవన్నీ భర్తలను బాధపెట్టే చేష్టలుగానే పరిగణించబడతాయి. కాని నేడు సమాజంలోని చాలా మంది స్త్రీలలో ఈ అనుచిత వైఖరి రోజురోజుకీ పెరిగిపోతోంది. భర్తల పట్ల గౌరవం సన్నగిల్లుతోంది. ఇది విపరీతమే. భార్యాభర్తలిద్దరూ ఒండొకరి హక్కుల్ని గుర్తించి, పరస్పరం స్నేహ, సుహృద్భావాలతో కలిసిమెలసి ఉండాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|35. భర్త హక్కులు|హదీసు 289
హదీసు 290
وعن أُسامَةَ بنِ زيد رضي اللَّه عنهما عن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَا تركْتُ بعْدِي فِتْنَةً هِي أَضَرُّ عَلَى الرِّجالِ: مِنَ النِّسَاءِ "متفقٌ عَلَيهِ.
హజ్రత్ ఉసామా బిన్ జైద్ కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ "నా తదనంతరం పురుషులపాలిట స్త్రీలకన్నా దారుణమైన ఉపద్రవం మరొకటి లేదు" అని అన్నారు. (బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని నికాహ్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని ప్రేమైక వచనాల ప్రకరణం)
English
Usamah bin Zaid (radiyallahu anhuma) reported: The Prophet ﷺ said, “I am not leaving behind me a more harmful trial for men than women”.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ఈ హదీసులో దైవప్రవక్త ﷺ స్త్రీ ఉనికి ఉపద్రవాలకు మూలమని చెప్పారు. చెడు నడతగల స్త్రీలవల్ల ఉపద్రవాలు మొదలవుతాయన్న విషయంలో సందేహం లేదు. సమాజంలోని అనేక చెడుల్లో ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా స్త్రీ ప్రమేయం ఎంతో కొంత తప్పకుండా ఉంటుంది. సాధారణంగా భార్యల గొంతెమ్మ కోర్కెలను తీర్చటం కోసమే భర్తలు అక్రమార్జనకు పాల్పడుతుంటారు. అలాంటి స్త్రీలే గనక నిరాడంబరత్వాన్ని అలవరచుకుంటే, వారి భర్తలకు డబ్బుకోసం అడ్డదారులు తొక్కాల్సిన అవసరం ఉండదు. వివాహ వేడుకల సందర్భాల్లో కూడా స్త్రీలే ఎక్కువగా ఆచారాలు, సంప్రదాయాల పేరిట తమ భర్తలతో ఎన్నో ధర్మవిరుద్ధమైన పనులు చేయిస్తారు. దుబారాగా డబ్బు ఖర్చు చేయిస్తుంటారు. నేడు వివాహాలు కష్టతరమై పోతున్నాయంటే దానికి స్త్రీలే కారణం. సాధారణంగా పురుషులకన్నా స్త్రీలే ఎక్కువగా పురాతన ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యతనిస్తారు. కనుక వైవాహిక వ్యవస్థ బాగుపడాలంటే ముందుగా స్త్రీల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|35. భర్త హక్కులు|హదీసు 290
You must be logged in to post a comment.