హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 340వ అధ్యాయం: నమాజ్‌లో దృష్టిపైకెత్తి ఆకాశంవైపు చూడరాదు. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 1756) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
340. నమాజ్‌లో దృష్టిపైకెత్తి ఆకాశంవైపు చూడరాదు
باب النهي عن رفع البَصَر إِلَى السماء في الصلاة
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 1756
عَنْ أَنسِ بْنِ مَالكٍ رَضِيَ اللَّه عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَا بالُ أَقْوَامٍ يَرْفَعُونَ أَبْصَارَهُمْ إِلِى السَّماءِ في صَلاتِهِمْ، "فَاشْتَدَّ قَوْلُهُ في ذَلِكَ حَتَّى قَالَ: "لَيَنْتَهُنَّ عَنْ ذَلِكَ، أَوْ لَتُخْطَفَنَّ أَبْصارُهُمْ،" رواه البخاري.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: "ఏమయింది వీరికి? వీరు నమాజులో దృష్టిపైకెత్తి, ఆకాశం వైపు చూస్తున్నారు." ఈ మాట ఆయన చాలా కఠినంగా అన్నారు. చివరికి ఆయన, "ప్రజలు ఇలా చేయటం మానుకోవాలి లేదంటే వారి కళ్ళు చెదిరిపోతాయి" అని అన్నారు. (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని అజాన్ ప్రకరణం)
English
Anas bin Malik (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “How is it that some people raise their eyes towards the sky during As-Salat (the prayer)?” He stressed (this point) and added, “People must refrain from raising their eyes towards heaven in Salat (prayer), or else their sights will certainly be snatched away.”[Al-Bukhari].
ముఖ్యాంశాలు
నమాజ్ చేసేటప్పుడు ఆకాశం వైపు చూడటం ఏకాగ్రతకు, వినమ్రతకు విరుద్ధం. కనుక దానిని కఠినంగా వారించటం జరిగింది. నమాజు తప్ప ఇతర వేళల్లో ఉదా: దుఆ చేసేటప్పుడు, యోచన చేసేటప్పుడు ఆకాశం వైపు చూడటంలో తప్పు లేదు. పైగా కొందరు పండితుల అభిప్రాయం ప్రకారం ఇది అభిలషణీయం కూడా.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|340. నమాజ్‌లో దృష్టిపైకెత్తి ఆకాశంవైపు చూడరాదు|హదీసు 1756
You must be logged in to post a comment.