హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 333వ అధ్యాయం: దేవుడు తలచింది, ఫలానా అతను తలచింది అని అనటం అవాంఛనీయం. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 1747) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
333. దేవుడు తలచింది, ఫలానా అతను తలచింది అని అనటం అవాంఛనీయం
باب كراهة قول: ما شاء اللهُ وشاء فلان
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 1747
عنْ حُذَيْفَةَ بْنِ اليَمَانِ رَضِيَ اللَّه عَنْه عَنِ النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ: "لا تَقُولوا: ماشاءَ اللَّه وشاءَ فُلانٌ، ولكِنْ قُولوا: مَا شَاءَ اللَّه، ثُمَّ شَاءَ فُلانٌ" رواه أبو داود بإِسنادٍ صحيح.
హజ్రత్ హుజైఫా బిన్ యమాన్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: దేవుడు తలిస్తే, ఫలానా అతను తలిస్తే అని అనకండి. అలాగాకుండా దేవుడు తలిస్తే, ఆ తర్వాత ఫలానా అతను తలిస్తే అని అనండి. (అబూదావూద్ దీనిని దృఢమైన ఆధారాలతో వెలికితీశారు.)
(సుననె అబూదావూద్లోని అదబ్ ప్రకరణం)
English
Hudhaifah bin Yaman (radiyallahu anhu) said: The Prophet ﷺ said, “Say not: `What Allah wills and so-and-so wills’, but say: `What Allah wills, and then what so-and-so wills.”’[Abu Dawud with authentic Isnad].
ముఖ్యాంశాలు
మొదటి పద్ధతిని ఎందుకు వారించటం జరిగిందంటే అందులో దైవాభీష్టాన్ని, మానవాభీష్టాన్ని సమానంగా చేసి మాట్లాడటం జరుగుతోంది. ధర్మం రీత్యా ఆ విధంగా మాట్లాడటం తప్పు. దీనికి భిన్నంగా రెండో పద్ధతిలో ముందుగా దైవాభీష్టాన్ని పేర్కొని, ఆ తర్వాత ఆయన ఇష్టానికి లోబడే మానవుని ఇష్టం ఉందని చెప్పటం జరుగుతోంది. కనుక ఈ పద్ధతి సరైనదని పేర్కొనటం జరిగింది. అలాగే ఎవరైనా ఇతరులతో 'మాకు దేవుడూ, మీరూ తప్ప వేరే దిక్కులేదు' అని అన్నారనుకోండి. ఈ వాక్యంలో అల్లాహ్కు మనుషులకు ఒకే స్థానం ఇచ్చి మాట్లాడినట్లయింది. కనుక ఈ విధంగా మాట్లాడటం అధర్మంగా పరిగణించబడుతుంది. దానికి బదులు "మాకు అల్లాహ్, ఆ తర్వాత మీరూ తప్ప వేరే దిక్కు లేదు" అని అనటంలో తప్పులేదు. ఎందుకంటే మొదటి వాక్యం నుంచి వస్తున్న షిర్క్ వాసన రెండో వాక్యం నుంచి రావటం లేదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|333. దేవుడు తలచింది, ఫలానా అతను తలచింది అని అనటం అవాంఛనీయం|హదీసు 1747
You must be logged in to post a comment.