హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 326వ అధ్యాయం: ఒక ముస్లింని 'ఓయీ దైవతిరస్కారీ!' అని పిలవటం నిషిద్ధం. ఈ అధ్యాయంలో 2 హదీసులు (హదీసు 1734 – 1735) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
326. ఒక ముస్లింని 'ఓయీ దైవతిరస్కారీ!' అని పిలవటం నిషిద్ధం
باب تحريم قوله لمسلم: يا كافر
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 1734
عَنِ ابنِ عُمَرَ رَضِيَ اللَّه عَنْهُمَا قَالَ: قَالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِذا قَالَ الرَّجُلُ لأَخِيهِ: يَا كَافِر، فَقَدْ بَاءَ بِهَا أَحَدُهُما، فَإِنْ كَان كَمَا قَالَ وَإِلاَّ رَجَعَتْ عَلَيْهِ "متفقٌ عليه.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: మనిషి తన (ముస్లిం) సోదరుణ్ణి, "ఓయీ దైవతిరస్కారీ!" అని అంటే రెండు విషయాల్లో ఏదో ఒకటి అవుతుంది. ఆ వ్యక్తి నిజంగానే కాఫిర్ అయితేసరే; లేదా ఆ మాట తన వైపునకే తిరిగి వస్తుంది.
(బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని అదబ్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఈమాన్ ప్రకరణం)
English
Ibn `Umar (radiyallahu anhuma) said: The Messenger of Allah ﷺ said, “When a person calls his brother (in Islam) a disbeliever, one of them will certainly deserve the title. If the addressee is so as he has asserted, the disbelief of the man is confirmed, but if it is untrue, then it will revert to him.”[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|326. ఒక ముస్లింని 'ఓయీ దైవతిరస్కారీ!' అని పిలవటం నిషిద్ధం|హదీసు 1734
హదీసు 1735
وعَنْ أَبي ذَرٍّ رَضِي اللَّه عنْهُ أَنَّهُ سمِعَ رَسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَقُولُ: "منْ دَعَا رَجُلاً بالْكُفْرِ، أَوْ قَالَ: عَدُوَّ اللَّهِ، ولَيْس كَذلكَ إِلاَّ حَارَ علَيْهِ" متفقٌ عليه."حَارَ": رَجَعَ.
దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూ జర్ర్ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు: ఒక మనిషిని కాఫిర్ (దైవతిరస్కారి) అనిగాని లేక 'అదువ్వల్లాహి' (దైవవిరోధి) అనిగాని పిలిస్తే, అతను అలాంటివాడు కాని పక్షంలో ఆ మాట పిలిచినవాడి వైపునకే తిరిగి వస్తుంది. (బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని అదబ్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఈమాన్ ప్రకరణం)
English
Abu Dharr (radiyallahu anhu) said: I heard the Messenger of Allah ﷺ saying, “If somebody accuses another of disbelief or calls him the enemy of Allah, such an accusation will revert to him (the accuser) if the accused is innocent.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
అనవసరంగా ఒక ముస్లింని దైవతిరస్కారి అనో లేక దైవవిరోధి అనో పిలవరాదని ఈ హదీసులో బోధించటం జరిగింది. అయితే తన్ను తాను ముస్లింగా చెప్పుకునే వాడెవడైనా ధర్మం లోని ప్రాథమిక విషయాల్లో దేన్నయినా తిరస్కరించినప్పుడు ఇతర ముస్లింలను అతని మార్గభ్రష్టత్వం నుండి కాపాడటం కోసం అతన్ని ప్రజలముందు ధర్మతిరస్కారి (కాఫిర్)గా పేర్కొనటం అవసరం. ఇది గర్హనీయం కాదు. పైగా ఇస్లామీయ విశ్వాసాల పరిరక్షణ కోసం ఇలా చేయటం చాలా అవసరం.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|326. ఒక ముస్లింని 'ఓయీ దైవతిరస్కారీ!' అని పిలవటం నిషిద్ధం|హదీసు 1735
You must be logged in to post a comment.