హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 332వ అధ్యాయం: మనిషి 'ఓ అల్లాహ్! నీకు ఇష్టముంటే నన్ను క్షమించు' అని అనటం అవాంఛనీయం. అలాకాకుండా పూర్తి నమ్మకంతో దైవాన్ని ప్రార్థించాలి. ఈ అధ్యాయంలో 2 హదీసులు (హదీసు 1745 – 1746) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
332. మనిషి 'ఓ అల్లాహ్! నీకు ఇష్టముంటే నన్ను క్షమించు' అని అనటం అవాంఛనీయం. అలాకాకుండా పూర్తి నమ్మకంతో దైవాన్ని ప్రార్థించాలి
باب كراهة قول الإِنسان: اللهُمَّ اغْفِرْ لِي إن شئت بل يجزم بالطلب
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 1745
عنْ أَبي هُريْرَةَ رَضِيَ اللَّه عَنْهُ أَنَّ رَسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "لاَ يَقُولَنَّ أَحَدُكُمْ: اللَّهُمَّ اغْفِرْ لِي إِنْ شِئْتَ: اللَّهُمَّ ارْحَمْني إِنْ شِئْتَ، لِيعْزِمِ المَسْأَلَةَ، فإِنَّهُ لاَ مُكْرِهَ لَهُ" متفقٌ عليه. وفي روايةٍ لمُسْلِمٍ: "وَلكنْ، لِيَعْزِمْ وَلْيُعْظِّمِ الرَّغْبَةَ، فَإِنَّ اللَّه تَعَالى لاَ يتَعَاظَمُهُ شَيْءٌ أَعْطَاهُ".
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రబోధించారు: మీలో ఎవరూ కూడా "ఓ అల్లాహ్! నీకు ఇష్టముంటే నన్ను క్షమించు, నీవు తలచుకుంటే నన్ను కరుణించు" అని అనరాదు. అలా కాకుండా నమ్మకంగా ప్రార్థించాలి. ఎందుకంటే ఆయన్ని బలవంతపెట్టే వాడెవడూ లేడు.
(బుఖారీ-ముస్లిం)
ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: నమ్మకంగా ప్రార్థించాలి. బాగా ఆసక్తిని కనబరచాలి. ఎందుకంటే దేవుడు తాను అడిగేవారికి ఇచ్చే వస్తువు ఇవ్వటం ఆయన దృష్టిలో పెద్ద విషయం ఏమీ కాదు.
(సహీహ్ బుఖారీలోని దావాత్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “You must not supplicate: `O Allah! forgive me if You wish; O Allah bestow mercy on me if You wish.’ But beg from Allah with certitude for no one has the power to compel Allah.”[Al-Bukhari and Muslim]
Another narration of Muslim is: “A supplication should be made in full confidence and one should persistently express his desire (before Allah) in his supplication, for no bounty is too great for Allah to bestow (upon his slaves).”
ముఖ్యాంశాలు
దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు నిరాశతో, అపనమ్మకంతో ప్రార్థించకూడదు. దేవుడు తలచుకుంటేనే ఇవ్వాలనీ కోరుకోకూడదు. అలాగాకుండా తమకు ఎంతో అవసరమున్నట్లు, ప్రాధేయపడుతున్నట్లు ప్రార్థించాలి. 'ఇవ్వటం ఆయనకు పెద్ద విషయం కాదు' అంటే మనిషి కోరే అవసరాలు – అవి ధార్మికపరమైనవైనా లేక ప్రాపంచికమైనవైనా వాటిని తీర్చటం దేవునికి కష్టం కాదు అని భావం.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|332. మనిషి 'ఓ అల్లాహ్! నీకు ఇష్టముంటే నన్ను క్షమించు' అని అనటం అవాంఛనీయం. అలాకాకుండా పూర్తి నమ్మకంతో దైవాన్ని ప్రార్థించాలి|హదీసు 1745
హదీసు 1746
وَعَنْ أَنَسٍ رَضِيَ اللَّه عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِذا دَعَا أَحَدُكُمْ، فَلْيَعْزِمِ المَسْأَلَةَ، وَلا يَقُولَنَّ: اللَّهُمَّ إِنْ شِئْتَ، فَأَعْطِني، فَإِنَّهُ لاَ مُسْتَكْرهَ لَهُ" متفقٌ عليه.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: మీలో ఎవరైనా ప్రార్థించేటప్పుడు దృఢచిత్తంతో ప్రార్థించాలి. "అల్లాహ్! నువ్వు తలచుకుంటే ఇవ్వు" అని అనకూడదు. ఎందుకంటే ఆయన్ని ఎవరూ బలవంతం చేయలేరు. (బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని దావాత్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)
English
Anas (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “When one of you supplicates, let him be decisive and he should not say: `O Allah, bestow upon me such and such if You wish’, because no one has the power to compel Him.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
మానవుడికి జీవితంలో అడుగడుగునా దేవుని అవసరం ఉంటుంది. కనుక మనిషి ఎట్టి పరిస్థితుల్లోనూ తాను దైవం పట్ల నిరపేక్షాపరుడైనట్లు, దైవం తన అవసరాలు తీర్చినా, తీర్చకపోయినా, తనకు కలిగే నష్టం ఏమీ లేదన్నట్లు వ్యవహరించరాదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|332. మనిషి 'ఓ అల్లాహ్! నీకు ఇష్టముంటే నన్ను క్షమించు' అని అనటం అవాంఛనీయం. అలాకాకుండా పూర్తి నమ్మకంతో దైవాన్ని ప్రార్థించాలి|హదీసు 1746
You must be logged in to post a comment.