హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 325. ఫలానా నక్షత్రం మూలంగా మాకు వర్షం కురిసింది అని చెప్పరాదు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 325వ అధ్యాయం: ఫలానా నక్షత్రం మూలంగా మాకు వర్షం కురిసింది అని చెప్పరాదు. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 1733) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

325. ఫలానా నక్షత్రం మూలంగా మాకు వర్షం కురిసింది అని చెప్పరాదు

↑ విషయ సూచిక

باب النهي عن قول الإِنسان: مُطِرْنَا بِنَوْء كذا

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

1733

హదీసు 1733

عَنْ زَيْدِ بْنِ خَالِدٍ رَضِيَ اللَّه عَنْهُ قَالَ: صلَّى بِنَا رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم صَلاَةَ الصُّبْحِ بِالحُديْبِيَةِ في إِثْرِ سَمَاءٍ كَانتْ مِنَ اللَّيْل، فَلَمَّا انْصرَفَ أَقْبَلَ عَلى النَّاسِ، فَقَال: "هَلْ تَدْرُون مَاذَا قَالَ رَبُّكُمْ؟ "قَالُوا: اللَّهُ وَرَسُولُهُ أَعلَمُ. قَالَ:"قَالَ: أَصْبَحَ مِنْ عِبَادِي مُؤمِنٌ بِي، وَكَافِرٌ، فأَمَّا مَنْ قالَ مُطِرْنَا بِفَضْلِ اللَّهِ وَرَحْمتِهِ، فَذلِكَ مُؤمِنٌ بي كَافِرٌ بالْكَوْاكَبِ، وَأَمَّا مَنْ قالَ: مُطِرْنا بِنَوْءِ كَذا وَكذا، فَذلكَ كَافِرٌ بِي مُؤمِنٌ بالْكَوْكَبِ" متفقٌ عليه. والسَّماءُ هُنَا: المَطَرُ.

హజ్రత్ జైద్ బిన్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ మాకు హుదైబియా ప్రాంతంలో ఫజ్ర్ నమాజ్ చేయించారు. వర్షం కురిసిన రాత్రి తర్వాత జరిగిన సంఘటన ఇది. నమాజ్ ముగిసిన తర్వాత ఆయన ప్రజలవైపు తిరిగి, "మీ ప్రభువు, ఏమన్నాడో తెలుసా?" అని అడిగారు. దేవుడికి, దైవప్రవక్తకే బాగా తెలుసు అని చెప్పారు వారు. అప్పుడాయన దేవుడు ఇలా అన్నాడని వారికి చెప్పారు: తెల్లవారేటప్పటికి నా దాసుల్లో కొందరు నన్ను విశ్వసించారు, మరికొందరు తిరస్కరించారు. దైవానుగ్రహం వల్ల, ఆయన కారుణ్యం వల్ల మాకు వర్షం కురిసింది అని చెప్పినవారు నన్ను విశ్వసించారు, నక్షత్రాల (శక్తి)ను తిరస్కరించారు. దీనికి భిన్నంగా ఫలానా ఫలానా నక్షత్రం మూలంగా వర్షం కురిసిందని చెప్పినవారు నన్ను తిరస్కరించారు, నక్షత్రాలను విశ్వసించారు.

(బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని అజాన్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఈమాన్ ప్రకరణం)

English

Zaid bin Khalid (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ led the Fajr prayer at Al-Hudaibiyyah after a rainfall during the night. At the conclusion of prayer, he turned towards the people and said, “Do you know what your Rubb has said?” They replied: “Allah and His Messenger know better.” Upon this he remarked, “He has said: `Some of My slaves have entered the morning as My believers and some as unbelievers. He who said: We have had a rainfall due to the Grace and Mercy of Allah, believes in Me and disbelieves in the stars; and he who said: We have had a rainfall due to the rising of such and such star, disbelieves in Me and affirms his faith in the stars.”’[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

విశ్వంలో జరిగే పనులు, సంఘటనలన్నిటికీ మూల కారకుడు దేవుడు ఒక్కడే. బాహ్యపరంగా వాటికి ఏవైనా కారణాలుండవచ్చు. కాని అంతిమంగా ఈ పనులన్నిటికీ కారకుడిగా దేవుణ్ణే భావించాలి. ఈ నమ్మకంతో కొన్ని కొన్ని సందర్భాల్లో పనులు ఫలానా కారణాల వల్ల జరిగాయని చెప్పటంలోనూ తప్పులేదు. కాని బహుదైవారాధకులు భావించినట్లు కారణాలనే కర్తలుగా భావించరాదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|325. ఫలానా నక్షత్రం మూలంగా మాకు వర్షం కురిసింది అని చెప్పరాదు|హదీసు 1733