హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 339వ అధ్యాయం: బాగా ఆకలిగా ఉండి అన్నం వడ్డించి ఉన్నప్పుడు, మలమూత్ర విసర్జనకు అత్యవసరంగా వెళ్ళవలసి ఉన్నప్పుడు నమాజ్ చేయటం అవాంఛనీయం. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 1755) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
339. బాగా ఆకలిగా ఉండి అన్నం వడ్డించి ఉన్నప్పుడు, మలమూత్ర విసర్జనకు అత్యవసరంగా వెళ్ళవలసి ఉన్నప్పుడు నమాజ్ చేయటం అవాంఛనీయం
باب كراهة الصلاة بحضرة الطعام ونفسه تتوق إِلَيْهِ أَوْ مَعَ مدافعة الأخبثين: وهما البول والغائط
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 1755
عَنْ عَائِشَةَ رَضِيَ اللَّه عَنْهَا قَالَتْ: سَمِعْتُ رَسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَقُولُ:" لا صَلاةَ بحَضرَةِ طَعَامٍ، وَلا هُوَ يُدَافِعُهُ الأَخْبَثَانَ" رواه مسلم.
దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) తెలియజేశారు: అన్నం వడ్డించి ఉన్నప్పుడు, మలమూత్ర విసర్జనకు అత్యవసరంగా వెళ్ళవలసి ఉన్నప్పుడు నమాజు లేదు. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని మసాజిద్ ప్రకరణం)
English
`Aishah (radiyallahu anha) said: I heard the Messenger of Allah ﷺ saying, “No Salat (prayer) should be performed when the food has been served, nor should it be performed when a person is in need of relieving himself.”[Muslim].
ముఖ్యాంశాలు
నమాజ్ లేదంటే ఆ స్థితిలో మనిషి నమాజ్ చేయకూడదని భావం. అయితే ఈ ఆదేశం అన్నం వడ్డించబడి ఉండి బాగా ఆకలితో ఉన్న వారికే వర్తిస్తుంది. ఆ స్థితిలో అన్నం తినకుండా నమాజ్ చేయమంటే వారు పూర్తి ఏకాగ్రతతో ప్రశాంతంగా నమాజ్ చేయలేరు. అదే విధంగా మలమూత్ర విసర్జనకు అత్యవసరంగా వెళ్ళవలసి ఉన్నప్పుడు ముందు ఆ అవసరం తీర్చుకొని ఆ తర్వాత నమాజు చేయాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|339. బాగా ఆకలిగా ఉండి అన్నం వడ్డించి ఉన్నప్పుడు, మలమూత్ర విసర్జనకు అత్యవసరంగా వెళ్ళవలసి ఉన్నప్పుడు నమాజ్ చేయటం అవాంఛనీయం|హదీసు 1755
You must be logged in to post a comment.