హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 323. గాలిని తిట్టరాదు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 323వ అధ్యాయం: గాలిని తిట్టరాదు, గాలి వీచేటప్పుడు దుఆ చేయటం. ఈ అధ్యాయంలో 3 హదీసులు (హదీసు 1729 – 1731) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

323. గాలిని తిట్టరాదు, గాలి వీచేటప్పుడు దుఆ చేయటం

↑ విషయ సూచిక

باب النهي عن سبَّ الريح، وبيان ما يقال عند هبوبها

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

1729

హదీసు 1729

عَنْ أَبي المُنْذِرِ أَبَيِّ بْنِ كَعْبٍ رَضِيَ اللَّه عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لا تَسُبُّوا الرِّيحَ، فَإِذَا رَأَيْتُمْ مَا تَكْرَهُونَ، فَقُولُوا: اللَّهُمَّ إِنَّا نَسْأَلُكَ مِنْ خَيْرِ هذِهِ الرِّيحِ وخَيْرِ مَا فِيهَا وخَيْرِ مَا أُمِرَتْ بِهِ، وَنَعُوذُ بِكَ مِنْ شَرِّ هَذِهِ الرِّيحِ وَشَرِّ مَا فِيهَا وشرِّ مَا أُمِرَتْ بِهِ" رواه الترمذي وقَالَ: حَديثٌ حسنٌ صحيح.

హజ్రత్ అబుల్ ముంజిర్ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: గాలిని తిట్టకండి. మీకు భరించశక్యం కానిది (తుఫాను) గనక కనిపిస్తే ఈ విధంగా ప్రార్థించండి: "ఓ అల్లాహ్! మేము నీ నుండి ఈ పెనుగాలుల ప్రయోజనాన్ని, వీటిలో ఉన్న ప్రయోజనాన్ని, ఏ ఉద్దేశ్యంతో ఈ గాలుల్ని పంపటం జరిగిందో దాని ప్రయోజనాన్ని కోరుకుంటున్నాము. ఈ పెనుగాలుల వల్ల నష్టం జరగటం నుండి, వీటిలో ఉన్న కీడు నుండి, ఏ ఉద్దేశ్యంతో ఈ గాలుల్ని పంపటం జరిగిందో దాని కీడు నుండి నీ శరణు వేడుతున్నాము."

(తిర్మిజీ-హసన్ సహీహ్)

(సుననె తిర్మిజీలోని ఫితన్ అధ్యాయాలు)

English

Abul-Mundhir Ubaiy bin Ka`b (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “Do not revile the wind. When you experience something abominable (about it), supplicate: `Allahumma inna nas’aluka min khairi hadhihir-rihi, wa khairi ma fiha, wa khairi ma umirat bihi. Wa na`udhu bika min sharri hadhihir-rihi, wa sharri ma fiha, wa sharri ma umirat bihi. (O Allah, we beg of You the good of this wind and the good of that which it contains and the good of that which it has been commanded; and we seek refuge in you from the evil of this wind and the evil of that which it contains and the evil of that which it has been commanded).”[At-Tirmidhi].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|323. గాలిని తిట్టరాదు, గాలి వీచేటప్పుడు దుఆ చేయటం|హదీసు 1729

1730

హదీసు 1730

وعنْ أَبي هُرَيْرةَ رَضِي اللَّه عَنْهُ قَالَ: سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَقُولُ: الرِّيحُ مِنْ رَوْحِ اللَّهِ تَأْتِي بِالرَّحْمَةِ، وَتَأْتِي بالعَذَابِ، فَإِذا رَأَيْتُمُوهَا فَلا تَسُبُّوهَا، وَسَلُوا اللَّه خَيْرَهَا، واسْتَعِيذُوا باللَّهِ مِنْ شَرِّهَا "رواه أبو داود بإِسناد حسنٍ. قوله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"مِنْ رَوْحِ اللَّهِ"هو بفتح الراءِ: أَيْ رَحْمَتِهِ بِعِبَادِهِ.

దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) తెలియజేశారు: గాలి దేవుని కారుణ్యం. అది కారుణ్యం తీసుకొని వస్తుంది. (అప్పుడప్పుడూ) శిక్ష తెస్తుంది. మీరు దాన్ని చూసినప్పుడు దాన్ని తిట్టకండి. దానిలోని మంచిని ప్రసాదించమని దేవుణ్ణి కోరండి. దాని కీడు నుండి శరణు వేడండి. (అబూదావూద్ దీనిని ప్రామాణికమైన ఆధారాలతో వెలికి తీశారు.)

(సుననె అబూదావూద్‌లోని అదబ్ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) said: I heard the Messenger of Allah ﷺ saying, “The wind is the Blessing of Allah. Sometimes it brings His Mercy and sometimes it brings His Chastisement. When you experience it, do not revile it but beg of Allah its good; and seek Allah’s Refuge against its evil.”[Abu Dawud with good Isnad].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|323. గాలిని తిట్టరాదు, గాలి వీచేటప్పుడు దుఆ చేయటం|హదీసు 1730

1731

హదీసు 1731

وعنْ عَائِشَةَ رَضِيَ اللَّه عنْهَا قَالَتْ: كَانَ النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم إِذا عَصِفَتِ الرِّيح قالَ: "اللَّهُمَّ إِني أَسْأَلُكَ خَيْرَهَا، وَخَيْرِ مَا فِيهَا، وخَيْر مَا أُرسِلَتْ بِهِ، وَأَعُوذُ بِكَ مِنْ شَرِّهِا، وَشَرِّ مَا فِيها، وَشَرِّ مَا أُرسِلَت بِهِ" رواه مسلم.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం: పెనుగాలులు వీచినప్పుడు దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రార్థించేవారు: ఓ అల్లాహ్! నేను నీ నుండి వీటి ప్రయోజనాన్ని, వీటిలో ఉన్న ప్రయోజనాన్ని, ఏ ఉద్దేశ్యంతో వీటిని పంపటం జరిగిందో దాని ప్రయోజనాన్ని కోరుకుంటున్నాను. ఈ పెనుగాలుల వల్ల నష్టం జరగటం నుండి, వీటిలో ఉన్న కీడు నుండి, ఏ ఉద్దేశ్యంతో వీటిని పంపటం జరిగిందో దాని కీడు నుండి నీ శరణు వేడుతున్నాను. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని సలాతుల్ ఇస్తిస్ఖా ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha) said: Whenever the wind blew strongly, The Prophet ﷺ would say: “Allahumma inni as’aluka khairaha, wa khaira ma fiha, wa khaira ma ursilat bihi. Wa a`udhu bika min sharriha, wa sharri ma fiha, wa sharri ma ursilat bihi. (O Allah, I beg of You its good and the good of that which it contains and the good of the purpose for which it has been sent; and I seek Your Refuge from its evil and the evil of that which it contains and the evil of the purpose for which it has been sent).”[Muslim].

ముఖ్యాంశాలు

1) ఇతర దైవానుగ్రహాల మాదిరిగా గాలి కూడా ఒక దైవానుగ్రహమే. మానవుని ఆరోగ్యానికి, ఉపాధి వనరులకు అది చాలా అవసరం. అయితే దేవుడే గనక తలచుకుంటే ఆయన ఆ గాలిలో సాంద్రతను, వేగాన్ని పెంచి దాన్నే వినాశకారిగా కూడా మార్చగలడు. కనుక దైవసన్నిధిలో దానిలోని మంచిని కోరుకొని దాని చెడుల నుండి శరణు వేడుకోవాలి.

2) విశ్వాసి అయినవాడు తోటి మనుషుల్నే తిట్టడు. అలాంటప్పుడు నోరులేని జంతువుల్ని, ప్రకృతి వనరుల్ని తిట్టటం అతనికి అసలే శోభించదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|323. గాలిని తిట్టరాదు, గాలి వీచేటప్పుడు దుఆ చేయటం|హదీసు 1731