హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 338వ అధ్యాయం: నమాజ్ చేసేటప్పుడు జబ్బల మీద చేతులు పెట్టటం అవాంఛనీయం. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 1754) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
338. నమాజ్ చేసేటప్పుడు జబ్బల మీద చేతులు పెట్టటం అవాంఛనీయం
باب كراهة وضع اليد عَلَى الخاصرة في الصلاة
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 1754
عَنْ أَبي هُريْرةَ رَضِيَ اللَّه عَنْهُ أنَّ رَسُولَ اللهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: نَهَى عنِ الخَصْرِ في الصَّلاةِ. متفقٌ عليهِ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ నమాజులో జబ్బలమీద చేతులు పెట్టుకోవటాన్ని వారించారు.
(బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని అమల్ ఫిస్సలాత్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని మసాజిద్ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) said: We are prohibited from placing the hand on the side during As-Salat (the prayer).[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
జబ్బలమీద చేతులు పెట్టుకోవటం అహంకారానికి నిదర్శనం. అందుకని నమాజులో జబ్బలమీద చేతులు పెట్టుకోరాదని వారించటం జరిగింది. నమాజులో వీలైనంత ఎక్కువగా అణకువ భావాన్ని ప్రదర్శించాలి. ఒకవేళ ప్రక్కల్లో నొప్పిగా ఉంటే అలాంటప్పుడు జబ్బలమీద చేతులు పెట్టుకోవటంలో తప్పులేదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|338. నమాజ్ చేసేటప్పుడు జబ్బల మీద చేతులు పెట్టటం అవాంఛనీయం|హదీసు 1754
You must be logged in to post a comment.