హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 327వ అధ్యాయం: అశ్లీలపు మాటలు పలుకరాదు, దుర్భాషలాడరాదు. ఈ అధ్యాయంలో 2 హదీసులు (హదీసు 1736 – 1737) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
327. అశ్లీలపు మాటలు పలుకరాదు, దుర్భాషలాడరాదు
باب النهي عن الفُحش وبَذاءِ اللِّسان
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 1736
عَن ابْنِ مَسْعُودٍ رَضِيَ اللَّه عَنْهُ قَالَ: قَالَ رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لَيْس المُؤْمِنُ بالطَّعَّانِ، وَلا اللَّعَّانِ، وَلا الْفَاحِشِ، وَلا الْبَذِيء "رواه الترمذي وقال: حديثٌ حسنٌ.
హజ్రత్ ఇబ్నె మస్వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: విశ్వాసి దెప్పిపొడిచేవాడు, శాపనార్ధాలు పెట్టేవాడు, అశ్లీలపు మాటలు మాట్లాడేవాడు, దుర్భాషలాడేవాడు కాడు.
(తిర్మిజీ దీనిని వెలికితీసి హసన్ కోవకు చెందిన హదీసుగా పేర్కొన్నారు.)
(సుననె తిర్మిజీలోని బిర్ర్, సిలా అధ్యాయాలు)
English
Ibn Mas`ud (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “A true believer does not taunt or curse or abuse or talk indecently.”[At-Tirmidhi].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|327. అశ్లీలపు మాటలు పలుకరాదు, దుర్భాషలాడరాదు|హదీసు 1736
హదీసు 1737
وعِنْ أَنَسٍ رضي اللَّه عَنهُ قَاَل: قَالَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَا كَانَ الْفُحْشُ فِي شَيْءٍ إِلاَّ شانَهُ، ومَا كَانَ الحَيَاءُ فِي شَيْءٍ إِلاَّ زَانَهُ" رواه الترمذي، وقال: حديثٌ حسن.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఏ వస్తువులోనయినా అశ్లీలం ఉంటే అది దాన్ని లోపభూయిష్టంగా మారుస్తుంది. ఏ వస్తువులోనయినా వ్రీడ ఉంటే అది ఆ వస్తువును అందంగా మలుస్తుంది.
(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హసన్ కోవకు చెందిన హదీసుగా పేర్కొన్నారు.)
(సుననె తిర్మిజీలోని బిర్ర్, సిలా అధ్యాయాలు)
English
Anas (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “Indecency does not leave anything untainted and decency does not leave anything ungraced and embellished.”[At-Tirmidhi].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|327. అశ్లీలపు మాటలు పలుకరాదు, దుర్భాషలాడరాదు|హదీసు 1737
You must be logged in to post a comment.