హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 331వ అధ్యాయం: వివాహం తదితర షరీఅత్ పరమైన అవసరం ఉంటే తప్ప స్త్రీ సుగుణాలను ఇతర పురుషుని ముందు వివరించరాదు. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 1744) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
331. వివాహం తదితర షరీఅత్ పరమైన అవసరం ఉంటే తప్ప స్త్రీ సుగుణాలను ఇతర పురుషుని ముందు వివరించరాదు
باب النهي عن وصف محاسن المرأة لرجل إلاَّ أن يحتاج إلى ذلك لغرض شرعي كنكاحها ونحوه
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 1744
عَنِ ابْنِ مَسْعُودٍ رَضِيَ اللَّه عنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لاَ تُبَاشِرِ المرْأَةُ المَرْأَةَ، فَتَصِفَهَا لِزَوْجِهَا كَأَنَّهُ يَنْظُرُ إِلَيْهَا" متفقٌ عليه.
హజ్రత్ ఇబ్నె మస్‌ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రబోధించారు: ఏ స్త్రీ కూడా మరో స్త్రీతో శారీరక కలయిక చేయరాదు. ఎందుకంటే ఆ విధంగా కలయిక చేసిన స్త్రీ ఆమె అందచందాలను గురించి తన భర్తకు కళ్ళకు కట్టినట్లు చెప్పగలదు.
(బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని నికాహ్ ప్రకరణం)
English
Ibn Mas`ud (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “No woman should touch another woman’s body and then describe the details of her figure to her husband in such a manner as if he was looking at her.”[Al-Bukhari].
ముఖ్యాంశాలు
అరబీలో 'ముబాషరత్' అన్న పదం ఉపయోగించబడింది. ముబాషరత్ అంటే రెండు శరీరాల కలయిక. ఇతరుల శరీరం చూడటాన్ని కూడా కొన్ని సందర్భాల్లో చూచాయగా ముబాషరత్ అని చెప్పటం జరుగుతుంది. పై హదీసులో ముబాషరత్ అనే పదానికి రెండు అర్థాలూ ఉన్నాయి. అంటే ఇతరుల శరీరాన్ని చూడటం, శారీరక కలయిక జరపటం. ఉద్దేశపూర్వకంగా గనక చేస్తే ఈ రెండూ పాపాలుగా పరిగణించబడతాయి. ఎందుకంటే ఈ పనుల మూలంగా స్త్రీకి తోటి స్త్రీ యొక్క లోవిషయాలు తెలిసివస్తాయి. ఆమె ప్రయత్నంగానో అప్రయత్నంగానో ఆ విషయాలు తన భర్తకు చెప్పవచ్చు. దానివల్ల అతను ఏదయినా పాపానికి లోనుగావచ్చు. ఫలితంగా తన సంసారంలో తనే నిప్పులు పోసుకున్నట్లవుతుంది. ఈ ప్రమాదాలన్నిటి నుంచి సురక్షితంగా ఉండటానికి, ముందు జాగ్రత్త కోసం ఈ పనులను వారించటం జరిగింది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|331. వివాహం తదితర షరీఅత్ పరమైన అవసరం ఉంటే తప్ప స్త్రీ సుగుణాలను ఇతర పురుషుని ముందు వివరించరాదు|హదీసు 1744
You must be logged in to post a comment.