హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 324వ అధ్యాయం: కోడి పుంజుని తిట్టటం అవాంఛనీయం. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 1732) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
324. కోడి పుంజుని తిట్టటం అవాంఛనీయం
باب كراهة سبَّ الدِّيك
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 1732
عنْ زيْدِ بْنِ خَالِدٍ الجُهَنيِّ رَضيَ اللَّه عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"لا تَسُبوا الدِّيكَ، فَإِنَّهُ يُوقِظُ للصلاةِ "رواه أبو داود بإِسنادٍ صحيح.
హజ్రత్ జైద్ బిన్ ఖాలిద్ జుహనీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: "కోడి పుంజుని తిట్టకండి. అది నమాజ్‌కు మేల్కొలుపుతుంది". (అబూదావూద్ దీనిని దృఢమైన ఆధారాలతో వెలికితీశారు)
(సుననె అబూదావూద్‌లోని అదబ్ ప్రకరణం)
English
Zaid bin Khalid Al-Juhani (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “Do not revile the rooster for it wakes you up for prayer.”[Abu Dawud].
ముఖ్యాంశాలు
ఈ రోజుల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా అజాన్ (నమాజ్ ప్రకటన) చెబుతున్నారు. అందుకని కోడికూత ప్రయోజనం మనకు బోధపడటం లేదు. ఈ లౌడ్స్పీకర్లు కనుగొనక ముందు ముఅజ్జిన్లు చేసే అజాన్ ప్రకటనలు మస్జిద్ చుట్టుప్రక్కల ఇండ్లకు మాత్రమే వినిపించేవి. అలాంటప్పుడు మస్జిద్కు దూరంగా ఉండే ప్రజల్ని ఈ కోడికూతలే తహజ్జుద్ కోసం, ఫజ్ర్ నమాజ్ కోసం మేల్కొలిపేవి. ఈ హదీసు ద్వారా బోధపడే మరొక విషయం ఏమిటంటే సత్కార్యంలో ఏ విధంగా పాలుపంచుకున్నవారయినా సరే- అందరినీ గౌరవించాలి. తాము కూడా ప్రజల సత్కార్యాల్లో పాలుపంచుకొని దేవుని దగ్గర మంచి ప్రతిఫలం పొందటానికి కృషి చేయాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|324. కోడి పుంజుని తిట్టటం అవాంఛనీయం|హదీసు 1732
You must be logged in to post a comment.