హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 322వ అధ్యాయం: జ్వరాన్ని తూలనాడటం తగదు. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 1728) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
322. జ్వరాన్ని తూలనాడటం తగదు
باب كراهة سبَّ الحُمّى
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 1728
عنْ جَابرٍ رَضِيَ اللَّه عَنْهُ أَنَّ رسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم دخَلَ على أُمِّ السَّائبِ، أَوْ أُمِّ المُسَيَّبِ فقَالَ:"مَالَكِ يَا أُمَّ السَّائبِ أَوْ يَا أُمِّ المُسيَّبِ تُزَفْزِفينَ؟ "قَالَتْ: الحُمَّى لاَ بارَكَ اللَّه فِيهَا، فَقَالَ:"لاَ تَسُبِّي الحُمَّى، فَإِنَّهَا تُذْهِبُ خَطَايا بَني آدَمَ، كَما يُذْهِبُ الْكِيرُ خَبثَ الحدِيدِ " رواه مسلم. "تُزَفْزِفِينَ"أَيْ: تَتَحرَّكِينَ حرَكَةً سريعَةً، ومَعْناهُ: تَرْتَعِدُ، وَهُوَ بضمِّ التاءِ وبالزاي المكررة والفاء المكررة، ورُوِي أَيضاً بالراءِ المكررة والقافينِ.
హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ ఉమ్మె సాయిబ్ లేక ఉమ్మె ముసయ్యబ్ ఇంటికి వెళ్ళి, "ఉమ్మె సాయిబ్! (లేక ఉమ్మె ముసయ్యబ్!) ఏమయింది నీకు? వణుకుతున్నావేమిటి?" అని అడిగారు. అందుకామె, "జ్వరం ఉందండి. దేవుడు ఇందులో వృద్ధిని ప్రసాదించకుండా ఉండుగాక!" అని సమాధానమిచ్చింది. ఆమె సమాధానం విని ఆయన "జ్వరాన్ని తిట్టకు. ఎందుకంటే ఇది మనిషి వల్ల జరిగే (చిన్నపాటి) పాపాలను, బట్టీ ఇనుము తుప్పును దూరం చేసినట్లు దూరం చేస్తుంది" అని చెప్పారు. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని బిర్ర్, సిలా ప్రకరణం)
English
Jabir (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ visited Umm Sa’ib (or Umm Musaiyyab) and asked her, “What ails you O Umm Sa’ib (or Umm Musaiyyab)? You are shivering.” She replied: “It is a fever, may Allah not bless it!” He said to her, “Do not revile fever, for it cleanses out the sins of the sons of Adam in the same way that a furnace removes the dirt of iron.”[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|322. జ్వరాన్ని తూలనాడటం తగదు|హదీసు 1728
You must be logged in to post a comment.